సాక్షి, పెద్దపల్లి: ఎన్నికల్లో అభ్యర్థులు తమ ప్రత్యర్థులకు డిపాజిట్ కూడా రాదంటూ విమర్శిస్తుండం నిత్యం వింటూ ఉంటాం. మరి డిపాజిట్ గల్లంతు అంటే ఏమిటో.. మనలో చాలామందికి తెలియదు.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ నామినేషన్ ఫారంతోపాటు నిర్ణీత డిపాజిట్ (ధరావతు) చెల్లించాల్సి ఉంటుంది. నామినేషన్ దాఖలు చేసే జనరల్ అభ్యర్థులు రూ.10వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5,000 డిపాజిట్ చెల్లించాలి.
సాధారణంగా ఎన్నికల్లో పోలైన చెల్లిన ఓట్లలో ఆరోవంతుకు మించిన ఓట్లు పోటీచేసిన అభ్యర్థులకు వస్తేనే సదరు అభ్యర్థికి చెల్లించిన డిపాజిట్ తిరిగి చెల్లిస్తారు. లేదంటే ఆ డిపాజిట్‌ను ప్రభుత్వమే జప్తు చేసుకుంటుంది. ఎన్నికల ఫలితాలు కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురితమయ్యాకే అర్హులైన అభ్యర్థులకు డిపాజిట్ తిరిగి ఇచ్చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment