independent candidates
-
Haryana Assembly Elections 2024: రెబెల్స్ దడ
హరియాణాలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ముఖ్యనేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మంచి ప్రదర్శన 10 సీట్లలో ఐదు నెగ్గింది) కనబర్చిన కాంగ్రెస్ హరియాణాను తమ ఖాతాలో వేసుకోగలమనే ధీమాలో ఉంది. రైతుల అసంతృప్తి, నిరుద్యోగం, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై రెజర్ల లైంగిక వేధింపుల ఆరోపణలు, అగి్నవీర్ పథకంపై యువతలో నెలకొన్న ఆగ్రహం.. కాంగ్రెస్ అవకాశాలను మెరుగుపరిచాయి. అయితే పార్టీలోని ఆధిపత్య పోరు కాంగ్రెస్‌ను కలవరపెడుతోంది. మరోవైపు బీజేపీ గడిచిన పదేళ్లలో చేసిన అభివృద్ధిపై ఆశలు పెట్టుకుంది. 20 స్థానాల్లో రెబెల్స్ ప్రభావంఅయితే రెండు పారీ్టలకూ తిరుగుబాటు అభ్యర్థులు దడ పుట్టిస్తున్నారు. టికెట్లు నిరాకరించడంతో.. పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. మరికొందరు ఇతర పార్టీల నుంచి నామినేషన్ వేశారు. మొత్తం మీద సొంత పార్టీలకు సవాల్ విసురుతున్నారు. హోరాహోరీ పోరులో రెబెల్స్ ఎవరి పుట్టిముంచుతారోననే దడ రెండు పారీ్టల్లోనూ ఉంది. హరియాణా అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉండగా.. కనీసం 20 నియోజకవర్గాల్లో రెబెల్స్ ఫలితాలను తారుమారు చేసే స్థితిలో ఉన్నారు. 15 స్థానాల్లో 19 మంది బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులు బరిలో నిలిచారు. 20 నియోజకవర్గాల్లో 29 మంది కాంగ్రెస్ రెబెల్స్ పోటీలో ఉన్నారు. 7 స్థానాల్లో 12 మంది అసంతృప్త నేతలను కాంగ్రెస్ బుజ్జగించింది. అలాగే 6 నియోజకవర్గాల్లో బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులు పార్టీ సీనియర్ల విజ్ఞప్తులను మన్నించి తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. హరియాణా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు గణనీయమైన ఓట్ల శాతాన్ని రాబట్టుకుంటూ వస్తున్నారు. ఇది ప్రధాన పారీ్టలకు తలనొప్పిగా మారింది. గెలుపోటములను ప్రభావితం చేయగలిగే స్థాయిలో వీరు ఓట్లను చీల్చితే.. తాము నష్టపోతామని కాంగ్రెస్, బీజేపీ నాయకులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అందరి దృష్టి హిసార్ పైనే.. బీజేపీ రెబెల్స్‌లో దేశవ్యాప్తంగా రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తున్నది సావిత్రి జిందాల్. ఓ.పి.జిందాల్ గ్రూపు చైర్పర్సన్ అయిన సావిత్రి భారత్‌లోనే అత్యంత సంపన్న మహిళ. హిసార్‌లో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ఆరోగ్యశాఖ మంత్రి కమల్ గుప్తాకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఆమె కుమారుడు నవీన్ జిందాల్ ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గూటికి చేరి.. కురుక్షేత్ర ఎంపీగా గెలిచారు. కమల్ గుప్తా గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో హిసార్ నుంచి విజయం సాధించారు. 2009లో ఇక్కడ సావిత్రి జిందాల్ కాంగ్రెస్ టికెట్‌పై గెలిచారు. గనౌర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి దేవేందర్ కౌశిక్‌కు రెబెల్ అభ్యర్థి దేవేందర్ కడ్యాన్ నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. బీజేపీ ఓటు బ్యాంకును వీరిద్దరూ పంచుకుంటుండడంతో కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ శర్మకు కలిసివస్తోంది. కుల్దీప్ 2009, 2014లలో రెండుసార్లు గనౌర్ నుంచి గెలుపొందారు. బీజేపీ టికెట్‌ను నిరాకరించడంతో మాజీ విద్యుత్‌శాఖ మంత్రి రంజిత్‌సింగ్ చౌతాలా రైనా నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేస్తున్నారు. 2009, 2014లలో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిపోయిన రంజిత్‌సింగ్.. 2019లో రైనా నుంచి స్వతంత్ర అభ్యరి్థగా విజయం సాధించారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ చేరారు. గురుగావ్‌లో బీజేపీ ట్రేడ్ సెల్ మాజీ కనీ్వనర్ నవీన్ గోయల్ రెబెల్ అభ్యరి్థగా బరిలో నిలిచారు. సఫిదాన్‌లో బీజేపీ అభ్యర్థి రామ్‌కుమార్ గౌతమ్‌కు తిరుగుబాటు అభ్యర్థి బచన్‌సింగ్ ఆర్య చెమటలు పట్టిస్తున్నారు. సఫిదాన్‌లో బచన్‌సింగ్ 2009, 2019లలో రెండోస్థానంలో నిలువడం గమనార్హం. కాంగ్రెస్‌కూ సెగ.. అంబాలా కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ తరఫున బలమైన నేత అనిల్ విజ్ మరోసారి బరిలో నిలువగా.. కాంగ్రెస్‌ను చిత్ర సర్వరా భయం వెంటాడుతోంది. 2009, 2014లలో అనిల్ విజ్ చేతిలో ఓటమి చవిచూసిన చిత్ర 2019లో స్వతంత్ర అభ్యరి్థగా బరిలోకి దిగి రెండోస్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యరి్థని మూడోస్థానానికి నెట్టారు. దాంతో కాంగ్రెస్ ఆమెను ఆరేళ్లు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. జగధారి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుడు ఆదర్శపాల్ గుర్జా ర్ పార్టీ మారి ఆప్ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అక్రమ్ ఖాన్‌కు గట్టి సవాల్ విసురుతున్నారు. ఇది బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కన్వర్పాల్కు అడ్వాంజేట్గా మారింది. అక్రమ్‌ఖాన్ 2009లో బీఎస్పీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019లలో రెండోస్థానానికి పరిమితమయ్యారు. సదౌ రా నియోజకవర్గంలో బ్రిజ్‌పాల్ చప్పర్ బీఎస్పీ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేణు బాలాపై పోటీచేస్తునానరు. రేణు 2019లో 17 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. అయితే సదౌరాలో బీఎస్పీ 2009, 2019లలో 18–19 శాతం ఓట్లు సాధించడం.. కాంగ్రెస్ అభ్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మొత్తం మీద ఏ పార్టీని రెబెల్స్ ఎంతమేరకు దెబ్బతీస్తారనేది అక్టోబరు 8న ఓట్ల లెక్కింపు తర్వాత తేలనుంది. హరియాణా అసెంబ్లీకి అక్టోబరు 5న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
AP: స్వతంత్రుల ఏజెంట్లూ ‘తమ్ముళ్లే’!
సత్తెనపల్లి: జూన్ 4న కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎక్కువ మంది తెలుగు తమ్ముళ్లను పంపేలా కూటమి నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. సార్వత్రిక ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు, వారి ప్రతినిధులు, ఏజెంట్ల నియామకానికి గురువారంలోగా వివరాలు పంపాలని పల్నాడు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేశ్ బి లత్కర్ సూచించారు. ప్రధాన పార్టీలైన వైఎస్సార్సీపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థులతోపాటు మరో 93 మంది అభ్యర్థులు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల బరిలో ఉన్నారు. అభ్యర్థుల తరఫున ఏజెంట్లు నియమించుకోవడానికి ఆధార్ కార్డులతో పాటు గుర్తింపు పత్రాలు, ఫొటోలు ఇస్తే గుర్తింపు కార్డులు జారీ చేస్తారు. గుర్తింపు పొందిన పార్టీలతో పాటు పోటీలో ఉన్న ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా వారి తరఫున ఏజెంట్లను నియమించుకునేందుకు అవకాశం ఉండటంతో స్వతంత్ర అభ్యర్థులకు ఎరవేసి వారి తరఫున కూడా తమవారిని నియమించుకునే వ్యూహాన్ని పల్నాడు జిల్లాలోని ఎన్డీఏ కూటమి అభ్యర్థులు పన్నుతున్నట్లు చర్చ జరుగుతోంది. స్వతంత్రంగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో ఉన్న అభ్యర్థుల తరఫున ఉన్న ఏజెంట్లకు బదులు టీడీపీ అభ్యర్థులు సొంత మనుషులను ఏజెంట్లుగా నియమించుకున్నట్లు సమాచారం. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అభ్యర్థులు వారి ఏజెంట్లకు మాత్రమే ఎన్నికల కమిషన్ అనుమతిస్తుంది. దీంతో స్వతంత్ర అభ్యర్థుల తరఫున తమ అనుచరులను ఏజెంట్లుగా నియమించుకున్నట్టు తెలిసింది. లెక్కింపు కేంద్రం లోపల తమ వారు ఎక్కువ మంది ఉండేలా చూసుకుంటున్నారని, అందుకు ప్రధాన కారణం రౌండ్ల వారీగా అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు అధికారులు ప్రకటించగానే తమకు సమాచారం ఇచ్చేలా నమ్మకస్తులను ఏర్పాటు చేసుకున్నట్లు అనుచర వర్గం బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అవసరమైతే లోపల గొడవలకు కూడా సిద్ధంగా ఉండేలా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని రిటర్నింగ్ అధికారులు, పోలీసులు ఇలాంటి ప్రలోభాలను నిలువరిస్తారా! లేక చేతులు ఎత్తేస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది. వ్యూహాత్మకంగా స్వతంత్రులుగా రంగంలోకి.. టీడీపీకి చెందిన కొందరినీ ముందుగానే వ్యూహం ప్రకారం స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయించారు. ఇప్పుడు వారి తరఫున కూడా ఏజెంట్లుగా తెలుగు తమ్ముళ్లే వెళ్లబోతున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో మొత్తం 15 మంది పోటీలో ఉన్నారు. వీరిలో వివిధ పార్టీల నుంచి 9 మంది బరిలో ఉంటే ఆరుగురు స్వతంత్రులున్నారు. స్వతంత్రులతో పాటు కొందరు బరిలో ఉన్న అభ్యర్థులనూ ప్రలోభాలకు గురి చేసి ఎలాగైనా చివరి ఘట్టమైన కౌంటింగ్ కేంద్రాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని, అనుకూలంగా లేకపోతే గొడవలకు దిగాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. -
Lok Sabha Election 2024: ఢిల్లీ బరిలో స్వతంత్రుల సందడి
దండల్లేవు. నినాదాల్లేవు. పెద్ద ఎత్తున ప్రజానీకం లేరు. లౌడ్ స్పీకర్లు అసలే లేవు. ప్రచారానికి నిధులు కూడా లేవు. అ యినా ఇల్లిల్లూ తిరుగుతూ ఓట్లడుగుతున్నారు. వారంతా ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన 49 మంది స్వతంత్ర అభ్యర్థులు. వీరిలో ఓ బహుళజాతి సంస్థ ఉద్యోగి మొదలుకుని వెల్డ ర్, మెకానిక్, సామాజిక కార్యకర్త, స్టాక్ ట్రేడర్ దాకా రకరకాల వాళ్లున్నారు. వీరిలో 67 ఏళ్ల సుభాష్ చందర్ హరియాణాలోని సిర్సా వాసి. కాలుష్యంతో ఢిల్లీ గ్యాస్ చాంబర్‌లా మారిపోయిందన్నది ఆయన ఆవేదన. దీన్ని ఎత్తి చూపేందుకే చాందినీ చౌక్ లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగానని చెబుతున్నాడు. డబ్బు ఆదా చేసేందుకు రాత్రుళ్లు గురుద్వారాల్లో బస చేస్తున్నాడు. రూ.10కే భోజనం పెడతా సౌత్ ఢిల్లీ బరిలో ఉన్న శంకర్ రాజధానిలో పోటీ చేస్తున్న ఏకైక బెంగాలీ అభ్యర్థి! 30 ఏళ్లు ఢిల్లీలోనే ప్రభుత్వోద్యోగం చేసి రిటైరయ్యారు. గెలిచినా ఓడినా ఎన్నికల తర్వాత ఢిల్లీలో ప్రజలకు రూ.10కే కడుపునిండా భోజనం అందిస్తానని ధీమాగా చెబుతున్నాడు! అచ్లా జెఠ్మలానీ ఓ బహుళజాతి సంస్థలో మంచి హోదాలో పని చేశారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బాసూరీ స్వరాజ్, సోమనాథ్ భారతిలతో తలపడుతున్నారు. పెచ్చరిల్లిన నిరుద్యోగంపై పోరాడేందుకే బరిలో దిగానంటున్నారు. ఉద్యోగిగా పొదుపు చేసుకున్న డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారు. సౌత్ ఢిల్లీలో బరిలో ఉన్న నవీన్‌కుమార్ వృత్తిరీత్యా వెల్డర్. చదువుకోలేదు. అందుకే సరైన విద్యా వ్యవస్థ కోసం బరిలో దిగాడు. ఆయన కోసం 12 మందితో కూడిన బృందం పని చేస్తోంది. తనకు 6 లక్షల ఓట్లు ఖాయమంటున్నాడు! వెస్ట్ ఢిల్లీ నుంచి బరిలో ఉన్న సామాజిక కార్యకర్త అంజు శర్మ పూర్వాశ్రమంలో కాంగ్రెస్ నాయకురాలు. – న్యూఢిల్లీ -
కూటమిలో వేరు కుంపట్లు
సాక్షి, పుట్టపర్తి: జెండాలు జత కట్టాయి.. నేతలు కూటమిగా ఏర్పడ్డారు.. సీట్లు పంచుకున్నారు.. అభ్యర్థులను ఖరారుచేశారు.. కానీ, అసలైనది అయిన సహకారం వీరి మధ్య కరువైంది. ప్రధానంగా మిత్రపక్షాల నుంచి టీడీపీకి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇదే అదనుగా బీజేపీకి చెక్ పెట్టాలని టీడీపీ నేతలు స్కెచ్ వేస్తున్నారు. మరోవైపు.. తమకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని జనసేన కార్యకర్తలూ అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయా పార్టీల పెద్దలు కలుసుకునేందుకు మాత్రమే కూటమి వేదికగా మారినట్లు స్పష్టమవుతుండగా క్షేత్రస్థాయిలో మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కూటమిలో టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్లు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగేందుకు ఎవరికి వారు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. శ్రీసత్యసాయి జిల్లాలోని హిందూపురం పార్లమెంటు సీటుతో పాటు ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, రాప్తాడులో వేరు కుంపట్లు ఉంటాయని చెబుతున్నారు. మూడు పార్టీల నాయకుల మధ్య సఖ్యత లేకపోవడంతో ఎవరికి వారుగా పోటీచేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాప్తాడు నుంచి వరదాపురం సూరి? బీజేపీ తరఫున ధర్మవరం టికెట్ ఆశించిన వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ)కి కూడా నిరాశే ఎదురైంది. బీజేపీ అధిష్టానం ధర్మవరం టికెట్‌ను వై. సత్యకుమార్‌కు ఖరారు చేసింది. దీని వెనుక పరిటాల శ్రీరామ్ హస్తం ఉందని భావిస్తున్న సూరి తనకు టికెట్ రాకుండా టీడీపీ అధిష్టానం వద్ద అడ్డుపుల్లలు వేసిన పరిటాల కుటుంబ సభ్యులను ఓడించేందుకు ఆయన కంకణం కట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి.. పరిటాల సునీతను ఓడించేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ‘స్వతంత్రం’గా పరిపూర్ణానందస్వామి.. హిందూపురం ఎంపీగా బీజేపీ తరఫున పోటీచేస్తానని రెండు నెలలుగా పరిపూర్ణానందస్వామి ప్రచారం చేసుకున్నారు. అయితే, కూటమిలో భాగంగా టీడీపీ నేత బీకే పార్థసారథికి ఆ ఎంపీ టికెట్ ఖరారుచేశారు. కానీ, పరిపూర్ణానందస్వామి తగ్గే పరిస్థితి కనిపించడంలేదు. తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని.. కార్యకర్తలు అందరూ సహకరించాలని ఆయన కోరుతున్నారు. టీడీపీ–జనసేన తనను మోసం చేశాయని ఆయన మండిపడుతున్నారు. ప్రచారానికి శ్రీరామ్ దూరం? ధర్మవరం టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ తరఫున ప్రచారం చేసేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. రాప్తాడులో పరిటాల సునీత గెలుపు కోసం బిజీబిజీగా గడపాల్సి ఉందని.. ఇతర పార్టీ నేతల గెలుపు కోసం తానెందుకు సమయం వృథా చేసుకోవాలని తన అనుచరుల వద్ద శ్రీరామ్ చర్చించినట్లు సమాచారం. అలాగే.. జనసేన నేత చిలకం మధుసూదన్‌రెడ్డి కూడా సత్యకుమార్‌కు మద్దతిచ్చే పరిస్థితి కనిపించలేదు. కదిరిలో అంటీముట్టనట్లుగా విష్ణు.. ఇక కూటమి నిర్ణయాలు తనను నిరాశపరిచాయని కదిరి బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి తన అనుచరుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. రానున్న ఎన్నికల్లో కదిరిలో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేయకపోవచ్చని సమాచారం. కర్ణాటక రాజధాని బెంగళూరు వెళ్లి.. అక్కడ బీజేపీ పార్లమెంటు అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఆయన ప్లాన్ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. పుట్టపర్తిలో టీడీపీకి సహాయ నిరాకరణ.. కలిసి పోటీచేయాలన్న లక్ష్యంతో టీడీపీ–బీజేపీ –జనసేన కూటమిగా ఏర్పడినా.. పుట్టపర్తిలో మాత్రం ఆ దిశగా ఆయా నాయకులు ముందుకెళ్లడంలేదు. అక్కడ జనసేన నాయకుల అడ్రస్‌లేదు. బీజేపీ నేతలు ఎక్కడ ఉన్నారో కనిపించని పరిస్థితి. కేవలం టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రచారం చేస్తున్నారు. అనంతపురం నుంచి ఉద్యోగం మాదిరిగా ఉదయం వచ్చి సాయంత్రం వెళ్తున్నట్లు ‘తమ్ముళ్లు’ చెబుతున్నారు. -
Rajasthan Assembly elections 2023: బీజేపీ గుండెల్లో రె‘బెల్స్’
రాజస్తాన్‌లో తిరుగుబాటు నేతలు బీజేపీకి దడ పుట్టిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం చేసిన చరిత్ర వారిది! ఆ ఎన్నికల్లో చివరి క్షణంలో పార్టీ మొండి చేయి చూపడంతో ఆగ్రహించి డజను మంది నేతలు స్వతంత్రులుగా బరిలో దిగారు. తాము ఓడటమే గాక బీజేపీ అభ్యర్థులను కూడా ఓడించి కాంగ్రెస్ నెత్తిన పాలు పోశారు. అదే సమయంలో 2018లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడి తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేసిన 13 మందిలో ఏకంగా 12 మంది విజయం సాధించడం విశేషం. పైగా ఫలితాలు వెలువడగానే వారంతా కాంగ్రెస్ గూటికే చేరుకున్నారు. అలా నికరంగా ఆ పార్టీకి పెద్దగా నష్టమేమీ జరగలేదు. ఈసారి కూడా రెండు పార్టీల నుంచీ రెబెల్స్ రంగంలో ఉన్న నేపథ్యంలో వారు ఎవరికి చేటు చేస్తారోనన్న చర్చ జరుగుతోంది...! రాజస్తాన్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 830 మంది స్వతంత్రులు పోటీ చేశారు. వారిలో 13 మంది కాంగ్రెస్, 12 మంది బీజేపీ నేతలున్నారు. పార్టీ టికెట్ దక్కకపోవడంతో వారు తిరుగుబావుటా ఎగరేశారు. కాంగ్రెస్ రెబెల్స్‌లో ఏకంగా 12 మంది గెలవడమే గాక ఆ వెంటనే కాంగ్రెస్‌లో చేరారు. ఈసారి వారిలో 10 మందికి సీఎం అశోక్ గహ్లోత్ కాంగ్రెస్ టికెట్లు కూడా ఇప్పించారు. మరోవైపు 12 మంది బీజేపీ రెబల్స్‌లో ఒక్కరు కూడా నెగ్గలేదు. కుల్దీప్ ధన్‌ఖడ్, దేవీసింగ్ షెకావత్, ధన్సింగ్ రావత్, హేమ్‌సింగ్ భడానా వంటి పెద్ద నాయకులు కూడా రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. కాకపోతే ఈ 12 మందీ తమ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులందరినీ ఓడించారు. అలా రెబెల్స్ దెబ్బకు బీజేపీ బాగా నష్టపోయింది. బీజేపీకి 73 సీట్లు రాగా కాంగ్రెస్ 100 స్థానాల్లో నెగ్గడం తెలిసిందే. 2013లో కూడా కాంగ్రెస్ రెబెల్స్‌లో చాలామంది నెగ్గగా బీజేపీ తిరుగుబాటు అభ్యర్థుల్లో అత్యధికులు ఓటమి చవిచూశారు. ఈసారి కూడా రాష్ట్రంలో ఏకంగా 737 మంది స్వతంత్ర అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిలో బీజేపీ, కాంగ్రెస్ టికెట్లు ఆశించి భంగపడ్డ వారూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. మొత్తమ్మీద 18 మంది బీజేపీ రెబెల్స్, 14 మంది కాంగ్రెస్ రెబెల్స్ స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. వీరి ప్రభావం ఆ పారీ్టలపై ఎలా ఉంటుందన్నది ఫలితాల అనంతరమే తేలనుంది. రాష్ట్రంలో నవంబర్ 25న పోలింగ్ జరగనుంది. ఫలితాలు మిగతా 4 రాష్ట్రాలతో పాటు డిసెంబర్ 3న వెల్లడవుతాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నామినేషన్ వేసి.. ప్రచారం మరిచే.. చోటా పార్టీల పరిస్థితి..???
సాక్షి,పెద్దపల్లి: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గడువు మరోవారం రోజుల్లో ముగియనుంది. అయినా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో నిలిచిన వారిలో చాలామంది తమ ప్రచారం ఇంకా మొదలుపెట్టని పరిస్థితి నెలకొంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల నాటినుంచే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీల అభ్యర్థులు మండలాల వారీగా ప్రచార సభలు, సమావేశాలతో దూసుకపోతున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల ప్రచార వాహనాలు గ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్లును ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ స్వతంత్రులుగా, ఇతర చిన్న పార్టీల నుంచి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో కొంతమంది ప్రచారంలో ఎక్కడా కానరావటం లేదు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోరు నెలకొంది. బరిలో 61 మంది ► పెద్దపల్లి అసెంబ్లీ బరిలో 17మంది అభ్యర్థులు పోటీపడుతుండగా, అందులో ప్రధాన పార్టీలతోపాటు న్యూ ఇండియా, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, భారతీయ స్వదేశీ కాంగ్రెస్ చిన్నపార్టీలతోపాటు, 9మంది స్వతంత్ర అభ్యర్ధులు ఉన్నారు. ► రామగుండంలో 23మంది బరిలో ఉండగా వీరిలో తెలంగాణ లేబర్, విద్యార్థుల రాజకీయ, జనశంఖారావం, పిరమిడ్, ధర్మసమాజ్, న్యూండియా, భారతీయ స్వదేశ్ కాంగ్రెస్, ఆలిండియా డెమొక్రటిక్ రిఫారమ్స్ పార్టీలతో పాటు 11మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీపడుతున్నారు. ► మంథని అసెంబ్లీ బరిలో 21మంది పోటీలో ఉండగా చిన్నపార్టీలను కలుపుకుని 17మంది స్వంత్రులు పోటీచేస్తున్నారు. సైలెంట్ చేశారా! ఈవీఎంలో నోటాతో కలుపుకుని 16మంది అభ్యర్థులు దాటితే మరో ఈవీఎం అమర్చాల్సి ఉంటుంది. మూడు నియోజకవర్గాల్లో రెండు ఈవీఎంలూ వాడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో స్వంతంత్రులకు పొలయ్యే ఓట్లు ఎవరికి నష్టం చేకూరుస్తాయోనన్న భయం అభ్యర్థులకు ఆందోళన కలిగిస్తోంది. స్వతంత్ర అభ్యర్థులు గెలవకపోయినా, గెలుపోటములను ప్రభావితం చేసిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓట్లలో చీలిక రాకుండా స్వతంత్రులు, ఇతర చిన్నపార్టీల అభ్యర్థులను ప్రచారం చేయకుండా తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. మరో పక్క.. ఎన్నికల ఖర్చుకు భయపడి ఆయా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ప్రచారంలో దూకుడు పెంచడం లేదని తెలుస్తోంది. గుర్తులతో ఇబ్బందే.. ► స్వతంత్రులు ఎన్నికల ప్రచారం చేయకున్నా వారికి పోలైన ఓట్లు ఏ పార్టీ అభ్యర్థికి నష్టం చేకూరుస్తాయనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ► ఎందుకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు, ప్రధాన పార్టీల అభ్యర్థులకు కేటాయించిన గుర్తులను పోలిఉన్న సందర్భంలో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. ► దీంతో ఈసారి ఎన్నికల్లో వీరి ప్రభావం ఎంత అనేది ఫలితాలు వస్తే కానీ తెలియని పరిస్థితి నెలకొంది. ఇవి చదవండి: ఏ గుర్తు.. ఎంతిస్తరు..? కండువా వేసుకుని సిద్ధం.. -
స్వతంత్ర అభ్యర్థులు ఎక్కడ.. ఒకప్పుడు 41 మంది, ఇప్పుడు నలుగురే
రాజకీయ పార్టీల అభ్యర్థులు కోట్ల రూపాయల ఖర్చు పెట్టి, మందీ మార్బలం, ప్రచారార్భాటంతో ఎన్నికల్లో హల్చల్ చేస్తారు. ఇవేమీ లేని అభ్యుదయవాదులు, ఔత్సాహికులు కూడా ఏ పార్టీ గుర్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తారు. కానీ గెలిచేది మాత్రం తక్కువమంది. ఒకప్పుడు 40 మందికిపైగా ఉన్న స్వతంత్ర శాసనసభ్యులు ఇప్పుడు నలుగురికి మించడం లేదు. పెద్ద పారీ్టల ధాటికి స్వతంత్రులు నిలవడం లేదు. కర్ణాటక: కన్నడనాట ప్రతి ఎన్నికల సమయంలో సత్తా చాటుతున్న స్వతంత్ర అభ్యర్థులు ఈసారి నామమాత్రమయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు సమయంలో ప్రతిసారి నంబర్ గేమ్‌కు అవసరమయ్యేది స్వతంత్రులే. కానీ 16 వ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో స్వతంత్ర ఎమ్మెల్యేల అవసరం లేకుండా పోయింది. 2018లో ఒక్కరు ► 1985 నుంచి ఇప్పటివరకు వేలాది మంది స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీచేశారు. కానీ గెలుపొందిన వారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ► 2018 ఎన్నికల్లో 1,142 మంది స్వతంత్రులు పోటీచేయగా 3.96 శాతం ఓట్లు పొందారు, గెలిచింది మాత్రం ఒక్కరే. ► తాజా ఎన్నికల్లో 918 మంది స్వతంత్రులు, చిన్నపార్టీల నుంచి 693 మంది అభ్యర్థులతో కలిపి 1,611 మంది బరిలో నిలిచారు, గెలిచింది నలుగురు మాత్రమే. 1967లో 41 మంది విజయం ► 1957 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 251 మంది స్వతంత్రులు పోటీచేయగా వారిలో 35 మంది గెలుపొందారు. ► 1962 లో 179 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీచేసి 27 మంది గెలిచారు. ► 1967 లో 331 మంది స్వతంత్రులు పోటీచేయగా ఏకంగా 41 మంది విజయకేతనం ఎగురవేశారు. ఇది ఇప్పటివరకు చారిత్రక రికార్డు. ఆ తరువాత నుంచి స్వతంత్రుల హవాకు బ్రేక్ పడింది. ప్రతిసారీ 25 లక్షల దాకా ఓట్లు ► 1978లో అతి తక్కువ అంటే 9,40,677 ఓటర్లు మాత్రమే స్వతంత్ర అభ్యర్థులకు ఓటేశారు. ► 1967లో 21,29,786 ఓట్లు, 1999లో 26,66,444 ఓట్లు, 2013లో 23,13,386 ఓట్లు స్వతంత్రులకు వచ్చాయి. ► ఇప్పటి ఎన్నికల్లో 22,54,882 (5.81) ఓట్లు స్వతంత్రులకు పడ్డాయి. -
Guajarat Elections: ఏడుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన బీజేపీ
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏడుగురు రెబల్ ఎమ్మెల్యేలపై ఆరేళ్ల పాటు సస్పెన్షన్ వేటు వేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలైన వీరంతా టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో క్రమశిక్షణా రాహిత్యం కింద పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. సస్పెండ్ అయిన ఏడుగురు ఎమ్మెల్యేలు.. హర్షద్ వాసవ, అరవింద్ లదాని, ఛత్రాసింగ్ గుంజారియా, కేతన్ భాయ్ పటేల్, భరత్ భాయ్ చావ్డా, ఉదయ్ భాయ్ షా, కరన్ భాయ్ బరైయా. వీరంతా డిసెంబర్ 1న జరిగే తొలి విడత ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపింది బీజేపీ. మొత్తం 42 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించింది. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్‌కు కూటా టికెట్ ఇవ్వలేదు. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా ఏడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ, పూర్వవైభవం సాధించి మరోసారి గుజరాత్‌ను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నాయి. చదవండి: ఉద్ధవ్ శివసేన కార్యాలయం కూల్చివేత..ముంబైలో ఉద్రిక్తత.. -
రాజ్యసభ ఎన్నికలు.. జోరందుకున్న బేరసారాలు!
సాక్షి, ముంబై: రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ పార్టీల, స్వతంత్ర ఎమ్మెల్యేలతో ప్రధాన పార్టీల ప్రతినిధులు రహస్యంగా మంతనాలు జరపడం, ఓట్ల కొనుగోలు కోసం బేరసారాలు చేయడం జోరందుకున్నట్లు తెలుస్తోంది. కొందరు ప్రత్యక్షంగా, మరికొందరు పరోక్షంగా సమావేశాల్లో పాల్గొంటున్నారు. అంతేగాకుండా ఓట్లు చీలిపోకుండా ప్రధాన రాజకీయ పార్టీలు తమతమ ఎమ్మెల్యేలతో, చిన్నాచితక పార్టీలు, ఇండిపెండెంటు ఎమ్మెల్యేలతో వేర్వేరుగా చర్చలు జరుపుతున్నాయి. ఈనెల 10న ఆరు రాజ్యసభ స్ధానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కానీ ఆరు స్ధానాలకుగాను ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో పేచీ మొదలైంది. ఇందులో బీజేపీ తరఫున (ముగ్గురు) కేంద్ర రైల్వే మంత్రి పీయుష్ గోయల్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి, విదర్భకు చెందిన డాక్టర్ అనీల్ బోండే, కొల్హాపూర్‌కు చెందిన మాజీ ఎంపీ ధనంజయ్ మహాడిక్, శివసేన తరఫున (ఇద్దరు) సంజయ్ రావుత్, సంజయ్ పవార్, ఎన్సీపీ తరఫున (ఒక్కరు) ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ తరఫున (ఒక్కరు) ఇమ్రాన్ ప్రతాపగడి ఇలా ఏడుగురు బరిలో ఉన్నారు. నామినేషన్ ఉపసంహరించుకునేందుకు ఇచ్చిన గడువు చివరి నిమిషం వరకు ఇరు పార్టీల నాయకుల మధ్య చర్చలు జరిగాయి. అభ్యర్థి ఉపసంహరణకోసం ఒకరికొకరు ఆఫర్లు ప్రకటించుకున్నారు. అయినప్పటికీ చర్చలు విఫలం కావడంతో ఎన్నికలు అనివార్యమయ్యా యి. దీంతో ఆరో అభ్యర్ధిని గెలిపించుకోవడానికి ఇటు బీజేపీ, అటు శివసేన తమ ప్రతిష్టను ఫణంగా పెడుతున్నాయి. ఎలాగైనా తమ అభ్యర్ధిని గెలిపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నేతృత్వంలోని మహావికాస్ ఆఘాడికి చెందిన ఎమ్మెల్యేలతో చర్చించేందుకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ముంబైలోని ఫైవ్‌స్టార్ హోటల్ ట్రయ్డెంట్లో మంగళవారం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కొందరు ఇండిపెండెంటు ఎమ్మెల్యేలు కూడా హాజరు కానున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. చదవండి: నోట్లపై గాంధీ బొమ్మ బదులు.. ఆర్బీఐ క్లారిటీ బీజేపీ మూడో అభ్యర్థితో మొదలైన కాక... బీజేపీ మూడో అభ్యర్ధిని బరిలో దింపడంతో 24 ఏళ్ల తరువాత రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న విషయం విదితమే. లేని పక్షంలో ఆరుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికై రాజ్యసభకు వెళ్లేవారు. బీజేపీ కారణంగా ఈ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. దీంతో అన్ని ప్రధాన పార్టీలు తమ పరువు, ప్రతిష్టను ఫణంగా పెడుతున్నాయి. ఎక్కడ తమ ఎమ్మెల్యేలు అమ్ముడుపోతారోనని భయం పట్టుకుంది. దీంతో ఎమ్మెల్యేలు చీలిపోకుండా ఎన్నికలకు రెండు రోజుల ముందే తమ పార్టీ ఎమ్మెల్యేలందరినీ ఓ రహస్య స్థావరానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరితో సంప్రదింపులు జరపకుండా, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఎన్నికలు జరిగే రోజు వరకు ఎమ్మెల్యేలందరూ ఎక్కడ బస చేశారనే విషయం బయటకు పొక్కకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముంబై చేరుకున్న అశ్వినీ వైష్ణవ్ రాష్ట్రంలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల పనులు పర్యవేక్షించేందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను బీజేపీ నియమించింది. దీంతో వైష్ణవ్ ఆదివారమే ముంబైకి చేరుకున్నారు. మూడో అభ్యర్ధిని గెలిపించుకునేందుకు రచించాల్సిన వ్యూహంపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైష్ణవ్‌తోపాటు కేంద్ర వాణిజ్య మంత్రి, రాజ్యసభ బీజేపీ అభ్యర్ధి పీయూష్ గోయల్, ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తదితర కీలక నేతలు హాజరయ్యారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ సమావేశం ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు చెందిన సాగర్ బంగ్లాలో జరగాల్సి ఉంది. కానీ ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో బీజేపీ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. కరోనా కారణంగా ఫడ్నవీస్ ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయినప్పటికీ ఆన్లైన్లో పాల్గొన్నారు. చదవండి: బెడిసికొట్టిన ఏకగ్రీవం.. రాష్ట్రంలో 24 ఏళ్ల తరువాత రాజ్యసభ ఎన్నికలు -
కేటీఆర్‌కు షాకిచ్చిన స్వతంత్రులు
సాక్షి, రాజన్న సిరిసిల్ల : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం మున్సిపాలిటీ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చేటుసుకున్నాయి. సిరిసిల్లలో పది వార్డుల్లో స్వతంత్రులు విజయం సాధించి.. కేటీఆర్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. మొత్తం 39 వార్డులకు ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. టీఆర్ఎస్ 24 వార్డుల్లో విజయం సాధించగా.. బీజేపీ 3, కాంగ్రెస్ 2, స్వతంత్రులు 10 స్థానాల్లో గెలుపొందారు. వీరంతా టీఆర్ఎస్కు చెందిన రెబల్స్‌గా తెలుస్తొంది. అయితే రెబెల్స్ గెలుపొందినా వారిని తిరిగి టీఆర్ఎస్లోకి తీసుకునేది లేదని కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. (మున్సిపల్ ఎన్నికలు : కౌంటింగ్ అప్డేట్స్) -
గుర్తుల ప్రాధాన్యతలను ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న తమకు ఎన్నికల గుర్తులను కేటాయించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ ఎస్.రవి, మరో 15 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలో ఉన్న తమకు ఇప్పటివరకు గుర్తులను కేటాయించకపోవడం, వాటి నమూనాలను ఇవ్వకపోవడం నిబంధనలకు విరుద్ధమని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని తగిన ఆదే శాలు జారీ చేయాలంటూ వారు గురువారం లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేటప్పుడే ఎన్నికల గుర్తుల ప్రాధాన్యతలను పేర్కొంటారని, అలా పిటిషనర్లు ఏం ప్రాధాన్యతలను ఇచ్చారో తమకు తెలియచేయాలని వారిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల సంఘం ఇప్పటి వరకు గుర్తులను కేటాయించకపోవడం వల్ల స్వతం త్ర అభ్యర్థులు నష్టపోతున్నారని తెలిపారు. గుర్తు లేకపోవడంతో ఓటర్లకు ఆ విషయం చెప్పి ఓట్లు అడగలేకపోతున్నారని వివరించారు. 64 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పుడు నిబంధనల ప్రకారం బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని, నిజామాబాద్ బరిలో 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తుంటే, ఎన్నికల సంఘం మాత్రం ఈవీఎంల ద్వారానే ఎన్నిక నిర్వహిస్తామని చెప్పడం సరికాదన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, నామినేషన్ దాఖలు చేసేటప్పుడే స్వతంత్ర అభ్యర్థులు తమ గుర్తుల విష యంలో ప్రాధాన్యతలు ఇస్తారని ఆ వివరాలు తమ ముందుంచాలని ఆదేశించింది. వాటిని పరిశీలించిన తర్వాతనే తదుపరి విచారణను కొనసాగిస్తామని తెలిపింది. నామినేషన్ పత్రా ల ప్రతులను తమకు అప్పగించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలన్న రచనారెడ్డి అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రతీ అభ్యర్థి కూడా నామినేషన్ ప్రతిని తన వద్ద ఉంచుకుంటారని, అందువల్ల వాటిని మీరే సమర్పించాలని రచనారెడ్డికి స్పష్టం చేసింది. -
స్వతంత్రులతో కలవరం
సాక్షి, మచిలీపట్నం : సార్వత్రిక సమరం కీలక దశకు చేరుకుంది. పోరులో పైచేయి సాధించేందుకు ప్రధాన పార్టీలు ఎవరి వ్యూహాలు వారు రచిస్తున్నారు. ప్రధాన పార్టీల మధ్యే పోరు సాగుతున్నా, బరిలో మాత్రం సగానికిపైగా ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. జిల్లాలోని కొన్ని కీలక నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులు.. తాము ఏ విషయంలో తగ్గేది లేదన్నట్టుగా.. ముందుకెళుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఏమాత్రం తగ్గని రీతిలో.. ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం వీరు చీల్చే ఓట్ల ప్రభావం ఎవరిపై పడుతుందోననే ఆందోళన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో నెలకొంది. జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలకు 27 మంది, 16 అసెంబ్లీ స్థానాలకు 205 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో సింహభాగం ఇండిపెండెంట్లు, ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులే ఉన్నారు. వీరిలో ఇతర పార్టీల అభ్యర్థులు, టీడీపీ నాయకులు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బదీసేందుకు స్వతంత్రులను రంగంలోకి దించారన్న ప్రచారమూ సాగుతోంది. బందరు, అవనిగడ్డ, ఇలా అన్ని ప్రధాన నియోజకవర్గాల్లో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, జనసేనతో పాటు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఇతర పార్టీలకు చెందిన నలుగురు, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులు 1000 నుంచి 10,000 ఓట్ల వరకు చీల్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొత్త చిక్కు.. 2014 ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్ సీపీ మధ్య పోరు సాగింది. ప్రస్తుతం రంగంలోకి జనసేన రావడంతో ఏ పార్టీ ఓట్లు చీల్చుతుంది? మూడో పార్టీ రంగ ప్రవేశంతో ఏ పార్టీకి నష్టం కలుగుతుందన్న చర్చ నడుస్తున్న తరుణంలో స్వతంత్రుల పోరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు మరో చిక్కు తెచ్చిపెట్టినట్లయింది. చీల్చేవి తక్కువ ఓట్లయినా రసవత్తర యుద్ధంలో కొన్సిసార్లు అవే కీలకంగా మారే అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీలు ఈ అంశంపై తర్జనభర్జన పడుతున్నాయి. పార్లమెంట్ల పరిధిలో.. బందరు పార్లమెంట్ పరిధిలో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 12 మంది బరిలో ఉండగా.. అందులో 4 ఇండిపెండెంట్లు, మరో 4 రిపబ్లికన్, పిరమిడ్ తదితర పార్టీలకు చెందిన వారు ఉన్నారు. మిగిలిన వారు వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో 15 మంది బరిలో ఉండగా.. 5 ఇండిపెండెంట్లు, 5 మంది పిరమిడ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తదితర పార్టీలకు చెందిన వారు కాగా.. మిగిలిన వారు ప్రధాన పార్టీల అభ్యర్థులున్నారు. అసెంబ్లీ పరిధిలో.. తిరువూరు నియోజకవర్గంలో 12 మంది బరిలో ఉండగా.. అందులో 4 ఇండిపెండెంట్లు, 3 ఇతర పార్టీలు, మిగిలిన వారు ప్రధాన పార్టీలకు చెందిన వారు బరిలో ఉన్నారు. నూజివీడులో 11 మంది పోటీలో ఉండగా.. 3 ఇండిపెండెంట్లు, 4 ఇతర పార్టీలు, మిగిలిన వారు ప్రధాన పార్టీల తరఫున బరిలోకి దిగుతున్నారు. గన్నవరంలో 14 మంది బరిలోకి దిగగా.. 4 ఇండిపెండెంట్లు, 4 ఇతర పార్టీలు, మిగిలిన వారు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ టీడీపీ గిమ్మిక్కు రాజకీయాలకు దిగింది. వైఎస్సార్ సీపీ యార్లగడ్డ వెంకట్రావు పేరును పోలిన పేరుతో ప్రజాశాంతి పార్టీ నుంచి యార్లగడ్డ వెంకట్రామయ్యను రంగంలోకి దింపి వైఎస్సార్ సీపీ ఓట్లను చీల్చే కుట్ర పన్నుతోంది. గుడివాడలో 12 మంది అభ్యర్థులుండగా.. 6 మంది ఇండిపెండెంట్లు, 1 ఇతర పార్టీ, మిగిలినవి ప్రధాన పార్టీలకు చెందిన వారు కాగా.. ఇక్కడ కూడా టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు దిగింది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నానీ) పేరును పోలిన వెంకటేశ్వరరావు కొడాలి అభ్యర్థిని ప్రజాశాంతి పార్టీ నుంచి బరిలోకి దింపుతోంది. కైకలూరులో 14 మంది బరిలో ఉండగా..6 మంది స్వతంత్ర అభ్యర్థులు, ఇద్దరు ఇతర పార్టీ, మిగిలిన వారు ప్రధాన పార్టీల నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పెడనలో 9 మంది పోటీలో ఉండగా 2 స్వతంత్ర, 3 ఇతర, మిగిలిన వారు ప్రధాన పార్టీల నుంచి బరిలోకి దిగుతున్నారు. మచిలీపట్నంలో 8 మంది బరిలో ఉండగా.. ఒక్క స్వతంత్ర అభ్యర్థి, 1 ఇతర, మిగిలినవి ప్రధాన పార్టీ అభ్యర్థులు ఉన్నారు. -
కుమారస్వామి సర్కార్‌కు ఇద్దరు ఇండిపెండెంట్లు షాక్
సాక్షి, బెంగళూర్ : కర్ణాటకలో హైడ్రామా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు బీజేపీ సిద్ధమవుతోందన్న ప్రచారం నేపథ్యంలో ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మంగళవారం తమ మద్దతు ఉపసంహరించకున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు హెచ్ నగేష్, ఆర్ శంకర్లు జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించినట్టు వెల్లడించారు. ప్రభుత్వ మార్పును తాను కోరుకుంటున్న క్రమంలో కుమారస్వామి సర్కార్‌కు మద్దతు ఉపసంహరించాలనే నిర్ణయం తీసుకున్నానని, మకర సంక్రాంతి రోజున ప్రభుత్వ మార్పును అభిలషిస్తున్నామని ఎమ్మెల్యే శంకర్ పేర్కొన్నారు. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్-కాంగ్రెస్ సర్కార్ సుపరిపాలన, నిలకడైన ప్రభుత్వాన్ని అందించడంలో ఘోరంగా విఫలమైందని మరో ఎమ్మెల్యే ఆర్ నగేష్ ఆరోపించారు. సంకీర్ణ భాగస్వామ్య పక్షాల మధ్య ఎలాంటి అవగాహన, సమన్వయం లేదని అన్నారు. సుస్ధిర ప్రభుత్వం ఏర్పడే దిశగా తాను బీజేపీతో జట్టుకట్టాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. కాగా, స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇరువురు మద్దతు ఉపసంహరించినా తమ సర్కార్‌కు ఎలాంటి ప్రమాదం లేదని కాంగ్రెస్ తేల్చిచెప్పింది. బీజేపీ తమ ఎమ్మెల్యేలను డబ్బు, అధికారం పేరుతో ప్రలోభాలకు గురిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి జీ పరమేశ్వర పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని అస్ధిరపరచాలన్న బీజేపీ ప్రయత్నాలు ఫలించబోవన్నారు. కాగా బీజేపీ ఇప్పటికే తమ ఎమ్మెల్యేలను గురుగావ్ రిసార్ట్స్‌కు తరలించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి తర్వాత కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ ఆపరేషన్ లోటస్ పేరుతో వేగంగా పావులు కదుపుతోంది. కుమారస్వామి సర్కార్‌పై అవిశ్వాస తీర్మానానికి బీజేపీ సన్నాహాలు చేస్తోందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. -
మధ్యప్రదేశ్‌లో ‘ఇతరులే’ కింగ్ మేకర్లా?
భోపాల్/దతియా: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీలు గెలుచుకునే సీట్ల మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉంటుందని పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతుండటం తెలిసిందే. అదే జరిగితే, ఈ రెండు పార్టీల్లో ఏ దానికీ, స్పష్టమైన ఆధిక్యం రాకపోతే ఆ రాష్ట్రంలో బీఎస్పీతోపాటు పలు చిన్న పార్టీలు, స్వతంత్రులు కీలక పాత్ర పోషించనున్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పనీ, తమ పార్టీ 12 వరకు సీట్లు గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తుందని ఇప్పటికే బీఎస్పీ నాయకులు అంటున్నారు. ఒక్క టైమ్స్ నౌ–సీఎన్ఎక్స్ సర్వే మాత్రమే బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పగా, సీఎస్డీఎస్ సర్వే ఒక్కటే కాంగ్రెస్ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తుందని పేర్కొంది. మిగిలిన అన్ని సర్వేల్లోనూ ఈ రెండు పార్టీలు సాధించే సీట్ల మధ్య తేడా చాలా స్వల్పంగా ఉంటుందన్నాయి. బీఎస్పీ, ఎస్పీ తదితర పార్టీలు, స్వతంత్రులకు కలిపి 15 సీట్ల వరకు వస్తాయని దాదాపు అన్ని సర్వేలూ చెప్పాయి. కాంగ్రెస్, బీజేపీల్లో ఏదో ఓ దానికి పూర్తి ఆధిక్యం రాని పక్షంలో ఈ చిన్న పార్టీలే, స్వతంత్రులే ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నారు. మళ్లీ మాదే అధికారం: శివరాజ్ సింగ్ మధ్యప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ గెలుస్తుందనీ, వరుసగా నాలుగోసారి అధికారం చేపడుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లకు దాదాపు సమానంగా సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ‘నేను అతిపెద్ద సర్వేయర్‌ను. రోజు మొత్తం ప్రజల మధ్యే గడుపుతా. బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో గెలుస్తుంది’ అని శివరాజ్ అన్నారు. ఎన్నికల్లో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలూ తమ పక్షానే నిలిచారనీ, తామే గెలవబోతున్నామన్నారు. -
ఇవీ ఇండిపెండెంట్ల గుర్తులు
సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తలపడుతున్నఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం 81 గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించింది. వాటిలో దాదాపు 65 గుర్తులను అభ్యర్థులు ఎంచుకున్నారు. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో వీరు ఎంపిక చేసుకున్న గుర్తులు ఇవీ... ఎయిర్ కండిషనర్, బీరువా, బెలూన్, మర్రిచెట్టు, పండ్ల బుట్ట, బ్యాట్, బ్యాట్స్‌మన్, టార్చి, బెల్ట్, సైకిల్, నల్లబల్ల, సీసా, బ్రెడ్, బ్రీఫ్‌కేస్, బకెట్, కేక్, కాలిక్యులేటర్, కెమెరా, కొవ్వొత్తులు, క్యారంబోర్డు, క్యారట్, కాలిఫ్లవర్, చెస్ బోర్డు, కొబ్బరికాయ, కప్పు-సాసర్, గ్యాస్ సిలిండర్, డిష్ యాంటెనా, పల్లకి, విద్యుత్ స్తంభం, కవరు, ఫ్లూట్, గౌను, గ్యాస్ స్టవ్, టోపీ, హెల్మెట్, గరాటా, హాకీ అండ్ బాల్, ఇస్త్రీపెట్టె, లేడీ పర్సు, ల్యాంప్, పోస్డుడబ్బా, సింహం, మిక్సీ, నెక్ టై, పెన్‌స్టాండ్, కుండ, రిఫ్రిజిరేటర్, ఉంగరం, రంపం, కత్తెర, కుట్టుమెషిన్, షటిల్, స్టెతస్కోప్, టేబుల్ ల్యాంప్, టెలిఫోన్, టీవీ, టెంట్, టూత్‌బ్రష్, టార్చి, ట్రంపెట్, గొడుగు, వయోలిన్, విజిల్, నీటిపంపు, ప్రెషర్ కుక్కర్. -
'అభిమానంతోనే పోటీ నుంచి తప్పుకున్నాం'
కర్నూలు: తాము ఆళ్లగడ్డ ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు స్వతంత్ర అభ్యర్థులు సింగం వెంకటేశ్వరరెడ్డి, బాలగంగాధర్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం అంటే ఈ రోజుతో ఉప ఎన్నిక నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో వారిరువురు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అనంతరం వారిరువురు మీడియాతో మాట్లాడారు. భూమా కుటుంబంపై ఉన్న అభిమానంతోనే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. అధికార తెలుగుదేశం పార్టీతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఉప ఎన్నికలో అభ్యర్థి నిలపలేదు. అదికాక స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు కూడా తమ నామినేషన్ ఉప సంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ అభ్యర్థి, భూమా శోభానాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. -
స్వతంత్రులే కీలకం!
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ప్రధాన పార్టీల కూటములు విచ్ఛిన్నం కావడంతో తాజా అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు చక్రం తిప్పనున్నారు. ఒంటి పోరు వల్ల ఏ పార్టీకీస్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో వీరి పాత్ర కీలకం కానుంది. గత ఎన్నికల్లో శివసేన, బీజేపీలు మహాకూటమిగా, కాంగ్రెస్, ఎన్సీపీలు ప్రజాస్వామ్య కూటమిగా పోటీ చేశాయి. ఈసారి సీట్ల పంపకాల్లో విభేదాలతో ఈ కూటముల పొత్తు విచ్ఛిన్నమైంది. ఆ పార్టీలన్నీ వేర్వేరుగా బరిలోకి దిగాయి. ఒంటరి పోరుతో వీటి అభ్యర్థులకు ఎన్నికలు సవాలుగా మారాయి. స్వతంత్ర అభ్యర్థులు ఈ పార్టీల విజయావకాశాలను దెబ్బతీయొచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో మొత్తం 1,686 మంది ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. శివసేన, బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ, ఎమ్మెన్నెస్ తదితర పార్టీల మధ్య పోటీ జరగనుంది. ఇవి సొంత బలంతో పోటీ చేస్తుండడంతో ఓట్లు చీలి ఇండిపెండెంట్లకు లబ్ధి చేకూరే అవకాశముంది. అత్యధిక స్థానాలు గెల్చుకునే ఏ పార్టీకి అయినాసరే ప్రభుత్వ ఏర్పాటుకు స్వతంత్రుల సాయం తప్పనిసారి కావచ్చు. గతంలో..: 1995 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో 3,196 ఇండిపెండెంట్లు పోటీ చేయగా వారిలో 45 మంది గెలిచారు. 2009లో బరిలోకి దిగిన 1,820 స్వతంత్రుల్లో 24 మంది, 1999లో 837 ఇండింపెండెంట్లకు గాకు కేవలం 12 మంది గెలుపొందారు. 2004లో 1,083 మందికిగాను 20 గెలిచారు. -
‘డిపాజిట్లా’..చూద్దాం..!
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: పురపాలక సంఘాలకు జరిగిన పోరులో అభ్యర్థులు చేసిన డిపాజిట్లకు సంబంధించి మొత్తాన్ని అందజేయడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ముఖ్యంగా నామినేషన్లు ఉపసంహరించుకున్నవారికి ఈ చెల్లింపులు జరగాల్సి ఉంది. తొలుత వెంటనే ఇచ్చేస్తామని చెప్పినా ఆ తర్వాత ఆ మాటే పక్కన పెట్టేశారు.అందరికీ నిబంధనలు అమలు పరిచే అధికారులే ఇలా చేస్తే ఎలా అని ఉపసంహరించుకున్న వారు ప్రశ్నిస్తున్నారు. ఇలా 95 మంది చెల్లింపులకోసం ఎదురుచూస్తున్నారు. రూ.పదిలక్షలకు పైగా వసూళ్లు... ఈ ఎన్నికల్లో మున్సిపాలిటీల్లోని 41వార్డులకు గాను వివిధ పక్షాలకు చెందిన అభ్యర్థులతోపాటు, స్వతంత్ర అభ్యర్థులు 462మంది డిపాజిట్లు చెల్లించి నామినేషన్లను దాఖలు చేశారు. వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 1250, జనరల్ అభ్యర్థులు 2,500 వంతున చెల్లించగా మున్సిపాలిటీకి రూ.10లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. వీరిలో ఉపసంహరణ రోజు మార్చి 18న 95మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకొని డిపాజిట్ల ఇవ్వాలని కోరగా తరువాత ఇస్తామని చెప్పి పంపించేశారు. ఇలా మున్సిపాల్టీ వద్ద రూ.2లక్షల వరకు డిపాజిట్ల మొత్తం పేరుకు పోయింది. చెల్లింపుల్లోనే జాప్యమవుతోంది. కౌంటింగ్ అయ్యాక చెల్లింపులు: కమిషనర్ ఈనెల 12న ఓట్ల లెక్కింపు పక్రియ పూర్తవుతోంది, ఆతరువాత ఉపసంహరించుకొన్న అభ్యర్థులంతా తమ రశీదులతో వస్తే వెంటనే వారి డిపాజిట్లను తిరిగి చెల్లిస్తామని మున్సిపల్ కమిషనర్ అమరయ్య తెలిపారు. కొన్ని అనివార్య కారణాల దృష్ట్యా తిరిగి చెల్లించడం అలస్యమైందని, ఇక అలస్యం లేకుండా వారికి చెల్లిస్తామని వెల్లడించారు. -
దడ పుట్టిస్తున్నారు..
పార్టీల అభ్యర్థులకు తలనొప్పిగా మారిన స్వతంత్రులు పోటీలో ఈసారి మరింత ఎక్కువ మంది ఓట్లు చీలుతాయేమోనని ఆందోళన గుర్తులతో ఓటర్లకు పరేషన్ స్వతంత్రులతో పరేషాన్ మోపైంది. ఎంత బుజ్జగించినా వారు బరి నుంచి తప్పుకోకపోవడంతో ఓట్లు చీలుతాయేమోనన్న ఆందోళన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో నెల కొంది. ప్రధానంగా టీఆర్ఎస్ కారు గుర్తును పోలి ఉండే బస్సు, ఆటో రిక్షా గుర్తులొచ్చే స్వతంత్రులు తమ ఓట్లకు గండి కొడుతారని మదనపడుతున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే ఇది నిజమేనని భావించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో గెలుపొందిన నేతలకు స్వతంత్రులు చీల్చిన ఓట్లే కలిసొచ్చాయి.ఇప్పుడు కూడా ఆయా సెగ్మెంట్లలో స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉండడం ప్రధాన పార్టీల నేతల్లో దిగులుకు కారణమైంది. 153 మందిలో 53 మంది స్వతంత్రులు జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 153 మంది పోటీ చేస్తుండగా... వీరిలో 53 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నా రు. ఇక రెండు ఎంపీ స్థానాల్లో 29 మంది బరిలో నిలవగా 13 మంది స్వతంత్ర అభ్యర్థులే ఉన్నారు. అత్యధికంగా మహబూబాబాద్ పార్లమెంట్లో పది మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో నిలవడం విశేషం. అసెంబ్లీ స్థానాలు జనగామ, నర్సంపేట, పాలకుర్తి, భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, ములుగు నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగానే ఉన్నారు. గుర్తులతోనే ఇబ్బంది ప్రధానంగా స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే గుర్తులతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు ప్రమాదం వాటిల్లుతోంది. అంతేకాకుండా కొన్నిచోట్ల స్వతంత్రులకు వేలల్లో ఓట్లు పడడం ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓటమికి కారణమవుతోంది. బస్సు, ఆటో రిక్షా వంటి గుర్తులు పోల్చుకోలేని నిరక్షరాస్యులు ప్రధాన పార్టీల అభ్యర్థులకే వేయాల్సిన ఓట్లను ఈ గుర్తులపై వేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో ప్రతీసారి స్వతంత్రులను బుజ్జగించి పోటీ నుంచే తప్పించే ప్రయత్నాలు చేస్తున్నా వారిలో కొందరు ససేమిరా అంటున్నారు. ఈసారి కూడా అన్ని నియోజకవర్గాల్లో కలిపి 53 మంది స్వతంత్రులు పోటీలో ఉండడం.. ప్రధాన పార్టీల అభ్యర్థులకు వణుకు పుట్టిస్తోంది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో వివరాలు... నియోజకవర్గం గెలిచినఅభ్యర్థి మెజార్టీ స్వతంత్రులకు వచ్చిన ఓట్లు జనగామ 236 9,210 స్టేషన్ ఘన్పూర్ 11,210 11,234 పాలకుర్తి 2,663 9,782 డోర్నకల్ 4,623 4,140 మహబూబాబాద్ 15,367 10,654 నర్సంపేట 8,623 6,094 పరకాల 12,800 10,315 వరంగల్ పశ్చిమ 6,684 6,397 వరంగల్ తూర్పు 7,255 7,344 వర్ధన్నపేట 6,584 10,487 భూపాలపల్లి 11,972 12,576 ములుగు 18,775 17,876 -
‘ప్రాదేశిక’ ప్రచారం సమాప్తం
374 ఎంపీటీసీ, 28 జెడ్పీటీసీలకు ఎన్నికలు రేపు ఎంపీటీసీ బరిలో 969 మంది అభ్యర్థులు జెడ్పీటీసీ స్థానాల్లో వంద మంది అభ్యర్థుల పోటీ ఒంగోలు, న్యూస్‌లైన్: మలిదశ ప్రాదేశిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రం 5 గంటలతో తెరపడింది. ఆరు నియోజకవర్గాల్లోని 9,42,722 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 28 మండలాల్లో ఎన్నికలు: రెండో దశ ప్రాదేశిక ఎన్నికలు ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి, కనిగిరి, కందుకూరు, దర్శి నియోజకవర్గాల్లో 28 మండలాల్లోని 381 ఎంపీటీసీ స్థానాలకు జరగాల్సి ఉంది. వీటిలో దర్శి -2, క్రిస్టియన్‌పాలెం, తాళ్లూరు మండలం మల్కాపురం మండల ప్రాదేశికాలు వైఎస్సార్ సీపీకి ఏకగ్రీవమయ్యాయి. అదేవిధంగా కనిగిరి మండలం చాకిరాలు, పీసీపల్లి మండలం గుదేవారిపాలెం స్థానాలు టీడీపీ ఖాతాకు జమయ్యాయి. ఉలవపాడు మండలం పెదపట్టపుపాలెం, లింగసముద్రం మండలం ముత్యాలపాడు, తాళ్లూరు మండలం మన్నేపల్లి ఎంపీటీసీ స్థానాలకు స్వతంత్ర అభ్యర్థులు ఏకగ్రీవమయ్యాయి. ఏడు ప్రాదేశికాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 374 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 969 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో బీఎస్పీ 5, బీజేపీ 8, సీపీఐ 11, సీపీఎం 16, కాంగ్రెస్ 35, వైఎస్సార్ సీపీ 363, టీడీపీ 363, లోక్‌సత్తా 2, స్వతంత్రులు 166 మంది పోటీలో ఉన్నారు. రెండో దశలో 28 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీఎస్పీ 5, బీజేపీ 2, సీపీఐ 3, సీపీఎం 2, కాంగ్రెస్ 7, వైఎస్సార్ సీపీ 27, టీడీపీ 28, లోక్‌సత్తా 1, స్వతంత్రులు 25 మంది వెరసి మొత్తం వంద మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ తరఫున వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి, చైర్మన్ అభ్యర్థి నూకసాని బాలాజీ జిల్లా అంతటా ప్రచారం నిర్వహించి అభ్యర్థులను, కార్యకర్తలను ఉత్సాహపరుస్తుంటే టీడీపీ నేతలు మాత్రం టికెట్ల వేటలో రాజధానిలో మకాం వేశారు. దీంతో అభ్యర్థుల్లో తీవ్ర నిరాసక్తత కనిపిస్తోంది. ఎన్నికల నిర్వహణకు 6,855 మంది సిబ్బంది: రెండో దశ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 6,855 మంది సిబ్బందిని జిల్లా అధికారులు వినియోగిస్తున్నారు. 1270 పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేశారు. 1,395 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,395 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 4,065 మంది ఇతర పోలింగ్ అధికారులు ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది మొత్తం గురువారం ఉదయం 7 గంటలకల్లా సంబంధిత మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద రిపోర్టు చేయాలని ఇప్పటికే జిల్లా అదనపు ఎన్నికల అధికారి ఆదేశించారు. బ్యాలెట్ బాక్సుల పంపిణీ, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఇతర మెటీరియల్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒంగోలు డివిజన్లో 7 మండలాల్లో, కందుకూరు డివిజన్లోని 21 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. -
స్వతంత్రులే అధికం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(జెడ్పీటీసీ), మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(ఎంపీటీసీ) స్థానాలకు ప్రధాన పార్టీల కంటే స్వతంత్ర అభ్యర్థులే అధికంగా నామినేషన్ వేశారు. సోమవారం అర్ధరాత్రి వరకు అధికారులు కసరత్తు చేసి ఉపసంహరణ అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల జాబితాను మంగళవారం ఉదయం ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా జెడ్పీటీసీ స్థానాలు 52 ఉండగా 269 మంది, ఎంపీటీసీ స్థానాలు 636 స్థానాలకు, 2,654 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో జెడ్పీటీసీ స్థానాలకు స్వతంత్ర అభ్యర్థులు 70 మంది బరిలో ఉండగా,ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు 52 మంది చొప్పున నామినేషన్ వేశారు. ఇక బీజేపీకి 32, టీడీపీకి 43, బీఎస్పీకి 11, సీసీఎం 8, సీసీఐ 1 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. అంటే కాంగ్రెస్, టీఆర్ఎస్లు ఒక్కోస్థానానికి ఒక్కో నామినేషన్ దాఖలు చేయగా, బీజేపీ, టీడీపీలకు అభ్యర్థులు కరువయ్యారు. ఇక, 636 ఎంపీటీసీ స్థానాలకు స్వతంత్రులు 672 మంది పోటీకి దిగగా, కాంగ్రెస్ 599, టీఆర్ఎస్ 593, టీడీపీ 390, బీజేపీ 247, బీఎస్పీ 84, సీపీఐ 42, సీపీఎం 25, వైఎస్సార్ సీపీ 2కి చొప్పున బరిలో నిలిచారు. అంటే ప్రధాన పార్టీలకు కొన్ని స్థానాల్లో అభ్యర్థులు కూడా లేరు. కాంగ్రెస్‌కు 37, టీఆర్ఎస్కు 43, టీడీపీకి 246, బీజేపీకి 389 స్థానాల నుంచి ఎంపీటీసీగా పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారు. -
ప్రచార హోరు
ప్రచారానికి గడువు సమీపిస్తుండడంతో ఆయా మున్సిపాలిటీల్లో అభ్యర్థులు జోరు పెంచారు. ఎండలను సైతం లెక్క చేయకుండా ఇంటింటికీ తిరుగు తున్నారు. ర్యాలీలు నిర్వహిస్తున్నారు. పలు పార్టీల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. వార్డుల్లో కలియ తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ప్రారంభంలో కొద్దిమందితో ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు రోజురోజుకూ మందీ మార్బలాన్ని పెంచుతున్నారు. ఒకరిని చూసి మరొకరు పెద్ద సంఖ్యలో జనాలను పోగేసుకుని ప్రచార హోరులో మునిగిపోయారు. తాండూరు- ఆశీర్వదించమ్మా.. 22వ వార్డులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి వరలక్ష్మి ప్రచారం వికారాబాద్- అవ్వా నీ ఓటు నాకే: కొత్తగడిలో ఓ వృద్ధురాలిని ఓటు వేయాలని కోరుతున్న టీడీపీ చైర్మన్ అభ్యర్థి చిగుళ్లపల్లి రమేష్‌కుమార్ -
ఆమ్ ఆద్మీ తరపున స్వతంత్ర అభ్యర్థులు
కడప రూరల్, న్యూస్‌లైన్: కడప కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ నగర కన్వీనర్, కో కన్వీనర్ సాజిద్ హుసేన్, సుబ్రమణ్యం తెలిపారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కడప కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ తరుపున పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి సరైన సమయంలో బి.ఫారాలు అందించలేక పోయామన్నారు. స్వతంత్య్ర అభ్యర్థులుగా 10వ డివిజన్‌కు డాక్టర్ అశోక్‌కుమార్, 13వ డివిజన్‌కు జీవీ సుబ్రమణ్యం, 14వ డివిజన్‌కు ఎ.నారాయణ, 19వ డివిజన్‌కు ఎం.సుబ్బరాయుడు, 31వ డివిజన్‌కు జఫ్రరుల్లాఖాన్, 32వ డివిజ న్కు సయ్యద్ జావిద్‌బాష, 42వ డివిజన్‌కు మహబూబ్‌పీర్ ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున చీపురు గుర్తుపై పోటీ చేస్తారన్నారు. కార్యక్రమంలో ఆపార్టీ నాయకులు పి.శివారెడ్డి, ప్రమీలాదర్శన్ పాల్గొన్నారు. -
రాజ్యసభ బరిలోకి ఇండిపెండెంట్లు?
రాజ్యసభ బరిలోకి ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థులు రంగప్రవేశం చేయబోతున్నారా? సమైక్యవాదులు అంతా కలిసి అధిష్ఠానం చెప్పిన అభ్యర్థులను కాకుండా, స్వతంత్ర అభ్యర్థులనే గెలిపించబోతున్నారా? ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. అసెంబ్లీ లాబీల్లో బుధవారం నాడు ఆసక్తికరమైన చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ శాసన సభ్యుడు, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ రాజ్యసభ ఎన్నికల గురించి చర్చించుకున్నారు. క్రితం సారిలా ఈ సారి కాంగ్రెస్‌కు నాలుగు రాజ్యసభ సీట్లు రావని, మహా అయితే రెండు సీట్లు మాత్రమే గెలవచ్చునని జేసీ అన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరూ హైకమాండ్ అభ్యర్థికి ఓటు వేసేందుకు సుముఖంగా లేరని కూడా ఆయన చెప్పారు. ఎంఐఎం తరఫున అభ్యర్థిని పోటీకి నిలపాలని అక్బర్‌కు జేసీ సూచించారు. అయితే, అందుకు అక్బర్ సమాధానమిస్తూ, మీరే నిలబడవచ్చు కదా అన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు బలపరుస్తామంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి రాజ్యసభకు పోటీ చేస్తానని జేసీ ఆయనతో చెప్పారు. ఈ దఫా సమైక్యవాదులెవరైనా స్వతంత్రులుగా పోటీచేస్తే రాజ్యసభ అభ్యర్థిగా గెలవడానికి అవకాశముందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తమ తరఫున ఇండిపెండెంట్లను బరిలోకి దింపే ప్రయత్నాలు సాగుతున్నాయని జేసీ వెల్లడించారు.