సీడబ్ల్యూసీ భేటీలో సోనియా గాందీ, ఖర్గే
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దించి, కాంగ్రెస్‌ను గెలుపు తీరాలకు చేర్చడమే లక్ష్యంగా పని చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) నిర్ణయించింది. తెలంగాణ మినహా ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నప్పటికీ నైతిక స్థైర్యం వీడకుండా ముందుకుసాగాలని పిలుపునిచి్చంది. కూటమి పక్షాలను కలుపుకుంటూ, విజయ లక్ష్యంతో నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని హైకమాండ్ పెద్దలు సూచించారు.
సార్వత్రిక ఎన్నికలు, కూటమి పొత్తులు, సీట్ల పంపకాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో గురువారం జరిగింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, సీనియర్ నేతలు రాహుల్ గాం«దీ, ప్రియాంకా గాం«దీ, కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ భేటీకి ఆంధ్రప్రదేశ్ నుంచి రఘువీరారెడ్డి, టి.సుబ్బిరామిరెడ్డి హాజరయ్యారు.
తెలంగాణ నుంచి హాజరు కావాల్సిసిన ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహ అసెంబ్లీ సమావేశాల కారణంగా రాలేదు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మానంలోని అంశాలను తర్వాత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. ‘‘ పార్లమెంటు నుంచి 143 మంది విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడాన్ని సీడబ్ల్యూసీ తీవ్రంగా ఖండించింది.
బీజేపీ దాని మిత్రపక్షాలకు ధీటుగా విపక్షాల ‘ఇండియా’ కూటమిని పటిష్టవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి’’ అని సీడబ్ల్యూసీ తీర్మానించింది. ‘‘నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న కారణంగా ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం పెరుగుతున్నాయి. ప్రధాని చెప్పే విషయాలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు మధ్య చాలా అంతరం ఉంది’ అని సీడబ్ల్యూసీ అభిప్రాయపడింది.
‘‘దేశంలో సామాజిక ధ్రువీకరణ తీవ్రమవుతోంది. ఎన్నికల్లో లాభం పొందేందుకు ప్రజలను రెచ్చగొడుతున్నారు’’ అని మండిపడింది. భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. ‘4 రాష్ట్రాల ఫలితాలపై ప్రాథమిక విశ్లేషణ చేసి ఓటమి కారణాలను గుర్తించాం. ఫలితాలు ప్రతికూలంగా ఉన్నా ఓట్ల శాతం సానుకూలంగా ఉంది. శ్రద్ధ పెడితే వచ్చే ఎన్నికలను మలుపు తిప్పగలమన్న ఆశ పెరిగిందిం’అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment