
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి, నిలకడగా ఉందని ఎయిమ్స్ తెలిపింది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు నెగెటివ్‌గా వచ్చిందని సోమవారం వెల్లడించింది. ఆదివారం ఆయనకు కొత్త మెడికేషన్ సరిపడక జ్వరం రావడంతో కుటుంబసభ్యులు ఎయిమ్స్‌లో చేర్చారు. ‘ఆయన్ను కార్డియో థొరాసిక్ ఐసీయూ నుంచి కార్డియో–న్యూరో టవర్‌లోని ప్రైవేట్ వార్డుకు తరలించాం. ఇవాళో రేపో డిశ్చార్జి చేసే అవకాశం ఉంది’ అని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి.