79.39% అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు  | 80percent of total candidates lose of deposits in Delhi Elections | Sakshi
Sakshi News home page

79.39% అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు 

Published Mon, Feb 10 2025 6:04 AM | Last Updated on Mon, Feb 10 2025 1:00 PM

80percent of total candidates lose of deposits in Delhi Elections

న్యూఢిల్లీ:  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సహా పలు పార్టిల అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. ఈ ఎన్నికల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ చేయగా, వీరిలో 555 మందికి(79.39 శాతం) కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో కేవలం ముగ్గురికే డిపాజిట్లు దక్కాయి. మిగతా వారంతా తెల్లమొహం వేయాల్సి వచ్చింది. 

స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన చాలామందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీజేపీతోపాటు బీజేపీ మిత్రపక్షాలైన జనతాదళ్‌(యునైటెడ్‌), లోక్‌జనశక్తి పార్టి(రామ్‌విలాస్‌) అభ్యర్థులంతా డిపాజిట్లు నిలబెట్టుకోవడం విశేషం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి మొత్తం 70 మంది బరిలోకి దిగారు. 67 మంది డిపాజిట్లు కోల్పోయారు. ఏఐఎంఐఎం అభ్యర్థులు రెండు స్థానాల్లో పోటీ చేయగా, కేవలం ఒక్కచోటే డిపాజిట్‌ దక్కింది.  

ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం... ఎన్నికల్లో పోటీ చేసే జనరల్‌ కేటగిరీ అభ్యర్థి ఎన్నికల సంఘం వద్ద రూ.10,000 డిపాజిట్‌ చేయాలి. దీన్ని సెక్యూరిటీ డిపాజిట్‌ అంటారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.5,000 డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల చట్టం ప్రకారం.. ఎన్నికల్లో పోలై చెల్లుబాటు అయిన మొత్తం ఓట్లలో అభ్యరి్థకి ఆరింట ఒక వంతు ఓట్లు లభిస్తే డిపాజిట్‌ సొమ్మును వెనక్కి ఇచ్చేస్తారు. లేకపోతే డిపాజిట్‌ కోల్పోయినట్లే. అంటే ప్రతి ఆరు ఓట్లలో కనీసం ఒక్క చోటు వచ్చి ఉండాలి.  

10 శాతం తగ్గిన ఆప్‌ ఓట్ల శాతం  
దేశ రాజధానిలో బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. పదేళ్లలో 13 శాతం పెరగడం విశేషం. అదే సమయంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ బలం 10 శాతం పడిపోయింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నెగ్గగా, ఆప్‌ పరాజయం పాలైంది. కానీ, రెండు పార్టిలు సాధించిన ఓట్ల మధ్య తేడా కేవలం 2 శాతమే. ఈసారి పోలైన మొత్తం ఓట్లలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి 43.57 శాతం ఓట్లు లభించాయి. బీజేపీకి 45.56 శాతం ఓట్లు దక్కాయి. కాంగ్రెస్‌ పార్టీ బలం కూడా స్వల్పంగా పెరిగింది. 2020 ఎన్నికల్లో 4.3 శాతం ఓట్లు సాధించిన ఆ పార్టీ ఈసారి 6.34 శాతం ఓట్లు తన ఖాతాలో వేసుకుంది. అంటే కాంగ్రెస్‌ ఓట్లు 2 శాతానికి పైగానే పెరిగాయి.   

నేర చరితులు 31 మంది 
దేశ రాజధాని ఢిల్లీ 8వ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 70 మంది ఎమ్మెల్యేల్లో 31 మంది, 44% మంది నేర చరితులున్నారు. ఈ ఎమ్మెల్యేల్లో 17 మందిపై తీవ్రమైన అభియోగాలున్నా యి. 2020 ఎన్నికల్లో ఎన్నికైన వారిలో నేర చరితులు 43 మంది, అంటే 61% మంది కాగా వీరిలో తీవ్రమైన నేరారోపణలున్న వా రు 37 మంది. ఈ సంఖ్య తాజా అసెంబ్లీ ఎ న్నికల్లో తగ్గింది. 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలి తాలు వెలువడిన నేపథ్యంలో అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫామ్స్‌(ఏడీఆర్‌), ఢిల్లీ ఎ లక్షన్‌ వాచ్‌ సంస్థలు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారి అఫిడవిట్లను విశ్లేషించి ఆదివారం ఒక నివేదికను విడుదల చేశాయి. దీని ప్రకారం.. బీజేపీ టిక్కెట్‌పై గెలిచిన 48 మందిలో 16 మంది అంటే 33% మందిపై క్రిమినల్‌ కేసులను ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో ఆప్‌ నుంచి గెలిచిన 22 మందిలో 15 మంది, 68% నేరచరితులున్నారు. 

మరోవైపు మొత్తం 70 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు బిలియనీర్లు కాగా షాకుర్‌బస్తీ స్థానం నుంచి బీజేపీ తరఫున గెలిచిన కర్నయిల్‌ సింగ్‌ రూ.259 కోట్లతో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా నిలిచారు. ఆ తర్వాతి రెండు స్థానాల్లో రూ.248 కోట్లతో రాజౌరి గార్డెన్స్‌ ఎమ్మెల్యే మంజిందర్‌ సింగ్‌ సిర్సా, రూ.115 కోట్లతో న్యూఢిల్లీ ఎమ్మెల్యే పర్వేశ్‌ సాహిబ్‌ సింగ్‌ వర్మ ఉన్నారు. అప్పులున్న ఎమ్మెల్యేల జాబితాలోనూ రూ.74 కోట్లతో పర్వేశ్‌ సాహిబ్‌ సింగ్‌ వర్మ అగ్రస్థానంలో నిలవడం విశేషం.

 మొత్తం 70 మంది ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ.1,542 కోట్లుగా ఉంది. వీరిలో 45 మంది, 64% గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకోగా, 23 మంది, 33% మంది 5వ నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నారు. అంతేగాక 41– 60 ఏళ్ల మధ్య వయసు్కలైన ఎమ్మెల్యేలు 47 మంది (67% కాగా 14 మంది అంటే 20% మంది వయస్సు 61– 80 ఏళ్ల మధ్య ఉంది. రాజిందర్‌ నగర్‌ నుంచి గెలిచిన 31 ఏళ్ల ఉమంగ్‌ బజాజ్‌ పిన్న వయసు్కడైన ఎమ్మెల్యేగా నిలిచారు. అదేవిధంగా, సిట్టింగుల్లో 22 మంది మరోసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టనున్నారు. వీరిలో ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి 14 మంది, బీజేపీ నుంచి 8 మంది ఉన్నారు.  

38 శాతం మంది పట్టభద్రులు
 ఢిల్లీ అసెంబ్లీకి ఈసారి ఎక్కువ మంది పట్టభద్రులు ఎన్నికయ్యారని పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌ పేర్కొంది. ఈ సంస్ధ ఇందుకు సంబంధించి నివేదిక విడుదల చేసింది. మొత్తం 70 మంది శాసనసభ్యులకుగాను ఈ దఫా కేవలం ఐదుగురు మాత్రమే, అంటే 7 శాతం మంది మహిళలు ఎన్నికయ్యారని తెలిపింది. వీరిలో నలుగురు బీజేపీ నుంచి, ఒకే ఒక్కరు ఆతిశీ ఆప్‌ నుంచి గెలిచారంది. 2020 ఎన్నికల్లో ఢిల్లీ అసెంబ్లీలో 8 మంది మహిళలు ప్రాతినిథ్యం వహించారని గుర్తు చేసింది. అదేవిధంగా, గత అసెంబ్లీలో 34 శాతం మంది పట్టభద్రులుండగా ఈసారి వీరి సంఖ్య 38 శాతానికి పెరిగింది. 

పీజీ, అంతకంటే ఉన్నత చదువులు చదివిన వారి సంఖ్య 26 శాతంగానే ఉందని వివరించింది. కొత్త శాసనసభ్యుల్లో 61 శాతం మంది రాజకీయాలు, సామాజిక సేవను తమ వృత్తిగా పేర్కొన్నారంది. గత అసెంబ్లీలో 29% మంది వ్యాపారాన్ని వృత్తిగా పేర్కొనగా ఈ దఫా వీరి సంఖ్య ఏకంగా 49 శాతానికి పెరిగిందనిఆ నివేదిక తెలిపింది. సభ్యుల సరాసరి వయస్సు 52 ఏళ్లుగా పేర్కొంది. కొత్త ఎమ్మెల్యేల్లో 25–40 ఏళ్ల మధ్య ఉన్న వారు 13% కాగా, గత అసెంబ్లీలో వీరు 23 శాతంగా ఉన్నారని విశ్లేషించింది. 70 ఏళ్లు పైబడిన వారి వాటా 4శాతమని తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement