బిహార్‌లో మహాఘఠ్‌బంధన్ సీట్ల సర్దుబాటు
పట్నా: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు గాను బిహార్‌లో ఆర్జేడీ సారథ్యంలోని మహాఘఠ్‌బంధన్‌లో సీట్ల పంపిణీ కొలిక్కి వచ్చింది. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాలకు గాను దాదాపు మూడింట రెండొంతుల సీట్లలో లాలూ ప్రసాద్‌కు చెందిన ఆర్జేడీ పోటీ చేయనుంది. మిగతా వాటిని కాంగ్రెస్, మూడు వామపక్ష పార్టీలు పంచుకున్నాయి. 2019 ఎన్నికల్లో ఆర్జేడీ ఒక్క సీటూ దక్కించుకోలేకపోయినప్పటికీ ఈసారి 26 చోట్ల పోటీ చేయనుంది.
కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారీ 9 చోట్ల పోటీ చేయనుంది. ఆ తర్వాత సీపీఐ ఎంఎల్ లిబరేషన్ మూడు, సీపీఐ, సీపీఎంలు చెరో చోట బరిలోకి దిగనున్నాయి. బిహార్‌లో ఆర్జేడీ ఇప్పటికే నాలుగు చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఒక సీటును కాంగ్రెస్ ఆశిస్తోంది. కాంగ్రెస్ పోటీ చేయాలని ఆశిస్తున్న పుర్నియా స్థానానికి లాలూ ప్రసాద్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించేశారు. సీపీఐ, సీపీఐ(ఎంఎల్) కూడా బెగుసరాయ్, ఖరారియా సీట్లకు అభ్యర్థులను ప్రకటించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment