Press Club
-
పీసీఐ మేనేజింగ్ కమిటీ మెంబర్‌గా పబ్బ సురేశ్‌బాబు
ఢిల్లీ: ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (Press Club of India) మేనేజింగ్ కమిటీ మెంబర్‌గా తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్టు పబ్బ సురేశ్‌బాబు విజయం సాధించారు. ఢిల్లీలోని పీసీఐలో ఎన్నికల పోలింగ్ శనివారం జరగగా.. ఆదివారం ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 1357 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 85 శాతం ఓట్లతో గౌతమ్ లహిరి ప్యానెల్ విజయం సాధించింది. తెలంగాణ బిడ్డ పాలమూరు జిల్లా నడిగడ్డ గద్వాల ప్రాంతానికి చెందిన పబ్బ సురేశ్ 773 ఓట్లతో మేనేజింగ్ కమిటీమెంబర్గా ఎన్నికయ్యారు. కాగా, ఫలితాల అనంతరం సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. పీసీఐ మేనేజింగ్ కమిటీ మెంబర్‌గా గెలుపొందడం సంతోషంగా ఉందన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్యానెల్ దేశ వ్యాప్తంగా జర్నలిస్తుల హక్కుల కోసం పార్లమెంట్ వేదికగా పోరాడుతుందని చెప్పారు. జర్నలిస్ట్ లపై ఎలాంటి దాడులు, సంఘటనలు జరిగినా ఖండించిడంతో పాటు.. వారికి న్యాయం చేకూర్చడంలో ముందుందన్నారు.ఇకపై తెలంగాణ, ఏపీ జర్నలిస్టుల వాయిస్ వినిపించేందుకు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు. తన గెలుపుకోసం సహకరించి ఓట్లతో మద్దతు తెలిపిన పీసీఐ మెంబర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో గౌతమ్ లహిరి ప్యానెల్ మొత్తం బంపర్ మెజారిటితో గెలిచారు.పలువురు స్వతంత్రులుగా బరిలోకి దిగారు. -
Rahul Gandhi: చైనాను అడ్డుకోలేకపోయారు
వాషింగ్టన్: అమెరికా పర్యటనలో పలు అంశాలపై పదునైన వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా చైనా అంశాన్ని ప్రస్తావించారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక నేషనల్ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆయన పత్రికాసమావేశంలో మాట్లాడారు. ‘‘ 4,000 చదరపు కి.మీ.ల భారత భూభాగంలో చైనా బలగాలు తిష్టవేసిన ఉదంతంలో మోదీ సమర్థవంతంగా వ్యవహరించారా అంటే కాదు అనే చెప్తా. లద్దాఖ్‌లో ఢిల్లీ అంత పరిమాణంలో భూభాగాన్ని చైనా బలగాలు ఆక్రమించాయి. ఇది తీవ్ర వైఫల్యం. ఒక వేళ అమెరికాకు చెందిన 4వేల చదరపు కి.మీ.ల భూభాగాన్ని పొరుగుదేశం ఆక్రమిస్తే అమెరికా ఊరుకుంటుందా? ఎలా స్పందిస్తుంది?. ఈ విషయాన్ని అద్భుతంగా చక్కదిద్దానని అమెరికా అధ్యక్షుడు చేతులు దులిపేసుకుంటాడా?. అందుకే ఈ కోణంలో చూస్తే మోదీ చైనా విషయంలో విఫలమయ్యారు’’అని అన్నారు. ‘‘ అమెరికా– భారత్ సంబంధాల విషయంలో మోదీని సమరి్థస్తా. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో అనుసరించిన విధానాలనే ఇప్పుడు మోదీ కొనసాగిస్తున్నారు. అయితే భారత అంతర్గత అంశాల్లో అమెరికా ప్రమేయాన్ని నేను ఏమాత్రం ఒప్పుకోను. భారత్‌లో ప్రజాస్వామ్యం మెరుగు కోసం దేశీయంగా జరుగుతున్న పోరు ఇండియా సొంత విషయం. దీనిని మేమే పరిష్కరించుకుంటాం’’ అని రాహుల్ అన్నారు. నిరాధార ఆరోపణలు: రాజ్‌నాథ్ భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న రాహుల్ వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ స్పందించారు. ‘‘ లోక్‌సభలో విపక్షనేత హోదాలో ఉన్న వ్యక్తి ఇలా తప్పుడు, నిరాధార, అబద్దపు వ్యాఖ్యానాలు చేయడం నిజంగా సిగ్గుచేటు. అసంబద్ధంగా మాట్లాడి విదేశీ గడ్డపై భారత పరువు తీస్తున్నారు. గురుద్వారాకు వెళ్లే సిక్కులు తలపాగా ధరించడానికి కూడా పోరాడాల్సి వస్తోందని రాహుల్ సత్యదూరమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రేమ దుకాణాలు తెరిచానని చెప్పుకుని తిరిగే రాహుల్ .. అబద్ధాల దుకాణాలు నడుపుతున్నారు’’ అనిరాజ్నాథ్ అన్నారు. -
విలువలు లోపించాయి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో రాజ్యాంగ విలువలు లోపించాయని, అధికారం వచ్చాక తాము ఏది చేసినా చెల్లుతుందనే ధోరణి కొనసాగుతోందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జె.చలమేశ్వర్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వేదికగా గురువారం ప్రముఖ పాత్రికేయుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్.. దివంగత నేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి, వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, చంద్రబాబునాయుడు గురించి రచించిన ‘మూడు దారులు’పుస్తక పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ జె.చలమేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయ పరంగా విధివిధానాలు వేరైనా.. ముగ్గురి గమ్యం ఒక్కటేనని అన్నారు. పాదయాత్ర అనంతరం వై.ఎస్. రాజశేఖరరెడ్డి వ్యక్తిత్వంలో చాలా మార్పు వచ్చిందని అన్నారు. ఒక సందర్భంలో వైఎస్‌ను కలసినప్పుడు ఈ విషయాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నానని తెలిపారు. నేరుగా ప్రజల చెంతకు వెళ్లి, వారికి నమ్మకం కల్పించిన నాయకుడే అధికారాన్ని పొందగలుగుతాడని ఆయన పేర్కొన్నారు. వైఎస్ తన పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఆ నమ్మకాన్ని కల్పించి జననేతగా నిలిచారన్నారు. చంద్రబాబు స్వయం ప్రకాశితుడు కాడు.. ఒక పాత్రికేయునిగా తాను చూసిన వాస్తవ సంఘటనలను తన అభిప్రాయాలుగా మూడు దారలుగా తీసుకువచ్చానని రచయిత దేవులపల్లి అమర్ అన్నారు. ఉత్తరాది రాజకీయ నాయకులకు దక్షణాదిలో కొనసాగుతున్న వాస్తవ రాజకీయ పరిణామాలను చేరువ చేయాలనే లక్ష్యంతో ఇదే పుస్తకాన్ని ‘డక్కన్ పవర్ ప్లే’పేరుతో ఇంగ్లిష్‌లో కూడా తీసుకువచ్చానని చెప్పారు. కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలో అసమ్మతి నేతగా కొనసాగి, ప్రజల మొప్పుతో ఆ పార్టీనే తనపైన ఆధారపడేలా ప్రభావితం చేసిన గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని పేర్కొన్నారు. నాలుగు గోడల మధ్య నుంచి ముఖ్యమంత్రిగా వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడని ఆయన అభిప్రాయపడ్డారు. పొత్తులతోనే ఆయన ముఖ్యమంత్రిగా అయ్యారుకానీ, చంద్రబాబు స్వయం ప్రకాశితుడు కారని చెప్పారు. ఒంటరిగా పోటీ చేసిన ప్రతీసారి బాబు ఓడిపోయారన్నారు. 1993లో ఎన్టీఆర్ తనకు జరిగిన మోసాన్ని తిప్పికొట్టి 1994లో మళ్లీ ముఖ్యమంత్రిగా నిలిచారని, కానీ కొద్ది రోజుల్లోనే ఆయనకు వెన్నుపోటు పోడిచి చంద్రబాబు సీఎంగా మారారని అన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన తండ్రికి భిన్నంగా ప్రయాణం చేశారని, ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ నిరాకరిస్తే ఆ పార్టీనే వదిలి ప్రజల చెంతకు చేరారని అన్నారు. కక్షసాధింపుతో ఆ పార్టీ ప్రభుత్వం కేసులు పెట్టినా 16 మాసాలు జైల్లో ఉండి, అనంతరరం ప్రజల మెప్పుతో 2019లో ఏపీ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారని కొనియాడారు. సీనియర్ పాత్రికేయుడు కల్లూరి భాస్కరం, చక్రధర్, రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అధికారమదంతోనే.. 'సాక్షి విలేకరి'పై దాడి!
సంగారెడ్డి: అల్లాదుర్గం సాక్షి విలేకరి వీరేందర్‌పై దాడి చేసిన ఎంపీపీ అనిల్‌రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని దౌల్తాబాద్ ప్రెస్‌క్లబ్ సభ్యులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అండతోనే ఎంపీపీ అనిల్‌రెడ్డి దాడి చేశారన్నారు. పోలీసులు ఎంపీపీపై చర్యలు తీసుకోకపోతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళ చేస్తామని హెచ్చారించారు. కార్యక్రమంలో దౌల్తాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రాజిరెడ్డి, ప్రెస్‌క్లబ్ సభ్యులు శంభులింగం, సంతోష్, నగేష్, బాబు, భాస్కర్ గౌడ్, యాదగిరి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. అల్లాదుర్గం సాక్షి విలేకరి వీరేందర్‌పై ఎంపీపీ అనిల్‌కుమార్‌రెడ్డి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మెదక్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు దొంతి నరేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింహచారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రియాజ్ పేర్కొన్నారు. బుధవారం మెదక్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలికితీసే జర్నలిస్టును అధికారమదంతో దాడికి పాల్పడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. అందిన సమాచారాన్ని బట్టి వార్తలు రాస్తే దుర్భాషలాడుతారా అని ప్రశ్నించారు. ఒకవేళ వార్తలో తప్పుంటే ఖండించాల్సిందిపోయి భౌతిక దాడులకు దిగడం సరైందికాదన్నారు. చంటి క్రాంతికిరణ్ జర్నలిస్టు నాయకుడిగా ఉండి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినా నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యా నించారు. ఎంపీపీ అనిల్‌కుమార్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, పదవి నుంచి బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు పంపాలన్నారు. లేకుంటే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మెదక్ ప్రెస్‌క్లబ్ నాయకులు రాజశేఖర్, బీవీకే రాజు,ప్రకాష్, చింతల రమేశ్, రహమత్, చంద్రశేఖర్ గౌడ్, మువ్వ నవీన్, శ్రీని వాస్చారి, లక్ష్మీనారాయణ, కార్తీక్, రఘు, దుర్గేష్, నర్సింలు, వంశీ ,శ్రీకాంత్, నవీన్‌రెడ్డి, ఊశ య్య, కృష్ణమూర్తి, సాయిలు, హమీద్ పాల్గొన్నారు. టేక్మాల్‌లో ర్యాలీ.. అల్లాదుర్గం విలేకరిపై దాడిని ఖండిస్తూ బుధవారం టేక్మాల్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నల్లాబడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎంపీపీ అనిల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తహసీల్దార్ మల్లయ్యకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ.. అధికారమదంతో జర్నలిస్టులపై దాడులు చేయడం అమానుషమన్నారు. కార్యక్రమంలో టేక్మాల్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు బాగయ్య, సీనియర్ పాత్రికేయులు ఆనంద్, మహేదర్‌రెడ్డి, బీరప్ప, నర్సింలు, పులిరాజు, ధనుంజయ, రాజు, రమేష్, నాయికోటి రాజు, సాయిలు, ప్రేమ్‌కుమార్, నరేందర్, రాము, అశోక్, కుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అల్లాదుర్గంలో.. జర్నలిస్టులపై అధికార పార్టీ నాయకుల దాడులు సహించేది లేదని కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు బలరాం, బీజేపీ జిల్లా నాయకుడు బ్రహ్మం హెచ్చరించారు. బుధవారం తహసీల్దార్ సతీశ్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. అల్లాదుర్గం ఎంపీపీ అనిల్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నాలుగున్నరేళ్లుగా ఎంపీపీగా ఉన్న మీరు అల్లాదుర్గంకు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ దుర్గయ్య, వైఎస్సార్సీపీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు నరేష్ నాయకులు సదానందం,, కేశనాయక్, వంకిడి రాములు, సాయిబాబా, వీరబోయిన సాయిలు, ముసిరిగారి శ్రీను, నితీశ్, లక్ష్మణ్, రాజు ఉన్నారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు.. అల్లాదుర్గం సాక్షి విలేకరి వీరేందర్‌పై దాడి చేసిన ఎంపీపీ అనిల్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని నారాయణఖేడ్ ప్రెస్‌క్లబ్ గౌరవ అధ్యక్షుడు అలీం బుధవారం డిమా ండ్ చేశారు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోని దాడులకు పాల్పడడం అప్రజాస్వామ్యమన్నారు. జర్నలిస్టుపై దాడులు చేయడం.. బెదిరించడం రాజకీయ నాయకులకు ఫ్యాషన్‌గా మారిందన్నారు. -
World Press Freedom Index 2023: ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీలో భారత్ నేలచూపులు
న్యూఢిల్లీ: ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీ–2023లో భారత్ 11 స్థానాలు దిగజారింది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా బుధవారం విడుదల చేసిన నివేదికలో 161వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. 180 దేశాల్లో పత్రికారంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ల ఆధారంగా ఇచ్చే ఈ ర్యాంకుల్లో గతేడాది భారత్ 150వ స్థానంలో నిలిచింది. దీనిపై పత్రికా సంఘాలు ఆందోళన వ్యక్తంచేశాయి. ‘భారత్ సహా పలు దేశాల్లో పత్రికా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కల్గుతోందని స్పష్టమవుతోంది. మీడియా క్రియాశీలక పాత్ర పోషించలేకపోవడం దారుణం’’ అని ది ఇండియన్ విమెన్స్ ప్రెస్ కోర్స్, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ప్రెస్ అసోసియేషన్ ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. -
ఫిరాయింపుల చట్టంలో సవరణలు: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
బెంగళూరు: పార్టీ ఫిరాయింపుల చట్టంలో లొసుగుల పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. అవి మూకుమ్మడి ఫిరాయింపులకు దోహదం చేస్తున్నాయన్నారు. చట్టంలో సవరణలు తేవాలని అభిప్రాయపడ్డారు. ఆదివారం బెంగళూరు ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. పార్టీ మారదలిచిన వాళ్లు రాజీనామా చేసి మళ్లీ గెలుపొందాలన్నారు. ఫిరాయింపుల కేసులపై నిర్ణయాన్ని స్పీకర్లు, చైర్పర్సన్లు, న్యాయమూర్తులు జాప్యం చేస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిరాయింపులపై నిర్ణయం వెలువరించేందుకు కాలపరిమితి ఉండాలన్నారు. స్థానిక సంస్థలను బలో పేతం చేయాల్సిన అవసరముందన్నారు. మీడియా పాత్ర కీలకం దేశంలోని పెనుమార్పుల్లో మీడియా పాత్ర నిర్ణయాత్మకమని వెంకయ్య అన్నారు. కనిపించని వాస్తవాలను వెలుగులోకి తేవాలన్నారు. తన పదవీకాలం మూడు నెలల్లో ముగుస్తుందని, మళ్లీ రాజకీయాల్లోకి రానని చెప్పారు. ఖాళీగా మాత్రం ఉండనని, ఏదో వ్యాపకాన్ని చేపడతానని తెలిపారు. -
హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా వేణుగోపాలనాయుడు
పంజగుట్ట (హైదరాబాద్): ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు ఎల్.వేణుగోపాలనాయుడు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా కె.శ్రీకాంత్‌రావు, మహిళా ఉపాధ్యక్షురాలిగా సి.వనజ, జనరల్ సెక్రటరీగా ఆర్.రవికాంత్‌రెడ్డి విజయం సాధించారు. సంయుక్త కార్యదర్శులుగా రమేశ్ వైట్ల, చిలుకూరి హరిప్రసాద్, ట్రెజరర్‌గా ఎ.రాజేశ్.. ఈసీ సభ్యులుగా ఎ.పద్మావతి, ఎం.రమాదేవి, ఎన్.ఉమాదేవి, పి.అనిల్‌కుమార్, కె.శ్రీనివాస్, బి.గోపరాజు, జి.వసంత్‌కుమార్, ఎం.రాఘవేంద్రరెడ్డి, టి.శ్రీనివాస్, వి.బాపూరావు గెలుపొందారు. మొత్తమ్మీద ప్రెస్ క్లబ్ పాలకవర్గ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. అధ్యక్షుడి నుంచి ఎగ్జిక్యూటివ్ మెంబర్ల (ఈసీ) వరకు మొత్తం 17 స్థానాలకుగాను 70 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రెస్ క్లబ్లో 1,251 మంది యాక్టివ్ ఓటర్లు ఉండగా.. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకు బ్యాలెట్ విధానంలో 1,114 మంది ఓట్లు వేశారు. ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌లతోపాటు వివిధ పత్రికల సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆదివారం రాత్రి 7.30 గంటలకు మొదలైన ఓట్ల లెక్కింపు 12 గంటల సమయంలో ముగిసింది. -
సీఎం కేసీఆర్‌పై భరత్ వాఘ్మారే వివాదాస్పద వ్యాఖ్యలు
