CWC meet
-
CWC meet: ఎన్నికలకు సిద్ధంకండి
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దించి, కాంగ్రెస్‌ను గెలుపు తీరాలకు చేర్చడమే లక్ష్యంగా పని చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) నిర్ణయించింది. తెలంగాణ మినహా ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నప్పటికీ నైతిక స్థైర్యం వీడకుండా ముందుకుసాగాలని పిలుపునిచి్చంది. కూటమి పక్షాలను కలుపుకుంటూ, విజయ లక్ష్యంతో నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని హైకమాండ్ పెద్దలు సూచించారు. సార్వత్రిక ఎన్నికలు, కూటమి పొత్తులు, సీట్ల పంపకాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో గురువారం జరిగింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, సీనియర్ నేతలు రాహుల్ గాం«దీ, ప్రియాంకా గాం«దీ, కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ భేటీకి ఆంధ్రప్రదేశ్ నుంచి రఘువీరారెడ్డి, టి.సుబ్బిరామిరెడ్డి హాజరయ్యారు. తెలంగాణ నుంచి హాజరు కావాల్సిసిన ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహ అసెంబ్లీ సమావేశాల కారణంగా రాలేదు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మానంలోని అంశాలను తర్వాత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. ‘‘ పార్లమెంటు నుంచి 143 మంది విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడాన్ని సీడబ్ల్యూసీ తీవ్రంగా ఖండించింది. బీజేపీ దాని మిత్రపక్షాలకు ధీటుగా విపక్షాల ‘ఇండియా’ కూటమిని పటిష్టవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి’’ అని సీడబ్ల్యూసీ తీర్మానించింది. ‘‘నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న కారణంగా ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం పెరుగుతున్నాయి. ప్రధాని చెప్పే విషయాలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు మధ్య చాలా అంతరం ఉంది’ అని సీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. ‘‘దేశంలో సామాజిక ధ్రువీకరణ తీవ్రమవుతోంది. ఎన్నికల్లో లాభం పొందేందుకు ప్రజలను రెచ్చగొడుతున్నారు’’ అని మండిపడింది. భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. ‘4 రాష్ట్రాల ఫలితాలపై ప్రాథమిక విశ్లేషణ చేసి ఓటమి కారణాలను గుర్తించాం. ఫలితాలు ప్రతికూలంగా ఉన్నా ఓట్ల శాతం సానుకూలంగా ఉంది. శ్రద్ధ పెడితే వచ్చే ఎన్నికలను మలుపు తిప్పగలమన్న ఆశ పెరిగిందిం’అని చెప్పారు. -
21న సీడబ్ల్యూసీ కీలక భేటీ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అమలుచేయాల్సిన ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకునేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) డిసెంబర్ 21వ తేదీన సమావేశం కానుంది. డిసెంబర్ 19వ తేదీన విపక్షాల ‘ఇండియా’ కూటమి భేటీ పూర్తయిన రెండు రోజులకు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సీడబ్ల్యూసీ భేటీ జరగనుంది. వివిధ రాష్ట్రాల్లో కూటమి పారీ్టలతో సీట్లు పంపకం, ఎన్నికల ప్రచార వ్యూహాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. హిందీ ప్రాబల్య రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ఓటమిపై సమీక్ష జరగొచ్చు. నిరుద్యోగం, పెరిగిన ధరలను ప్రధాన విమర్శనా్రస్తాలుగా తీసుకుని పశి్చమ–ఈశాన్య భారతాల మధ్య రాహుల్‌గాంధీ మరోమారు పాదయాత్ర చేసే అంశాన్నీ చర్చించే వీలుంది. 19న ఇండియా ‘కీలక’ భేటీ ‘ఇండియా’ కూటమి విపక్ష పార్టీలు ఢిల్లీలో ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం సమావేశం కానున్నాయి. సీట్ల పంపకం, కనీస ఉమ్మడి కార్యాచరణ, సీట్ల పంపకం జరిగిన చోట్ల ఉమ్మడిగా ప్రచార ర్యాలీలు చేపట్టడం వంటి సవాళ్లు నేతలకు స్వాగతం పలకనున్నాయి. వీటిపై సమావేశంలో ఒక స్పష్టత వచ్చే వీలుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘‘నేను కాదు, మనం’’ అనే కొత్త నినాదంలో జనంలోకి వెళ్లాలని విపక్షాల కూటమి నిర్ణయించిన సంగతి తెల్సిందే. -
‘ఆత్మనిర్భర్, అమృత్ కాల్.. బూటకపు పదాలు మాత్రమే!’
సాక్షి, హైదరాబాద్: CWC సమావేశం ప్రారంభ ఉపన్యాసంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మోదీ ప్రభుత్వ పద్దతులు లౌకిక భారతదేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని, ప్రతిపక్ష పార్టీలపై బీజేపీ ప్రతీకార చర్యకు పూనుకుందని ఆరోపించారాయన. తాజ్ కృష్ణ హోటల్ వేదికగా శనివారం సాయంత్రం సీడబ్ల్యూసీ సమావేశం జరగ్గా కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ప్రారంభోపన్యాసంలో.. ‘‘కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కీలక పాత్ర పోషిస్తోంది. కానీ, అధికారంలో ఉండి శాంతి స్థాపనలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. మణిపూర్‌లో ఇప్పటికీ జరుగుతున్న విషాదకర సంఘటనలను దేశం మొత్తం చూస్తోంది. మోదీ ప్రభుత్వ పద్దతులు లౌకిక భారతదేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని మల్లికార్జున ఖర్గే తెలిపారు. మన ఆర్థిక వ్యవస్థ నేడు తీవ్ర ప్రమాదంలో ఉంది. దేశంలో రికార్డు స్థాయిలో నిరుద్యోగం ఉంది. జాతీయ భద్రత విషయంలో, చైనా ఆక్రమణల విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదు అని అన్నారాయన. ఆత్మనిర్భర్ భారత్, 5 ట్రిలియన్ ఎకానమీ, న్యూ ఇండియా 2022, అమృత్ కాల్ , 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. ఇలాంటి నినాదాల్నీ కేవలం తమ వైఫల్యాల నుండి దేశాన్ని మరల్చడానికి కేంద్రంలోని బీజేపీ పుట్టించిన బూటకపు పదాలు మాత్రమేనని ఖర్గే అన్నారు. భారత రాజ్యాంగాన్ని, దేశ ప్రజాస్వామ్యాన్ని, అట్టడుగు వర్గాల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. భారతదేశ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినందున, ప్రజల గొంతుకగా ఉండటం కాంగ్రెస్ బాధ్యత. ఈరోజు 27 భారత పార్టీలు ప్రాముఖ్యమైన ప్రాథమిక సమస్యలపై కలిసి ఉన్నాయి. కానీ, ప్రతిపక్ష పార్టీలపై బీజేపీ ప్రతీకార చర్యకు పూనుకుంది. పార్లమెంట్లో ప్రతిపక్షాలను అణచివేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. త్వరలో జరగబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అధికార పార్టీ ఉద్దేశాల గురించి ఆందోళన కలిగిస్తున్నాయన్నారు ఖర్గే. ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికల వ్యూహంపై రేపు(ఆదివారం) అంతర్గత సమావేశంలో చర్చిద్దామని.. అలాగే సంస్థాగత సమస్యలపైనా రేపటి సమావేశంలో వివరంగా మాట్లాడతాను అని ఖర్గే సభ్యులను ఉద్దేశించి తెలిపారు. -
ప్రస్తుతానికి సోనియానే!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలయ్యేవరకు సోనియా గాంధీనే పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగనున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం నాలుగున్నర గంటల పాటు వాడీవేడీగా జరిగింది. సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఐదు రాష్ట్రాల ఫలితాలపై సమీక్ష జరిపారు. పార్టీ ప్రయోజనాల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమేనని సమావేశంలో సోనియా చెప్పారు. సోనియా నాయకత్వంపై కమిటీ పూర్తి విశ్వాసాన్ని ప్రకటించింది. రాబోయే ఎన్నికల్లో రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేలా, పార్టీని బలోపేతం చేసేలా తక్షణ మార్పులకు శ్రీకారం చుట్టాలని ఆమెను కోరింది. రాహుల్ పార్టీ నాయకత్వం వహించాలన్నది ప్రతిఒక్క కార్యకర్త కోరికని, అయితే సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నందున వీటిలోనే కొత్త అధ్యక్షుడిని నిర్ణయిస్తామని పార్టీ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల అనంతరం పార్టీలో చింతన్ శిబిర్ నిర్వహిస్తామని, పార్టీని బలోపేతం చేసేందుకు అధ్యక్షురాలు తక్షణ చర్యలు చేపడతారని పార్టీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. ఈ శిబిరాన్ని రాజస్థాన్‌లో నిర్వహించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సూచించారు. పార్టీ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ సీడబ్ల్యూసీ ముందు ప్రస్తావించగా, వారి ప్రతిపాదనను సభ్యులు ఏకగ్రీవంగా తిరస్కరించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఫలితాలు తీవ్ర ఆందోళనకరం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి దారి తీసిన కారణాలపై సీడబ్ల్యూసీ చర్చించిందని, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ సహా పలువురు సీనియర్ నేతలు సూచనలు చేశారని సూర్జేవాలా పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్టీకి ‘తీవ్ర ఆందోళన కలిగించేవి’లా ఉన్నాయన్న అంశాన్ని సీడబ్ల్యూసీ ఆమోదించింది. కాంగ్రెస్ తన వ్యూహంలో లోపాల కారణంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను సమర్థవంతంగా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళలేకపోయినట్లు అంగీకరించారు. వీటితో పాటు పంజాబ్‌లో అధికార వ్యతిరేకతను అధిగమించలేకపోయిందని, పార్టీ అంతర్గత కలహాలు కొంప ముంచాయని సీడబ్ల్యూసీ అంగీకరించింది. అదే సమయంలో శక్తివంతమైన ప్రతిపక్షంగా కొనసాగుతామని ప్రజలకు హామీ ఇచ్చింది. ఈ ఏడాదితో పాటు, 2023, 2024లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో పాటు సార్వత్రిక ఎన్నికల సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సిద్ధమవుతుందని సీడబ్ల్యూసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా, రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భగేల్, అజయ్ మాకెన్, సల్మాన్ ఖుర్షీద్, హరీష్ రావత్, మల్లికార్జున్ ఖర్గే, అంబికా సోనీ, చిదంబరం, గులాంనబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ సహా ప్రముఖ నేతలు పాల్గొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కరోనా కారణంగా ఏకే ఆంటోని హాజరుకాలేదు. మీరే దిక్కు పార్టీ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని సోనియా ప్రకటించారు. సమావేశంలో అసమ్మతి నేతలు సహా అందరి అభిప్రాయాలను ఆమె తెలుసుకున్నారు. అయితే సంస్థాగత ఎన్నికల వరకు సోనియా నాయకత్వం కొనసాగించాలని ప్రతి సభ్యుడు కోరారని సూర్జేవాలా చెప్పారు. ఆగస్టు 21– సెప్టెంబర్ 20 మధ్య కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు బీజేపీ– ఆర్ఎస్ఎస్ గాంధీ కుటుంబంపై బురద జల్లుతున్నాయని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. పార్టీని బలోపేతం చేసే మార్గాలపై రాహుల్ సూచనలిచ్చారన్నారు. పార్టీ ఓటమికి కారణాలను సభ్యులు విశ్లేషించినట్లు తెలిపారు. సమావేశానికి జీ 23 కూటమికి చెందిన ఆజాద్, ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్ మాత్రమే హాజరయ్యారు. పార్టీ బలోపేతానికి తాము కూడా కృషి చేస్తామని, తమకు ప్రత్యేక కూటమి ఏదీ లేదని, జీ23 అనేది మీడియా సృష్టని వీరు వివరణ ఇచ్చినట్లు సమాచారం. సమావేశానికి ముందు రాహుల్‌ను అధ్యక్షుడిగా చేయాలంటూ పలువురు కార్యకర్తలు, నాయకులు నినాదాలిచ్చారు. పార్టీ ఐక్యంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే బాధ్యతలు స్వీకరించాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ అన్నారు. గత మూడు దశాబ్దాలుగా గాంధీ కుటుంబం నుంచి ఎవరూ ప్రధాని, కేంద్ర మంత్రికాలేకపోయారని, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఐక్యతకు గాంధీ కుటుంబం కీలకమని నాయకులు అర్థం చేసుకోవాలని గహ్లోత్ పేర్కొన్నారు. యాక్టివ్‌గా అసమ్మతి గ్రూప్ ఆదివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశానికి కంటే ముందే, కాంగ్రెస్‌లోని అసంతప్తి వర్గానికి చెందిన సీనియర్ నేతలు శుక్రవారం గులాం నబీ ఆజాద్ నివాసంలో భేటీ అయి భవిష్యత్తు వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశానికి ఆనంద్ శర్మ, కపిల్ సిబల్, మనీష్ తివారీ వంటి ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ పార్టీ అన్ని నిర్ణయాలు కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, రణదీప్ సూర్జేవాలాలు తీసుకుంటున్నారని జీ23 లోని నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి వీడినప్పటికీ, తెర వెనుక నుంచి ఆయనే పార్టీని నడిపిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తామంతా పార్టీ శ్రేయోభిలాషులమే కానీ శత్రువులం కాదు అని ఈ నేతలు పలుమార్లు స్పష్టం చేశారు. -
16న సీడబ్ల్యూసీ సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఈనెల 15న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుందని ఏఐసీసీ కార్యదర్శి వేణుగోపాల్ ప్రకటించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు పలు విషయాలను కమిటీ చర్చిస్తుందన్నారు. మే తర్వాత సీడబ్లు్యసీ సమావేశం జరగడం ఇదే తొలిసారి. సమావేశంలో గతంలో ధిక్కార స్వరం వినిపించిన జీ23 గ్రూపు నేతలు ఎలా ప్రవర్తిస్తారని ఆసక్తి నెలకొంది. అలాగే పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికపై చర్చను లేవనెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఈ విషయంపై జీ–23 నేతలు లేఖ రాయడం ద్వారా సంచలనం సృష్టించారు. తాజాగా గ్రూపులోని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ పార్టీ నాయకత్వంపై మాటల దాడి చేశారు. పారీ్టలో ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారని, లేఖ రాసి ఒక సంవత్సరం గడిచినప్పటికీ, అధ్యక్ష ఎన్నిక కోసం చేసిన డిమాండ్ నెరవేరలేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. పంజాబ్‌లో పరిణామాలు, అంతర్గత కలహాలు, ఉత్తర్‌ప్రదేశ్ లఖీంపూర్ ఖేరీ ఘటన సహా ఇతర రాజకీయ పరిణామాలపై సమావేశంలో విస్తృత చర్చలు జరగవచ్చని అంచనా. -
‘అసంతృప్త నేతలపై చర్యలు లేవు’
సాక్షి, న్యూఢిల్లీ : పార్టీలో సంస్ధాగత అంశాలను పరిశీలించి పరిష్కరిస్తామని, పార్టీ పునర్నిర్మాణం నిరంతరం కొనసాగే ప్రక్రియని సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ చీఫ్ సోనియా గాంధీ స్పష్టం చేశారని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జీవాలా పేర్కొన్నారు. సోమవారం సుదీర్ఘంగా సాగిన సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ నేతలెవరిపైనా ఎలాంటి చర్యలూ ఉండవనీ, వారంతా తమ కుటుంబంలో భాగమని సోనియా వెల్లడించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద కుటుంబమని, పలు సందర్భాల్లో ఎన్నో విభేదాలు ఎదురైనా చివరికి తామంతా ఒక్కటిగా నిలిచామని సమావేశం చివరిలో సోనియా పేర్కొన్నారని సుర్జీవాలా చెప్పారు. దేశంలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన అవసరం ప్రస్తుతం పార్టీ శ్రేణుల ముందున్నదని ఆమె చెప్పారని అన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక చీఫ్‌గా సోనియా గాంధీ కొనసాగుతారని పార్టీ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. నూతన అధ్యక్షుడి ఎన్నిక పూర్తయ్యే వరకూ ఆమె మరికొన్ని నెలల పాటు పదవిలో కొనసాగుతారని వెల్లడించారు. పార్టీ తాత్కాలిక చీఫ్‌గా సోనియానే కొనసాగాలని పార్టీ నేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారని అన్నారు. మరోవైపు సీడబ్ల్యూసీ భేటీలో సోనియా గాంధీ రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించగానే రాహుల్ సీనియర్ నేతల తీరును తప్పుపట్టారు.బీజేపీతో కలిసి కుట్రపూరితంగానే పార్టీ ప్రక్షాళన కోరుతూ సోనియాకు లేఖ రాశారని సీనియర్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీతో సంబంధాలను నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని స్పష్టం చేశారు. ఇక సీనియర్ నేతలను అనునయించేందుకు వారిపై తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని రాహుల్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. చదవండి : సోనియా రాజీనామా : సీడబ్ల్యూసీ భేటీలో ట్విస్ట్ -
కాంగ్రెస్‌లో విభేదాలు!
న్యూఢిల్లీ: కీలక సీడబ్ల్యూసీ భేటీ నేడు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌లో విభేదాలు బయటపడ్డాయి. పార్టీ అగ్ర నాయకత్వంలో సమూల మార్పు కావాలని కోరుతున్న వర్గం ఒకవైపు, రాహుల్ గాంధీ మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుతున్న మరో వర్గం తెరపైకి వచ్చాయి. పార్టీ నాయకత్వంలో మార్పు ప్రస్తుతం అత్యవసరమని, క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో చురుగ్గా పనిచేసే శాశ్వత నాయకత్వం, ఏఐసీసీ, పీసీసీ కార్యాలయాల్లో అనునిత్యం అందుబాటులో ఉండే నాయకత్వం ఇప్పుడు పార్టీకి కావాలని పేర్కొంటూ సుమారు 23 మంది సీనియర్ నేతలు ఇటీవల సోనియాగాంధీకి లేఖ రాశారు. మరోవైపు, గాంధీ కుటుంబ సభ్యులే కాంగ్రెస్‌కు సరైన నాయకత్వం అందించగలరని మరికొందరు నేతలు స్పష్టం చేశారు. పార్టీ శ్రేణుల్లో దేశవ్యాప్తంగా గుర్తింపు, అభిమానం ఉన్న నాయకుడిగా రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలను మళ్లీ చేపట్టాలని పలువురు సీనియర్లు డిమాండ్ చేశారు. కాగా, పార్టీ నాయకత్వంలో మార్పు కావాలని కోరుతూ రాసిన లేఖపై ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పందించినట్లు తెలుసోంది. పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. (అధ్యక్ష పదవికి సోనియా రాజీనామా..!) ఈ విషయాన్ని పార్టీలోని సన్నిహిత నేతలకు ఆమె ఇప్పటికే స్పష్టం చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. సోమవారం జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీలో దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశముందని వెల్లడించాయి. అయితే, సోనియా పార్టీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోనున్నారన్న వార్తలను కాంగ్రెస్ ఖండించింది. సోనియా గాంధీ నుంచి అలాంటి ప్రకటనేదీ రాలేదని పార్టీ స్పష్టం చేసింది. పార్టీ ప్రెసిడెంట్‌గా సోనియా గాంధీ కొనసాగడమో, లేక రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టడమో సరైన నిర్ణయమని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, లోక్‌సభలో కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌధురి, మాజీ కేంద్ర మంత్రులు సల్మాన్ ఖుర్షీద్, అశ్విన్ కుమార్, కేకే తివారీ తదితరులు అభిప్రాయపడ్డారు. నాయకత్వ మార్పు కోరుతూ లేఖ రాసినవారిలో గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, శశి థరూర్, కపిల్ సిబల్, మనీశ్ తివారీ, హరియాణా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హూడా తదితరులున్నారు. గత సంవత్సరం ఆగస్ట్ 10న సీడబ్ల్యూసీ అభ్యర్థన మేరకు తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ బాధ్యతలు స్వీకరించారు. 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమి తరువాత రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగేందుకు అయిష్టత చూపి తప్పుకొన్న విషయం తెలిసిందే. చాలా మార్పులు జరగాలి.. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరించాలని, పీసీసీలకు మరిన్ని అధికారాలను అప్పగించాలని సోనియాకు రాసిన లేఖలో సీనియర్లు కోరారు. అధికారం కేంద్ర స్థాయిలో ఎక్కువగా కేంద్రీకృతం కావడం, ప్రతీ చిన్న అంశాన్ని అగ్ర నాయకత్వమే నిర్ణయించడం దీర్ఘకాలంలో పార్టీకి ప్రతికూలంగా పరిణమిస్తుందని వారు ఆ లేఖలో హెచ్చరించారు. నాయకత్వ స్థాయిలో అనిశ్చితి వల్ల పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం ఆవరిస్తుందని, అది చివరకు పార్టీని బలహీన పరుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నూతనంగా రూపొందే సమగ్ర, క్రియాశీల నాయకత్వంలోనూ నెహ్రూ–గాంధీ కుటుంబం కీలక భూమిక నిర్వహించాల్సిన అవసరం ఉంటుందన్నారు. ప్రథమ ప్రధాని నెహ్రూ దార్శనికత కాంగ్రెస్ పార్టీకి దిక్సూచిగా కొనసాగుతుందన్నారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక బృందం సీడబ్ల్యూసీ ఎంపిక, పనితీరుపైనా వారు లేఖలో అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ రాజ్యాంగంలో పేర్కొన్న విధానం ద్వారా సీడబ్ల్యూసీ ఏర్పడాలన్నారు. అలాగే, కేంద్ర పార్లమెంటరీ బోర్డు, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలను మళ్లీ కొత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని లేఖలో సూచించారు. ప్రస్తుతం పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావిస్తూ.. సాధ్యమైనంత త్వరగా పార్టీ పునరుత్తేజం కోసం చర్యలు చేపట్టాలన్నారు. వ్యవస్థీకృత, సమీకృత నాయకత్వ విధానం తక్షణావసరమన్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడంలో సీడబ్ల్యూసీ సమర్ధంగా పని చేయడం లేదని అభిప్రాయపడ్డారు. 