న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అమలుచేయాల్సిన ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకునేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) డిసెంబర్ 21వ తేదీన సమావేశం కానుంది. డిసెంబర్ 19వ తేదీన విపక్షాల ‘ఇండియా’ కూటమి భేటీ పూర్తయిన రెండు రోజులకు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సీడబ్ల్యూసీ భేటీ జరగనుంది.
వివిధ రాష్ట్రాల్లో కూటమి పారీ్టలతో సీట్లు పంపకం, ఎన్నికల ప్రచార వ్యూహాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. హిందీ ప్రాబల్య రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ఓటమిపై సమీక్ష జరగొచ్చు. నిరుద్యోగం, పెరిగిన ధరలను ప్రధాన విమర్శనా్రస్తాలుగా తీసుకుని పశి్చమ–ఈశాన్య భారతాల మధ్య రాహుల్‌గాంధీ మరోమారు పాదయాత్ర చేసే అంశాన్నీ చర్చించే వీలుంది.
19న ఇండియా ‘కీలక’ భేటీ
‘ఇండియా’ కూటమి విపక్ష పార్టీలు ఢిల్లీలో ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం సమావేశం కానున్నాయి. సీట్ల పంపకం, కనీస ఉమ్మడి కార్యాచరణ, సీట్ల పంపకం జరిగిన చోట్ల ఉమ్మడిగా ప్రచార ర్యాలీలు చేపట్టడం వంటి సవాళ్లు నేతలకు స్వాగతం పలకనున్నాయి. వీటిపై సమావేశంలో ఒక స్పష్టత వచ్చే వీలుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘‘నేను కాదు, మనం’’ అనే కొత్త నినాదంలో జనంలోకి వెళ్లాలని విపక్షాల కూటమి నిర్ణయించిన సంగతి తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment