కడప రూరల్, న్యూస్‌లైన్: కడప కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ నగర కన్వీనర్, కో కన్వీనర్ సాజిద్ హుసేన్, సుబ్రమణ్యం తెలిపారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కడప కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ తరుపున పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి సరైన సమయంలో బి.ఫారాలు అందించలేక పోయామన్నారు.
స్వతంత్య్ర అభ్యర్థులుగా 10వ డివిజన్‌కు డాక్టర్ అశోక్‌కుమార్, 13వ డివిజన్‌కు జీవీ సుబ్రమణ్యం, 14వ డివిజన్‌కు ఎ.నారాయణ, 19వ డివిజన్‌కు ఎం.సుబ్బరాయుడు, 31వ డివిజన్‌కు జఫ్రరుల్లాఖాన్, 32వ డివిజ న్‌కు సయ్యద్ జావిద్‌బాష, 42వ డివిజన్‌కు మహబూబ్‌పీర్ ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున చీపురు గుర్తుపై పోటీ చేస్తారన్నారు. కార్యక్రమంలో ఆపార్టీ నాయకులు పి.శివారెడ్డి, ప్రమీలాదర్శన్ పాల్గొన్నారు.