సాక్షి, న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు పదవ తరగతితో పాటు డిగ్రీ, పీజీ అన్ని రకాల పరీక్షలు రద్దు చేశాయి. తాజాగా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) కూడా పరీక్షలను రద్దు చేసింది. 10, 12 తరగతి పరీక్షలను రద్దు చేసినట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది. జూలై జరగాల్సిన పరీక్షలను సీబీఎస్‌ఈ రద్దు చేసినట్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సర్వోన్నత న్యాయస్థానానికి గురువారం తెలిపారు. వీటితో పాటు ఐసీఎస్‌ఈ పరీక్షలు రద్దు చేసినట్టు వెల్లడించారు.
12వ తరగతి విద్యార్థులకు రెండు ఆప్షన్లు ఇచ్చినట్టు కోర్టుకు సీబీఎస్‌ఈ తెలిపింది. పరీక్షకు హాజరవుతారా? ఇంటర్నర్ మార్కుల ఆధారంగా సర్టిఫికెట్ తీసుకుంటారా అనేది విద్యార్థుల నిర్ణయానికే వదిలిపెట్టినట్టు వెల్లడించింది. సీబీఎస్‌ఈ తీసుకున్న తాజా నిర్ణయాలకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు(శుక్రవారం) వెలువడనుంది.
Comments
Please login to add a commentAdd a comment