
ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఈరోజు(మంగళవారం) కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సహకరించాలని విపక్షాలను కేంద్ర ప్రభుత్వం కోరింది.
వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీ మార్గాని భరత్ హాజరయ్యారు. అనంతరం ఎంపీ భరత్ మాట్లాడుతూ.. విభజన చట్టం పెండింగ్ అంశాలే తమ ప్రధాన అజెండా అని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రైవేటు మెంబర్ బిల్లు పెడుతున్నాం’ అని అన్నారు.