
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో శనివారం పద్మ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పద్మశ్రీ అవార్డుని అందుకున్నారు. గంభీర్‌తో పాటు భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునిల్ ఛెత్రి, ఆర్చరీ క్రీడాకారిణి బంబేలా దేవి, బాస్కెట్‌బాల్ ప్లేయర్ ప్రశాంతి సింగ్ కూడా పద్మశ్రీ అందుకున్నారు.
ఈ ఏడాది జనవరి 25న 112 మంది కూడిన పద్మ(పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ) పురస్కారాల జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో క్రీడా విభాగం నుంచి తొమ్మిది మంది ఉన్నారు. ఇందులో పలువురికి మార్చి 11న అవార్డులను ప్రదానం చేయగా... మిగతావారికి శనివారం అవార్డులను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment