CBSE Class X Exams
-
సీబీఎస్ఈ 10, 12 పరీక్షల్లో చాట్‌జీపీటీపై నిషేధం
న్యూఢిల్లీ: 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత చాట్‌జీపీటీ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) అధికారులు మంగళవారం ప్రకటించారు. ఈ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొబైల్ ఫోన్లు, చాట్‌జీపీటీ యాక్సెస్ ఉన్న పరికరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని అధికారులు చెప్పారు. పరీక్షల్లో చాట్‌జీపీటీ ఉపయోగించడం అంటే అనైతిక పద్ధతులు అనుసరించినట్లేనని అన్నారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వార్తలను నమ్మొద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏఐ ఆధారంగా పనిచేసే చాట్‌జీపీటీ (చాట్ జనరేటివ్ ప్రి–ట్రెయిన్డ్ ట్రాన్స్ఫార్మర్) గత ఏడాది నవంబర్‌లో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. -
టెన్త్, ఇంటర్ పరీక్షలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
సాక్షి, న్యూఢిల్లీ: విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షల నిర్వహణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులను గందరగోళానికి గురిచేయవద్దంటూ వ్యాఖ్యానించింది. అయితే.. ఈ ఏడాది సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ, ఎన్ఐఓఎస్ సహా ఇతర బోర్డులు ఆఫ్‌లైన్‌లో నిర్వహించే 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్ ఎంఏ ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలోనే ఇది పరీక్షలకు సిద్ధమవుతోన్న విద్యార్థుల్లో తప్పుడు ఆశలను కలిగించటమే కాకుండా గందరగోళాన్ని సృష్టిస్తుందని స్పష్టం చేసింది. విద్యార్థులను, అధికారులను వారి విధులను వారు నిర్వర్తించనివ్వాలని ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి పిటిషన్లు విద్యార్థుల్లో తప్పుడు భావనను, గందరగోళాన్ని కలిగిస్తాయని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 26 నుంచి 10, 12వ తరగతుల టెర్మ్-2 బోర్డు పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. సీఐఎస్సీఈ కూడా బోర్డు పరీక్షలను ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించనుండగా కొన్ని రాష్ట్రాల్లో బోర్డు పరీక్షలు మార్చి 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. Supreme Court dismisses a plea seeking cancellation of offline exams for Class X and XII to be conducted by all State Boards, CBSE, ICSE and National Institute of Open Schooling (NIOS). Supreme Court says these kinds of petitions are misleading and give false hope to students. pic.twitter.com/lCZvFKLlMX — ANI (@ANI) February 23, 2022 -
సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు రద్దు, 12వ తరగతి ఎగ్జామ్స్ వాయిదా
-
CBSE పదో తరగతి పరీక్షలు రద్దు
ఢిల్లీ: సెకండ్ వేవ్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థుల ప్రతిభ, పనితీరు ఆధారంగా వారికి మార్కులు కేటాయిస్తామని వెల్లడించింది. 12వ తరగతి పరీక్షలు మాత్రం వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్వీట్ చేశారు. "దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత, విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మే 4 నుంచి జూన్ 7 వరకు జరగాల్సిన సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నాం. బోర్డు తయారు చేసే ఆబ్జెక్టివ్, క్రైటీరియా ఆధారంగా విద్యార్థుల పదో తరగతి ఫలితాలు ప్రకటిస్తాం. ప్రస్తుతానికి 12వ తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నాం. జూన్ 1న పరిస్థితిని సమీక్షించిన తర్వాత 12వ తరగతి ఎగ్జామ్స్‌పై నిర్ణయం తీసుకుంటాం. ఒకవేళ పరీక్షలు పెట్టాలనుకుంటే 15 రోజుల ముందుగానే వాటి వివరాలు ప్రకటిస్తాం" అని తెలిపారు. కోరలు చాస్తున్న కరోనాను దృష్టిలో పెట్టుకుని పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం కీలక సమావేశం నిర్వహించారు. విద్యార్థుల శ్రేయస్సే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని మోదీ చెప్పారని ఈ భేటీకి హాజరైన విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. అనంతరం టెన్త్ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరిన్ని వివరాల కోసం సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ cbse.nic.inను వీక్షించండి. చదవండి: ఈ ఏడాదే సీబీఎస్ఈ సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ విడుదల -
సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క సెంట్రల్ బోర్డ్(సీబీఎస్ఈ) 10, 12వ తరగతులకు సంబందించిన పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2020-2021 విద్యా సంవత్సారానికి సంబంధించి 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ ఫోక్రియాల్ నిషాంక్ నేడు ట్విటర్లో ప్రకటించారు. ఈ పరీక్షలు మే 4 నుంచి జూన్ 10 వరకు జరగనున్నాయి.(చదవండి: ఆధార్ సేవా కేంద్రాల కోసం హెల్ప్‌లైన్) షెడ్యూల్: మే 4 నుంచి జూన్ 7 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి మే 4 నుంచి జూన్ 11 వరకు 12వ తరగతి పరీక్షలు జరగనున్నాయి మార్చి 1 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జులై 15 తేదీలోగా సీబీఎస్ఈ ఫలితాలు విడుదల పదో తరగతి పరీక్షలు రోజూ ఉదయం 10.30గం నుంచి మధ్యాహ్నం 1.30గం వరకు కొనసాగనున్నాయి. అలాగే, 12వ తరగతి పరీక్షలు రెండు షిఫ్ట్‌లలో నిర్వహించనున్నారు. తొలి షిఫ్ట్ ఉదయం 10.30గం నుంచి 1.30గం వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2.30గం నుంచి 5.30గం వరకు నిర్వహిస్తారు. మహమ్మారి కారణంగా10, 12 తరగతుల సిలబస్‌ను 30 శాతం తగ్గించారు. కోవిడ్-19 పాండమిక్ ప్రోటోకాల్స్‌ను అనుసరించి పరీక్షలు జరుగుతాయి. ఫేస్ మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి. మరిన్ని వివరాల కోసం సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ cbse.nic.inను వీక్షించండి. -
సీబీఎస్ఈ 10,12వ తరగతి పరీక్షలు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు పదవ తరగతితో పాటు డిగ్రీ, పీజీ అన్ని రకాల పరీక్షలు రద్దు చేశాయి. తాజాగా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) కూడా పరీక్షలను రద్దు చేసింది. 10, 12 తరగతి పరీక్షలను రద్దు చేసినట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది. జూలై జరగాల్సిన పరీక్షలను సీబీఎస్ఈ రద్దు చేసినట్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సర్వోన్నత న్యాయస్థానానికి గురువారం తెలిపారు. వీటితో పాటు ఐసీఎస్ఈ పరీక్షలు రద్దు చేసినట్టు వెల్లడించారు. 12వ తరగతి విద్యార్థులకు రెండు ఆప్షన్లు ఇచ్చినట్టు కోర్టుకు సీబీఎస్ఈ తెలిపింది. పరీక్షకు హాజరవుతారా? ఇంటర్నర్ మార్కుల ఆధారంగా సర్టిఫికెట్ తీసుకుంటారా అనేది విద్యార్థుల నిర్ణయానికే వదిలిపెట్టినట్టు వెల్లడించింది. సీబీఎస్ఈ తీసుకున్న తాజా నిర్ణయాలకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు(శుక్రవారం) వెలువడనుంది. -
సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: సీబీఎస్ఈ పదో తరగతి చెన్నై రీజియన్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లో జరిగిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 13.28 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ http://cbseresults.nic.in/class10/cbse102014.htmలో పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. -
మార్చి 1 నుంచి సీబీఎస్సీ పరీక్షలు
న్యూఢిల్లీ: సీబీఎస్సీ 10, 12 తరగతుల పరీక్షలను 2014 మార్చి 1 నుంచి నిర్వహిస్తున్నట్టు సీబీఎస్సీ బోర్డు వెల్లడించింది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పరీక్షలను ముందస్తుగా నిర్వహిస్తారేమోననే ఊహాగానాలకు తెరదించుతూ ఏటా నిర్వహించే విధంగానే షెడ్యూల్ ప్రకారమే ఆయా పరీక్షలు నిర్వహించనున్నట్టు బోర్డు తెలిపింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పరీక్షలు నెల రోజులపాటు జరగనున్నాయి.