Gold Prices Fall After Hitting a One-Year High on Feb 16th - Sakshi
Sakshi News home page

బంగారం కొనేవారికి భారీ శుభవార్త..!

Published Wed, Feb 16 2022 2:56 PM | Last Updated on Wed, Feb 16 2022 7:49 PM

Gold Prices Fall After Hitting a One-Year High On Feb 16th - Sakshi

గత కొద్ది రోజులుగా బుల్లెట్ రైలు వేగంతో దూసుకెళ్తున్న పసిడి ధరలకు ఇప్పుడు బ్రేక్ పడింది. కేవలం ఒక్కరోజులోనే బంగారం ధరలు భారీ తగ్గాయి. ప్రపంచ రేట్లకు అనుగుణంగా భారతీయ మార్కెట్లలో కూడా బంగారం ధరలు తగ్గాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు కొద్దిగా తగ్గడంతో అంతర్జాతీయంగా ధరలు పడిపోయినట్లు నిపుణులు పేర్కొన్నారు. గరిష్ట స్థాయి ధరను ₹50,350ను చేరుకున్న తర్వాత బంగారం ధర తీవ్రంగా పడిపోయింది. ఒక్కరోజులో సుమారు రూ.900కి పైగా పడిపోవడం విశేషం.

దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల(బిస్కెట్‌ గోల్డ్‌ 999) బంగారం ధర సుమారు రూ.916కి పైగా తగ్గి రూ.49,440కు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల(916) బంగారం ధర రూ.46,126 నుంచి రూ.45,287కు చేరుకుంది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే నేడు 22 క్యారెట్ల(916) పసిడి ధర రూ.46,400 నుంచి రూ.46,200కు తగ్గింది. అంటే ఒక్కరోజులో రూ.200 తగ్గింది అన్నమాట. ఇక బిస్కెట్‌ గోల్డ్‌ బంగారం ధర రూ.220 తగ్గి రూ.50,400కి చేరుకుంది. పసిడి బాటలోనే వెండి ధర కూడా భారీగా తగ్గింది. వెండి ధర రూ.1400కి పైగా తగ్గి రూ.63,045కి చేరుకుంది.

బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. పసిడి ధరలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి అనే విషయం గుర్తుంచుకోవాలి.

(చదవండి: చైనా కంపెనీకి గట్టి షాకిచ్చిన ఐటీ శాఖ..!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement