![Gold Price On 23 March 2022: MCX Gold Gets Cheaper on Weak Global Cues - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/23/Gold-Price-mar-16.jpg.webp?itok=khoeC9v8)
బంగారం కొనాలని చూస్తున్నవారికి శుభవార్త. దేశంలో బంగారం ధరలు మళ్లీ భారీగా తగ్గాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎమ్‌సీఎక్స్)లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రూ.60 తగ్గి రూ.51.320 వద్ద ట్రేడవుతుండగా, వెండి ఫ్యూచర్స్ ధర కిలోకు రూ.139 తగ్గి రూ.67,553 వద్ద నిలిచింది. యుక్రెయిన్ సంక్షోభం భయాందోళనలు, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవటానికి ఫెడరల్ రిజర్వ్ అధికారులు వడ్డీ రేట్లను పెంచడంతో పసుపు లోహ ధరలు పడిపోయాయి. స్పాట్ గోల్డ్ ధర ఔన్స్'కు 0.2 శాతం తగ్గి 1,918.29 డాలర్ల వద్ద ఉంటే, యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం క్షీణించి 1,918.40 డాలర్లకు చేరుకుంది.
అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో దేశీయంగా కూడా ధరలు తగ్గాయి. ముంబైకి చెందిన ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్(ఐబీజెఏ) ప్రకారం.. దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.400కి పైగా తగ్గి రూ.51,315కి చేరుకుంది. ఇక, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,409 నుంచి రూ.47,005కి పడిపోయింది. అలాగే, మన హైదరాబాద్ నగరంలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర తగ్గి పెరిగి రూ.47,350కి చేరుకుంది. ఇంకా, 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.52,100 నుంచి రూ.51,670కి చేరుకుంది.
బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. నేడు 1 కేజీ వెండి ధర రూ.68,521 నుంచి రూ.67,004కి పడిపోయింది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి.
(చదవండి: బీర్లు తయారు చేయడమే ఆమె లక్ష్యం.. ఇప్పుడు బిలియనీర్ అయ్యింది!)
Comments
Please login to add a commentAdd a comment