
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు నిరసన సెగ తగిలింది. మహిళలు అనూహ్యంగా ఆయనపై గుడ్ల వర్షాన్ని కురిపించారు. అయితే, ముఖ్యమంత్రికి ఆ గుడ్లు తాకలేదు. ముఖ్యమంత్రి లక్ష్యంగా గుడ్లు దూసుకురావడంతో.. ఆయన వ్యక్తిగత సిబ్బంది, అధికారులు అడ్డుగా నిలబడ్డారు. బాలాసౌర్‌లో ఈ ఘటన జరిగింది. ముఖ్యమంత్రి లక్ష్యంగా గుడ్లు విసిరిన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment