Seat Distribution
-
జార్ఖండ్‌లో ఎన్డీఏ పక్షాల సీట్ల పంపకాలు ఖరారు
సాక్షి, న్యూఢిల్లీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్డీఏ మధ్య సీట్ల పంపకాలు ఖరార య్యాయి. బీజేపీ 68, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ) 10, జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) 2, లోక్‌జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) 1 స్థానంలో పోటీ చేయాలని శుక్రవారం నిర్ణయించాయి. ఏజేఎస్‌యూ– సిల్లి, రామ్‌గఢ్, గోమియా, ఇచాగర్, మాండు, జుగ్సాలియా, డుమ్రి, పాకూర్, లోహర్దగా, మనోహర్పూర్, జేడీయూ– జంషెడ్పూర్ వెస్ట్, తమర్ స్థానాల నుంచి, ఎల్జేపీ (ఆర్) ఛత్రా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. జార్ఖండ్‌లో నవంబర్ 13, 20ల్లో రెండు దళల్లో పోలింగ్ జరగనుంది. 23న ఫలితాలు ప్రకటించనున్నారు. -
Maha Vikas Aghadi: 200 సీట్లపై ఏకాభిప్రాయం.. శరద్‌పవార్ వెల్లడి
పుణె: మహావికాస్ అఘాడిలోని మూడు భాగస్వామ్య పార్టీల మధ్య 200 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరిందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్‌పవార్ గురువారం వెల్లడించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలుండగా.. కాంగ్రెస్, ఎన్పీపీ (ఎస్పీ), శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) కలిసి పోటీచేయనున్న విషయం తెలిసిందే. తమ తరఫున ఎన్సీపీ (ఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ సీట్ల పంపకం చర్చల్లో పాల్గొంటున్నారని, ఆయనిచ్చిన సమాచారం మేరకు 200 సీట్లపై ఏకాభిప్రాయం కుదిరిందని వెల్లడించారు. ఎవరెన్ని స్థానాల్లో పోటీచేయాలి, ఏయే నియోజకవర్గాలు ఏ పార్టీకి కేటాయించాలనే విషయంలో మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) పార్టీలు చాలా రోజులుగా కసరత్తు చేస్తున్నాయి. నవంబరు 20న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఈసీ షెడ్యూల్‌ను విడుదల చేయడంతో ఈ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. హరియాణా ఫలితం ప్రభావం (బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది) మహారాష్ట్ర ఎన్నికలపై ఉండదని శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. ఎంవీఏ సీఎం అభ్యరి్థని ప్రకటించాలనే శివసేన (యూబీటీ) డిమాండ్‌ను ప్రస్తావించగా మూడు భాగస్వామ్యపక్షాల మధ్య ఈ అంశం పరిష్కారమైందని బదులిచ్చారు. ఉద్ధవ్ ఠాక్రే పాల్గొన్న సంయుక్త విలేకరుల సమావేశంలో దీనిపై స్పష్టత ఇచ్చామని, ఎన్నికల తర్వాత సీఎం అభ్యర్థి నిర్ణయమవుతారని తెలిపారు. నాందేడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా రవీంద్ర చవాన్ నాందేడ్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ తమ అభ్యర్థిగా రవీంద్ర చవాన్‌ను ప్రకటించింది. దివంగత ఎంపీ వసంత్ రావు కుమారుడే రవీంద్ర. వసంత్ రావు మృతి చెందడంతో నాందేడ్ స్థానికి ఉపఎన్నిక వచి్చంది. వచ్చేనెల 20న పోలింగ్ జరగనుంది. -
Lok sabha elections 2024: ఆర్జేడీకి 26.. కాంగ్రెస్‌కు 9
పట్నా: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు గాను బిహార్‌లో ఆర్జేడీ సారథ్యంలోని మహాఘఠ్‌బంధన్‌లో సీట్ల పంపిణీ కొలిక్కి వచ్చింది. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాలకు గాను దాదాపు మూడింట రెండొంతుల సీట్లలో లాలూ ప్రసాద్‌కు చెందిన ఆర్జేడీ పోటీ చేయనుంది. మిగతా వాటిని కాంగ్రెస్, మూడు వామపక్ష పార్టీలు పంచుకున్నాయి. 2019 ఎన్నికల్లో ఆర్జేడీ ఒక్క సీటూ దక్కించుకోలేకపోయినప్పటికీ ఈసారి 26 చోట్ల పోటీ చేయనుంది. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారీ 9 చోట్ల పోటీ చేయనుంది. ఆ తర్వాత సీపీఐ ఎంఎల్ లిబరేషన్ మూడు, సీపీఐ, సీపీఎంలు చెరో చోట బరిలోకి దిగనున్నాయి. బిహార్‌లో ఆర్జేడీ ఇప్పటికే నాలుగు చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఒక సీటును కాంగ్రెస్ ఆశిస్తోంది. కాంగ్రెస్ పోటీ చేయాలని ఆశిస్తున్న పుర్నియా స్థానానికి లాలూ ప్రసాద్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించేశారు. సీపీఐ, సీపీఐ(ఎంఎల్) కూడా బెగుసరాయ్, ఖరారియా సీట్లకు అభ్యర్థులను ప్రకటించుకున్నాయి. -
Lok Sabha elections 2024: కాంగ్రెస్, ఆప్ సీట్ల సర్దుబాటు!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపే అంశంపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు మంతనాలు మొదలెట్టాయి. త్వరలోనే ఢిల్లీ, గుజరాత్, హరియాణా రాష్ట్రాల్లో సీట్ల పంపకాలపై తుది నిర్ణయం వెలువడనుందని విశ్వసనీయ వర్గాలు గురువారం తెలిపాయి. అయితే ఇప్పటికే కొన్ని ఎంపీ స్థానాల్లో ఏ పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలనే దానిపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. దక్షిణ ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, వాయవ్య ఢిల్లీ, న్యూఢిల్లీ స్థానాల్లో ఆప్ బరిలో దిగనుంది. చాంద్నీ చౌక్, తూర్పు ఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలబెడుతుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గత ఎన్నికల్లో ఈ ఏడు ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలిచింది. హరియాణాలో ఒకటి, గుజరాత్లో రెండు స్థానాలను ఆప్కే కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. గురుగ్రామ్ లేదా ఫరీదాబాద్‌లో ఆప్ పోటీచేయనుంది. గుజరాత్‌లోని భరూచ్ స్థానం నుంచి ఆప్ నేత ఛైతర్ వసావా, భావ్‌నగర్‌లో ఉమేశ్‌భాయ్ మాక్వానా పోటీ చేస్తారని ఇప్పటికే ఆప్ ప్రకటించింది. -
CWC meet: ఎన్నికలకు సిద్ధంకండి
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దించి, కాంగ్రెస్‌ను గెలుపు తీరాలకు చేర్చడమే లక్ష్యంగా పని చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) నిర్ణయించింది. తెలంగాణ మినహా ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నప్పటికీ నైతిక స్థైర్యం వీడకుండా ముందుకుసాగాలని పిలుపునిచి్చంది. కూటమి పక్షాలను కలుపుకుంటూ, విజయ లక్ష్యంతో నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని హైకమాండ్ పెద్దలు సూచించారు. సార్వత్రిక ఎన్నికలు, కూటమి పొత్తులు, సీట్ల పంపకాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో గురువారం జరిగింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, సీనియర్ నేతలు రాహుల్ గాం«దీ, ప్రియాంకా గాం«దీ, కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ భేటీకి ఆంధ్రప్రదేశ్ నుంచి రఘువీరారెడ్డి, టి.