![Congress, JD(S) Finalise 20-8 Seat Sharing in karnataka - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/14/jds.jpg.webp?itok=SBHcdynG)
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి మధ్య లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపిణీ విషయమై ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు గానూ కాంగ్రెస్ 20, జేడీఎస్ 8 స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయించాయి. ఈ విషయమై జేడీఎస్ స్పందిస్తూ.. ఉత్తర కన్నడ, చిక్‌మంగళూరు, శివమొగ్గ, తుమకూరు, హసన్, మాండ్య, బెంగళూరు నార్త్, విజయపురా స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీచేస్తారని తెలిపింది. సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ మాండ్య నుంచి, కుమారస్వామి అన్న రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ హసన్ సీటు నుంచి పోటీచేస్తారని వెల్లడించింది. అలాగే మాజీ సీఎం ఎస్.బంగారప్ప కుమారుడు, ఎమ్మెల్యే మధు బంగారప్పను శివమొగ్గ నుంచి బీజేపీ నేత యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్రపై పోటీకి దించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. మరోవైపు తమ అభ్యర్థుల పేర్లను మార్చి 16న ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 17 సీట్లు దక్కించుకోగా, కాంగ్రెస్ 9, జేడీఎస్ అభ్యర్థులు రెండు స్థానాల్లో విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment