Deposits missing
-
79.39% అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సహా పలు పార్టిల అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. ఈ ఎన్నికల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ చేయగా, వీరిలో 555 మందికి(79.39 శాతం) కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. కాంగ్రెస్ అభ్యర్థుల్లో కేవలం ముగ్గురికే డిపాజిట్లు దక్కాయి. మిగతా వారంతా తెల్లమొహం వేయాల్సి వచ్చింది. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన చాలామందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీతోపాటు బీజేపీ మిత్రపక్షాలైన జనతాదళ్(యునైటెడ్), లోక్‌జనశక్తి పార్టి(రామ్‌విలాస్) అభ్యర్థులంతా డిపాజిట్లు నిలబెట్టుకోవడం విశేషం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మొత్తం 70 మంది బరిలోకి దిగారు. 67 మంది డిపాజిట్లు కోల్పోయారు. ఏఐఎంఐఎం అభ్యర్థులు రెండు స్థానాల్లో పోటీ చేయగా, కేవలం ఒక్కచోటే డిపాజిట్ దక్కింది. ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం... ఎన్నికల్లో పోటీ చేసే జనరల్ కేటగిరీ అభ్యర్థి ఎన్నికల సంఘం వద్ద రూ.10,000 డిపాజిట్ చేయాలి. దీన్ని సెక్యూరిటీ డిపాజిట్ అంటారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.5,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల చట్టం ప్రకారం.. ఎన్నికల్లో పోలై చెల్లుబాటు అయిన మొత్తం ఓట్లలో అభ్యరి్థకి ఆరింట ఒక వంతు ఓట్లు లభిస్తే డిపాజిట్ సొమ్మును వెనక్కి ఇచ్చేస్తారు. లేకపోతే డిపాజిట్ కోల్పోయినట్లే. అంటే ప్రతి ఆరు ఓట్లలో కనీసం ఒక్క చోటు వచ్చి ఉండాలి. 10 శాతం తగ్గిన ఆప్ ఓట్ల శాతం దేశ రాజధానిలో బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. పదేళ్లలో 13 శాతం పెరగడం విశేషం. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ బలం 10 శాతం పడిపోయింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నెగ్గగా, ఆప్ పరాజయం పాలైంది. కానీ, రెండు పార్టిలు సాధించిన ఓట్ల మధ్య తేడా కేవలం 2 శాతమే. ఈసారి పోలైన మొత్తం ఓట్లలో ఆమ్ ఆద్మీ పార్టీకి 43.57 శాతం ఓట్లు లభించాయి. బీజేపీకి 45.56 శాతం ఓట్లు దక్కాయి. కాంగ్రెస్ పార్టీ బలం కూడా స్వల్పంగా పెరిగింది. 2020 ఎన్నికల్లో 4.3 శాతం ఓట్లు సాధించిన ఆ పార్టీ ఈసారి 6.34 శాతం ఓట్లు తన ఖాతాలో వేసుకుంది. అంటే కాంగ్రెస్ ఓట్లు 2 శాతానికి పైగానే పెరిగాయి. నేర చరితులు 31 మంది దేశ రాజధాని ఢిల్లీ 8వ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 70 మంది ఎమ్మెల్యేల్లో 31 మంది, 44% మంది నేర చరితులున్నారు. ఈ ఎమ్మెల్యేల్లో 17 మందిపై తీవ్రమైన అభియోగాలున్నా యి. 