Mahagathbandhan
-
Lok sabha elections 2024: ఆర్జేడీకి 26.. కాంగ్రెస్‌కు 9
పట్నా: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు గాను బిహార్‌లో ఆర్జేడీ సారథ్యంలోని మహాఘఠ్‌బంధన్‌లో సీట్ల పంపిణీ కొలిక్కి వచ్చింది. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాలకు గాను దాదాపు మూడింట రెండొంతుల సీట్లలో లాలూ ప్రసాద్‌కు చెందిన ఆర్జేడీ పోటీ చేయనుంది. మిగతా వాటిని కాంగ్రెస్, మూడు వామపక్ష పార్టీలు పంచుకున్నాయి. 2019 ఎన్నికల్లో ఆర్జేడీ ఒక్క సీటూ దక్కించుకోలేకపోయినప్పటికీ ఈసారి 26 చోట్ల పోటీ చేయనుంది. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారీ 9 చోట్ల పోటీ చేయనుంది. ఆ తర్వాత సీపీఐ ఎంఎల్ లిబరేషన్ మూడు, సీపీఐ, సీపీఎంలు చెరో చోట బరిలోకి దిగనున్నాయి. బిహార్‌లో ఆర్జేడీ ఇప్పటికే నాలుగు చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఒక సీటును కాంగ్రెస్ ఆశిస్తోంది. కాంగ్రెస్ పోటీ చేయాలని ఆశిస్తున్న పుర్నియా స్థానానికి లాలూ ప్రసాద్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించేశారు. సీపీఐ, సీపీఐ(ఎంఎల్) కూడా బెగుసరాయ్, ఖరారియా సీట్లకు అభ్యర్థులను ప్రకటించుకున్నాయి. -
బిహార్‌లో ఆగని ఫిరాయింపుల పర్వం
పట్నా: బిహార్‌లోని మహాఘఠ్బంధన్ కూటమిలో ఫిరాయింపుల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆర్జేడీకి చెందిన మరో ఎమ్మెల్యే భరత్ బిండ్ అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన శుక్రవారం ఎన్డీఏ పక్షంలోకి మారారు. కాంగ్రెస్‌కు చెందిన మహిళా ఎమ్మెల్యే నీతూ కుమారి పార్టీ లోక్‌సభ టిక్కెట్ ఇస్తే సరేసరి లేకుంటే బీజేపీలో చేరడం ఖాయమని ప్రకటించారు. ఇప్పటికే ఆర్జేడీకి చెందిన స్పీకర్ అవధ్ బిహారీ చౌధరిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా అదే పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటేయడం, నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు తెలపడం తెలిసిందే. తాజా పరిణామాలతో 243 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఎన్డీఏ బలం 135కు చేరుకుంది. -
Bihar political crisis: మళ్లీ కూటమి మారిన నితీశ్
పట్నా: బిహార్ రాజకీయ రగడకు ఊహించిన విధంగానే తెర పడింది. గోడదూకుళ్లకు పెట్టింది పేరైన జేడీ(యూ) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మళ్లీ కూటమి మారారు. ఆదివారం ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పి మరోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ గూటికి చేరారు. ఉదయం సీఎం పదవికి రాజీనామా చేసి జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్బంధన్ సర్కారుకు చరమగీతం పాడారు. సాయంత్రానికల్లా బీజేపీ మద్దతుతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తద్వారా 72 ఏళ్ల నితీశ్ బిహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి పగ్గాలు చేపట్టారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరుల సమక్షంలో రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. బిహార్ బీజేపీ చీఫ్ సమ్రాట్ చౌధరి, పార్టీ నేత విజయ్‌కుమార్ సిన్హాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. నితీశ్ చర్యపై కాంగ్రెస్‌తో పాటు విపక్ష ఇండియా కూటమిలోని ఆర్జేడీ, డీఎంకే, జేఎంఎం, ఆప్ తదితర పారీ్టలు మండిపడ్డాయి. బిహార్ ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారన్నాయి. భాగస్వాములను మోసగించడంలో సిద్ధహస్తుడైన ఆయన మరోసారి ఊసరవెల్లి నైజాన్ని చాటుకున్నారంటూ కాంగ్రెస్ దుయ్యబట్టింది. నితీశ్ వంటి ఆయారాం, గయారాంల ని్రష్కమణతో ఇండియా కూటమికి నష్టమేమీ లేదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘‘ఆయన ఇలా చేస్తారని నాకు ముందే తెలుసు. ఎన్డీఏలోకి వెళ్లడం ఖాయమని ఆర్జేడీ చీఫ్ లాలు, ఆయన కుమారుడు తేజస్వి కూడా నాకు చెప్పారు. కానీ ఇండియా కూటమి చెదిరిపోకుండా ఉండాలని నేను బయటికి చెప్పలేదు’’ అన్నారు. ఆట ఇప్పుడే ఆరంభమైందని తేజస్వి అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో జేడీ(యూ) మట్టి కరవడం ఖాయమంటూ శాపనార్థాలు పెట్టారు. నితీశ్‌ది ద్రోహమంటూ సీపీఐ (ఎంఎల్) దుయ్యబట్టింది. గోడ దూకుడుకు పర్యాయపదంగా ఆయన చరిత్రలో నిలిచిపోతారంటూ ఎన్సీపీ (శరద్ పవార్) ఎద్దేవా చేసింది. ‘‘స్నోలీగోస్టర్ (విలువల్లేని వ్యక్తి) పదం నితీశ్‌కు బాగా సరిపోతుంది. ఇదే వర్డ్ ఆఫ్ ద డే’’ అంటూ కాంగ్రెస్ నేత శశిథరూర్ చమత్కరించారు. పదేపదే కూటములు మార్చడం నితీశ్‌కు పరిపాటేనని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. జేడీ(యూ) మాత్రం కాంగ్రెస్ స్వార్థపూరిత వైఖరి వల్లే నితీశ్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచి్చందని చెప్పుకొచి్చంది. కొత్త సర్కారుకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బిహారీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పాటుపడుతుందంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇక ఎటూ వెళ్లను: నితీశ్ అంతకుముందు ఆదివారం రోజంతా పట్నాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ వచ్చాయి. ఉదయమే జేడీ(యూ) శాసనసభా పక్షం నితీశ్ నివాసంలో భేటీ అయింది. ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కును ఆయనకు కట్టుబెడుతూ తీర్మానించింది. వెంటనే నితీశ్ రాజ్‌భవన్‌కు వెళ్లి సీఎం పదవికి రాజీనామా సమరి్పంచారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. మహాఘట్బంధన్లో పరిస్థితులు సజావుగా లేకపోవడం వల్లే ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు నితీశ్‌కు మద్దతిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీర్మానించారు. ఆ వెంటనే తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహా్వనించాల్సిందిగా గవర్నర్‌ను నితీశ్ కోరడం, సీఎంగా ప్రమాణం చేయడం చకచకా జరిగిపోయాయి. తర్వాత నితీశ్ మరోసారి మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏను వీడి ఇకపై ఎటూ వెళ్లేది లేదని చెప్పుకొచ్చారు. ఆయన తమ సహజ భాగస్వామి అని బీజేపీ చీఫ్ నడ్డా అన్నారు. జేడీ(యూ)తో కలిసి లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో మొత్తం 40 సీట్లనూ స్వీప్ చేస్తామని అన్నారు ఇండియా కూటమికి చావుదెబ్బ! తృణమూల్ కాంగ్రెస్, ఆప్ ఇచి్చన ఇటీవలి షాక్‌లకు ఇప్పటికే మూలుగుతున్న కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి నితీశ్ తాజా ని్రష్కమణతో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే దూకుడు మీదున్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని ఈ పరిణామం మరింత బలోపేతం చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో పశి్చమబెంగాల్లో అన్ని స్థానాల్లోనూ తృణమూల్ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించడం తెలిసిందే. పంజాబ్‌లోనూ ఆప్‌ది ఒంటరిపోరేనని రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ కూడా అదే రోజు స్పష్టం చేశారు. అధికారమే పరమావధి 2020లో ఏర్పాటైన ప్రస్తుత బిహార్ అసెంబ్లీ పదవీకాలంలో నితీశ్ సారథ్యంలో ఇది ఏకంగా మూడో ప్రభుత్వం కావడం విశేషం! అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ మద్దతుతో నితీశ్ సీఎం అయ్యారు. జేడీ(యూ)లో చీలికకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ 2022లో ఆ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి మహాఘట్బంధన్ సర్కారును ఏర్పాటు చేశారు. 18 నెలలకే దాన్నీ పడదోసి తాజాగా మరోసారి ఎన్డీఏతో జట్టు కట్టి మళ్లీ సీఎంగా పీఠమెక్కారు. మొత్తమ్మీద కూటములు మారడం నితీశ్‌కు ఇది ఐదోసారి. ఆయన తొలిసారిగా 2000లో బిహార్ సీఎం పదవి చేపట్టారు. 2013లో ఎన్డీఏతో 17 ఏళ్ల బంధాన్ని తెంచుకుని కాంగ్రెస్, సీపీఐ మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జేడీ(యూ) ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి నితీశ్ కుమార్ తప్పుకున్నారు. కానీ 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌తోకలిసి పోటీ చేసి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 2017లో తిరిగి ఎన్డీఏ గూటికి చేరి 2022 దాకా అందులో కొనసాగారు. -
బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా
అప్డేట్స్.. ► బీహార్ ముఖ్యమంత్రిగా తొమ్మిదోసారి నితీష్ కుమార్ సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇద్దరు బీజేపీ పార్టీకి చెందిన నేతలు విజయ్ సిన్హా, సామ్రాట్ చౌదరీ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేస్తారు. వీరితో పాటు ఓబీసీ-ఈబీసీ సమీకరణాల్లో భాగంగా మరో 8 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ► బిహార్ రాజకీయాలపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ప్రధాని నరేంద్ర మోదీ బిహార్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. వీరు ముగ్గురు బిహార్ ప్రజలకు ద్రోహం చేశారు. మరీ ముఖ్యంగా నితీష్ కుమార్ అయితే పలు సార్లు బిహార్ ప్రజలను మోసం చేశారు. రాజకీయ ఆవకాశవాదంలో నితీష్ రికార్డులు బద్దలు కొట్టారు. #WATCH | Hyderabad: On JDU President Nitish Kumar's resignation as Bihar CM, AIMIM chief Asaduddin Owaisi says, "Nitish Kumar, Tesjaswi Yadav, PM Modi should apologise to the people of Bihar... All three have betrayed the people of Bihar, especially Nitish Kumar... The term… pic.twitter.com/7mOeAokcCK — ANI (@ANI) January 28, 2024 ► బీజేపీతో నితీష్ కుమార్ చేతులు కలిపి ఎన్డీఏ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ శ్రేణులు వేడుక చేసుకుంటున్నాయి. కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. #WATCH | BJP workers celebrate in Bihar's Patna after Nitish Kumar & BJP stake claim to form the govt in the state#BiharPolitics pic.twitter.com/KXhk41r2Hd — ANI (@ANI) January 28, 2024 ► సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఎన్డీఏ కూటమిలో చేరనున్నందుకు అభినందనలు తెలిపారు. ► బిహార్‌లో రాష్ట్ర శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌధరి మాట్లాడారు. తన జీవిత కాలంలో సాధించిన అరుదైన సందర్భంగా అభివర్ణించారు. #WATCH | Patna | After being elected as the Leader of the Legislative Party, state BJP chief Samrat Chaudhary says, "BJP did a historic thing for my life...This is an emotional moment for me to have been elected as the Leader of the Legislative Party to be a part of the… pic.twitter.com/NYq6GKp8Ht — ANI (@ANI) January 28, 2024 ► బీజేపీ, జేడీయూలతో కలిపి బిహార్‌లో ఎన్జీడే ప్రభుత్వం ఏర్పడటానికి రాష్ట్ర ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. #WATCH | Patna | Bihar MLAs unanimously passed the proposal to form the NDA government in the state with BJP, JD(U) and other allies. Samrat Chaudhary has been elected as the Leader of the legislative party, Vijay Sinha elected as the Deputy Leader. pic.twitter.com/N9kFWHkYYz — ANI (@ANI) January 28, 2024 ► నితీష్ కుమార్ రాజీనామాపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఇది జరుగుతుందని తనకు ముందే తెలుసని అన్నారు. "Knew it would happen," says Mallikarjun Kharge on Nitish Kumar's exit from Mahagathbandhan Read @ANI Story | https://t.co/dPQbzR6iHf#MallikarjunKharge #NitishKumar #INDIAAlliance pic.twitter.com/OS1uIyP2MZ — ANI Digital (@ani_digital) January 28, 2024 ► మహాకూటమిలో పరిస్థితిలు సరిగా లేవని నితీష్ కుమార్ చెప్పారు. అందుకే మహాకూటమి నుంచి బయటకు వచ్చానని అన్నారు. త్వరలో కొత్త కూటమిని ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. గవర్నర్‌కు లేఖ సమర్పించానని స్పష్టం చేశారు. గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించిన అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. #WATCH | Patna | Bihar outgoing CM and JD(U) president Nitish Kumar says, "Today, I have resigned as the Chief Minister and I have also told the Governor to dissolve the government in the state. This situation came because not everything was alright...I was getting views from… pic.twitter.com/wOVGFJSKKH — ANI (@ANI) January 28, 2024 ► బీహార్, పాట్నాలో బీజేపీ శాసనసభా పక్ష సమావేశం ముగిసింది. #UPDATE | The BJP legislative party meeting in Patna, Bihar concludes. — ANI (@ANI) January 28, 2024 ► బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేశారు. గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్చించారు. దీంతో జేడీయూ - ఆర్జేడీ ప్రభుత్వం కూలిపోయింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బీజేపీ-జేడీయూ నేతృత్వంలో సీఎంగా నితీష్ మళ్లీ ప్రమాణం చేయనున్నారు. Nitish Kumar tendered his resignation as the Chief Minister of Bihar to Governor Rajendra Arlekar. The Governor accepted the resignation and deputed him as the Acting CM. pic.twitter.com/uaDXROe6PA — ANI (@ANI) January 28, 2024 ► బిహార్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పార్టీల పెద్దలు తమ వర్గం ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలతో పార్టీ పెద్దలు సమావేశం ప్రారంభించారు. #WATCH | A meeting of Bihar BJP MLAs and leaders of the party is underway at the party office in Patna, amid political developments in the state. The legislative party meeting is underway here pic.twitter.com/LoRdSg0ojL — ANI (@ANI) January 28, 2024 ► పార్టీ ఎమ్మెల్యేలతో నేడు పాట్నాలో జరగనున్న సమావేశానికి బిహార్ బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌధరి హాజరయ్యారు. #WATCH | BJP Bihar President Samrat Chaudhary arrives at the party office in Patna for a meeting of the party MLAs. pic.twitter.com/dGK51tU2UM — ANI (@ANI) January 28, 2024 ► పాట్నాలోని పార్టీ కార్యాలయానికి బిహార్ బీజేపీ మాజీ అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్ హాజరయ్యారు. #WATCH | Former Bihar BJP president Sanjay Jaiswal arrives at the party office in Patna, for a meeting of party leaders here. On speculations around Nitish Kumar, he says, "...The most important goal of the state working committee is to line up the preparations for the next one… pic.twitter.com/6TiiflXzKk — ANI (@ANI) January 28, 2024 ► సీఎం నితీష్ కుమార్ ఇంటికి జేడీయూ ఎంపీ కౌశలేంద్ర కుమార్ వచ్చారు. కేవలం తమను రమ్మని మాత్రమే పిలిచినట్లు ఆయన చెప్పారు. తదుపరి పరిణామాలు తెలియదని అన్నారు. #WATCH | Patna, Bihar | JD(U) MP Kaushalendra Kumar arrives at the residence of CM Nitish Kumar; he says, "...We have been called, so we have come here..."#BiharPolitics pic.twitter.com/kFfPCWn99I — ANI (@ANI) January 28, 2024 ► బిహార్‌లో రాజకీయ మార్పులు రసవత్తరంగా ఉన్నాయి. పాట్నాలో పార్టీ కార్యాలయానికి కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ నిత్యానంద రాయ్ బయలుదేరారు. #WATCH | Bihar | Union Minister and BJP MP Nityanand Rai arrives at the state party office in Patna for a meeting, amid political developments in the state. pic.twitter.com/DlN3rFF2tk — ANI (@ANI) January 28, 2024 ► పాట్నాలోని పార్టీ కార్యాలయానికి బీజేపీ ఎంపీ రవి శంకర్ ప్రసాద్ బయలుదేరారు. #WATCH | Bihar | BJP MP Ravi Shankar Prasad arrives at the state party office in Patna for a meeting, amid political developments in the state. pic.twitter.com/9h2MUApSvg — ANI (@ANI) January 28, 2024 ►పార్టీ శాసనసభ్యుల భేటీకి హాజరవుతున్నట్లు బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ ఎమ్మెల్యే తార్కిషోర్ ప్రసాద్ తెలిపారు. అజెండా పూర్తిగా తనకు తెలియదని చెప్పారు. రావాలని చెప్పారు.. కాబట్టి తాము వస్తున్నట్లు చెప్పారు. #WATCH | Patna | Former Bihar Deputy CM and BJP MLA Tarkishore Prasad says, "A legislative party meeting has been called and we have come here for that. The agenda is not clear. We have been told to come, so we have come..." On political developments in the state, he says, "The… pic.twitter.com/AVUbdtiYeg — ANI (@ANI) January 28, 2024 ►బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేడు రాజీనామా చేయనున్నారు. గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సీఎంగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్బంధన్ సంకీర్ణ సర్కారుకు జేడీ(యూ) సారథి, సీఎం నితీశ్‌కుమార్ గుడ్‌బై చెప్పడం, మళ్లీ బీజేపీతో దోస్తీ కట్టి ఎన్డీఏ కూటమిలో చేరడం ఖాయమైనట్టు కనిపిస్తోంది. బీజేపీ, జేడీ(యూ), జితిన్‌రాం మాంఝీ సారథ్యంలోని హిందూస్తాన్ అవామీ లీగ్ అందులో పాల్గొంటాయి. ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభాపక్ష నేతగా నితీశ్‌ను ఎన్నుకుంటారు. వెంటనే ఆయన గవర్నర్‌ను కలిసి సీఎం పదవికి రాజీనామా చేస్తారు. ఎన్డీఏ పక్షాల మద్దతు లేఖలు సమరి్పంచి మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరతారు. సాయంత్రం సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని సమాచారం. మాంఝీ కూడా రెండు మంత్రి పదవులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆదివారం విధులకు రావాల్సిందిగా సచివాలయ సిబ్బందికి ఆదేశాలు వెళ్లడం వంటివన్నీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సూచికలేనని చెబుతున్నారు. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నితీశ్‌ను బలపరిచే అవకాశముందని వార్తలొస్తున్నాయి. కనీసం ఏడెనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సెల్ ఫోన్లు శనివారమంతా స్విచాఫ్ కావడం వాటిని బలపరుస్తోంది! ఇండియా కూటమి ఖతమే: జేడీ(యూ) బిహార్‌లో ఘట్బంధన్ సంకీర్ణం కుప్పకూలనుందని జేడీ(యూ) రాజకీయ సలహాదారు, అధికార ప్రతినిధి కేసీ త్యాగి స్పష్టం చేశారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు నితీశ్‌ను పదేపదే అవమానించడమే ఇందుకు కారణమని చెప్పారు. కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి కూడా కుప్పకూలే దశలో ఉందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మాత్రం కూటమికి వచి్చన ముప్పేమీ లేదని ఆశాభావం వెలిబుచ్చారు. అయితే, నితీశ్‌తో మాట్లాడేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పదేపదే ప్రయత్నించినా ఆయన ‘బిజీ’గా ఉండటంతో వీలు కాలేదని వెల్లడించారు! ఇండియా కూటమి నుంచి జేడీ(యూ) వైదొలగుతున్నట్టు ఎలాంటి సమాచారమూ లేదని ఖర్గే చెప్పుకొచ్చారు. ఇదీ చదవండి: కూటమిని కాపాడుకుంటాం: ఖర్గే -
ఇలా రాజీనామా, అలా ప్రమాణం!
పట్నా/న్యూఢిల్లీ: బిహార్‌లో రాజకీయ సంక్షోభం క్లైమాక్స్‌కు చేరుతోంది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్బంధన్ సంకీర్ణ సర్కారుకు జేడీ(యూ) సారథి, సీఎం నితీశ్‌కుమార్ గుడ్‌బై చెప్పడం, మళ్లీ బీజేపీతో దోస్తీ కట్టి ఎన్డీఏ కూటమిలో చేరడం ఖాయమైనట్టు కని్పస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, ఆదివారం ఉదయం నితీశ్ సారథ్యంలో పటా్నలో ఎన్డీఏ శాసనసభా పక్ష భేటీ జరగనుంది. బీజేపీ, జేడీ(యూ), జితిన్‌రాం మాంఝీ సారథ్యంలోని హిందూస్తాన్ అవామీ లీగ్ అందులో పాల్గొంటాయి. ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభాపక్ష నేతగా నితీశ్‌ను ఎన్నుకుంటారు. వెంటనే ఆయన గవర్నర్‌ను కలిసి సీఎం పదవికి రాజీనామా చేస్తారు. ఎన్డీఏ పక్షాల మద్దతు లేఖలు సమరి్పంచి మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరతారు. సాయంత్రం సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని సమాచారం. మాంఝీ కూడా రెండు మంత్రి పదవులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆదివారం విధులకు రావాల్సిందిగా సచివాలయ సిబ్బందికి ఆదేశాలు వెళ్లడం వంటివన్నీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సూచికలేనని చెబుతున్నారు. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నితీశ్‌ను బలపరిచే అవకాశముందని వార్తలొస్తున్నాయి. కనీసం ఏడెనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సెల్ ఫోన్లు శనివారమంతా స్విచాఫ్ కావడం వాటిని బలపరుస్తోంది! దాంతో పరిస్థితిని సమీక్షించేందుకు కాంగ్రెస్ అధిష్టానం తరఫున ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘెల్ హుటాహుటిన పట్నా చేరుకున్నారు. ఇండియా కూటమిలోకి రావాల్సిందిగా మాంఝీతో మంతనాలు జరిపారు. మరోవైపు నితీశ్‌తో చేదు అనుభవాల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ వ్యూహాత్మకమౌనం పాటిస్తోంది. శనివారం పటా్నలో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దీనిపై లోతుగా చర్చ జరిగినా జేడీ(యూ)ను తిరిగి ఎన్డీఏలోకి ఆహా్వనించడంపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఇక ఘట్బంధన్ సంకీర్ణంలో ప్రధాన భాగస్వామ్య పక్షమైన ఆర్జేడీ ఎలాగైనా సర్కారును కాపాడుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఆర్జేడీ నేతలతో పార్టీ చీఫ్ లాలు మంతనాల్లో మునిగి తేలుతున్నారు. జేడీ(యూ) లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వాలని నేతలు ప్రతిపాదించారు. అయితే బీజేపీ, జేడీ(యూ) కలిస్తే 123 ఎమ్మెల్యేలతో మెజారిటీ మార్కు (122)ను సులువుగా దాటేస్తారంటూ లాలు కుమారుడు, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వాటిని తిరస్కరించినట్టు చెబుతున్నారు. ఇలా శనివారమంతా పట్నాలో హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామా నడిచింది. ఇండియా కూటమి ఖతమే: జేడీ(యూ) బిహార్‌లో ఘట్బంధన్ సంకీర్ణం కుప్పకూలనుందని జేడీ(యూ) రాజకీయ సలహాదారు, అధికార ప్రతినిధి కేసీ త్యాగి స్పష్టం చేశారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు నితీశ్‌ను పదేపదే అవమానించడమే ఇందుకు కారణమని చెప్పారు. కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి కూడా కుప్పకూలే దశలో ఉందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మాత్రం కూటమికి వచి్చన ముప్పేమీ లేదని ఆశాభావం వెలిబుచ్చారు. అయితే, నితీశ్‌తో మాట్లాడేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పదేపదే ప్రయత్నించినా ఆయన ‘బిజీ’గా ఉండటంతో వీలు కాలేదని వెల్లడించారు! ఇండియా కూటమి నుంచి జేడీ(యూ) వైదొలగుతున్నట్టు ఎలాంటి సమాచారమూ లేదని ఖర్గే చెప్పుకొచ్చారు. -
Bihar Politics: రేపే ఎన్డీఏలోకి నితీశ్?
పట్నా/న్యూఢిల్లీ: బిహార్ రాజకీయం రసకందాయంలో పడింది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన అధికార మహాఘట్బంధన్ సంకీర్ణానికి జేడీ(యూ) సారథి, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గుడ్‌బై చెప్పి ఎన్డీఏ కూటమిలో చేరడం దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది. పాత నేస్తం బీజేపీతో మళ్లీ జట్టు కట్టి ఆయన కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారమే నితీశ్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయవచ్చని జేడీ(యూ) వర్గాలంటున్నాయి. రాష్ట్ర బీజేపీ అగ్ర నేత సుశీల్‌కుమార్ మోదీకి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కనుందని సమాచారం. ‘‘(నితీశ్‌కు ఇంతకాలంగా బీజేపీలోకి) మూసుకుపోయిన తలుపులు తెరుచుకోవచ్చు. రాజకీయాంటేనే అవకాశాల ఆటస్థలి. కనుక ఏదైనా సాధ్యమే’’ అంటూ శుక్రవారం సుశీల్ చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. బిహార్ తాజా పరిణామాలపై రాష్ట్ర బీజేపీ చీఫ్ సమర్థ్ చౌదరి, సుశీల్‌కుమార్ ఇప్పటికే ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితర బీజేపీ అగ్ర నేతలతో చర్చలు జరిపి వచ్చారు. ఈ నేపథ్యంలో జేడీ(యూ)ను ఎన్డీఏలోకి తీసుకోవడంపై శని, ఆదివారాల్లో బిహార్ బీజేపీ రెండు రోజుల రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్నారు. ఆదివారమే పొత్తు నిర్ణయం వెలువడవచ్చని తెలుస్తోంది. ఆ రోజు ఉదయమే జేడీ(యూ) ఎమ్మెల్యేలతో నితీశ్ సమావేశం కానుండటం విశేషం! మరోవైపు 10 మంది దాకా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో టచ్‌లో ఉన్నట్టు వస్తున్న వార్తలు అధికార సంకీర్ణంలో కలకలం రేపుతున్నాయి. నితీశ్ స్పష్టత ఇవ్వాలి: ఆర్జేడీ సంకీర్ణంలో ప్రధాన భాగస్వామి అయిన ఆర్జేడీతో నితీశ్‌కు విభేదాల నేపథ్యంలో బిహార్‌లో రెండు రోజులుగా రాజకీయ రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆయన ఎన్డీఏలో చేరతారన్న వార్తలు గురువారం కలకలం రేపాయి. జేడీ(యూ) ని్రష్కమిస్తే సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది. దాన్ని కాపాడుకునేందుకు అవసరమైన 8 మంది ఎమ్మెల్యేల కోసం ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నలుగురు ఎమ్మెల్యేలున్న ఎన్డీఏ భాగస్వామి హిందూస్తానీ అవామ్ మోర్చా చీఫ్ జితిన్‌రామ్ మాంఝీతో శుక్రవారం మంతనాలు జరిపారు. మాంఝీ మాత్రం నితీశ్ కూడా త్వరలో ఎన్డీఏలోకి వస్తారని మీడియాతో చెప్పుకొచ్చారు! ఘట్బంధన్ సర్కారు ఒకట్రెండు రోజుల్లోనే కుప్పకూలడం ఖాయమని ఆయన కుమారుడు సంతోష్ జోస్యం చెప్పారు. మొత్తం ఉదంతంపై నితీశ్ తక్షణం స్పష్టమైన ప్రకటన చేసి ఊహాగానాలకు తెర దించాలని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా కోరడం విశేషం. -
Lok Sabha polls 2024: బీజేపీ వైపు... నితీశ్ చూపు!
పట్నా/న్యూఢిల్లీ: కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమికి రెండు రోజుల్లోనే మూడో భారీ ఎదురుదెబ్బ! కీలక భాగస్వామి అయిన జేడీ(యూ) అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ కూటమికి కటీఫ్ చెప్పేలా కని్పస్తున్నారు. అవసరార్థపు గోడ దూకుళ్లకు పెట్టింది పేరైన ఆయన 2024 లోక్‌సభ ఎన్నికల ముంగిట యూ టర్న్ తీసుకుని మళ్లీ బీజేపీతో జట్టు కట్టే దిశగా సాగుతున్నారు. ఈ దిశగా బుధవారం నుంచీ జరుగుతున్న వరుస పరిణామాలతో బిహార్‌లో ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్, వామపక్షాల మహాఘట్బంధన్ సంకీర్ణ సర్కారు కూడా కుప్పకూలేలా కన్పిస్తోంది. ఘట్‌బంధన్‌తో 18 నెలల కలహాల కాపురానికి ఫుల్స్టాప్ పెట్టి బీజేపీ మద్దతుతో మరోసారి సీఎం పీఠం కాపాడుకునే ప్రయత్నాలకు నితీశ్ పదును పెట్టారంటూ వార్తలు వస్తున్నాయి. ప్రతిగా ఆర్జేడీ కూడా జేడీ(యూ)తో నిమిత్తం లేకుండా మెజారిటీ సాధనకు ప్రయత్నాలకు పదును పెట్టింది. ఈ దిశగా జేడీ(యూ) సీనియర్ నేతలతో నితీశ్ ఇంట్లో, ఘట్‌బంధన్‌లోని ఇతర పక్షాలతో ఆర్జేడీ చీఫ్ లాలుప్రసాద్ నివాసంలో పోటాపోటీ సమావేశాలతో గురువారం బిహార్ రాజధాని పట్నాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నితీశ్ నివాసంలో భేటీలో జేడీ(యూ) ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. ఇక లాలు ఒకవైపు తన నివాసంలో భేటీ జరుగుండగానే మరోవైపు ఆర్జేడీకే చెందిన అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌధరితో కూడా ఫోన్లో మంతనాలు జరిపారు. దాంతో నితీశ్ మరింత అప్రమత్తయ్యారు. ఆర్జేడీకి ప్రభుత్వ ఏర్పాటుకు చాన్సివ్వకుండా అవసరమైతే అసెంబ్లీని రద్దు చేయాలని కూడా ఆయన యోచిస్తున్నట్టు చెబుతున్నారు! లోక్‌సభ ఎన్నికల్లో పశి్చమ బెంగాల్లో కాంగ్రెస్‌తో పొత్తుండబోదని, ఒంటరిగానే పోటీ చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పంజాబ్‌లో ఆప్‌దీ ఒంటరి పోరేనని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ బుధవారం ప్రకటించడం తెలిసిందే. దాంతో ఒక్కసారిగా డీలా పడ్డ ఇండియా కూటమిలో బిహార్ తాజా పరిణామాలు మరింత కలవరం రేపుతున్నాయి. నితీశ్ బీజేపీ గూటికి చేరితే విపక్ష కూటమి దాదాపుగా విచి్ఛన్నమైనట్టేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ జోడో న్యాయ్ యాత్రకు రెండు రోజుల విరామమిచ్చి ఢిల్లీ చేరిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఈ పరిణామాలన్నింటిపై పార్టీ నేతలతో మంతనాల్లో మునిగిపోయారు. మరోవైపు బిహార్ బీజేపీ చీఫ్ సమర్థ్ చౌదరి, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి అశ్వినీ చౌబేతో పాటు జేడీ(యూ) రాజకీయ సలహాదారు కేసీ త్యాగి కూడా ఒకే విమానంలో హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. దాంతో హస్తినలోనూ రాజకీయ వేడి తారస్థాయికి చేరుతోంది. ఆదినుంచీ కలహాల కాపురమే... బిహార్‌లో 2020లో ఏర్పాటైన మహాఘట్బంధన్ సంకీర్ణ సర్కారు నిత్యం కలహాలమయంగానే సాగుతూ వస్తోంది. ముఖ్యంగా తేజస్విని సీఎం చేసి తప్పుకోవాలని లాలు కొంతకాలంగా పట్టుబడుతుండటంపై నితీశ్ గుర్రుగా ఉన్నారు. జేడీ(యూ) తాజా మాజీ అధ్యక్షుడు లలన్ సింగ్ సాయంతో ఆ పార్టీ నుంచి డజను మంది ఎమ్మెల్యేలను లాగేసేందుకు లాలు ఇటీవల గట్టి ప్రయత్నమే చేశారు. దాన్ని సకాలంలో పసిగట్టిన నితీశ్ లలన్‌కు ఉద్వాసన పలికి తానే పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు. ఈ ఉదంతంతో ఆర్జేడీతో విభేదాలు తారస్థాయికి చేరాయి. లాలు, నితీశ్‌లిద్దరికీ రాజకీయ గురువైన బిహార్ దివంగత సీఎం కర్పూరి ఠాకూర్ శత జయంత్యుత్సవాల సందర్భంగా బుధవారం నితీశ్ చేసిన వ్యాఖ్యలు విభేదాలకు మరింతగా ఆజ్యం పోశాయి. పారీ్టల్లో కుటుంబాల పెత్తనాన్ని కర్పూరి తీవ్రంగా వ్యతిరేకించేశారన్న నితీశ్ వ్యాఖ్యలు ఆర్జేడీని ఉద్దేశించినవేనంటూ లాలు కుటుంబం మండిపడింది. నితీశ్ అవకాశవాది అని తూర్పారబడుతూ లాలు కుమార్తె రోహిణీ ఆచార్య ఎక్స్‌లో పెట్టిన పోస్టులతో పరిస్థితి రసకందాయంలో పడింది. నితీశ్‌పై ఆమె విమర్శలను రాష్ట్ర బీజేపీ అగ్ర నేతలు తీవ్రంగా ఖండించడం, ఆ వెంటనే ఆ పారీ్టతో జేడీ(యూ) దోస్తీ అంటూ వార్తలు రావడం... నితీశ్, లాలు నివాసాల్లో పోటాపోటీ సమావేశాల తదితర పరిణామా లు వెంటవెంటనే జరిగిపోయాయి. గిరిరాజ్ చెణుకులు పదేపదే ఆర్జేడీపై అలగడం నితీశ్‌కు పరిపాటేనంటూ కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర నేత గిరిరాజ్‌సింగ్ విసిరిన చెణుకులు గురువారం వైరల్‌గా మారాయి. ‘‘నే పుట్టింటికి వెళ్లిపోతా. నువ్వు చూస్తూ ఉండిపోతావ్ అని పాడుతూ లాలును నితీశ్ చీటికీమాటికీ బెదిరిస్తుంటారు. కానీ పుట్టింటి (బీజేపీ) తలుపులు తనకు శాశ్వతంగా మూసుకుపోయాయన్న వాస్తవాన్ని మాత్రం దాస్తుంటారు’’ అంటూ తాజా పరిణామాలపై గిరిరాజ్ స్పందించారు. గోడదూకుళ్లలో ఘనాపాఠి రాజకీయ గాలికి స్వీయ ప్రయోజనాలకు అనుగుణంగా మంచినీళ్ల ప్రాయంగా కూటములను మార్చడంలో నితీశ్‌కుమార్ సిద్ధహస్తుడు. దాంతో ఆయన్ను పల్టూ (పిల్లిమొగ్గల) కుమార్‌గా పిలవడం పరిపాటిగా మారింది. బీజేపీ వాజ్‌పేయీ, అడ్వాణీల సారథ్యంలో సాగినంత కాలం ఆ పారీ్టతో నితీశ్ బంధం అవిచి్ఛన్నంగా సాగింది. వారి శకం ముగిసి నరేంద్ర మోదీ తెరపైకి రావడంతో పొరపొచ్ఛాలు మొదలయ్యాయి. ఆయన్ను ప్రధాని అభ్యరి్థగా ప్రకటించడంతో బీజేపీతో 17 ఏళ్ల బంధానికి 2013లో తొలిసారిగా గుడ్‌బై చెప్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత బిహార్ సీఎంగా తప్పుకుని జితిన్‌రాం మాంఝీని గద్దెనెక్కించారు. తన బద్ధ విరోధి అయిన లాలు సారథ్యంలోని ఆర్జేడీతో పొత్తు ద్వారా సర్కారును కాపాడుకున్నారు. 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో మహాఘట్‌బంధన్‌గా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఘనవిజయం సాధించి మళ్లీ సీఎం అయ్యారు. కానీ సంఖ్యాబలంలో ఆర్జేడీ పెద్ద పారీ్టగా అవతరించడంతో నితీశ్ ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. లాలు కుమారుడు తేజస్విని అయిష్టంగానే డిప్యూటీ సీఎం చేయాల్సి వచి్చంది. రెండేళ్లలోపే కూటమిలో పొరపొచ్ఛాలు పెద్దవయ్యాయి. సరిగ్గా అదే సమయంలో లాలు, తేజస్విలపై సీబీఐ కేసులు నితీశ్‌కు అందివచ్చాయి. డిప్యూటీ సీఎం పోస్టుకు రాజీనామా చేసేందుకు తేజస్వి ససేమిరా అనడంతో తానే సీఎం పదవికి రాజీనామా చేసి 2017లో కూటమి సర్కారును కుప్పకూల్చారు. గంటల వ్యవధిలోనే బీజేపీ మద్దతుతో మళ్లీ గద్దెనెక్కి ఔరా అనిపించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయంతో నితీశ్ మళ్లీ సీఎం అయ్యారు. కానీ ఈసారి బీజేపీ పెద్ద పారీ్టగా అవతరించడంతో ఏ విషయంలోనూ తన మాట సాగక ఉక్కపోతకు గురయ్యారు. చివరికి జేడీ(యూ)ను చీల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ 2022 ఆగస్టులో దానికి గుడ్‌బై చెప్పారు. మర్నాడే ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో మహాఘట్బంధన్ సర్కారు ఏర్పాటు చేసి సీఎం పీఠం కాపాడుకున్నారు. తాజాగా నితీశ్ మళ్లీ బీజేపీ వైపు చూస్తున్నారన్న వార్తలు నిజమైతే ఇది ఆయనకు ఐదో పిల్లిమొగ్గ అవుతుంది! తెరపైకి మెజారిటీ లెక్కలు... నితీశ్ బీజేపీ గూటికి చేరతారన్న వార్తల నేపథ్యంలో బిహార్ అసెంబ్లీలో బలాబలాలు మరోసారి తెరపైకొచ్చాయి. 243 మంది సభ్యుల అసెంబ్లీలో మెజారిటీ మార్కు 122. మహాఘట్బంధన్ ప్రస్తుత బలం 159. 45 మంది ఎమ్మెల్యేలున్న జేడీ(యూ) ని్రష్కమిస్తే ఆర్జేడీ (79), కాంగ్రెస్ (19), వామపక్షాల (16)తో కూటమి బలం 114కు పడిపోతుంది. అప్పుడు మెజారిటీకి మరో 8 మంది ఎమ్మెల్యేలు అవసరమవుతారు. జితిన్‌రాం మాంఝీ సారథ్యంలోని హెచ్ఏఎం (4), మజ్లిస్ (1), స్వతంత్ర ఎమ్మెల్యే (1) మద్దతు కూడగట్టినా 120కే చేరుతుంది. మెజారిటీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కావాలి. ఈ నేపథ్యంలో మాంఝీ తదితరులతో పాటు జేడీ(యూ) అసంతృప్త ఎమ్మెల్యేలతో కూడా ఆర్జేడీ చీఫ్ లాలు జోరుగా మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జేడీకి చెందిన స్పీకర్ పాత్ర కూడా కీలకంగా మారేలా కన్పిస్తోంది. మరోవైపు బీజేపీ, జేడీ(యూ) కలిస్తే 123 మంది ఎమ్మెల్యేలతో మెజారిటీ మార్కును అలవోకగా దాటేస్తాయి. తద్వారా తానే సీఎంగా కొనసాగాలని నితీశ్ భావిస్తున్నట్టు సమాచారం. కానీ అందుకు బీజేపీ సుముఖంగా లేదని, తమకే సీఎం చాన్సివ్వాలని భావిస్తోందని చెబుతున్నారు. అందుకు నితీశ్ అంగీకరించే పక్షంలో ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. -
Bihar: నితీష్ కుమార్‌కు షాకిచ్చిన పాట్నా హైకోర్టు..
పాట్నా: నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వానికి పాట్నా హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల ఆధారిత సర్వేపై హైకోర్టు స్టే విధించింది. కుల గణనపై దాఖలైన మూడు పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్, జస్టిస్ మధురేష్ ప్రసాద్‌లతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కుల, ఆర్థిక సర్వేలు నిర్వహిస్తోందని పిటిషనర్లలో ఒకరైన దిను కుమార్ కోర్టుకు తెలిపారు. సర్వేలు నిర్వహించే హక్కు రాష్ట్ర ప్రభుత్వ పరిధికి మించినదని అన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ప్రస్తుతం జరుగుతున్న సర్వేపై తక్షణమే స్టే విధించాలని, ఇప్పటివరకు సేకరించిన సర్వే డేటాను తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు భద్రపరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది. కాగా మహాఘట్బంధన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన చేపట్టిన విషయం తెలిసిందే. దీనికోసం రూ. 500 కోట్లు ఖర్చుపెడుతోంది. రెండు దశల్లో చేపట్టిన ఈ గణన జనవరి 7న ప్రారంభమైంది. మొదటి దశలో 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కులాల లెక్కింపు జరిగింది. రెండో సర్వే ఏప్రిల్ 15న ప్రారంభమవ్వగా మే 15వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉంది. చదవండి: రోడ్డు ప్రమాదంలో యూట్యూబర్ మృతి.. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో.. ఈ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికి తిరుగుతూ ప్రజల కులం, విద్య, ఆర్థిక, సామాజిక స్థితి, కుటుంబ స్థితిగతులు వంటి విషయాలను తెలుసుకుంటున్నారు. వాస్తవానికి కులగణన చేపట్టాల్సింది కేంద్ర ప్రభుత్వం. అయితే కేంద్రం కుల గణన చేపట్టాలని నితీష్ కుమార్ పలుమార్లు కోరారు. కానీ కేంద్రం నుంచి సరైన సమాధానం లేకపోవడంతో బిహార్ సీఎం స్వయంగా తమ రాష్ట్రంలో కుల గణన చేపట్టింది. అవసరమైన వారికి సేవలు అందించడంలో సర్వే ఉపయోగపడుతుందని సీఎం నితీశ్ తెలిపారు. అయితే ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేపై వస్తున్న వ్యతిరేకతపై నితీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో వెనకబడిన వర్గాల ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం సర్వే ఉపయోగపడుతుందని తెలిపారు. దీని ద్వారా ప్రజలకే ప్రభుత్వం లక్ష్య సాయాన్ని సులువగా చేర్చేందుకు దోహదపడుతందన్నారు. చదవండి: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మనందం ప్రచారం.. ఏ పార్టీ తరపునో తెలుసా? #WATCH | Bihar Deputy CM Tejashwi Yadav speaks after Patna HC puts a stay on Caste-based census, says, "Caste-based census is for welfare of the people, we want to eradicate poverty, backwardness. One thing is clear, it is bound to happen" pic.twitter.com/GZG7V5m7de — ANI (@ANI) May 4, 2023 -
బీజేపీతో ఇంకా టచ్‌లోనే.. ఇదే సాక్ష్యం!
పాట్నా: బీజేపీతో బంధం తెంచుకుని ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన జేడీయూ నేత నితీశ్‌కుమార్ త్వరలో మళ్లీ బీజేపీ పంచన చేరుతారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అంచనా వేస్తున్నారు. ఊపిరి ఉన్నంత వరకు బీజేపీతో కలవనని నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్ కిషోర్ తాజాగా కౌంటర్ వేశారు. బిహార్‌లోని పశ్చిమచంపారన్ జిల్లాలో పాదయాత్రలో మద్దతుదారులను ఉద్దేశిస్తూ పీకే ప్రసంగించారు.‘బీజేపీతో ఆయన తెగదెంపులు చేసుకున్నారా? అది అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన ఇంకా ఆ పార్టీతో టచ్‌లోనే ఉన్నారు!. ఇందుకు సాక్ష్యం కూడా ఉంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఇంకా కొనసాగుతున్న జేడీయూ నేత హరివంశ్ అందుకు సాక్ష్యం. ఇప్పటికే ఆయన్ని పదవి నుంచి తప్పుకోవాలని నితీశ్ ఆదేశించి ఉండాల్సింది. లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సింది. కానీ, అలా జరగలేదు. ఎందుకంటే హరివంశ్ ద్వారా నితీశ్ ఇంకా బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు’ అని ప్రశాంత్ పేర్కొన్నారు.‘ప్రశాంత్ ఏం చేయగలడనేది దేశవ్యాప్తంగా సీనియర్ రాజకీయనేతలందరికీ తెలుసు. అదే ఎన్నికల్లో గెలిపించడం ’ అని ప్రశాంత్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. గతంలో జేడీ-యూలో చేరి జాతీయ ఉపాధ్యక్ష పగ్గాలు అందుకున్న ప్రశాంత్ కిషోర్‌ను.. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడనే కారణంతో పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత సొంత వేదికతో ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులేస్తున్న ప్రశాంత్ కిషోర్.. నితీశ్‌పై సూటి విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ క్రమంలో నితీశ్ సైతం పీకేకు కౌంటర్లు ఇస్తున్నారు. #WATCH | As far as I know, Nitish Kumar is surely with Mahagathbandhan but hasn't closed his channels with BJP, biggest proof is that RS Dy Chairman-JDU MP Harivansh neither resigned from his post nor party asked him to do so: P Kishor (Source: Self-made video by Kishor to ANI) pic.twitter.com/DmMVMZvU84 — ANI (@ANI) October 20, 2022 -
చచ్చేదాకా బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు!
సమస్తీపూర్: తాను బతికి ఉన్నంతకాలం బీజేపీతో మళ్లీ కలిసే ప్రసక్తే లేదని బిహార్ ముఖ్యమంత్రి,, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి దర్యాప్తు సంస్థలను వాడుకుంటోందని బీజేపీపై మండిపడ్డారు. ఆయన శుక్రవారం సమస్తీపూర్‌లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను ప్రారంభించి.. ప్రసంగించారు. వారు గతంలో లాలూ గారిపై(ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్) కేసు పెట్టారు. దాని వల్ల ఆయనతో నాకు సంబంధాలు తెగిపోయాయి. వాళ్లకు ఒరిగింది ఏమీ లేదు. ఇప్పుడు మేము మళ్ళీ కలిసి ఉన్నప్పుడు, వాళ్లు మళ్లీ కేసులు పెడుతున్నారు. ఇలాంటి వాళ్ల పనితీరు శైలి ఎలా ఉందో మీరు గమనించవచ్చు అంటూ పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. అయితే.. ప్రస్తుత బీజేపీ నాయకత్వం అరాచకంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్‌జోషీ హయాం నాటి బీజేపీ ఇప్పుడే లేదన్నారు. అందుకే తాను తుదిశ్వాస విడిచేవరకు జేడీయూ.. బీజేపీతో కలవబోదని అన్నారాయన. జేడీ(యూ), కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలకు కూడిన ‘మహాఘట్బంధన్’ ఎప్పటికీ కలిసే ఉంటుందని తేల్చిచెప్పారు. దేశ ప్రగతి కోసం తామంతా కలిసి పని చేస్తామని అన్నారు. ఇదీ చదవండి: మోయలేని భారం మోపే వాడే మోదీ -
నితీశ్ కుమార్‌తో దోస్తీపై ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: బిహీర్ సీఎం నితీశ్ కుమార్‌తో దోస్తీపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్. ఆయనతో మళ్లీ కలిసి పనిచేసేందుకు సిద్ధమే అని స్పష్టం చేశారు. కానీ ఒక్క షరతు విధించారు. నితీశ్ సర్కార్ బిహార్‌లో ఒక్క ఏడాదిలో 10 లక్షల ముందికి ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. అలా అయితేనే మహాఘట్బంధన్లో తాను కూడా చేరతానని చెప్పారు. అంతేకాదు రెండో రోజుల క్రితం నితీశ్‌తో తాను భేటీ అయినట్లు ప్రశాంత్ కిశోర్ ధ్రువీకరించారు. ప్రశాంత్ కిశోర్‌తో భేటీ అయినట్లు నితీశ్ బుధవారమే వెల్లడించారు. అయితే ఏ విషయాలపై మాట్లాడారనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. సాధారణంగానే సమావేశమైనట్లు పేర్కొన్నారు. వీరిద్దరి భేటీని జేడీయూ మాజీ నేత పవన్ వర్మ ఏర్పాటు చేయడం గమనార్హం. ప్రశాంత్ కిశోర్‌తో తనకు ఎలాంటి మనస్పర్థలు లేవని, పాత స్నేహితుడే అని నితీశ్ వ్యాఖ్యానించడం మళ్లీ వీరిద్దరూ జతకడతారా? అనే ఊహాగానాలకు తెరలేపింది. ఇప్పుడు పీకే రియాక్షన్ చూస్తుంటే ఇది వాస్తవరూపం దాల్చే సూచనలే కన్పిస్తున్నాయి. నెల రోజుల క్రితం ఏన్డీఏతో తెగదెంపులు చేసుకుని ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్టుల మద్దతుతో బిహార్‌లో మహాఘట్బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీశ్. అనంతరం 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకం చేసి కేంద్రంలో బీజేపీని ఓడిస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగానే ఢిల్లీ పర్యటను వెళ్లి కాంగ్రెస్ సహా వివిధ రాజకీయ పార్టీల అధినేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడే పీకేతో భేటీ కావడం చూస్తుంటే.. నితీశ్ పెద్ద ప్లాన్‌తోనే ముందుకెళ్తున్నట్లు స్పష్టమవుతోంది. చదవండి: ఆ వీడియో నిజమైతే నన్ను అరెస్టు చేయండి.. బీజేపీకి సిసోడియా సవాల్ -
పిల్లిమొగ్గల రాజకీయం
అనుమానిస్తున్నంతా అయింది. కొద్ది నెలలుగా బీజేపీ పెద్దలతో ఎడముఖం, పెడముఖంగా ఉన్న జనతాదళ్ – యునైటెడ్ (జేడీ–యూ) అధినేత నితీశ్ కుమార్ కాషాయపార్టీతో తెగతెంపులు చేసుకొని, జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) నుంచి మంగళవారం బయటకు వచ్చేశారు. బీహార్ సీఎం పదవికి రాజీనామా ఇచ్చారు. బీజేపీ వినా రాష్ట్రంలో మిగిలిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్ సహా 7 పార్టీల ‘మహా గఠ్బంధన్ 2.0’తో కొత్త సర్కారు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 2010 నవంబర్ నుంచి ఇప్పటికి 22 ఏళ్ళలో రకరకాల పొత్తులతో, ఏకంగా 8వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారానికి సిద్ధపడుతూ, కొత్త రికార్డు సృష్టించారు. రాజకీయ వ్యూహాలు, అధికార ఆకాంక్షల నడుమ విలువలకై వెతుకులాడితే వృథాప్రయాసని సామాన్య ఓటర్లకు చెప్పకనే చెప్పారు. పార్టీల తేడా లేకుండా బీజేపీ, కాంగ్రెస్, ఆర్జేడీ... ఇలా అన్నీ నితీశ్‌ను ఏదో ఒక సందర్భంలో దుయ్యబట్టినవే. పదేపదే అదే బీహారీ బాబుతో చేయి కలిపి, చంకనెక్కించుకున్నవే. ఇన్నిసార్లు దోస్తీలు మార్చి, రాజకీయ ఊసరవెల్లిగా అధికార పీఠాన్ని అట్టిపెట్టుకోవడం నితీశ్ చేసిన విచిత్ర విన్యాసం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులంటూ ఎవరూ ఉండరనే సూత్రాన్ని నితీశ్ ఆపోశన పట్టారు. అసలు సోషలిస్టు సిద్ధాంత నేపథ్యం నుంచి పైకొచ్చిన నితీశ్ ఏ సైద్ధాంతికతతో ఒకప్పుడు బీజేపీకి దగ్గరయ్యారన్నది ఆశ్చర్యమే. ఆ పైన 2013లోనే మోదీ మతతత్వాన్ని వ్యతిరేకించి, 17 ఏళ్ళ బంధాన్ని తెంపుకొని ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన ఆయన తర్వాత మళ్ళీ ఏ విలువల కోసం అదే నాయకుడితో అంటకాగారో అర్థం కాదు. తీరా ఇప్పుడు బలహీనపడుతున్న తన సొంత పార్టీ పునాదులు, లోలోపలి జాతీయ రాజకీయ ఆకాంక్షలతో ఆయన బీజేపీతో దోస్తీకి రామ్ రామ్ చెప్పడమూ భవిష్యత్ అవసరాల కోసం చేసిన రాజకీయమే. బీహార్ రాజకీయాల్లో ‘పల్టీ మాస్టర్’గా పేరు పడ్డ నితీశ్ వేసిన రాజకీయ పిల్లిమొగ్గలు అన్నీ ఇన్నీ కావు. 1994లో లూలూ ప్రసాద్‌తో విభేదించి, జనతాదళ్ నుంచి బయటకొచ్చి, సమతా పార్టీ పెట్టారు. ఆ తర్వాత ఎన్డీఏతో దోస్తీ కట్టారు. 2013లో మోదీ మతతత్త్వ రాజకీయాల్ని నిరసిస్తూ మహా గఠ్బంధన్తో కలిశారు. 2017లో ఆర్జేడీ అవినీతిమయమైందంటూ గఠ్బంధన్ను వదిలి మళ్ళీ ఎన్డీఏ పంచన చేరారు. ఇప్పుడేమో మళ్ళీ ‘మహా గఠ్బంధన్ 2.0’తో పాతవాళ్ళనే అక్కున చేర్చుకున్నారు. పాట్నాలో ఒకరికొకరు కూతవేటు దూరంలో నివసించే నితీశ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఇప్పుడు మరింత సన్నిహితం కానున్నారు. పరస్పరం అనుమానించుకుంటూ, తీవ్రంగా దూషించుకొన్న జేడీ(యూ), ఆర్జేడీలు ‘గతం గతః’ అనుకుంటూ, గాఢాలింగనం చేసుకోవడం రాజకీయ వైచిత్రి. ఎనభై ఏళ్ళ క్రితం సరిగ్గా ‘క్విట్ ఇండియా ఉద్యమం మొదలైన రోజునే తీసుకున్న ఈ మహత్తర నిర్ణయం దేశానికి నూతన ఉషోదయమ’ని తేజస్వి ఉవాచ. దేశం మాటేమో కానీ, అధికారం కోసం ముఖం వాచి, ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదా, హోం మంత్రిగా బాధ్యత, సోదరుడికి మరో మంత్రి పదవి... ఇన్నీ ఆశిస్తున్న తేజస్వి అండ్ పార్టీకి ఈ పొత్తుపొడుపు కొత్త పొద్దుపొడుపే. పెద్దన్న లాంటి లాలూతో కలసి నడిచిన నితీశ్... ఇది లాలూ వారసులకిస్తున్న రాజకీయ కానుక. గతంలో నితీశ్ తమను వదిలి బీజేపీ చేయందుకున్నప్పుడు ఆర్జేడీ ఆయనను నిందించింది. ఇప్పుడు అచ్చంగా అవే విమర్శలు బీజేపీ నోట వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో కలసి పోటీ చేసి, అధికారంలోకి వచ్చాక పొత్తుధర్మాన్ని విస్మరించి అర్ధంతరంగా వదిలేసిన నితీశ్ వల్ల బాధితులమనీ, రాజకీయ అమరులమనీ రాబోయే ఎన్నికల్లో చెప్పుకోవాలనీ బీజేపీ భావిస్తోంది. కలసి గెలిచినప్పటికీ కేంద్రంలో ఒకే ఒక్క మంత్రి పదవితో సరిపెట్టి అవమానించడమే కాక, తమను బలహీనపరిచేందుకు కాషాయపార్టీ తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నందుకే బయటకు రావాల్సి వచ్చిందని జేడీ (యూ) వాదిస్తోంది. పంజాబ్, మహారాష్ట్ర మొదలు ఇప్పుడు బీహార్ దాకా కూటమి మిత్రులను బీజేపీ ఎప్పుడూ బలహీనపరుస్తూనే వస్తోందని జేడీ–యూ పాత కథల పట్టిక చూపిస్తోంది. నిజానికి, నితిన్ గతంలో ఇవే తన ఆఖరి ఎన్నికలన్నారు. తీరా ఆ ఒట్టు తీసి గట్టు మీద పెట్టేశారు. ఢిల్లీలో చక్రం తిప్పాలన్న ఆశలను నెరవేర్చుకోవడానికి ఇదే మంచి సమయమని అనుకుంటున్నారు. లెక్కప్రకారం జాతీయ ఎన్నికలు 2024లో, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025లో జరగాలి. ఇప్పటి దాకా తన కైవసం చేసుకోలేకపోయిన బీహార్ విషయంలో బీజేపీకి రాబోయేది పెద్ద పరీక్ష. ‘మండల్ వర్సెస్ కమండల్’ పోరాటానికి బహుశా రానున్న బీహార్ ఎన్నికలే రణక్షేత్రం కావచ్చు. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో 4 శాతం ఉన్న దళిత పాశ్వాన్లు, వారి నేతగా రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడైన చిరాగ్ కీలకం కానున్నారు. వారిని బీజేపీ చేరదీస్తుందని ఓ అంచనా. మరి ఏ ఎన్నికలకా గొడుగు పట్టడంలో సిద్ధహస్తుడైన నితీశ్ ఎలాంటి వ్యూహం వేస్తారో చూడాలి. ఇప్పటికైతే బీజేపీని ఎదురుదెబ్బ తీసి, నితీశ్ తమ వైపు రావడం ప్రతిపక్షాలకు ఒకింత ఉత్సాహజనకమే. కానీ, దానివల్ల కలిసొచ్చేది ఎంత? ఇప్పటికే ఉన్న సోనియా పరివారం, మమత, కేజ్రీవాల్‌ల సరసన పీఎం పదవికి నితిన్ రేసులో నిలుస్తారు. ఏక కేంద్రక బీజేపీకి దాని వల్ల మరింత లాభం. ఏమైనా, రెండేళ్ళలో రానున్న జాతీయ ఎన్నికల ఆట రంజుగా మారింది. కానీ, రాజకీయాలంటే వట్టి అంకగణితమే కాదు... పొత్తులోని పార్టీల మధ్య కెమిస్ట్రీ, ప్రజల్లో ఆ పార్టీల విశ్వసనీయత. క్రమంగా విశ్వసనీయత క్షీణిస్తూ, ఢిల్లీ వైపు చూస్తున్న నితీశ్జీకి ఆ సంగతి తెలీదంటారా? -
మహారాష్ట్ర ఎంఎల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ
సాక్షి, ముంబై: మహారాష్ట్ర శాసన మండలిలో ఖాళీ అయిన ఆరు స్థానాలకు జరిగిన ఎన్ని కల్లో నాలుగు స్థానాలు మహావికాస్ ఆఘాడి (కాంగ్రెస్–ఎన్సీపీ–శివసేన), ఒక స్థానం స్వతంత్ర అభ్యర్ధి, ఒక స్థానం బీజేపీ కైవసం చేసుకున్నాయి. రాష్ట్రంలోని మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలతో పాటు ఒక స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. కరోనా మహ మ్మారి నేపథ్యంలో లాక్డౌన్ ఆంక్షలను సడలించిన అనంతరం జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రావడంతో మహావికాస్ ఆఘాడిలో నూతన ఉత్సాహం నిండింది. డిసెంబర్ 1న జరిగిన ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ప్రారంభం కాగా బీజేపీకి తొలి విజయం దక్కింది. ధులే–నందుర్బార్ స్థానిక సంస్థ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అమరీష్ పటేల్ విజయం సాధించారు. అయితే మిగిలిన స్థానాల్లో మాత్రం బీజేపీ ఓటమిపాలైంది. ముఖ్యంగా పెట్టని కోటగా ఉండే నాగపూర్, పుణే, ఔరంగాబాద్‌లలో బీజేపీకి షాక్‌నిస్తూ మహావికాస్ ఆఘాడి విజయ ఢంకా మోగించింది. పుణే పట్టభద్రుల నియోజకవర్గంలో మహావికాస్ ఆఘాడికి చెందిన ఎన్సీపీ అభ్యర్థి అరుణ్ లాడ్ విజయం సాధించారు. సుమారు 60 ఏళ్ల అనంతరం నాగపూర్‌లో బీజేపీ పరాజయం పాలైంది. ఈ నియోజకవర్గంలో మహావికాస్ ఆఘాడికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి అభిజిత్ వంజారీ తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సందీప్ జోషిపై విజయం సాధించారు. అమరావతి టీచర్ల నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్ధి కిరణ్ సర్నాయక్ గెలుపొందారు. -
బిహార్‌లో నేనే విజేత: తేజస్వి
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో యువ కెరటంగా నిలిచిన లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ తానే అసలు సిసలైన విజేతనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చున్నప్పటికీ ప్రజల హృదయాలను తామే గెలిచామన్నారు. గురువారం మహాకూటమి శాసనసభా నేతగా ఎన్నికైన తేజస్విæ ప్రధాని మోదీ, బిహార్ సీఎం నితీశ్‌లపై నిప్పులు చెరిగారు. వారు దొడ్డిదారిన గెలిచారని ఆరోపించారు. 20 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సరిగా జరగలేదని, చాలా ఓట్లని చెల్లని ఓట్లు అంటూ పక్కన పెట్టారని విమర్శించారు. ఆ స్థానాల్లో రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ‘నితీశ్‡ ఛరిష్మా ఏమైపోయింది ? ఆయన పార్టీ మూడో స్థానానికి దిగజారిపోయింది. మార్పు కావాలని ప్రజలు అనుకుంటున్నారు. నితీశ్ సీఎం పీఠంపై కూర్చోవచ్చు కానీ మనం ప్రజల హృదయాల్లో నిలిచాం’ అని తేజస్వి అన్నారు. ఎన్డీయే, మహాఘట్ బంధన్ మధ్య ఓట్ల తేడా కేవలం 12,270 మాత్రమేనని అలాంటప్పుడు వారికి 15 సీట్లు అధికంగా ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఓట్ల తేడా 0.03% ఎన్నికల్లో హోరాహోరి పోరు మధ్య బొటాబొటి సీట్ల మెజారిటీతో అధికార పీఠాన్ని దక్కించుకున్న ఎన్డీయే ఓట్ల విషయంలో మరీ వెనుకబడిపోయింది. ఎన్డీయేకి, ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్‌కి మధ్య ఓట్ల శాతంలో తేడా కేవలం 0.03శాతం. ఎన్డీయే కూటమికి 37.26శాతం ఓట్లు పోలయితే, మహాఘట్ బంధన్ కూటమికి 37.23% ఓట్లు పోలయ్యాయి. మిగిలిన పార్టీలకు 25.51% ఓట్లు వచ్చాయి. మొత్తం పోలయిన 3.14 కోట్ల ఓట్లలో ఎన్డీయేకి 1,57,01,226 ఓట్లు వస్తే, మహాఘట్ బంధన్‌కి 1,56,88,458 ఓట్లు వచ్చాయి. అంటే ఈ రెండు కూటముల మధ్య తేడా కేవలం 12,768 ఓట్లు మాత్రమే. ఇరుపక్షాల మధ్య గెలుపు ఆధిక్యాలు అత్యంత స్వల్పంగా ఉన్నట్టు ఎన్నికల సంఘం గణాంకాల్లో తేలింది. 243 సీట్లకు గాను 130 సీట్లకు సంబంధించి మొత్తం పోలయిన ఓట్లలో సగటు ఆధిక్యం 16,825గా ఉంది. -
తేజస్వి వైఫల్యానికి ఐదు కారణాలు
పట్నా: తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని, బిహార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ అధికారపీఠాన్ని అందుకోలేకపోయారు. ఈ ఎన్నికల్లో గెలిచి ఉంటే అతి చిన్న వయసులో సీఎంగా రికార్డులకెక్కేవారు. ఈ ఎన్నికల్లో అత్యధికంగా 200 ర్యాలీల్లో పాల్గొని, ఆర్జేడీ కుల సమీకరణలకు భిన్నంగా పది లక్షల ఉపాధి అవకాశాలపై హామీలిచ్చి, యువతరం మదిని మెప్పించినప్పటికీ ఫలితాలు మాత్రం తారుమారయ్యాయి. బిహార్ రాజకీయాలను సుదీర్ఘకాలంపాటు శాసించిన రాజకీయ దురంధరుడు లాలూ ప్రసాద్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిల కుమారుడు తేజస్వి. చదువు పెద్దగా అచ్చిరాక, అర్ధంతరంగా 10వ తరగతిలోనే చదువుకి స్వస్తిపలికిన తేజస్వి యిప్పుడు దేశంలోనే అతి తక్కువ వయస్సున్న ప్రతిపక్ష నేత. ఆయన రాజకీయారంగేట్రం 2015లో జరిగింది. 2018 నుంచి ఆర్జేడీ అధినాయకుడిగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఆర్జేడీ గెలుపుని ఖాయం చేసినా, ఆ పార్టీ అధికారానికి ఆమడ దూరంలో ఉండిపోయింది. అయితే బిహార్‌లో ఆర్జేడీని అతిపెద్ద పార్టీగా నిలపగలిగారు. క్షేత్ర స్థాయిలో నితీశ్ ప్రభుత్వంపై వ్యతిరేకతను తేజస్వి అనుకూల ఓటుగా మలుచుకోలేకపోయారు. మహాగఠ్ బంధన్ వైఫల్యం తేజస్వి వైఫల్యంగానే చూడాలని నిపుణులు అంటున్నారు. మహాకూటమి ఎందుకు ఓడిందంటే... 1. పేదరికం, ఉపాధి కల్పన, వలస కార్మికుల సంక్షోభం లాంటి విషయాలపై తేజస్వి ఎక్కువ దృష్టిపెట్టి, కులాలకు అతీతంగా ప్రచారం చేశారు. ఈ ఎత్తుగడ కలిసిరాలేదు. 2. కాంగ్రెస్ పార్టీ 70 సీట్లలో పోటీపడి 19 మాత్రమే గెలవడం ఓటమికి ప్రధాన కారణమంటున్నారు. 3. ఏఐఎంఐఎం కూడా ముస్లిం ఓటర్ల ప్రాబల్య ప్రాంతాల్లో పోటీచేసి, 5 స్థానాలు పొందడంతో పాటు, మిగిలిన చోట్ల ఓట్లు చీల్చింది. 4. ఆర్జేడీ గెలిస్తే జంగిల్ రాజ్ వస్తుందంటూ బీజేపీ చేసిన ప్రచారం కూడా ఆర్జేడీకి ప్రతికూలంగా మారింది. 5. తేజస్వి క్షేత్ర స్థాయిలో జనంతో మమేకమై ఉంటే ఆర్జేడీ గెలుపు ఖాయమయ్యేదని అంచనా. -
ఆర్జేడీని కాంగ్రెస్సే ముంచిందా?
పట్నా : అతి చిన్న వయసులోనే బిహార్ పీఠం ఎక్కాలన్న ఆర్జేడీ యువ నేత తేజస్వి యాదవ్ కల చెదిరింది. కాంగ్రెస్‌తో జత కట్టడం వల్లే ఆయన కథ మారిపోయిందన్న విశ్లేషణలు వినబడుతున్నాయి. తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉన్నప్పటికీ, కీలకమైన నేతలందరూ పార్టీని వీడినప్పటికీ తేజస్వి యాదవ్ ఈ సారి ఎన్నికల్లో ఒక శక్తిమంతమైన నాయకుడిగా ఎదిగారు. 31 ఏళ్ల వయసున్న తేజస్వి పార్టీ బరువు బాధ్యతల్ని తన భుజం మీద వేసుకొని ఒంటరి పోరాటం చేశారు. ఎన్నికల ప్రచార సభల్లో తూటాల్లాంటి మాటలతో తేజస్వి చేసిన ప్రసంగాలు, నిరుద్యోగం, వలసవాదుల సమస్యలు, ఆర్థిక సంక్షోభం వంటి విధానపరమైన అంశాలనే ప్రస్తావిస్తూ ఎన్నికల్లో ముందుకు వెళ్లడంతో అధికార ఎన్డీయేకి ఎదురు దెబ్బ తగులుతుందని అందరూ భావించారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఈ సారి యువతరం తేజస్వికి జై కొడుతుందని అంచనా వేసింది. మహాకూటమిలో భాగస్వామి కాంగ్రెస్‌కు 70 సీట్లు కేటాయించడం ఆర్జేడీ విజయావకాశాలను దెబ్బ తీసిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆర్జేడీకి మద్దతుగా ఉన్న ముస్లిం, యాదవుల ఓటు బ్యాంకులో ముస్లిం ఓటు బ్యాంకుని ఎంఐఎం చీల్చడం ఓటమికి కారణాలుగా భావిస్తున్నారు. కాంగ్రెస్‌కి అత్యధిక సీట్లు కేటాయించారా ? ఈ సారి ఆర్జేడీ 144 సీట్లలో పోటీ చేస్తే, కాంగ్రెస్‌కి 70 స్థానాలు, లెఫ్ట్ పార్టీలకు 23 స్థానాలను కేటాయించారు. 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కనీసం 20 స్థానాల్లో గెలవకపోవడం కూటమి కొంప ముంచిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2015 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 41 స్థానాల్లో పోటీ చేసి 19 స్థానాలను గెలుచుకుంది. ఈసారి 20 స్థానాలకే పరిమితమైంది. గత ఎన్నికల కంటే తక్కువ సీట్లను సాధించి కూటమి విజయావకాశాలను దెబ్బ తీసింది. ఎన్డీయేకున్న అధికార వ్యతిరేకతను తమకి అనుకూలంగా మలుచుకోవడంలోనూ, అగ్రకులాల ఓట్లను ఆకర్షించడంలో కాంగ్రెస్ విఫలమైంది. ఆ ఓట్లన్నీ చిరాగ్ పాశ్వాన్ పార్టీ ఎల్జేపీ దక్కించుకోవడంతో కాంగ్రెస్ కుదేలైంది. కాంగ్రెస్‌ని నమ్మి ఎక్కువ సీట్లు కేటాయించడంతో తేజస్వి ఇరకాటంలో పడిపోయారు. చీలిపోయిన ముస్లిం ఓటు బ్యాంకు ఎంఐఎం, బీఎస్పీ, ఆర్ఎల్ఎస్పీ పార్టీలు కలిసి గ్రాండ్ డెమొక్రాటిక్ సెక్యులర్ ఫ్రంట్ (జీడీఎల్‌ఎఫ్)గా ఏర్పడ్డాయి. ఎంఐఎం 5స్థానాలను గెలుచుకుంది. ఆర్జేడీకి మద్దతుగా నిలిచే ముస్లిం ఓట్లను ఎంఐఎం చీల్చిందనే చెప్పాలి. మహాఘట్బంధన్ ఓటమి పాలు కావడంలో జీడీఎల్‌ఎఫ్ పాత్ర కూడా ఉంది. -
బిహార్ పీఠం కొత్త తరానిదేనా?
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి పీఠం యువనేతకు దక్కుతుందా? లేక ప్రస్తుత సీఎం, అధికార జేడీయూ–బీజేపీ కూటమి నేత నితీశ్ కుమార్(69)కే మళ్లీ సొంతమవుతుందా? అనే సందేహం నేడు పటాపంచలు కానుంది. నితీశ్ వయస్సులో సగం కంటే తక్కువగా ఉన్న రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)యువ నేత తేజస్వీయాదవ్(31) నేతృత్వంలోని మహాఘట్ బంధన్‌కు అధికారం ఖాయమని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో ఈ ఫలితాలు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు 38 జిల్లాల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 55 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కాగా, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎమ్మెల్సీ కావడంతో ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. భారీగా బందోబస్తు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద 19 కంపెనీల కేంద్రసాయుధ బలగాల తోపాటు, రాష్ట్ర పోలీసులను బందోబస్తుకు ఏర్పాటు చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి హెచ్ఆర్ శ్రీవాస్తవ వెల్లడించారు. మంగళవారం ఉదయం పోస్టల్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతే ఈ స్ట్రాంగ్ రూంలను తెరుస్తామని చెప్పారు. కోవిడ్–19 మహ మ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో లెక్కింపు కేంద్రాల వద్ద గుమికూడ వద్దని రాజకీయ పార్టీల శ్రేణులకు ఆయన విజ్ఞప్తి చేశారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీలకు కనెక్ట్ చేసిన డిస్ప్లే స్క్రీన్లను సీనియర్ అధికారులు పరిశీలిస్తూ అవసరమైన ఆదేశాలిస్తారని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేంద్ర కుమార్ చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణకు మరో 59 కంపెనీ(వంద మంది చొప్పున)ల బలగాలను రంగంలోకి దించామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద జనం పెద్ద సంఖ్యలో గుమి కూడకుండా నిషేధాజ్ఞలు విధించామన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు కూడా.. బిహార్‌లోని వాల్మీకినగర్ లోక్‌సభ స్థానం తోపాటు మధ్యప్రదేశ్ అసెంబ్లీలోని 28 స్థానాలు, ఇతర పది రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా నేడు వెల్లడి కానున్నాయి. రఘోపూర్‌పైనే అందరి కళ్లూ రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 28వ తేదీ మొదలుకొని నవంబర్ 7వ తేదీ వరకు మూడు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సీట్లలో తేజస్వీ యాదవ్ మరోసారి ఎన్నికయ్యేందుకు బరిలో నిలిచిన వైశాలి జిల్లాలోని రఘోపూర్‌పైనే అందరి దృష్టీ ఉంది. గతంలో ఈ స్థానం నుంచి తేజస్వీ తల్లిదండ్రులు, మాజీ ముఖ్యమంత్రులు లాలూప్రసాద్ యాదవ్, రబ్రీదేవి పోటీ చేశారు. తేజస్వీ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సమస్తిపూర్ జిల్లా హసన్పూర్ నుంచి పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో పలువురు కేబినెట్ మంత్రుల భవితవ్యం తేలనుంది. వీరిలో ప్రముఖులు నంద్‌కిశోర్ యాదవ్(పట్నా సాహిబ్), ప్రమోద్ కుమార్(మోతిహరి), రాణా రణ్‌ధీర్(మధుబన్), సురేశ్ శర్మ(ముజఫర్‌పూర్), శ్రావణ్ కుమార్(నలందా), జైకుమార్ సింగ్(దినారా), కృష్ణనందన్ ప్రసాద్ వర్మ(జెహనాబాద్) ఉన్నారు. -
ఆర్జేడీ కూటమికే జై
సాక్షి, న్యూఢిల్లీ/పటా్న: బిహార్‌లో మళ్లీ లాలూ కుటుంబమే రాజ్యమేలే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. మొత్తం 243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీలో తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి అయిన మహాగuŠ‡బంధన్(ఎంజీబీ) మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో ఉందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు, మూడింట రెండొంతుల మెజారిటీ దక్కించు కుంటుందని మరికొన్ని సంస్థలు తేల్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూతో కూడిన ఎన్డీయే కూటమి 40 సీట్లకు గాను 39 సీట్లు గెలుచుకోగా.. ఏడాదిన్నర కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. మహాగuŠ‡బంధన్ వైపే ప్రజలు మొగ్గు చూపించినప్పటికీ హంగ్ అసెంబ్లీకి కూడా అవకాశాలున్నట్టుగా వివిధ సర్వేలు చూస్తే వెల్లడవుతుంది. నితీశ్‌కుమార్ వరసగా నాలుగోసారి సీఎం కావాలని తహతహలాడుతూ ఉంటే, తన తండ్రి లాలూ ప్రచారం చేయకపోయినా తేజస్వి యాదవ్ రాష్ట్రంలో ఆర్జేడీని బలోపేతం చేశారని, యువతరాన్ని ఆకర్షించారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ప్రజా సమస్యలపై గత ఏడెనిమిది నెలలుగా నితీశ్ సరిగ్గా స్పందించలేదని, ప్రతిపక్షంలో ఉన్న తేజస్వీ యాదవ్ ఆర్థిక అంశాలు, నిరుద్యోగితపై ప్రధాన ప్రచారాస్త్రాలుగా మలుచుకోవడంలో సఫలీకృతుడయ్యారని ఎగ్జిట్ పోల్స్ విశ్లేషించాయి. ఎంఐఎం, బీఎస్పీ, ఆర్ఎల్ఎస్పీ సహా ఆరు పార్టీల కూటమి అయిన గ్రాండ్ డెమొక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్(జీడీఎస్ఎఫ్) ప్రభుత్వ వ్యతిరేక ఓటును పెద్దగా చీల్చలేకపోయిందన్నాయి. తేజస్వీ యాదవ్ సీఎం కావాలి ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ సర్వేలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు కావాలి ప్రశ్నకు 44 శాతం మంది ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్‌నే ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని స్పష్టంగా చెప్పారు. నితీశ్‌కుమార్ సీఎం కావాలని 35% మంది కోరుకుంటే, దివంగత నాయకుడు రామ్‌విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ సీఎం కావాలని 7% మంది, ఉపేంద్ర కుష్వా ముఖ్యమంత్రి కావాలని 4% మంది ఆశించారు. బిహార్‌లో తన తండ్రి మాదిరిగా కులాల చట్రంలో పడి కొట్టుకుపోకుండా కొత్త తరహా రాజకీయాలకు తేజస్వీ యాదవ్ తెరతీశారని ఇండియా టుడే విశ్లేíÙంచింది. మధ్యప్రదేశ్‌లో చౌహాన్ సర్కార్ సురక్షితం! మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరడంతో 28 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాలు శివరాజ్‌సింగ్ సర్కార్‌పై ప్రభావం చూపించే అవకాశాలు ఉండడంతో ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా సర్వేలో బీజేపీకి 16–18, కాంగ్రెస్‌కి 10–12 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఆజ్‌తక్ సర్వే కాంగ్రెస్‌కు 16–18, బీజేపీకి 10–12స్థానాలు వెల్లడించింది. యువతరం ప్రతినిధి తేజస్వి 30 ఏళ్ల వయసున్న తేజస్వి తనని తాను యువతరానికి ప్రతినిధిగా ఒక ఇమేజ్ సంపాదించడమే కాకుండా ఉద్యోగాల కల్పన, అభివృద్ధి వంటి అంశాలతో ప్రచారానికి కొత్త రూపు కలి్పంచారని ఇండియా టుడే అభిప్రాయపడింది. 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తేజస్వీ హామీ ఇవ్వడమే కాకుండా, లాక్డౌన్ తర్వాత రాష్ట్రానికి తిరిగి వచ్చిన వలస కారి్మకుల కష్టాలపైనే ఆయన ఎన్నికల ప్రచారంలో దృష్టి సారించారు. అధికార నితీశ్ కుమార్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైన అంశాలను పట్టుకొని వాటినే పదే పదే ప్రస్తావిస్తూ యువతరాన్ని ఆకర్షించే ప్రయత్నాలు చేశారు. వలస కారి్మకులు, నిరుద్యోగులు, విద్యార్థులు, నిరుపేద మధ్య తరగతి వర్గాలన్నీ ఈసారి తేజస్వీ యాదవ్ వైపే ఉన్నట్టుగా ఇండియా టుడే సర్వేలో వెల్లడైంది. ముస్లిం, యాదవ్‌లు అంటూ కులాల వారీగా మద్దతు కూడగట్టుకోకుండా కష్టాల్లో ఉన్న వారి అండని సంపాదించడానికి తేజస్వి ప్రయత్నించారు. తేజస్వి ప్రచార సభలకి జనం వెల్లువెత్తడం, ఆవేశపూరితంగా ఆయన చేసే ప్రసంగాలు ఎన్నికల ఫలితాల్ని మార్చబోతున్నాయని ఇండియా టుడే విశ్లేíÙంచింది. -
బిహార్ పోరు రసవత్తరం
ఇన్నాళ్లూ ముఖాముఖి పోరు అనుకున్నారు.. హఠాత్తుగా ముక్కోణపు పోటీకి తెరలేచింది.. దళిత నేత రామ్‌విలాస్ పాశ్వాన్ మరణం.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల లెక్కల్ని మారుస్తోంది.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్‌ని నమ్ముకొని ఎన్డీయే.. యువ శక్తిపై విశ్వాసం ఉంచి ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి.. సానుభూతి పవనాలను నమ్ముకొని చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ.. బిహార్ ఎన్నికల బరిని వేడెక్కిస్తున్నారు. కరోనా నేపథ్యంలో దేశంలో జరుగుతున్న తొలి ఎన్నికలివి.. నితీశ్ వరసగా నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఎన్నికలివి. లాలూ ప్రచారం చేయకుండా జరిగే మొట్టమొదటి ఎన్నికలు కూడా ఇవే. కేంద్రంలో అధికార బీజేపీ వరసగా ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతున్న తరుణంలో జరుగుతున్న ఈ ఎన్నికలు రాజకీయంగా కాక పుట్టిస్తున్నాయి. హ్యాట్రిక్ సీఎం నితీశ్ కుమార్‌కి ఈ ఎన్నికలు అగ్నిపరీక్షలాంటివి. అధికార వ్యతిరేకతకు ఎదురొడ్డి నాలుగోసారి సత్తా చాటడం అంత సులభం కాదు. పోలింగ్‌కు కొద్ది రోజుల ముందే రాష్ట్రంలో దళిత దిగ్గజ నేత, లోక్‌జనశక్తి పార్టీ అధినాయకుడు రాంవిలాస్ పాశ్వాన్ మృతి చెందడంతో రాజకీయం రంగులు మార్చుకుంటోంది. పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించడంతో పాటు జేడీ(యూ) అభ్యర్థులపై ఎల్జేపీని బరిలోకి దింపనున్నారు. బీజేపీతో స్నేహాన్ని కొనసాగిస్తూనే నితీశ్ కుమార్‌ని ఢీ కొడుతున్నారు. అయిదు జిల్లాల్లో పాశ్వాన్ ప్రభావం నితీశ్ జేడీ(యూ)ని దెబ్బ కొడుతుందనే అంచనాలున్నాయి. మరోవైపు ఆర్జేడీ, కాంగ్రెస్ మహాగuŠ‡బంధన్ కూటమి సీఎం అభ్యర్థి, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ యువకుడు. తండ్రి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నప్పటికీ యువతరం ఓట్లను కొల్లగొట్టేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వలసలు, వరదలు, నిరుద్యోగం వంటి అంశాలను లేవనెత్తుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మోదీకే ప్రతిష్టాత్మకం ఈసారి బిహార్ ఎన్నికల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నితీశ్ కుమార్ అధికార వ్యతిరేకతకు తన చరిష్మాతో చెక్ పెట్టడానికి వ్యూహరచన చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏ రాష్ట్రానికీ ఇవ్వనన్ని ప్రాజెక్టులు బిహార్ బాట పట్టించారు. దర్భాంగాలో ఎయిమ్స్ ఏర్పాటు, రూ.541 కోట్లతో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, మూడు పెట్రోలియం ప్రాజెక్టులు, దేశంలో తొలి కిసాన్ రైలు వంటివెన్నో ఉదారంగా రాష్ట్రానికి ఇచ్చేశారు. నితీశ్ సీఎం అభ్యర్థిగా ముందు ఉన్నప్పటికీ ఎన్డీయేకి తిరిగి అధికారంలోకి వచ్చే బాధ్యతని మోదీ తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. ‘‘బిహార్ ఎన్నికలు ప్రధాని మోదీకే ఎక్కువ ముఖ్యమైనవి. ఒక రకంగా చెప్పాలంటే లాక్‌డౌన్‌కి రిఫరెండంలాంటివి. అందుకే ఎలాగైనా ఈ ఎన్నికల్లో నెగ్గాలని మోదీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు’’అని బిహార్ ఎన్నికల విశ్లేషకుడు సౌరర్ అహ్మద్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశాలు ► బిహార్‌లో పారిశ్రామికీకరణ జరగకపోవడంతో నిరుద్యోగ సమస్య ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలో నిరుద్యోగం 10.2 శాతానికి చేరుకుంది. ఇప్పటికే ఆర్జేడీ, కాంగ్రెస్ మహాగuŠ‡బంధన్ తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ► కోవిడ్ సంక్షోభం ఈ ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు కరోనాని ఎంత సమర్థంగా ఎదుర్కొన్నాయో ఈ ఎన్నికల ఫలితాలు తేలుస్తా యని ఎన్నికల విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది ► దేశవ్యాప్త లాక్డౌన్ తర్వాత ఎక్కడా ఉపాధి అవకాశాల్లేక 30 లక్షల మంది వలస కార్మికులు తిరిగి సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. ప్రస్తుతం అందరికీ పని కల్పించే పరిస్థితులు లేవు. ఈ సారి కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి వలసల అంశానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ► వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు ఎన్నికల అంశంగా మారా యి. అయితే పంజాబ్, హరియాణాల మాదిరిగా రైతు సంఘాలు ఎక్కువగా రాష్ట్రంలో లేవు. ఈ చట్టాలు రైతులకు బేరమాడే శక్తిని పెంచుతాయన్న ఎన్డీయే వాదనని అన్నదాతలు ఎంతవరకు విశ్వసిస్తారో చూడాలి. ► బిహార్ ఓటర్లలో 16శాతం మంది ఉన్న దళితులు ఈసారి ప్రధానపాత్ర పోషిస్తారు. దళిత నాయకుడు రామ్‌విలాస్ పాశ్వాన్ మరణంతో సానుభూతి పవనాలు ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌కు ఎంతవరకు కలిసొస్తాయా అన్న చర్చ జరుగుతోంది. మొత్తం అసెంబ్లీ స్థానాలు : 243 పోలింగ్ తేదీలు : మూడు దశల్లో ఎన్నికలు అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7 ఓట్ల లెక్కింపు : నవంబర్ 10 2015 ఎన్నికల ఫలితాలు ఆర్జేడీ 80 జేడీ (యూ) 71 బీజేపీ 53 కాంగ్రెస్ 27 ఇతరులు 8 స్వతంత్రులు 4 -
ఎన్నికలకు ముందు బిహార్‌లో కీలక పరిణామం
పాట్నా: అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిహార్‌లోని ప్రతిపక్ష కూటమి ‘మహాఘట్బంధన్’కు ఎదురుదెబ్బ తగిలింది. కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు మాజీ సీఎం జితన్‌రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందూస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) ప్రకటించింది. మహాఘట్‌బంధన్‌తో తెగతెంపులు చేసుకుంటున్నట్టు గురువారం ప్రకటించింది. జితన్‌రామ్ మాంఝీ నివాసంలో నేడు జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సీట్ల పంపకం విషయం గురించి చర్చించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని హామ్-ఎస్ పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. దీనిపై ఎటువంటి స్పందన లేకపోవడంతో జితన్‌రామ్ మాంఝీ కలత చెందినట్లు తెలుస్తోంది. దీని గురించి ఆయన కుమారుడు సంతోష్ సుమన్ మాట్లాడుతూ.. ‘మా పార్టీ మహాఘట్బంధన్ నుంచి బయటకు రావాలనుకుంటుంది. కోర్ కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని నిర్ణయించాం. సమన్వయ కమిటి ఏర్పాటు చేయాలని మేం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. కూటమిలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. బిహార్‌లో కాంగ్రెస్‌తో పాటు రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), రాష్ట్రీయ లోక్ సమత పార్టీ (ఆర్ఎల్ఎస్పి), వికాషీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి)లు కలిసి మహాఘట్‌బంధన్‌గా ఏర్పడిన సంగతి తెలిసిందే. నవంబర్ 29తో ఇప్పుడు ఉన్న నితీశ్‌కుమార్ ప్రభుత్వం కాలపరిమితి ముగుస్తుంది. అక్టోబర్, నవంబర్ నెలలో ఎన్నికలు జరగాల్సివుంది. కరోనా సంక్షోభం కారణంగా ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు. చదవండి: ‘ముందే చెప్పాను.. కానీ ఎగతాళి చేశారు’ -
మేము కూడా ఒంటరిగానే పోటీ చేస్తాం : అఖిలేష్
లక్నో : రానున్న ఉప ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఒంటరిగా పోటీ చేస్తే.. తాము కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతామని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. రాబోయే ఉప ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని వెల్లడించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ - బీఎస్పీ కూటమి ఘోర విఫలమైన విషయం తెలిసిందే. అఖిలేష్ యాదవ్ ఆదేశాలను ఎస్పీ కేడర్ పాటించలేదని, ఆ పార్టీ నేతలు బీఎస్పీకి ఓట్లేయలేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. క్షేత్రస్థాయిలో బీఎస్పీ-ఎస్పీ పొత్తు పనిచేయలేదని, యాదవ సామాజికవర్గం ఓట్లు బీఎస్పీ అభ్యర్థులకు బదిలీ కాలేదని తెలిపారు.మాయవతి ఆరోపణలపై అఖిలేష్ స్పందిస్తూ.. మహా గఠ్ బంధన్ విడిపోతే రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామన్నారు. రాబోయే ఉప ఎన్నికల కోసం తాము సిద్ధమవుతున్నామని, 11 సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తామని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో కూటమి ఓటమికి గల కారణాలను లోతుగా విశ్లేషణ చేస్తామన్నారు. సామాజిక న్యాయం కోసం బీఎస్పీతో కలిసి పోరాటం సాగిస్తామని ఎస్ చీఫ్ అఖిలేశ్‌యాదవ్ తెలిపారు. -
అఖిలేశ్ భార్యను కూడా గెలిపించుకోలేకపోయాడు!
న్యూఢిల్లీ: త్వరలో యూపీలో జరగనున్న ఉపఎన్నికల్లో ఒంటరిగానే పోటీకి దిగనున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. కూటమిలో ఉంటే గెలుస్తామనుకోవద్దని, ముందుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని తెలిపారు. ఢిల్లీలో పార్టీ నేతలతో ఆమె మాట్లాడారు. ఇటీవలి ఎన్నికల్లో ఎస్పీ–బీఎస్పీ– ఆర్ఎల్డీ ‘మహా గఠ్ బంధన్’ సీట్లు సర్దుబాటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మాయా వ్యాఖ్యలతో మహాగఠ్‌బంధన్ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడినట్లయింది. ‘ఎమ్మెల్యేలు, పార్టీ పదవుల్లో ఉన్న వారు, కొత్తగా ఎన్నికైన ఎంపీలు త్వరలో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండండి. కూటమితో పనిలేకుండా ఒంటరిగానే బరిలో నిలుస్తాం. రాష్ట్రంలో బీఎస్పీ సంప్రదాయ ఓటుబ్యాంకు ఉన్న 10 సీట్లను బీఎస్పీ గెలుచుకుంది. ఎస్పీ ఓట్లు మన అభ్యర్థులకు బదిలీ కాలేదు’ అని వివరించారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన 9 మంది, బీఎస్పీ, ఎస్పీలకు చెందిన ఒక్కొక్కరు చొప్పున ఎమ్మెల్యేలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో రాష్ట్రంలో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక అవసరమైంది. ములాయం కుటుంబీకులే గెలవలేదు యూపీలో బీఎస్పీ–ఎస్పీ– ఆర్ఎల్డీతో ఏర్పాటైన మహాగఠ్‌బంధన్ వృథాయేనని మాయావతి అన్నారు. ‘యాదవుల ఓట్లు మన అభ్యర్థులకు బదిలీ కాలేదు. మన పార్టీ ఓట్లు వాళ్లకు పడ్డాయి. ముస్లింలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేసిన నియోజకవర్గాల్లో ఎస్పీ గెలిచింది. యాదవుల ఓట్లు అఖిలేశ్ యాదవ్ కుటుంబీకులకు కూడా పడలేదు’ అని తెలిపారు. కూటమి లేకున్నా ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తాం. ఎందుకంటే అతడు తండ్రి(ములాయం సింగ్ యాదవ్)లాంటి వాడు కాదు’ అని మాయ పేర్కొన్నారు. ‘అఖిలేశ్‌తో విభేదించిన అతడి బాబాయి శివ్‌పాల్‌యాదవ్, కాంగ్రెస్ కారణంగానే యాదవుల ఓట్లు చీలాయి. అఖిలేశ్ భార్య డింపుల్‌ను కూడా గెలిపించుకోలేకపోయాడు. అతని ఇద్దరు సోదరులూ ఓడారు. మనం ఈ ఉప ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేద్దాం’ అని తెలిపారు. సామాజిక న్యాయం కోసం కలిసి పోరాడతాం: అఖిలేశ్ సామాజిక న్యాయం కోసం బీఎస్పీతో కలిసి పోరాటం సాగిస్తామని ఎస్ చీఫ్ అఖిలేశ్‌యాదవ్ తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికలు జరిగిన తీరు వేరేగా ఉందని, అది తనకు కూడా అర్థం కాలేదని తెలిపారు. ‘ఈ ఎన్నికల్లో ఫెరారీ, సైకిల్ (ఎస్పీ ఎన్నికల గుర్తు) మధ్య పోటీ. ఫెరారీయే గెలుస్తుందని అందరికీ తెలుసు. అంశాల ప్రాతిపదికన కాకుండా వేరే రకంగా ఎన్నికలు జరిగాయి. టీవీలు, సెల్ఫోన్ల ద్వారా ప్రజలతో వాళ్లు(బీజేపీ)మైండ్ గేమ్ ఆడారు. అది నాకూ అర్థం కాలేదు’ అని పేర్కొన్నారు. ఆ యుద్ధ తంత్రం అర్థమైన రోజున తాము విజేతలుగా నిలుస్తామన్నారు. -
కలిసుంటే మరో 10 సీట్లు
సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ దారుణంగా దెబ్బతింటుందన్న ఊహాగానాలన్నీ తలకిందులయ్యాయి. మహా కూటమి(మహాగఠ్ బంధన్)ను ఎదుర్కోవడం కమలనాథులకు కష్టమన్న రాజకీయ పండితుల జోస్యాలు కూడా వమ్మయ్యాయి. రాష్ట్రంలోని 80 సీట్లలో బీజేపీ కూటమి 64 సీట్లు గెలిస్తే, బీఎస్పీ–ఎస్పీ–ఆర్ఎల్డీల మహా కూటమి 15 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కాంగ్రెస్‌కు ఒక్క సీటే వచ్చింది. అయితే, మహా కూటమిలో కాంగ్రెస్ కూడా ఉండి ఉంటే కూటమి పరిస్థితి మరీ ఇంత దయనీయంగా ఉండేది కాదని, కనీసం మరో పది సీట్లయినా వచ్చేవని రాజకీయ విశ్లేషకులు లెక్కలేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి, కాంగ్రెస్‌కు కలిపి 45.20 శాతం ఓట్లు వస్తే, బీజేపీకి 49.56 శాతం ఓట్లు వచ్చాయి. కొన్ని నియోజకవర్గాల్లో విజేతకు వచ్చిన మెజారిటీ కంటే కాంగ్రెస్ లేదా కూటమి అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. కూటమిలో కాంగ్రెస్ ఉంటే ఫలితం మరోలా.. మహా కూటమిలో కాంగ్రెస్ చేరి ఉంటే అలాంటి చోట్ల కచ్చితంగా కూటమి అభ్యర్థే గెలిచేవారని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఈ పది చోట్ల కాంగ్రెస్ అభ్యర్థి గెలుచుకున్న బీజేపీ యేతర ఓట్లు పొత్తులో ఉంటే కూటమికి పడేవని వారంటున్నారు. ఉదాహరణకు బదౌన్‌లో బీజేపీ అభ్యర్థి సంఘమిత్ర మౌర్య 18,454 ఓట్ల ఆధిక్యతతో ఎస్పీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్‌పై గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్‌కు 51,947 ఓట్లు వచ్చాయి. ఒకవేళ కాంగ్రెస్ కూటమిలో ఉండి ఉంటే ఈ ఓట్లు ధర్మేంద్రకు పడేవి. దాంతో ఆయన గెలుపు సాధ్యమయ్యేది. అలాగే, బందాలో ఎస్పీ అభ్యర్థి శ్యామ్ చరణ్ 58,553 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి 75,438 ఓట్లు వచ్చాయి. ఇవి కలిస్తే శ్యామ్ సునాయాసంగా గెలిచేవారు. బారాబంకిలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి రామ్ సాగర్ బీజేపీ చేతిలో 1,10,140 ఓట్ల తేడాతో ఓడిపోయారు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి తనూజ్ పునియాకు 1,59,611 ఓట్లు వచ్చాయి. కూటమిలో కాంగ్రెస్ చేరితే ఈ ఓట్లన్నీ కూటమికి పడి ఆ అభ్యర్థి గెలిచేవారు. ఇక ధరౌహ్రాలో బీఎస్పీ అభ్యర్థి ఇలియాస్ సిద్ధిఖి 1,60,601 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అక్కడ కాంగ్రెస్‌కు 1,62,856 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్, కూటమిల్లో ఏవరో ఒకరే నిలబడి ఉంటే కచ్చితంగా వాళ్లే గెలిచేవారు. మచిలీషహర్‌లో బీఎస్పీ అభ్యర్థి రామ్ కేవలం 181 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ మద్దతిచ్చిన జన్ అధికార్‌పార్టీ అభ్యర్థికి 7వేల ఓట్లు వచ్చాయి. ఆ ఓట్లు కూటమికి వస్తే బీఎస్పీ అభ్యర్థే కచ్చితంగా గెలిచేవారు. మీరట్‌లో కూడా బీజేపీ మెజారిటీ(2,379) కంటే కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. బస్తి, సంత్ కబీర్ నగర్, సుల్తాన్పూర్ వంటి పది నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మహాకూటమితో కాంగ్రెస్ కలిస్తే ఈ సీట్లతో పాటు మరి కొన్ని సీట్లు కచ్చితంగా కూటమి ఖాతాలో పడేవని పరిశీలకులు చెబుతున్నారు. కాగా, కాంగ్రెస్ కూటమిలో చేరకపోవడం వల్ల బీఎస్పీ లాభపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. షహరన్‌పూర్‌లో బీఎస్పీ అభ్యర్థి గెలిచారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్‌కు రెండు లక్షల ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఓట్లను చీల్చిందని, దాంతో బీఎస్పీ లాభపడిందనేది పరిశీలకుల మాట. -
వికటించిన గట్బంధన్
లక్నో: సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని నిలువరించాలనుకున్న ప్రతిపక్షాలకు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 80 స్థానాలకు గానూ 71 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి మిత్రపక్షాలతో కలిసి 64 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. బీజేపీకి చెక్ పెట్టేందుకు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) పార్టీలు కలిసి ఏర్పాటుచేసిన మహాకూటమి(గట్బంధన్) కనీసం పోటీ ఇవ్వలేక చతికిలపడింది. ఈ కూటమి వేర్వేరుగా పోటీచేయడంతో కమలనాధుల విజయం సులువైందని విశ్లేషకులు చెబుతున్నారు. సోనియా ప్రయత్నాలకు చెక్.. యూపీలో బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయడం ద్వారా ప్రధాని మోదీని నిలువరించాలని యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ భావించారు. ఇందుకు అనుగుణంగానే మహాకూటమిలో చేరేందుకు ముందుకొచ్చారు. యూపీలో తమకు కేవలం 15 లోక్‌సభ స్థానాలు ఇస్తే చాలన్నారు. అయితే బీఎస్పీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్ పార్టీతో కలిస్తే విజయావకాశాలు దెబ్బతింటాయన్న అనుమానంతో ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. # కంచుకోట అమేథీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ఓటమి చవిచూడగా, సోనియా రాయ్‌బరేలీలో గెలిచి పరువు కాపాడుకున్నారు. ఈ ఎన్నికల్లో మహాకూటమిలో లాభపడ్డది ఎవరైనా ఉన్నారంటే అది బీఎస్పీ చీఫ్ మాయావతియే. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ–ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమికి మొత్తం 15 సీట్లురాగా, వీటిలో బీఎస్పీనే 10 స్థానాలను గెలుచుకుంది. ఎస్పీకి 5 లోక్‌సభ సీట్లు దక్కగా, మరో మిత్రపక్షం ఆర్ఎల్డీ ఖాతానే తెరవలేదు. సమాజ్‌వాదీ పార్టీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే తగలింది. -
కనిపించని అభ్యర్థికి ప్రచారం!
ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి లోక్‌సభ నియోజకవర్గంలో మే 19వ తేదీన పోలింగ్ జరగనుండటంతో ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. ఇక్కడ బీఎస్పీ అభ్యర్థి అతుల్ రాయ్ తరఫున బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్‌లు స్వయంగా ప్రచారం చేస్తున్నారు. అంతే కాకుండా అతుల్ కోసం విస్తృతంగా ప్రచారం చేయాల్సిందిగా వారు పార్టీ శ్రేణులకు ఆదేశిస్తున్నారు. ఇందులో విశేషమేముంది...అనుకుంటున్నారా...వారు ఎవరికోసమైతే ప్రచారం చేస్తున్నారో ఆ అభ్యర్థి అతుల్ రాయ్ పదిహేను రోజుల నుంచి కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్లాడో కూడా తెలియడం లేదు. అంటే ‘కనిపించని’ అభ్యర్థి కోసం భారీ ఎత్తున ప్రచారం జరుగుతోందన్నమాట. ఇంతకీ అతుల్ అదృశ్యానికి కారణం, ఆయనపై అత్యాచారం కేసు నమోదు కావడం. అతుల్ రాయ్ తనపై అత్యాచారం చేశారని ఒక విద్యార్థిని వారణాసి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు మే 1న అతుల్‌పై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆయన కనిపించడం లేదు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని కొందరు, మలేసియా పారిపోయారని ఇంకొందరు చెబుతున్నారు.ఆయన లేకపోయినా ఆయన తరఫున ప్రచారం మాత్రం సాగిపోతోంది. బీజేపీ వాళ్లు కుట్రతో తమ అభ్యర్థిపై బూటకపు కేసు పెట్టించారని మాయావతి, అఖిలేశ్‌లు చెబుతున్నారు. అతుల్ రాయ్‌ని తప్పనిసరిగా గెలిపించి బీజేపీ కుట్రను భగ్నం చేయాలని కూడా వారు ఓటర్లను కోరుతున్నారు. మరోవైపు మే 23 వరకు అతుల్‌ను అరెస్టు చేయకుండా చూడాలని ఆయన లాయరు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దానిపై ఈ రోజు విచారణ జరగనుంది. -
‘ప్రధాని పదవి దక్కకున్నా బాధ లేదు’
పట్నా : దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్ని ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మహాకూటమిని తెర మీదకు తెచ్చిన సంగతి తెలిసిందే. మోదీని గద్దే దించడమే తమ లక్ష్యమని ఈ కూటమి చెప్పుకుంటుంది. కేంద్రంలో ఏ పార్టీకి సరైన మెజారిటీ రానీ పక్షంలో.. విపక్షాలన్ని కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా పార్టీల నాయకులంతా ప్రధాని పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రధాని పదవి దక్కకపోయినా ఇబ్బంది లేదని తేల్చి చెప్పారు. బుధవారం పట్నాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆజాద్.. ‘మా స్టాండ్ ఏంటో ఇప్పటికే స్పష్టం చేశాం. కాంగ్రెస్‌కు మద్దతుగా అన్ని పార్టీలు కలిసి ఓ కూటమిగా ఏర్పాడితే.. ఆ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అప్పుడు ప్రధాని పదవి కాంగ్రెస్ పార్టీకి దక్కకపోయినా పెద్దగా బాధ పడం. ఎందుకంటే బీజేపీని గద్దే దించడమే మా ప్రధాన ధ్యేయం. అందుకోసం అందరిని కలుపుకొని ముందుకు వెళ్తాం. మిగతా పార్టీలు తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఆమోదిస్తుంది. ఈ అంశంలో ఎలాంటి విభేదాలు తలెత్తకుండా చూస్తాం’ అని ఆజాద్ తెలిపారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపక్షాలు తమ ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పాంటూ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు బదులుగా ఆజాద్ ఇలా వివరణ ఇచ్చారు. -
యూపీ వెనుకబడిన వర్గాల మొగ్గు ఎటువైపు?
ఉత్తర్‌ప్రదేశ్‌లోని 27 లోక్‌సభ స్థానాలకు చివరి రెండు దశల్లో జరిగే పోలింగ్ పాలకపక్షమైన బీజేపీకి అత్యంత కీలకమైనది. 2014లో రాష్ట్రంలోని మొత్తం 80 సీట్లలో బీజేపీ, దాని మిత్రపక్షం 73 స్థానాలు కైవసం చేసుకున్నాయి. గతంలో యూపీలో వరుసగా పదేళ్లు అధికారంలో ఉన్న ఎస్పీ, బీఎస్పీ మరో ప్రాంతీయపక్షమైన ఆరెల్డీతో చేతులు కలిపి మహా కూటమి పేరుతో 2019 ఎన్నికల్లో పోటీచేయడం కొత్త పరిణామం. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెల్లెలు, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ విస్తృతంగా ప్రచారం చేయడం రెండో ప్రధానాంశం. ప్రియాంక ప్రచారం కారణంగా కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో పది శాతం వరకూ ఓట్లు అదనంగా పడుతున్నాయని ఎన్డీటీవీ అధిపతి, ప్రసిద్ధ ఎన్నికల విశ్లేషకుడు ప్రణయ్ రాయ్ జరిపించిన సర్వేలో తేలింది. అయితే, కాంగ్రెస్‌కు పెరిగే ఈ ఓట్లు బీజేపీ వ్యతిరేక ఓట్ల నుంచే వస్తున్నందువల్ల ఎస్పీ–బీఎస్పీ కూటమికి నష్టదాయకం కావచ్చని అంచనా వేస్తున్నారు. దేశంలోని మిగతా ప్రాంతాల సగటు కన్నా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎక్కువ మంది దళితులు, ముస్లింలు ఉన్నారు. అలాగే పట్టణ ఓటర్ల కంటే గ్రామీణ ఓటర్ల శాతం యూపీలో ఎక్కువ. బీజేపీ నుంచి కాంగ్రెస్, కూటమి వైపు మొగ్గుతున్న దళితులు కిందటి లోక్‌సభ ఎన్నికల్లో కాషాయపక్షానికి అధిక సంఖ్యలో ఓట్లేసిన దళితుల్లో కొందరు ఈసారి ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లేసే అవకాశం ఉందని కూడా సర్వేలో తేలింది. 2014లో బీజేపీకి పడిన దళితుల ఓట్లలో 10 శాతం కాంగ్రెస్‌కు, ఐదు శాతం మహా కూటమికి దక్కే అవకాశముంది. యూపీలో ముస్లింలు జనాభాలో 19 శాతం వరకూ ఉన్నారు. వారిలో 75 శాతం ఓటర్లు మహాగఠ్‌బంధన్‌కు, 25 శాతం మంది కాంగ్రెస్‌కు ఓటేసే వీలుందని కూడా ఈ సర్వే సూచిస్తోంది. 18–25 ఏళ్ల యువ ఓటర్ల మద్దతు ఎక్కువగా బీజేపీకే ఉంటుందని తెలుస్తోంది. ఇంకా మహిళలు, వెనుకబడిన వర్గాల్లో కూడా బీజేపీకి ఎక్కువ మద్దతు కనిపిస్తోంది. యూపీలోని బీసీల్లో సగానికి పైగా(55 శాతం) జనం బీజేపీ అభ్యర్థులకు ఓటేయడానినికి ఇష్టపడుతున్నారు. మిగిలిన 35 శాతం మహా కూటమికి, పది శాతం కాంగ్రెస్‌కు ఓటేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. యువతలో సగం బీజేపీకే? ఉత్తర్ ప్రదేశ్ యువ ఓటర్లలో(18–25 ఏళ్ల వయసువారు) దాదాపు సగం మంది బీజేపీకి ఓటేయడానికే మొగ్గు చూపుతున్నారని, ఈ అంశం పార్టీలు సాధించే లోక్‌సభ సీట్ల సంఖ్యను నిర్ణయిస్తుందని కూడా క్షేత్రస్థాయిలో జరిపిన అధ్యయనాలు చెబుతున్నాయి. ఏ ఎన్నికల్లోనైనా ఉత్సాహంగా ఓటు వేస్తున్న మహిళల విషయానికి వస్తే, పురుషులతో సమానంగా మహిళలు బీజేపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. కాంగ్రెస్‌కు పడే ఓట్లలో మహిళల ఓట్లు ఎక్కువనీ, మహా కూటమికి దక్కే ఓట్లలో పురుషులవి ఎక్కువనీ ఈ సర్వే సూచిస్తోంది. బీసీలు, దళితుల మద్దతు అత్యధికంగా ఉన్న ఎస్పీ–బీఎస్పీ కూటమి ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో చేతులు కలపడం వల్ల గణనీయ సంఖ్యలో ఉన్న అగ్రవర్ణాలు బీజేపీకి అనుకూలంగా సమీకృతం అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని కూడా ఈ సర్వేలో తేలింది. వారు అత్యధిక సంఖ్యలో కాషాయపక్షం అభ్యర్థులకు ఓటేస్తారని తెలుస్తోంది. మొత్తం మీద రాజకీయ, కుల సమీకరణలు కొంత వరకు బీజేపీకి అనుకూలంగా మారుతున్నట్టు కనిపిస్తోంది. -
నాది పేదల కులం
సోనెభద్ర: దేశంలోని నిరుపేద ప్రజలందరిది ఏ కులమో అదే తన కులమని ప్రధాని మోదీ తెలిపారు. నిఘా వ్యవస్థలను బలహీన పరిచే దుష్ట కూటమి సంకీర్ణ ప్రభుత్వాలకు అధికారం ఇవ్వరాదని ఆయన కోరారు. శనివారం ప్రధాని ఉత్తరప్రదేశ్‌లోని సోనెభద్ర, ఘాజీపూర్‌లలో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. ప్రధాని మోదీ నకిలీ ఓబీసీ కులస్తుడంటూ బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎద్దేవా చేయడంపై ఈ సందర్భంగా మోదీ స్పందించారు. ‘వారంతా కొత్తగా నా కులం విషయం తెరపైకి తెచ్చారు. పేదలందరిదీ ఏ కులమో, మోదీది కూడా అదే కులమని వారికి చెప్పాలనుకుంటున్నా’అని అంటూ పేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను వివరించారు. దుష్ట కూటమితో దేశం బలహీనం గతంలో సమాజ్‌వాదీ పార్టీతో కూడిన సంకీర్ణం హయాంలో నిఘా వ్యవస్థలు నష్టపోయాయన్న ప్రధాని..‘దుష్టకూటమి ప్రభుత్వ హయాంలో దేశ భద్రత ప్రమాదంలో పడింది. నిఘా వ్యవస్థలు బలహీనపడ్డాయి. సంకీర్ణ ప్రభుత్వాల తప్పిదాలను సరిదిద్దే చర్యల్లో భాగంగా బీజేపీ నేతృత్వంలోని వాజ్‌పేయి ప్రభుత్వం 1998లో సరిగ్గా ఇదే రోజు పోఖ్రాన్లో విజయవంతంగా అణు పరీక్ష జరిపింది’అని గుర్తు చేశారు. కాంగ్రెస్ సారథ్యంలోని మన్మోహన్ సర్కారును బలహీన, రిమోట్ కంట్రోల్ ప్రభుత్వంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ఈ ప్రభుత్వం వల్ల దేశానికి చెడ్డపేరు వచ్చిందన్నారు. ఇలాంటి దుష్టకూటమి ప్రభుత్వాలకు మద్దతు పలకవద్దని ఆయన ప్రజలను కోరారు. వారంతా కలిసి గతంలో ఉత్తరప్రదేశ్‌ను ధ్వంసం చేశారు. ఇప్పుడు తమను తాము నాశనం కాకుండా కాపాడుకునేందుకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఏకమయ్యాయి’అని అన్నారు. తమ ప్రభుత్వం హయాంలో వైమానిక బలగాలు సరిహద్దులు దాటి బాలాకోట్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపాయని తెలిపారు. కాంగ్రెస్‌ది అహంకారం కాంగ్రెస్ హయాంలో 1984లో సిక్కుల ఊచకోతపై ఆ పార్టీ నేత శామ్ పిట్రోడా ‘అప్పుడు అలా జరిగింది, అయితే ఏంటి?’ అనడంపై ప్రధాని స్పందిస్తూ...‘ఈ వ్యాఖ్యలు ఆ పార్టీ వైఖరిని, మనస్తత్వాన్ని వెల్లడి చేస్తున్నాయి. ఎన్ని కుంభకోణాలు జరిగినా వారిలో పశ్చాత్తాపం లేదు. కాంగ్రెస్ నిర్లక్ష్య ధోరణికి ఇదే నిదర్శనం’ అని మండిపడ్డారు. దళిత మహిళకు కాంగ్రెస్ ‘అన్యాయం’ రాజస్తాన్‌లో దళిత మహిళపై సామూహిక అత్యాచారం జరగ్గా లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విషయం బయటకు పొక్కకుండా అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కిపెడుతోందని ప్రధాని ఆరోపించారు. ఏప్రిల్ 26వ తేదీన ఈ ఘటన జరిగిందంటూ 30వ తేదీన బాధితురాలి భర్త ఫిర్యాదు చేసినప్పటికీ తీరిగ్గా మే 7వ తేదీన పోలీసులు కేసు నమోదు చేశారని ఆయన వెల్లడించారు. ఎన్నికలు జరుగుతున్నందునే ఇంత జాప్యం చేశారని విమర్శించారు. అధికారంలోకి వస్తే న్యాయ్ పథకం అమలు చేస్తామంటూ కాంగ్రెస్ చెప్పుకుంటుండగా..అక్కడి ఆ పార్టీ ప్రభుత్వం మాత్రం దళిత మహిళకు అన్యాయం చేసిందని ఆరోపించారు. -
6 ప్యాక్ ఎలక్షన్
ఎన్నికలు ముగింపు దశకు వచ్చేసరికి నరాలు తెగే ఉత్కంఠ ఊపిరాడనివ్వడం లేదు. కేంద్రంలో గద్దెనెక్కే దెవరు? మోదీ మరోసారి మ్యాజిక్ చేస్తారా? కాంగ్రెస్ కాస్తయినా పుంజుకుంటుందా? ముచ్చటగా మూడో కూటమి కొత్త రాజకీయ సమీకరణలకు బాటలు వేస్తుందా? ఇప్పుడందరి మదిలోనూ ఇవే ప్రశ్నలు. ఆరో దశలో ఏడు రాష్ట్రాల్లో 59 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. అన్ని పార్టీలకూ ఈ విడతే అత్యంత కీలకం. ముఖ్యంగా కమలం పార్టీ కఠిన పరీక్ష ఎదుర్కొంటోంది. 2014 ఎన్నికల్లో బీజేపీ ఈ 59 నియోజకవర్గాల్లో 44 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. మరోసారి ఆ స్థాయి విజయం బీజేపీకి దక్కుతుందా? ఏకంగా 43 మంది సిట్టింగ్ ఎంపీలనే బరిలోకి దింపడంతో ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొని ఎంతవరకు నిలబడగలదు? కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి పోరు ఉన్న నియోజకవర్గాల్లో హస్తం పార్టీ హవా చూపిస్తుందా? ఇప్పటివరకు అయిదు దశల్లో 424 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. ఇంకా 118 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. ఆదివారం జరగబోయే ఆరోదశలో పై చేయి సాధించడానికి అన్ని పార్టీలు తమ శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ఈ దశలో ఎవరు నెగ్గితే వారే కేంద్రంలో చక్రం తిప్పే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. బిహార్, హరియాణా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు గతంలో మాదిరిగా లేవు. 2014 ఎన్నికల్లో ఢిల్లీ రాష్ట్రాన్ని క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ బిహార్, హరియాణాలో ఎవరి అంచనాలకు అందని విధంగా దూసుకుపోయింది. ఇక యూపీలో విజయభేరి ఢిల్లీ పీఠానికి బాటలు వేసింది. కానీ ఈ అయిదేళ్లలో రాజకీయంగా, వ్యవస్థాగతంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోవడం, ఒకట్రెండు సీట్లకే పరిమితమైన చోట క్షేత్రస్థాయిలో పట్టు బిగించడం, పాత శత్రువులే కొత్త మిత్రులుగా మారడం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గద్దె దింపాలన్న ఏకైక లక్ష్యంతో ఆగర్భ శత్రువులు కూడా ఏకం కావడం వంటి పరిణామాలు రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పుతాయో ఎవరి అంచనాలకు అందడం లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పరిస్థితి. ఈ దశలో అత్యధిక స్థానాలు దక్కించుకోవడానికి మోదీ,షా ద్వయం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. మొత్తం రాష్ట్రాలు: 7 పోలింగ్ జరిగే నియోజకవర్గాలు: 59 బరిలో ఉన్న అభ్యర్థులు: 979 పశ్చిమ బెంగాల్ నియోజకవర్గాలు : 8 తామ్లుక్, కంథీ, ఘటాల్, ఝార్గ్రామ్, మేదినీపూర్, పురూలియా, బంకూరా, బిష్ణుపూర్ గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేసింది. అప్పట్లో సైడ్ ప్లేయర్‌గా ఉన్న బీజేపీ ఈసారి ప్రధాన ప్రత్యర్థిగా మారి హోరాహోరి పోరాటానికి తెరతీసింది. వీటిలో నాలుగు నియోజకవర్గాల్లో ఆదివాసీల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఒకప్పుడు మావోయిస్టుల ప్రాబల్యం అత్యధికంగా ఉండే జార్ఖండ్‌కు సరిహద్దుల్లో ఉండే జంగల్‌మహల్ ప్రాంతంలో ఎన్నికలూ జరుగుతున్నాయి. ఒకప్పుడు సీపీఎంకి కంచుకోటగా ఉండే ఈ ప్రాంతాల్లో ఆ పార్టీ నామమాత్రపు పోటీని కూడా ఇవ్వలేకపోతోంది. బీర్బహ సోరెన్ ఆదివాసీలను ఆకర్షించడానికి మమత దీదీ ఏకంగా 52 పథకాల్ని ప్రవేశపెట్టారు. మరోవైపు ఆరెస్సెస్ ఈ ప్రాంతంలో బలంగా విస్తరించింది. ఆదివాసీలను ఆకర్షించడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ 150 ఏకలవ్య విద్యాలయాలను నిర్వహిస్తూ వారిలో అక్షరాస్యత పెంచుతోంది, ఝార్గ్రామ్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి స్కూలు టీచర్‌గా పనిచేస్తున్న బీర్బహ సోరెన్, బీజేపీ అభ్యర్థి, ఇంజనీర్ అయిన కునార్ హేమంబరం మధ్య గట్టి పోటీ నెలకొంది. మమత ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా అవి అమలు జరగడం లేదన్న అసంతృప్తి ఆదివాసీల్లో ఉంది. అదే ఇప్పుడు బీజేపీ విజయావకాశాలను పెంచుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జార్ఖండ్ నియోజకవర్గాలు: 4 గిరిడీహ్, ధన్‌బాద్, జంషెడ్పూర్, సింగ్భూమ్ ఈ దశలో పోలింగ్ జరిగే నాలుగు స్థానాల్లోనూ గత ఎన్నికల్లో బీజేపీయే గెలుపొందింది. 2014 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ అధికారం దక్కించుకుంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అభివృద్ధి ఆశించినంత స్థాయిలో జరగలేదు. ఇక బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కేవలం ప్రధాని మోదీ ఇమేజ్‌పైనే ఆశలు పెట్టుకొని బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తోంది. మోదీ హవాను అడ్డుకోవడానికి విపక్ష పార్టీలైన కాంగ్రెస్, జేఎంఎం, మాజీ సీఎం బాబూలాల్ మరాండీకి చెందిన జార్ఖండ్ వికాస్ మోర్చా ప్రగతిశీల్ (జేవీఎంపీ), ఆర్జేడీ మహాకూటమిగా ఏర్పడి సవాల్ విసురుతున్నాయి. చమాయ్ సోరెన్, బిద్యుత్ బరణ్ ధన్‌బాద్ నియోజకవర్గంపై 2009 నుంచి కాషాయం జెండా ఎగురుతోంది. సిటింగ్ ఎంపీ పశుపతినాథ్ సింగ్నే బీజేపీ మళ్లీ బరిలో దింపింది. ఆయనపై కాంగ్రెస్ పార్టీ మాజీ క్రికెటర్, బీజేపీ నుంచి ఫిరాయించిన కీర్తీ ఆజాద్‌కు టికెట్ ఇవ్వడంతో పోరు రసవత్తరంగా మారింది. మరోముఖ్యమైన స్థానం జంషెడ్పూర్. ఇది జనరల్ సీటు అయినప్పటికీ మహాకూటమి అభ్యర్థిగా జేఎంఎం నుంచి ఆదివాసీ చమాయ్ సోరెన్‌కు పోటీకి నిలిపారు. అభ్యర్థి ఎంపికతోనే మహాకూటమి సగం విజయం సాధించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక బీజేపీ సిటింగ్ ఎంపీ, కుర్మి సామాజిక వర్గానికి చెందిన బిద్యుత్ బరణ్ మహతోకే టికెట్ ఇచ్చింది. కార్మికుల మద్దతు కలిగిన సోరెన్ మైనార్టీలను కూడా ఆకర్షించే ప్రయత్నాల్లో ఉంటే, మహతో కేవలం మోదీ పాపులారిటీనే నమ్ముకొని విజయంపై ధీమాగా ఉన్నారు. ఢిల్లీ నియోజకవర్గాలు: 7 చాందినీ చౌక్, తూర్పు ఢిల్లీ, న్యూఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ, వాయవ్య ఢిల్లీ (ఎస్సీ), దక్షిణ ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ గత ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసిన రాష్ట్రాల్లో ఢిల్లీ ఒకటి. కానీ ఈ అయిదేళ్లలో వచ్చిన మార్పులు, రోజురోజుకూ మారిపోయే ఢిల్లీ ఓటరు మూడ్ చూస్తుంటే గత ఎన్నికల మాదిరిగా కమలదళం అన్ని స్థానాలు దక్కించుకోలేదేమోనన్న అంచనాలున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్‌కున్న క్రేజ్‌తో ఆ పార్టీ గట్టి పోటీయే ఇస్తోంది. ఆప్ ఓటర్లందరూ ఒకప్పుడు కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన వారే. కాషాయం ఓటు బ్యాంకు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అందుకే బీజేపీ త్రిముఖ పోటీలో తమదే పై చేయి అన్న ధీమాతో ఉంది. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న తూర్పు ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, ఆప్ అభ్యర్థి, విద్యావేత్త ఆతిషి మధ్య హోరాహోరి పోరు నెలకొంది. హర్షవర్ధన్, జేపీ అగర్వాల్ పాఠశాలల వ్యవస్థను సంస్కరించడంతో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ఓటర్లు ఆతిషి వైపు మొగ్గు చూపించే అవకాశాలున్నాయి. ఇక ఈశాన్య ఢిల్లీ నుంచి కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి, 81 ఏళ్ల వయసున్న షీలాదీక్షిత్ పోటీ చేస్తూ ఉండడంతో ఈ స్థానంపై ఆసక్తి పెరిగింది. అంత వయసులోనూ ఆమె ప్రచారాన్ని హోరెత్తించారు. కాంగ్రెస్ పార్టీలో కొత్త ఆశలు కల్పించారు. ముస్లిం ఓటర్ల మద్దతుతో షీలా విజయం సాధిస్తారన్న నమ్మకంలో కాంగ్రెస్ ఉంది. ఇక్కడ బీజేపీ నుంచి సిటింగ్ ఎంపీ, భోజ్‌పురీ గాయకుడు, నటుడు మనోజ్ తివారీ బరిలో ఉన్నారు. ఆప్ నుంచి దిలీప్ పాండే పోటీ పడుతున్నారు. చాందినీ చౌక్ నియోజకవర్గంలో శాస్త్ర, సాంకేతిక శాఖా మంత్రి హర్షవర్ధన్‌పై కాంగ్రెస్ పార్టీ నాలుగుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన జేపీ అగర్వాల్‌ను పోటీకి నిలిపింది. ఆప్ నుంచి పంకజ్ గుప్తా బరిలో ఉన్నారు. హర్షవర్ధన్ 1993–98 మధ్య ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా పల్స్ పోలియోను విజయవంతంగా అమలుచేశారు. మధ్యప్రదేశ్ నియోజకవర్గాలు: 8 మొరెనా, భిండ్, గ్వాలియర్, గుణ, సాగర్, విదిష, భోపాల్, రాజ్‌గఢ్ పదిహేనేళ్ళ తర్వాత బీజేపీ కంచుకోటను బద్దలుకొట్టి, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ ఓట్ల శాతంలో మాత్రం బీజేపీకన్నా ఒకడుగు వెనకే ఉంది. 2014లో మధ్యప్రదేశ్‌లోని మొత్తం 29 స్థానాలకు గాను 27 స్థానాల్లో విజయకేతనాన్ని ఎగురవేసిన బీజేపీకిగానీ, 2018 ఎన్నికల్లో అవిశ్రాంతంగా పోరాడి తృటిలో బయటపడిన కాంగ్రెస్‌కి గానీ ఈ ఎన్నికల్లో గెలుపు నల్లేరుమీద నడకేం కాదు. దశాబ్దకాలం పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ గెలుపు భోపాల్‌లో ప్రతిష్టాత్మకంగా మారింది. మాలెగాం బాంబు పేలుడు కేసులో జైలుపాలై అనారోగ్యం పేరుతో బెయిలుపై బయటకు వచ్చిన సాధ్విని బీజేపీ బరిలోకి దింపింది. వీరేంద్ర కుమార్, కిరణ్ అహిర్వార్ బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించిన ఖజురహోలో ఈసారి బీజేపీ నుంచి వీ.డీ శర్మ తన విజయావకాశాలను పరీక్షించుకుంటున్నారు. స్థానిక రాజకుటుంబీకురాలు కవితాసింగ్‌ని కాంగ్రెస్ బరిలోకి దింపింది. హోశంగాబాద్ 1989 నుంచి బీజేపీకి మంచి పట్టున్న లోక్‌సభ స్థానం. మాజీ ముఖ్యమంత్రి సుందర్‌లాల్ పట్వా కూడా ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ బీజేపీ అభ్యర్థి ఉదయప్రతాప్ సింగ్. దామోహ్‌లో బీజేపీ నుంచి తిరిగి ప్రçహ్లాద్ సింగ్ పటేల్ పోటీ చేస్తోంటే, కాంగ్రెస్ నుంచి ప్రతాప్ సింగ్, ప్రహ్లాద్ సింగ్‌ని ఢీకొనబోతున్నారు. గతంలో రెండుసార్లు విజయం సాధించిన వీరేంద్ర కుమార్‌నే తిరిగి బీజేపీ టీకంగఢ్‌లో పోటీకి దింపింది. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ బీజేపీ వీరేంద్ర కుమార్ తిరిగి ఈ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ టికెట్‌పై కిరణ్ అహిర్వార్ తలపడుతున్నారు. బిహార్ నియోజకవర్గాలు: 8 వాల్మీకీనగర్, తూర్పు చంపారణ్, పశ్చిమ చంపారణ్, శివహార్, వైశాలి, మహారాజ్‌గంజ్, సివాన్, గోపాల్‌గంజ్ గత ఎన్నికల్లో బీజేపీ ఏడు స్థానాల్లో గెలుపొందితే, దాని మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ ఒక్క స్థానంలో గెలుపొందింది. అయితే ఈ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గత ఎన్నికల్లో మోదీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని విభేదించి ఎన్నికల్లో భంగపడ్డారు. ఇప్పుడు బీజేపీ పూర్తిగా నితీశ్‌కున్న ఇమేజ్ మీదే ఆధారపడి ఎన్నికల బరిలోకి దిగింది. ఆర్జేడీ, కాంగ్రెస్, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ), హిందూస్తాన్ అవామ్ మోర్చా (హెచ్ఏఎం)లతో కూడిన మహాగఠ్‌బంధన్ గట్టి సవాలే విసురుతోంది. ముఖేశ్ సహాని వీఐపీ పార్టీ అధినేత ముఖేశ్ సహాని తాను మల్లా (జాలరి) కుమారుడినంటూ గర్వంగా ప్రకటించుకొని ప్రచారం చేస్తున్నారు. ఈ సారి ఎన్నికలు జరగబోయే నియోజకవర్గాల్లో యాదవులు, ముస్లింలు, మల్లా ఓటర్లు బీజేపీకి అతి పెద్ద సవాల్ విసురుతున్నారు. ధనబలం, కండబలం ఇవే ఈ దశ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించబోతున్నాయి. మొత్తం 127 మంది అభ్యర్థులు బరిలో ఉంటే వారిలో 44 మంది కోట్లకు పడగలెత్తారు. మరో 43 మంది అభ్యర్థులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. వాల్మీకీనగర్ నుంచి పోటీ పడుతున్న దీపక్ యాదవ్ 59.46 కోట్లతో అత్యంత ధనిక అభ్యర్థిగా ఉంటే, సగటు ఆస్తులు చూసుకుంటే బీజేపీ అభ్యర్థులు ముందు వరసలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ నియోజకవర్గాలు: 14 సుల్తాన్పూర్, ప్రతాప్‌గఢ్, ఫూల్పూర్, అలహాబాద్, అంబేడ్కర్‌నగర్, శ్రావస్తి, దొమరియాగంజ్, బస్తీ, సంత్‌కబీర్‌నగర్, లాల్గంజ్, ఆజంగఢ్, జౌన్పూర్, మచిలీషెహర్, భాడోహి ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ప్రాంతంలోని 14 స్థానాలకు ఆరో దశలో పోలింగ్ జరుగుతోంది. ఈ స్థానాలున్న తూర్పు ప్రాంతం బాగా వెనుకబడి ఉంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిన్న కోడలు, కేంద్ర మంత్రి మేనకాగాంధీ (బీజేపీ) సుల్తాన్పూర్ నుంచి, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఆజమ్గఢ్ నుంచి పోటీలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఆజమ్గఢ్ తప్ప మిగిలిన 13 సీట్లను బీజేపీ (ప్రతాప్‌గఢ్‌లో అప్నాదళ్ గెలుపుతో కలిపి) కైవసం చేసుకుంది. 2018 ఉప ఎన్నికలో ఫూల్పూర్ స్థానాన్ని ఎస్పీ గెలుచుకుంది. బీఎస్పీ మద్దతుతో ఈ నియోజకవర్గంలో ఎస్పీ విజయం సాధించడంతో మూడు పార్టీల మహా కూటమికి అంకురార్పణ జరిగింది. తొలి ప్రధాని నెహ్రూ మూడుసార్లు, ఆయన చెల్లెలు విజయలక్ష్మీ పండిత్ రెండుసార్లు లోక్‌సభకు ఫూల్పూర్ నుంచి ఎన్నికయ్యారు. కిందటి ఎన్నికల్లో సుల్తాన్పూర్ నుంచి ఇందిర మనవడు, బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ విజయం సాధించగా ఈసారి ఆయన తల్లి మేనక పోటీచేస్తున్నారు. మేనకాగాంధీ, అఖిలేశ్ యాదవ్ ఇక్కడ బీఎస్పీ అభ్యర్థితోపాటు, కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ సంజయ్‌సింగ్ పోటీకి దిగారు. ఎస్పీ అగ్రనేత ములాయంసింగ్ యాదవ్ కిందటిసారి ఆజమ్గఢ్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఈసారి ఆజమ్‌గఢ్‌లో అఖిలేశ్‌పై భోజ్‌పురీ నటుడు, గాయకుడు దినేశ్‌లాల్ యాదవ్ ‘నిర్హౌవా’ను బీజేపీ నిలబెట్టింది. అలహాబాద్ సిట్టింగ్ బీజేపీ ఎంపీ శ్యామాచరణ్ గుప్తా ఎస్పీలో చేరడంతో కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత, యూపీ కేబినెట్ మంత్రి రీటా బహుగుణ జోషీ బీజేపీ తరఫున పోటీకి దిగారు. ఈ స్థానంలో ప్రధాన పార్టీల తరఫున ఫిరాయింపుదారులే పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ ఇక్కడ బీజేపీ మాజీ నేత యోగేశ్ శుక్లాకు దక్కింది. ఎస్పీ తరఫున జేడీయూ మాజీ నేత రాజేంద్రసింగ్ పటేల్ పోటీకి దిగారు. బీసీలు, దళితులు, ముస్లింల మద్దతు అధికంగా ఉన్న ఎస్పీ, బీఎస్పీ కలిసిపోటీచేయడం వల్ల ఈ పార్టీల అభ్యర్థులు బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్నారు. 2014లో ఈ 14 నియోజకవర్గాల్లో ఒక ప్రతాప్‌గఢ్ తప్ప మిగిలిన స్థానాల్లో ఎస్పీ, బీఎస్పీకి పడిన ఓట్లు కలిపితే బీజేపీకి దక్కిన ఓట్లను మించిపోతాయి. ఈ రెండు కూటమి పార్టీల మధ్య ఓట్ల బదిలీ పూర్తిగా జరుగుతుందా? అనేది కీలకాంశంగా మారింది. రాష్ట్రంలోని మిగిలిన స్థానాల్లో మాదిరిగానే యాదవేతర బీసీలు, జాటవేతర దళితులు, ఎస్సీ, బీసీ వర్గాల్లో బాగా వెనుకబడిన కులాలు మళ్లీ బీజేపీకే మద్దతిస్తాయనే ఆశతో పాలకపక్షం నేతలు ఉన్నారు. హరియాణా నియోజకవర్గాలు: 10 ఫరీదాబాద్, గుర్గావ్, హిసార్, రోహ్తక్, కర్నాల్, అంబాలా, సోనిపత్, సిర్సా, భివానీ–మహేంద్రగఢ్, కురుక్షేత్ర హరియాణా రాజకీయాలంటేనే ముగ్గురు లాల్స్ గుర్తుకొస్తారు. బన్సీలాల్, దేవీలాల్, భజన్‌లాల్ వారి కుటుంబాలే దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను తమ గుప్పిట్లో పెట్టుకొని నడిపించారు. జనాభాలో 27శాతం ఓటర్లు ఉన్న జాట్లు ఎవరికి మద్దతు ఇస్తే వారికే అధికారం దక్కడం ఆ రాష్ట్ర ఆవిర్భావం నుంచి జరుగుతోంది. గత ఎన్నికల్లో ఆ సంప్రదాయాన్ని తిరగరాసి బీజేపీ పది నియోజకవర్గాలకు గాను ఏడింట్లో విజయకేతనం ఎగురవేసింది. జాట్ వ్యతిరేక పంజాబీ ఓటర్లను కూడగట్టి కొత్త సామాజిక సమీకరణలకు తెర తీసింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ అధికారాన్ని దక్కించుకుంది. ఈ సారి అదే కార్డుని ప్రయోగిస్తూ జాట్ అభ్యర్థులపై పంజాబీ బ్రాహ్మణ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది. దుష్యంత్ , భవ్య బిష్ణోయి రెండేళ్ల క్రితం జాట్ ఆందోళనల ప్రభావంతో సమాజంలో జాట్లు, జాటేతరుల అన్న చీలిక వచ్చింది. హరియాణాలో ఈ సారి హిసార్ స్థానంపైనే అందరి దృష్టి ఉంది. ఈ రాష్ట్రాన్ని తమ గుప్పిట్లో ఉంచుకొని శాసిస్తున్న మూడు కుటుంబాలకు చెందిన వారసులు పోటీ చేస్తున్న స్థానమిది. ఐఎన్ఎల్డీ వ్యవస్థాపకుడు దేవీలాల్ ముని మనవడు, జేపీపీ పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా సిట్టింగ్ ఎంపీ. గత ఎన్నికల్లో ఐఎన్ఎల్డీ తరఫున పోటీ చేసి నెగ్గిన దుష్యంత్ ఈ సారి సొంత పార్టీ తరఫున బరిలో ఉన్నారు. ఇక బీజేపీ తరఫున కేంద్ర మంత్రి బ్రిజేంద్ర సింగ్ కుమారుడు బీరేంద్ర సింగ్పోటీ చేస్తుంటే, కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మనవడు భవ్య బిష్ణోయి పోటీలో ఉన్నారు. -
క్లీన్‌బౌల్డ్ అయ్యాక అంపైర్‌పై నిందలు
బస్తి, ప్రతాప్‌గఢ్ (యూపీ)/వాల్మీకినగర్ (బిహార్): క్లీన్‌బౌల్డ్ అయ్యాక అంపైర్‌ను నిందించే బ్యాట్స్‌మన్‌లా, పరీక్షల్లో ఫెయిలై కుంటిసాకులు చెప్పే విద్యార్థిలా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. అధికారం కోసం ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లు విలువలకు తిలోదకాలిస్తున్నాయన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బస్తి, ప్రతాప్‌గఢ్, బిహార్‌లోని వాల్మీకినగర్‌లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎనిమిది సీట్లకు పోటీ చేస్తున్నవారు కూడా ప్రధానిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమవుతున్నారని మోదీ వ్యంగ్యంగా అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా సమష్టి పోరాటం చేస్తున్న మహాకల్తీ కూటమి బంధం ఎంతోకాలం సాగదని మోదీ ఈ సందర్భంగా జోస్యం చెప్పారు. మహా కూటమి మహా అవినీతిని పెంచి పోషిస్తుందని అన్నారు. కాంగ్రెస్ ‘ఓటు కాట్వా’(ఓట్ల కోత) స్థాయికి దిగజారిపోయిందని, త్వరలోనే అది తన పతనాన్ని చూస్తుందని అన్నారు. ఒకపక్క కాంగ్రెస్‌తో ఎస్పీ మెతగ్గా వ్యవహరిస్తుంటే మరోపక్క బీఎస్పీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్‌పై దాడి చేయడం గమనార్హమన్నారు. రఫేల్ విషయంలో తనను అపఖ్యాతి పాలుచేసేందుకు రాహుల్ ప్రయత్నించారంటూ.. ఆయన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీపై మోదీ విమర్శలు చేశారు. రాజీవ్ గాంధీ మిస్టర్ క్లీన్ ఇమేజ్ చివరకు అవినీతి నంబర్ వన్ గా ముగిసిందని ఆరోపించారు. ఎస్పీ, బీఎస్పీల అవినీతిపై మోదీ ధ్వజమెత్తారు. ఎన్‌ఆర్‌హెచ్ కుంభకోణం, ఇసుక అక్రమ తవ్వకాలు, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేసిన తర్వాత కొన్ని వస్తువులు మాయం కావడం వంటివి ఆయన ప్రస్తావించారు. మహా కల్తీ కూటమితో పోల్చుకుంటే ఎన్డీయే పనితీరు విభిన్నమైనదని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు పాక్ చర్యలపై గగ్గోలు పెడుతుండేవని, శత్రు దేశం కంటే తమ ఓటు బ్యాంకే ప్రధానంగా భావించేవని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఏర్పడిన తెలుగు రాష్ట్రాల్లో ఘర్షణ వాతావరణం కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల మధ్య వైరుధ్యాన్ని మోదీ ప్రస్తావిస్తూ.. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఏర్పడిన కొత్త రాష్ట్రాలు ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లు తమ మాతృ రాష్ట్రాలతో ఎంతోబాగా మంచి సంబంధాలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరుపడిందంటూ.. ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొందని ఆయన చెప్పారు. -
కాంగ్రెస్ కొత్త ఖాతా తెరుస్తుందా?
లోక్‌సభ ఎన్నికల ఐదో దశలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ, రాయ్‌బరేలీ సహా 14 స్థానాలకు మే 6న పోలింగ్ జరుగుతుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ గెలిచిన అమేఠీ, రాయ్‌బరేలీ మినహా మిగిలిన పన్నెండు స్థానాలను కిందటి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో రాజకీయంగా కీలకమైన అవధ్ ప్రాంతంలోని అనేక నియోజకవర్గాలున్న ఈ దశ ఎన్నికల్లో ఈసారి కూడా అత్యధిక సీట్లు గెలుచుకోవడం బీజేపీకి అత్యవసరం. దళితులు, బీసీలు, ముస్లింల మద్దతు అధికంగా ఉన్న బహుజన్ సమాజ్‌వాదీపార్టీ (బీఎస్పీ), సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కూటమికి కూడా ఈ ప్రాంతంలో గట్టి పునాదులున్నాయి. అగ్రనేతలు మళ్లీ పోటీచేస్తున్న రెండు సీట్లతోపాటు మరో మూడు స్థానాలైనా సంపాదించాలని కాంగ్రెస్ ఆరాటపడుతోంది. రాష్ట్ర రాజధాని పరిధిలోని లక్నో నియోజకవర్గం నుంచి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఫతేపూర్ నుంచి కేంద్ర ఆహార పరిశ్రమల శాఖ సహాయమంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి పోటీ చేస్తున్నారు. మందిర్–మసీదు వివాదానికి కేంద్ర బిందువు అయిన అయోధ్య ఉన్న ఫైజాబాద్ స్థానానికి కూడా గట్టి పోటీ ఉంది. బీజేపీ తర్వాత బలమైన కూటమి మహాగuŠ‡బంధన్ 2014 ఎన్నికల్లో ఈ 14 యూపీ సీట్లలో పది చోట్ల ఎస్పీ, బీఎస్పీలు రెండో స్థానంలో నిలిచాయి. అనేక నియోజకవర్గాల్లో ఈ రెండు పార్టీల ఓట్లు కలిపితే అవి బీజేపీకి పడిన ఓట్లను మించిపోతాయి. ధౌరహ్రా, బారాబంకీ, ఫైజాబాద్, సీతాపూర్ స్థానాల్లో బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 14 సీట్లలో ఏడు స్థానాలను కైవసం చేసుకుంది. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో తల్లీ కొడుకుల స్థానాలే కాంగ్రెస్ పరువు నిలబెట్టాయి. లక్నోలో రాజ్‌నాథ్‌పై పోటీచేస్తున్నవారిలో శత్రుఘ్న సిన్హా భార్య పూనమ్ సిన్హా(ఎస్పీ) ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా హిందూ మతాచార్యుడు ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ పోటీచేస్తున్నారు. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై బహారాయిచ్(ఎస్సీ రిజర్వ్డ్) స్థానం నుంచి గెలిచిన సావిత్రీబాయి ఫూలే ఈసారి కాంగ్రెస్ తరఫున ఎన్నికల బరిలోకి దిగారు. బీజేపీ పాలనలో దళితులకు న్యాయం చేయడం లేదంటూ సావిత్రీబాయి బీజేపీ నాయకత్వాన్ని విమర్శించాక పార్టీకి దూరమయ్యారు. లక్నోలో రాజ్‌నాథ్‌కు పోటీయే లేదా? తొలి ప్రధాని నెహ్రూ చెల్లెలు విజయలక్ష్మీ పండిత్, కేంద్ర మాజీ మంత్రి షీలా కౌల్, బీజేపీ తొలి ప్రధాని ఏబీ వాజ్‌పేయి అనేకసార్లు లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం లక్నో. యూపీ మాజీ సీఎం, ప్రస్తుత కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రెండోసారి ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ తరఫున హిందూ పీఠాధిపతి(సంభల్ కల్కి మఠం) ప్రమోద్ కృష్ణం, ఎస్పీ–బీఎస్పీ కూటమి తరఫున పూనమ్ సిన్హా పోటీచేస్తున్నారు. అయితే, ఎస్పీ, కాంగ్రెస్ చివరి నిమిషంలో బయటి నుంచి అభ్యర్థులను ‘దిగుమతి’ చేసుకోవడాన్ని బట్టి చూస్తే రాజ్‌నాథ్‌కు సునాయాసంగా గెలిచే అవకాశం ఇస్తున్నట్టు భావించాలని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఠాకూర్ వర్గానికి చెందిన రాజ్‌నాథ్‌కు అన్ని వర్గాల మద్దతు ఉంది. నియోజకవర్గంలోని 19.6 లక్షల మంది ఓటర్లలో 4 లక్షల మంది కాయస్థులు, లక్ష మంది సింధీలు, నాలుగు లక్షల మంది బ్రాహ్మణులు, మూడు లక్షల మంది ఠాకూర్లు, నాలుగు లక్షల మంది ముస్లింలు ఉన్నారు. పూనమ్ సింధీ కావడం, ఆమె భర్త శత్రుఘ్న కాయస్థ కుటుంబంలో పుట్టిన కారణంగా ఈ వర్గాల ఓట్లన్నీ తమ అభ్యర్థికి పడతాయనే ఆశతో ఎస్పీ నేతలు ఉన్నారు. అమేఠీలో రాహుల్ అమేఠీ అవతరించినప్పటి నుంచీ జరిగిన 15 ఎన్నికల్లో 13 సార్లు కాంగ్రెస్ గెలిచింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఇద్దరు కొడుకులు, కోడలు, మనవడు విజయం సాధించిన కాంగ్రెస్ కంచుకోట ఇది. ఇందిర చిన్న కొడుకు సంజయ్‌గాంధీ 1977లో మొదటిసారి పోటీచేసి ఓడిపోయారు. 1980 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. మళ్లీ 1998లో బీజేపీ టికెట్‌పై పోటీచేసి అమేఠీ మాజీ సంస్థానాధీశుని కొడుకు సంజయ్‌సింగ్ తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి సతీష్‌శర్మను ఓడించారు. 2004 నుంచీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మూడుసార్లు అమేఠీ నుంచి ఎన్నికయ్యారు. 2014లో రాహుల్ చేతిలో ఓడిన బీజేపీ ప్రత్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మళ్లీ పోటీకి దిగారు. పాత ప్రత్యర్థుల మధ్యే 2019లో ఎన్నికల పోరు జరుగుతోంది. రాహుల్‌పై స్మృతి తొలిసారి పోటీచేసి ఓడినా ఆయన మెజారిటీని 3 లక్షల 70 వేల నుంచి లక్షా ఏడు వేలకు తగ్గించగలిగారు. రాజ్యసభ సభ్యురాలైన స్మృతి మళ్లీ అమేఠీ బరిలోకి దిగడంతో రాహుల్ ఎందుకైనా మంచిదని కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీచేస్తున్నారు. అమేఠీలో ఓటమి భయంతోనే రాహుల్ కాంగ్రెస్‌కు సురక్షితమైన రెండో సీటు నుంచి పోటీకి దిగారని ఆమె వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ కారణంగానే సంజయ్ ఓడిపోయారుగాని గాంధీ–నెహ్రూ కుటుంబ సభ్యులెవరూ నేడు అమేఠీలో ఓడిపోయే అవకాశం లేదని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ అభ్యర్థి తరఫున బీజేపీ అగ్రనేతలందరూ ప్రచారానికి వస్తున్నారు. బిహార్‌కు చెందిన ఎల్జేపీ నేత, కేంద్రమంత్రి రామ్‌విలాస్ పాస్వాన్ సైతం అమేఠీలో స్మృతికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. రాహుల్ చెల్లెలు ప్రియాంకా గాంధీ కూడా ఇక్కడ విస్తృతంగా పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొంటూ, గెలుపుపై తన అన్నకు అనుమానమే లేదనీ, వయనాడ్ ప్రజల కోరిక మేరకే అక్కడ నుంచి పోటీచేస్తున్నారని ధీమాగా చెప్పారు. రాయ్‌బరేలీలో సోనియా నాలుగోసారి పోటీ మామ ఫిరోజ్ గాంధీ, అత్త ఇందిర, ఇందిర మేనత్త షీలాకౌల్ వంటి హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ ఆరోసారి పోటీచేస్తున్నారు. ఆమెపై బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్‌సింగ్ పోటీకి దిగారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి ఆయన బీజేపీలోకి ఫిరాయించారు. అమేథీతోపాటు రాయ్‌బరేలీలో కూడా ఎస్పీ–బీఎస్పీ కూటమి అభ్యర్థిని నిలబెట్టలేదు. సోనియా తొలిసారి 1999లో అమేఠీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2004 నుంచి ఆమె రాయ్‌బరేలీకి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓ సాంకేతిక సమస్య కారణంగా సోనియా 2006లో రాజీనామా చేశాక మళ్లీ ఇక్కడ నుంచి పోటీచేసి గెలిచారు. కిందటి ఎన్నికల్లో ఆమె తన బీజేపీ ప్రత్యర్థి అజయ్ అగర్వాల్‌పై మూడున్నర లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2004లో దాదాపు రెండున్నర లక్షలు, 2006 ఉప ఎన్నికలో 4 లక్షల 17 వేలు, 2009లో 3 లక్షల 72 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో సోనియా తన ప్రత్యర్థులపై విజ యం సాధించారు. ప్రస్తుత బీజేపీ అభ్యర్థి దినేష్ప్రతాప్ సింగ్ 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో సోనియా తరఫున సహాయకునిగా పనిచేసి 2016లో ఎమ్మెల్సీ అయ్యారు. కిందటేడాది కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. సోనియా గెలుపుపై అనుమానాలు లేకున్నా ఈసారి గట్టి పోటీ ఉన్నట్టు కనిపిస్తోంది. కూతు రు ప్రియాంక కూడా తల్లి తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ధౌరహ్రాలో జితిన్ ప్రసాద మరో ప్రయత్నం! కాంగ్రెస్ దివంగత నేత జితేంద్ర ప్రసాద కొడుకు, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద(కాంగ్రెస్) రెండోసారి పోటీచేస్తున్న స్థానం ధౌరహ్రా. జితిన్ తండ్రి జితేంద్ర గతంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా, మాజీ ప్రధానులు రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహావులకు రాజకీయ సలహాదారుగా పనిచేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సోనియాగాంధీపై పోటీచేసి ఆయన ఓడిపోయారు. ఆయన వారసునిగా రాజకీయాల్లోకి వచ్చిన జితిన్ తొలిసారి 2004లో షాజహాన్‌పూర్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేసి ఎన్నికయ్యారు. 2008లో అవతరించిన ధౌరహ్రా నుంచి 2009లో గెలిచి 2011 నుంచి 2014 వరకూ మన్మోహన్సింగ్ కేబినెట్లో సహాయ మంత్రిగా పనిచేశారు. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో ఆయన రెండోసారి ఇదే సీటు నుంచి పోటీచేసి నాలుగో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి రేఖా వర్మ తన సమీప బీఎస్పీ ప్రత్యర్థి దావూద్ అహ్మద్‌ను లక్షా పాతిక వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. ఎస్పీ అభ్యర్థి కొన్ని వందల ఓట్ల తేడాతో మూడో స్థానంలో నిలిచారు. బీసీ కులమైన కుర్మీలు ఈ స్థానంలో అధిక సంఖ్యలో ఉన్నారు. ఈసారి ఎస్పీ, బీఎస్పీ కూటమి తరఫున అర్షద్ సిద్దిఖీ(బీఎస్పీ) పోటీచేస్తున్నారు. ఆయన తండ్రి ఇలియాస్ సిద్దిఖీ గతంలో రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఫైజాబాద్‌లో త్రిముఖ పోటీ ప్రాచీన నగరం అయోధ్య అంతర్భాగంగా ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో మరోసారి ప్రతిష్టాత్మక పోటీ జరుగుతోంది. బీజేపీ సిట్టింగ్ సభ్యుడు లల్లూ సింగ్, కాంగ్రెస్ మాజీ ఎంపీ నిర్మల్ ఖత్రీ, ఎస్పీ, బీఎస్పీ కూటమి అభ్యర్థి ఆనంద్‌సేన్ యాదవ్(ఎస్పీ) పోటీలో ఉన్నారు. 2014లో లల్లూ సింగ్ తన సమీప ప్రత్యర్థి మిత్రసేన్ యాదవ్‌ను 2 రెండు లక్షల 82 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. ఎస్పీ అభ్యర్థి ఆనంద్‌సేన్ తండ్రి మిత్రసేన్ మొదటిసారి 1989లో సీపీఐ టికెట్‌పైన, 1998లో ఎస్పీ తరఫున, 2004లో బీఎస్పీ టికెట్‌పై లోక్‌సభకు ఎన్నికయ్యారు. తండ్రీకొడుకులిద్దరికీ నేరమయ రాజకీయాలతో సంబంధాలున్నాయి. తండ్రి మాదిరిగానే ఆనంద్‌సేన్ కూడా బీఎస్పీలో ఉన్నారు. అసెంబ్లీకి ఎన్నికయ్యాక మాయావతి కేబినెట్లో మంత్రిగా కొన్ని రోజులు పనిచేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల్ ఖత్రీ కూడా గతంలో రెండుసార్లు కాంగ్రెస్ తరఫున ఫైజాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయోధ్య ప్రాంతంలో నిరుద్యోగం, పరిశ్రమల స్థాపన జరగకపోవడం ఈ ఎన్నికల్లో చర్చనీయాంశాలయ్యాయి. ప్రధాని పదవి చేపట్టాక నరేంద్రమోదీ తొలిసారి ఆయోధ్య ఎన్నిక ప్రచారానికి వచ్చినా రామజన్మభూమి వివాదంపై మాట్లాడలేదు. మహా కూటమి నేతలు మాయావతి, అఖిలేశ్ యాదవ్ కూడా ఆయోధ్యకు 70 కిలో మీటర్ల దూరంలో ఓ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. మోదీపై నియోజకవర్గ ప్రజలకు అభిమానం తగ్గలేదనీ, ఎంపీగా లల్లూ సింగ్ పనితీరును పట్టించుకోకుండా ప్రధానిపై మోజుతోనే బీజేపీకి ఓట్లేస్తారని ఫైజాబాద్ రాజకీయ విశ్లేషకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. బహరాయిచ్ కాంగ్రెస్ అభ్యర్థిగా బీజేపీ మాజీ నేత సావిత్రీబాయి ఫూలే పోటీచేయడంతో బహరాయిచ్ నియోజకవర్గం ఎన్నికపై ఆసక్తి పెరిగింది. షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్‌చేసిన ఈ స్థానం నుంచి 2014లో సాధ్వీ సావిత్రీబాయి ఫూలే బీజేపీ టికెట్‌పై పోటీచేసి తన సమీప ఎస్పీ ప్రత్యర్థి షబ్బీర్ అహ్మద్ వాల్మికీపై 95 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. యూపీ బీజేపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ హనుమంతుడి కులం గురించి మాట్లాడి సమాజాన్ని చీల్చివేస్తున్నారంటూ సావిత్రీబాయి కిందటి డిసెంబర్లో బీజేపీ నుంచి వైదొలిగారు. ఇటీవల ఆమె కాంగ్రెస్‌లో చేరగానే బహరాయిచ్ టికెట్ ఇచ్చారు. ఆమె స్థానంలో బీజేపీ టికెట్ అక్షర్‌వర్ లాల్‌కు లభించింది. మొదట బీఎస్పీలో ఉన్న సావిత్రీబాయి బౌద్ధమతాన్ని అనుసరిస్తూ ప్రజా సేవ ద్వారా గుర్తింపు పొందారు. తర్వాత బీజేపీలో చేరి 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై భారీ మెజారిటీతో గెలిచారు. అప్పటికే పేరు సంపాదించిన ఆమెకు కిందటి ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఎలాంటి ప్రయత్నం లేకుండానే దక్కింది. ఎస్సీ అభ్యర్థి షబ్బీర్ అహ్మద్ వాల్మీకీ రెండోసారి పోటీచేస్తున్నారు. ఎస్పీ కులమైన వాల్మికీ వర్గానికి చెందిన ఆయన పేరులోని మొదటి రెండు పదాల కారణంగా ఆయన హిందూ దళితుడు కాదనీ, ముస్లిం అని కొందరు కోర్టు కెక్కగా నడిచిన కేసులో ఆయన తాను హిందువునని నిరూపించుకున్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ కొత్త అభ్యర్థి తరఫున ప్రధాని మోదీ ఇప్పటికే ప్రచారం చేసి వెళ్లారు. త్రిముఖ పోటీలో బీజేపీ అభ్యర్థికి మొగ్గు ఉన్నట్టు కనిపిస్తోంది. పూనమ్ సిన్హా, దినేష్ ప్రతాప్‌సింగ్, అర్షద్ సిద్దిఖీ -
రంగులుమారే రాజకీయాలా? పారదర్శక పాలనా?
లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకవైపు, కాంగ్రెస్ సహా మిగిలిన పక్షాలన్నీ ఒకవైపుగా పోరు నడుస్తోంది. కానీ బిహార్ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ రాష్ట్రంలో ఫలితాలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తరచూ మిత్రుల్ని మార్చే రాజకీయాలకు ఒక రిఫరెండంగా భావిస్తున్నారు. సుపరిపాలనకు పెట్టింది పేరైన నితీశ్ గత ఆరేళ్లలో ప్రతీ ఎన్నికలకి కూటములు మారడం ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది ? ఒకప్పుడు బిహార్‌లో మోదీని అడుగు పెట్టనివ్వనన్న నితీశ్ ఇప్పుడు బీజేపీకి అధికారాన్ని అప్పజెప్పేందుకు చేస్తున్న కృషి ఫలితాన్నిస్తుందా ? సర్వత్రా ఇదే చర్చ నడుస్తోంది. తొలి నుంచీ రాజకీయాలూ, కులం కలగలిసి ఉన్న రాష్ట్రం బిహార్. ఇటు రాజకీయాల్లోనూ, అటు సామాజిక కోణంలోనూ మిగిలిన రాష్ట్రాలకు పూర్తి భిన్నత్వం గల బిహార్ ఎన్నికల్లో ఈ సారి రాజకీయానుభవం, ప్రజల మద్దతు కలిగిన ఆర్జేడీ నేత లాలూ లేకపోవడం కూడా ప్రత్యేకమే. ఓ పక్క అపర రాజకీయ దురంధరుడూ, చమత్కారీ లేని లోటుతో పాటు, రాష్ట్ర సీఎం, జేడీ(యూ) అధ్యక్షుడు నితీశ్ కుమార్‌పై బీజేపీ పూర్తిగా నమ్మకం ఉంచడం మరో ప్రత్యేకత. ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీ(యూ) చేతులు కలిపి చెరో 17 సీట్ల నుంచి పోటీ పడుతున్నారు. శత్రువులు మిత్రులైన వేళ భారతీయ జనతా పార్టీ 2013లో అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడాన్ని నితీశ్‌కుమార్ జీర్ణించుకోలేకపోయారు. ఏనాటిౖకైనా ప్రధాన మంత్రి కావాలని కలలు కన్న ఆయన బీజేపీతో 17ఏళ్ల బంధాన్ని తెంపేసుకున్నారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చి మోదీపై విమర్శల దాడిచేశారు. ఆయనను బిహార్ గడ్డపై అడుగుపెట్టనివ్వనని ప్రతినబూనారు. మాటల గారడీ చేస్తారంటూ విమర్శించారు. మోదీ కూడా మోసం చేయడం నితీశ్ డీఎన్ఏలోనే ఉందని ఎదురుదాడి చేశారు. గత ఎన్నికల సమయంలో ఇద్దరు నేతలు ఒకరినొకరు తీవ్రంగా నిందించుకున్నారు. కానీ మోదీ హవా ముందు నితీశ్ నిలబడలేకపోయారు. నితీశ్ పార్టీ కేవలం రెండు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకప్పుడు శత్రువుగా చూసిన లాలూ ప్రసాద్ యాదవ్‌తో చేతులు కలిపి నెగ్గారు. సీఎం పదవిని కూడా అందుకున్నారు. మళ్లీ నాలుగేళ్లు తిరిగిందో లేదో లాలూకి హ్యాండిచ్చి తిరిగి బద్ధశత్రువులా చూసిన మోదీతో చేతులు కలిపారు. మోదీ అధికారంలోకి వస్తేనే దేశం భద్రంగా ఉంటుందని, బిహార్ సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. నితీష్ మోదీ మ్యాజిక్ పనిచేస్తుందా ? నితీశ్ ఎంత పరిపాలనాదక్షుడైనప్పటికీ ఇలా కూటములు మారడం వల్ల భారీ మూల్యం చెల్లించుకుంటారని అంటున్నారు హిందూస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్) చీఫ్ జితన్ రామ్ మాంఝీ ‘‘బహుశా ఇదే నితీశ్‌కి ఆఖరి ఎన్నికలు. అధికారంలో కొనసాగడానికి ఆయన ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారు‘‘అని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ కంటే జేడీ(యూ)కి తక్కువ సీట్లు వచ్చాయని, లాలూ కుమారుడు ఎక్కడ సీఎం అవుతారోనని లోలోపల ఆయనకి భయం ఉందని ఆరోపించారు. కొందరు రాజకీయ విశ్లేషకులు కూడా నితీష్ గోడదూకుడు రాజకీయాలను తప్పుపడుతున్నారు. ‘‘నితీష్ కుమార్లో ఈ మార్పు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అన్నిటికన్నా ముఖ్యంగా నితీ‹Ô నోటి వెంట మోదీ జపం విస్మయానికి గురిచేస్తోంది’’అని సీమాంచల్, కోశి ప్రాంతంలో వరద బాధితుల సమస్యలపై పనిచేస్తోన్న మహేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. మరోవైపు జేడీ (యూ) ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి నితీశ్, మోదీ కాంబినేషన్‌కి తిరుగులేదని అభిప్రాయపడ్డారు. ‘‘మా రెండు పార్టీల మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది. లెక్కలు కూడా పక్కాగా వేశాం.గత ఎన్నికల్లో బీజేపీ, జేడీ(యూ), ఎల్జేపీ ఓటు షేర్ని బట్టి అంచనాలు వేసుకుంటే ఈ సారి మా కూటమి 40కి 38 సీట్లు గెలుచుకుంటుంది‘‘అని ధీమా వ్యక్తం చేశారు. ఇక బీజేపీ నేతలు కూడా ఈ ఎన్నికలు మోదీ, నితీశ్ పరిపాలనకు రిఫరెండంగానే భావిస్తున్నారు. ‘‘ఎన్డీయేకి నితీ‹శ్ కుమారే ప్రధానమనీ, ఇప్పటికీ నితీశ్ బ్రాండ్ ఇక్కడ పనిచేస్తోందనీ జేడీయూ నాయకుడు నీరజ్ కుమార్ అంటున్నారు. మహిళా ఓటర్లే నితీశ్‌కి అండదండ ! బిహార్‌లో ఇప్పటివరకు 14 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం గయ మినహా మిగతా అన్ని చోట్లా పురుషుల కంటే మహిళలే ఎక్కువగా వచ్చి ఓట్లు వేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి బాగా మెరుగు పడడం, అమల్లో లోపాలు ఉన్నప్పటికీ మద్యపానంపై నిషేధం విధించడంతో మహిళలంతా నితీశ్‌వైపే ఉంటారని అంచనాలున్నాయి. ‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉన్న వ్యక్తిగత కరిష్మాతో నితీశ్‌కుమార్‌కి ఉన్న క్లీన్ ఇమేజ్ తోడుకావడంతో వెనుకబడిన కులాలన్నీ ఎన్డీయేకే మద్దతు పలుకుతున్నాయి. అందుకే మహిళలంతా కులాలకు అతీతంగా ఈ సారి మోదీ, నితీశ్ ద్వయానికే ఓట్లు వేసినట్టుగా అంచనాలున్నాయి. మరోసారి రాష్ట్రంలో ఎన్డీయే స్వీప్‌చేయడం ఖాయం‘‘అని రాజకీయ విశ్లేషకులు డాక్టర్ సైబాల్ గుప్తా అభిప్రాయపడ్డారు. మహాగఠ్‌బంధన్‌కి పరిస్థితులు అనుకూలంగా లేవా ? ఈ సారి ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్‌కి పరిస్థితులు ఏమంత అనుకూలంగా కనిపించడం లేదు. సీట్ల పంపకం ఆ కూటమిలో సంక్షోభాన్నే నింపింది. కూటమిలో ఆర్ఎస్ఎల్పీ, హెచ్ఏఎం వంటి చిన్నా చితకా పార్టీలు సంతృప్తిగా ఉన్నప్పటికీ కాంగ్రెస్, ఆర్జేడీ కత్తులు దూసుకున్నాయి. చివరికి ఎలాగోలా సర్దుబాటు చేసుకున్నాయి. ఆర్జేడీ 20 స్థానాల్లో పోటీ చేస్తుంటే, క్షేత్రస్థాయిలో ఏ మాత్రం బలం లేని కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది సీట్లు కట్టబెట్టింది. మిగిలిన 11 సీట్లు చిన్నపార్టీలు పంచుకున్నాయి. ఇవన్నీ మహాగఠ్‌బంధన్ కొంప ముంచుతాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. -
కాంగ్రెస్‌కు ఇదొక్కటే చాన్స్
ఏడు దశల సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్లో ఇంకో అంకానికి రంగం సిద్ధమైంది. లోక్‌సభలోని మొత్తం 543 స్థానాలకుగాను తొలి మూడు దశల్లో 302 స్థానాల ఎన్నికలు పూర్తికాగా.. నాలుగోదశలో భాగంగా మరో 71 స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. తొలి దశ పోలింగ్ ప్రాంతీయ పార్టీలకు అనుకూలంగా ఉంటే.. రెండు, మూడోదశలు ఎన్డీయేకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగో దశ పోలింగ్ జరగనున్న కేంద్రాలను విశ్లేషిస్తే.. రాజకీయంగా కాంగ్రెస్‌కు కొద్దోగొప్పో ఉపయోగపడేలా కనిపిస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా ఎక్కువ స్థానాలు సంపాదించుకునే ఈ దశను విశ్లేషిస్తే.... మహారాష్ట్ర.... రాజధాని ముంబైలోని ఆరు లోక్‌సభ స్థానాలతోపాటు మొత్తం 17 స్థానాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో బీజేపీ– శివసేన ఈ పదిహేడు స్థానాల్లో 14 గెలుచుకుంది. కాంగ్రెస్–ఎన్సీపీలకు ఒక్కటీ దక్కలేదు. గత ఐదేళ్లలో బీజేపీ – శివసేనల సంబంధాలు తరచూ మారిపోయిన సంగతి తెలిసిందే. 2014లో జరిగిన అసెంబ్లీలో ఒంటరిగా పోటీ చేసిన శివసేన ఆ తరువాతి కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వైదొలగింది. కానీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మళ్లీ పొత్తు కుదుర్చుకుని ఉమ్మడిగా పోటీకి దిగారు. కాంగ్రెస్ –ఎన్సీపీలు కూడా సీట్ల సర్దుబాటులో విలువైన సమయాన్ని వృథా చేయడంతో ఎన్నికల సన్నాహాలకు ప్రచార వ్యూహాలను సిద్ధం చేసుకునేందుకు సమయం లేకుండా పోయింది. ఎన్నికల సమయంలో మాజీ కేంద్ర మంత్రి మురళీ దేవరా కుమారుడు మిలింద్ దేవరాను ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయడం ఆ పార్టీలో పరిస్థితులు ఏమంత గొప్పగా లేవన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే, మిలింద్ కూటమికి పరీక్ష... మహారాష్ట్రలో బీజేపీ – శివసేన కూటమికి రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) రూపంలో ఓ పరీక్ష ఎదురవుతోంది. శివసేన వ్యవస్థా పకుడైన బాలాసాహెబ్ ఠాక్రే తమ్ముడి కుమారుడైన రాజ్‌ఠాక్రే బీజేపీ – శివసేనలను బహిరంగంగానే విమర్శిస్తున్న నేపథ్యంలో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. ఎంఎన్ఎస్ స్వయంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అలాగని కాంగ్రెస్ – ఎన్సీపీలతో పొత్తు కూడా పెట్టుకోలేదు. కానీ.. పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే మాత్రం ప్రచార సభలు నిర్వహిస్తూ హిందుత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రసంగాలు గుప్పిస్తున్నారు. ఈ సభలకు మంచి ఆదరణ లభిస్తూండటం ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సారి ఎన్నికల్లో మహారాష్ట్రలోని అత్యంత కీలక నియోజకవర్గాల్లోముంబై సౌత్ ఒకటని చెప్పుకోవాలి. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మిలింద్ దేవరా పోటీ చేస్తున్నారిక్కడ. 2004, 2009లలో ఈ స్థానం నుంచే గెలుపొందిన మిలింద్ 2014 ఎన్నికల్లో మాత్రం అరవింద్ సావంత్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యంత ధనికుడిగా పేరొందిన ముఖేష్ అంబానీ మద్దతుతో పోటీ చేస్తున్న మిలింద్ దేవరా ఎంత మేరకు విజయవంతమవుతారో వేచి చూడాల్సిందే. ఇక ముంబై నార్త్ నుంచి సినీనటి ఊర్మిళా మటోండ్కర్ బీజేపీ ఎంపీ గోపాల్ షెట్టిల మధ్య ఆసక్తికరమైన పోరు నెలకొని ఉంది. ముంబై నార్త్–వెస్ట్‌లో ప్రదేశ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్, శివసేన ఎంపీ గజానన్ చంద్రకాంత్ కీర్తికర్, ముంబై నార్త్ –సెంట్రల్లో ప్రియాదత్ (కాంగ్రెస్), సిట్టింగ్ ఎంపీ పూనమ్ మహాజన్ (బీజేపీ)ల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఈ స్థానం నుంచి ప్రియాదత్ 2009లో గెలుపొందగా.. పూనమ్ 2014లో గెలుపొందారు. రాజస్థాన్... ఈ దఫా ఎన్నికల్లో బీజేపీకి అత్యంత ముఖ్యమైన రాష్ట్రాల్లో ఒకటైన రాజస్థాన్‌లో పరిస్థితులు అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన బీజేపీ రాష్ట్రంలోని మొత్తం 25 స్థానాల్లోనూ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే 2014 తరువాత అక్కడి పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. బీజేపీ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. మొత్తం 200 అసెంబ్లీ స్థానాల్లో వంద గెలుచుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. బీజేపీ 73 స్థానాలకే పరిమితమైంది.2013 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఏడు శాతం ఓట్లు కోల్పోగా కాంగ్రెస్ అంతమేరకు లాభపడింది. పద్మావత్ సినిమా వివాదం రాజ్çపుత్లలో బీజేపీపై వ్యతిరేకతకు కారణం కాగా.. జైపూర్‌లోని రాజ్ మహల్ ప్రధాన ద్వారాన్ని మూసివేయడం, భరత్పూర్ –ధోపూర్ ప్రాంతంలోని జాట్ సామాజిక వర్గం రిజర్వేషన్లు వంటి అంశాలన్నీ వసుంధర రాజే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశాయని అంచనా. ఏప్రిల్ 29న పోలింగ్ జరుపుకునే స్థానాల్లో రాష్ట్రం పశ్చిమ ప్రాంతంలోని పాలి, జోధ్‌పూర్, బర్మార్, జాలోర్లతోపాటు దక్షిణ ప్రాంతంలోని ఉదయ్‌పూర్, బాన్స్వారా, చిత్తోర్ఘర్, రాజ్‌సమంద్, భిల్వారాలు, హరోతీ ప్రాంతంలోని కోట, జల్వార్ –బరోన్లు, మధ్య రాజస్థాన్‌లోని అజ్మీర్, మత్సయ్ ప్రాంతంలోని టోంక్–సవాయి మాధోపూర్లు ఉన్నాయి. నిరుద్యోగం.. వ్యవసాయ సంక్షోభం వంటి సమస్యలు ఈ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు. బీజేపీ జాతీయ వాదం, భద్రత, బాలాకోట్ దాడులు వంటి అంశాలతో ప్రచారం నిర్వహిస్తోంది. అధికార కాంగ్రెస్ రైతులకు తాము అందించిన పాక్షిక రుణమాఫీ, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేయడం వంటి అంశాలను తమ విజయాలుగా ఓటర్లకు వివరిస్తోంది. న్యాయ్ పథకం ద్వారా కనీస ఆదాయ పథకం లబ్ధిని నేరుగా జన్‌ధన్ యోజన అకౌంట్లలోకి వేస్తామన్న రాహుల్ గాంధీ హామీ కూడా కాంగ్రెస్‌కు మేలు చేయవచ్చు. వీటికి తోడు రాష్ట్రంలోని పన్నెండు మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌కే మద్దతివ్వడంతో లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామన్న ఆశాభావంతో ఉంది ఆ పార్టీ. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ కుమారుడు వైభవ్ గెహ్లోట్‌కు, బీజేపీకి చెందిన జి.ఎస్.షెఖావత్ల మధ్య జోధ్‌పూర్ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న పోటీ అందరి దృష్టిని ఆకర్శిçస్తుం డగా బర్మార్‌లో కాంగ్రెస్ టిక్కెట్‌పై బీజేపీ దిగ్గజ నేత జశ్వంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర సింగ్ పోటీ చేస్తూండటం ఆసక్తికరంగా మారింది. చిత్తోర్‌ఘర్‌లో బీజేపీ సిట్టింగ్ ఎంపీ సీపీ జోషీ కాంగ్రెస్‌కు చెందిన గోపాల్ సింగ్ ఐద్వాపై పోటీ చేస్తున్నారు. మొత్తమ్మీద రాజస్థాన్‌లో రాజకీయ వాతావరణం కాంగ్రెస్‌కు కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ అంతర్గత కుమ్ములాటలు, రైతు రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోవడం వంటి అంశాలు ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. మానవేంద్ర సింగ్, వైభవ్, సి.పి.జోషి మహాఘట్‌బంధన్‌తో బీజేపీకి నష్టం? మొత్తం పదమూడు స్థానాలకుగాను సోమవారం పోలింగ్ జరగనుంది. సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, ఆర్ఎల్డీలతో కూడిన మహాఘట్బంధన్ కారణంగా బీజేపీకి కొన్ని స్థానాలు తగ్గే అవకాశాలు ఎక్కువ. అయితే ఇందుకు కూటమిలోని పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగాల్సిన అవసరం ఉంది. అవధ్ ప్రాంతంలోని ఖేరీ, హర్దోయి (ఎస్సీ), మిస్రిక్ (ఎస్సీ), దోయాబ్ ప్రాంతంలోని ఉన్నావ్, ఫరుక్కాబాద్, ఇటావా (ఎస్సీ), కనౌజ్, కాన్పూర్, అక్బర్పూర్, బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని జలౌన్ (ఎస్సీ), ఝాన్సీ, హమీర్పూర్, రుహేల్‌ఖండ్ ప్రాంతంలోని షాజహాన్‌పూర్‌లలో గత ఎన్నికలల్లో బీజేపీ ఏకంగా 12 స్థానాలు గెలుచుకోగా, అతిస్వల్ప మార్జిన్‌తో కనౌజ్ స్థానాన్ని సమాజ్‌వాదీ పార్టీ గెలుచుకోగలిగింది. తాజా ఎన్నికల్లోనూ కనౌజ్లో ఆసక్తికరమైన పోటీ నెలకొని ఉంది. సమాజ్‌వాదీ పార్టీ తరఫున డింపుల్‌యాదవ్ బరిలో ఉండగా బీజేపీ సుభ్రత్పాఠక్ను నిలబెట్టింది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పోటీ చేయడం లేదు. ఇక కాన్పూర్ విషయానికొస్తే.. సిట్టింగ్ ఎంపీ, బీజేపీ దిగ్గజ నేత మురళీమనోహర్ జోషీ స్థానంలో సత్యదేవ్ పచౌరికి టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి శ్రీ ప్రకాశ్ జైస్వాల్, శ్రీ రామ్‌కుమార్ సమాజ్‌వాదీ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలకెక్కే బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ పోటీ చేస్తున్న ఉన్నావ్‌లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున అరుణ్ కుమార్ శుక్లా, కాంగ్రెస్ నుంచి అను టాండన్‌లు బరిలో ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీ కంచుకోట ఇటావాలో బీజేపీ రమాశంకర్ కథారియాతో గెలుపుకోసం ప్రయత్నిస్తూండగా సిట్టింగ్ ఎంపీ అశోక్ కుమార్ దొహారే పార్టీని వీడి కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి కమలేశ్ కథారియా బరిలో ఉన్నారు. ఝాన్సీలో సిట్టింగ్ ఎంపీ స్థానంలో బీజేపీ అనురాగ్ శర్మను బరిలోకి దింపగా శివ శరణ్ కుష్వహా (కాంగ్రెస్), శ్యామ్ సుందర్ సింగ్ యాదవ్ (ఎస్పీ)ల రూపంలో ఇక్కడ ముక్కోణపు పోటీ జరగనుంది. డింపుల్, సాక్షి మహరాజ్, సత్యదేవ్ బెంగాల్లో హోరాహోరీ... తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటలో కమల వికాసానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయా? అన్నది కౌంటింగ్ తరువాతే తెలుస్తుందిగానీ ఈ సారి పోరు మాత్రం హోరాహోరీగానే సాగుతోంది. గత ఎన్నికల్లో టీఎంసీ ఆరు స్థానాలు గెలుచుకున్న లోక్‌సభ స్థానాలతోపాటు బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్కో స్థానం గెలుచుకున్న వాటికి సోమవారం పోలింగ్ జరగనుంది. వీటిల్లో బర్హమ్‌పూర్, కృష్ణనగర్, రానాఘాట్లతోపాటు బర్దమాన్ పుర్బా, దుర్గాపూర్, అసన్సోల్, బీర్బమ్, బర్దమాన్లు ఉన్నాయి. బహరంపూర్‌లో పోటీ ప్రధానంగా సిట్టింగ్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ (కాంగ్రెస్), అపూర్వా సర్కార్ (టీఎంసీ), కృష్ణ జౌర్దార్ ఆర్య (బీజేపీ)ల మధ్యనే ఉంది. రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ తరఫున ఈద్ మహమ్మద్ కూడా బరిలో ఉన్నారు. టీఎంసీ కృష్ణ నగర్ స్థానానికి సిట్టింగ్ ఎంపీ తపస్ పాల్ ను కాదని మహువా మొయిత్రాను బరిలోకి నిలపగా కల్యాణ్ చౌబే (బీజేపీ), శంతనూ ఝా (సీపీఎం)లు ఆమెకు ప్రత్యర్థులుగా ఉన్నారు. అసన్సోల్ విషయానికొస్తే.. ఇక్కడ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో (బీజేపీ)కి పోటీగా సినీనటి మూన్‌మూన్ సేన్(టీఎంసీ), గౌరాంగ్ ఛటర్జీ (సీపీఎం)లు ఉన్నారు. బీర్బమ్లో టీఎంసీ, సీపీఎం, కాంగ్రెస్, బీజేపీల మధ్య బహుముఖ పోటీ ఉంది. అధిర్ రంజన్, మూన్‌మూన్ సేన్, బాబుల్ సుప్రియో మధ్యప్రదేశ్‌లో మళ్లీ మోదీ హవా వచ్చేనా? మోడీ హవా కారణంగా బీజేపీ బాగా లాభపడ్డ రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ కూడా ఒక్కటి. ఈ సార్వత్రిక ఎన్నికల నాలుగోదశలో మధ్యప్రదేశ్‌లోని ఆరు స్థానాలకు పోలింగ్ జరగనుంది. వింధ్యప్రదేశ్ ప్రాంతంలోని సిధి, షాదోల్లతోపాటు మహాకోశల్ ప్రాంతంలోని జబల్పూర్, మండ్ల, బాలాఘాట్, ఛింద్వారాలను గత ఎన్నికల్లో బీజేపీ గెలుచుకుంది. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలై, కాంగ్రెస్ అధికారం చేపట్టిన నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మాండసోర్‌లో రైతులపై కాల్పులు, వ్యవసాయ సంక్షోభాన్ని అరికట్టడంలో విఫలమవడం వంటి అంశాలు బీజేపీకి ప్రతికూలంగా మారితే.. రుణమాఫీ, గో సంరక్షణకు సమగ్ర పథకం వంటి అంశాలు ఓటర్లు కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. రాష్ట్రస్థాయిలో ఎస్పీ, బీఎస్పీ, గోండ్వానా గణతంత్ర పార్టీలు పొత్తు పెట్టుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా త్రిముఖ పోటీ ఏర్పడింది. ముఖ్యమంత్రి కమల్‌నాథ్ 1980 నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఛింద్వారా లోక్‌సభ నియోజకవర్గంలో ఈ సారి కాంగ్రెస్ తరఫున నకుల్ నాథ్ పోటీ చేస్తూండగా.. బీజేపీ నుంచి నాథన్ షా, జ్ఞానేశ్వర్ గజ్భియే (బీఎస్పీ)లు పోటీలో ఉన్నారు. నఖుల్ నాథ్, నాథన్ షా, జ్ఞానేశ్వర్ ఒడిశాలో పోలింగ్ పూర్తి.. ఏప్రిల్ 29 వతేదీతో ఒడిశాలోని అన్ని లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ పూర్తవుతుంది. మిగిలిన మయూర్భంజ్ (ఎస్టీ), బాలాసోర్ (ఎస్సీ), భద్రక్ (ఎస్సీ), జజ్పూర్ (ఎస్సీ), కేంద్రపారా, జగత్సింగ్పూర్ (ఎస్సీ) స్థానాలు గత ఎన్నికల్లో బీజేడీ గెలుచుకున్నవే. అయితే ఈ సారి బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. 1998 నుంచి బీజేడీని గెలిపిస్తూ వచ్చిన కేంద్రపారాలో ఈసారి ఇటీవలే బీజేడీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి వైజయంత్ జై పాండా పోటీ చేస్తూండగా.. ఆయన ప్రత్యర్థిగా బీజేడీ తరఫున సినీనటుడు అనుభవ్ మహంతి ఉన్నారు. బీజేడీని గెలిపించేందుకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అనుభవ్, వైజయంత్ కన్హయ్య కుమార్‌కు కఠిన పరీక్ష... బిహార్‌లో నాలుగోదశలో భాగంగా ఐదు స్థానాలకు పోలింగ్ జరగనుంది. జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ పోటీ చేస్తున్న బేగూసరాయితోపాటు దర్భంగ, ఉజిర్‌పూర్, సమస్ఠిపూర్, ముంగేర్‌లలో ఈ పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో ఈ స్థానాల్లో మూడింటిని బీజేపీ, రెండింటిని ఎల్జేఎన్ఎస్పీ గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న నియోజకవర్గం బేగూసరాయి అనడంలో సందేహం ఏమీ లేదు. ఒకప్పుడు వామపక్ష పార్టీలకు మద్దతిచ్చిన బేగూసరాయిలో ఈ సారి సీపీఐ తరఫున కన్హయ్య కుమార్ పోటీ చేస్తున్నారు. బీజేపీ మాజీ మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రధాన ప్రత్యర్థిగా ఉండగా.. ఆర్జేడీకి చెందిన తన్వీర్ హసన్ కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్హయ్య కుమార్‌కు వామపక్ష నేతలతోపాటు ప్రకాశ్‌రాజ్, షబానా ఆజ్మీ, జావేద్ అక్తర్, స్వరా భాస్కర్ వంటి సినీ ప్రముఖుల మద్దతు లభిస్తుండగా ఆర్జేడీ అభ్యర్థి తన్వీర్ హసన్‌కు బలమైన కేడర్ ఉండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఇవే కాకుండా జార్ఖండ్‌లో ఛత్రా, లోహార్డాగా (ఎస్టీ), పలమావు (ఎస్సీ) లోకసభ స్థానాల్లో రెండింటిని గత ఎన్నికల్లో బీజేపీ గెలుచుకున్నప్పటికీ ఈ సారి అక్కడ గట్టిపోటీ ఎదుర్కొంటోంది. కాంగ్రెస్, జేవీఎం(పీ), జేఎంఎం, ఆర్జేడీల కూటమి బీజేపీని నిలువరించే ప్రయత్నం చేస్తోంది. ఏతావాతా.. తొలి మూడు దశల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు సంపాదించుకునే అవకాశం లేకపోయిన కాంగ్రెస్ ఈ దశలో మాత్రం కొంచెం లాభపడనుందని చెప్పాలి. 2014లో ఈ స్థానాల్లో కేవలం రెండింటిని మాత్రమే కాంగ్రెస్ గెలుచుకోగా.. ఈ సారి మాత్రం సీట్ల సంఖ్య రెండు అంకెల్లో ఉండవచ్చునని అంచనా. కన్హయ్య, గిరిరాజ్ సింగ్, తన్వీర్ హసన్ ప్రవీణ్ రాయ్, రాజకీయ విశ్లేషకులు, సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, ఢిల్లీ. ద్వైపాయన్ సన్యాల్, ఫ్రీలాన్స్ పొలిటికల్ ఎకనమిస్ట్, నోయిడా, ఉత్తర ప్రదేశ్. -
ఉద్దండుల కర్మభూమి కనౌజ్
లోక్‌సభ ఎన్నికల నాలుగో దశలో పోలింగ్ జరిగే ఉత్తరప్రదేశ్‌లోని 13 నియోజకవర్గాల్లో ఆసక్తికర పోటీ జరుగుతోంది. అవధ్ ప్రాంతంలోని ఐదు సీట్లు(ఉన్నావ్, హర్దోయ్, కాన్పూర్, ఖేరీ, మిస్రిక్), బుందేల్‌ఖండ్‌లోని మూడు స్థానాల్లో(జాలోన్, ఝాన్సీ, హమీర్పూర్) పాలకపక్షమైన బీజేపీకి బీఎస్పీ, ఆరెల్డీతో కూడిన మహాకూటమి మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఈ నియోజకవర్గాలతోపాటు షాజహాన్‌పూర్, ఫరూఖాబాద్, ఇటావా, కనౌజ్, అక్బర్పూర్లో ఈ నెల 29న పోలింగ్ జరుగుతుంది. రాజకీయ ప్రాధాన్యం ఉన్న కనౌజ్లో ఎస్పీ స్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ కోడలు డింపుల్ మరోసారి పోటీలో ఉండగా, ఉన్నావ్‌లో బీజేపీకి చెందిన వివాదాస్పద ఎంపీ సాక్షీ మహారాజ్ మళ్లీ బరిలోకి దిగారు. ఫరూఖాబాద్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కిందటి ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్లీ పోటీచేస్తున్నారు. కాన్పూర్‌లో 2014 ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ మాజీ అధ్యక్షుడు మురళీమనోహర్ జోషీ స్థానంలో సత్యదేవ్ పచౌరీని ఆ పార్టీ రంగంలోకి దింపింది. యూపీలోని మొత్తం 80 సీట్లలో మిగిలిన సీట్లలో మాదిరిగానే ఈ నెల 29న పోలింగ్ జరిగే ఈ 13 స్థానాల్లో మహాగuŠ‡బంధన్ సగం వరకూ గెలుచుకునే అవకాశాలున్నాయని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. త్రిముఖ పోటీలు జరిగే అనేక సీట్లలో బీజేపీ గెలుపు కాంగ్రెస్ చీల్చుకునే ఓట్లపైనే ఆధారపడి ఉందని భావిస్తున్నారు. మొదటి రెండు దశల్లో పోలింగ్ జరిగిన పశ్చిమ యూపీ, దాని పరిసర ప్రాంతాల నియోజకవర్గాల్లో ఎస్పీ, బీఎస్పీ మధ్య ఓట్ల బదిలీ సంతృప్తికర స్థాయిలోనే జరిగిందనే వార్తల నేపథ్యంలో రెండు పార్టీలు ఎన్నికల్లో బాగానే కలిసి పనిచేస్తున్నాయి. ములాయం పోటీచేస్తున్న మైన్‌పురీలో ఆయనతోపాటు బీఎస్పీ నాయకురాలు మాయావతి ఒకే వేదిక నుంచి ప్రసంగించడం, ఆమెకు ములాయం, మాజీ సీఎం అఖిలేశ్ ఇస్తున్న గౌరవ మర్యాదలు రెండు పార్టీల కార్యకర్తలు, మద్దతుదారులు బీజేపీకి వ్యతిరేకంగా కూటమి అభ్యర్థుల గెలుపునకు గట్టిగా కృషిచేయడానికి దారితీసింది. వరుసగా దళితులు, బీసీలకు ప్రాతినిధ్యం వహించే ఈ రెండు పక్షాల మధ్య పొత్తు క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలిస్తోందని పోలింగ్ సరళిని బట్టి అంచనావేస్తున్నారు. ఇదే పరిస్థితి అన్ని ప్రాంతాల్లో కొనసాగితే నాలుగో దశలో పోలింగ్ జరిగే అవధ్, బుందేల్‌ఖండ్ ప్రాంతాల్లో కూడా ఎస్పీ, బీఎస్పీ మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. డింపుల్ యాదవ్, సల్మాన్ ఖుర్షీద్, సత్యదేవ్ పచౌరీ, సాక్షీ మహారాజ్, అనూ టండన్ ఉద్దండుల కర్మభూమి కనౌజ్ మాజీ సీఎం అఖిలేశ్ భార్య, ప్రస్తుత ఎంపీ డింపుల్ యాదవ్ మూడోసారి కనౌజ్ నుంచి పోటీచేస్తున్నారు. 1998 నుంచీ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి కంచుకోట కనౌజ్ నియోజకవర్గం. ములాయం ఈ స్థానం నుంచి మూడు సార్లు గెలుపొందారు. 1967లో సోషలిస్ట్ నేత రాంమనోహర్ లోహియా గెలుపొందగా, 1984లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కేంద్ర మంత్రి అయ్యారు. 2009లో కనౌజ్‌తోపాటు ఫిరోజాబాద్ నుంచి కూడా పోటీచేసి గెలిచిన అఖిలేశ్ ఫిరోజాబాద్ స్థానానికి రాజీనామా చేశారు. దాంతో ఈ సీటుకు జరిగిన ఉప ఎన్నికలో ఎస్పీ తరఫున డింపుల్ పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి, బాలీవుడ్ నటుడు రాజ్‌బబ్బర్ చేతిలో ఓడిపోయారు. 2012లో అఖిలేశ్ యూపీ సీఎం పదవి చేపట్టాక కనౌజ్ సీటుకు జరిగిన ఉప ఎన్నికలో డింపుల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మళ్లీ 2014లో ఆమె తన సమీప అభ్యర్థి సుబ్రత్ పాఠక్‌పై 19 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. బీఎస్పీ అభ్యర్థి నిర్మల్ తివారీకి లక్షా 27 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఎస్పీకి బీఎస్పీ మద్దతు ఇవ్వడంతో డింపుల్ విజయం ఖాయమన్న ధీమాతో ఉన్నారు. కిందటిసారి ఓడిపోయిన సుబ్రత్ పాఠక్ మరోసారి బీజేపీ టికెట్‌పై పోటీచేస్తుండడంతో డింపుల్‌కు గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. యాదవులతోపాటు గణనీయ సంఖ్యలో ఉన్న బ్రాహ్మణుల ఓట్లు ఈ వర్గానికి చెందిన పాఠక్‌కే పడితే డింపుల్‌కు గట్టి పోటీ తప్పదు. నామినేషన్ రోజు డింపుల్ ఊరేగింపులో పాల్గొన్న ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ మద్దతుదారుల సంఖ్యను బట్టి ఆమె విజయం సునాయాసమని మహా కూటమి అంచనావేస్తోంది. సాక్షీ మహారాజ్‌కు సాటి ఎవరు? ముస్లింలు, బీజేపీ వ్యతిరేకులపై దూకుడుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సిట్టింగ్ సభ్యుడు సాక్షీ మహారాజ్ (డా.సచ్చిదానంద్ హరి సాక్షి)కు ఆలస్యంగా ఉన్నావ్‌లో పోటీకి మరోసారి బీజేపీ టికెట్ లభించింది. 63 ఏళ్ల ఈ హిందూ సన్యాసి 2014లో ఉన్నావ్ స్థానంలో తన సమీప ఎస్పీ అభ్యర్థి అరుణ్శంకర్ శుక్లాపై 3 లక్షల పది వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీఎస్పీ అభ్యర్థి బ్రజేష్ పాఠక్‌కు రెండు లక్షలకు పైగా ఓట్లు దక్కాయి. 2009లో ఇక్కడ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థి అన్నూ టండన్ లక్షా 97 వేల ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి సాక్షి మహారాజ్ బీసీ వర్గానికి చెందిన లోధా కులానికి చెందిన నేత. 1991లో మథుర నుంచి, 1996, 98లో ఫరూఖాబాద్ నుంచి ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో ఉన్న ఉన్నావ్‌లో కింద టిసారి ఎస్పీ, బీఎస్పీ అభ్యర్థులిద్దరూ ఈ వర్గం వారే. అయితే, ఈ వర్గం ప్రజలు యూపీలో కాషాయపక్షం వైపు మొగ్గు చూపడంతో సాక్షి గెలుపు సాధ్యమైంది. ఈసారి కూడా ఎస్పీ, కాంగ్రెస్ తరఫున అరుణ్శంకర్ శుక్లా, అనూ టండన్ పోటీకి దిగారు. పొత్తులో భాగంగా బీఎస్పీ పోటీలో లేదు. 1999 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఏ పార్టీ వరుసగా రెండు సార్లు ఉన్నావ్‌లో గెలవలేదు. మహా కూటమి అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న సాక్షి ఈ ఆనవాయితీ నిజమైతే గెలవడం కష్టమే. ఫరూఖాబాద్‌లో సల్మాన్ ఖుర్షీద్ మరో ప్రయత్నం! రెండో యూపీఏ సర్కారులో విదేశాంగ మంత్రిగా పనిచేసిన వివాదాస్పద కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ మరోసారి ఫరూఖాబాద్ నుంచి రంగంలోకి దిగారు. ఆయన ఇక్కడ 1991, 2009లో రెండుసార్లు విజయం సాధించారు. కిందటి పార్లమెంటు ఎన్నికల్లో ఆయన నాలుగో స్థానంలో నిలవడమేగాక డిపాజిట్ కోల్పోయారు. 2014లో బీజేపీ అభ్యర్థి ముకేష్ రాజ్‌పుత్ తన సమీప ఎస్పీ అభ్యర్థి రామేశ్వర్ యాదవ్‌పై లక్షన్నరకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ, కాంగ్రెస్ తరఫున రాజ్‌పూత్, ఖుర్షీద్ బరిలోకి దిగారు.ఈసారి మహాగuŠ‡బంధన్ తరఫున బీఎస్పీ అభ్యర్థి మనోజ్ అగర్వాల్ పోటీకి దిగారు. సల్మాన్ ఖుర్షీద్ మాజీ రాష్ట్రపతి డా.జాకిర్‌హుస్సేన్ మనవడు. 1984లో ఖుర్షీద్ తండ్రి ఖుర్షీద్ ఆలం ఖాన్ విజయం సాధించాక మరోసారి కేంద్ర మంత్రి అయ్యారు. కిందటి ఎన్నికల్లో ఖుర్షీద్ ఫరూఖాబాద్‌లో డిపాజిట్ దక్కించుకోలేదంటే కాంగ్రెస్ ఇక్కడ ఎంత బలహీనమైందో అర్థంచేసుకోవచ్చు. విద్యావంతుడు, ప్రసిద్ధ లాయర్ అయిన ఖుర్షీద్ నెహ్రూగాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా పేరు సంపాదించారు. కాన్పూర్‌లో కొత్త నేత యూపీలో మొదటి పారిశ్రామిక నగరంగా పేరొందిన కాన్పూర్ స్థానం నుంచి బీజేపీ మాజీ అధ్యక్షుడు మురళీమనోహర్ జోషీ కిందటి ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 85 ఏళ్ల జోషీకి మళ్లీ పోటీచేసే అవకాశం ఇవ్వలేదు. ఆయన స్థానంలో సత్యదేవ్ పచౌరీ బీజేపీ తరఫున పోటీచేస్తున్నారు. గతంలో కాన్పూర్ నుంచి మూడుసార్లు వరుసగా గెలిచిన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ (కాంగ్రెస్)ను 2014లో జోషీ రెండు లక్షల 22 వేలకు పైగా ఆధిక్యంతో ఓడించా రు. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన బీఎస్పీ, ఎస్పీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఎస్పీ. బీఎస్పీ కూటమి తరఫున శ్రీరాం కుమార్(ఎస్పీ) బరిలోకి దిగారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ నేత జైస్వాల్‌కు బీజేపీ కొత్త అభ్యర్థికి మధ్యనే గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. బుందేల్‌ఖండ్‌పై బీజేపీ పై చేయి సాధిస్తుందా? యూపీ, మధ్యప్రదేశ్‌లో విస్తరించి ఉన్న బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని మూడు యూపీ లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, మహా కూటమి మధ్య హోరాహోరీ ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జాలోన్(ఎస్సీ), ఝాన్సీ, హమీర్పూర్ సీట్లలో నాలుగో దశలో పోలింగ్ జరుగుతుంది. ఈ ప్రాంతంలోని బందా స్థానంలో మే ఆరున పోలింగ్ జరుగుతుంది. బ్రాహ్మణులు, రాజపుత్రులతోపాటు బీసీలు, దళితులు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ముస్లింల జనాభా బాగా తక్కువ. ఈ కారణంగా బీజేపీ, ఎస్పీబీఎస్పీ కూటమి మధ్య బుందేల్‌ఖండ్‌లో గట్టి పోటీ ఉన్నట్టు కనిపిస్తున్నా మొగ్గు కాషాయపక్షానికే ఉందని కొందరు ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడి నాలుగు సీట్లలో అత్యధికంగా 44.86 శాతం ఓట్లు సాధించి అన్నింటినీ కైవసం చేసుకుంది. మూడేళ్ల తర్వాత జరిగిన 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన ఓట్ల శాతాన్ని 45.01 శాతానికి పెంచుకుని ఈ ప్రాంతంలోని మొత్తం 20 సీట్లలో విజయం సాధించింది. 1996, 1998 ఎన్నికల్లో సైతం బీజేపీ ఇక్కడ తిరుగులేని విజయం సాధించింది. అయితే ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కలిసిపోటీచేయడంతో బీజేపీకి తొలిసారి ఊహించని పోటీ ఎదురవుతోంది. కాంగ్రెస్ రెండు సార్లు ఒక్కొక్క సీటునే గెలుచుకుంది. జాలోన్, హమీర్‌పూర్‌లో బీఎస్పీ పోటీచేస్తుండగా, ఝాన్సీలో ఎస్పీ అభ్యర్థిని నిలిపింది. స్వల్ప సంఖ్యలో ఉన్న ముస్లిం ఓట్లతోపాటు ఎస్సీ, బీసీ వర్గాల ఓట్లు అత్యధికంగా మహా కూటమి అభ్యర్థులకు పడితే కిందటి పార్లమెంటు ఎన్నికల్లో మాదిరిగా బీజేపీ నూరు శాతం విజయాలు సాధించడం కష్టమే. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలకు దక్కిన ఓట్లను కలిపి చూస్తే బందా, ఝాన్సీలో ఈ కూటమి విజయానికి అవకాశాలున్నాయి. వరుస కరువు కాటకాలతో ఇబ్బందులుపడుతున్న బుందేల్‌ఖండ్ ప్రజలకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం లభించలేదు. హిందుత్వ రాజకీయాల ప్రభావం ఎక్కువ ఉన్న ఈ మూడు సీట్లలో ప్రభుత్వంపై జనంలో అసంతృప్తి ఎంత వరకు ఉందనేది అంచనాలకు అందడం లేదు. -
‘ఫతేపూర్’ బస్తీలో రాజ్‌బబ్బర్
ఉత్తర్‌ప్రదేశ్‌లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆరెల్డీ)తో కూడిన మహాగఠ్ బంధన్‌లో స్థానం దక్కని కాంగ్రెస్‌కు ఉత్తర్‌ప్రదేశ్‌లో గెలుపు అవకాశాలున్న అతి కొద్ది సీట్లలో ఫతేపూర్ సిక్రీ ఒకటి. యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ బాలీవుడ్ నటుడైన రాజ్‌బబ్బర్ రెండోసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. 2009లో మొదటిసారి ఆయన ఇక్కడ నుంచి పోటీ చేసి బీఎస్పీ అభ్యర్థి సీమా ఉపాధ్యాయ చేతిలో దాదాపు పది వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అదే ఏడాది జరిగిన ఫిరోజాబాద్ ఉప ఎన్నికలో ఎస్పీ అభ్యర్థి, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్‌ను బబ్బర్ ఓడించారు. 2014 ఎన్నికల్లో ఆయన ఘజియాబాద్‌లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ప్రస్తుత కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ చేతిలో ఓడిపోయారు. అంతకుముందు ఆయన ఎస్పీలో ఉండగా ఆ పార్టీ తరఫున ఆగ్రా నుంచి 1999, 2004లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. పునర్విభజనలో ఆగ్రా స్థానాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేశారు. ఆగ్రా జిల్లాలో సగ భాగం ఫతేపూర్ సిక్రీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లున్న ఫతేపూర్ సిక్రీ నియోజకవర్గం 2009లో ఏర్పాటయింది. 2014లో బీజేపీ అభ్యర్థి చౌధరీ బాబూలాల్ తన సమీప బీఎస్పీ అభ్యర్థి సీమా ఉపాధ్యాయను లక్షా 73 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. అప్పుడు కాంగ్రెస్–ఆర్ఎల్డీ కూటమి అభ్యర్థిగా పోటీచేసిన అమర్‌సింగ్‌కు డిపాజిట్ కూడా దక్కలేదు. ఈసారి బాబూలాల్‌కు బీజేపీ టికెట్ దక్కలేదు. రాజ్‌కుమార్ చాహర్ బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. మహాగఠ్ బంధన్ తరఫున శ్రీభగవాన్ శర్మ అలియాస్ గుడ్డూ పండిత్ (బీఎస్పీ) పోటీ చేస్తున్నారు. ఆగ్రా నగరంలో పుట్టిన బబ్బర్ బలమైన అభ్యర్థిగా ఉన్నారు. మొత్తానికి ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. ఘజియాబాద్ వద్దన్న బబ్బర్.. రాజ్ బబ్బర్‌ను మొదట ఆయన కిందటిసారి ఓడిన ఘజియాబాద్ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. బబ్బర్ మద్దతుదారులతో పాటు ఆయన కూడా అక్కడి నుంచి పోటీకి ఇష్టపడకపోవడంతో చివరికి ఫతేపూర్ సిక్రీ టికెట్ కేటాయించారు. ఎన్నికల్లో కులం కూడా ప్రధాన పాత్ర పోషించే ఈ నియోజకవర్గంలో రాజ్‌బబ్బర్ కులానికి (విశ్వకర్మ) చెందిన జనం బాగా తక్కువ. తనను చూసి అభిమానంతో చేతులు ఊపుతున్న ప్రజలంతా తన కులస్తులేనని, బంధువులని బబ్బర్ ఓ సందర్భంలో చమత్కరించారు. బాలీవుడ్ నటునిగా జనంతో ఉన్న పాత సంబంధం, స్థానికునిగా ఉన్న గుర్తింపు తనకు చాలని ఆయన భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఠాకూర్లు, బ్రాహ్మణుల తర్వాత జాట్ల జనాభా ఎక్కువ. బీజేపీ అభ్యర్థి చాహర్ జాట్. బీఎస్పీ నేత గుడ్డూ పండిత్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. జనాభా రీత్యా ఠాకూర్ల ఆధిపత్యం ఉన్నా ఈ వర్గం అభ్యర్థులెవరూ బరిలో లేరు. బీఎస్పీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సూరజ్‌పాల్ సింగ్, ధరమ్‌పాల్ సింగ్ (ఇద్దరూ ఠాకూర్లే) ఇటీవల కాంగ్రెస్‌లో చేరడంతో రాజ్ బబ్బర్ ప్రచారం ఊపందుకుంది. మోదీ ఇమేజ్‌పైనే బీజేపీ అభ్యర్థి భారం బీజేపీకి లోక్‌సభ అభ్యర్థిని చూసి తాము ఓట్లేయడం లేదనీ, ప్రధాని నరేంద్రమోదీ ప్రగతిశీల విధానాల కారణంగానే కాషాయ పక్షాన్ని గెలిపిస్తున్నామనే అభిప్రాయం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యక్తమవుతోంది. బీజేపీ అభ్యర్థి చాహర్ గతంలో సిక్రీ నుంచి అసెంబ్లీకి మూడుసార్లు పోటీచేసి ఓడిపోయారు. బబ్బర్ అనుచరునిగా పనిచేసిన నేపథ్యం కూడా చాహర్‌కు ఉంది. అయినా, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి నరేంద్రమోదీ ముఖం చూసి ఓటేసే వారి సంఖ్య యూపీలో గణనీయంగా ఉందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. బీఎస్పీకి దూరమైన బ్రాహ్మణ ఓటర్లు? బ్రాహ్మణ వర్గంలో మంచి పలుకుబడి ఉన్న సీమా ఉపాధ్యాయకు బీఎస్పీ టికెట్ ఇవ్వలేదు. ఆమె పార్టీ టికెట్‌పై 2009 ఎన్నికల్లో గెలిచారు. అయితే ఈసారి ఆమె వర్గానికే చెందిన గుడ్డూ పండిత్‌కు బీఎస్పీ టికెట్ లభించింది. స్థానికేతురుడైన బులంద్‌శహర్ ఎమ్మెల్యే పండిత్‌కు మద్దతు ఇవ్వడానికి బ్రాహ్మణులు ఆసక్తి చూపడం లేదు. మాయావతి కులమైన జాటవులు మాత్రమే బీఎస్పీ అభ్యర్థి తరఫున ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనకు మంచి పేరు లేకపోవడం బబ్బర్‌కు అనుకూలాంశంగా మారింది. ఎస్పీకి చెందిన కొందరు బ్రాహ్మణ నేతలు బబ్బర్ తరఫున ప్రచారం చేయడంతో పోటీ ప్రధానంగా బీజేపీ అభ్యర్థి చాహర్, బబ్బర్ మధ్యనే ఉంటుందని ఎన్నికల విశ్లేషకులు భావిస్తున్నారు. -
కులగూరగంప
కిందటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందిన 282 స్థానాల్లో నాలుగో వంతు సీట్లు (71) అందించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. 2014 ఎన్నికలకు ఏడు నెలల ముందు పశ్చిమ యూపీలోని ముజఫర్‌నగర్ జిల్లాలో చోటుచేసుకున్న మత ఘర్షణలు బీజేపీకి లబ్ధి చేకూర్చాయి. ముస్లింలపై ద్వేషంతో చెప్పుకోదగ్గ సంఖ్యలో హిందువులు కులాలకు అతీతంగా కాషాయ పక్షానికి ఓటేశారు. దీనికి తోడు రాష్ట్రంలో బలమైన పునాదులున్న బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్–ఆరెల్డీ కూటమి విడివిడిగా పోటీ చేశాయి. ఇప్పుడు రెండు మతాల మధ్య అలాంటి ఉద్రిక్తతలు లేవు. మతపరమైన చీలికలు తేవడానికి పాలకపక్షం యత్నిస్తున్నా జనం బాహాటంగా స్పందించడం లేదు. బీఎస్పీ, ఎస్పీ, ఆరెల్డీ కూటమిగా ఏర్పడి కలిసి పోటీ చేస్తున్నాయి. దళితులు, యాదవులు, ముస్లిం వర్గాల మద్దతు ఉన్న ఈ కూటమి బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి. మరోపక్క కిందటి పార్లమెంటు ఎన్నికల్లో 7.5 శాతం ఓట్లతో రెండు సీట్లు గెల్చుకున్న కాంగ్రెస్‌కు పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెల్లెలు ప్రియాంక రంగ ప్రవేశం కొత్త ఉత్సాహం ఇస్తోంది. పశ్చిమ యూపీలోని 8 సీట్లకు మొన్న జరిగిన తొలి దశ పోలింగ్‌పై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పూర్తి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 18న జరగబోయే యూపీలోని మరో ఎనిమిది స్థానాలు కూడా పశ్చిమ యూపీలోనివే. ఈ స్థానాల్లో కూడా మహాగఠ్ బంధన్ విజయం సాధిస్తుందనీ, మొదటి దశలో బీజేపీపై కూటమి ఆధిక్యం సాధించిందని ఆయన ప్రకటించారు. ఇందులో నిజానిజాలెలా ఉన్నా మూడు పార్టీల కూటమి ఈసారి బీజేపీకి గట్టి పోటీయే ఇస్తుందని రాజకీయ పరిశీలకులు నమ్ముతున్నారు. 2014లో ఒంటరిగా పోటీ చేసిన బీఎస్పీ, ఎస్పీ వరుసగా 22.2, 19.6 శాతం ఓట్లు సాధించాయి. ఎస్పీకి ఐదు, కాంగ్రెస్‌కు రెండు దక్కగా బీఎస్పీ ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. అప్నాదళ్‌తో కలిసి పోటీచేసిన బీజేపీ 42.3 శాతం ఓట్లతో మొత్తం 80 సీట్లలో 71 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ఫోకస్ 2022? ప్రియాంకను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (తూర్పు యూపీ ఇన్చార్జ్)గా నియమించారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి మళ్లీ రాష్ట్రంలో అధికారంలో రావడం కోసమే తాము కృషి చేస్తున్నామని రాహుల్, ప్రియాంక అనేక సందర్భాల్లో ప్రకటించారు. అంటే ఈ ఎన్నికల్లో తమతో పొత్తుకు ఎస్పీ–బీఎస్పీ కూటమి నిరాకరించడంతో తన ఉనికిని కాపాడుకునే పనిలో కాంగ్రెస్ నిమగ్నమైందని భావించాలి. అయితే, కాంగ్రెస్ ఎన్ని నియోజకవర్గాల్లో, ఎంత మేరకు ఓట్లు సాధిస్తుందనే అంశమే బీజేపీ నిలబెట్టుకునే సీట్ల సంఖ్యను నిర్ణయిస్తుంది. బ్రాహ్మణులు, వైశ్యులు, రాజపుత్రులు, కాయస్త వంటి అగ్రకులాల ఓట్లను స్వల్ప సంఖ్యలో కాంగ్రెస్ చీల్చుకునే అవకాశాలున్నాయి. ఈ వర్గాలకు చెందిన బలమైన అభ్యర్థులను నిలిపిన చోట్ల అగ్రవర్ణాల ఓట్లు బీజేపీకి పూర్తిగా పడవని భావిస్తున్నారు. అలాగే, పశ్చిమ యూపీలో కూడా కాంగ్రెస్ తరఫున నిలబడే జనాదరణ ఉన్న ముస్లిం నేతలు కూడా మైనారిటీల ఓట్లను గణనీయ సంఖ్యలో సాధిస్తారని అంచనా. ప్రియాంక ఇన్చార్జ్గా ఉన్న తూర్పు యూపీలోని అత్యధిక సీట్లకు చివరి మూడు దశల్లో (మే 6, 13, 19) పోలింగ్ జరుగుతుంది. ఈ సీట్ల ఫలితాలు ప్రియాంక ప్రచారం ప్రభావం ఎంతో తేల్చేస్తాయి. రెండో దశ పోలింగ్‌కు రెడీ పశ్చిమ యూపీలోని ఎనిమిది సీట్లలో ఈ నెల 18న పోలింగ్ జరగనుంది. వాటిలో నగీనా, బులంద్‌శహర్, హాథ్రస్, ఆగ్రా ఎస్సీ రిజర్వుడు సీట్లు. అమ్రోహా, అలీగఢ్, మథుర, ఫతేపూర్ సిక్రీ జనరల్ స్థానాలు. ఈ నియోజకవర్గాల్లో హిందువుల జనాభా 75 నుంచి 88 శాతం వరకు ఉంది. ముస్లింలు 12 నుంచి 25 శాతం వరకు ఉన్నారు. ఇక్కడ బీసీ, ఎస్సీ కులాల జనాభా ఎక్కువ. మొత్తం మీద 80 శాతం జనాభా గ్రామాల్లోనే నివసిస్తోంది. బీసీల్లో విశ్వకర్మ, కుమ్మరి వంటి బాగా వెనుకబడిన కులాల (ఎంబీసీ) మొగ్గు ఈ స్థానాల్లో బీజేపీ వైపే ఉంది. దళితుల్లో చర్మకారులైన జాటవుల జనాభా ఎక్కువ. వారితోపాటు ఎస్సీల జాబితాలో ఉన్న ధోబీ, భంగీ, కోరీలు, కంజర్లు బీఎస్పీకి గట్టి మద్దతుదారులు. అంచనాకు అందదు.. 2014లో ఎస్పీ, బీఎస్పీకి పడిన ఓట్లను కలిపితే 41 లోక్‌సభ స్థానాల్లో బీజేపీపై ఆధిక్యం కనిపిస్తోంది. ఈ రెండు పార్టీలకూ ఆరెల్డీ ఓట్లు తోడైతే మరికొన్ని స్థానాల్లో మహాగఠ్ బంధన్ విజయం సాధించాలి. పైన చెప్పినట్టు గత పార్లమెంటు ఎన్నికల్లో ఈ పార్టీలకు పోలైన ఓట్లను బట్టి కచ్చితంగా ఎవరు ఎన్ని సీట్లు గెలిచేదీ చెప్పడం సాహసమే అవుతుంది. ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ కూటమితో పాటు కాంగ్రెస్ కూడా యూపీ జనాభాలో 19 శాతం ఉన్న ముస్లింల ఓట్ల కోసం పోటీ పడుతున్నాయి. ముస్లింల మొగ్గు మహాగఠ్ బంధన్ వైపే ఉన్నా కాంగ్రెస్ అభ్యర్థులు బీజేపీని ఓడించేంత బలంగా ఉన్న స్థానాల్లో హస్తం గుర్తుకే వారు ఓటేస్తారని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మాజీ ప్రధాని కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి అజిత్‌సింగ్ నాయకత్వంలోని ఆరెల్డీ బలం జాట్లతోపాటు ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్న పశ్చిమ యూపీకే పరిమితం. ఈ పార్టీతో పొత్తు ఎస్పీ, బీఎస్పీకి లాభిస్తుంది. ముజఫర్‌నగర్ ఘర్షణల నాటి విద్వేషాలు జాట్లు, ముస్లింల మధ్య లేకపోవడం కూడా మహాగఠ్ బంధన్ ఇక్కడ ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. అయితే, పుల్వామా ఉగ్ర దాడి తర్వాత పాక్‌లోని బాలాకోట్‌పై భారత వాయుసేన మెరుపు దాడుల ఫలితంగా హిందువుల ఓట్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో బీజేపీకి పడతాయని అంచనా. జాట్లు, గుజ్జర్లదే ఆధిపత్యం రెండో దశ పోలింగ్ జరిగే ఈ ప్రాంతంలో వ్యావసాయిక కులాలైన జాట్లు, గుజ్జర్లదే ఆధిపత్యం. ఈ రెండు కులాల ఓట్లు బీజేపీ, మహాగఠ్ బంధన్ మధ్య చీలిపోతాయని భావిస్తున్నారు. జాట్లు, మాయావతి కులమైన జాటవుల మధ్య ఉన్న వైరుధ్యాల వల్ల బీఎస్పీ ఓట్లను ఎస్పీ, ఆరెల్డీ అభ్యర్థులకు బదిలీ అయ్యేలా చూడటం మాయావతికి కష్టమైన పనిగా కనిపిస్తోంది. ఎస్సీలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులకు వివిధ ఎంబీసీ, దళిత కులాల ఓట్లు ఎక్కువ పడతాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమ యూపీలోని ఈ ప్రాంతం లో ఇప్పటికే ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షడు రాహుల్‌గాంధీ, బీఎస్పీ నాయకురాలు మాయావతి భారీ బహిరంగసభల్లో పాల్గొని ప్రచారం చేశారు. ► మథురలో బీజేపీ తరఫున సినీ నటి, ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ హేమమాలిని పోటీచేస్తుండగా, ఆరెల్డీ అభ్యర్థి నరేంద్రసింగ్ రంగంలో ఉన్నారు. ► ఫతేపూర్ సిక్రీలో యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ నటుడు రాజ్ బబ్బర్ బీజేపీ అభ్యర్థి రాజ్ కుమార్ చాహర్‌తో తలపడుతున్నారు. ఇక్కడ బీఎస్పీ తరఫున రాజ్వీర్సింగ్ పోటీ చేస్తున్నారు. ► అమ్రోహాలో బీజేపీ సిటింగ్ సభ్యుడు కన్వర్‌సింగ్ తన్వర్, కాంగ్రెస్ నేత సచిన్ చౌధరీ రంగంలో ఉన్నారు. ఇటీవలి వరకూ జేడీఎస్‌లో ఉన్న కన్వర్ దానిష్ అలీ బీఎస్పీ అభ్యర్థిగా పోటీపడుతున్నారు. ► అలీగఢ్‌లో బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ సతీష్ కుమార్ గౌతమ్ మళ్లీ పోటీలో నిలవగా, మహాగఠ్ బంధన్ నుంచి అజిత్ బలియాన్ సవాల్ విసురుతున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ బ్రిజేష్‌సింగ్ తలపడుతున్నారు. తన్వర్, రాజ్ బబ్బర్, సచిన్, కున్వర్, రాజ్వీర్, హేమమాలిని, రాజ్‌కుమార్ -
కులమే కీలకం....అలీగఢ్
ద్వితీయ బ్రిటిష్–మరాఠా యుద్ధానికి అలీగఢ్ ప్రత్యక్ష సాక్షి. భారతదేశం మొత్తంలో బహుశా మహమ్మద్ అలీ జిన్నా ప్రస్తావన కలిగిన ఏకైక నియోజకవర్గం ఈ పార్లమెంటు స్థానమే కావడం విశేషం. ఇటీవల కాలంలో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో తలెత్తిన వివాదాలు కావచ్చు, స్థానిక ప్రజల చైతన్యం కావచ్చు ఈ పార్లమెంటు స్థానంపై ఇటు బీజేపీ, అటు మహాగఠ్ బంధన్.. రెండూ పట్టు సంపాదించేందుకు చాలా కాలంగా యత్నిస్తున్నాయి. బీజేపీకే పట్టం.. ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి బలమైన నియోజకవర్గాల్లో అలీగఢ్ ఒకటి. స్వతంత్ర భారతంలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక పర్యాయాలు అలీగఢ్ ప్రజలు పట్టంగట్టింది కూడా బీజేపీకే. ఆ పార్టీ సిట్టింగ్ అభ్యర్థి సతీష్ కుమార్ గౌతమ్ ఈసారి కూడా ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో షీలాగౌతం బీజేపీ నుంచి నాలుగుసార్లు ఇదే పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్, గఠ్బంధన్ అభ్యర్థి అజిత్ బలియాన్.. బీజేపీ అభ్యర్థి సతీష్‌కుమార్ గౌతమ్‌తో తలపడి తన బలాన్ని నిరూపించుకోబోతున్నారు. బీజేపీని నాలుగుసార్లు విజయతీరాలకు చేర్చిన షీలాగౌతమ్‌ను 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఓడించిన బీజేంద్రసింగ్‌ని కాంగ్రెస్ బరిలోకి దింపింది. అయితే ప్రధాన పోటీ మాత్రం బీజేపీ– గఠ్బంధన్ మధ్యనే ఉండబోతోంది. సిట్టింగ్‌పై అసంతృప్తి.. నిజానికి బీజేపీ సిట్టింగ్ ఎంపీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సతీష్‌కుమార్ గౌతమ్ అభ్యర్థిత్వంపై బీజేపీ అధినాయకత్వం అసంతృప్తితో ఉంది. ప్రస్తుతం రాజస్తాన్ గవర్నర్ కల్యాణ్‌సింగ్.. సతీష్‌కుమార్‌కు తిరిగి సీటు కేటాయించడాన్ని వ్యతిరేకించారు. అయితే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో మహ్మద్ అలీ జిన్నా ఫొటోని పెట్టడంపై చెలరేగిన వివాదంలో సతీష్‌కుమార్ గౌతం కీలక భూమిక పోషించడం ద్వారా బీజేపీని ప్రసన్నం చేసుకుని, తిరిగి ఈ సీటుని పొందగలిగారు. 2014లో మోదీ వేవ్‌తో ఈ స్థానాన్ని 3 లక్షల ఓట్లతో కైవసం చేసుకోగలిగినా పెద్ద నోట్ల రద్దు ప్రభావం, జీఎస్టీపై వ్యతిరేకత, స్థానిక సామాజిక సమీకరణలు బీజేపీ–మహాగఠ్ బంధన్ ఎన్నికల యుద్ధాన్ని పతాక స్థాయికి చేర్చనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సామాజిక సమీకరణల ప్రభావం బీజేపీ అభ్యర్థి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారైతే, ఆయనతో ఢీ అంటే ఢీ అంటోన్న మహాగఠ్ బంధన్ అభ్యర్థి అజిత్ బలియాన్ జాట్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అలాగే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తోన్న చౌధరీ బీజేంద్రసింగ్‌ది సైతం ఇదే సామాజిక వర్గం కావడం విశేషం. ‘‘ఈ ఎన్నికలు చాలా స్పష్టంగా ఉన్నాయి. హిందూ అగ్రకులాల ఓట్లన్నీ బీజేపీ పొందగలుగుతుంది. అయితే స్థానిక దళితుల్లోని మెజారిటీ ఓట్లూ, ఓబీసీల ఓట్లూ, జాట్ల ఓట్లు, ఠాకూర్లు, ముస్లింల ఓట్లు మాత్రం మహాగఠ్ బంధన్ ఉమ్మడి అభ్యర్థికే పడతాయి’ అని స్థానిక ఉపాధ్యాయుడు రాఘవేంద్ర సింగ్ తెలిపారు. ప్రస్తుతం అలీగఢ్‌లో 18.5 లక్షల ఓట్లున్నాయి. ఇందులో 20 శాతం ముస్లింల ఓట్లు. జాట్లు, ఠాకూర్లు కలిపి 15 శాతం ఉంటారు. బ్రాహ్మణులు, వైశ్యుల ఓట్లు కలిపి 10 నుంచి 15 శాతం ఉంటాయి. మిగిలిన వారిలో లోధ్, బఘేల్, సెయినీ, కుమ్మర్లు ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో అగ్రవర్ణాల ఓట్లూ, జాట్లు, ఠాకూర్లు, ఓబీసీలూ, దళితుల్లో కొన్ని వర్గాల మద్దతుతో విజయాన్ని సాధిం చారు. ఈసారి సాధారణ యువతరం అంతా బీజేపీ వైపే మొగ్గుచూపుతోంటే, విద్యావంతులూ, అలీగఢ్ యూనివర్సిటీ ఘటనల నేతృత్వంలో విద్యార్థులూ బీజేపీని ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈసారి ఇక్కడ విజయావకాశాలు ఎవరిని వరిస్తాయనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
బీజేపీకి ఓటమి భయం
దియోబంద్(సహరాన్పూర్): బీజేపీకి భయంతో వణికిపోతోందని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి పరాజయం తప్పదని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. తమ కూటమి గెలవడం ఇష్టంలేని కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. విద్వేష పూరిత విధానాలు, ముఖ్యంగా చౌకీదార్(మోదీ) ప్రచారం తీరుతో ఆ పార్టీ ఓడిపోవడం ఖాయమన్నారు. ఎస్పీ– బీఎస్పీ– ఆర్ఎల్డీ పార్టీల మహాకూటమి తొలి ఎన్నికల సభలో మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్, ఆర్ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్ ప్రసంగించారు. న్యాయ్ సరైన పరిష్కారం కాదు ఈ సందర్భంగా మాయావతి.. ‘రోడ్డు షోలు, గంగ, యమున నదుల్లో పవిత్ర స్నానాలు, సినీ తారలకు టికెట్లు.. వంటివి కాంగ్రెస్, బీజేపీలకు ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు. బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే సత్తా కాంగ్రెస్‌కు లేదు. మహాకూటమి మాత్రమే బీజేపీని ఎదుర్కోగలదు. గతంలో ఇందిరాగాంధీ పేదరిక నిర్మూలన కోసమంటూ పథకాన్ని ప్రవేశపెట్టారు. అది ఫలితం చూపిందా? పేదరికాన్ని రూపుమాపడానికి న్యాయ్ సరైన పరిష్కారం కాదు’ అని తెలిపారు. చౌకీదార్లను తొలగిస్తాం: ‘కోట్ల ఉద్యోగాలు ఇస్తామన చాయ్‌వాలా(టీ కొట్టు వ్యాపారి)ను 2014లో నమ్మాం. ఇప్పుడు చౌకీదార్‌ను నమ్మమంటున్నారు. ఈ చౌకీదార్ల(వాచ్మెన్)ను వాళ్ల చౌకీ(కాపలా పోస్ట్)ల నుంచి తొలగిస్తాం’ అని ర్యాలీలో అఖిలేశ్ ప్రకటించారు. తమ గఠ్ బంధన్(కూటమి) అవినీతిపరుల కూటమి కాదు, మహాపరివర్తన్(పూర్తిమార్పు) అని తెలిపారు. తనను తాను ఫకీర్(సన్యాసి)అని మోదీ చెప్పుకుంటుంటారు. హామీల అమల్లో విఫలమైతే నేను ఫకీర్‌ను వెళ్లిపోతున్నా అంటారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఉంచుదామా? వెళ్లగొడదామా? అని అఖిలేశ్ ప్రశ్నించారు. అచ్చేదిన్ (మంచి రోజు) అంటే మోదీ ఉద్దేశం తన గురించే తప్ప, ప్రజలకు వచ్చే మంచి రోజుల గురించి కాదని అజిత్ సింగ్ ఎద్దేవా చేశారు. -
యూపీలో గఠ్బంధన్ హవా
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నాయకత్వంలోని గఠ్బంధన్ అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని, అలాగే బిహార్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మెజారిటీ సీట్లు దక్కించుకోవచ్చని ఏబీపీ–నీల్సన్ సర్వే వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో సమాజ్‌వాదీపార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, రాష్ట్రీయ లోక్దళ్లతో కూడిన గఠ్బంధన్ (కూటమి) 42 స్థానాలు గెలుచుకోవచ్చనీ, బీజేపీ, అప్నాదళ్ కూటమికి 36 సీట్లు రావచ్చని ఆ సర్వే పేర్కొంది. ఒంటరిగా బరిలో దిగిన కాంగ్రెస్‌కు ఇక్కడ రెండు సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. 2014 ఎన్నికల్లో బీజేపీ కూటమి 73 సీట్లలో విజయం సాధించగా ఎస్పీ 5, కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకున్నాయి. బిహార్‌లో మొత్తం 40 సీట్లలో ఎన్డీయేకు 34, గఠ్ బంధన్‌కు 6 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే నివేదిక పేర్కొంది. యూపీలో సీట్లు తగ్గినా బీజేపీ కూటమికి ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉందని, గఠ్బంధన్ కంటే ఎక్కువగా (43శాతం) ఓట్లు వస్తాయని సర్వే తెలిపింది. కాంగ్రెస్ ఓట్ల శాతం కూడా 7.8(2014) నుంచి 9 శాతానికి పెరగొచ్చని పేర్కొంది. మార్చి16–24వ తేదీల మధ్య 20వేల మందికిపైగా ఓటర్ల అభిప్రాయాలను సేకరించి ఈ నివేదిక రూపొందించారు. ప్రధాని మోదీ పనితీరు బాగుందని సర్వేలో మెజారిటీ ఓటర్లు అభిప్రాయపడ్డారు. ముస్లిం ఓటర్లు మోదీ తీరు ఏవరేజ్‌గా ఉందన్నారు. ఎన్డీయే ప్రభుత్వం పనితీరుకు ఓటర్లు 3.73 మార్కులు ఇచ్చారు. అవినీతి, నిరుద్యోగం ఈ ఎన్నికల్లో ముఖ్యాంశాలని మెజారిటీ ఓటర్లు చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించే వారికే ఓటేస్తామని అత్యధికులు స్పష్టం చేశారు. మత సామరస్యం, ధరల నియంత్రణ, వెనకబడిన వర్గాలకు సంక్షేమ పథకాలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తోందని సర్వే నివేదిక పేర్కొంది. బిహార్‌లో 34 సీట్లు.. బీజేపీ, జనతాదళ్ యునైటెడ్, లోక్‌జనశక్తి పార్టీలతో కూడిన ఎన్డీయే 52 శాతం ఓట్లతో 34 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని నీల్సన్ సర్వే పేర్కొంది. రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, రాష్ట్రీయలోక్ సమతా పార్టీ, సీపీఐ (ఎంఎల్)తో కూడిన గఠ్‌బంధన్‌కు ఆరు సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. మార్చి 17–26 మధ్య పది వేల మంది ఓటర్ల అభిప్రాయాలు తెలుసుకుని ఈ అంచనాకు వచ్చినట్టు నీల్సన్ సంస్థ పేర్కొంది. ఇక్కడ కూడా మోదీ పనితీరు బాగుందని, నితీశ్ కుమార్ ప్రభుత్వం పనితీరు బాగానే ఉందని అత్యధికులు అభిప్రాయపడ్డారు. కేంద్రంలో ఎన్డీయే పనితీరుకు 3.92 మార్కులు ఇచ్చారు. ఇక్కడ కూడా అవినీతి, నిరుద్యోగం ప్రజల ప్రధాన సమస్యలని సర్వేలో తేలింది. ఇదిలా ఉండగా, శత్రుఘ్న సిన్హా బీజేపీని వదిలి కాంగ్రెస్‌లో చేరడం మంచిదేనని 38 శాతం ఓటర్లు అభిప్రాయపడగా, తప్పు నిర్ణయమని 39 శాతం వ్యాఖ్యానించారు. -
లాల్, నీల్.. కన్హయ్య
సాక్షి, సెంట్రల్ డెస్క్ : ప్రజా సమస్యలే పోరాట పంథాగా, జనం గొంతుక వినిపించే కమ్యూనిస్టు పార్టీల ఉనికి ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో మూడేళ్ల క్రితం ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో (జేఎన్‌యూ) పీహెచ్డీ విద్యార్థి కన్హయ్య కుమార్ రూపంలో ఒక నవగళం దేశవ్యాప్తంగా మారుమోగింది. ఇప్పుడా గళమే మన రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం నినదిస్తోంది. ఏళ్లకి ఏళ్లు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న రాజకీయాలకే అలవాటుపడిపోయిన ప్రజలకి వామపక్ష సిద్ధాంతాలను, దళితులకు అంబేడ్కర్ కల్పించిన రక్షణ కవచాన్ని కలగలిపి ‘లాల్.. నీల్’ అనే ఒక కొత్త రాజకీయ అస్త్రాన్ని సంధించి, అందరి దృష్టిని ఆకర్షించినవాడు కన్హయ్య కుమార్. ఇంటింటి ఉద్యమ కెరటం చిన్నతనం నుంచే వామపక్ష భావజాలం, అందరినీ మంత్రముగ్ధుల్ని చేసే వాగ్ధాటి ఉండడంతో జేఎన్‌యూలో అంతగా పట్టులేని లెఫ్ట్ పార్టీ విద్యార్థి విభాగం ఏఐఎస్ఎఫ్ నుంచి పోటీచేసి విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కన్హయ్యకుమార్. విద్యార్థులకు పీహెచ్డీ భృతి తగ్గించడంతో ‘ఆక్యుపై యూజీసీ’ పేరుతో వీధులకెక్కి పోరాడినప్పుడు తొలిసారి ఆయన పేరు అందరికీ తెలిసింది. జేఎన్‌యూలో జాతివ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో దేశద్రోహం నేరం కింద అరెస్టయి బయటకి వచ్చాక కన్హయ్యకుమార్ తోటి విద్యార్థుల్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంతో ఆయన పేరు ఊరూవాడా మారుమోగింది. ఆ ప్రసంగమే రాజకీయ జీవితానికి పునాది వేసింది. చట్టసభల్లో కొత్త గొంతుకనవుతా.. రాజ్యాంగాన్ని కచ్చితంగా అమలు చేసినప్పుడు సమ సమాజం ఆవిష్కృతమవుతుందని నమ్ముతారు కన్హయ్య కుమార్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నడిరోడ్డుపై నిల్చోబెట్టి ప్రశ్నించాలని అంటారు. అందుకే చట్టసభల్లో కొత్త గొంతుకనవుతానని ఎలుగెత్తి చాటుతున్నారు. 2018 ఏప్రిల్‌లో సీపీఐ జాతీయ సమితిలో చేరారు. అప్పట్నుంచి జనసంవాద్ కార్యక్రమం ద్వారా 100కిపైగా సమావేశాలు నిర్వహించి జనంలోకి చొచ్చుకెళ్లారు. ఇప్పుడు బిహార్‌లోని బేగూసరాయి నియోజకవర్గం నుంచి వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఉద్యమ నేపథ్య కుటుంబం.. బిహార్‌లోని బేగూసరాయిలో అగ్రవర్ణానికి చెందిన భూమిహార్ కుటుంబం నుంచి వచ్చారు కన్హయ్యకుమార్. తండ్రి జయశంకర్ సింగ్ చాలా ఏళ్లుగా పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు. తల్లి మీనాదేవి అంగన్వాడీ కార్యకర్త. ఒకప్పుడు తల్లిదండ్రులిద్దరూ రైతు హక్కుల కోసం పోరాటాలు చేశారు. ఉద్యమమే ఊపిరిగా బతికిన కుటుంబం కావడంతో చిన్నప్పట్నుంచి కన్హయ్యకుమార్ ఆలోచనలన్నీ అణగారిన బతుకుల చుట్టూ తిరుగుతుండేవి. వామపక్ష భావజాలానికి ఓట్లు రాల్చే సత్తా లేదని భావించిన కన్హయ్య కుమార్ దేశంలోని దళితులు, వామపక్షాలు కలిస్తేనే సరికొత్త విప్లవం పుట్టుకొస్తుందని ప్రతిపాదిస్తున్నారు. ‘లాల్, నీల్’ నినాదంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. కన్హయ్యకుమార్ విజేతగా నిలుస్తారా ? ఒక ప్రశ్నించే గళం, ఆగ్రహావేశాలు రగిలించే ప్రసంగం నవయువకుల్లో స్ఫూర్తి నింపుతోంది. నేటి తరం ఆయన ప్రసంగాల్ని ఆసక్తిగా వింటున్నారు. ‘‘ కన్హయ్యకుమార్ యువతకి ఆదర్శప్రాయుడు, ఒక హీరో. మోదీనే ఎదురిస్తున్న ధీరుడు. అందులో సందేహం లేదు. కానీ నడి వయసులో వారిని,వయసు మళ్లిన వారిని కన్హయ్య కుమార్ ప్రసంగాలు ఆకట్టుకోలేకపోతున్నాయి‘‘అని బీహార్‌కు చెందిన జర్నలిస్టు ఒకరు వ్యాఖ్యానించారు. బీజేపీ నుంచి వివాదాస్పదుడైన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ బరిలో ఉంటే, మహాగఠ్ బంధన్‌లో భాగస్వామి అయినప్పటికీ ఆర్జేడీ తన్వీర్ హసన్‌ను పోటీలో నిలిపింది. కన్హయ్య కుమార్ భావజాలం జనసామాన్యంలోకి వెళ్లలేదనే భావనతో ఉన్న ఆర్జేడీ ఎన్నికల గోదాలోకి దిగింది. మహాగఠ్‌బంధన్ కన్హయ్యకుమార్కు మద్దతుగా నిల్చొని ఉంటే ఆయన విజయం నల్లేరు మీద బండి నడకే. కానీ త్రిముఖ పోటీలో ఓట్లు చీలి ఎవరికి లాభం చేకూరుతుందో ఇప్పట్నుంచే చెప్పలేని స్థితి. కన్హయ్య కుమార్ పక్కా లోకల్ కావడం ఆయనకి కలిసొచ్చే అంశం.. కొత్త గొంతుకల మద్దతు ప్రజాస్వామ్యంలో కొత్త ఉద్యమ కెరటాలైన హార్దిక్ పటేల్, జిగ్నేష్ మేవాని వంటివారు కన్హయ్యకు మద్దతుగా ప్రచారానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా రాజకీయం రంగు మార్చుకుంది. గత ఏడాది గుజరాత్లో బీహార్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులపై దాడులు జరిపి, వారిని రాష్ట్రం నుంచి తరిమేసిన విషయం తెలిసిందే. దీనినే కేంద్రమంత్రి, బీజేపీ అభ్యర్థి గిరిరాజ్ సింగ్ ఒక ఆయుధంగా తీసుకున్నారు. జిగ్నేష్ మేవానీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘బెంగుసరాయిలో మీకేం పని ? బిహారీలను తరిమి కొట్టారు. అలా దాడులు చేసిన వారి వెనక ఉండి మీరే ప్రోత్సహించారు. అప్పటి ఉద్రిక్తతలకి మీదే బాధ్యత‘ అంటూ ట్వీట్ చేశారు. దీనికి మేవానీ గట్టిగానే బదులిచ్చారు.. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టుగా గుజరాత్లో బీజేపీ అధికారంలో ఉంటే, తనను నిందించడం ఏమిటని సూటిగా ప్రశ్నించారు. గిరిరాజ్‌సింగ్‌పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఒక మహా కవి చెప్పినట్టుగా కన్హయ్య కుమార్‌కు కెరటమే ఆదర్శం. పడినందుకు కాదు, పడినా లేచినందుకు. కన్హయ్య ఎన్నికల్లో గెలిచారా, ఓడారా అన్నది కాదు ముఖ్యం. ఒక కొత్త తరహా రాజకీయాలకు దారి చూపించిన యువకుడిగా ఆయన చరిత్ర సృష్టిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. -
ఢిల్లీలోనూ మహాకూటమి కథ కంచికే!
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారును గద్దె దించేందుకు బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాలని తీర్మానించుకున్నా.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అది సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని పక్కనబెట్టి ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) పొత్తు ఖరారు చేసుకున్నాయి. ఢిల్లీలోనూ విపక్ష మహాకూటమికి చుక్కెదురైంది. తమతో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధపడటం లేదని, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో తాము ఒంటరిగా పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం స్పష్టం చేశారు. ఢిల్లీలో మహాకూటమి (మహాఘట్బంధన్) ఏర్పాటు కాకపోవడానికి కాంగ్రెస్సే కారణమని, ఆ పార్టీ తమతో పొత్తుకు ఎంతమాత్రం సిద్ధంగా లేదని, ఈ విషయంలో కాంగ్రెస్ దృఢనిశ్చయంతో ఉన్నట్టు కనిపిస్తోందని కేజ్రీవాల్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నరేంద్రమోదీ-అమిత్ షా ద్వయాన్ని అధికారంలోంచి దింపేయడమే దేశముందున్న అతిపెద్ద సవాలు అని, ఆ సవాలులో భాగంగా తమకు బద్ధవిరోధి అయిన కాంగ్రెస్‌తో పొత్తుకు తాము సిద్ధపడినా.. ఆ పార్టీ మాత్రం అందుకు అంగీకరించడం లేదని, అందుకే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిపోరుకు సిద్ధమవుతున్నామని ఆయన స్పష్టం చేశారు. -
కూటమి అధికారంలోకి వస్తే రోజుకో ప్రధాని
నల్లగొండ టూటౌన్: దేశాన్ని 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమాన్ని విస్మరించి, లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడిందని బీజేఎల్పీ మాజీ నేత జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మళ్లీ అధికారంకోసం తాపత్రయ పడుతున్న కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కూటమిలో 9 మంది ప్రధాని అభ్యర్థులున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీల మహాకూటమి అధికారంలోకి వస్తే రోజుకొక ప్రధాన మంత్రిని చూడాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఆ కూటమిలో మమత, మాయావతి, చంద్రబాబు , అఖిలేష్‌లాంటి వారు 9 మంది ప్రధానమంత్రి పదవి కోసం పాకులాడుతున్నారని అన్నారు. వైరి పక్షాలుగా ఉన్న చంద్రబాబు, రాహుల్ గాంధీలు ఒకే వేదిక పంచుకొని ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్నారని, రాష్ట్రంలో బాబు పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి రైతులకు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ నాలుగున్నరేళ్లుగా అవినీతి రహిత పాలన అందిస్తూ దేశ ప్రజల సంక్షేమానికి, దేశాభివృద్ధికి పాటుపడ్డారని పేర్కొన్నారు. కేంద్రంలో కేసీఆర్, చంద్రబాబులు కీలక పాత్ర పోషిస్తారని వారి వారసులు కేటీఆర్, లోకేశ్ చెబుతున్నారని.., వారు అక్కడికి వెళితే వీళ్లు ముఖ్యమంత్రులు కావడానికి చూస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాలకు బీజేపీ పోటీ చేస్తుందని, ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతోందని తెలిపారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు మంత్రివర్గం ఏర్పాటు చేయలేదని, దేశంలో మంత్రివర్గం లేని ప్రభుత్వం ఒక్క కేసీఆర్‌ది మాత్రమేనని అన్నారు. -
బీజేపీ, కాంగ్రెస్‌కు సమదూరం: నవీన్
భువనేశ్వర్: లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్షాలు ప్రతిపాదిస్తున్న మహాకూటమిలో చేరబోమని బీజేడీ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు సమాన దూరం పాటిస్తామని బుధవారం తేల్చిచెప్పారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఏకం కావాలని బీజేపీయేతర పక్షాలు ప్రయత్నిస్తున్న సమయంలో నవీన్ పట్నాయక్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. మహాకూటమిలో చేరికపై నిర్ణయానికి కొంత సమయం కావాలని ఆయన ఢిల్లీలో చెప్పిన మరుసటి రోజే ఈ విధంగా స్పందించడం గమనార్హం. బీజేడీకి కాంగ్రెస్‌తో రహస్య అవగాహన ఉందని బీజేపీ ఆరోపించగా, బీజేడీ ఎప్పటికీ బీజేపీ పక్షమేనని కాంగ్రెస్ పేర్కొంది. -
మహాకూటమిలో చేరేది లేదు : నవీన్ పట్నాయక్
న్యూఢిల్లీ : మహా కూటమిలో చేరే ఉద్దేశమే లేదని బిజూ జనతాదళ్ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఏర్పాటు చేస్తోన్న మహా కూటమిలోగానీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలోగానీ తమ పార్టీ చేరబోదని బుధవారం ప్రకటించారు. దేశంలోని రెండు ప్రధాన పార్టీలకు బీజేడీ దూరంగా ఉండి, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని నవీన్ పట్నాయక్ తెలిపారు. బీజేడీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ.. రైతుల సమస్యలన్నీ తీర్చుతామని 2014 ఎన్నికలకు ముందు బీజేపీ హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు అన్నదాతల గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అందుకే వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటి చేస్తామని వెల్లడించారు. ఒడిశాలో మొత్తం 21 లోక్ సభ స్థానాలున్నాయి. అయితే గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకుందని 20 స్థానాల్లో బీజేడి ఘనవిజయం సాధించిందని గుర్తుచేశారు. దాంతో ఈ సారి ఎన్నికల్లో బీజేపీ ఒడిశాలో ఎక్కువ సీట్ల గెలుపొందాలనే ప్రయత్నంలో ఉంది. ఇక పోతే గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ ఒక్కసీటును కూడా దక్కించుకోలేకపోయింది. -
మహాకూటమిపై ఏచూరి కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో ఎన్నికలకు ముందు మహా ఘట్బంధన్ (మహా కూటమి) సాధ్యం కాదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై చర్చ జరిగిందని సోమవారం ఆయన మీడియాతో వెల్లడించారు. తెలంగాణలో టీఆర్ఎస్ , బీజేపీ ఓటమి లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. ‘మా స్థానాల్లో మేము పోటీ చేస్తాం, మిగిలిన స్థానాల్లో బీజేపీ ఓటమికి పని చేస్తాం’ అని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీ చేస్తామనీ, కాంగ్రెస్‌తో జతకట్టేది లేదని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.(మహాకూటమిపై ‘మాయ’ మబ్బులు) రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ లలో కొన్ని సీట్లలో పోటీ చేస్తామనీ, మిగిలిన చోట్ల బీజేపీని ఓడించే పార్టీలకు ఓటేయాలని ప్రజలని కోరతామని సీతారం అన్నారు. మహాకూటమి సఫలం కానిపక్షంలో కాంగ్రెస్‌తో పొత్తు అంశం మున్ముందు చెప్తామని పేర్కొన్నారు. బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ పేరుతో ఎన్నికల బరిలోకి దిగుతామన్నారు. బహుజన అజెండా మా లక్ష్యమని ఆయన వెల్లడించారు. ‘సీపీఎం, సీపీఐ అజెండా వేరు. అందుకే మేము రెండు పార్టీ లుగా ఉన్నాం’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన అన్నారు. చట్టం తీసుకురండి.. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలందరికీ అనుమతినిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పు పట్ల కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని ఆయన విమర్శించారు. ఆ పార్టీ జాతీయ స్థాయిలో స్వాగతం పలుకుతూ.. కేరళలో ధర్నాలు నిర్వహిస్తోందని మండిపడ్డారు. శబరిమల తీర్పును వ్యతిరేకిస్తున్న బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో చట్టం తేవాలని అన్నారు. -
మాయా మర్మం
-
మహాకూటమిలోకి నితీష్?
పట్నా : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బిహార్ రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. జేడీయూ అధినేత, బిహార్ సీఎం నితీష్ కుమార్ తిరిగి మహాకూటమిలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఆర్జేడీ నేత, ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్‌పై అవినీతి అరోపణలు కారణంగా గత ఏడాది మహాకూటమి నుంచి బయటకు వచ్చిన నితీష్.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఎన్డీయే కూటమిలో నితీష్ ఇమడలేకపోతన్నారని.. బీజేపీకి స్వస్తి చెప్పి తిరిగి కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిలో చేరతారని సమాచారం. గతకొంత కాలంగా కేంద్ర ప్రభుత్వంపై నితీష్ పలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా లోక్‌సభ సీట్ల పంపకం విషయంలో రెండు పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో ఎన్డీఏ నుంచి బయటకు వస్తారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్జేడీ ఛీప్, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఇటీవల నితీష్ కుమార్ ఫోన్ చేయడంతో బిహార్ రాజకీయం మరింత వేడెక్కింది. ఎన్డీఏ నుంచి నితీష్ బయటకు వస్తే మహాకూటమిలోకి తిరిగి ఆహ్వానించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు ప్రకటించారు. ఈ విషయంపై తేజస్వీ యాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నితీష్‌ను తిరిగి మహాకూటమిలోకి తిరిగి రానిచ్చేదిలేదని తేల్చిచెప్పారు. నితీష్‌కు మహాకూటమి తలుపులు ఎప్పుడో మూసుకుని పోయాయని ఇటీవల తేజస్వీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఇటీవల సమావేశమై చర్చించారు. నితీష్ ప్రస్తుతం ఫాసిస్టు పార్టీతో కలిసి ఉన్నారని, వారి నుంచి బయటకు వస్తే మిత్రపక్షాలతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని బిహార్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎస్కే గోయల్ పేర్కొన్నారు. -
కాంగ్రెస్ వ్యూహం : 250 స్ధానాల్లోనే పోటీ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ రెండో సారి అధికార పగ్గాలు చేపట్టకుండా చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు ప్రాతినిథ్యం పెరిగేలా వీలైనన్ని తక్కువ స్ధానాల్లోనే పోటీకి పరిమితమవాలని ఆ పార్టీ యోచిస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కనిష్టస్ధాయిలో కేవలం 250 స్ధానాల్లోనే పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాషాయ కూటమిని అధికార పీఠం నుంచి తప్పించేందుకు భావసారూప్యం కలిగిన పార్టీలతో మహాకూటమి ఏర్పాటుకు చొరవ తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు బీజేపీయేతర పార్టీలకు ఎక్కువ స్ధానాలు సర్ధుబాటు చేసేలా తాను తక్కువ సీట్లకే పరిమితం కావాలని యోచిస్తున్నట్టు సమాచారం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇతర పార్టీలతో సీట్ల సర్దుబాటుపై రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ బ్లూప్రింట్ రూపకల్పనలో నిమగ్నమైంది. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపునకు రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేసేందుకు ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీకి ఈ బాధ్యతలను పార్టీ అప్పగించింది. ఈ కమిటీ జిల్లా, రాష్ట్ర కమిటీలతో సంప్రదింపులు జరిపి ఆయా రాష్ట్రాల్లో పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లను హైకమాండ్ దృష్టికి తీసుకువెళతారు. అనంతరం కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలుంటాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నివేదికలను పరిశీలించిన అనంతరం సీట్ల సర్ధుబాటుపై, ఎన్ని స్ధానాల్లో బరిలో దిగాలనే అంశంపై పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఓ నిర్ణయం తీసుకుంటారు. ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఢీ కొనేందుకు ఏర్పాటైన మహాకూటమిలో చేరే ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ ప్రాతినిథ్యం కల్పిస్తూ పార్టీ 250 కన్నా తక్కువ స్ధానాల్లో పోటీకి పరిమితం కావాలని పలువురు పార్టీ నేతలు సూచిస్తుండటం గమనార్హం. -
'శరద్ యాదవ్ నచ్చిన దారి చూసుకోవచ్చు'
న్యూఢిల్లీ: జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్ విషయంలో తాను ఏం చేయలేనని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. ఆయనకు నచ్చిన దారి చూసుకోవచ్చని తెలిపారు. బీజేపీతో జేడీయూ పొత్తుపెట్టుకోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న శరద్ యాదవ్ సొంత కుంపటి పెట్టే ఆలోచన చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై నితీష్‌ను మీడయి ప్రతినిధులు ప్రశ్నించగా.. 'ప్రతి ఒక్కరి అభిప్రాయం తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవడం జరిగింది. నచ్చిన దారిని చూసుకునే స్వేచ్ఛ ఆయనకు ఉంది. గురువారం మీడియాతో మాట్లాడిన శరద్ యాదవ్ తాను మహాగట్బంధన్కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని అన్నారు. బిహార్ ప్రజలు కలిసి పరిపాలించండనే తీర్పు ఇచ్చారని, నితీష్ దెబ్బకొట్టారని అసంతృప్తి వ్యక్తం చేశారు. -
ములాయంకు ఊహించని షాక్!
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహాకూటమి ఏర్పాటు చేయాలని భావిస్తున్న సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కు ఊహించని షాక్ తగిలింది. అఖిలేశ్ యాదవ్ ను సీఎం అభ్యర్థిగా పెడితేనే చేతులు కలుపుతామని భాగస్వామ్య పార్టీలు స్పష్టం చేయడంతో ములాయం ప్రయత్నాలకు ఆరంభంలోనే హంసపాదు ఎదురైంది. సమాజ్ వాదీ పార్టీలో ముసలం రేగడంతో ములాయం.. కొడుకుని కాదని సోదరుడు శివపాల్ యాదవ్, ప్రాణమిత్రుడు అమర్ సింగ్ పక్షం వహించారు. సమాజ్ వాదీ పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా అఖిలేశ్ పేరును ఖరారు చేస్తేనే ఉమ్మడి పోరుకు అంగీకరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్టు వార్తలు వచ్చాయి. ములాయం మహాకూటమి ఏర్పాటు చేయాలనుకుంటే ముందుగా తన కుటుంబంలో రేగిన కలహాలను పరిష్కరించుకోవాలని ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్ సూచించినట్టు ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు వెల్లడించారు. పరి'వార్' తర్వాత ములాయం కంటే అఖిలేశ్ కు ప్రజాదరణ పెరిగిందని ఒక సర్వేలో వెల్లడైన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం. కాగా, సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ కలిసి వస్తేనే మహాకూటమి సాధ్యమన్న అభిప్రాయాన్ని జేడీ(యూ) నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యక్తం చేశారు. గతేడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికప్పుడు మహాకూటమి నుంచి చివరి నిమిషంలో ములాయం తప్పుకుని నితీశ్ కు షాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ములాయంతో చేతులు కలిపే విషయంలో నితీశ్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 5న జరగనున్న సమాజ్ వాదీ పార్టీ రజతోత్సవాలకు హాజరుకాకూడదని నితీశ్ నిర్ణయించుకున్నారు. కాగా, సమాజ్ వాదీ పార్టీలో అంతర్గత సంక్షోభం యాదవ్, ముస్లిం ఓట్లపై బాగా ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.