
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామాన్య ప్రజలనుంచి పాలకుల వరకు ఎవర్నీ వదలిపెట్టడం లేదు. ఇప్పటికే మనదేశంలో అయిదుగురు ముఖ్యమంత్రులకు కరోనా సోకింది. తమిళనాడు సీఎం పళని స్వామి, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం యడ్యూరప్ప, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు కరోనా బారిన పడిన వారిలో ఉన్నారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ జాబితాలో చేరారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కి కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.
కాగా, కరోనా తీవ్రతను దృష్ఠిలో ఉంచుకున్నకేంద్రం వ్యాక్సిన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మే1 నుంచి 18 సంవత్సరాలు పైబడిన వారందరికి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment