మీరు బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు శుభవార్త. ఈ కొత్త ఏడాదిలో బంగారం ధర భారీగా పడిపోతుంది. కేవలం ఈ ఏడాది మొదటి వారంలోనే బంగారం ధర సుమారు వెయ్యి రూపాయల వరకు పడిపోయింది. జనవరి 7న కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. నిన్నటితో పోలిస్తే నేడు బంగారం ధర సుమారు రూ.300 వరకు తగ్గింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఓ) చీఫ్ ఓమిక్రాన్ వేరియంట్ ను 'తేలికగా' తీసుకోవద్దని పేర్కొన్న తర్వాత బులియన్ లాభాలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో, స్పాట్ బంగారం 0.15 శాతం క్షీణించి ఔన్స్ కు 1,788.68 డాలర్లకు చేరుకుంది. అమెరికా బంగారు ఫ్యూచర్స్ 0.06 శాతం తగ్గి 1,788.20 డాలర్లకు చేరుకుంది.
న్యూఢిల్లీ బులియన్ ఇండియన్ జ్యూవెలరీ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర రూ.47,566గా ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు పసిడి ధర రూ.280కు పైగా తగ్గింది. అలాగే, ఆభరణాల తయారీలో వాడే 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.43,571గా ఉంది. ఇక హైదరాబాద్ గోల్డ్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. స్వచ్చమైన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.390 తగ్గి రూ.48,650కు చేరుకుంటే.. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.44,600గా ఉంది.
విజయవాడ, విశాఖ మార్కెట్లో కూడా ఇవే ధరలు ఉన్నాయి. బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. నేడు కేజీ వెండి ధర రూ.100కి పైగా తగ్గి రూ.59,801కు చేరుకుంది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి.
#Gold and #Silver Opening #Rates for 07/01/2022#IBJA pic.twitter.com/0aWcrJeNoW
— IBJA (@IBJA1919) January 7, 2022
Comments
Please login to add a commentAdd a comment