
న్యూఢిల్లీ: తాజాగా ఐదు రాష్ట్రాల ఫలితాలు ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌పైనా ప్రభావం చూపాయి. పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడిలో అమరులకు గురువారం ఢిల్లీలోని పార్లమెంటు ప్రాంగణంలో ఉపరాష్ట్రపతి, మోదీసహా ప్రముఖులంతా నివాళులర్పించారు. నివాళులర్పించే సమయంలో మోదీ, రాహుల్ ఇద్దరూ పక్కపక్కనే నిలబడి ఉన్నా వారు కనీసం పలకరించుకోలేదు. ఎవరికి మటుకు వారు ముభావంగా ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను మోదీ పలకరించారు. కేంద్ర మంత్రులు విజయ్ గోయెల్, రామ్‌దాస్ అథావలే మాత్రం రాహుల్‌తో కరచాలనం చేశారు. నివాళి కార్యక్రమంలో స్పీకర్ సుమిత్రా, సోనియా, ఆడ్వాణీ తదితరులు పాల్గొన్నారు.