2014, 2019 సాధారణ ఎన్నికల్లో పార్టీ ఓటమికి చాలా కారణాలున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. 2019 ఎన్నికలు జరిగి 14 నెలలు పూర్తయినా.. ఇప్పటికే ఆ ఓటమిపై నిష్పక్షపాత సమీక్ష జరగలేదన్నారు. దేశంలో ప్రస్తుతం అభద్రతతో కూడిన భయ వాతావరణం నెలకొని ఉందని, ఈ పరిస్థితులను ఎదుర్కొనే క్రియాశీల విపక్షంగా నిలవాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందన్నారు. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్‌ల్లో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనను కూడా సీనియర్లు ఆ లేఖలో తప్పుబట్టారు. ఆ నిర్ణయం రాహుల్ గాంధీదేనన్న విషయం గమనార్హం. డీసీసీ అధ్యక్షుల నియామక నిర్ణయాన్ని పీసీసీ అధ్యక్షుడి సూచనల మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తీసుకునేలా చూడాలన్నారు. నిష్పక్షపాత విధానంలో సంస్థాగత ఎన్నికలు జరగాలని కోరారు. ప్రజాస్వామ్య, లౌకిక వేదిక ప్రజాస్వామ్య, లౌకిక శక్తులతో కూడిన దేశవ్యాప్త కూటమిని రూపొందించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించాలని సూచించారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న నేతలందరినీ కూడా ఈ వేదికలో భాగస్వామ్యులను చేయాలన్నారు. మళ్లీ రాహుల్ రావాలి ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీ మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కోరుతూ మరి కొందరు నేతలు లేఖ రాశారు. ఎంపీ మానికం ఠాగోర్ ఈ డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ‘గాంధీలు త్యాగానికి గుర్తులు. రాహుల్ గాంధీ మళ్లీ అధ్యక్షుడు కావాలని 1,100 మంది ఏఐసీసీ సభ్యులు, 8,800 పీసీసీ సభ్యులు, 5 కోట్లమంది పార్టీ కార్యకర్తలు, 12 కోట్లమంది పార్టీ మద్దతుదారులు కోరుకుంటున్నారు’అని ఆయన పేర్కొన్నారు. గాంధీ కుటుంబమే బెస్ట్ ప్రస్తుత పరిస్థితుల్లో గాంధీ కుటుంబమే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించారు. పార్టీ పునర్వ్యవస్థీకరణకు ఇది సరైన సమయం కాదన్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గట్టి విపక్షం రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బలమైన, ఐక్య విపక్షం లేకపోవడం బీజేపీకి కలసి వస్తోందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడిగా.. మొత్తం పార్టీ కోరుకునే, శ్రేణులందరికీ చిరపరిచితుడైన నాయకుడు కావాలని, గాంధీ కుటుంబ సభ్యులే అందుకు సరైన వారన్నారు. కాంగ్రెస్ కార్యకర్త లేని గ్రామం దేశంలో లేదని, ఆ ఘనత గాంధీ కుటుంబం కారణంగానే సాధ్యమైందని తెలిపారు. కోరుకున్నంత కాలం సోనియాగాంధీనే ప్రెసిడెంట్‌గా ఉండాలని, ఆ తరువాత రాహుల్ ఆ బాధ్యతలను తీసుకోవాలని సూచించారు. సీనియర్ల లేఖ దురదృష్టకరమని రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ అన్నారు. నాయకత్వానికి సంబంధించి ఎన్నికల నిర్వహణ ఈతరుణంలో సరైన నిర్ణయం కాదని, దానివల్ల విభేదాలు పెరిగే అవకాశముందని సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ అభిప్రాయపడ్డారు. రాహుల్‌కు పార్టీ శ్రేణులు, నాయకుల మద్దతుందన్నారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం.. పార్టీ రాజ్యాంగం ప్రకారం.. సీడబ్ల్యూసీలో పార్టీ ప్రెసిడెంట్, పార్లమెంట్లో పార్టీ నేత, 23 మంది ఇతర సభ్యులు ఉంటారు. ఆ 23 మందిలో 12 మందిని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎన్నుకుంటుంది. మిగతావారిని పార్టీ ప్రెసిడెంట్ ఎంపిక చేస్తారు. 1990 నుంచి సీడబ్ల్యూసీకి ఎన్నికలు జరగలేదు. అప్పటినుంచి, ఏకగ్రీవ మార్గంలో సీడబ్ల్యూసీ సభ్యుల ఎంపిక జరుగుతోంది. కాంగ్రెస్‌లో సంచలనం సృష్టించిన తాజా లేఖలో పలువురు మాజీ కేంద్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఇతర సీనియర్ నేతలు సంతకాలు చేశారు. వారిలో గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, శశి థరూర్, పీజే కురియన్, ఆనంద్ శర్మ, మనీశ్ తివారీ, రేణుకా చౌదరి, మిలింద్ దేవ్రా, అజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్, జితిన్ ప్రసాద, భూపిందర్ సింగ్ హూడా, రాజిందర్ కౌర్ భట్టల్, వీరప్ప మొయిలీ, పృథ్వీరాజ్ చవాన్, రాజ్ బబ్బర్, అరవింద్ సింగ్ లవ్లీ, సందీప్ దీక్షిత్ తదితరులున్నారు. నేడు జరగనున్న సీడబ్ల్యూసీ భేటీలో ఈ లేఖలోని అంశాలపై లోతైన, వాడి వేడి చర్చ జరిగే అవకాశముందని భావిస్తున్నారు. -
సరిహద్దు వివాదంపై మన్మోహన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు ఘర్షణల విషయంలో ప్రభుత్వం తాత్సారం చేయవద్దని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హితవు పలికారు. కరోనా మహమ్మారిని ప్రభుత్వం దీటుగా ఎదుర్కోవడంలో విఫలమైందని విమర్శలు గుప్పిస్తూ సరిహద్దు వివాదంలోనూ ఇలాగే వ్యవహరించవద్దని అన్నారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం సమర్ధవంతంగా చేపట్టలేకపోతోందని ఆరోపించారు. మహమ్మారి కట్టడికి ప్రభుత్వం ధైర్యంగా ముందుకు వెళ్లడం లేదని దుయ్యబట్టారు. మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో తలెత్తిన మరో సంక్షోభాన్నీ ఇదే తరహాలో ఎదుర్కొంటే తీవ్ర పరిస్థితికి దారితీస్తుందని మన్మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. సీడబ్ల్యూసీ సమావేశంలో మన్మోహన్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జీవాలా ట్వీట్ చేశారు. సింగ్ వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని పేర్కొన్నారు. చదవండి : పర్యవసానాలపై అవగాహన ఉండాలి -
రాహుల్ వారసుడి ఎంపిక ఎప్పుడంటే..
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ నూతన సారథి ఎంపిక ప్రక్రియ ఈనెల 10న కొలిక్కిరానుంది. ఇదే అజెండాతో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈనెల 10న రాహుల్ వారసుడిపై చర్చించేందుకు పార్టీ అత్యున్నత నిర్ణాయక సంఘం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్య్లూసీ) భేటీ జరగనుంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతుందని గతవారం కాంగ్రెస్ పేర్కొంది. ఈనెల పదో తేదీ శనివారం ఉదయం 11 గంటలకు పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం ట్వీట్ చేశారు. పార్టీ చీఫ్‌గా వైదొలగుతున్నట్టు రాహుల్ గాంధీ ప్రకటించిన అనంతరం జరగనున్న తొలి సీడబ్ల్యూసీ భేటీ ఇదే కావడం గమనార్హం. పార్టీ సీనియర్లు వారించినా తన నిర్ణయం మార్చుకునేందుకు రాహుల్ అంగీకరించని సంగతి తెలిసిందే. -
కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తదుపరి అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గేను ఎన్నుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను వెనక్కుతీసుకునేందుకు రాహుల్ గాంధీ ససేమిరా అంటున్న నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం అనివార్యమైంది. పార్లమెంటు సమావేశాల అనంతరం ఆగస్టు 8 లేదా 10న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) భేటీ జరిగే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. అక్కడే రాహుల్ గాంధీ రాజీనామాను ఆమోదించడం, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరగుతుందని పేర్కొన్నాయి. ఆగస్టు 15న పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కొత్త అధ్యక్షుడే జెండా వందనం చేస్తారన్నాయి. పార్లమెంటు సమావేశాల తరువాత సీడబ్ల్యూసీ భేటీ ఉంటుందని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా సైతం గురువారం ప్రకటించారు. కానీ భేటీ తేదీలను ఆయన వెల్లడించలేదు. భేటీలో రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారని చెప్పారు. కాగా, పార్లమెంటు సమావేశాలను ఆగస్టు 9న వరకు పొడిగించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. -
రాజీనామాల పర్వం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక సంఘం (సీడబ్ల్యూసీ) భేటీ శనివారం ఉదయం 11 గంటలకు జరగనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా సీడబ్ల్యూసీలో రాజీనామా సమర్పించే అవకాశం ఉందని సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 52 సీట్లతో పార్టీ ఘోర పరాజయం చెందడంపై ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారు. పార్టీ ఓటమికి కారణాలపై సమీక్ష జరపనున్నారు. సంస్థాగత లోపాలు, ప్రచార వ్యూహం విఫలం కావడంతో పాటు రాష్ట్ర కమిటీల అంతర్గత కుమ్ములాటలపై కూడా చర్చించే అవకాశం ఉంది. బీజేపీ ముందెన్నడూ లేనంత బలమైన పార్టీగా అవతరించిన నేపథ్యంలో.. కాంగ్రెస్‌ను సంస్కరించడానికి, పునరుజ్జీవింప చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు ఒక అంతర్గత కమిటీని నియమించే అవకాశంపై కూడా చర్చించవచ్చని తెలుస్తోంది. ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లతో పాటు బిహార్ తదితర రాష్ట్రాల్లో పార్టీ దెబ్బతినడానికి కారణాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్,తో పాటు ఏకే ఆంటోని, అశోక్ గెహ్లోత్, కేసీ వేణుగోపాల్, గులాంనబీ ఆజాద్ తదితర అగ్రనేతలు భేటీలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ చేతిలో కాంగ్రెస్ వరుసగా రెండోసారి పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. అదే బాటలో యూపీ, ఒడిశా చీఫ్‌లు మరోవైపు సీడబ్ల్యూసీకి ముందే పలువురు నేతలు పార్టీ పదవులకు రాజీనామాలు సమర్పిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అధ్యక్షులు రాజ్‌బబ్బర్, నిరంజన్ పట్నాయక్‌లు ఇప్పటికే తమ పదవులకు రాజీనామాలు ప్రకటించారు. ఈ మేరకు లేఖలను పార్టీ అధినేత రాహుల్‌కు పంపించారు. పార్టీ ఇంతలా నష్టపోవడానికి, ప్రజలకు చేరువ కాలేకపోవడానికి కారణాలు ఏమిటనే దానిపై నేతలు ఇప్పటికే అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. 80 ఎంపీ స్థానాలున్న యూపీలో సోనియాగాంధీ సీటు రాయబరేలీలో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. కీలక అమేథీ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ సైతం బీజేపీ నేత స్మృతీ ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. ఫతేపూర్ సిక్రీ నుంచి పోటీ చేసిన బబ్బర్ బీజేపీకి చెందిన రాజ్‌కుమర్ చహర్ చేతిలో దాదాపు 5 లక్షల ఓట్ల భారీ తేడాతో ఓటమి చవిచూశారు. ఎన్నికల ఫలితాలు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్‌ను తీవ్రంగా నిరాశపరిచాయి. నా బాధ్యతలు నేను సరైన విధంగా నిర్వర్తించనందుకు నాకు నేనే దోషిగా భావిస్తున్నానంటూ బబ్బర్ హిందీలో ట్వీట్ చేశారు. కాగా రాష్ట్రంలో పార్టీ ఓటమికి నైతికి బాధ్యత వహిస్తూ తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడికి పంపినట్లు ఒడిశా పీసీసీ అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్ తెలిపారు. ఒడిశాలో కాంగ్రెస్ ఒక లోక్‌సభ స్థానంలో, తొమ్మిది అసెంబ్లీ సీట్లలో మాత్రమే గెలుపొందింది. -
గాంధీజీ భారత్, గాడ్సే భారత్
న్యూఢిల్లీ: ప్రేమను పంచే మహాత్మాగాంధీ భారత్, ద్వేషాన్ని నూరిపోసే గాడ్సే భారత్.. ఇందులో ఏది కావాలో నిర్ణయించుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రజలను కోరారు. సోమవారం ఇక్కడ జరిగిన పార్టీ బూత్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘గాంధీజీ భారత్ లేక గాడ్సే భారత్.. మీకు ఏది కావాలో నిర్ణయించుకోండి. ఒక వైపు ప్రేమ, సోదరభావం, మరో వైపు ద్వేషం, భయం. గాంధీజీకి భయం లేదు. ఎన్నో ఏళ్లు జైలు జీవితం గడిపారు. అయినప్పటికీ అప్పటి బ్రిటిష్ పాలకులతో ప్రేమగానే మాట్లాడారు. కానీ, వలస పాలకులపై ద్వేషాన్ని నూరిపోసిన వీర సావర్కర్ మాత్రం తనను క్షమించి వదిలేయాలంటూ బ్రిటిష్ వారిని ప్రాధేయపడ్డారు’ అని తెలిపారు. ‘మేకిన్ ఇండియా అంటూ తరచూ మాట్లాడే మోదీ.. ధరించే దుస్తులు, చెప్పులు, సెల్ఫీలు తీసుకునే ఫోన్..ఇవన్నీ చైనాలో తయారైనవే’ అంటూ ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రైతు రుణ మాఫీ అమలు చేశామన్నారు. నేడు సీడబ్ల్యూసీ భేటీ అహ్మదాబాద్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ మంగళవారం అహ్మదాబాద్‌లో జరగనుంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చిన రెండు రోజులకే ఈ భేటీ జరుగుతుండటంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్‌ల స్వరాష్ట్రమైన గుజరాత్ నుంచి దేశానికి గట్టి రాజకీయ సందేశం ఇవ్వాలని కాంగ్రెస్ కోరుకుటోందని పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం ముందుగా అహ్మదాబాద్‌లోని సబర్మతీ గాంధీ ఆశ్రమంలో ప్రార్థనా సమావేశం నిర్వహించి, ఆ తర్వాత సర్దార్ పటేల్ జాతీయ స్మారకంలో సీడబ్ల్యూసీ భేటీ అవనుంది. -
రాహుల్ అధ్యక్షతన సీడబ్ల్యూసీ భేటీ
న్యూఢిల్లీ: పార్టీ అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన రాహుల్‌గాంధీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి తొలిసారి అధ్యక్షత వహించనున్నారు. దీంతో నూతన సారథికి సీడబ్ల్యూసీ ఘన స్వాగతం పలకనుంది. ఈ భేటీ శుక్రవారం ఉదయం పదిన్నరకు ప్రారంభమవుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ తెలిపారు. కాగా ఈ సమావేశ అజెండా అధికారికంగా వెల్లడి కానప్పటికీ దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఇందులో చర్చించ నున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కనబరిచిన ప్రభావవంతమైన పనితీరును పార్టీకి భవిష్యత్‌లో ఎలా అన్వయించాలో యోచించనున్నట్లు తెలిపారు. 2జీ కేసులో నిందితులందరూ నిర్దోషులన్న కోర్టు తీర్పుపైనా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, నరేంద్ర మోదీ ఈ కేసును ప్రచారాస్త్రంగా చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో అవినీతి జరగలేదన్న అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ఈ మేరకు ప్రణాళిక రూపొందించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వివరించాయి. గతంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ గైర్హాజరీలో పార్టీ ఉపాధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ సీడబ్ల్యూసీ సమావేశానికి అధ్యక్షత వహించినప్పటికీ పూర్తి స్థాయి అధ్యక్షుడిగా మాత్రం ఇదే తొలి భేటీ కావడం గమనార్హం. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ డిసెంబర్ 11న ఏకగ్రీవంగా ఎన్నిక కాగా 16న బాధ్యతలు చేపట్టారు. -
సంకుచిత దేశంగా మార్చే కుట్ర
కశ్మీర్ పరిస్థితికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం ► విమర్శకుల గొంతు నొక్కేస్తున్నారు ► సీడబ్ల్యూసీ భేటీలో మోదీ సర్కారుపై సోనియా ధ్వజం న్యూఢిల్లీ: మూడేళ్ల పాలనా సంబరాలు జరుపుకుంటున్న మోదీ సర్కారుపై విపక్ష కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. రాజధానిలో మంగళవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. భారత్‌ను తిరోగమన, సంకుచిత దేశంగా మార్చే కుట్ర జరుపుతున్నారని కేంద్ర ప్రభుత్వంపై సోనియాగాంధీ ధ్వజమెత్తారు. ప్రపంచ దేశాల దృష్టిలో భారత్‌కున్న ప్రత్యేక ముద్రను ఈ ప్రభుత్వం చెరిపేసే ప్రయత్నం చేస్తోందని.. ఆ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు, దేశ మౌలిక భావనను పరిరక్షించేందుకు 2019లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చే దిశగా సిద్ధం కావాలని ఆమె కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మన్మోహన్ సింగ్, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీనియర్ నేతలు ఏకే ఆంటోనీ, పీ చిదంబరం, అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ పరిస్థితి, త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలు.. తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. పార్టీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌ను ఆమోదించారు. భేటీలో సోనియా మాట్లాడుతూ.. ఆర్థికాభివృద్ధికి దోహదపడే అంశాల్లో స్తబ్దత నెలకొందని విమర్శించారు. కశ్మీర్ పరిస్థితికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విమర్శకుల గొంతు నొక్కేస్తు న్నారని మండిపడ్డారు. మేకిన్ ఇండియాతో ఇప్పటివరకు ఎలాంటి ఉద్యోగావకాశాలు రాలేదన్నారు. నోట్ల రద్దు విఫల ప్రయత్నం భేటీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. నోట్ల రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఆ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థను భారీగా దెబ్బతీసిందన్నారు. గత మూణ్నెళ్ల జీడీపీలో తగ్గుదల అదే విషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు. ‘దేశంలో ఉపాధి అవకాశాలను భారీగా కల్పించే నిర్మాణ రంగం నోట్ల రద్దుతో కుదేలైంది. ప్రైవేటు రంగ పెట్టుబడులు దారుణంగా పడిపోయాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ప్రభుత్వ వ్యయం అనే ఏకైక ఇంజిన్‌పైనే నడుస్తోంది’ అని వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థ పనితీరుకు గ్రాస్ వ్యాల్యూ అడిషన్(జీవీఏ)’ అనేది ఒక కచ్చితమైన సూచీ. 2016 మార్చిలో పరిశ్రమల రంగంలో 10.7 శాతంగా ఉన్న జీవీఏ.. 2017 మార్చి నాటికి దారుణంగా 3.8 శాతానికి పడిపోయింది’ అని మన్మోహన్ వివరించారు. పార్టీ ఎన్నికల షెడ్యూల్ ఆగస్ట్ 6: సభ్యుల తుది జాబితా, జిల్లా కాంగ్రెస్ కమిటీలు రూపొందించిన అర్హులైన పోటీదారుల తుది జాబితా ప్రచురణ. ఆగస్ట్ 7– ఆగస్ట్ 20: బూత్ కమిటీలు, బ్లాక్ కమిటీ సభ్యుల ఎన్నిక. ఆగస్ట్ 21–సెప్టెంబర్ 4: బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కోశాధికారి, కార్యనిర్వాహక కమిటీ ఎన్నిక. బ్లాక్ కాంగ్రెస్ కమిటీచే డీసీసీకి ఆరుగురు సభ్యుల ఎన్నిక, పీసీసీకి ఒక సభ్యుడి ఎన్నిక. సెప్టెంబర్ 5–15: డీసీసీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కోశాధికారి, కార్యనిర్వాహకవర్గ ఎన్నిక. సెప్టెంబర్ 16– అక్టోబర్ 15: పీసీసీ అధ్యక్షుడి ఎన్నిక, ఉపాధ్యక్షుడు, కోశాధికారి, పీసీసీ కార్యవర్గ, ఏఐసీసీ సభ్యుల ఎన్నిక. చివరగా పార్టీ అధ్యక్షుడు/అధ్యక్షురాలి ఎన్నిక. అక్టోబర్ 16–25 మధ్య ఏఐసీసీ సభ్యులకు ప్రదేశ్ ఎన్నికల అథారిటీ గుర్తింపు కార్డులు జారీచేస్తుంది. చివరగా, ఏఐసీసీ సభ్యులు సీడబ్ల్యూసీ సభ్యులను ఎన్నుకుంటారు. -
కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే సంతోషిస్తాం: బిజెపి
-
మేం తెలంగాణకు వ్యతిరేకం:ఒమర్ అబ్దుల్లా
-
సీడబ్ల్యూసీ భేటి ఎప్పుడు.. టీ కాంగ్రెస్ నేతల్లో టెన్షన్