
న్యూఢిల్లీ: పంద్రాగస్టు వేడుకలు సమీస్తున్న వేళ దేశ రాజధాని ఢిల్లీ లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఎర్రకోట వద్ద 5 వేల మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎర్రకోట పరిసరప్రాంతాల్లో ఎత్తైన భవనాలపై ఎన్‌ఎస్‌జీ, స్వాత్ కమాండోలు..కైట్ క్యాచర్స్, షార్ప్ షూటర్లు పహరా కాస్తున్నారు. ఆగస్టు 15న డ్రోన్లు, బెలూన్లు వంటివి ఎగురవేయడంపై నిషేధం విధించారు. యాంటీ డ్రోన్ల వ్యవస్థలను పోలీసులు ఏర్పాటు చేశారు.
కాగా శుక్రవారం ఢిల్లీ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టిన ప్రత్యేక బ్రాంచ్ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుండి 55 పిస్తోళ్ళు, 50 లైవ్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితుల నుండి 55 సెమీ ఆటోమేటిక్ పిస్టల్స్ , 50 లైవ్ క్యాట్రిడ్జ్‌లను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment