మీరు కొత్తగా బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక మంచి శుభవార్త. గత కొద్ది రోజులుగా పసిడి ధరలు అంతకంతకూ పడిపోతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల సవరణకు ముందు నేడు బంగారం, వెండి ధరలు తగ్గాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ మూడేళ్లలో తొలిసారిగా కనీసం 25 బేసిస్ పాయింట్లు(బీపీఎస్) వడ్డీరేట్లను పెంచనున్నట్లు పెట్టుబడిదారులు భావిస్తున్నారు. దేశంలో గత వారం రోజుల్లో బంగారం ధరలు రూ.2 వేలకు పైగా పడిపోయింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో 10 గ్రాముల బంగారం ధర 0.35 శాతం క్షీణించి ₹51,564 నుంచి ₹51,383కి తగ్గింది.
ఇక ముంబైకి చెందిన ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్(ఐబీజెఏ) ప్రకారం.. 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.250కి పైగా పడిపోయి ₹51,315కి చేరుకుంది. ఇక, ఆభరణాల తయారీలో వాడే బంగారం ధర రూ.47,233 నుంచి రూ.47,005కి పడిపోయింది. అలాగే, హైదరాబాద్ నగరంలో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గి రూ.47,300కి చేరుకుంది. అలాగే, 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.51,930 నుంచి రూ.51,600కి చేరుకుంది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు తగ్గాయి. నేడు 1 కేజీ వెండి ధర రూ.67,349 నుంచి రూ.67,288కి పడిపోయింది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి.
Comments
Please login to add a commentAdd a comment