
న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ సీనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో రష్మిక 6–2, 6–2తో హైదరాబాద్‌కే చెందిన నిధి చిలుములపై అలవోకగా గెలిచింది. హైదరాబాద్‌కే చెందిన మరో ప్లేయర్ చిలకలపూడి శ్రావ్య శివాని పోరాటం రెండో రౌండ్‌లో ముగిసింది.
షర్మదా బాలు (కర్ణాటక)తో జరిగిన మ్యాచ్‌లో శ్రావ్య శివాని తొలి సెట్‌ను 7–5తో గెలిచి, రెండో సెట్‌ను 1–6తో కోల్పోయింది. మూడో సెట్‌లో 0–2తో వెనుకబడిన దశలో గాయం కారణంగా శ్రావ్య శివాని వైదొలిగింది. మరో మ్యాచ్‌లో తటవర్తి శ్రేయ (ఆంధ్రప్రదేశ్) 6–2, 3–6, 1–6తో టాప్ సీడ్ జీల్ దేశాయ్ (గుజరాత్) చేతిలో... స్మృతి భాసిన్ (తెలంగాణ) 4–6, 1–6తో ఆకాంక్ష (మహారాష్ట్ర) చేతిలో ఓడిపోయారు.
విష్ణు పరాజయం
పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ నిక్కీ పునాచా (ఆంధ్రప్రదేశ్) క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. రెండో రౌండ్‌లో నిక్కీ 6–4, 6–3తో ఫైజల్ కమర్ (రాజస్తాన్)పై గెలిచాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ‘లండన్ ఒలింపియన్’ విష్ణువర్ధన్ (తెలంగాణ) 4–6, 1–6తో నితిన్ కుమార్ సిన్హా (పశి్చమ బెంగాల్) చేతిలో... కాజా వినాయక్ శర్మ (ఆంధ్రప్రదేశ్) 4–6, 6–7 (2/7)తో సిద్ధార్థ్ విశ్వకర్మ (ఉత్తరప్రదేశ్) చేతిలో ఓడిపోయారు
Comments
Please login to add a commentAdd a comment