సుబ్బిరామిరెడ్డి హాజరయ్యారు. తెలంగాణ నుంచి హాజరు కావాల్సిసిన ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహ అసెంబ్లీ సమావేశాల కారణంగా రాలేదు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మానంలోని అంశాలను తర్వాత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. ‘‘ పార్లమెంటు నుంచి 143 మంది విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడాన్ని సీడబ్ల్యూసీ తీవ్రంగా ఖండించింది. బీజేపీ దాని మిత్రపక్షాలకు ధీటుగా విపక్షాల ‘ఇండియా’ కూటమిని పటిష్టవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి’’ అని సీడబ్ల్యూసీ తీర్మానించింది. ‘‘నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న కారణంగా ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం పెరుగుతున్నాయి. ప్రధాని చెప్పే విషయాలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు మధ్య చాలా అంతరం ఉంది’ అని సీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. ‘‘దేశంలో సామాజిక ధ్రువీకరణ తీవ్రమవుతోంది. ఎన్నికల్లో లాభం పొందేందుకు ప్రజలను రెచ్చగొడుతున్నారు’’ అని మండిపడింది. భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. ‘4 రాష్ట్రాల ఫలితాలపై ప్రాథమిక విశ్లేషణ చేసి ఓటమి కారణాలను గుర్తించాం. ఫలితాలు ప్రతికూలంగా ఉన్నా ఓట్ల శాతం సానుకూలంగా ఉంది. శ్రద్ధ పెడితే వచ్చే ఎన్నికలను మలుపు తిప్పగలమన్న ఆశ పెరిగిందిం’అని చెప్పారు. -
19న ‘ఇండియా’ భేటీ
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో ఈ నెల 19న భేటీ కానున్నారు. ఈ సమావేశంలో సీట్ల పంపకం, ఉమ్మడి ఎజెండా, ఉమ్మడిగా ర్యాలీల నిర్వహణ వంటి కీలక అంశాలపై నేతలు ఒక అంగీకారానికి రావాల్సి ఉంది. కూటమి నాలుగో సమావేశం ఢిల్లీలో 19న సాయంత్రం 3 గంటలకు జరుగుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ఎక్స్’లో ఆదివారం తెలిపారు. ప్రధాని మోదీకి దీటుగా మనం, నేను కాదు(మై నహీ, హమ్)అనే ఐక్య ఇతివృత్తంతో ఇండియా కూటమి నేతలు ముందుకు సాగుతారని ఆయన చెప్పారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఈ సమావేశం జరగనుండటం గమనార్హం. టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా కీలక నేతలు ఈ భేటీకి హాజరవుతారని భావిస్తున్నారు. -
భోపాల్‌లో ‘ఇండియా’ మొట్టమొదటి ర్యాలీ
న్యూఢిల్లీ: ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమి తమ మొట్టమొదటి బహిరంగసభను వచ్చే నెలలో భోపాల్‌లో నిర్వహించనుంది. అదేవిధంగా, భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపిణీకి సంబంధించిన చర్చలను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించనుంది. ఇండియా కూటమి సమన్వయ కమిటీ మొదటి సమావేశం బుధవారం ఢిల్లీలో జరిగింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో జరిగిన ఈ భేటీకి కమిటీలోని 14 మంది సభ్యులకు గాను 12 మంది హాజరయ్యారు. సనాతనధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల దుమారం నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. కమిటీ సభ్యుడు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అనంతరం మాట్లాడుతూ, విచారణకు రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయడంతో టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ భేటీకి రాలేదని చెప్పారు. హాజరైన వారిలో..ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్, జార్ఖండ్ సీఎం, జేఎంఎం నేత హేమంత్ సోరెన్, సీపీఐ నేత డి.రాజా, ఎస్పీ నుంచి జావెద్ అలీ ఖాన్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, జేడీయూకు చెందిన సంజయ్ ఝా, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, శివసేన(యూబీటీ)కి చెందిన సంజయ్ రౌత్ ఉన్నారు. ‘సీట్ల పంపకాల ప్రక్రియను ప్రారంభించాలని సమన్వయ కమిటీ నిర్ణయించింది. భాగస్వామ్య పక్షాలు చర్చలు జరిపి సాధ్యమైనంత త్వరగా సీట్ల పంపణీని ఖరారు చేయాలి.. కూటమి ఉమ్మడి సమావేశాలను దేశవ్యాప్తంగా చేపట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మొట్టమొదటి సభను అక్టోబర్ మొదటి వారంలో భోపాల్‌లో చేపట్టాలని అంగీకారానికి వచ్చారు. బీజేపీ పాలనలో పెరిగిన అవినీతి, నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం ప్రధాన ఎజెండాగా ఈ సభలు జరుగుతాయి’అని కమిటీ ఉమ్మడి ప్రకటనను వేణుగోపాల్ చదివి వినిపించారు. మహారాష్ట్ర, తమిళనాడు, బిహార్‌ల్లో సీట్ల పంపకం సులువుగా కనిపిస్తుండగా, పంజాబ్, ఢిల్లీ, పశి్చమబెంగాల్ల్లో మాత్రం భాగస్వామ్య పక్షాల మధ్య ఏకాభిప్రాయం సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. -
ఒక్కోపార్టీకి 125 సీట్లు
ముంబై: మహారాష్ట్రలో కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ల మధ్య సీట్లు ఖరారయ్యాయి. రాష్ట్రంలో వచ్చేనెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, ఎన్సీపీలు చెరో 125 స్థానాల్లో పోటీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 288 స్థానాలున్న మహారాష్ట్రలో మరో 38 స్థానాలను కూటమిలోని ఇతర పార్టీలకు కేటాయించినట్లు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ సోమవారం ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల్లో ఎన్సీపీ తరఫున కొత్త వ్యక్తులు ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారని ఆయన స్పష్టం చేశారు. రెండు పార్టీల మధ్య పలు స్థానాల్లో సీట్ల మార్పు కూడా ఉంటుందని తెలిపారు. -
కాంగ్రెస్‌కు 20, జేడీఎస్‌కు 8
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి మధ్య లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపిణీ విషయమై ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు గానూ కాంగ్రెస్ 20, జేడీఎస్ 8 స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయించాయి. ఈ విషయమై జేడీఎస్ స్పందిస్తూ.. ఉత్తర కన్నడ, చిక్మంగళూరు, శివమొగ్గ, తుమకూరు, హసన్, మాండ్య, బెంగళూరు నార్త్, విజయపురా స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీచేస్తారని తెలిపింది. సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ మాండ్య నుంచి, కుమారస్వామి అన్న రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ హసన్ సీటు నుంచి పోటీచేస్తారని వెల్లడించింది. అలాగే మాజీ సీఎం ఎస్.బంగారప్ప కుమారుడు, ఎమ్మెల్యే మధు బంగారప్పను శివమొగ్గ నుంచి బీజేపీ నేత యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్రపై పోటీకి దించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. మరోవైపు తమ అభ్యర్థుల పేర్లను మార్చి 16న ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 17 సీట్లు దక్కించుకోగా, కాంగ్రెస్ 9, జేడీఎస్ అభ్యర్థులు రెండు స్థానాల్లో విజయం సాధించారు. -
మహాకూటమి లెక్కతేలింది..
సాక్షి, హైదరాబాద్: కేవలం 11 స్థానాలు మినహా మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. ఇప్పటివరకు కాంగ్రెస్ 88, టీడీపీ 13, టీజేఎస్ 4, సీపీఐ 3 స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించాయి. పెండింగ్‌లో ఉన్న 11 స్థానాలకు ఆదివారం క్లియరెన్స్ రానుంది. ఆదివారం కాంగ్రెస్ తుది జాబితాను ప్రకటించనున్న నేపథ్యంలో కూటమి లెక్క పక్కాగా తేలనుంది. శనివారమే కాంగ్రెస్ పార్టీ తుది జాబితా వస్తుందని భావించినా, కేవలం 13 సీట్లకే అభ్యర్థులను ప్రకటించి 6 స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. దీంతో కూటమిలోని ఇతర పార్టీలకు సంబంధించిన మరో ఐదు స్థానాలు కూడా అస్పష్టంగా మిగిలిపోయాయి. కాగా, శనివారం టీజేఎస్ 4స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ కోటాలోకి జనగామ.. కూటమిలోని 17 మంది అభ్యర్థులను శని వారం అధికారికంగా ప్రకటించారు. ఇం దులో 13 కాంగ్రెస్, 4 జనసమితి స్థానాలున్నాయి. కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు లైన్‌క్లియర్ అయింది. టీజేఎస్ అధినేత కోదండరాం పోటీచేస్తారని భావించిన జనగామ నియోజకవర్గాన్ని అధిష్టానం వద్ద తనకున్న పలుకుబడితో కాంగ్రెస్ కోటాలో వేయడంలో పొన్నాల సఫలీకృతులయ్యారు. ఈయనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ (తుంగతుర్తి), నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్.బాలూనాయక్ (దేవరకొండ), డి.సుధీర్‌రెడ్డి (ఎల్బీనగర్), ఈరవత్రి అనిల్ (బాల్కొండ)కు కూడా టికెట్లు కేటాయించింది. రేవంత్‌రెడ్డి కోటాలో ఇల్లెందు స్థానం బాణోతు హరిప్రియా నాయక్‌కు ఖరారు చేశారు. నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్‌కు నిజామాబాద్ అర్బన్ స్థానాన్ని కేటాయించారు. ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి నిజామాబాద్ రూరల్‌లో అవకాశమిచ్చారు. ఇక, పాతబస్తీలోని యాకుత్‌పుర, బహుదూర్‌పుర నియోజకవర్గాలకు కూడా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. కొల్లాపూర్‌లో ముందునుంచీ ఊహించినట్లుగానే హర్షవర్దన్‌రెడ్డికి టికెటిచ్చారు. ఇక, ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావుకు మరోమారు అవకాశమిచ్చారు. తెలంగాణ జనసమితి కూడా నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో కపిలవాయి దిలీప్‌కుమార్ (మల్కాజ్గిరి), చిందం రాజ్‌కుమార్ (దుబ్బాక), భవానీరెడ్డి (సిద్ధిపేట), జనార్దన్‌రెడ్డి (మెదక్)లున్నాయి. ‘మర్రి’కి మొండిచేయి... మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇచ్చింది. శనివారం ఆ పార్టీ ప్రకటించిన మూడో జాబితాలో ఆయన పేరు లేకపోవడం, ఆ జాబితా వచ్చిన వెంటనే సనత్‌నగర్ అభ్యర్థిగా కూన వెంకటేశ్‌గౌడ్‌ను టీడీపీ ప్రకటించడంతో ఆయన అవాక్కయ్యారు. షాక్ నుంచి తేరుకున్న శశిధర్‌రెడ్డి తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం గమనార్హం. అయితే, శశిధర్‌రెడ్డికి శనివారం సాయంత్రం ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. రాహుల్ కోటరీలో శక్తివంతమైన నేతగా పేరున్న అహ్మద్‌పటేల్ నుంచి ఫోన్ రా>వడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. ఈ నేపథ్యంలో మర్రి భవితవ్యం ఏంటనేది ఆదివారం తేలనుంది. పెండింగ్ వీరికేనా... కూటమి పక్షాన ఇంకా ప్రకటించకుండా పెండింగ్‌లో ఉన్న 11 నియోజకవర్గాల్లో 6 చోట్ల కాంగ్రెస్ పోటీచేసే అవకాశాలున్నాయి. ఇందులో నారాయణŠ ఖేడ్ నుంచి సురేశ్‌షెట్కార్, హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్‌రెడ్డి, దేవరకద్ర నుంచి పవన్‌కుమార్‌రెడ్డి, నారాయణపేట నుంచి శివకుమార్‌రెడ్డి లేదా షరాబు శివకుమార్, సికింద్రాబాద్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ లేదా ఆదం ఉమ లేదా బండా కార్తీక, కోరుట్ల నుంచి జువ్వాడి నర్సింగరావు లేదా కొమిరెడ్డి జ్యోతి రామ్‌లు ఖరారు కానున్నారు. ఇక, రాజేంద్రనగర్ నుంచి కాంగ్రెస్ పోటీచేస్తే అక్కడ సినీ నిర్మాత బండ్ల గణేశ్ పేరు ఖరారు చేస్తారని తెలుస్తోంది. జన సమితి పోటీ చేయాలనుకుంటున్న స్థానాల్లో వర్ధన్నపేట నుంచి డాక్టర్ దేవయ్య, అంబర్‌పేట నుంచి సత్యంగౌడ్, మిర్యాలగూడ నుంచి విజయేందర్‌రెడ్డి, వరంగల్ తూర్పు నుంచి గాదె ఇన్నారెడ్డి ఖరారు కానున్నారు. వరంగల్ తూర్పు స్థానాన్ని కాంగ్రెస్‌కు ఇస్తే అక్కడ వద్దిరాజు రవిచంద్ర పోటీ చేయనున్నారు. మిర్యాలగూడ కూడా కాంగ్రెస్‌కు ఇచ్చే పక్షంలో అక్కడ జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి బరిలో ఉంటారు. పఠాన్‌చెరు స్థానాన్ని టీడీపీకి కేటాయించనుండగా అక్కడ మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ పేరు వినిపిస్తోంది. ‘కూటమి’కులాల వారీగా.... ఇప్పటి వరకు కూటమి పార్టీలు ప్రకటించిన అభ్యర్థుల వివరాలను కులాల వారీగా పరిశీలిస్తే.. కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 32 స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గానికి సీట్లు కేటాయించింది. ఆ తర్వాత ఎస్సీల్లో మాదిగలకు 9, మాలలకు 8 సీట్లు ప్రకటించింది. ఎస్టీల్లో లంబాడీలు, ఆదివాసీలకు చెరో 5 నియోజక వర్గాలను కేటాయించగా, బీసీల్లో అత్యధికంగా మున్నూరు కాపులకు 7 చోట్ల అవకాశమిచ్చింది. ఆ తర్వాత గౌడ కులస్తులకు 4, పద్మశాలీలకు 2, యాదవ, బొందిలి, భట్రాజు, విశ్వబ్రాహ్మణ, పవార్ కులస్తులకు ఒక్కోటి చొప్పున ఇచ్చింది. ముస్లిం మైనార్టీలకు 7 చోట్ల అవకాశం కల్పించింది. ఇక అగ్రవర్ణాల్లో వెలమలకు 3 చోట్ల, బ్రాహ్మణులకు 1 స్థానంలో అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు ప్రకటించిన 13 స్థానాలకు గాను కమ్మ కులస్తులకు 3, వైశ్యులకు 1, రెడ్లకు 3, బీసీలకు 3, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు ఒక్కోటి చొప్పున కేటాయించింది. జనసమితి శనివారం సాయంత్రం ప్రకటించిన నలుగురు అభ్యర్థుల్లో ముగ్గురు ఓసీ, ఒక బీసీ ఉన్నారు. అందులో ఒకరు బ్రాహ్మణ, ఒకరు మున్నూరుకాపు, ఇద్దరు రెడ్డి సామాజిక వర్గాలకు చెందినవారు. సీపీఐ తరఫున పోటీచేసే ముగ్గురిలో ఎస్సీ (మాదిగ) ఒకటి, ఎస్టీ (లంబాడ) ఒకటి, ఓసీ (రెడ్డి) ఒకటి చొప్పున కేటాయించారు. స్నేహపూర్వక పోటీ లేనట్టే... కూటమి పక్షాల్లో సీట్ల సర్దుబాటు శనివారంతో పూర్తికానుండగా, స్నేహపూర్వక పోటీలకు కూడా అవకాశం లేదని తెలుస్తోంది. ఆసిఫాబాద్, స్టేషన్ ఘన్పూర్ స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటిస్తామని టీజేఎస్ చెప్పినా గందరగోళానికి తావు లేకుండా ఈ పోటీలను నివారించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే, కొన్ని చోట్ల కూటమిలోని ఇతర పార్టీలకు కేటాయించిన చోట్ల ఇంకో పార్టీ అభ్యర్థులు రెబల్‌గా బరిలో దిగే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు కూటమిలోని పార్టీలు ప్రకటించిన స్థానాల సంఖ్య: కాంగ్రెస్: 88 టీడీపీ: 13 టీజేఎస్ : 04 సీపీఐ: 03 మొత్తం: 108 పెండింగ్: 11 కూటమి అభ్యర్థులను ప్రకటించని స్థానాలు: నారాయణ్‌ఖేడ్, నారాయణపేట, మిర్యాలగూడ, హుజూరాబాద్, సికింద్రాబాద్, అంబర్‌పేట, వరంగల్ (ఈస్ట్), పఠాన్‌చెరు, కోరుట్ల, దేవరకద్ర, వర్ధన్నపేట. ఇప్పటివరకు కాంగ్రెస్ మిత్రపక్షాలు అభ్యర్థులను ఖరారు చేసిన నియోజకవర్గాలివే: తెలుగుదేశం: నియోజకవర్గం అభ్యర్థి పేరు సామాజిక వర్గం 1. ఉప్పల్ టి.వీరేందర్‌గౌడ్ బీసీ (గౌడ్) 2. శేరిలింగంపల్లి భవ్య ఆనందప్రసాద్ ఓసీ (కమ్మ) 3. కూకట్పల్లి సుహాసిని ఓసీ (కమ్మ) 4. సనత్‌నగర్ కూన వెంకటేశ్‌గౌడ్ బీసీ (గౌడ్) 5. రాజేంద్రనగర్ గణేశ్‌గుప్తా ఓసీ (వైశ్య) 6. ఇబ్రహీంపట్నం సామా రంగారెడ్డి ఓసీ (రెడ్డి) 7. ఖమ్మం నామా నాగేశ్వరరావు ఓసీ (కమ్మ) 8. అశ్వారావుపేట మెచ్చా నాగేశ్వరరావు ఎస్టీ (కోయ) 9. సత్తుపల్లి సండ్రవెంకటవీరయ్య ఎస్సీ (మాదిగ) 10. మహబూబ్‌నగర్ ఎర్ర శేఖర్ బీసీ (ముదిరాజ్) 11. మక్తల్ కొత్తకోట దయాకర్‌రెడ్డి ఓసీ (రెడ్డి) 12. వరంగల్ (వెస్ట్) రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఓసీ (రెడ్డి) 13. మలక్‌పేట ముజఫర్‌అలీ ముస్లిం మైనార్టీ (టీడీపీ ప్రకటించిన 13 స్థానాల్లో ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ నియోజకవర్గాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ రెండు నియోజకవర్గాల్లో.. లేదంటే ఒకచోట కాంగ్రెస్ పోటీచేసే అవకాశాలున్నాయి. పఠాన్‌చెరు నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించనున్నారు.) తెలంగాణ జనసమితి: 1. దుబ్బాక చిందం రాజ్‌కుమార్ బీసీ (మున్నూరుకాపు) 2. సిద్ధిపేట భవానీరెడ్డి ఓసీ (రెడ్డి) 3. మల్కాజ్గిరి కె. దిలీప్‌కుమార్ ఓసీ (బ్రాహ్మణ) 4. మెదక్ జనార్దనరెడ్డి ఓసీ (రెడ్డి) (ఈ పార్టీ విషయంలో స్పష్టత వచ్చిన నియోజకవర్గాల్లో అంబర్‌పేట, వర్ధన్నపేట స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మిర్యాలగూడ, వరంగల్ (ఈస్ట్) నియోజకవర్గాల విషయంలో నేడు పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది.) సీపీఐ: 1. బెల్లంపల్లి గుండా మల్లేశ్ ఎస్సీ (మాదిగ) 2. వైరా బి. విజయ ఎస్టీ (లంబాడీ) 3. హుస్నాబాద్ చాడా వెంకటరెడ్డి ఓసీ (రెడ్డి) కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల సామాజిక వర్గాల వారీ వివరాలు: ఓసీ – 36, బీసీ – 18, ఎస్సీ – 17, ఎస్టీ – 10, మైనార్టీ – 7 , మొత్తం – 88 కూటమి తరఫున ఇప్పటివరకు ఖరారైన అభ్యర్థుల సామాజిక వర్గాల వారీ వివరాలు: ఓసీ – 47, బీసీ – 22, ఎస్సీ – 19, ఎస్టీ – 12, మైనార్టీ – 8, మొత్తం – 108. కాంగ్రెస్ మూడో జాబితా నిజామాబాద్(అర్బన్) : తాహెర్ బిన్ హమ్దాన్ నిజామాబాద్(రూరల్) : రేకుల భూపతిరెడ్డి బాల్కొండ : ఇ.అనిల్‌కుమార్ ఎల్బీనగర్ : డి.సుధీర్‌రెడ్డి కార్వాన్ : ఉస్మాన్ బిన్ మొహమ్మద్ అల్ హజ్రీ యాకుత్‌పుర : కె.రాజేందర్ రాజు బహదూర్పు : కాలెం బాబా కొల్లాపూర్ : బీరం హర్షవర్ధ్దన్‌రెడ్డి దేవరకొండ(ఎస్టీ) : బాలూనాయక్ తుంగతుర్తి(ఎస్సీ) : అద్దంకి దయాకర్ జనగామ : పొన్నాల లక్ష్మయ్య ఇల్లెందు : బానోతు హరిప్రియా నాయక్ బోథ్(ఎస్టీ) : సోయం బాపూరావు టీజేఎస్ జాబితా.. మల్కాజ్గిరి : దిలీప్‌కుమార్ దుబ్బాక : రాజ్‌కుమార్ సిద్ద్ధిపేట్ : భవానీరెడ్డి మెదక్ : జనార్దన్‌రెడ్డి -
సీట్ల పంపకాలపై పీటముడి
-
సీట్లపై పీటముడి
* సర్దుబాటుపై టీడీపీ, బీజేపీ పేచీలు * మీ కంటే మాకే ఎక్కువ కావాలంటూ పట్టు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీల మధ్య సీట్ల పంపకాలపై పీటముడి నెలకొంది. గ్రేటర్లో తమకే బలం ఎక్కువనే అభిప్రాయంతో ఉన్న రెండు పార్టీల నేతలు తక్కువ సీట్లు పొందేందుకు ఒప్పుకోవడం లేదు. రెం డు పార్టీల మధ్య మొదలైన ప్రాథమిక చర్చల్లో ఈ విషయం స్పష్టమైంది. ఆదివారం ఎన్టీఆర్ భవన్లో, ఓ బీజేపీ నేత నివాసంలో రెండు పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనతోపాటు ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశాలపై చర్చించిన ట్లు సమాచారం. మొత్తమున్న 150 సీట్లలో పాతబస్తీలో ఎంఐఎంకు పట్టున్న సుమారు 30 సీట్లను మినహాయిస్తే మిగిలిన సీట్లు 120 మాత్రమేనని, వీటిలో గెలుపు అవకాశాలున్న వాటి విషయంలోనే ఇరు పార్టీల నేతలు పట్టుపడుతున్నారని తెలిసింది. బీజేపీ 60 సీట్లకు పోటీ చేయాలని టీడీపీ ప్రాథమికంగా ప్రతిపాదించగా, బీజేపీ తోసిపుచ్చినట్లు తెలిసింది. తెలంగాణలో టీడీపీకి ఏమాత్రం బలం లేదని, సెటిలర్ల బలం చూసుకుంటే తెలంగాణ స్థాని కుల ఓట్లు కూడా అవసరమేనని బీజేపీ నేతలు చెప్పినట్లు సమాచారం. నాలుగు స్థానాల్లో బీజేపీ ఎక్కువ పోటీ చేసినా, తెలంగాణ ప్రజ లు ఆమోదిస్తారని.. టీడీపీకి ఆ పరిస్థితి లేదని బీజేపీ ముఖ్యనేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సెటిలర్లు కూడా బీజేపీకి ఓటేసేందుకు మొగ్గు చూపుతున్నారని, టీడీపీకి చెందిన 30 మంది కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరడం ఆ పార్టీకి ప్రతికూలమని కూడా పేర్కొంటున్నారు. కేసీఆర్‌తో చంద్రబాబు మిత్రుత్వం నెరపడం వల్ల సెటిలర్ల ఓట్లు టీడీపీకన్నా టీఆర్ఎస్కే అనుకూలమవుతాయన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే బీజేపీకి లేని కార్యకర్తల బలం, ఓటర్లు టీడీపీకి ఉన్నారని తెలుగుదేశం నాయకులు వాదించినట్లు తెలిసింది. బీజేపీ బలముందని చెబుతున్న కోర్‌సిటీలో మెజారిటీ స్థానాలు బీజేపీ పోటీ చేసినా తమకు అభ్యంతరం లేదని, శివార్లలో మాత్రం 60 శాతానికి పైగా డివిజన్లలో తాము పోటీ చేస్తామని ఓ కీలక టీడీపీ నేత వ్యాఖ్యానించినట్లు సమాచారం. కాగా ఈనెల 12న చంద్రబాబు, కేంద్ర మంత్రి జెపీ లడ్డాలతో జరిగే బహిరంగసభ తరువాత సీట్ల పంపకం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. టీడీపీ, బీజేపీ నేతలు తమకు బలం ఉందని భావిస్తున్న డివిజన్ల జాబితాలను మార్చుకున్నారు.