దేశీయంగా బంగారం ధరల పరుగులు కొనసాగుతున్నాయి. గతకొద్ది రోజుల క్రితం పడిపోయిన పుత్తడి ధరలు తిరిగి జీవితకాల గరిష్టస్థాయిలను చేరుకోవడానికి పరుగు పెడుతున్నాయి. ఈ నెల 10న రూ.47500 దగ్గరగా ఉన్న ధరలు ఇప్పుడు రూ.48,600పైకి చేరుకున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ బలహీనపడిపోవడం, దేశీయ స్టాక్ మార్కెట్లు పతనమౌతున్నందున ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి మార్గమైన బంగారం వైపునకు మళ్లడమే డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణంగా నిపుణులు తెలుపుతున్నారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల(బిస్కెట్ గోల్డ్ 999) బంగారం ధర రూ.48,620 వద్దకు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల(916) బంగారం ధర ఒక్క రోజులో రూ.300కి పైగా పెరిగి రూ.44,536కు చేరుకుంది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే నేడు 22 క్యారెట్ల(916) పసిడి ధర రూ.45100 నుంచి రూ.45,550 పెరిగింది. అంటే ఒక్కరోజులో రూ.450 పెరిగింది. ఇక బిస్కెట్ గోల్డ్ బంగారం ధర రూ.500 పెరిగి రూ.49,700కి చేరుకుంది. పసిడి బాటలోనే వెండి ధర కూడా భారీగా పెరిగింది. వెండి ధర రూ.1400కి పెరిగి రూ.64404కి చేరుకుంది.
#Gold and #Silver Opening #Rates for 20/01/2022#IBJA pic.twitter.com/EEX50NOqrr
— IBJA (@IBJA1919) January 20, 2022
బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి.
(చదవండి: టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ కోసం ఆ రాష్ట్ర మంత్రి కేంద్రానికి లేఖ..!)
Comments
Please login to add a commentAdd a comment