![Gold prices today rise again, jumping Rs 5000 From April - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/26/GOLD-ORNAMENTS.jpg.webp?itok=feSdyBfQ)
న్యూఢిల్లీ: నేడు బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ఇండియన్ బులియన్, జెవెల్లెర్స్ అసోసియేషన్ ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,536 నుంచి రూ.49,105కు పెరగింది. అంటే ఒక్క రోజులో రూ.569 పెరగింది అన్నమాట. అలాగే, నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,459 నుంచి రూ.44,980కు చేరుకుంది. పసిడి బాటలోనే వెండి కూడా పయనించింది. కిలోపై రూ.752 పెరగడం ద్వారా రూ.71,700కు చేరింది.
ఇక హైదరాబాద్ మార్కెట్లో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర నేటి ఉదయం 10 గ్రాములు రూ.45,600 నుంచి రూ.46,100కు పెరిగింది. అలాగే పెట్టుబడులు పెట్టేందుకు వాడే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు బంగారం ధర రూ.540 పెరిగి రూ.50,300కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. ఇక అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ ఏర్పడింది. ఔన్సు 1,908 డాలర్లు ఉండగా, వెండి ఔన్సు 28.07 డాలర్లుగా ఉంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment