మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల | AIIMS: Manmohan Singh Diagnosed With Dengue, Gradually Improving | Sakshi

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల

Oct 16 2021 7:21 PM | Updated on Oct 17 2021 7:31 AM

AIIMS: Manmohan Singh Diagnosed With Dengue, Gradually Improving - Sakshi

న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ వైద్యులు శనివారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డెంగ్యూతో బాధపడుతున్నారని, అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని ఎయిమ్స్ అధికారులు శనివారం తెలిపారు. మన్మోహన్‌సింగ్‌ ప్లేట్​లెట్ల సంఖ్య వృద్ధి చెందుతోందని వైద్యులు తెలిపారు.
చదవండి: కేంద్రమంత్రిపై మన్మోహన్‌ సింగ్‌ కుమార్తె ఆగ్రహం..‘వాళ్లేం జూలో జంతువులు కాదు’

కాగా మాజీ ప్రధాని జ్వరం, నీరసం వంటి అనారోగ్య సమస్యలతో బుధవారం ఎయిమ్స్‌లో చేరారు. డెంగ్యూ జ్వరం బారినపడిన మాజీ ప్రధాని.. ఎయిమ్స్ ఆస్పత్రిలోని కార్డియో న్యూరో సెంటర్​లోని ఓ ప్రైవేట్ వార్డులో​ చికిత్స పొందుతున్నారు. డాక్టర్‌ నితీష్ నాయక్ మార్గదర్శకత్వంలోని కార్డియాలజిస్ట్ బృందం మాజీ ప్రధాని ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంది. 
చదవండి: వైరల్‌: వీడెవ‌డ్రా బాబు.. నాకే పోటీగా వచ్చేలా ఉన్నాడు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement