న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపే అంశంపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు మంతనాలు మొదలెట్టాయి. త్వరలోనే ఢిల్లీ, గుజరాత్, హరియాణా రాష్ట్రాల్లో సీట్ల పంపకాలపై తుది నిర్ణయం వెలువడనుందని విశ్వసనీయ వర్గాలు గురువారం తెలిపాయి. అయితే ఇప్పటికే కొన్ని ఎంపీ స్థానాల్లో ఏ పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలనే దానిపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. దక్షిణ ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, వాయవ్య ఢిల్లీ, న్యూఢిల్లీ స్థానాల్లో ఆప్ బరిలో దిగనుంది.
చాంద్‌నీ చౌక్, తూర్పు ఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలబెడుతుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గత ఎన్నికల్లో ఈ ఏడు ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలిచింది. హరియాణాలో ఒకటి, గుజరాత్‌లో రెండు స్థానాలను ఆప్‌కే కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. గురుగ్రామ్ లేదా ఫరీదాబాద్‌లో ఆప్ పోటీచేయనుంది. గుజరాత్‌లోని భరూచ్ స్థానం నుంచి ఆప్ నేత ఛైతర్ వసావా, భావ్‌నగర్‌లో ఉమేశ్‌భాయ్ మాక్వానా పోటీ చేస్తారని ఇప్పటికే ఆప్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment