సాక్షి, బెంగళూరు: సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. తాజాగా తారకరత్న హెల్త్ కండీషన్‌పై శనివారం మధ్యాహ్నం హృదయాలయ డాక్టర్లు బుటిటెన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు.
కాగా, టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం సందర్బంగా తారకతర్న అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆయన ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. దీంతో, తారకరత్నను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం, నారాయణ హృదయాలయ డాక్టర్లు కుప్పం వెళ్లారు. వైద్య చికిత్సల అనంతరం.. శనివారం బులిటెన్ విడుదల చేశారు. ఈ సందర్బంగా వైద్యులు మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే సరికే తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. నిన్న రాత్రి తారకరత్నను బెంగళూరు ఆసుపత్రికి తీసుకువచ్చాము.
ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో తారకరత్నకు చికిత్స జరుగుతోంది. తారకరత్నకు ప్రస్తుతం ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నాము. గుండె నాళాల్లోకి రక్తప్రసరణ కావడం లేదు. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు ప్రయత్నం జరుగుతోంది అని తెలిపారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బెంగళూరులోనే ఉండి ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment