మీరు కొత్తగా బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక అదిరిపోయే శుభవార్త. కేవలం ఒక్క రోజులోనే బంగారం ధర సుమారు రూ.870 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాల ధరలు పతనం కావడంతో రూపాయి క్షీణత ఉన్నప్పటికీ దిల్లీలో రాత్రికి రాత్రి పసిడి ధర రూ.870 తగ్గింది. కేవలం వారం రోజుల్లోనే పుత్తడి ధర రూ.2,000 వరకు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం 1806 అమెరికా డాలర్లుగా ట్రేడ్ అవుతుండగా.. ఔన్సు వెండి ధర 25.05 డాలర్లుగా ఉంది. ఇక ఇండియన్ బులియన్ జువెలరీ ప్రకారం నేడు దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి సుమారు రూ.870లు తగ్గడంతో రూ.48,076కి చేరింది. అలాగే, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.44,837 నుంచి రూ.44,038కు తగ్గింది.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర దాదాపు రూ.49,900ల నుంచి రూ49,150కు పడిపోయింది. ఇక, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.45,740 నుంచి రూ.45,050కు తగ్గింది. మరోవైపు, వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనించాయి. కిలో వెండి ధర రూ.1,195లు తగ్గడంతో ప్రస్తుతం మొత్తం ధర రూ.64,532కి చేరింది. నిన్నటి ట్రేడింగ్‌లో కిలో వెండి ధర రూ.65,727లుగా ఉంది. బంగారం, వెండి ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి వివిధ అంశాల చేత ప్రభావం చెందుతాయి.
(చదవండి: వాహనదారులకు శుభవార్త.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!)
Comments
Please login to add a commentAdd a comment