కాంగ్రెస్ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే స్వాగతిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అయితే తెలంగాణ ఏర్పడే వరకు కాంగ్రెస్ను నమ్మబోమని ఆయన తెలిపారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్నే ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇవ్వాలన్నారు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించినా ఒప్పుకోబోమని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. అంతకుముందు కిషన్రెడ్డితో తెలంగాణ జేఏసీ నేతలు సమావేశమయ్యారు. మరోవైపు సుష్మాస్వరాజ్‌కు ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోన్ చేశారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చర్చించారని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో పరిస్థితుల గురించి సుష్మాస్వరాజ్ తనను అడిగారని చెప్పారు. తెలంగాణ జేఏసీ నేతలకు సుష్మాస్వరాజ్ శుభాకాంక్షలు తెలిపారన్నారు