2020 ఎన్నికల్లో ఎన్నికైన వారిలో నేర చరితులు 43 మంది, అంటే 61% మంది కాగా వీరిలో తీవ్రమైన నేరారోపణలున్న వా రు 37 మంది. ఈ సంఖ్య తాజా అసెంబ్లీ ఎ న్నికల్లో తగ్గింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలి తాలు వెలువడిన నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్(ఏడీఆర్), ఢిల్లీ ఎ లక్షన్ వాచ్ సంస్థలు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారి అఫిడవిట్లను విశ్లేషించి ఆదివారం ఒక నివేదికను విడుదల చేశాయి. దీని ప్రకారం.. బీజేపీ టిక్కెట్‌పై గెలిచిన 48 మందిలో 16 మంది అంటే 33% మందిపై క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో ఆప్ నుంచి గెలిచిన 22 మందిలో 15 మంది, 68% నేరచరితులున్నారు. మరోవైపు మొత్తం 70 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు బిలియనీర్లు కాగా షాకుర్బస్తీ స్థానం నుంచి బీజేపీ తరఫున గెలిచిన కర్నయిల్ సింగ్ రూ.259 కోట్లతో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా నిలిచారు. ఆ తర్వాతి రెండు స్థానాల్లో రూ.248 కోట్లతో రాజౌరి గార్డెన్స్ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా, రూ.115 కోట్లతో న్యూఢిల్లీ ఎమ్మెల్యే పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఉన్నారు. అప్పులున్న ఎమ్మెల్యేల జాబితాలోనూ రూ.74 కోట్లతో పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ అగ్రస్థానంలో నిలవడం విశేషం. మొత్తం 70 మంది ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ.1,542 కోట్లుగా ఉంది. వీరిలో 45 మంది, 64% గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోగా, 23 మంది, 33% మంది 5వ నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నారు. అంతేగాక 41– 60 ఏళ్ల మధ్య వయసు్కలైన ఎమ్మెల్యేలు 47 మంది (67% కాగా 14 మంది అంటే 20% మంది వయస్సు 61– 80 ఏళ్ల మధ్య ఉంది. రాజిందర్ నగర్ నుంచి గెలిచిన 31 ఏళ్ల ఉమంగ్ బజాజ్ పిన్న వయసు్కడైన ఎమ్మెల్యేగా నిలిచారు. అదేవిధంగా, సిట్టింగుల్లో 22 మంది మరోసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టనున్నారు. వీరిలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 14 మంది, బీజేపీ నుంచి 8 మంది ఉన్నారు. 38 శాతం మంది పట్టభద్రులు ఢిల్లీ అసెంబ్లీకి ఈసారి ఎక్కువ మంది పట్టభద్రులు ఎన్నికయ్యారని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ పేర్కొంది. ఈ సంస్ధ ఇందుకు సంబంధించి నివేదిక విడుదల చేసింది. మొత్తం 70 మంది శాసనసభ్యులకుగాను ఈ దఫా కేవలం ఐదుగురు మాత్రమే, అంటే 7 శాతం మంది మహిళలు ఎన్నికయ్యారని తెలిపింది. వీరిలో నలుగురు బీజేపీ నుంచి, ఒకే ఒక్కరు ఆతిశీ ఆప్ నుంచి గెలిచారంది. 2020 ఎన్నికల్లో ఢిల్లీ అసెంబ్లీలో 8 మంది మహిళలు ప్రాతినిథ్యం వహించారని గుర్తు చేసింది. అదేవిధంగా, గత అసెంబ్లీలో 34 శాతం మంది పట్టభద్రులుండగా ఈసారి వీరి సంఖ్య 38 శాతానికి పెరిగింది. పీజీ, అంతకంటే ఉన్నత చదువులు చదివిన వారి సంఖ్య 26 శాతంగానే ఉందని వివరించింది. కొత్త శాసనసభ్యుల్లో 61 శాతం మంది రాజకీయాలు, సామాజిక సేవను తమ వృత్తిగా పేర్కొన్నారంది. గత అసెంబ్లీలో 29% మంది వ్యాపారాన్ని వృత్తిగా పేర్కొనగా ఈ దఫా వీరి సంఖ్య ఏకంగా 49 శాతానికి పెరిగిందనిఆ నివేదిక తెలిపింది. సభ్యుల సరాసరి వయస్సు 52 ఏళ్లుగా పేర్కొంది. కొత్త ఎమ్మెల్యేల్లో 25–40 ఏళ్ల మధ్య ఉన్న వారు 13% కాగా, గత అసెంబ్లీలో వీరు 23 శాతంగా ఉన్నారని విశ్లేషించింది. 70 ఏళ్లు పైబడిన వారి వాటా 4శాతమని తెలిపింది. -
డిపాజిట్ గల్లంతు అంటే..
సాక్షి, పెద్దపల్లి: ఎన్నికల్లో అభ్యర్థులు తమ ప్రత్యర్థులకు డిపాజిట్ కూడా రాదంటూ విమర్శిస్తుండం నిత్యం వింటూ ఉంటాం. మరి డిపాజిట్ గల్లంతు అంటే ఏమిటో.. మనలో చాలామందికి తెలియదు.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ నామినేషన్ ఫారంతోపాటు నిర్ణీత డిపాజిట్ (ధరావతు) చెల్లించాల్సి ఉంటుంది. నామినేషన్ దాఖలు చేసే జనరల్ అభ్యర్థులు రూ.10వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5,000 డిపాజిట్ చెల్లించాలి. సాధారణంగా ఎన్నికల్లో పోలైన చెల్లిన ఓట్లలో ఆరోవంతుకు మించిన ఓట్లు పోటీచేసిన అభ్యర్థులకు వస్తేనే సదరు అభ్యర్థికి చెల్లించిన డిపాజిట్ తిరిగి చెల్లిస్తారు. లేదంటే ఆ డిపాజిట్‌ను ప్రభుత్వమే జప్తు చేసుకుంటుంది. ఎన్నికల ఫలితాలు కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురితమయ్యాకే అర్హులైన అభ్యర్థులకు డిపాజిట్ తిరిగి ఇచ్చేస్తారు. -
వాటికి డిపాజిట్లు దక్కొద్దు
బెంగళూరు/సాక్షి ప్రతినిధి, చెన్నై: అధికారం కోసం కలలు కంటున్న కాంగ్రెస్, దాని కూటమి పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కకుండా చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ‘ఇప్పుడు న్యాయం జరుగుతుంది (అబ్ హోగా న్యాయ్) అనే నినాదంతో వస్తున్న కాంగ్రెస్ పార్టీ.. గతంలో తన 60 ఏళ్ల పాలనలో అన్యాయం చేసిందని పరోక్షంగా అంగీకరించినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఆయన కర్ణాటక రాజధాని బెంగళూరు, మంగళూరు, తమిళనాడులోని తేని, రామనాథపురంలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. మంగళూరు పార్టీ నిర్వహించిన ‘విజయ్ సంకల్ప్’ ఎన్నికల సభలో మోదీ మాట్లాడారు. ‘ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటపుడు వేలాది జనం మానవహారంలా కాకుండా మానవ కుఢ్యం(హ్యూమన్ వాల్)గా నిల్చున్నారు. జనమంతా రోడ్లపైనే ఉంటే అసలు వేదిక వద్ద జనం ఉన్నారా అని అనుకున్నా.. కానీ వేదిక వద్ద చూస్తే అంతకుమించిన జనం ఉన్నారుగా’ అని వేలాదిమంది కార్యకర్తలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్, దాని కూటమి పార్టీలను కనీసం డిపాజిట్లు కూడా దక్కని విధంగా ఓడించండి. తమ ప్రభుత్వం 60 రోజుల్లో ‘సులభతర వాణిజ్య విధానం’ అమల్లోకి తెస్తే కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో దోపిడీ విధానాన్ని అమలు చేసింది’ అని ఎద్దేవా చేశారు. ఆదాయ పన్ను శాఖ అధికారుల దాడులపై అధికార కాంగ్రెస్–జేడీఎస్ నేతల తీరును ఆయన ప్రస్తావిస్తూ.. ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రి.. ఎవరి విషయంలోనైనా చట్టం తన పని తాను చేయాలా వద్దా? ఏ తప్పూ చేయనప్పుడు మీరెందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు. ఎవరు న్యాయం చేస్తారు? : ‘ఇప్పుడు న్యాయం జరుగుతుంది(అబ్ హోగా న్యాయ్) అంటూ కాంగ్రెస్ అంటోంది. అంటే గతంలో ఆ పార్టీ 60 ఏళ్ల పాలనలో అన్యాయం జరిగినట్లు పరోక్షంగా అంగీకరించినట్లే కదా’ అని ‘న్యాయ్’ పథకంపై ప్రధాని వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా..1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులకు ఎవరు న్యాయం చేస్తారు? దళితులపై దాడుల బాధితులకు ఎవరు న్యాయం చేస్తారు? కేవలం ఆ ఒక్క కుటుంబానికి నచ్చలేదనే కారణంతో అన్యాయంగా బర్తరఫ్‌నకు గురైన మహానేత ఎంజీ రామచంద్రన్ ప్రభుత్వానికి ఎవరు న్యాయం చేస్తారు? దేశంలో అతిపెద్ద భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులకు ఎవరు న్యాయం చేస్తారు? ఎంజీ రామచంద్రన్, ఎం.కరుణానిధి తదితరులకు చెందిన ప్రాంతీయ పార్టీలను, కమ్యూనిస్టులను అన్యాయంగా అణగదొక్కింది’ అని ప్రధాని మండిపడ్డారు. వారితో ఉగ్రవాదానికి ఊతం ‘కాంగ్రెస్, ఆ పార్టీ కూటమి అధికారంలో ఉండగా దేశంలో తరచూ ఉగ్రదాడులు జరిగేవి. కాంగ్రెస్ పార్టీ మాత్రం వాటిని అపకుండా చూస్తూ ఉండిపోయింది. కాంగ్రెస్, డీఎంకే, ముస్లింలీగ్ కూటమికి ఓటేస్తే ఉగ్రవాదులు, నేరస్తులకు ఊతమిచ్చినట్లే’ అని పేర్కొన్నారు. ‘అవినీతి కుటుంబాల రాచరిక పాలనను అడ్డుకుని, శ్రీలంక తమిళుల సంక్షేమానికి పనిచేస్తాం’ అని తెలిపారు. రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ఆ కూటమిలోని నేతలే అంగీకరించలేదని మోదీ వ్యాఖ్యానించారు. కూటమి పార్టీల నేతలు ఎవరికివారు ప్రధాని పదవి కోసం క్యూకట్టి నిల్చుని ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆ ఒక్క కుటుంబానికే ప్రాధాన్యం బీజేపీ హిందుత్వను విమర్శించేందుకు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ తమిళుల గౌరవం అంటూ మాట్లాడటంపై ప్రధాని స్పందిస్తూ.. ‘దివంగత ఎంజీఆర్, జయలలిత పేదల కోసం పరితపించిన గొప్పనేతలు. శబరిమల అయ్యప్ప ఆలయ వివాదంలో బీజేపీ ప్రజల పక్షాన నిలిచింది. కానీ, కేరళలోని కాంగ్రెస్, కమ్యూనిస్ట్ ముస్లిం లీగ్ పార్టీలు శబరిమల ఆలయం విషయంలో ప్రమాదకరమైన ఆటను ఆడుతున్నాయి. బీజేపీకి దేశమే మొదటి ప్రాధాన్యం కాగా ప్రతిపక్షానికి కుటుంబమే ముఖ్యం’ అని తెలిపారు. ‘ఆ ఒక్క కుటుంబం మినహా మరెవరూ దేశానికి సేవ చేయలేదన్నట్లుగా రాజధాని ఢిల్లీలో ఎక్కడ చూసినా వారి స్మారకాలే కనిపిస్తాయి. రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి కలాం మెమోరియల్‌ను కాంగ్రెస్ నిర్మించలేదు. ఆ ఒక్క కుటుంబానికి చెందిన వారి పేర్లను ఇక్కడ ప్రభుత్వ భవనాలు, రహదారులకు పెట్టింది’ అని విమర్శించారు. -
తప్పులు గుర్తించే పనిలో..
ఘోర పరాజయం డీఎండీకేను డీలా పడేలా చేసింది. డిపాజిట్ల గల్లంతుతో పాటుగా ఓటు బ్యాంక్ పతనం కావడంతో భవిష్యత్తు కార్యచరణపై విజయకాంత్ దృష్టి పెట్టారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు జిల్లాల కార్యదర్శులతో సమాలోచనలో మునిగారు. ప్రజా సంక్షేమ కూటమితో పొత్తే పార్టీ కొంప ముంచిందని పలువురు జిల్లా కార్యదర్శులు విజయకాంత్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. బీజేపీ సైతం తప్పులను గుర్తించే పనిలో పడింది. సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి ఘోర పరాజయాన్ని చవి చూసిన విషయం తెలి సిందే. ఇందులో డీఎండీకేకు అత్యధికంగా నష్టం జరిగి ఉన్నది. ప్రధాన ప్రతిపక్ష స్థాయిలో ఉన్న పార్టీ, ఇప్పుడు చతికిల పడింది. 5.4 శాతం మేరకు ఓటు బ్యాంక్‌ను సైతం కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. విజయకాంత్ సైతం ముఫ్పై వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి చవి చూడాల్సినంతగా డీఎండీకే దిగజారింది. విజయకాంత్‌కు తీవ్ర నష్టం ఏర్పడిందన్న విషయం కూటమిలోని మిత్రులందరికీ తెలుసు. అందుకే ఆయన్ను ఓదార్చే రీతిలో కూటమిలోని ఎండీఎంకే, సీపీఎం, సీపీఐ, వీసీకే, తమిళ మానిల కాంగ్రెస్‌లు రెండు రోజుల క్రితం విజయకాంత్‌తో సమాలోచించారు. ఈ సమాలోచనతో విజయకాంత్ మినహా తక్కిన నేతలు మీడియా ముందుకు వచ్చి తమ కూటమి కొనసాగుతుందని ప్రకటించి వెళ్లారు. అయితే, నష్టం ఎక్కడి నుంచి తమకు ఎదురైందో అన్వేషించి, భవిష్యత్తును మళ్లీ పునర్ నిర్మించుకునేందుకు విజయకాంత్ సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా సోమవారం నుంచి మూడు రోజుల పాటుగా రాష్ట్రంలోని పార్టీ జిల్లాల కార్యదర్శులు ముఖ్య నాయకులతో సమాలోచనకు నిర్ణయించారు. ఆ మేరకు కోయంబేడులో జరిగిన సమాలోచనకు ఉదయం పలువురు జిల్లాల కార్యదర్శులు హాజరయ్యారు. పొత్తే కొంప ముంచింది: కోయంబేడులో విజయకాంత్ నేతృత్వంలో జరిగిన ఈ సమాలోచనలో పలువురు నేతలు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేసి ఉన్నారు. ప్రజా సంక్షేమ కూటమితో కలిసి వెళ్లడం వల్లే పార్టీ పతనం కావాల్సి వచ్చిందని, ఇది కొనసాగితే, ఇక కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్న హెచ్చరికను చేసినట్టు సమాచారం. ఇకనైనా వ్యూహాత్మకంగా వ్యవహరించడం, అదును చూసి అడుగులు వేసి బలోపేతం చేసుకోవాలని లేనిపక్షంలో కేడర్ చేజారే ప్రమాదం ఉందని సూచించినట్టు తెలిసింది. పార్టీ ఎన్నికల గుర్తింపు రద్దు, ఢంకా చిహ్నం దూరం కాబోతున్న విషయంగా విజయకాంత్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేసినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగుదామని, ఆ ఎన్నికల్లో గెలుపుతో మళ్లీ బలాన్ని చాటుకుందామన్న భరోసాను కేడర్‌కు ఇచ్చే విధంగా పలు సూచనలు , సలహాల్ని జిల్లాల కార్యదర్శులకు విజయకాంత్ ఇచ్చి ఉన్నారు. ఇక, విజయకాంత్ బాటలోనే ఎండీఎంకే నేత వైగో ఓటమిపై నేతలతో సమాలోచించేందుకు నిర్ణయించారు. ఒకటో తేదిన చెన్నైలోని పార్టీ కార్యాలయంలో ఈ సమాలోచనా సమావేశం సాగనున్నది. ఇక, రాష్ట్రంలో ఓటమి చవి చూసినా, ఓటు బ్యాంక్ ఊరట నివ్వడంతో తదుపరి అడుగులు దిశగా పీఎంకే సిద్ధం అయింది. ఇందు కోసం కేడర్‌తో సమాలోచించేందుకు నిర్ణయించారు. ఓటమి చవిచూసిన అభ్యర్థులు, పార్టీ ముఖ్య నేతలతో మంగళవారం పీఎంకే అధినేత రాందాసు, ఎంపీ అన్భుమణి రాందాసు, పార్టీ అధ్యక్షుడు జికే మణిలు సమాలోచనా సమావేశానికి నిర్ణయించారు. కమలనాథుల మంతనాలు : ఇక ఐదుసీట్లు గ్యారంటీ అని ఢిల్లీకి నివేదిక పంపించి చివరకు ఒక్కటి కూడా దక్కక నిరాశలో పడ్డ కమలనాథులు సైతం మంతనాల్లో మునిగారు. నాలుగు చోట్ల రెండో స్థానం దక్కినా, మిగిలిన అన్ని చోట్ల డిపాజిట్లు గల్లంతు కావడంతో ఓటమి కారణాలపై సోమవారం సమీక్షించారు. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సంతోష్ నేతృత్వంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్, నేతలు ఇలగణేషన్, వానతీ శ్రీనివాసన్, హెచ్ రాజా తదితరులతో కూడిన కమిటీ సమాలోచించి ఓటమి కారణాలను ఆరా తీసింది. కేంద్ర ప్రభుత్వ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు తగ్గట్టుగా బలాన్ని పెంచుకునే విధంగా కార్యచరణను సిద్ధం చేశారు. ఈసమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీలోని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పంపించేందుకు నిర్ణయించారు.