
భువనేశ్వర్: లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్షాలు ప్రతిపాదిస్తున్న మహాకూటమిలో చేరబోమని బీజేడీ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు సమాన దూరం పాటిస్తామని బుధవారం తేల్చిచెప్పారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఏకం కావాలని బీజేపీయేతర పక్షాలు ప్రయత్నిస్తున్న సమయంలో నవీన్ పట్నాయక్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. మహాకూటమిలో చేరికపై నిర్ణయానికి కొంత సమయం కావాలని ఆయన ఢిల్లీలో చెప్పిన మరుసటి రోజే ఈ విధంగా స్పందించడం గమనార్హం. బీజేడీకి కాంగ్రెస్‌తో రహస్య అవగాహన ఉందని బీజేపీ ఆరోపించగా, బీజేడీ ఎప్పటికీ బీజేపీ పక్షమేనని కాంగ్రెస్ పేర్కొంది.