
కోల్‌కతా:కాంగ్రెస్ పార్టీపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఫెయిలవడం వల్లే 2024లో ఇండియా కూటమి కేంద్రంలో అధికారం దక్కించుకోలేకపోయిందని విశ్లేషించారు.
బంగ్లార్ నిర్బచోన్ ఒ ఆమమ్రా పేరుతో తాను రాసిన మూడు పుస్తకాలను మమతా బెనర్జీ బుధవారం(జనవరి29) విడుదల చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపు కోసం తృణమూల్ కాంగ్రెస్ శాయశక్తులా ప్రయత్నించింది.
కూటమిలో పార్టీల అభ్యర్థులు ఒకరిపై ఒకరు పోటీ చేసుకోవడం వల్లే బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ రాణించకపోవడం ఇండియా కూటమి ఓటమికి కారణం’అని 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై మమత తన పుస్తకాల్లో లోతుగా విశ్లేషిచారు.
Comments
Please login to add a commentAdd a comment