సరిహద్దు వివాదంపై మన్మోహన్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు | Manmohan Singh Says Pandemic Not Being Tackled With Required Courage | Sakshi
Sakshi News home page

మోదీ సర్కార్‌పై మన్మోహన్‌ ఫైర్‌

Jun 23 2020 12:24 PM | Updated on Jun 23 2020 12:25 PM

Manmohan Singh Says Pandemic Not Being Tackled With Required Courage    - Sakshi

కరోనా మహమ్మారిని దీటుగా ఎదుర్కోవడంలో మోదీ సర్కార్‌ విఫలమైందన్న సర్ధార్జీ

సాక్షి, న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు ఘర్షణల విషయంలో ప్రభుత్వం తాత్సారం చేయవద్దని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హితవు పలికారు. కరోనా మహమ్మారిని ప్రభుత్వం దీటుగా ఎదుర్కోవడంలో విఫలమైందని విమర్శలు గుప్పిస్తూ సరిహద్దు వివాదంలోనూ ఇలాగే వ్యవహరించవద్దని అన్నారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం సమర్ధవంతంగా చేపట్టలేకపోతోందని ఆరోపించారు.

మహమ్మారి కట్టడికి ప్రభుత్వం ధైర్యంగా ముందుకు వెళ్లడం లేదని దుయ్యబట్టారు. మంగళవారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో తలెత్తిన మరో సంక్షోభాన్నీ ఇదే తరహాలో ఎదుర్కొంటే తీవ్ర పరిస్థితికి దారితీస్తుందని మన్మోహన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సీడబ్ల్యూసీ సమావేశంలో మన్మోహన్‌ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జీవాలా ట్వీట్‌ చేశారు. సింగ్‌ వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని పేర్కొన్నారు.

చదవండి : పర్యవసానాలపై అవగాహన ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement