New Delhi:
-
ఆదివాసీల అభ్యున్నతికి ప్రాధాన్యం
న్యూఢిల్లీ: దేశంలోని ఆదివాసీల అభ్యున్నతి కోసం కేంద్రం ఎంతో చేస్తోందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. మెగా జాతీయ ఆదివాసీల ఉత్సవం ‘ఆది మహోత్సవ్’ను గురువారం ప్రధాని ప్రారంభించారు. గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు ఎలా ఉంటాయో చాటి చెప్పడానికి, ఆదివాసీలు తయారు చేసిన వస్తువులు, ఆహార పదార్థాలు విక్రయించడానికి అవకాశం కల్పిస్తూ వారి అభ్యున్నతి కోసం తాము అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి కృషి చేస్తున్నామని తెలిపారు. బడ్జెట్లో నిధులు భారీగా కేటాయిస్తున్నామని, మొట్టమొదటి సారిగా ఆదివాసీ మహిళ ద్రౌపదీ ముర్ముని రాష్ట్రపతి పీఠంపై కూర్చోబెట్టినది తమ ప్రభుత్వమేనని సగర్వంగా చెబుతున్నామని పేర్కొన్నారు. ఢిల్లీ దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లోని ప్రజలందరూ తప్పనిసరిగా ఆది మహోత్సవ్‌ను సందర్శించి, ఆదివాసీలు తయారు చేసిన వస్తువుల్ని కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంంలో ఆదివాసీల పాత్ర మరువలేనిదని, వారి త్యాగాలను గుర్తుంచుకోవాలన్నారు. అమృత కాలంలో ఆదివాసీలను తిరిగి వెలుగులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుంటున్నామని మోదీ తెలిపారు. బొట్టు బొట్టు కాపాడుకోవాలి దేశంలో నీటి సంరక్షణ అత్యంత ఆందోళన కలిగించే అంశమని మోదీ అన్నారు. ప్రకృతితో మనకున్న భావోద్వేగ బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకొని నీటి వనరుల్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర జల శక్తి శాఖ, బ్రహ్మకుమారిలు సంయుక్తంగా నిర్వహిస్తున్న దేశవ్యాప్త ప్రచారం జల్ జన్ అభియాన్‌ను ప్రధాని మోదీ గురువారం ప్రారంభించారు. రాజస్థాన్‌లోని బ్రహ్మకుమారిల ప్రధాన కార్యాలయంలో ఉన్న వారినుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. -
జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. రెండు విడతల్లో జరగనున్న పార్లమెంట్ సమావేశాలు ఏప్రిల్ 6న ముగియనున్నాయని తెలిపారు. తొలి విడత జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు జరగనున్నాయని పేర్కొన్నారు. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ వరకు తాత్కాలిక విరామం ఉంటుందన్నారు. రెండో విడతలో మార్చి 13న ప్రారంభమై ఏప్రిల్ 6తో ముగియనున్నట్లు పేర్కొన్నారు. 66 రోజుల వ్యవధిలో మొత్తం 27 రోజల పని దినాల్లో ఈ సమావేశాలు కొనసాగున్నట్లు తెలిపారు. ఈ అమృత కాలంలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, కేంద్ర బడ్జెట్, ఇతర అంశాలపై చర్చలు జరుగుతాయని పేర్కొంటూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం ట్వీట్ చేశారు. కాగా ఈ సమావేశాల్లో తొలిసారి పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చేయనున్నారు. చదవండి: ఢిల్లీ సర్కార్ వర్సెస్ కేంద్రం.. నియంత్రణ కేంద్రానిదే అయితే రాష్ట్ర సర్కార్ దేనికి? Budget Session, 2023 of Parliament will commence from 31 January and continue till 6 April with 27 sittings spread over 66 days with usual recess. Amid Amrit Kaal looking forward to discussions on Motion of Thanks on the President’s Address, Union Budget & other items. pic.twitter.com/IEFjW2EUv0 — Pralhad Joshi (@JoshiPralhad) January 13, 2023 -
‘ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రైవేటు మెంబర్ బిల్లు పెడుతున్నాం’
ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఈరోజు(మంగళవారం) కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సహకరించాలని విపక్షాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ మార్గాని భరత్ హాజరయ్యారు. అనంతరం ఎంపీ భరత్ మాట్లాడుతూ.. విభజన చట్టం పెండింగ్ అంశాలే తమ ప్రధాన అజెండా అని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రైవేటు మెంబర్ బిల్లు పెడుతున్నాం’ అని అన్నారు. -
మహిళా జట్లకు మహిళా కోచ్ తప్పనిసరి
న్యూఢిల్లీ: క్రీడాకారిణిలకు తరచూ ఎదురవుతోన్న కోచ్‌ల వేధింపులకు ముగింపు పలకాలని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకపై మహిళల జట్లు ఆడేందుకు ఎక్కడికి వెళ్లినా మహిళా కోచ్‌ను తప్పనిసరిగా నియమించాలని జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లను ఆదేశించింది. దేశవాళీ టోర్నీ, విదేశీ పర్యటనలకు వెళ్లే అమ్మాయిల బృందంలో మహిళా కోచ్ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఇటీవల స్లోవేనియాలో జరిగిన పోటీలకు వెళ్లిన మహిళా సైక్లిస్ట్ పట్ల చీఫ్ కోచ్ ఆర్.కె.శర్మ అనుచితంగా ప్రవర్తించాడు. ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, ‘సాయ్’ అతన్ని పదవి నుంచి తప్పించి, విచారణ చేపట్టింది. మరో మహిళా సెయిలర్‌కు జర్మనీలో ఇలాంటి అనుభవమే ఎదురవడంతో ‘సాయ్’ డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రధాన్ 15 ఎన్‌ఎస్‌ఎఫ్‌లకు చెందిన అధికారులతో సమావేశమయ్యారు. ‘సాయ్’ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించేలా ఓ ప్రత్యేక అధికారిని జట్టులో నియమించాలని కూడా ఆయన ఆదేశించారు. చదవండి: FIFA U17 Womens World Cup 2022: ఫిఫా వరల్డ్ కప్ 2022 షెడ్యూల్ విడుదల -
‘కళ్లల్లో నీళ్లు తిరిగాయి’.. పంజాబ్ సీఎంపై కేజ్రీవాల్ ప్రశంసలు
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌పై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసలు కురిపించారు. అవినీతి ఆరోపణలపై ఆరోగ్యశాఖ మంత్రిని కేబినెట్ నుంచి తొలగించిన కొద్దిసేపటికే అరవింద్ కేజ్రీవాల్ ట్విటర్ ద్వారా స్పందించారు. సీఎం భగవంత్ మాన్‌ను చూసి గర్వపడుతున్నానని అన్నారు. సీఎం భగవంత్ మాన్ చర్య తన కళ్లల్లో నీళ్లు తెప్పించిందని, దేశంలో నిజాయితీ పాలనను అందించే పార్టీ ఒక్క ఆమ్ ఆద్మీనేనని, ఆప్‌ను చూసి పంజాబ్‌తో సహా దేశమంతా గర్విస్తోందని అన్నారు. భగవంత్ మాన్ నిర్ణయానికి చాలా ధైర్యం కావాలని, దేశంలో రాజకీయాలు తిరోగమనం చెందుతున్న వేళ ఆమ్ ఆత్మీ పార్టీ కొత్త ప్రారంభాన్ని తీసుకొచ్చిందన్నారు. సీఎం భగవంత్ మాన్ తలుచుకుంటే ఆరోగ్య మంత్రి చేసిన అవినీతిని కప్పిపుచ్చగలరని, కానీ అలా చేయకుండా మంత్రిపై చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. తను కూడా ఢిల్లీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఓ మంత్రిని తొలగించినట్లు కేజ్రీవాల్ గుర్తు చేశారు. సంబంధిత వార్త: అవినీతి ఆరోపణలు.. పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం.. మంత్రి అరెస్ట్ Proud of you Bhagwant. Ur action has brought tears to my eyes. Whole nation today feels proud of AAP https://t.co/glg6LxXqgs — Arvind Kejriwal (@ArvindKejriwal) May 24, 2022 కాగా పంజాబ్ ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ సింఘ్లాను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మంత్రి విజయ్ సింగ్లాపై అవినీతి ఆరోపణలు రావడంతో పదవి నుంచి బర్తరఫ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. టెండర్ల కోసం సింగ్లా ఒక శాతం కమీషన్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. పదవి నుంచి తొలగించిన వెంటనే ఏసీబీ అధికారులు మంత్రిని అరెస్ట్ చేశారు. -
సామాన్యుడు బతికేది ఎలా?.. మోత మోగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 80 పైసలు చొప్పున పెరిగాయి. గత 10 రోజుల్లో ఇంధన ధరలు లీటరుకు 6.40 రూపాయలకు పెరిగాయి. దీంతో, సామాన్యుడు బయటకి వెళ్లాలంటే బయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రతి వస్తువు ధర పెరగడంతో మూలిగే నక్క మీద తాటి పండు పడినట్లు ఉంది సామాన్యుడి పరిస్థితి. ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు పెరగడం వల్ల కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసన ప్రారంభించింది. గత ఏడాది నవంబర్ 4 చివరి సారిగా ఇంధన ధరలు పెరిగాయి. అప్పటి నుంచి మార్చి 22 వరకు ఇంధన ధరలలో పెద్ద మార్పు లేదు. ఈ మధ్య కాలంలో దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఇంధన ధరలు పెంచడానికి కేంద్రం సాహసించలేదు. ఎన్నికలు ముగియగానే పెట్రోల్ ధరలు పెంపు మొదలు పెట్టింది. అయితే, ఈ అంశంపై స్పందించిన కేంద్రం, రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్దం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో దేశంలో ఇంధన ధరలను పెంచాల్సి వచ్చినట్లు తెలిపింది. అయితే, ప్రతిపక్షాలు మాత్రం కేంద్రం సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. పెట్రోల్, డీజిల్ పై లీటరుకు 80 పైసల చొప్పున పెంచిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.81 ఉండగా.. డీజిల్ లీటర్ రూ.93.07 వద్దకు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 116.72గా ఉండగా.. డీజిల్ ధర రూ.100.94కు చేరుకుంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.45గా ఉంటే.. డీజిల్ ధర రూ.97.52కు చేరుకుంది. ఇక కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటరుకు ₹.111.35(83 పైసలు పెరిగింది), లీటర్ డీజిల్ ధర ₹96.22 (80 పైసలు పెరిగింది)గా ఉంది. (చదవండి: కేంద్రం కీలక నిర్ణయం, అకౌంటెన్సీ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ!) -
హమ్మయ్య! దిగొస్తున్న బంగారం ధరలు..
గత కొద్ది రోజులుగా బంగారం ధరల విషయంలో ఊగిసలాట దొరణి కనిపిస్తుంది. గత వారం రోజుల నుంచి తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నిన్న, నేడు మళ్లీ తగ్గాయి. ప్రపంచ మార్కెట్లలో ఫ్లాట్ రేట్ల నేపథ్యంలో మంగళవారం భారతదేశంలో బంగారం ధరలు అర శాతానికి పైగా పడిపోయాయి. మల్టీ కమోడిటీఎక్స్ఛేంజ్ (ఎమ్‌సీఎక్స్)లో గోల్డ్ ధర ఫ్యూచర్స్ ధర(0.7 శాతం) రూ.357 తగ్గి 10 గ్రాములకు రూ.51,214 వద్ద ట్రేడవుతోంది. వెండి ఫ్యూచర్స్ ధర కిలోకు రూ.525(0.8 శాతం) తగ్గి రూ.67,580 వద్ద కొనసాగుతోంది. స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 1,925.71 డాలర్ల వద్ద ఉంటే, అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 0.8 శాతం క్షీణించి 1,924.20 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఈ వారం రష్యా- ఉక్రెయిన్ మధ్య ఇస్తాంబుల్ వేదికగా శాంతి చర్చలు జరుగునున్న నేపథ్యంలో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కేవలం రెండు రోజుల్లో దేశంలో బంగారం ధర సుమారు రూ.600 తగ్గింది. ముంబైకి చెందిన ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్(ఐబీజెఏ) ప్రకారం.. దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.150కి పైగా తగ్గి ₹51,509కి చేరుకుంది. అలాగే, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,314 నుంచి రూ.47,182కి తగ్గింది. అలాగే, మన హైదరాబాద్ నగరంలో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గి రూ.47,750కి చేరుకుంది. ఇంకా, 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.52,310 నుంచి రూ.52,100కి చేరుకుంది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా దిగొచ్చాయి. నేడు 1 కేజీ వెండి ధర రూ.67,782 నుంచి రూ.67,344కి తగ్గింది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. (చదవండి: ఏప్రిల్ నెల బ్యాంకు సెలవులు జాబితా ఇదే..!) -
శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఈసారి ఎంతంటే?
బంగారం కొనాలని చూస్తున్నవారికి శుభవార్త. దేశంలో బంగారం ధరలు మళ్లీ భారీగా తగ్గాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎమ్‌సీఎక్స్)లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రూ.60 తగ్గి రూ.51.320 వద్ద ట్రేడవుతుండగా, వెండి ఫ్యూచర్స్ ధర కిలోకు రూ.139 తగ్గి రూ.67,553 వద్ద నిలిచింది. యుక్రెయిన్ సంక్షోభం భయాందోళనలు, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవటానికి ఫెడరల్ రిజర్వ్ అధికారులు వడ్డీ రేట్లను పెంచడంతో పసుపు లోహ ధరలు పడిపోయాయి. స్పాట్ గోల్డ్ ధర ఔన్స్'కు 0.2 శాతం తగ్గి 1,918.29 డాలర్ల వద్ద ఉంటే, యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం క్షీణించి 1,918.40 డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో దేశీయంగా కూడా ధరలు తగ్గాయి. ముంబైకి చెందిన ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్(ఐబీజెఏ) ప్రకారం.. దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.400కి పైగా తగ్గి రూ.51,315కి చేరుకుంది. ఇక, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,409 నుంచి రూ.47,005కి పడిపోయింది. అలాగే, మన హైదరాబాద్ నగరంలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర తగ్గి పెరిగి రూ.47,350కి చేరుకుంది. ఇంకా, 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.52,100 నుంచి రూ.51,670కి చేరుకుంది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. నేడు 1 కేజీ వెండి ధర రూ.68,521 నుంచి రూ.67,004కి పడిపోయింది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. (చదవండి: బీర్లు తయారు చేయడమే ఆమె లక్ష్యం.. ఇప్పుడు బిలియనీర్ అయ్యింది!) -
బంగారం కొనేవారికి షాక్.. భారీగా పెరిగిన ధరలు!
మీరు బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు షాకింగ్ న్యూస్. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు మళ్లీ ఒక్కసారిగా భారీగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎమ్‌సీఎక్స్)లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములు పెరిగి రూ.151(0.3 శాతం) పెరిగి రూ .51,806 వద్ద ట్రేడవుతోంది. సీల్వర్ ఫ్యూచర్స్ ధర ఎమ్‌సీఎక్స్‌లో కిలోకు రూ.462(0.7 శాతం) పెరిగి రూ.68,811 వద్ద ఉంది. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో దేశీయంగా కూడా ధరలు పెరిగాయి. ముంబైకి చెందిన ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్(ఐబీజెఏ) ప్రకారం.. దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.400కి పైగా పెరిగి ₹51,757కి చేరుకుంది. ఇక, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,029 నుంచి రూ.47,409కి పెరిగింది. అలాగే, మన హైదరాబాద్ నగరంలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 పెరిగి రూ.47,750కి చేరుకుంది. అలాగే, 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.51,700 నుంచి రూ.52,100కి చేరుకుంది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. నేడు 1 కేజీ వెండి ధర రూ.67,426 నుంచి రూ.68,521కి పెరిగింది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. (చదవండి: జర్మనీ అతి పెద్ద సంస్థ ఇన్ఫోసిస్ కైవసం.. డీల్ విలువ ఎంతంటే?) -
పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రిని కలిశాం
-
‘ఏపీకి రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇవ్వమని కోరాం’
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టుల అంశానికి సంబంధించి కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లామని తెలిపిన విజయసాయి రెడ్డి.. అరకు రైలుకు విస్టాడోమ్ కోచ్‌ల సంఖ్య పెంచమని కోరినట్లు పేర్కొన్నారు. రైల్వేమంత్రిని కలిసిన అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ .. ‘ఏపీకి రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం.రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేయమన్నాం. ఏపీలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరాం. రైల్వేలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశాం. వాల్తేర్ డివిజన్‌ను కొనసాగించాలని కేంద్ర మంత్రిని కోరాం. సౌత్‌కోస్ట్ రైల్వే జోన్ ఆపరేషన్ ప్రారంభించాలని విజ్ఞప్తి చేశాం’ అని తెలిపారు. తమ ప్రతిపాదనలపై కేంద్ర రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంచితే, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 120 మంది ఎంపీల నుంచి సంతకాలు సేకరించిన విషయాన్ని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని, విశాఖ ప్రైవేటీకరణ వ్యతిరేక సమితితో కలిసి ఎంపీల సంతకాల జాబితాను ప్రధానికి ఇస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. -
దిగొస్తున్న బంగారం ధరలు.. వారంలో ఎంత తగ్గాయంటే?
మీరు కొత్తగా బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక మంచి శుభవార్త. గత కొద్ది రోజులుగా పసిడి ధరలు అంతకంతకూ పడిపోతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల సవరణకు ముందు నేడు బంగారం, వెండి ధరలు తగ్గాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ మూడేళ్లలో తొలిసారిగా కనీసం 25 బేసిస్ పాయింట్లు(బీపీఎస్) వడ్డీరేట్లను పెంచనున్నట్లు పెట్టుబడిదారులు భావిస్తున్నారు. దేశంలో గత వారం రోజుల్లో బంగారం ధరలు రూ.2 వేలకు పైగా పడిపోయింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో 10 గ్రాముల బంగారం ధర 0.35 శాతం క్షీణించి ₹51,564 నుంచి ₹51,383కి తగ్గింది. ఇక ముంబైకి చెందిన ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్(ఐబీజెఏ) ప్రకారం.. 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.250కి పైగా పడిపోయి ₹51,315కి చేరుకుంది. ఇక, ఆభరణాల తయారీలో వాడే బంగారం ధర రూ.47,233 నుంచి రూ.47,005కి పడిపోయింది. అలాగే, హైదరాబాద్ నగరంలో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గి రూ.47,300కి చేరుకుంది. అలాగే, 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.51,930 నుంచి రూ.51,600కి చేరుకుంది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు తగ్గాయి. నేడు 1 కేజీ వెండి ధర రూ.67,349 నుంచి రూ.67,288కి పడిపోయింది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. (చదవండి: సరికొత్తగా టాటా ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ వేరియంట్..!) -
సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధర..!
బంగారం, వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో గోల్డ్ ధర 0.05 శాతం పెరిగి ₹51,840 వద్ద ఉంది. ఉక్రెయిన్ సంక్షోభం రోజు రోజుకి మరింత తీవ్రతరం కావడంతో ఆ ప్రభావం ఇప్పుడు పెట్రోల్, బంగారం ధరల మీద భారీగా పడింది. దీంతో, అంతర్జాతీయంతో పాటు దేశీయంగా పసిడి ధరలు భారీగా పెరిగాయి. రూపాయి విలువ క్షీణించడం కూడా పుత్తడి ధరలు పెరిగడానికి ఒక కారణం అని నిపుణులు భావిస్తున్నారు. ముంబైకి చెందిన ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్(ఐబీజెఏ) ప్రకారం.. 24 క్యారెట్ల స్వచ్ఛతతో కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.600కి పైగా పెరిగి ₹51,567కు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600కి పైగా పెరిగి ₹47,235కు చేరుకుంది. అలాగే, హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే నేడు 22 క్యారెట్ల(916) పసిడి ధర రూ.46700 నుంచి రూ.47,700కు పెరిగింది. అంటే ఒక్కరోజులో రూ.1000 పెరిగింది అన్నమాట. #Gold and #Silver Opening #Rates for 02/03/2022#IBJA pic.twitter.com/gFFu4Yu0wP — IBJA (@IBJA1919) March 2, 2022 ఇక బిస్కెట్ గోల్డ్ బంగారం ధర రూ.1090 పెరిగి రూ.52,040కి చేరుకుంది. అలాగే, ఇక పసిడి బాటలోనే వెండి ధర కూడా భారీగా పెరిగింది. వెండి ధర రూ.1700కి పైగా పెరిగి రూ.₹67,030కి చేరుకుంది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. (చదవండి: యూజర్ల మతిపోగొడుతున్న జీప్ తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు..!) -
బంగారం కొనేవారికి భారీ షాక్.. భగ్గుమన్న ధరలు..!
Gold Prices Surge To Highest in a Year: మీరు బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు షాకింగ్ న్యూస్. నేడు బంగారం ధరలు భగ్గుమన్నాయి. ఉక్రెయిన్ మీద రష్యా దాడికి దిగడంతో అంతర్జాతీయంగా పసిడి ధరలు భారీగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధర 2022లో గరిష్ట స్థాయికి పెరిగింది. ఎంసీఎక్స్'లో 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర ఈ రోజు ₹1,400కు పైగా పెరగడంతో ₹51,750 ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. స్పాట్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1950 డాలర్లకు చేరుకుంది. సుమారు 13 నెలలో ఇదే గరిష్టం. ఔన్స్ (28.3495 గ్రాములు) బంగారం ధర త్వరలో $1950-$2000 వరకు వెళ్ళవచ్చని మార్కెట్ నిపుణులు తెలిపారు. బులియన్ జేవెల్లర్స్ ప్రకారం.. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల(బిస్కెట్ గోల్డ్ 999) బంగారం ధర సుమారు రూ.1300కి పైగా పెరిగి రూ.51,419కు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల(916) బంగారం ధర రూ.45,870 నుంచి రూ.47,100కు చేరుకుంది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే నేడు 22 క్యారెట్ల(916) పసిడి ధర రూ.46000 నుంచి రూ.46,850కు పెరిగింది. అంటే ఒక్కరోజులో రూ.850 పెరిగింది అన్నమాట. ఇక బిస్కెట్ గోల్డ్ బంగారం ధర రూ.930 పెరిగి రూ.51,110కి చేరుకుంది. ఇక పసిడి బాటలోనే వెండి ధర కూడా భారీగా పెరిగింది. వెండి ధర రూ.2300కి పైగా పెరిగి రూ.66,501కి చేరుకుంది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. (చదవండి: మరో ప్రమాదం అంచున ఉక్రెయిన్, ఇది రష్యా పనేనా?!) -
బంగారం కొనేవారికి షాక్.. భారీగా పెరిగిన ధరలు..!
గత కొద్ది రోజుల నుంచి పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు ఒక్కసారిగి పెరిగాయి. ఇందుకు ప్రధాన కారణం.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ తిరుగుబాటు నేతలతో క్లెమ్లిన్‌లో సమావేశమై..డోనెట్స్క్, లుగన్స్క్లను(ఉక్రెయిన్ రెబల్ ప్రాంతాలు) స్వతంత్ర్య రాజ్యాలుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించడంతోనే అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు తొమ్మిది నెలల గరిష్టానికి చేరుకున్నాయి. స్పాట్ బంగారం 0.2% పెరిగి ఔన్స్‌కు $1,909.54 వద్ద ఉంటే.. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.7% లాభపడి 1,913.60 డాలర్లకు చేరుకుంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసిఎక్స్)లో 10 గ్రాముల బంగారం ధర 0.72 శాతం పెరిగి రూ.50,440 వద్ద ఉంటే, వెండి 1.08 శాతం పెరిగి కిలోగ్రాముకు రూ.64,275 వద్ద ట్రేడవుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ వివాదం వల్ల బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల(బిస్కెట్ గోల్డ్ 999) బంగారం ధర సుమారు రూ.600కి పైగా పెరిగి రూ.50,547కు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల(916) బంగారం ధర రూ.45,743 నుంచి రూ.46,301కు చేరుకుంది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే నేడు 22 క్యారెట్ల(916) పసిడి ధర రూ.45,900 నుంచి రూ.46,250కు తగ్గింది. అంటే ఒక్కరోజులో రూ.300 పెరిగింది అన్నమాట. ఇక బిస్కెట్ గోల్డ్ బంగారం ధర రూ.410 పెరిగి రూ.50,460కి చేరుకుంది. పసిడి బాటలోనే వెండి ధర కూడా భారీగా పెరిగింది. వెండి ధర రూ.1100కి పైగా పెరిగి రూ.64,656కి చేరుకుంది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. (చదవండి: వాహనదారులకు షాక్.. భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!) -
బంగారం కొనేవారికి భారీ శుభవార్త..!
గత కొద్ది రోజులుగా బుల్లెట్ రైలు వేగంతో దూసుకెళ్తున్న పసిడి ధరలకు ఇప్పుడు బ్రేక్ పడింది. కేవలం ఒక్కరోజులోనే బంగారం ధరలు భారీ తగ్గాయి. ప్రపంచ రేట్లకు అనుగుణంగా భారతీయ మార్కెట్లలో కూడా బంగారం ధరలు తగ్గాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు కొద్దిగా తగ్గడంతో అంతర్జాతీయంగా ధరలు పడిపోయినట్లు నిపుణులు పేర్కొన్నారు. గరిష్ట స్థాయి ధరను ₹50,350ను చేరుకున్న తర్వాత బంగారం ధర తీవ్రంగా పడిపోయింది. ఒక్కరోజులో సుమారు రూ.900కి పైగా పడిపోవడం విశేషం. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల(బిస్కెట్ గోల్డ్ 999) బంగారం ధర సుమారు రూ.916కి పైగా తగ్గి రూ.49,440కు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల(916) బంగారం ధర రూ.46,126 నుంచి రూ.45,287కు చేరుకుంది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే నేడు 22 క్యారెట్ల(916) పసిడి ధర రూ.46,400 నుంచి రూ.46,200కు తగ్గింది. అంటే ఒక్కరోజులో రూ.200 తగ్గింది అన్నమాట. ఇక బిస్కెట్ గోల్డ్ బంగారం ధర రూ.220 తగ్గి రూ.50,400కి చేరుకుంది. పసిడి బాటలోనే వెండి ధర కూడా భారీగా తగ్గింది. వెండి ధర రూ.1400కి పైగా తగ్గి రూ.63,045కి చేరుకుంది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. పసిడి ధరలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి అనే విషయం గుర్తుంచుకోవాలి. (చదవండి: చైనా కంపెనీకి గట్టి షాకిచ్చిన ఐటీ శాఖ..!) -
బుల్లెట్ రైలు వేగంతో దూసుకెళ్తున్న బంగారం ధర..!
మీరు కొత్తగా బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక షాకింగ్ న్యూస్. బంగారం ధరలు బుల్లెట్ రైలు వేగంతో దూసుకెళ్తున్నాయి. కేవలం ఒక్కరోజులో బంగారం ధర సుమారు రూ.600కి పైగా పెరగడం విశేషం. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడం, అంతర్జాతీయంగా బంగారనికి డిమాండ్ పెరగడంతో దేశంలో ధరలు భారీగా పెరిగాయి. బంగారం భారీ వేగంతో పెరగడంతో సామాన్యుడు బంగారం కొనాలంటేనే బయపడే పరిస్థితి ఏర్పడింది. కేవలం 4 రోజుల్లోనే పసిడి ధర సుమారు రూ.1400 పెరగడం విశేషం. కేవలం ఈ ఫిబ్రవరి నెలలోనే బంగారం ధర రూ.2 వేలకు పైగా పెరిగింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల(బిస్కెట్ గోల్డ్ 999) బంగారం ధర సుమారు రూ.600కి పైగా పెరిగి రూ.50,356 వద్దకు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల(916) బంగారం ధర రూ.45,561 నుంచి రూ.46,126కు చేరుకుంది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే నేడు 22 క్యారెట్ల(916) పసిడి ధర రూ.46,300 నుంచి రూ.46,400 పెరిగింది. అంటే ఒక్కరోజులో రూ.100 పెరిగింది. ఇక బిస్కెట్ గోల్డ్ బంగారం ధర రూ.110 పెరిగి రూ.50,620కి చేరుకుంది. పసిడి బాటలోనే వెండి ధర కూడా భారీగా పెరిగింది. వెండి ధర రూ.600కి పెరిగి రూ.64,440కి చేరుకుంది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. #Gold and #Silver Opening #Rates for 15/02/2022#IBJA pic.twitter.com/7W8pRrFfyr — IBJA (@IBJA1919) February 15, 2022 (చదవండి: ప్రముఖ ఐపీఎల్ జట్టుతో అథర్ ఎనర్జీ ఈవీ కంపెనీ కీలక ఒప్పందం..!) -
Gold Price: పసిడి పరుగో పరుగు.. తులం ఎంతంటే?
గత కొద్ది రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నా బంగారం ధరలు మళ్లీ ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి. ఈ నెల మొదటి నుంచి బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, డాలరుతో రూపాయి మారకం విలువ బలహీనపడిపోవడం, పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో బంగారం ధరలకు డిమాండ్ పెరిగినట్లు మార్కెట్ నిపుణులు తెలియజేస్తున్నారు. బంగారం భారీగా దూసుకెళ్తుండటంతో సామాన్యుడు బంగారం కొనాలంటేనే బయపడే పరిస్థితి ఏర్పడింది. కేవలం ఈ నెల ప్రారంభ 9 రోజుల్లోనే సుమారు రూ.1000 పెరిగింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల(బిస్కెట్ గోల్డ్ 999) బంగారం ధర రూ.48,691 వద్దకు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల(916) బంగారం ధర ఒక్క రోజులో రూ.260కి పైగా పెరిగి రూ.44,601కు చేరుకుంది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే నేడు 22 క్యారెట్ల(916) పసిడి ధర రూ.45,400 నుంచి రూ.45,550 పెరిగింది. అంటే ఒక్కరోజులో రూ.150 పెరిగింది. ఇక బిస్కెట్ గోల్డ్ బంగారం ధర రూ.160 పెరిగి రూ.49,690కి చేరుకుంది. పసిడి బాటలోనే వెండి ధర కూడా భారీగా పెరిగింది. వెండి ధర రూ.900కి పెరిగి రూ.62,463కి చేరుకుంది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. #Gold and #Silver Opening #Rates for 09/02/2022#IBJA pic.twitter.com/uE9dLfqWar — IBJA (@IBJA1919) February 9, 2022 (చదవండి: ట్వీట్ రగడ.. క్షమాపణలు చెప్పిన హోండా, డొమినోస్) -
బంగారం కొనేవారికి శుభవార్త.. తగ్గుతున్న పసిడి ధరలు!
మీరు బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు క్రమ క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కేవలం వారం రోజుల్లోనే సుమారు రూ.800కి పైగా తగ్గింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడంతో ఆ ప్రభావం మన దేశం మీద కూడా పడింది. న్యూఢిల్లీలో 10 గ్రాముల మేలిమి(999 స్వచ్చత) బంగారం ధర రూ.130కి పైగా తగ్గి రూ.48048 వద్ద నిలిచింది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.44,012గా ఉంది. మన హైదరాబాద్ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరలు పడిపోయాయి. పెట్టుబడి కోసం కొనుగోలు చేసే 999 స్వచ్చత గల బంగారం ధర రూ.49,100 నుంచి రూ.48,990కి పడిపోయింది. అంటే, ఒక్కరోజులో రూ.110కి పైగా తగ్గింది అన్నమాట. ఇక 916 స్వచ్చత గల పసిడి ధర రూ.100 తగ్గి రూ.44,900కి చేరుకుంది. బంగారంతో వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ఒక కేజీ వెండి ధర రూ.800కి పైగా తగ్గి రూ.60,898కు పడిపోయింది. విజయవాడ, విశాఖ మార్కెట్లో కూడా ఇవే ధరలు ఉన్నాయి. #Gold and #Silver Opening #Rates for 31/01/2022#IBJA pic.twitter.com/rt2RVAO85u — IBJA (@IBJA1919) January 31, 2022 బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. (చదవండి: ఇకపై అన్నింటికీ ఒకే కార్డు..! కేంద్రం కీలక నిర్ణయం..!) -
Gold Price: పసిడి పరుగో పరుగు.. తులం ఎంతంటే?
దేశీయంగా బంగారం ధరల పరుగులు కొనసాగుతున్నాయి. గతకొద్ది రోజుల క్రితం పడిపోయిన పుత్తడి ధరలు తిరిగి జీవితకాల గరిష్టస్థాయిలను చేరుకోవడానికి పరుగు పెడుతున్నాయి. ఈ నెల 10న రూ.47500 దగ్గరగా ఉన్న ధరలు ఇప్పుడు రూ.48,600పైకి చేరుకున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ బలహీనపడిపోవడం, దేశీయ స్టాక్ మార్కెట్లు పతనమౌతున్నందున ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి మార్గమైన బంగారం వైపునకు మళ్లడమే డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణంగా నిపుణులు తెలుపుతున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల(బిస్కెట్ గోల్డ్ 999) బంగారం ధర రూ.48,620 వద్దకు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల(916) బంగారం ధర ఒక్క రోజులో రూ.300కి పైగా పెరిగి రూ.44,536కు చేరుకుంది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే నేడు 22 క్యారెట్ల(916) పసిడి ధర రూ.45100 నుంచి రూ.45,550 పెరిగింది. అంటే ఒక్కరోజులో రూ.450 పెరిగింది. ఇక బిస్కెట్ గోల్డ్ బంగారం ధర రూ.500 పెరిగి రూ.49,700కి చేరుకుంది. పసిడి బాటలోనే వెండి ధర కూడా భారీగా పెరిగింది. వెండి ధర రూ.1400కి పెరిగి రూ.64404కి చేరుకుంది. #Gold and #Silver Opening #Rates for 20/01/2022#IBJA pic.twitter.com/EEX50NOqrr — IBJA (@IBJA1919) January 20, 2022 బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. (చదవండి: టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ కోసం ఆ రాష్ట్ర మంత్రి కేంద్రానికి లేఖ..!) -
బంగారం కొనేవారికి శుభవార్త.. రాకెట్ కంటే వేగంగా పడిపోతున్న ధర!
మీరు బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు శుభవార్త. ఈ కొత్త ఏడాదిలో బంగారం ధర భారీగా పడిపోతుంది. కేవలం ఈ ఏడాది మొదటి వారంలోనే బంగారం ధర సుమారు వెయ్యి రూపాయల వరకు పడిపోయింది. జనవరి 7న కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. నిన్నటితో పోలిస్తే నేడు బంగారం ధర సుమారు రూ.300 వరకు తగ్గింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఓ) చీఫ్ ఓమిక్రాన్ వేరియంట్ ను 'తేలికగా' తీసుకోవద్దని పేర్కొన్న తర్వాత బులియన్ లాభాలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో, స్పాట్ బంగారం 0.15 శాతం క్షీణించి ఔన్స్ కు 1,788.68 డాలర్లకు చేరుకుంది. అమెరికా బంగారు ఫ్యూచర్స్ 0.06 శాతం తగ్గి 1,788.20 డాలర్లకు చేరుకుంది. న్యూఢిల్లీ బులియన్ ఇండియన్ జ్యూవెలరీ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర రూ.47,566గా ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు పసిడి ధర రూ.280కు పైగా తగ్గింది. అలాగే, ఆభరణాల తయారీలో వాడే 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.43,571గా ఉంది. ఇక హైదరాబాద్ గోల్డ్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. స్వచ్చమైన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.390 తగ్గి రూ.48,650కు చేరుకుంటే.. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.44,600గా ఉంది. విజయవాడ, విశాఖ మార్కెట్లో కూడా ఇవే ధరలు ఉన్నాయి. బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. నేడు కేజీ వెండి ధర రూ.100కి పైగా తగ్గి రూ.59,801కు చేరుకుంది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. #Gold and #Silver Opening #Rates for 07/01/2022#IBJA pic.twitter.com/0aWcrJeNoW — IBJA (@IBJA1919) January 7, 2022 (చదవండి: థర్డ్‌వేవ్ ముంగిట!.. ఊపందుకున్న ఈ-కామర్స్) -
ఎల్ఈడీ లైట్ల వల్ల మనకెంత ముప్పు?
సాక్షి, హైదరాబాద్: నగరంలో న్యూ ఇయర్ జోష్ సంబరాలు.. ఫంక్షన్లు, ఔట్‌డోర్ ఈవెంట్స్‌లో జిలుగు వెలుగుల ఎల్ఈడీ లైట్లు...అత్యధిక కాంతిని వెదజల్లే విద్యుత్ దీప కాంతులు .. ధగదగల మాటెలా ఉన్నా.. వెలుగు వెనక చీకట్లు ముసురు కున్నట్లుగా గ్రేటర్ సిటీలో కాంతి కాలుష్య తీవ్రత రోజురోజుకూ పెరుగుతూనే ఉందని తాజా అధ్యయనంలో తేలింది. దేశంలో పలు మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో ఈ తీవ్రత అత్యధికంగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ అధ్యయన వివరాలు ఇటీవల ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆడ్వాన్స్డ్ రీసెర్చ్ అనే పరిశోధన జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి. ఈ కాంతి కాలుష్యం శృతిమించిన నేపథ్యంలో సిటీజన్లు నిద్రలేమి, స్థూలకాయం, డిప్రెషన్, చక్కెరవ్యాధి తదితర జీవనశైలి జబ్బుల బారిన పడుతున్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనాన్ని భువనేశ్వర్‌కు చెందిన సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్కు చెందిన ప్రొఫెసర్ సిబా ప్రసాద్ మిశ్రా ఆధ్వర్యంలో నిర్వహించారు. తన అధ్యయనంలో దేశంలోనే అత్యధికంగా హైదరాబాద్ నగరంలో కాంతి కాలుష్య తీవ్రత అధికంగా ఉందని తేలింది. అత్యధిక కాంతిని వెదజల్లేందుకు పోటాపోటీగా ఏర్పాటుచేస్తున్న కృత్రిమ కాంతులతో అనర్థాలే అత్యధికంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ కాంతి తీవ్రత విషయానికి వస్తే గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఎల్ఈడీ విద్యుత్ ధగధగలు వెదజల్లుతున్న కాంతి తీవ్రత 7790 యూనిట్లుగా ఉందని తేలింది. ఈ తీవ్రతను ప్రతి చదరపు మీటరు స్థలంలో విరజిమ్మే కాంతి తీవ్రత ఆధారంగా లెక్కిస్తారు. దీన్ని ఆంగ్ల ప్రమాణంలో ‘యూనిట్ ఆఫ్ ల్యుమినస్ ఇంటెన్సిటీ ఫర్ స్కేర్ మీటర్’గా పిలుస్తారు. ఈ విషయంలో మన గ్రేటర్‌సిటీ తరవాత కోల్‌కతా నగరం రెండోస్థానంలో నిలిచింది. ఈ సిటీలో 7480 యూనిట్ల కాంతితీవ్రత ఉందని ఈ అధ్యయనం తెలిపింది. ఇక మూడోస్థానంలో నిలిచిన దేశరాజధాని ఢిల్లీ సిటీలో 7270 యూనిట్లుగా కాంతి తీవ్రత నమోదైంది. అతి కాంతితో అనర్థాలే... అత్యధికంగా కాంతిని వెదజల్లే కృత్రిమ విద్యుత్ దీపాలతో మానవాళితోపాటు ఇతర జీవరాశుల్లోనూ విపరీత పరిణామాలు సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు. చత్వారం, కంటిచూపు దెబ్బతినడం వంటి అనర్థాలు చోటుచేసుకుంటాయంటున్నారు. చూపుల్లో అస్పష్టత చోటుచేసుకోవడం, పాదచారులు, వాహనచోదకులు, వాహనదారులు ఈ కాంతి వల్ల ఒక చోటు నుంచి మరో చోటుకు ప్రయాణించే సమయంలో కంటిచూపులో స్పష్టత కోల్పోయి తరచూ రోడ్డు ప్రమాదాల బారినపడుతున్నట్లు ఈ అధ్యయనం హెచ్చరించింది. అత్యధిక కాలం ఎల్ఈడీ కాంతులను చూసేవాళ్లు సమీప భవిష్యత్‌లో రంగులను గుర్తించే విజన్ సామర్థ్యాన్ని సైతం కోల్పోతారని కంటి వైద్య నిపుణులు శ్రీకాంత్ ‘సాక్షి’కి తెలిపారు. ఎల్ఈడీ లైట్లు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తాయని చెబుతున్నప్పటికీ మానవాళికి కలిగే ముప్పును ఎవరూ గుర్తించడం లేదని ఈ అధ్యయనం ఆందోళన వ్యక్తంచేయడం గమనార్హం. పశు, పక్ష్యాదులకూ గడ్డుకాలమే.. ఎల్ఈడీ కృత్రిమ కాంతులు మానవాళికే కాదు పెంపుడు జంతువులు, పక్షుల జీవనశైలిని సైతం తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ఈ అధ్యయనం హెచ్చరించింది. ప్రధానంగా పక్షులు సీజన్‌ను బట్టి, వాతావరణ మార్పులకు అనుగుణంగా వాటి మనుగడ కోసం ఒక చోటు నుంచి మరోచోటుకు వలసపోయే సమయంలో అత్యధిక కాంతుల బారిన పడినపుడు అవి తమ గమ్యాన్ని చేరకుండా దారితప్పుతాయని ఈ అధ్య యనం తెలిపింది. వాటి వలస టైంటేబుల్ సైతం అస్తవ్యస్తంగా మారుతుందని పేర్కొంది. ఇక కప్పలు సైతం ఈ అత్యధిక కాంతికి గురయినపుడు వాటి ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతాయని చెబుతున్నారు. గబ్బిలాలు ఈ కాంతి బారినపడినపుడు భౌతిక వత్తిడికి గురవుతాయని చెబుతున్నారు. ఈ అత్యధిక కాంతుల బారిన పడిన జంతువులు కొన్ని సార్లు కాంతిని చూసి భయపడి అధిక దూరం ప్రయాణించేందుకు బెంబేలెత్తే పరిస్థితి తలెత్తుతుందని జంతుశాస్త్ర అధ్యాపకులు చెబుతున్నారు. అత్యధిక విద్యుత్ కాంతులు,కృత్రిమ కాంతులు,భారీ విద్యుత్ దీపాలు ఏర్పాటుచేసే సమయంలో ప్రభు త్వం తగిన చర్యలు తీసుకోవాలి. -
భారీగా పెరిగిన బంగారం ధరలు!
మీరు బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక చెదువార్త. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు ఒక్కసారిగా పెరిగాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయి అని నిపుణులు సూచిస్తున్నారు. నేడు ఇండియన్ జువెలరీ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర రూ.47,877గా ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు పసిడి ధర సుమారు రూ.350 పెరిగింది. అలాగే, ఆభరణాల తయారీలో వాడే 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.43,855గా ఉంది. ఇక హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలలో ఎలాంటి మార్పు లేదు. స్వచ్చమైన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹48,830గా ఉంటే.. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర ₹44,760కు చేరుకుంది. విజయవాడ మార్కెట్లో కూడా ఇవే ధరలు ఉన్నాయి. బంగారం ధరతో పాటు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. నేడు కేజీ వెండి ధర రూ.200కి పైగా పెరిగి రూ.6,1233కు చేరుకుంది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. (చదవండి: జూమ్ కాల్లో 900 మంది ఉద్యోగులను తొలగించిన సీఈఓ.. ఎందుకో తెలుసా?) -
న్యూయార్క్ - న్యూఢిల్లీ ఫ్లైట్‌కి ఊహించని సమస్యలు
American Airlines Russian Airspace Issue: అమెరికా - ఇండియాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసుగా అమెరికా ఎయిర్‌లైన్స్ ప్రారంభించిన సర్వీసుకి ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. మార్గమధ్యంలో తలెత్తున్న ఇబ్బందుల కారణంగా షెడ్యూల్ టైంకి ఈ విమానం నడిపించడం మా వల్ల కాదంటున్నారు అమెరికన్ పైలెట్లు. ఇండియా, అమెరికాల మధ్య గతంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ డైరెక్టు విమానాలు నడిపించినా 2012లో రద్దు చేసింది. తాజాగా న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి బోయింగ్ 777 (300ఈఆర్) సర్వీసులను ప్రారంభించింది. ఈ రెండు నగరాల మధ్య దూరం 7320 మైళ్లు ఉండగా ప్రయాణ సమయం 16 గంటలలోపుగానే షెడ్యూల్ చేశారు. అయితే ఈ షెడ్యూల ప్రకారం విమానాలు నడిపించడం వీలు కావడం లేదంటూ వన్ టైం అట్ టైం వెబ్సైట్ కథనం ప్రచురించింది. అయితే ఈ విమానం మార్గమధ్యంలో కొద్ది సేపు రష్యా ఎయిర్ స్పేస్ మీదుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తమ గగన తలం ఉపయోగించుకోవడంపై రష్యా అభ్యంతరం వ్యక్తం చేయడంతో రూటు మార్చి నడిపిస్తున్నారు. దీంతో ప్రయాణ సమయం 16 గంటలు మించుతోంది. ఫలితంగా విమానం షెడ్యూల్ ప్రకారం నడిపించడంలో ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో న్యూయార్క్ - న్యూఢిల్లీ విమాన సర్వీసులో తలెత్తున్న ఇబ్బందులు పరిష్కరించాలంటూ అమెరికన్ పైలెట్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం చినికిచినికి గాలివానగా మారితే మరోసారి ఈ సర్వీసులు కొనసాగింపుపై ప్రభావం పడే అవకాశం ఉంది. కరోనా సంక్షోభం చక్కబడిన తర్వాత ఇప్పుడిప్పుడే ఇండియా - అమెరికాల మధ్య ప్రయాణాలు ఊపందుకుంటున్నాయి. ఎన్నారైలు తమ ప్రయాణాలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఈ విమాన సర్వీసు విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు తెర మీదకు వచ్చాయి. చదవండి: విదేశాల నుంచి ఇండియా వచ్చే వారికి అలెర్ట్! డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ -
బంగారం ప్రియులకు భారీ శుభవార్త!
మీరు కొత్తగా బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక అదిరిపోయే శుభవార్త. కేవలం ఒక్క రోజులోనే బంగారం ధర సుమారు రూ.870 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాల ధరలు పతనం కావడంతో రూపాయి క్షీణత ఉన్నప్పటికీ దిల్లీలో రాత్రికి రాత్రి పసిడి ధర రూ.870 తగ్గింది. కేవలం వారం రోజుల్లోనే పుత్తడి ధర రూ.2,000 వరకు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం 1806 అమెరికా డాలర్లుగా ట్రేడ్ అవుతుండగా.. ఔన్సు వెండి ధర 25.05 డాలర్లుగా ఉంది. ఇక ఇండియన్ బులియన్ జువెలరీ ప్రకారం నేడు దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి సుమారు రూ.870లు తగ్గడంతో రూ.48,076కి చేరింది. అలాగే, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.44,837 నుంచి రూ.44,038కు తగ్గింది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర దాదాపు రూ.49,900ల నుంచి రూ49,150కు పడిపోయింది. ఇక, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.45,740 నుంచి రూ.45,050కు తగ్గింది. మరోవైపు, వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనించాయి. కిలో వెండి ధర రూ.1,195లు తగ్గడంతో ప్రస్తుతం మొత్తం ధర రూ.64,532కి చేరింది. నిన్నటి ట్రేడింగ్‌లో కిలో వెండి ధర రూ.65,727లుగా ఉంది. బంగారం, వెండి ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి వివిధ అంశాల చేత ప్రభావం చెందుతాయి. (చదవండి: వాహనదారులకు శుభవార్త.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!) -
ఢిల్లీలో ఊపిరి ఆడట్లేదు
న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుందని, అత్యవసర పరిస్థితి కింద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు పేర్కొంది. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయో చెప్పాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. రెండు రోజుల పాటు లాక్డౌన్ విధిస్తే మంచిదని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ల ధర్మాసనం సూచించింది. ఇళ్లల్లో కూడా మాస్కులు పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితులు వచ్చాయని జస్టిస్ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల్ని తీయడంతో పిల్లలు ఎక్కువగా కాలుష్యం బారిన పడుతున్నారని ప్రధాన న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. వాయు కాలుష్యం పెరిగిపోవడానికి పంట వ్యర్థాలను కాల్చడమే కారణమని కేవలం రైతుల్ని మాత్రమే నిందించడం తగదన్నారు. వాహనాల నుంచి కాలుష్యం, బాణాసంచా కాల్చడం, పారిశ్రామిక వ్యర్థాలు వంటివన్నీ కూడా వాయుకాలుష్యాన్ని తీవ్రతరం చేస్తున్నాయని అన్నారు. ఏక్యూఐని 500 పాయింట్ల నుంచి 200కి తగ్గించడానికి ఏం చెయ్యాలో ఆలోచించాలి.. రెండు రోజుల లాక్డౌన్ సహా అత్యవసరంగా చర్యలేమైనా తీసుకోండి..అని ధర్మాసనం పేర్కొంది. గాలిలో కాలుష్యాన్ని తగ్గించి శుద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన స్మాగ్ టవర్లు చేస్తున్నాయా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు. ఢిల్లీ ప్రభుత్వం తరఫున కోర్టుకు హాజరైన అడ్వకేట్ రాహుల్ మెహ్రా.. సెప్టెంబర్ 30న ఏక్యూఐ 84 ఉంటే ప్రస్తుతం 474కి పెరిగిపోయిందని చెప్పారు. ప్రస్తుతం కాలుష్యం రోజుకి 20 సిగరెట్లు కాల్చిన దానితో సమానమని అన్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సమాచారం ప్రకారం శనివారం సాయంత్రం 6.30కి ఏక్యూఐ 427గా ఉంది. (చదవండి: 89 ఏళ్ల వయసు.. ఫిజిక్స్‌లో పీహెచ్డీ!) వారం రోజులు పాఠశాలలు బంద్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీలో బడుల్ని సోమవారం నుంచి వారం రోజులు మూసివేయనున్నట్లు్ల సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఈ సమయంలో స్కూళ్లు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తాయని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తారని చెప్పారు. ప్రైవేటు కార్యాలయాలు కూడా ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని సూచించారు. నిర్మాణ రంగం పనుల్ని నవంబర్ 14 నుంచి 17వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్టు తెలిపారు. (చదవండి: వావ్ ఏంటీ అద్భుతం... ఆకాశంలో హ్యారీపాటర్ సినిమాలో మాదిరి ఎగురుతోంది!!) -
క్వార్టర్ ఫైనల్లో శ్రీవల్లి రష్మిక..
న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ సీనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో రష్మిక 6–2, 6–2తో హైదరాబాద్‌కే చెందిన నిధి చిలుములపై అలవోకగా గెలిచింది. హైదరాబాద్‌కే చెందిన మరో ప్లేయర్ చిలకలపూడి శ్రావ్య శివాని పోరాటం రెండో రౌండ్లో ముగిసింది. షర్మదా బాలు (కర్ణాటక)తో జరిగిన మ్యాచ్‌లో శ్రావ్య శివాని తొలి సెట్‌ను 7–5తో గెలిచి, రెండో సెట్‌ను 1–6తో కోల్పోయింది. మూడో సెట్లో 0–2తో వెనుకబడిన దశలో గాయం కారణంగా శ్రావ్య శివాని వైదొలిగింది. మరో మ్యాచ్‌లో తటవర్తి శ్రేయ (ఆంధ్రప్రదేశ్) 6–2, 3–6, 1–6తో టాప్ సీడ్ జీల్ దేశాయ్ (గుజరాత్) చేతిలో... స్మృతి భాసిన్ (తెలంగాణ) 4–6, 1–6తో ఆకాంక్ష (మహారాష్ట్ర) చేతిలో ఓడిపోయారు. విష్ణు పరాజయం పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ నిక్కీ పునాచా (ఆంధ్రప్రదేశ్) క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. రెండో రౌండ్లో నిక్కీ 6–4, 6–3తో ఫైజల్ కమర్ (రాజస్తాన్)పై గెలిచాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ‘లండన్ ఒలింపియన్’ విష్ణువర్ధన్ (తెలంగాణ) 4–6, 1–6తో నితిన్ కుమార్ సిన్హా (పశి్చమ బెంగాల్) చేతిలో... కాజా వినాయక్ శర్మ (ఆంధ్రప్రదేశ్) 4–6, 6–7 (2/7)తో సిద్ధార్థ్ విశ్వకర్మ (ఉత్తరప్రదేశ్) చేతిలో ఓడిపోయారు చదవండి: బీసీసీఐ బాస్ కీలక నిర్ణయం.. 'ఆ పదవికి' రాజీనామా -
ఫెస్టివల్ ఎఫెక్ట్.. బంగారం మరింత ప్రియం
భారతదేశంలో బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి. దీపావళి పండుగ సీజన్ నేపథ్యంలో కొనుగోలుదారులు ఆసక్తి కనబరచడంతో పసిడి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా పుత్తడి ధరలు రెండు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. ప్రపంచ మార్కెట్లలో బంగారం రేట్లు నేడు $1,800 స్థాయికి చేరుకున్నాయి. ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇండియన్ బులియన్ & గోల్డ్ జ్యువెలరీ ప్రకారం 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర సుమారు రూ.400 పెరిగి రూ.48,048కు చేరుకుంది. అలాగే, ఆభరణాల తయారీలో వాడే 10 గ్రాముల పసిడి ధర రూ.43,639 నుంచి రూ.44,012కు పెరిగింది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో రూ.100 పెరిగిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,760కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరగడంతో రూ.46,760కి చేరింది. ఇక వెండి ధర కూడా బంగారంతో పాటు పెరిగింది. నేడు రూ. 900 పెరిగి రూ. 65,777 చేరుకుంది. బంగారం, వెండి ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి వివిధ అంశాల చేత ప్రభావం చెందుతాయి.(చదవండి: డ్యాన్స్‌తో అదరగొట్టిన సీఈవో) -
ప్రపంచంలోనే తొలి చైల్డ్ ఆర్టిస్ట్
న్యూఢిల్లీ: చిన్నారులు ముద్దులొలికే మాటలు, వారి హావాభావాలు చూస్తుంటే పెద్దలకు తమ సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. కొంత మంది పిల్లలు చిన్న వయసులో సహజ సిద్ధంగానే వాళ్లలో కొన్ని కళలు దాగి ఉంటాయి. పాట పాడటం, డ్యాన్స్ చేయడం లేదా మంచి జ్ఞాపకశక్తి తదితర టాలెంట్లను పిల్లలో చూసుంటాం. అయితే అతి చిన్న వయసులోనే కుంచె పట్టుకున్న అత్యంత ఆకర్షణీయమైన చిత్రాలను గీయగల పిల్లలను చూసి ఉండం కదా!. కానీ ఢిల్లీకి చెందిన మూడేళ్ల ఏళ్ల అర్మాన్ రహేజా సోలోగా ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టి మరీ అందర్నీ ఆకర్షించేలా కాన్వాస్‌పై రంగురంగుల పెయింటింగ్‌లు వేసి అందరీ మన్నలను పొందుతున్నాడు. (చదవండి: వామ్మో...ఓవర్ హెడ్ వైర్ల పై పెద్ద పాము) అంతే కాదండోయ్ భారత్‌లోనే తొలిసారిగా అత్యంత పిన్న వయసులో ఇండియా హాబిటాట సెంటర్లో సోలోగా ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించిన కళాకారుడుగా చరిత్రలో నిలవడమే కాక ప్రపంచంలోనే అత్యంత పిన్న కళాకారుల్లో ఒకడిగా కూడా స్థానం దక్కించుకున్నాడు. అయితే ఆర్మాన్ తన చూట్టు ఉన్న పరిసరాలను నుండి స్ఫూర్తి పొందడమే కాక దానికి తన సృజనాత్మక శక్తిని జోడించి అక్రిలిక్, వాటర్ కలర్స్ పోస్టర్ రంగులను ఉపయోగించి కాన్వాస్‌పై రమణీయమైన చిత్రాలను గీస్తాడు. అర్మాన్ తల్లి కాశిష్ రహేజా ఎఫ్ఐడీఎంలో ఇంటిరియర్ డిజైనర్, తండ్రి నయన్ రహేజా న్యూఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో ఆర్కిటెక్ట్. ఈ మేరకు అర్మాన్ తల్లి కాశిష్ మాట్లాడుతూ....గతేడాది రంగులతో ఆడుతుంటే అది తనలోని అసాధారణమైన ప్రతిభకు సంకేతంగా చెబుతున్నాడని అనుకోలేదు. తల్లిదండ్రులు కూడా పిల్లల అసాధారణ ప్రతిభ గుర్తించిగలిగితేనే వారికి అవసరమైన మార్గదర్శకత్వం అందించి ప్రోత్సహించగలరు. ఈ విషయంలో స్కూల్ టీచర్ భావన, అమ్మమ్మ నిర్మల్ రహేజా కూడా అర్మాన్ ఆలోచనలను క్రమబద్ధీకరించడంలో సహాయపడట మేకాక తన ఆలోచనలకు ఒక నమూనాను రూపొందించగలిగేలా అర్మాన్ని మలిచారు. సూపర్నోవా, జెల్లీ ఫిష్ వంటి టైటిల్స్‌తో అర్మాన్ ప్రతి కాన్వాసులను ఎంత అద్భుతంగా గీస్తాడో కూడా వివరించారు. పైగా తమ కుమారుడి పనికి తగిన గుర్తింపు లభించినందుకు సంతోషంగా ఉంది" అని అన్నారు. (చదవండి: టాయిలెట్‌కి వెళ్లింది.. బిడ్డతో బయటకు వచ్చింది) -
Gold Price: బంగారం మరింత ప్రియం
పండుగ సీజన్ నేపథ్యంలో బంగారం అమ్మకాలు భారీగా కొనసాగుతున్నాయి. అందుకే గత వారం రోజుల నుంచి బంగారం ధర పెరుగుతూ వస్తుంది. నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ధర నేడు భారీగా పెరిగింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో స్వచ్చమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.46,604 నుంచి రూ.46,885కు పెరిగింది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర సుమారు రూ.250 పైగా పెరిగి రూ.42,947 చేరుకుంది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో రూ.220 పెరిగిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,780కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరగడంతో రూ.43,800కి చేరింది. బంగారం బాటలోనే వెండి ధరలు పెరిగాయి. కేజీ వెండి ధర రూ.500కి పైగా పెరిగి రూ.61,078కు చేరింది. బంగారం, వెండి ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి వివిధ అంశాల చేత ప్రభావం చెందుతాయి.(చదవండి: పేటీఎం నుంచి నవరాత్రి గోల్డ్ ఆఫర్) -
మళ్లీ గాల్లో ఎగరనున్న ఆ బడా ఎయిర్ లైన్స్ కంపెనీ
న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రముఖ ఎయిర్ లైన్స్ జెట్ ఎయిర్వేస్ తిరిగి మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్దం అవుతుంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో జెట్ ఎయిర్వేస్ విమానాలు మళ్లీ గాల్లో ఎగరనున్నాయని జలాన్ కల్రాక్ కన్సార్షియం సోమవారం వెల్లడించింది. న్యూఢిల్లీ నుంచి ముంబైకి తన మొదటి విమానంతో దేశీయ కార్యకలాపాలను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉందని, వచ్చే ఏడాది ద్వితీయార్ధం నాటికి అంతర్జాతీయ విమానాలు కూడా పనిచేస్తాయని కంపెనీ ఈ రోజు తెలిపింది. 100కి పైగా విమాన సేవలు గ్రౌండెడ్ క్యారియర్ పునరుద్ధరించే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్(ఏఓసీ) కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది. "జెట్ ఎయిర్వేస్ 2.0 2022 మొదటి తొలి త్రైమాసికంలో దేశీయ కార్యకలాపాలను పునఃప్రారంభించడం, క్యూ3/క్యూ4 2022 నాటికి స్వల్ప కాలిక అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మా ప్రణాళికలో భాగంగా రాబోయే 3 సంవత్సరాలలో 50+ విమానాలు, 5 సంవత్సరాలలో 100+ పైగా విమాన సేవలను అందుబాటులోకి తేవాలని కన్సార్టియం స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకున్నట్లు" లండన్ కు చెందిన జలాన్ కల్రాక్ కన్సార్టియం ప్రధాన సభ్యుడు, జెట్ ఎయిర్ వేస్ ప్రతిపాదిత నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ యుఏఈ వ్యాపారవేత్త మురారి లాల్ జలాన్ అన్నారు.(చదవండి: ఈఎస్ఐసీ చందాదారులకు కేంద్రం శుభవార్త!) విమానయాన చరిత్రలో ఇదే మొదటిసారి "విమానయాన చరిత్రలో 2 సంవత్సరాలకు పైగా మూతబడిన ఒక విమానయాన సంస్థను పునరుద్ధరించబడటం ఇదే మొదటిసారి. ఈ చారిత్రాత్మక ప్రయాణంలో భాగం కావడం ఆనందంగా ఉంది" అని శ్రీ జలాన్ చెప్పారు. భారీగా పెరిగిన నష్టాలతో కుంటుపడిన ఈ విమానయాన సంస్థ, ఒకప్పుడు భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ క్యారియర్. భారీ అప్పుల కారణంగా ఏప్రిల్ 2019లో అన్ని విమానాలను నిలిపి వేయాల్సి వచ్చింది. జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణ ప్రణాళికను నేషనల్ కంపెనీల లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఈ ఏడాది జూన్‌లో ఆమోదించింది. ప్రస్తుతం ఈ కంపెనీ దివాలా చట్టం కింద పరిష్కార ప్రక్రియలో ఉంది. గతేడాది అక్టోబరులో బ్రిటన్‌కు చెందిన కల్రాక్ క్యాపిటల్, యూఏఈ వ్యాపారవేత్త జలాన్‌ల నేతృత్వంలోని కన్సార్షియం.. జెట్ ఎయిర్వేస్ బిడ్డింగ్‌లో విజేతగా నిలిచింది. రాబోయే 5 ఏళ్లలో రూ.12000 వేల కోట్లను తిరిగి చెల్లిస్తామని కల్రాక్-జలాన్ కన్సార్షియం ప్రతిపాదించింది. దీనికి ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది.(చదవండి: పన్నులు చెల్లించండి..అభివృద్ధికి సహకరించండి..) 1000కి పైగా ఉద్యోగాలు పునరాగమనం చేస్తున్న జెట్ ఎయిర్వేస్ సంస్థ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. "జెట్ ఎయిర్ వేస్ ముంబైలోని తన 'గ్లోబల్ వన్' కార్యాలయం నుండి పనిచేస్తుంది. అక్కడ ఆ విమానయాన సంస్థకు ప్రపంచ స్థాయి అత్యాధునిక శిక్షణా కేంద్రాన్ని కూడా ఉంది. ఇక్కడే సిబ్బంది కోసం ఇన్-హౌస్ శిక్షణ ఇస్తారు" అని తాత్కాలిక సీఈఓ కెప్టెన్ గౌర్ పేర్కొన్నారు. "జెట్ ఎయిర్వేస్ ఇప్పటికే తన ప్రణాళికలో భాగంగా 150 మందికి పైగా శాశ్వత స్థాయి ఉద్యోగులను నియమించుకుంది. అలాగే వివధ కేటగిరీలలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో మరో 1000 మందికి పైగా ఉద్యోగులను ఆన్ బోర్డ్ చేయాలని చూస్తున్నాము" అని కెప్టెన్ గౌర్ తెలిపారు. ఈ నియామక ప్రక్రియ దశలవారీగా ఉంటుందని ఆయన అన్నారు. -
ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు..
న్యూఢిల్లీ: పంద్రాగస్టు వేడుకలు సమీస్తున్న వేళ దేశ రాజధాని ఢిల్లీ లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఎర్రకోట వద్ద 5 వేల మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎర్రకోట పరిసరప్రాంతాల్లో ఎత్తైన భవనాలపై ఎన్ఎస్జీ, స్వాత్ కమాండోలు..కైట్ క్యాచర్స్, షార్ప్ షూటర్లు పహరా కాస్తున్నారు. ఆగస్టు 15న డ్రోన్లు, బెలూన్లు వంటివి ఎగురవేయడంపై నిషేధం విధించారు. యాంటీ డ్రోన్ల వ్యవస్థలను పోలీసులు ఏర్పాటు చేశారు. కాగా శుక్రవారం ఢిల్లీ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టిన ప్రత్యేక బ్రాంచ్ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుండి 55 పిస్తోళ్ళు, 50 లైవ్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితుల నుండి 55 సెమీ ఆటోమేటిక్ పిస్టల్స్ , 50 లైవ్ క్యాట్రిడ్జ్‌లను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
బంగారం కొనుగోలుదారులకు శుభవార్త!
బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. నేడు బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. పసిడి ధర నెల చూపులు చూస్తుంది. న్యూఢిల్లీ బులియన్ జ్యూవెలరీ మార్కెట్లో ఆగస్టు 6న రూ.47,731లుగా ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర నేడు 1,175 రూపాయలు పడిపోయి రూ.46,556 చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.43,722 నుంచి రూ.42,645 పడిపోయింది. ప్రపంచ మార్కెట్లలో కూడా బంగారం రేట్లు నేడు 4.4% వరకు పడిపోయాయి, ఎందుకంటే అమెరికాలో ఉద్యోగాల నియామక ప్రక్రియ ఫెడరల్ రిజర్వ్ ఊహించిన దానికంటే వేగంగా పెరగడం, గోల్డ్ మీద పెట్టిన పెట్టుబడులు వెనక్కి తీసుకోవడంతో బంగారం ధర తగ్గినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక హైదరాబాద్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పడిపోయాయి. స్వచ్చమైన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,830 నుంచి రూ.530 పడిపోయి రూ.47,300కు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర ₹43,840 నుంచి 490 రూపాయలు క్షీణించి ₹43,350 చేరుకుంది. బంగరం స్థాయిలోనే వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి. నేడు కేజీ వెండి ధర రూ.66,990 నుంచి రూ.64,025 చేరుకుంది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. -
రెండో రోజు పెరిగిన బంగారం ధరలు
దేశంలో బంగారం ధరల్లో స్థిరత్వం ఏ మాత్రం కనిపించడం లేదు. గత కొద్ది రోజులుగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా రెండో రోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడంతో ఆ ప్రభావం మనదేశ బంగరం ధరల మీద పడింది. ఎంసిఎక్స్ లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.186 పెరిగి 10 గ్రాముల ధర రూ.47,763 వద్ద ఉంది. స్పాట్ మార్కెట్లో అత్యధిక స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.47,761కు లభిస్తుండగా, వెండి ధర కిలోకు రూ.66,386గా ఉందని ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ తెలిపింది. హైదరాబాద్ మార్కెట్లో కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. స్వచ్చమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹48,880 నుంచి ₹48,990 పెరిగింది. అలాగే, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹100 పెరిగి ₹44,900గా ఉంది. నేడు విజయవాడ మార్కెట్లో కూడా ఇవే ధరలు ఉన్నాయి. డెల్టా కరోనావైరస్ వేరియంట్ తో అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్దగా ప్రమాదం లేదని జెరోమ్ పావెల్ చెప్పడం, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ విధాన ప్రకటన తర్వాత బంగారం ధరలు పెరిగాయి. స్పాట్ బంగారం ధర 0.1% పెరిగి ఔన్స్ కు 1,801.10 డాలర్ల వద్ద ఉంది. -
స్కూళ్లు తెరవడంపై నిర్ణయం రాష్ట్రాలదే: కేంద్ర ఆరోగ్య శాఖ
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు మూత పడ్డాయి. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో స్కూళ్లను తెరవాలా వద్దా అనే అంశంపై అన్ని వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. దేశంలో థర్డ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని నిపుణల హెచ్చరికల నేపథ్యంలో స్కూళ్లు తెరవాలా వద్దా అన్నది రాష్ట్రాలే నిర్ణయించుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒకవేళ కరోనా కేసులు పెరిగినా పిల్లలపై ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. చాలా మంది ఉపాధ్యాయులు 18-44 సంవత్సరాల వయస్సులో ఉన్నారని..టీకాలు వేగవంతం చేయడం పూర్తిగా రాష్ట్రాలపైనే ఆధారపడి ఉన్నదని కేంద్రం తెలిపింది. దేశ జనాభాలో ఎక్కువ భాగం ఉపాధ్యాయులు కరోనా టీకాలు పొందనందున స్కూళ్లు తెరువడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు పేర్కొంది. దేశంలోని 94.5 కోట్ల మంది జనాభాలో కేవలం 9.54 కోట్ల మంది టీకా తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. స్కూళ్ల టీచర్ల టీకా శాతం, ప్రస్తుత పరిస్థితిపై సీబీఎస్ఈ, యూజీసీతో పాటు దేశంలోని ఇతర విద్యా సంస్థలు, విద్యా బోర్డుల నుంచి నివేదికను కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ కోరింది. -
నిజాయితీగా పన్ను చెల్లించేవారికి గుర్తింపు
న్యూఢిల్లీ: జాతి నిర్మాణం కోసం బాధ్యతాయుతంగా తమ వంతు వాటా మేర పన్నులను చెల్లిస్తున్న నిజాయితీపరులకు కచ్చితంగా గుర్తింపు ఉంటుందన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో సవాళ్లు, ఆటంకాలతో కూడిన పరిస్థితుల్లోనూ నిబంధనలను పాటిస్తున్నందుకు పన్ను చెల్లింపుదారులను ప్రశంసించారు. ఎన్నో సంస్కరణలను విజయవంతంగా అమలు చేస్తున్న ఆదాయపన్ను శాఖను ఆమె అభినందించారు. ఆదాయపన్ను శాఖ 161వ వార్షికోత్సవం సందర్భంగా మంత్రి సందేశం ఇచ్చారు. ఆదాయపన్ను శాఖ విధానాలు, ప్రక్రియలను సులభతరంగా మార్చడంలోను, పారదర్శకంగా, సౌకర్యవంతమైన అనుభవాన్ని పన్ను చెల్లింపుదారులకు కల్పించే విషయంలో ఆదాయపన్ను శాఖ చేస్తున్న కృషిని కొనియాడారు. ఆదాయపన్ను శాఖకు సంబంధించి చాలా వరకు ప్రక్రియలు, నిబంధనల అమలు ఆన్లైన్ వేదికలపైకి తీసుకురావడం వల్ల.. పన్ను చెల్లింపుదారులు ఆదాయపన్ను శాఖలకు ప్రత్య క్షంగా రావాల్సిన అవసరం లేకుండా పోయినట్టు లేదా చాలా వరకు పరిమితమైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. పన్ను ల వసూళ్లలో ఆరోగ్యకరమైన వృద్ధి నెలకొనడం పట్ల ఆదాయపన్ను శాఖ కృషిని రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్‌బజాజ్ కూడా అభినందించారు. -
మీడియా సంస్థలపై ఐటీ దాడులు
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను ఎగవేత ఆరోపణలతో మీడియా సంస్థలపై ఐటీ శాఖ కొరడా ఝళిపించింది. దైనిక్ భాస్కర్, భారత్ సంచార్ మీడియా సంస్థలకి చెందిన పలు నగరాల్లోని కార్యాలయాలపై దాడులకు దిగింది. భోపాల్, జైపూర్, అహ్మదాబాద్, నోయిడాతోపాటు దేశంలోని ఇతర నగరాల్లోని దైనిక్ భాస్కర్ కార్యాలయాలపై, ఉత్తరప్రదేశ్‌కు చెందిన న్యూస్ చానెల్ భారత్ సంచార్, ఆ సంస్థ ప్రమోటర్స్, సిబ్బందిపై లక్నోలో దాడులు నిర్వహించినట్టుగా ఐటీ శాఖ అధికారి ఒకరు చెప్పారు. దైనిక్ భాస్కర్ గ్రూప్ టెక్స్టైల్స్, మైనింగ్ వ్యాపారాలూ ఉన్నాయని, వాటికి సంబంధించిన లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించినట్టుగా ఆ అధికారి చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దైనిక్ భాస్కర్ యాజమానుల నివాసాల్లోని సోదాలు నిర్వహించింది. ఈ రెండు మీడియా సంస్థలు కరోనా సెకండ్ వేవ్ ఎదుర్కోవడంలో కేంద్రం వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజా సమస్యల్ని హైలైట్ చేస్తూ పలు కథనాలు చేశాయి. దేశంలో 12 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న దైనిక్ భాస్కర్ 65 ఎడిషన్లను, 211 సబ్ ఎడిషన్లను హిందీ, గుజరాతీ, మరాఠీ భాషనల్లో ప్రచురిస్తోంది. 7 రాష్ట్రాల్లో 30 రేడియో స్టేషన్లు నిర్వహించడంతో పాటుగా వెబ్ పోర్టల్స్, ఫోన్ యాప్స్ ఉన్నాయి. భారత్ సంచార్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ బ్రజేశ్ మిశ్రా, స్టేట్ హెడ్ వీరేంద్ర సింగ్‌తో పాటు కొందరు ఉద్యోగుల ఇళ్లల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించిందని ఆ టీవీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. తర్వాత దైనిక్ భాస్కర్ తన వెబ్సైట్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్లలోని తమ కార్యాలయాల్లో సోదాలు చేసినట్టు వెల్లడించింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ప్రభుత్వ అసమర్థతను తాము బహిర్గతం చేయడం వల్లే ఈ దాడులకు దిగిందని దైనిక్ భాస్కర్ ఆరోపించింది. రాజ్యసభలో ధ్వజమెత్తిన కాంగ్రెస్ మీడియాపై దాడుల్ని రాజ్యసభలోనూ విపక్ష నేతలు ప్రస్తావించారు. కాంగ్రెస్ నాయకుడు దిగ్వి జయ్ సింగ్ సభలో ఈ అంశాన్ని లేవనెత్తుతూ కేంద్రం ప్రజాస్వామ్యం గొంతు నొక్కేస్తుందని ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ చేసిన విమర్శ ల్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తిప్పికొట్టారు. కేంద్ర సంస్థలు తమ పని తాము చేస్తున్నాయని అందులో ప్రభుత్వం జోక్యం చేసుకోదని అన్నారు. ఎవరైనా పూర్తి సమాచారాన్ని తెలుసుకొని నిర్ధారణ చేసుకోవాలని, కొన్ని అంశాలు వాస్తవ దూరంగా ఉంటాయని వివరణ ఇచ్చారు. పాఠకులే సుప్రీం: దైనిక్ భాస్కర్ తమ కార్యాలయాలపై ఐటీ దాడులపై దైనిక్ భాస్కర్ మీడియా గ్రూపు స్పందించింది. ‘మేము స్వతంత్రులం. పాఠకుల అభీష్టమే మాకు పరమావధి’ అని తమ వెబ్సైట్లో పేర్కొంది. కరోనా సెకండ్ వేవ్‌లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకు పర్యవసానంగానే ఐటీ దాడులని తెలిపింది. తమ గ్రూపు ఉద్యోగుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయని, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని, నైట్‌షిఫ్ట్‌లో ఉన్న ఉద్యోగులను ఇళ్లకు వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించింది. -
బంగారం కొనుగోలుదారులకు భారీ షాక్!
బంగారం కొనుగోలుదారులకు భారీ షాక్ తగిలింది. భారతదేశంలో బంగారం ధరలు దాదాపు నాలుగు వారాల గరిష్టాన్ని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. రాయిటర్స్ ప్రకారం.. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ కు 0.1% పెరిగి 1,826.40 డాలర్లకు చేరుకుంది. జూన్ 16 తర్వాత ఇదే అత్యధికం. న్యూఢిల్లీ బులియన్ జువెలరీ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.48,108 నుంచి రూ.48,474 పైకి చేరింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజులో రూ.335 పెరిగి రూ.44,402 వద్ద నిలిచింది. హైదరాబాద్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగానే పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 నుంచి రూ.45,150కి చేరుకుంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990 నుంచి రూ.49,260కు పెరగింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. నేడు కేజీ వెండి ధర రూ.581 పెరిగి కిలో రూ.69,516కు చేరింది. అంతకుముందు రోజు కిలో రూ.68,935గా ఉన్న సంగతి తెలిసిందే. -
రెండో రోజు భారీగా పడిపోయిన బంగారం ధరలు
మీరు బంగారం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. కేవలం రెండు రోజుల్లోనే రూ.1300 పైగా పడిపోయింది. గతంలో ఇంత మొత్తంలో తగ్గిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. అమెరికాలో వడ్డీరేట్లు పెరగవచ్చన్న అంచనాలు అంతర్జాతీయంగా పసిడి పతనానికి దారితీశాయి. అలాగే, దేశీయంగా కూడా పుత్తడి ధరలు తగ్గాయి. మరోవైపు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్(ఐబీజెఎ) ప్రకారం.. 10 గ్రాముల 24 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.410లు తగ్గడంతో రూ.47,201కి చేరింది. క్రితం ట్రేడింగ్‌లో ఈ ధర రూ.47,611గా ఉంది. ఇక ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.376 తగ్గడంతో రూ.43,236కి చేరుకుంది. అటు హైదరాబాద్ మార్కెట్లో కూడా పసిడి ధరలు భారీగా పడిపోయాయి. హైదరాబాద్‌లో ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 తగ్గి రూ.44,250కి చేరుకుంది. క్రితం ట్రేడింగ్‌లో ఈ ధర రూ.44,850గా ఉంది. బంగారు ఆభరణ తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.660 తగ్గి రూ. 48,270కు పడిపోయింది. బంగారం దారిలోనే వెండి కూడా పయనించింది. నేడు ఒక కేజీ వెండి ధర రూ.1700 పడిపోయి రూ.68379 వద్ద ట్రేడింగ్ అవుతుంది. అంతర్జాతీయం ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయార్క్ కమోడిటీ ఎక్సేంజ్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర క్రితం ముగింపుతో పోల్చితే దాదాపు 100 డాలర్లు పతనమై, 1770 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. చదవండి: ఆఫ్రికాలో దొరికిన అరుదైన మూడో అతిపెద్ద వజ్రం -
Gold Price: బంగారం ప్రియులకు భారీ షాక్
న్యూఢిల్లీ: నేడు బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ఇండియన్ బులియన్, జెవెల్లెర్స్ అసోసియేషన్ ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,536 నుంచి రూ.49,105కు పెరగింది. అంటే ఒక్క రోజులో రూ.569 పెరగింది అన్నమాట. అలాగే, నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,459 నుంచి రూ.44,980కు చేరుకుంది. పసిడి బాటలోనే వెండి కూడా పయనించింది. కిలోపై రూ.752 పెరగడం ద్వారా రూ.71,700కు చేరింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర నేటి ఉదయం 10 గ్రాములు రూ.45,600 నుంచి రూ.46,100కు పెరిగింది. అలాగే పెట్టుబడులు పెట్టేందుకు వాడే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు బంగారం ధర రూ.540 పెరిగి రూ.50,300కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. ఇక అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ ఏర్పడింది. ఔన్సు 1,908 డాలర్లు ఉండగా, వెండి ఔన్సు 28.07 డాలర్లుగా ఉంది. చదవండి: ప్రపంచానికి కొత్త కుబేరుడు.. రెండో స్థానంలో జెఫ్ బిజోస్ -
కరోనా టెర్రర్.. 5 రాష్ట్రాల సీఎంలకు పాజిటివ్..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామాన్య ప్రజలనుంచి పాలకుల వరకు ఎవర్నీ వదలిపెట్టడం లేదు. ఇప్పటికే మనదేశంలో అయిదుగురు ముఖ్యమంత్రులకు కరోనా సోకింది. తమిళనాడు సీఎం పళని స్వామి, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం యడ్యూరప్ప, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు కరోనా బారిన పడిన వారిలో ఉన్నారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ జాబితాలో చేరారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కి కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. కాగా, కరోనా తీవ్రతను దృష్ఠిలో ఉంచుకున్నకేంద్రం వ్యాక్సిన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మే1 నుంచి 18 సంవత్సరాలు పైబడిన వారందరికి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని తీసుకుంది. -
భర్తను హతమార్చిన భార్య.. ఎందుకంటే?
న్యూఢిల్లీ: తాగుడుకు అలవాటు పడితే ఆ మైకంలో ఏం చేస్తారో వారికే తెలియదు. తాగుడుకు బానిసై తమను అశ్రద్ధ చేస్తున్నాడని భార్య కట్టుకున్న భర్తనే చంపగా, తాగటానికి డబ్బులివ్వలేదని ఓ వ్యక్తి కన్నతల్లినే కడతేర్చాడు. ఈ రెండు వేర్వేరు ఘటనలు దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ఫతేపూర్‌కు చెందిన సరితాదేవి, సికిందర్ సహని భార్యాభర్తలు. సికిందర్‌కు పూటుగా మద్యం తాగే అలవాటు ఉంది. ప్రతి రోజు తాగి వచ్చి భార్యను కొట్టేవాడు. పిల్లలముందే నోటికొచ్చినట్లు తిట్టేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అతడు మరోసారి తాగి ఇంటికి వచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. భర్త తీరుతో విసిగిపోయిన సరిత, చీర తీసుకుని మత్తులో ఉన్న భర్త మెడకు బిగించింది. దీంతో అతడు ఊపిరాడక ప్రాణాలు వదిలాడు. ఆమె వెంటనే తన భర్తను సఫ్దార్జంగ్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అతడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అయితే మెడపై కొన్ని గుర్తులు ఉండటంతో హత్య అని భావించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో డీసీపీ అతుల్ ఠాకుర్ ఆసుపత్రికి చేరుకుని బాధితురాలిని ప్రశ్నించారు. ఆమె పొంతన లేని మాటలు మాట్లాడటంతో ఇది హత్యేనన్న అనుమానం మరింత బలపడింది. దీంతో మృతదేహానికి ఫోరెన్సిక్ నిపుణులతో పరీక్షలు చేయించారు. ఆ తర్వాత సరితను తమదైన శైలిలో విచారించగా, భర్త తాగుడుకు బానిసవ్వడం, ఏ పని చేయకపోవడం వల్లే హత్య చేసినట్లు అంగీకరించింది. తాగడానికి డబ్బులివ్వలేదని.. ఢిల్లీలోని నార్త్ ఈస్ట్‌లో 64 ఏళ్ళ వృద్దురాలిని ఆమె కొడుకు హత్యచేశాడు. తాగడానికి డబ్బులివ్వాలని సుశీల్ పాండే తన తల్లి లల్లిదేవిని బలవంతపెట్టాడు. ఆమె డబ్బులివ్వడానికి నిరాకరించడంతో విచక్షణ కోల్పోయిన అతడు స్ర్కూడ్రైవర్ తీసుకొని తల్లిని క్రూరంగా హత్యచేశాడు. ఆమె భర్త ఫిర్యాదు మేరకు సుశీల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. చదవండి: దాబాకు వెళ్లి.. వెంటనే వచ్చేస్తామని చెప్పి -
కరోనా: భారత్‌లో 79 లక్షలు దాటిన కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 79,09,000 దాటాయి. గడచిన 24 గంటలలో దేశంలో 45,148 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. 24 గంటల్లో 480 మంది కరోనా వలన మరణించారు. అయితే ఇక్కడ ఊరటనిచ్చే విషయం ఏంటంటే కరోనా నుంచి కోలుకొని 24 గంటల్లో 59,105 మంది డిశార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా 6,53,717 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా సోకి మొత్తం 1,19,014 మంది మృతి చెందారు. దేశంలో కరోనా రికవరీ రేటు 90.23 శాతంగా ఉంది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం కేవలం 8.26 శాతం మాత్రమే. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు కేవలం 1.50 శాతం. గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 9,39,309 కరోనా టెస్ట్‌లు నిర్వహించగా, ఇప్పటి వరకు దేశంలో నిర్వహించిన మొత్తం కరోనా టెస్ట్‌ల సంఖ్య 10,34,62,778. చదవండి: నన్ను గెలిపిస్తే అందరికీ ఫ్రీగా వాక్సిన్ -
సీబీఎస్ఈ 10,12వ తరగతి పరీక్షలు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు పదవ తరగతితో పాటు డిగ్రీ, పీజీ అన్ని రకాల పరీక్షలు రద్దు చేశాయి. తాజాగా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) కూడా పరీక్షలను రద్దు చేసింది. 10, 12 తరగతి పరీక్షలను రద్దు చేసినట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది. జూలై జరగాల్సిన పరీక్షలను సీబీఎస్ఈ రద్దు చేసినట్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సర్వోన్నత న్యాయస్థానానికి గురువారం తెలిపారు. వీటితో పాటు ఐసీఎస్ఈ పరీక్షలు రద్దు చేసినట్టు వెల్లడించారు. 12వ తరగతి విద్యార్థులకు రెండు ఆప్షన్లు ఇచ్చినట్టు కోర్టుకు సీబీఎస్ఈ తెలిపింది. పరీక్షకు హాజరవుతారా? ఇంటర్నర్ మార్కుల ఆధారంగా సర్టిఫికెట్ తీసుకుంటారా అనేది విద్యార్థుల నిర్ణయానికే వదిలిపెట్టినట్టు వెల్లడించింది. సీబీఎస్ఈ తీసుకున్న తాజా నిర్ణయాలకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు(శుక్రవారం) వెలువడనుంది. -
ప్రపంచ నంబర్‌వన్‌గా మానవ్ ఠక్కర్
న్యూఢిల్లీ: భారత యువ టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారుడు మానవ్ ఠక్కర్ అండర్–21 పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించాడు. గత నెలలో జరిగిన నార్త్ అమెరికా ఓపెన్ టోర్నీలో మానవ్ విజేతగా నిలిచాడు. దాంతో అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) శుక్రవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో మానవ్ తొమ్మిది స్థానాలు ఎగబాకి టాప్ ర్యాంక్‌ను అధిరోహించాడు. గతంలో భారత్ తరఫున అండర్–21 విభాగంలో హర్మీత్ దేశాయ్, సత్యన్, సౌమ్యజిత్ ఘోష్ ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచారు. -
బంగ్లా ప్రధానితో కాంగ్రెస్ అధినేత్రి భేటీ
న్యూఢిల్లీ : భారత పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌హసీనాతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆమెతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, ఆనంద్ శర్మ తదితరులు పాల్గొన్నారు. వీరు ఈ సందర్భంగా అనేక విషయాలపై చర్చించారు. నాలుగు రోజుల పర్యటనకు భారత్‌కు వచ్చిన బంగ్లా ప్రధాని హసీనా శనివారం ఢిల్లీలో ప్రధానితో భేటీలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తృతం చేసుకునేందుకు భారత్, బంగ్లాదేశ్ అంగీకరించాయి. అనంతరం రెండు దేశాల అధికారులు ఏడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. తీరం ప్రాంతంలో ఉమ్మడి గస్తీ సహా మూడు ప్రాజెక్టుల ప్రారంభానికి అంగీకరించారు. కాగా, చర్చల సందర్భంగా అస్సాం ఎన్ఆర్సీ అంశాన్ని బంగ్లాదేశ్ ప్రధాని ప్రస్తావించారు. నాలుగు రోజుల పర్యటనకు ఈ నెల 3వ తేదీన భారత్ చేరుకున్న ప్రధాని హసీనా 3, 4 తేదీల్లో ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్నారు. -
అర్ధరాత్రి దాకా ఏం చేస్తున్నావ్?
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్ధరాత్రి ఇంటికి వస్తున్న ఓ రేడియో జాకీని తను నివాసం ఉండే కాలనీ సెక్యూరిటీగార్డు వేధింపులకు గురిచేసిన సంఘటన న్యూఢిల్లీలో జరిగింది. అర్ధరాత్రి వరకు ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావని వెటకారంగా ఆమెను ప్రశ్నించడమేగాక కాలనీ గేటు తీయడానికి నిరాకరించాడు. సెక్యూరిటీగార్డు చేష్టలతో ఖంగుతిన్నఆమె అతనిపై ఆగ్రహం వ్యక్తం చేయగా ఆ కాలనీ అధ్యక్షుడు, అతని భార్య సైతం సెక్యూరిటీ గార్డునే వెనకేసుకొచ్చారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడమేగాక తన ఆవేదనను ట్విటర్లో పంచుకుంది. ఆఫీసులో పని ఎక్కువ కావడంతో ఆలస్యంగా వచ్చిన రేడియోజాకీ స్తుతీ ఘోష్‌ను కాలనీ సెక్యూరిటీ గార్డు అడ్డగించాడు. ఇంత అర్ధరాత్రి వరకూ ఏం చేస్తున్నావని ప్రశ్నించాడు. కాలనీలోకి రాకుండా గేటును మూసివేశాడు. స్తుతీ సెక్యూరిటీగార్డుని మందలించేలోగా ఆ కాలనీ అధ్యక్షుడు మిక్కీ బేడీ జోక్యం చేసుకున్నాడు. సెక్యూరిటీ గార్డును ఏమీ అనకుండా తిరిగి స్తుతీపైనే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆమె క్యారెక్టర్‌ను అనుమానించేలా.. ఎందుకు నువ్వు లేట్‌గా వస్తున్నావ్, ఎక్కడి నుంచి వస్తున్నావ్ అంటూ ప్రశ్నించాడు. అంతేకాకుండా కాలనీ అధ్యక్షుని భార్య కూడా అతన్నే వెనకేసుకొచ్చింది. సాటి మహిళ అని చూడకుండా స్తుతీపై గట్టిగా అరుస్తూ కాలనీ గేటు తెరవొద్దని సెక్యూరిటీకి చెప్పింది. దీంతో స్తుతీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. స్తుతీ తల్లి మాట్లాడుతూ వృత్తిలో భాగంగా తన కూతురు ఒక్కోసారి లేట్‌గా వస్తుందని, వీళ్లెవరు తనని ప్రశ్నించడానికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలనీ అధ్యక్షుడిగా ఇంత సంకుచిత భావాలు ఉన్న వ్యక్తిని ఎలా ఎంపిక చేశారని మండిపడింది. స్తుతీ ఘోష్‌కు మద్దతు తెలుపుతూ అనేకమంది ట్విటర్లో తమ సానుభూతిని తెలియజేశారు. ఇలాంటి వాళ్ల వల్లే స్త్రీ స్వాతంత్రం భారత్‌కు రావట్లేదని విమర్శించారు. -
ఫైనల్ బెర్త్ లక్ష్యంగా...
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో బెర్త్ సాధించే క్రమంలో తొలి లక్ష్యమైన క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా భారత హాకీ జట్టు మహిళల సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్లో బరిలోకి దిగనుంది. ఈనెల 15 నుంచి 23 వరకు జపాన్‌లోని హిరోషిమాలో ఈ టోర్నీ జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు రాణి రాంపాల్ నాయకత్వంలోని భారత జట్టు శనివారం జపాన్‌కు బయలుదేరింది. పూల్ ‘ఎ’లో భారత్‌తోపాటు పోలాండ్, ఉరుగ్వే, ఫిజీ జట్లు ఉన్నాయి. పూల్ ‘బి’లో జపాన్, చిలీ, రష్యా, మెక్సికో జట్లకు స్థానం కల్పించారు. ఈ ఏడాది చివర్లో జరిగే ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌కు అర్హత సాధించాలంటే భారత జట్టు ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరాల్సి ఉంటుంది. భారత జట్టు తమ లీగ్ మ్యాచ్‌లను వరుసగా ఉరుగ్వేతో (జూన్ 15న), పోలాండ్‌తో (జూన్ 16న), ఫిజీతో (జూన్ 18న) ఆడుతుంది. ఫైనల్ 23న జరుగుతుంది. ఈ టోర్నీలో పాల్గొంటున్న భారత మహిళల జట్టుకు ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఎతిమరపు రజని రెండో గోల్‌కీపర్‌గా వ్యవహరించనుంది. -
ఇప్పుడు త్వరగా పేరు రావడం కష్టం
ముంబై: ప్రస్తుతం పోటీ ఎక్కువైన క్రికెట్లో స్టార్‌గా ఎదగడం కష్టమని భారత మాజీ క్రికెటర్ సెహ్వాగ్ అన్నాడు. 1980, 90 దశకంలోని పరిస్థితులు ఇప్పుడు లేవని... నగరాలతో పాటు చిన్న చిన్న పట్టణాల నుంచి కూడా క్రికెటర్లు ఎదుగుతున్నారని దీంతో పేరున్న క్రికెటర్ కావడం కష్టమన్నాడు. ‘ఇప్పుడు పిల్లలంతా క్రికెట్‌ను సరదాగా ఆడటం లేదు. ప్రొఫెషనల్ కెరీర్‌గా ఎంచుకొని ఆడుతున్నారు. దీంతో ఇప్పుడు క్రికెట్లో చాలా పోటీ నెలకొంది. ఈ పోటీ వాతావరణంలో మేటి క్రికెటర్‌గా ఎదగడం అంత సులభం కాదు. అయితే తమలోని ప్రతిభను నిలకడగా ప్రదర్శించడం ద్వారా క్రికెటర్‌గా ఎదగొచ్చు. పేరున్న లీగ్‌లో స్థిరమైన ప్రదర్శన కనబరిస్తేనే జట్టులోకి ఎంపికయ్యే అవకాశముంది. అప్పుడే అతని క్రికెట్ భవిష్యత్తుకు భరోసాతో పాటు 10–12 ఏళ్లు ఆడే ఆడొచ్చు... డబ్బూ సంపాదించుకోవచ్చు’ అని సెహ్వాగ్ వివరించాడు. ప్రస్తుతం పలు నగరాల నుంచి శివమ్ దూబే (ముంబై), కమలేశ్ నాగర్కోటి (రాజస్తాన్), ఇషాన్ పొరెల్ (బెంగాల్), హార్విక్ దేశాయ్ (గుజరాత్), అన్మోల్ప్రీత్ సింగ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (పంజాబ్)లు వెలుగులోకి వచ్చారు. అదే 80, 90 దశకాల్లో మాత్రం కేవలం మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబైల నుంచే ఎక్కువ మంది క్రికెటర్లు వచ్చేవారని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. -
గంభీర్‌కు పద్మశ్రీ ప్రదానం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో శనివారం పద్మ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పద్మశ్రీ అవార్డుని అందుకున్నారు. గంభీర్‌తో పాటు భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునిల్ ఛెత్రి, ఆర్చరీ క్రీడాకారిణి బంబేలా దేవి, బాస్కెట్‌బాల్ ప్లేయర్ ప్రశాంతి సింగ్ కూడా పద్మశ్రీ అందుకున్నారు. ఈ ఏడాది జనవరి 25న 112 మంది కూడిన పద్మ(పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ) పురస్కారాల జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో క్రీడా విభాగం నుంచి తొమ్మిది మంది ఉన్నారు. ఇందులో పలువురికి మార్చి 11న అవార్డులను ప్రదానం చేయగా... మిగతావారికి శనివారం అవార్డులను అందజేశారు. -
పలకరింపుల్లేవ్ మాటల్లేవ్..!
న్యూఢిల్లీ: తాజాగా ఐదు రాష్ట్రాల ఫలితాలు ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌పైనా ప్రభావం చూపాయి. పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడిలో అమరులకు గురువారం ఢిల్లీలోని పార్లమెంటు ప్రాంగణంలో ఉపరాష్ట్రపతి, మోదీసహా ప్రముఖులంతా నివాళులర్పించారు. నివాళులర్పించే సమయంలో మోదీ, రాహుల్ ఇద్దరూ పక్కపక్కనే నిలబడి ఉన్నా వారు కనీసం పలకరించుకోలేదు. ఎవరికి మటుకు వారు ముభావంగా ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను మోదీ పలకరించారు. కేంద్ర మంత్రులు విజయ్ గోయెల్, రామ్‌దాస్ అథావలే మాత్రం రాహుల్‌తో కరచాలనం చేశారు. నివాళి కార్యక్రమంలో స్పీకర్ సుమిత్రా, సోనియా, ఆడ్వాణీ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తాం : చంద్రబాబు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ వ్యతిరేకతలో నుంచి పుట్టిన తెలుగుదేశం పార్టీ సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అదే పార్టీతో చేతులు కలిపింది. ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన కాంగ్రెస్‌పార్టీతో టీడీపీ పొత్తుల కోసం ఆరాటపడుతోంది. చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలతో కలిసి ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో గురువారం చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పొత్తు విషయంలో గతంలో ఏం జరిగిందన్నది తాము ఆలోచించడం లేదని రాహుల్ గాంధీ అన్నారు. ప్రస్తుతం ముందుకెళ్లాలనే దానిపైనే ఆలోచన చేస్తున్నాని తెలిపారు. దేశ భవిష్యత్తు కోసం కలిసి పని చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. బీజేపీని ఓడించడమే తమ లక్ష్యం అని చెప్పారు. కాంగ్రెస్‌తో తాము చేతులు కలుపుతున్నామని చంద్రబాబు అన్నారు. తనకు 40 ఏళ్ల అనుభవం ఉందన్నారు. వ్యవస్థలను కేంద్రం నాశనం చేస్తోందని, బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకొస్తామని చంద్రబాబు తెలిపారు. -
పన్ను ఎగవేతదారులపై ఈసీ కన్ను
సీబీడీటీతో కలసి అభ్యర్థుల పాన్ కార్డుల వివరాల సంయుక్త తనిఖీ ఎన్నికల రంగం నుంచి పన్ను ఎగవేతదారుల ఏరివేతే లక్ష్యం న్యూఢిల్లీ: ఎన్నికల బరిలో దిగుతున్న అభ్యర్థుల్లో రూ. 5 కోట్లకు పైగా ఆస్తులు ఉండి.. పాన్ కార్డు లేని వారిపై ఆదాయ పన్ను శాఖ, కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టిసారిస్తోంది. పన్ను ఎగవేతదారులను ఎన్నికల రంగం నుంచి ఏరివేయటానికి.. అనుమానిత పన్ను ఎగవేతదారుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. గత ఎన్నికల్లో ప్రకటించిన ఆస్తుల కన్నా ఇప్పుడు రూ. 2 కోట్లు అంతకన్నా ఎక్కువ స్థిరాస్తులు ఉన్నట్లు ప్రకటించిన అభ్యర్థులను కూడా ఈ జాబితాలో చేర్చారు. వీరందరి ఆస్తులు, ఆదాయాల వివరాలను ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) అధికారులు క్షుణ్నంగా తనిఖీ చేయనున్నారని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. అనుమానిత పన్ను ఎగవేత కోణం నుంచి అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించటానికి ఈసీ, సీబీడీటీలు సంయుక్తంగా ఐదు కీలక ప్రమాణాలను రూపొందించాయి. అందులో పాన్ (శాశ్వత ఖాతా నంబరు) కార్డుల వాస్తవికతను పరిశీలించటం ఒకటి. ఎన్నికల అఫిడవిట్లో ఆయా అభ్యర్థులు ప్రకటించే ఆదాయం, ఆస్తుల వివరాలను తనిఖీ చేయటానికి ఇది చాలా ముఖ్యమైనది. అభ్యర్థులు తమ అఫిడవిట్లో తెలిపే పాన్ కార్డు వివరాలను తమకు అందించాలని.. దాని ద్వారా సదరు అభ్యర్థి ఆర్థిక మూలాలను తనిఖీ చేయటం సులభమని సీబీడీటీ ఇటీవల ఈసీని కోరింది. ఈసీ ఇచ్చిన పాన్ కార్డు వివరాలను తమ వద్ద గల సదరు అభ్యర్థికి సంబంధించిన పాన్ కార్డు వివరాలను పోల్చిచూసి.. అది బూటకపు పాన్ కార్డా లేక వాస్తవమైనదేనా అన్నది సీబీడీటీ నిర్థారించనుంది. అలాగే.. అభ్యర్థులు తమ అఫిడవిట్లలో ప్రకటించిన ఆస్తుల వివరాలను.. వారికి సంబంధించి ఐటీ విభాగానికి సమర్పించిన ఆదాయ పన్ను రిటర్నుల్లో పేర్కొన్న ఆస్తుల వివరాలను కూడా సరిపోల్చి తనికీ చేయనున్నారు. అభ్యర్థి వ్యక్తిగత ఆస్తుల వివరాలతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ఏ మేరకు చూపారనే అంశాలను కూడా సీబీడీటీ తనిఖీ చేయనుంది. ఈవీఎంలతోనే ఓటింగ్: ఈసీ సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ ఈవీఎంలను వినియోగిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కింలోనూ.. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఉప ఎన్నికల్లోనూ ఈవీఎంలను వినియోగిస్తామని వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఈవీఎంలు తమకు అందుబాటులో ఉన్నాయన్నారు. మహిళా అభ్యర్థులకు అదనపు భద్రత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే మహిళా అభ్యర్థులకు అదనపు భద్రత కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రస్తుతం ప్రతి మహిళా అభ్యర్థికి ఓ పురుష గన్‌మెన్‌ను అందిస్తున్నారు. దీనికి అదనంగా ఒక మహిళా వ్యక్తిగత భద్రతా అధికారి(పీఎస్వో)ని కూడా నియమించాలని నిర్ణయించారు. సాధారణంగా అభ్యర్థులు మగవారైనా.. మహిళలైనా పీఎస్వోలుగా పురుషులనే నియమిస్తారు. -
సాగర గర్భం నుంచి అణ్వస్త్రం
దీర్ఘశ్రేణి క్షిపణి పరీక్ష విజయవంతం మూడు రకాలుగా అణ్వస్త్ర క్షిపణుల ప్రయోగంలో అగ్రదేశాల సరసన భారత్ గగనతలం, ఉపరితలం నుంచే కాకుండా.. సముద్రగర్భం నుంచి సైతం దీర్ఘశ్రేణి అణ్వస్త్ర క్షిపణులను ప్రయోగించగల సత్తాను భారత్ సాధించింది. జలాంతర్గాముల నుంచి ప్రయోగించగల దీర్ఘశ్రేణి ‘సబ్‌మెరైన్-లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్(ఎస్ఎల్బీఎం)’ను సోమవారం బంగాళాఖాతంలో విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. సముద్రంలో నీటి లోపలి నుంచి జలాంతర్గామి ద్వారా బీవో5 అణ్వస్త్ర క్షిపణిని రక్షణ శాఖ ఇదివరకే విజయవంతంగా పరీక్షించినప్పటికీ.. దాని లక్ష్య పరిధి 700 కి.మీ. మాత్రమే. తాజాగా పరీక్షించిన క్షిపణి పరిధి 2 వేల కిలోమీటర్లు. నీటి లోపలి నుంచి ప్రయోగించేలా భారత్ రూపొందించినవాటిలో ఇదే అత్యధిక పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణి కావడం విశేషం.దీంతో గగన, భూతలాలతోపాటు సముద్రగర్భం నుంచి సైతం దీర్ఘశ్రేణి అణ్వస్త్ర క్షిపణులను ప్రయోగించే సామర్థ్యంలో అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనా వంటి అతికొద్ది దేశాల సరసన భారత్ కూడా నిలిచింది. ఈ ప్రయోగం విజయవంతంగా నిర్వహించిన రక్షణ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలను రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ అభినందించారు. డీఆర్డీవో అభివృద్ధిపరుస్తున్న ఎస్ఎల్బీఎం క్షిపణులను ఐఎన్ఎస్ అరిహంత్ జలాంతర్గామితో సహా ఇతర వేదికలపై మోహరించనున్నారు. -
ఐఎం చీఫ్ అక్తర్ అరెస్ట్
నేపాల్ సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు రోజుల వ్యవధిలోనే మరో ముందడుగు న్యూఢిల్లీ: దేశంలో గత కొన్నేళ్లుగా వరుస బాంబు పేలుళ్లతో వందల సంఖ్యలో అమాయక పౌరుల ప్రాణాలను బలితీసుకున్న ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్(ఐఎం)కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థకు నాయకత్వం వహిస్తున్న తెహ్సీన్ అక్తర్(23) అలియాస్ మోను ఢిల్లీ స్పెషల్‌సెల్ పోలీసులకు పట్టుబడ్డాడు. పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో... భారత్-నేపాల్ సరిహద్దుల్లో కాకరవత్త వద్ద తెహ్సీన్ను అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ స్పెషల్‌సెల్ పోలీస్ ప్రత్యేక కమిషనర్ శ్రీవాత్సవ మంగళవారం ఇక్కడ మీడియాకు వెల్లడించారు. పాకిస్థాన్ కేంద్రంగా ఐఎంకు బాస్‌లుగా వ్యవహరిస్తున్న ఇక్బాల్ భత్కల్, రియాజ్ భత్కల్‌కు తెహ్సీన్ సన్నిహితుడని చెప్పారు. నేపాల్ నుంచి భారత్‌లోకి ప్రవేశిస్తుండగా... మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే, వకాస్ అరెస్ట్ విషయం తెలుసుకుని బంగ్లాదేశ్‌కు పారిపోయే క్రమంలో తెహ్సీన్ పట్టుబడినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. అతడిని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చినట్లు, రానున్న రోజుల్లో మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశాలున్నట్లు వెల్లడించాయి. ఐఎంకు చెందిన కీలక ఉగ్రవాది, జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ వకాస్, అతని ముగ్గురు అనుచరులు రాజస్థాన్‌లో అరెస్ట్ అయిన రెండు రోజుల వ్యవధిలోనే వీరి నాయకుడూ పట్టుబడడం కీలక పరిణామం. ఐఎం సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్ అలియాస్ హద్దిలను పోలీసులు గతేడాది భారత్-నేపాల్ సరిహద్దుల్లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వకాస్, తెహ్సీన్ కోసం పోలీసులు నిఘా వేసి ఉంచారు. ఎట్టకేలకు వీరి అరెస్ట్‌తో ఐఎం అగ్రశ్రేణి నాయకులంతా పట్టుబడినట్లయింది. దేశంలో ఈ సంస్థ నిర్వహించిన ప్రతీ బాంబు పేలుళ్ల విధ్వంసం వెనుక వీరే ముఖ్య పాత్ర పోషించారు. 2013 ఫిబ్రవరిలో దిల్‌షుక్‌నగర్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస ఐదుగురిని నిందితులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. తెహ్సీన్ అరెస్ట్‌తో ఈ కేసులో ప్రధాన నిందితుడైన రియాజ్ మినహా నలుగురూ పట్టుబడ్డారు.బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన అక్తర్ బాంబుల తయారీలో నిపుణుడు. యాసిన్ అరెస్ట్ తర్వాత ఐఎం నాయకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు.