పెగడపల్లి(ధర్మపురి): పొద్దంతా చేనులో కట్టం చేసి వచ్చిన మల్లన్న పక్క ఊర్లో ఉంటున్న తన సోపతి రాజన్నకు ఫోన్ చేసి ఎలచ్చన్ల గురించి మాట్లాడుతున్న మాటమంతి ఇలా ఉంది.
మల్లన్న: ఏం రాజన్న ఎట్లున్నవ్ అంతా మంచిదేనా..?
రాజన్న: ఆ మల్లన్న మంచిగున్నానే...నువ్వు ఎట్లున్నవ్..
మల్లన్న: ఆ మంచిగనే ఉన్నా..బాగా రోజులైంది నీతో మాట్లాడక. ఎం జేస్తున్నవు ఏందీ?
రాజన్న: ఇప్పుడే చేన్లకు పోయి ఇంటికచ్చిన. ఎల్లచ్చన్లు అచ్చినయ్ కదా. రాత్రికి ఒక నలుగురం కలిసి మంచి చెడూ మాట్లాడుకునుడే ఇంకేముంది.
మల్లన్న: ఎలచ్చన్లు ఏంటో రాజన్న..ఎప్పుడూ సూడని సిత్రాలు సూస్తున్నాం. గీ నాయకులు కాళ్లు కడుగుతుండ్రు. బజ్జీలు జేత్తుండ్రు. ఇంటికొచ్చి ఇసీ్త్ర చేస్తుండ్రు, బీడీలాకు కత్తిరిస్తుండ్రు, పొయ్యికాడికచ్చి రొట్టెలు జేత్తుండ్రు. పోరగండ్లకు తానం పోత్తుండ్రు. పచారంలా దప్పులు కొడుతుండ్రు.. అబ్బబ్బ ఎన్నడూ సూడని సిత్రాలు ఎలచ్చన్ల పుణ్యమాని సూస్తున్నాం.
రాజన్న: ఔనూ మల్లన్నా.. గీ నాయకులు ఓట్ల కోసం ఏమైన సేసేటట్లు ఉన్నరు. నమ్మబుద్ధవ్వట్లేదు కదా..
మల్లన్న: అవు రాజన్న..గెలిసేదాక ఒక్కటే..గెలిపించాక ఇంకొక్కటి వీల్ల తరికా.. సూడనోల్లమా మనం.. సిన్నగున్నప్పటి నుంచి సూస్తున్నవే కదా.
రాజన్న: అవు మల్లన్న..గిసుంటి పనులు సేయడంలో నాయకులను మించినోళ్లు లేరు గదా.
మల్లన్న: సరే గానీ రాజన్న..మీ దగ్గర ఎట్టున్నదే.. (ఏ పార్టీ హవా నడుస్తున్నది).
రాజన్న: ఏం చెప్పస్తలేదు మల్లన్న. అందరూ వస్తుండ్రు, పోతుండ్రు. ఎవ్వల్లస్తరో(గెలుస్తరో) సమజయితలేదు.
మల్లన్న: అవునా..(నవ్వతూ) ఎవరైన రానీ..ఎవరిని నారాజ్ చేయొద్దు మనం. సూద్దాం ఇంకో వారం ఆగితే అంతా కుల్లావుతది గదా.
రాజన్న: సరే మల్లన్న. రాత్రి అయింది. బుక్కెడు బువ్వ తిని పడుకుంటా..
మల్లన్న: సరే రాజన్న ఉంటా మరి.
Comments
Please login to add a commentAdd a comment