పంజగుట్ట: రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుక కోసిన వారికి కోటి రూపాయలు బహుమతిగా ఇస్తానని ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ వాఘ్మారే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కి ధైర్యం ఉంటే తన పదవికి రాజీనామా చేసి రాజ్యాంగం మారుస్తాననే నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లాలని డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆ సంఘం జాతీయ ప్రధానకార్యదర్శి ఎమ్.విజయ్‌కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.నానులు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఈ ఏడేళ్లలో ఒక్కసారి కూడా జయంతి, వర్థంతుల సందర్భంగా ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయలేదని, ఆయనకు అంబేద్కర్ అంటే గౌరవమే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: మోదీ.. తెలంగాణ ద్రోహి) పరిస్థితులకు అనుగుణంగా సవరణ చేసుకోవచ్చని రాజ్యాంగంలోనే ఉందని, ఇప్పటివరకు 130 సార్లు సవరించారని, అలాంటిది ఏకంగా రాజ్యాంగాన్నే మారుస్తామనడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు. వెంటనే అంబేడ్కర్ విగ్రహంవద్ద కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో తలారి గోపాల్, షర్మిల జాదవ్, వినోద్‌కుమార్, సురేందర్, లింగన్న పాల్గొన్నారు. (చదవండి: మాదకద్రవ్యాల వ్యవహారాన్ని ఆటకట్టించేలా ‘హెచ్–న్యూ’) -
అన్ని దానాల్లో కంటే అన్నదానం మిన్న: ఏసీపీ గిరి కుమార్
వరంగల్: అన్ని దానాల్లో కంటే అన్న దానం మిన్న అని వరంగల్ ఏసీపీ శ్రీ గిరి కుమార్ అన్నారు. ఆకలితో అలమటిస్తున్న బడుగు బలహీన వర్గాలకు పాదచారులకు విద్యార్థులకు వైద్య సిబ్బందికి పలని సేవాదళ్ వారు గత మూడు సంవత్సరాల నుంచి అమావాస్య రోజు అన్నదానం నిర్వహించడం హర్షణీయమన్నారు. ఆదివారం రోజు మధ్యాహ్నం శ్రీ భద్రకాళి దేవాలయం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి శ్రీ గిరి కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నదాన కార్యక్రమంలో కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం పట్ల నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తుమ్మ శ్రీధర్ రెడ్డి, పలణి సేవాదళ్ నిర్వాహకులు బొడ్ల రవీంద్రనాథ్, గుండా అమర్నాథ్, నూతన్ కుమార్, లహరి సంతోష్ నరేష్, బొడ్ల సద్గున్, తాటిపల్లి కార్తీక్, పబ్బతి అవినాష్,ఛార్టర్డ్ అకౌంటెంట్ పబ్బతి కవి భరత్, మోదే నాగేందర్, వాకర్స్ అసోసియేషన్ చింతం సారంగపాణి, శ్రీమతి పడిశాల సుజాత తదితరులు పాల్గొన్నారు. సుమారు 600 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. -
ఆధారాల్లేని వార్తలపై దావా వేస్తా: కలహర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బెంగళూరు డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న వార్తలన్నీ నిరాధారమని ఫైనాన్షియర్ కలహర్‌రెడ్డి అన్నారు. తనపై నిరాధార వార్తలు రాసిన ఓ దినపత్రిక, ఓ టీవీ చానల్‌కు త్వరలోనే లీగల్ నోటీసులు పంపుతున్నానని, పరువు నష్టం దావా కూడా వేస్తానని వెల్లడించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్రగ్స్ కేసుతో తనక సంబంధముందంటూ వస్తోన్న వార్తలను ఆయన ఖండించారు. తాను మూడేళ్ల కింద బెంగళూరులో జరిగిన బర్త్ డే పార్టీకి వెళ్లిన మాట వాస్తవమేనని, ఆ పార్టీకి తనతో పాటు వివిధ ప్రాంతాల నుంచి 300 మంది వరకు అతిథులు హాజరయ్యారని గుర్తుచేసుకున్నారు. ఆ రోజు జరిగిన విందులో తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేశారు. తనకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేసిన మాట వాస్తవమేనని, స్టేట్మెంట్ రికార్డు కోసమే తనను పిలిపించారని తెలిపారు. బెంగళూరు పోలీసులకు ఆ రోజు జరిగిన పార్టీకి సంబంధించిన వివరాలు ఇచ్చానన్నారు. అక్కడ స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన డ్రగ్స్ కేసుతో ఎలా సంబంధం అంటగడతారు అని ప్రశ్నించారు. కుటుంబం కలత చెందుతోంది..! డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా.. కొన్ని మీడియా సంస్థలు తన పేరును పదేపదే ప్రస్తావిస్తున్నాయని కలహర్‌రెడ్డి వాపోయారు. ఈ ప్రచారం వల్ల తాను, తన కుటుంబం ఎంతో కలత చెందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా దగ్గర ఆధారాలు ఉంటే వార్తలు రాసుకోవాలని, కానీ అస్సలు సంబంధం లేని తనకు ఈ కేసుతో ముడిపెట్టి వార్తలు రాయడం సరికాదని విజ్ఞప్తి చేశారు. ఇక ఈ కేసుతో సంబంధముందంటూ ఆరోపణలు వస్తోన్న సందీప్‌తో తనకు ముఖ పరిచయమే తప్ప ఎలాంటి ఇతర సంబంధాలు లేవన్నారు. శంకర్‌గౌడతో మాత్రం తనకు ఐదేళ్లుగా స్నేహం ఉందని తెలిపారు. తెలంగాణ ఎమ్మెల్యేలు రాలేదు.. మీడియా సమావేశం అనంతరం ‘సాక్షి’ కలహర్రెడ్డిని ఫోన్లో సంప్రదించింది. ఈ సందర్భంగా కలహర్‌రెడ్డి మాట్లాడుతూ, ఈ కేసుతో సంబంధం లేకున్నా తన పేరును ప్రస్తావిస్తోన్న ఓ దినపత్రిక, మరో న్యూస్ చానల్‌కు త్వరలోనే లీగల్ నోటీసులు పంపుతానని స్పష్టం చేశారు. తన ఫేస్బుక్ వాల్‌పై నుంచి అనుమతి లేకుండా తనవి, తన మిత్రుల ఫొటోలను డౌన్లోడ్ చేసి ఎలా టెలికాస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడం కాదా? అని ప్రశ్నించారు. ఈ విషయంలోనూ తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఆ బర్త్‌డే పార్టీ కూడా 2018 అక్టోబర్‌లో జరిగిందని, సదరు పార్టీకి తెలంగాణ ఎమ్మెల్యేలు ఎవరూ రాలేదని అన్నారు. శంకర్‌గౌడ, తాను సినిమా ఇండస్ట్రీకి చెందినవాళ్లమని ఐదేళ్ల క్రితం నుంచి ఆయనతో పరిచయం ఉందని వెల్లడించారు. చదవండి: చితికిన జీవితం.. విద్యావలంటీర్ బలవన్మరణం -
ఓటమి భయంతోనే చంద్రబాబు డ్రామాకు తేరతీశారు
-
మరో వివాదంలో కమల్: వైరల్ పిక్
సాక్షి, చెన్నై: ప్రముఖ నటుడు మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) చీఫ్, కమల్ హాసన్‌ను మరో వివాదంలో ఇరుక్కున్నారు. పోలింగ్ రోజు (మంగళవారం) కమల్‌హాసన్ ఒక రిపోర్టర్‌పై దాడి చేశారంటూ ఆరోపణలు గుప్పుమన్నాయి. రిపోర్టర్‌ను కొట్టానికి ప్రయత్నించారంటూ కోయంబత్తూర్ ప్రెస్ క్లబ్ ఈ ఘటనను ఖండించింది. సోషల్ మీడియా వేదిక ఫేస్బుక్ పోస్ట్‌లో కమల్‌పై ఆరోపణలు గుప్పించింది. ఈ సందర్భంగా రిపోర్టర్‌ను కొట్టడానికి కమల్ తన వాకింగ్ స్టిక్ పైకి లేపిన చిత్రం వైరల్ అవుతోంది. దీంతో వివాదం రగిలింది. కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గంలోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కమల్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రెస్ క్లబ్ డిమాండ్ చేస్తోంది. వీడియోను చిత్రీకరించవద్దని డిమాండ్ చేస్తూ కమల్ అడ్డుకున్నాడని రిపోర్టర్‌ను తన వాకింగ్ స్టిక్ తో కొట్టడానికి ప్రయత్నించాడని క్లబ్ ఆరోపించింది. అదృష్టవశాత్తూ అతడు గాయపడకపోయినా, కర్ర అంచు అనుకోకుండా జర్నలిస్టు మెడకు తగిలి ఉంటేపరిస్థితి దారుణంగా ఉండేదని ఆరోపించింది. ఈ ఘటన తమను, తమ పాత్రికేయ బృందాన్ని షాక్‌కు గురి చేసిందని తెలిపింది. అంతేకాదు దీనికి చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని కూడా హెచ్చరించడం గమనార్హం. అటు న్యూస్ జర్నలిస్ట్ దాడి ఘటనను ఖండించిన కాంగ్రెస్ అభ్యర్థి మయూరా జయకుమార్, బీజేపీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు వనాతి శ్రీనివాసన్ కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ ఆరోపణలపై అటు కమల్ గానీ, ఎంఎన్ఎం గానీ అధికారికంగా స్పందించాల్సి ఉంది. இன்று கோவையில் #SunTV செய்தியாளர் மோகனை, மக்கள் நீதி மைய தலைவர் #கமலஹாசன் தாக்கியதாக தகவல் அறிந்தேன் சம்பவத்தை கண்டிக்கின்றேன் உடனடியாக கமலஹாசன் நடந்த சம்பவத்திற்கு மன்னிப்பு கோர வேண்டும் pic.twitter.com/gRgvr5tOWu — Mayura Jayakumar (@MayuraSJ) April 7, 2021 இன்று காலை கோவை ஜிசிடி கல்லூரி வளாகத்தில் திரு கமலஹாசன் அவர்கள் சன் நியூஸ் பத்திரிக்கையாளர் திரு மோகன் அவர்களை தனது கைத்தடியால் தாக்கியதாக கேள்விப்பட்டேன். இது மிகவும் வருத்தத்தை அளிக்கின்றது. — Vanathi Srinivasan (@VanathiBJP) April 7, 2021 -
బలమైన శక్తుల పేర్లు ఉన్నందు వల్లేనా!?
న్యూఢిల్లీ/అమరావతి: అమరావతిలో భూ కుంభకోణంపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ వివరాలను మీడియా ప్రచురించకూడదన్న ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఈ విషయం గురించి జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఆనంద్ సహాయ్ గురువారం సాక్షి టీవీతో మాట్లాడారు. ఏపీ హైకోర్టు ఉత్తర్వులు తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయన్నారు. నేర న్యాయ వ్యవస్థ(క్రిమినల్ జస్టిస్ సిస్టం)లో తొలి మెట్టు ఎఫ్ఐఆర్ అని, ఇంతటి ప్రాముఖ్యం కలిగిన ఎఫ్ఆర్పైను రిపోర్టు చేయకూడదని చెప్పడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.(చదవండి: ఈ తీర్పును పునఃసమీక్షించాల్సిందే) హైకోర్టు ఉత్తర్వులు ప్రాథమిక హక్కులను హరించే విధంగా ఉన్నాయని, బలమైన శక్తుల పేర్లు ఎఫ్ఐఆర్లో ఉండటం వల్లే ఇలా చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. అసలు విచారణ జరిగితేనే నిజానిజాలు పాలూ, నీళ్లలా తేలిపోతాయని, అలాంటప్పుడు దర్యాప్తునకు అడ్డుపడటం ఎందుకు అని ఆనంద్ సహాయ్ ప్రశ్నించారు. ఇలా మీడియా గొంతును నొక్కడం ప్రజాస్వామ్యాన్ని హరించడమేనన్నారు. హైకోర్టు తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. (చదవండి: హైకోర్టు ఉత్తర్వులు: కారణాలు సహేతుకంగా లేవు!) -
ప్రెస్‌క్లబ్‌లో ఫైటింగ్..!
సాక్షి, హైదరాబాద్ : సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఘర్షణ జరిగింది. ఐసీఎస్ అధికారి, గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఎస్సీ, ఎస్టీ పరిరక్షణ సమితి నేత శ్రీశైలం మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, ఈ సమావేశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్వేరోస్ మెంబర్స్ శ్రీశైలంపై దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇక న్యూస్ కవరేజీ కోసం వచ్చిన మీడియా ప్రతినిధులపై కూడా స్వేరోస్ సభ్యులు దాడి చేశారు. దాడి ఘటనపై శ్రీశైలం పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దారుణాలను ఎండగడతారనే దాడి..! దళిత నేత శ్రీశైలంపై స్వేరోస్ సభ్యుల దాడిని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్ ఖండించారు. గురుకులాల్లో ప్రవీణ్‌కుమార్ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రవీణ్‌కుమార్ అండదండలతో స్వేరోలు రెచ్చిపోతున్నారని, కాంట్రాక్టు ఉద్యోగుల పేరిట గురుకుల పాఠశాలల్లో చేరి గచ్చిబౌలిలో, ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని అన్నారు. తమ బాగోతాన్ని బయటపెడతాడనే స్వేరోలు శ్రీశైలంపై దాడికి తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలంపై దాడి చేసిన గూండాలను కఠినంగా శిక్షించాలని కిరణ్ డిమాండ్ చేశారు. స్వేరోస్ (స్టేట్ వెల్ఫేర్ ఎయిరో) అంటే జాతి సంక్షేమం కోసం ఆకాశం (అనంతం) హద్దుగా పనిచేసేవారు అని అర్థం. గురుకులాలలో చదివిన పూర్వ విద్యార్థులు అంతా ఒక కమిటి గా ఏర్పడి గురుకులాలను అభివృద్ధి చేసే ఉద్దేశంతో 2012 అక్టోబర్ 19న ఈ సంస్థను స్థాపించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఘర్షణ -
సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఘర్షణ
-
రామన్న గెలుపుకోసం పూజలు
ఆదిలాబాద్‌టౌన్/ఎదులాపురం: ఆదిలాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి జోగురామన్న గెలుపును ఆకాంక్షిస్తూ ముదిరాజ్ సంఘం రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పుష్పలత ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్‌లోని ఉజ్జయిని మాతా ఆలయం నుంచి తీసుకొచ్చిన కుంకుమను శుక్రవారం ఆపద్ధర్మ మంత్రి జోగు రామన్న నివాసంలో ఆయనను కలిసి తిలకం దిద్దారు. ఈ ఎన్నికల్లో కారు జోరుగా దూసుకెళ్తుందన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు శివయ్య, మహిళ నాయకులు తదితరులు ఉన్నారు. అభివృద్దే టీఆర్ఎస్ను గెలుపిస్తుంది ఎదులాపురం: టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే మళ్లీ ఆ పార్టీని అధికారంలోకి తీసుకువస్తాయని ముదిరాజ్ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పుష్పలత ముదిరాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రింట్ మీడియా ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమంకోసం టీఆర్ఎస్ చేసిన కృషిని ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధిని టీఆర్ఎస్ నాలుగేళ్లలో చేసి చూపిందన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సలేందర్ శివయ్య ముదిరాజ్, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షరాలు శకుంతల ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు, షాద్‌నగర్ టీఆర్ఎస్ అధ్యక్షురాలు ప్రేమకళ ముదిరాజ్, మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు గోదావరి, అనిత, సరోజ, లస్మన్న, దారవేణి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చేందుకు MEFI ఏర్పాటు
-
జర్నలిస్టుల సమస్యలపై 4న ‘చలో ఢిల్లీ’
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం టీయూడబ్ల్యూజే(ఐజేయూ) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ తెలిపారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలోనే గవర్నర్‌ను కలవనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో నాలుగేళ్లలో 220 మంది జర్నలిస్టులు అకాల మరణం పొందారన్నారు. జర్నలిస్టుల హెల్త్‌కార్డులు ఎక్కడా పనిచేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో జర్నలిస్టుల అకాల మరణాల నిలుపుదల కోసమే టీయూడబ్ల్యూజే చలో ఢిల్లీకి పిలుపునిచ్చిందని చెప్పారు. జర్నలిస్టులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని, ఎలక్ట్రానిక్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. మీడియా స్వేచ్ఛను హరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ సెప్టెంబర్ 1న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయనున్నట్లు చెప్పారు. త్రిపుర, అస్సాంలో మాదిరిగా దేశ వ్యాప్తంగా 60 ఏళ్లు నిండిన జర్నలిస్టులకు రూ.10 వేల పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టాలన్నారు. ఐజేయూ సీనియర్ నేత కె. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ వేజ్‌బోర్డు సిఫారసులు అమలు చేయాలని చాలా కాలంగా కోరుతున్నా పరిష్కారాం కావటంలేదన్నారు. జర్నలిస్టుల సంఘాలతో మంత్రి కేటీఆర్ చర్చలు జరిపినా ఫలితం కనపడటంలేదన్నారు. -
నా భర్త మోసం చేశాడు
ప్రొద్దుటూరు క్రైం : తన ఇంటిని అమ్మడమే గాక మరో పెళ్లి చేసుకోడానికి తన భర్త ప్రయత్నిస్తున్నాడని ఇస్లాంపురం వీధికి చెందిన షేక్.నస్రీన్ అనే మహిళ తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆమె ప్రజాసంఘాలతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. తనకు ముంబయికి చెందిన ఇబ్రహీంతో వివాహం అయిందన్నారు. తన బంగారు నగలను విక్రయించి 2011లో ఇంటిని కొన్నట్లు తెలిపారు. ఆ ఇల్లు తన భర్త పేరుతోనే ఉండటంతో 5 నెలల నుంచి వేధిస్తున్నాడన్నారు. తనను భర్త శారీరకంగా, మానసికంగా వేధిస్తుండటంతో రిమ్స్‌లోని ఐసీడీఎస్ ఉమెన్సెల్కు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఇళ్లు అమ్మేశాడని, రూ.15 లక్షల ఇంటిని రూ.2.5 లక్షలకు మాత్రమే తన బంధువులకు రాయించినట్లు ఆమె తెలిపారు. తన స్లాబ్ ఇంటిని చౌడు మిద్దెగా చూపించి తప్పుడు రిజిష్టర్ చేయించాడన్నారు. అయితే రిజిస్ట్రార్ అధికారులు చూడకుండా ఎలా రిజిష్టర్ చేస్తారని ఆమె ప్రశ్నించారు. దీనిపై కలెక్టర్, జిల్లా జడ్జికి ఫిర్యాదు చేస్తానన్నారు. ఈ విషయమై పెద్ద మనుషులతో మాట్లాడటానికి ఆమె నాలుగు రోజుల క్రితం జమ్మలమడుగుకు వెళ్లగా తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉన్న సామాన్లను లారీలో తరలించి ఇల్లు ఖాళీ చేశాడన్నారు. నాలుగు రోజుల నుంచి తన ఏడేళ్ల కుమార్తెతో కట్టుబట్టలతో రోడ్డుపాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో తన అమ్మగారింట్లో ఆశ్రయం పొందుతున్నామని తెలిపారు. తనను వేధింపులకు గురి చేయడమే కాకుండా రెండో పెళ్లి చేసుకొని సౌదీకి వెళ్లేందుకు తన భర్త ప్రయత్నిస్తున్నాడని నస్రీన్ పేర్కొన్నారు. గతంలో తన భర్తపై ముంబయి, సౌదీలో కేసులున్నాయని ఆమె ఆరోపించారు. తన తల్లిదండ్రులు కొనిచ్చిన వస్తువులన్నీ అతను తీసుకెళ్లాడని చెప్పారు. అందులో బంగారు నగలు, దుస్తులు, ఫ్రిజ్, వాషింగ్ మిషన్ ఉన్నాయన్నారు. గతంలోనే నేర చరిత్ర ఉన్న తన భర్తపై వెంటనే కేసు నమోదు చేసి పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. ఇప్పటికే ఎస్పీ, వన్‌టౌన్ సీఐ, డీఎస్పీకి ఫిర్యాదు చేశానని చెప్పారు. విలేకరుల సమావేశంలో ప్రజాసంఘాల నాయకులు ఖలందర్, శ్రీను, లక్ష్మిదేవి, మెహరున్నిసా, హరిత పాల్గొన్నారు. -
‘ముఖ్యమంత్రులు ప్రెస్మీట్లు పెట్టట్లేదు’
సాక్షి, హైదరాబాద్ : వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రెస్మీట్లు పెట్టట్లేదని, మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు వారు సిద్ధంగా లేరని ప్రముఖ జర్నలిస్టు, ఇండియా టుడే కన్సల్టింగ్ గ్రూపు ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ 53వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న ఆయన ‘మీడియా ఇన్ బ్రేకింగ్ న్యూస్ ఎరా’ అనే అంశంపై మాట్లాడారు. హైదరాబాద్ అనేక మంది గొప్ప పాత్రికేయులను ఇచ్చిందని, ఇక్కడికి రావడం తనకు గర్వంగా ఉందని ఈ సందర్భంగా అన్నారు. ప్రస్తుత మీడియాను అడ్వటైజ్మెంట్ విభాగాలే శాసిస్తున్నాయిని అన్నారు. కేవలం సంచలనాల కోసమే ఇప్పటి మీడియా ప్రయత్నిస్తుందని, ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం, వ్యవసాయంపై అవసరమైన మేర స్పందించట్లేదని పేర్కొన్నారు. సోషల్ మీడియా విస్తరణ తర్వాత అందరూ జర్నలిస్టులుగా వ్యవహరిస్తున్నారని, అయితే సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య వార్తాలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
నాకు న్యాయం చేయండి
సిద్దిపేటకమాన్ : రెండో పెళ్లికి సిద్ధమైన తన భర్త నుంచి తనకు న్యాయం చేయాలని సిర్సినగండ్లకు చెందిన సరిత కన్నీటి కన్నీటి పర్యంతమైంది. ఆడపిల్లలు పుట్టారనే నెపంతో విడాకులు తీసుకుంటున్నట్లు లాయర్ ద్వారా నోటీస్ ఇప్పించి, అనంతరం నా న్యాయవాదితో కుమ్మక్కై థర్డ్ పార్టీ డైవోర్స్ వచ్చినట్లు పత్రాలు సృష్టించాడని ఆవేద వ్యక్తం చేసింది. మంగళవారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న తనకు సిర్సినగండ్లకు చెందిన తాటిపాముల శ్రీనివాస్‌తో 2006 లో విహాహం జరగగా, 2008లో మొదటి పాప, 2015లో రెండో పాప పుట్టిందని తెలిపింది. రెండవ పాప పుట్టిన అనంతరం తాను పుట్టింకి వెళ్లగా భర్త రాలేదని, కనీసం ఇంటికి రమ్మని కూడా అనలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత డైవోర్స్ కేసు ఫైల్ చేసి, నా తరపు లాయర్‌తో కుమ్మక్కై తనకు తెలియకుండానే ఎక్స్ పార్టీ డైవోర్స్ తీసుకున్నాడని కన్నీటి పర్యంతం అయ్యింది. ఆ కాపీని అందరికి చూపిస్తూ మరో పెళ్లికి సిద్ధమవుతున్నాడని తెలిపింది. ఈ నెల 6న చేర్యాల మండలం మర్రిముచ్చాలకు చెందిన ఓ అమ్మాయితో కొమురవెల్లి దేవస్థానంలో పెళ్లికి సిద్ధమవ్వగా తాను కేసు పోలీసులకు ఫిర్యాదు చేయగా పెళ్లి ఆపారని తెలిపింది. గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారని చెప్పింది. గ్రామంలో మంగళవారం పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడడానికి వెళ్లగా భర్త రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. పెద్ద మనుషులు అతనికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని, ఆ తర్వాత స్విచ్ఛాప్ చేసుకున్నాడని తెలిపింది. తన లాగే మరో అమ్మాయి మోస పోకుండా ఉండాలనే విలేకరుల సమావేశం నిర్వహించినట్లు చెప్పింది. -
నేను అలా మాట్లాడలేదు.. వక్రీకరించారు
బెంగళూరు: ప్రెస్‌క్లబ్‌లో తాను మాట్లాడిన విషయాలను వక్రీకరించి మీడియాలో ప్రసారం చేశారంటూ నటుడు ప్రకాశ్‌రాజ్ తాజాగా బెంగళూరు ప్రెస్‌క్లబ్‌కు ఓ బహిరంగ లేఖ రాశారు. విలేకరుల ఆహ్వానం మేరకు ప్రకాశ్‌రాజ్ ఆదివారం బెంగళూరుకు వచ్చి పలు విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించడం తెలిసిందే. సినీనటులు రాజకీయాల్లోకి రావడం దౌర్భాగ్యమనీ, వారికి ఓటేయ్యొద్దని తాను ప్రచారం చేస్తాననీ ప్రకాశ్‌రాజ్ అన్నట్లు ఆ రోజున టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. అటు తమిళనాడులో కమల్‌హాసన్, రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై చర్చ జరుగుతుండటం, ఇటు కర్ణాటకలో ఉపేంద్ర కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా ప్రకాశ్‌రాజ్ వివరణ ఇస్తూ, తాను అసలు అలా మాట్లాడలేదనీ, విలేకరులందరూ అక్కడ ఉండగానే, ప్రెస్‌క్లబ్ సాక్షిగా తన మాటల్ని ఇంతలా వక్రీకరించడం దారుణమని అన్నారు. ఈ తప్పును సరిదిద్దేందుకు ప్రెస్‌క్లబ్ ఏం చర్య తీసుకుంటుందోనని తాను ఎదురు చూస్తున్నాననీ, తనకు తగిన సమాధానం లభిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. -
డ్రగ్స్ విక్రయదారులను దేశ ద్రోహులుగా ప్రకటించాలి
హైదరాబాద్: సినీ పరిశ్రమను ఒక కుదుపు కుదుపుతున్న డ్రగ్స్ వ్యవహారంపై సినీ నిర్మాత, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీష్ రెడ్డి స్పందించారు. మాదక ద్రవ్యాల మత్తులో మానవ సమాజం అనే అంశంపై సోమజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన చర్చా వేదికలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ విక్రయదారులను దేశద్రోహులుగా పరిగణించే విధంగా కఠిన చట్టాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు. డ్రగ్స్ మాఫియాను తీవ్రవాదులుగా పరిగణించి, వారిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీని కోరారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ కేసు దర్యాప్తు నత్తనడకగా జరుగుతోందన్నారు. డ్రగ్స్ అనర్థాలపై యువజన కాంగ్రెస్, స్వచ్ఛంద సంస్థలు యువతకు అవగాహన కల్పించాలని కోరారు. డ్రగ్స్ కేసులో ప్రభుత్వం రోజుకో సీనీనటులను దర్యాప్తు పేరుతో కాలయాపన చేస్తోందని అంతే తప్ప కేసులో పురోగతి లేదన్నారు. కేసులో పురోగతికి సిట్ అడుగులేయాలని పొంగులేటి చూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాస్, సూర్యప్రకాష్ రావు, మాజీ పోలీస్ అధికారి గోపీనాథ్ రెడ్డి, సినిమా రంగానికి చెందిన జొన్నవిత్తుల, త్రిపుర నేని చిట్టి, తెలంగాణ యువజన కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు వెంకట్, ఏఐఎస్ఎఫ్ తెలంగాణ అధ్యక్షుడు వేణు, పీడీఎస్‌యూ అధ్యక్షుడు ప్రభులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రాష్ట్రంలో నియంతృత్వ పాలన
ఎదులాపురం (ఆదిలాబాద్) : రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని బీజేపీ అసెంబ్లీ ఇన్చార్జి నాంపల్లి వేణుగోపాల్ ఆరోపించారు. శనివారం పట్టణంలోని ప్రింట్ మీడియా ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మత పరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో శుక్రవారం బీజేపీ తలపెట్డిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ నాయకులను ఎక్కడికక్కడే అరెస్టు చేయడం సరికాదన్నారు. అసెం బ్లీలో ప్రతిపక్షాల వాణిని వినాల్సింది పోయి, వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ బద్ధంగా నిరసన తెలుపుకునే హక్కు ప్రతీఒక్కరికి ఉందని, ఇందిరా పార్కు వద్ద గల ధర్నా చౌక్‌ను ఎత్తివేస్తూ నగర శివారుకు మా ర్చడం ఎంతవరకు స మంజసమన్నారు. అసెంబ్లీలో మాట్లాడని వ్వకుండా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం సరి కాదని మండిపడ్డారు. స స్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశా రు. మతపరమైన రిజర్వేషన్ల పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. పార్టీ జిల్లా కార్యదర్శి జోగు రవి, పట్టణ అధ్యక్షుడు ఆకుల ప్రవీణ్, గిరిజనమోర్చా రాష్ట్ర కార్యదర్శి గటిక క్రాంతికుమార్, నాయకులు గండ్రత్ మహేందర్, తోట పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
పాత్రికేయులు పోరాటయోధుల్లా ఉండాలి
-
పాత్రికేయులు పోరాటయోధుల్లా ఉండాలి
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ సీకే ప్రసాద్ ప్రభుత్వంతో పాత్రికేయులకు సంఘర్షణ ఉండాల్సిందే విశ్వసనీయత కోల్పోతే విలువ ఉండదని వ్యాఖ్య ‘సమకాలీన జర్నలిజంలో నైతిక విలువలు’ అంశంపై సదస్సు సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టులు సత్యం కోసం పోరాటం చేసే యోధులుగా ఉండాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ ప్రసాద్ అన్నారు. ‘సమకాలీన జర్న లిజంలో నైతిక విలువలు’ అంశంపై గురు వారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన జాతీ య సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొ న్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వంతో పాత్రికేయులకు సంఘర్షణ వాతావరణం ఉండాల్సిందేనని, అలాంటి వైఖరి లోపించిన రోజు ప్రజాస్వామ్యానికి అత్యంత విచారక రమైన రోజవుతుందని పేర్కొన్నారు. రామ రాజ్యం ఎలా ఉండా లనే దానిపై విస్తృతమైన చర్చ జరుగుతూ వచ్చిందని చెప్పారు. రామరాజ్యం ఏర్పడేంతవరకు ప్రభుత్వానికి, మీడియాకు మధ్య ఘర్షణ వైఖరి తప్పదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న వారితో జర్నలిస్టుల స్నేహపూర్వక సంబంధాలను వ్యక్తి గతంగా తాను వ్యతిరేకిస్తానన్నారు. పాత్రికేయులు సమాజానికి చేస్తున్న సేవను చూసి దేశం గర్వపడుతోందని వ్యాఖ్యానించారు. ప్రశ్నించడం పాత్రికేయుని విశిష్ట లక్షణం ఎంతటి సంపన్నులనైనా, శక్తిమంతులనైనా ప్రశ్నించగలగడమనేది జర్నలిస్టులకు ఉండే ప్రత్యేక లక్షణమని, ఈ విశిష్టతను యువ జర్నలిస్టులు మరింతగా సొంతం చేసుకో వాలని జస్టిస్ ప్రసాద్ సూచించారు. ఎవరినైనా సరే ప్రశ్నించగలిగే జర్నలిస్టు ఆత్మవిశ్వాసం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని తెలిపారు. రాజకీయ నాయకులు ఇచ్చిన ప్రకటనను తప్పుగా అర్థం చేసుకోవడంపై పలు ఫిర్యాదులు ప్రెస్ కౌన్సిల్‌కు అందు తున్నాయని చెప్పారు. ‘హరియాణాలో దళితుల హత్యలను వీధి కుక్కలను రాళ్లతో కొట్టి చంపడం వంటిదని ఓ కేంద్ర మంత్రి చెప్పి నట్లుగా మీడియాలో రావడంతో దేశంలో పెద్ద అలజడి రేగింది. దీనిపై పరిశీలన జరిపితే.. మంత్రి ప్రకటనను మీడియా తప్పుగా అన్వ యించుకున్నట్లు తేలింది’ అని పేర్కొన్నారు. కోడ్ ఆఫ్ కాండక్ట్ అవసరమే.. జర్నలిస్టులకు కూడా ప్రవర్తన నియమావళి అవసరమని జస్టిస్ ప్రసాద్ అన్నారు. చట్ట విరుద్ధమైన పనులు చేయడానికి, ప్రజలను బెదిరించి సంపాదించుకోవడానికి కొందరు జర్నలిస్టులు తమ వృత్తిని కవచంగా వాడుకుంటున్నారని ఈ ప్రాంతం నుంచే కొన్ని ఫిర్యాదులు అందాయని చెప్పారు. విశ్వసనీయతను కోల్పోయిన పాత్రికేయు డికి విలువ ఉండదని చెప్పారు. మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ మీడియా కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సదస్సులో ఐజేయూ అధ్యక్షుడు సిన్హా, ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ప్రెస్ కౌన్సిల్ సభ్యులు ప్రకాశ్ దూబే, అమర్నాథ్, ఎడిటర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ కృష్ణప్రసాద్ తదితరులు ప్రసంగించారు. జస్టిస్ ప్రసాద్‌ను టీయూడబ్ల్యూజే, హైదరాబాద్ ప్రెస్ క్లబ్, వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్, మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. -
ప్రెస్ క్లబ్లో మీడియా ఎధిక్స్ పై సెమినార్
-
సత్యదేవుని వ్రతాల్లో జర్నలిస్టులకు అవకాశం
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ) : పెదవాల్తెరు కరకచెట్టు పోలమాంబ ఆలయంలో మార్చి 5న నిర్వహించనున్న సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాల్లో పాత్రికేయులు పాల్గొనవచ్చని వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి ఎస్.దుర్గారావు తెలిపారు. హిందూ ధర్మపరిరక్షణ ట్రస్ట్, దేవాదాయ శాఖ, అన్నవరం వీరవేంకట సత్యనారాయణస్వామి దేవస్థానం సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారన్నారు. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం పోస్టర్ ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ కరకచెట్టు పోలమాంబ దేవాలయం, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ వెబ్ చానల్స్ సంయుక్తంగా నిర్వహించనున్న ఉచిత సత్యనారాయణస్వామి వ్రతాల్లో జర్నలిస్టులు పాల్గొనాలని కోరారు. వివరాలకు 9154576846, 9246673421 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో వీజేఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. -
మార్చి చివరికి పోస్టాఫీసుల్లో పాస్‌పోర్టు సేవలు
హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి హైదరాబాద్: తెలంగాణ, ఏపీలో మార్చి చివరి నాటికి నాలుగు పోస్టాఫీసుల్లో పాస్‌పోర్ట్ సేవలు ప్రారంభించనున్నామని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్ బేగంపేట్ పాస్‌పోర్టు సేవా కేంద్రంలో జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన మేళాను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వరంగల్, మహబూబ్‌నగర్.. ఏపీలోని కర్నూలు, కడపలోని పోస్టాఫీసుల్లో పాస్‌పోర్ట్ సేవలు ప్రారంభిస్తున్నామని చెప్పారు. పాస్‌పోర్టు అనేది ప్రతి పౌరుడి హక్కని.. అది విదేశాల్లో ఉన్నత విద్య పొందేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. డిసెంబర్ నెల నుంచి పాస్‌పోర్ట్ పొందడం సులభతరం చేయడంతో 30 శాతం దరఖాస్తులు పెరిగాయని వివరించారు. జర్నలిస్టుల కోసం అవసరమైతే ఇలాంటి మేళాలు మరిన్ని చేపడతామని విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాజమౌళి చారి మాట్లాడుతూ.. జర్నలిస్టుల కోసం ప్రత్యేక మేళా ఏర్పాటుచేసి పాస్‌పోర్ట్ సేవలు అందించడం హర్షదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యదర్శి విజయ్‌కుమార్‌రెడ్డి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అదనపు డైరెక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 720 మంది జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. -
వృత్తిపట్ల నిబద్ధతున్న వ్యక్తి.. జెస్సీ
ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హైదరాబాద్: పనిలో నిబద్ధత, అంకిత భావం ఉన్న వ్యక్తి స్పోర్ట్స్ జర్నలిస్ట్ జె.శ్రీనివాసులు (జెస్సీ) అని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ప్రెస్ అకాడమీ తరఫున లక్ష నగదు, ఐదేళ్ల పాటు నెలకు రూ.3 వేల పింఛన్ అతి త్వరలో కల్పిస్తామని, అంతే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చా రు. ఆదివారం ప్రెస్‌క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఇటీవల అకస్మాత్తుగా మృతి చెందిన సాక్షి స్పోర్ట్స్ జర్నలిస్టు జెస్సీకి ఆత్మీయ నివాళి కార్యక్రమం జరిగింది. జెస్సీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సీనియర్ పాత్రికేయులు పాల్గొని జెస్సీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అల్లం నారాయణ మాట్లాడుతూ.. జర్నలిజంలో జెస్సీ లాంటి వారు చాలా అరుదుగా ఉంటారని తాను అనుకున్నది కథనంలో చూపేవారని అన్నారు. జెస్సీ పేరుతో గేమ్ ఈవెంట్స్ నిర్వహించేందుకు కృషి చేద్దామన్నారు. స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ఆప్తుడిని కోల్పోయానని కన్నీటిపర్యంతమయ్యారు. ‘సాక్షి’ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి మాట్లాడుతూ.. జెస్సీ మ్యాన్ ఆఫ్ కమిట్మెంట్ అని కొనియాడారు. సాక్షి యాజమాన్యం, ఉద్యోగులు అందరూ ఆయన కుటుంబాన్ని ఆదుకోవడానికి చూస్తున్నామని అన్నారు. జెస్సీ స్నేహితుడు మైహోం ఇండస్ట్రీస్ సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆర్.వి.మహేశ్‌బాబు జెస్సీ కుటుంబానికి రూ.50 వేలు సాయం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రాజమౌళి చారి, ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్ రెడ్డి, జెస్సీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
ఎన్నికల్లో లబ్ధికోసమే వారసత్వ ఉద్యోగాలు
మణుగూరు రూరల్: త్వరలో జరగబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య అన్నారు. సోమవారం మణుగూరు ఏరియాలో పర్యటించిన ఆయన ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. వారసత్వ ఉద్యోగాల సర్క్యులర్ అందరికీ ఆమోదయోగ్యంగా లేదన్నారు. ఎటువంటి షరతులు లేకుండా వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్ అందుకు విరుద్ధంగా సర్క్యులర్ విడుదల చేశారన్నారు. దీంతో సుమారు 3వేల మంది కార్మికులకు తీరని నష్టం కలుగుతుందన్నారు. డైరెక్టర్ పా వారసత్వ ఉద్యోగాలను ఎప్పుడైనా రద్దుచేసే అవకాశం ఉందంటూ విధించిన నిబంధనతోనే దాని ప్రాధాన్యాన్ని అర్ధంచేసుకోవాలన్నారు. సమావేశంలో సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీ డి.శేషయ్య, మణుగూరు బ్రాంచి కార్యదర్శి వై.రాంగోపాల్, నాయకులు అంజయ్య, బైరి శ్రీనివాస్, నజీరుద్దీన్ బాబ పాల్గొన్నారు. -
మహిళలపై హింస పెరుగుతోంది
విజయవాడ (గాంధీనగర్) : మహిళలపై రోజురోజుకూ హింస పెరుగుతోందని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధ అన్నారు. లైంగికంగా, కుటుంబ పరంగా, రాజ్యపరంగా.. ఇలా అనేక రూపాల్లో హింస జరుగుతోందన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో చైతన్య మహిళా సంఘం ఆధ్వర్యాన ‘మహిళలపై జరుగుతున్న రాజ్యహింస’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం శనివారం జరిగింది. ఆమె మాట్లాడుతూ మహిళలపై హింసకు ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక కారణాలే మూలమని పేర్కొన్నారు. ఆదివాసీ మహిళలు దుర్భర జీవితం గడుపుతున్నారని, వారిపై సైనికులే లైంగికదాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివాసీలపై జరుగుతున్న దాడులను తెలుసుకునేందుకు వెళ్లిన ప్రొఫెసర్ నందినీ సుందర్, అర్చనా ప్రసాద్, జర్నలిస్ట్ మాలినీ సుబ్రహ్మణ్యంపై హత్యానేరం కింద కేసులు నమోదు చేశారని తెలిపారు. మహిళలపై దాడులను ప్రశ్నించేవారిని ప్రభుత్వం అణచివేస్తోందన్నారు. చైతన్య మహిళా సంఘం జిల్లా కార్యదర్శి రాజేశ్వరి ప్రసంగించారు. అనంతరం రాజ్యహింసను ఎదుర్కొనేందుకు పోరాటాలను తీవ్రతరం చేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో బి.కొండారెడ్డి (పీకేఎఫ్), టి.శ్రీరాములు (కేఎన్పీఎస్), వీఎన్ఎన్ రాజ్యలక్ష్మి (ఓపీడీఆర్), ఎస్ఎస్సీ బోసు(పౌరహక్కుల సంఘం), కొప్పల మాధవి (రూట్స్ హెల్త్ ఫౌండేషన్), మురళీకృష్ణ (పద్మశ్రీ నాజర్ కళాక్షేత్రం), మహిళా, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు
కడప రూరల్: వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభ్యున్నతి కోసం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేసినట్లు ఎన్.రవిశంకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా సీపీఎంలో ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేశామన్నారు. తనతో పాటు 16 మంది నాయకులు, 100 మంది కార్యకర్తలు సీపీఎంకు రాజీనామా చేసి బయటకు వచ్చామన్నారు. అనంతరం 200 మందితో చర్చించి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీని స్థాపించామన్నారు. నేడు కార్యాలయం ప్రారంభం గురువారం ఉదయం 10 గంటలకు కడప ఆఫీసర్స్ క్లబ్ ఎదురుగా కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు రవిశంకర్ రెడ్డి తెలిపారు. అలాగే ఈ నెల 9న పార్టీ ఆవిర్భావ సదస్సును ఏర్పాటు చేస్తామన్నారు. 10న నిర్వహించే ప్లీనరీలో పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని వెల్లడించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు కె.లింగమూర్తి, సి.శేఖర్, ఒ.శంకర్, ఓబయ్య, సుధీర్‌కుమార్, మగ్బూల్‌బాషా, సుబ్బరాయుడు, బాలచెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
కశెట్టి హైస్కూల్ ఆస్తులను అమ్ముకుంటున్నారు
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలోని విలువైన కశెట్టి హైస్కూల్ ఆస్తులను అమ్ముకుంటున్నారని దువ్వూరు పోతులూరయ్య ఆచారి తెలిపారు. ఆయన శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆర్యవైశ్య ప్రముఖుడు కశెట్టి చిన్నవెంకటసుబ్బయ్య మంచి ఆశయంతో పేద, బడుడు, బలహీన వర్గాల పిల్లల కోసం కశెట్టి చిన్నవెంకటసుబ్బయ్య చారిటీస్ సంస్థను నెలకొల్పి సంస్థ ఆధ్వర్యంలో ఎయిడెడ్ హైస్కూల్‌ను స్థాపించారన్నారు. వెంకటసుబ్బయ్య మరణానంతరం చారిటీస్‌కు చెందిన ఆస్తులను ఓ వ్యక్తి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగా తప్పుడు సమాచారం ఇచ్చి తనకు ఓ స్థలం అమ్మారని, దీన్ని ప్రశ్నిస్తే తనపై దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. -
29న కర్నూలులో మాదిగల ‘సింహగర్జన’
విజయవాడ (గాంధీనగర్) : ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఈనెల 29న కర్నూలులో మాదిగల సింహగర్జన మహాసభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తుందన్న మందాకృష్ణ మాటల్లో నిజం లేదన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో కృష్ణమాదిగ కుమ్మక్కై మాదిగలను బీజేపీ వైపు మళ్లించేందుకు చేస్తున్న కుట్ర అన్నారు. వర్గీకరణపై చిత్తశుద్ధి ఉంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒప్పించి అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. కర్నూలు సభ ద్వారా కేంద్రంపై తాము ఒత్తిడి పెంచుతామని చెప్పారు. అనంతరం సభ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ మహిళా అధ్యక్షురాలు నల్లూరి చంద్రలీల, మందా నాగమల్లేశ్వరరావు, ఆరేటి ఏసుపాదం, పాల్వాయి దాసు పాల్గొన్నారు. -
చంద్రన్న బీమాతో తాపీ కార్మికులకు నష్టం
విజయవాడ (గాంధీనగర్): భవన నిర్మాణ కార్మికులను వెల్ఫేర్ బోర్డు పరిధిలోనే కొనసాగించాలని ఏపీ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులందరికి వెల్ఫేర్ బోర్డునుంచే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఇటీవల ప్రభుత్వం కార్మికులనందరినీ చంద్రన్న బీమా పథకానికి మార్చాలని నిర్ణయించి, వెల్ఫేర్ బోర్డు సంక్షేమ పథకాలను నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. సంక్షేమ బోర్డు నిధులను చంద్రబాబు తన సొంత ప్రచారం కోసం, మంత్రులు, అధికారుల విలాసాల కోసం వినియోగిస్తున్నారన్నారు. బోర్డు నిధులతో చంద్రన్నబీమా ప్రచారం ఇప్పటికే చంద్రన్నబీమా పేరుతో సొంత ప్రచారానికి రూ. 200 కోట్లు బోర్డు నిధులను తరలించిందని రావు ఆరోపించారు. సంక్షేమ బోర్డు నుంచి కార్మికులకు సహజ మరణానికి రూ. 60 వేలు, దహన సంస్కారాలకు రూ. 20వేలు చెల్లిస్తున్నారన్నారు. కానీ చంద్రన్నబీమా పథకం ద్వారా కేవలం రూ. 30వేలు మాత్రమే ఇస్తున్నారన్నారు. ఇప్పటికే సంక్షేమ బోర్డులో రూ. 1300 కోట్లు సెస్‌ల ద్వారా సేకరించిన నిధులున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్‌గా ఒక్కరూపాయి కూడా చెల్లించలేదన్నారు. కార్మికుల కడుపుకొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కార్మికులను వెల్పేర్ బోర్డులోనే కొనసాగిస్తూ కొత్త పథకాలను ప్రవేశపెట్టాలని, లేని పక్షంలో ఉద్యమిస్తామని, అవసరమైతే మిలిటెంట్ పోరాటాలకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి పిల్ల నర్సింహారావు పాల్గొన్నారు. -
రేపు ముస్లిం మైనార్టీల ర్యాలీ
విజయవాడ (గాంధీనగర్) : ముస్లిం మతాచారాలు, చట్టాల్లో ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ ముస్లిం మైనార్టీ సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం సంతకాల సేకరణ, అవగాహన ర్యాలీ ఏర్పాటుచేశామని సామాజిక కార్యకర్త ఫారూఖ్ షుబ్లీ తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ర్యాలీ పంజా సెంటర్ నుంచి చిట్టినగర్‌లోని మోతీమస్జిద్ వరకు జరుగుతుందన్నారు. ముస్లిం పర్సనల్ లా విషయంలో కేంద్రప్రభుత్వ జోక్యం సహించేది లేదని చెప్పారు. వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం నగర అ«ధ్యక్షుడు గౌస్‌మొహిద్దీన్, కో–ఆప్షన్ సభ్యుడు ఫతావుల్లా, నజీర్ హుస్సేన్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు సలీం ఫర్వేజ్, అహలె సున్నత్ జమాత్ ప్రతినిధి అబ్దుల్ రహీం, అహలె హదీస్ జమాత్ నగర అధ్యక్షులు అతీఖుర్ రెహ్మాన్, ముఫ్తి సయ్యద్ పాల్గొన్నారు. -
విద్యార్థులు సంఘటితంగా పోరాడాలి
విజయవాడ (గాంధీనగర్ ) : విద్యారంగ సమస్యలపై విద్యార్థులు సంఘటితంగా ఉద్యమించాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి కె పోలారి పిలుపునిచ్చారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) నగర సమితి 8వ మహాసభ సోమవారం జరిగింది. తొలుత పీడీఎస్‌యూ జెండాను ఆవిష్కరించారు. మహాసభలో పాల్గొన్న పోలారి మాట్లాడుతూ విద్యను వ్యాపారంగా మార్చి పాలక వర్గాలకు పేదలకు విద్యను దూరం చేస్తున్నాయన్నారు. డబ్బున్న వారికి నాణ్యమైన విద్య అనే పరిస్థితి ఏర్పడిందన్నారు. అందరికీ సమానమైన, నాణ్యమైన విద్యకోసం పోరాడాలని పిలుపునిచ్చారు. పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రవిచంద్ర మాట్లాడుతూ ప్రై వేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటును ఉపసంహరించుకోవాలన్నారు. స్కాలర్షిప్, బోధనా ఫీజులను విడుదల చేయాలని కోరారు. నిరుద్యోగుల వయోపరిమితిని 42 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లలో బయోమెట్రిక్ విధానం రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వ కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, నిరుద్యోగ భృతి రూ. 2వేలు చెల్లించాలని, దళితులు, మైనార్టీలపై దాడులు అరికట్టాలని మహాసభ తీర్మానించింది. మహాసభలో ఇఫ్టూ నగర కార్యదర్శి పి.ప్రసాదరావు, ఆటో కార్మిక సంఘం నగర కార్యదర్శి శ్రీనివాసరావు, పీడీఎస్‌యూ ప్రధాన కార్యదర్శి ఎస్.రామ్మోహనరావు, తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక పీడీఎస్‌యూ నగర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగర అ«ధ్యక్షుడిగా ఐ.రాజేష్, ప్రధాన కార్యదర్శిగా బి.శ్యాంసన్, ఉపాధ్యక్షులుగా రాజు, సహాయ కార్యదర్శిగా సీహెచ్.ప్రగతి, కోశాధికారిగా భానుని ఎన్నుకున్నారు. వీరితోపాటు మరో 12మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు, -
రేపు మైనారిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ లోగో ఆవిష్కరణ
విజయవాడ(గాంధీనగర్) : ఆల్మైనార్టీ సెంట్రల్ అండ్ స్టేట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లోగో ఆవిష్కరణ సోమవారం నిర్వహించనున్నట్లు సంఘ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికై మైనార్టీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మైనార్టీ కమిషన్ చైర్మన్ జనాబ్ అబిద్ రసూల్ ఖాన్ హాజరవుతారని తెలిపారు. ఆయనతోపాటు ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్ ఉప్పులేటి దేవీప్రసాద్, కస్టమ్స్ కమిషనర్ ఖాదర్ రహమాన్ పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ రహీం, నగరశాఖ అధ్యక్ష, కార్యదర్శులు మహమ్మద్ యాకూబ్ సాహెబ్, ఖాసీం సాహెబ్ పాల్గొన్నారు. -
కాల్‌మనీ వ్యాపారులపై చర్య తీసుకోవాలి
విజయవాడ(గాంధీనగర్) : దళిత, గిరిజనులను వేధిస్తున్న కాల్‌మనీ, వడ్డీ వ్యాపారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వ్యాపారులపై దళితులు ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు బాధ్యతాయుతంగా దర్యాప్తు కొనసాగించడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లోనూ దళితులకు న్యాయం చేయడం లేదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవానరంలో బుడగ జంగాల కులస్తులు కాల్‌మనీ వ్యాపారులపై ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదని చెప్పారు. ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కేవీపీసీఎస్ నాయకులు పరిశపోగు రాజేష్ మాట్లాడుతూ చట్టవ్యతిరేకంగా సాగిస్తున్న వడ్డీ వ్యాపారాన్ని అరికట్టాలని కోరారు. -
సైకిల్ యాత్రకు వీడ్కోలు
గాంధీనగర్ : కృష్ణానది పరిరక్షణకు సైకిల్ యాత్ర చేపట్టిన గౌరీశంకర్‌ను ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు అభినందించారు. గురువారం ప్రెస్‌క్లబ్ వద్ద సైకిల్‌యాత్రకు ఏపీయూడబ్ల్యూజే నాయకులు వీడ్కోలు పలికారు. అంబటి మాట్లాడుతూ పాలనా వ్యవహారాలన్నీ తెలుగులోనే జరగాలనే సంకల్పంతో గౌరీశంకర్ యాత్ర చేపట్టారన్నారు. అధికార తెలుగుభాషలోనే పాలన జరిగితేనే పాలనా విధానం ప్రజలకు చేరుతుందన్నారు. అర్థం కానీ అంగ్లభాషలో పరిపాలించడంవలన తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. సైకిల్‌యాత్రలో భాగంగా రాజధాని నిర్మాణం కోసం మట్టి, నీరు, ఇటుకలు గౌరీశంకర్ అందించారన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. -
ప్రెస్‌క్లబ్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు
పంజగుట్ట: రాష్ట్రంలో ప్రెస్ ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తుందో చెప్పేందుకు ప్రెస్‌క్లబ్‌లో కమ్యునిటీ సీసీ కెమరాలు ఏర్పాటు చేయడమే నిదర్శనమని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. పత్రికారంగం వారు కెమరాలు ఏర్పాటు చేస్తే మరికొందరు ముందుకు వస్తారన్నారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్ ఆఫ్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కమ్యునిటీ సీసీ కెమరాల మనిటరింగ్ను ఆయన నగర పోలీస్ కమీషనర్ ఎం.మహేందర్ రెడ్డి, పశ్చిమమండల డీసీపీ వెంకటేశ్వర్ రావులతో కలిసి ప్రారంభించారు. క్లబ్లో 16 కెమరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ... గతంలో దిల్‌శుఖ్‌నగర్ బాబు పేలుళ్ల కేసులో పోలీసుల ఆధ్వర్యంలో ఓ షాపులో ఏర్పాటు చేసిన కెమరావల్లే ఎన్నో ఆధారాలు సేకరించగలిగామన్నారు. నగర పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ .. ప్రెస్‌క్లబ్‌లో సీసీ కెమరాలు ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా చూడటంతో మీడియాదే కీలకపాత్ర అన్నారు. డీసీపీ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ .. మీడియా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషమన్నారు. సీనియర్ పాత్రికేయులు శైలేష్ రెడ్డి మాట్లాడుతూ .. పోలీసులు మీడియా కలిసి పనిచేస్తుందని చెప్పడానికి ఈ కార్యక్రమమే నిదర్శనమన్నారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు రాజమౌళి చారి, ప్రధానకార్యదర్శి ఎస్.విజయ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌ను ఫ్యామిలీ క్లబ్‌గా, సేఫ్టీ క్లబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. మీడియా, పోలీసులు మరింత ఫ్రెండ్లీగా ఉండి సేఫ్, సెక్యుర్డ్ తెలంగాణ రూపొందించే దిశగా అడుగులేయాలన్నారు. పోలీస్ రంగంలో విశేష మార్పులు వచ్చాయని, అందుకు డైనమిక్ అధికారులే కారమన్నారు. హైదరాబాద్‌లో నేరం చేస్తే తప్పించుకోలేమని నేరస్ధుల్లో భయం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో క్లబ్ మాజీ అధ్యక్షులు రవికాం త్ రెడ్డి, జాయింట్ సెక్రటరీలు దుగ్గు రఘ, రమేష్ వైట్ల, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు నరేందర్ జి పద్మశాలి, ఎ.రాజేష్, పంజగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు, ఇన్స్‌స్పెక్టర్ మోహన్ కుమార్, ఎస్సై లింగారెడ్డి పాల్గొన్నారు. -
ఆడపిల్లలను రక్షించుకుందాం
సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రధాన్యత ఇస్తుందని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. బతుకమ్మ స్ఫూర్తితో ఆడపిల్లలను రక్షించుకోవాలన్నారు. ప్రెస్‌క్లబ్‌లో బతుకమ్మ పండుగను నిర్వహించడం అభినందనీయమన్నారు. సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్ హైదరాబాద్‌లో శుక్రవారం తొలిసారిగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. సేవ్ గర్ల్ చైల్డ్( ఆడపిల్లలను రక్షిద్దాం) అనే సామాజిక అంశంతో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలు, కళలు భావితరాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మకు పూజలు చేసి, ఆడిపాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మావతి, ఈటల జమున, సుశీల కోదండరామ్, శోభ, వెంకట్ మంతెన, భీమ్ రెడ్డి, గాయనీ మధుప్రియ, ప్రెస్‌క్లబ్ సెక్రటరీ శ్రీగిరి విజయ్‌కుమార్ రెడ్డి, ఈసీ మెంబర్స్ సరస్వతి రమ, యశోద, కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు. -
ప్రెస్‌క్లబ్ నిర్మాణానికి రూ.25 లక్షలు
దుబ్బాక రూరల్: దుబ్బాకలో నూతనంగా చేపట్టనున్న ప్రెస్‌క్లబ్ నిర్మాణానికి రూ.25లక్షలను మంజూరు చేయించినట్లు ప్రకటించారు. దుబ్బాక ప్రెస్‌క్లబ్ నిర్మాణానికి నిధులు ప్రకటించిన ఎమెల్యే రామలింగారెడ్డికి దుబ్బాక ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు చెక్కపల్లి రాజమల్లు, సీనియర్ జర్నలిస్టులు ఇంగు శివకుమార్, అంబటి వెంకట్‌గౌడ్, వీరబత్తిని శ్రీనివాస్, కాల్వ లింగం, గన్నె తిరుపతిరెడ్డి, బండ నర్సింలు, పల్లె వెంకటస్వామిగౌడ్, ఇస్తారిగల్ల ఎల్లం, వేములవాడ నవీన్ కుమార్, ఎండి చౌకత్, సుభాష్‌రెడ్డి, జైపాల్ తదితరులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా జర్నలిస్టుల డే సందర్భంగా ఎమ్మెల్యే రామలింగారెడ్డి జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. -
సాగునీటి కోసం పోరు
కడప రూరల్: సాగునీటి కోసం రైతుల పక్షాన పోరాటం చేస్తామని అఖిలపక్ష నేతలు తెలిపారు. అన్నదాతలు అవస్థలు పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి అధ్యక్షతన.. శ్రీశైలం ప్రాజెక్టులో 872 అడుగులు నీటిని నిల్వ ఉంచి కేసీ కెనాల్, గండికోట, బ్రహ్మంసాగర్‌లకు విడుదల చేయాలనే డిమాండుతో అఖిలపక్ష నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ అన్నదాతలు అవస్థలు పడుతున్నా, శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లున్నా, ఎందుకు నిల్వ చేయడం లేదని ప్రశ్నించారు. కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేయకుండా వృథాగా దిగువకు వదిలి వేయడంలో పరమార్థం ఏమిటో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాపై ఎందుకంత వివక్ష అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కడప మేయర్ సురేష్‌బాబు, జెడ్పీటీసీ సభ్యులు వీరారెడ్డి, సురేష్ యాదవ్, శివకుమార్‌రెడ్డి, పెద్ద సంఖ్యలో రైతు నాయకులు పాల్గొన్నారు. 29న మహాధర్నా: శ్రీశైలం జలాల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 29న మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సమావేశంలో పాల్గొన్న అందరూ మద్దతు తెలిపారు. ప్రతి ఒక్కరూ తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు. మన వాటా సాధించుకుందాం మన వాటా నీటిని సాధించుకోవడానికి పోరాటాలకు సిద్ధం కావాలి. శ్రీశైలంలో నీళ్లున్నప్పటికీ నిల్వ చేయకుండా ఏదో ఒక సాకు చూపుతూ కిందికి వదలడం దారుణం. పాలకుల మెడలు వంచి రైతాంగాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కదిలి రావాలి. – ఆకేపాటి అమర్నాథరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాబు దృష్టంతా అమరావతి పైనే ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని రంగాల్లో వెనుకబడిన రాయలసీమను పట్టించుకోకుండా.. దృష్టి అంతా అమరావతిపైనే కేంద్రీకరించడం అన్యాయం. ‘సీమ’కు రావాల్సిన నికర జలాలను వదలకుండా అడ్డు తగలడం శోచనీయం. – నజీర్ అహ్మద్, డీసీసీ అధ్యక్షుడు ప్రశ్నార్థకంగా ఆయకట్టు సాగు: ఎంతో పురాతనమైన కేసీ కెనాల్ కింద లక్షలాది ఎకరాలు సాగవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చుక్కనీరు విడుదల చేయకపోవడంతో కేసీ కెనాల్ కింద ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. – రామసుబ్బారెడ్డి, సీపీఐ, రైతు నాయకుడు తెలుగు తమ్ముళ్ల ప్రగల్బాలు కేసీ కెనాల్‌కు నీళ్లొస్తాయని కొంత మంది తెలుగు తమ్ముళ్లు ప్రగల్భాలు పలికారు. మరి శ్రీశైలంలో నీళ్లున్నా కేసీ కెనాల్లో ఏవీ? టీడీపీ నేతలు ఈ ప్రాంత ప్రజయోజనాల దృష్ట్యా మసలుకోవాలి. – జీఎన్ భాస్కర్‌రెడ్డి, చెన్నూరు మండల రైతు నాయకుడు ప్రాజెక్టుల నిర్మాణానికి వైఎస్ కృషి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే అన్ని పార్టీల నేతలను కలుపుకుని రాయలసీమ ప్రయోజనాల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఆయన సీఎం అయ్యాక ప్రాజెక్టుల నిర్మాణాన్ని దాదాపుగా పూర్తి చేశారని, మిగిలిన కొద్దిపాటి పనులను కూడా ప్రస్తుత ప్రభుత్వం చేపట్టడం లేదు. – ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి, సీపీఐ అన్నదాతలను ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం కేసీ కెనాల్, గండికోట తదితర ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయకపోవడంతో ఎన్నడూ లేని విధంగా అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా వారు ఎందుకో మరి ఇసుమంతైనా చలించడం లేదు. అన్నదాతలను ఆదుకోవడానికి ఎన్ని త్యాగాలకైనా వెనుకాడం! – సంబటూరు ప్రసాద్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం నీటి కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలి. అందుకు గ్రామీణ ప్రాంతాల ప్రజలు తరలి రావాలి. జాతీయ రహదారులను దిగ్బంధం చేసి పాలకులకు కనువిప్పు కలిగించేలా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాంతాలపై కొనసాగుతున్న వివక్ష ఎంతమాత్రం తగదు. శ్రీశైలంలో నీళ్లున్నా ప్రభుత్వం వదలడం లేదంటే ఏమని అర్థం చేసుకోవాలి. ఈ పాలకులకు రైతు సంక్షేమం పట్టదా? – సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, కార్మిక, కర్షక నేత –––– -
పుస్తకాల బ్యాగ్ మోయలేకపోతున్నాం
ప్రెస్‌మీట్ పెట్టి బాధను వ్యక్తం చేసిన ఏడో తరగతి విద్యార్థులు చంద్రపూర్(మహారాష్ట్ర): లెక్క కు మించి పుస్తకాలు... కిలోల కొద్దీ బరువు... బియ్యపు మూటలను తలపించే బ్యాగుల బరువులెత్తలేక విద్యార్థులు అల్లాడుతున్నారు. ఈ బాధను భరించలేకపోతున్నామంటూ ఇక్కడి విద్యానికేతన్ స్కూల్‌కు చెందిన ఇద్దరు ఏడో తరగతి విద్యార్థులు ప్రెస్ మీట్ పెట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ‘మేం రోజూ 8 సబ్జెక్టులకు సంబంధించి కనీసం 16 పుస్తకాలు బడికి తీసుకెళ్లాల్సి వస్తోంది. ఒక్కోసారి ఈ సంఖ్య 18 నుంచి 20 వరకు ఉంటుంది. దాదాపు ఏడు కిలోల బరువున్న బ్యాగును భుజాన వేసుకొని మూడో అంతస్తులో ఉన్న తరగతి గదికి మోసుకెళ్లే క్రమం లో విపరీతంగా అలసిపోతున్నాం. బ్యాగ్ బరువు తగ్గించమని మా ప్రిన్సిపాల్‌కు దీనిపై ఒకటిరెండుసార్లు విన్నవిం చినా ఫలితం లేదు.’ అంటూ ఇక్కడి ప్రెస్ క్లబ్లో వారు ఆవేదన వ్యక్తం చేశారు. పిరియడ్ల సంఖ్య తగ్గించాలని వారు కోరారు. అలాగే స్కూల్లో బ్యాగును తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఒకవేళ స్కూలు యాజమాన్యం ఈ అభ్యర్థనను పట్టించుకోకపోతే ఏం చేస్తారన్నదానికి... తమ డిమాండ్లు నెరవేరే వరకూ నిరాహార దీక్షకు దిగుతామని తేల్చిచెప్పారు. -
హక్కుల సాధనకు సంఘటిత పోరాటం
శ్రీనగర్‌కాలనీ: మాదిగల రిజర్వేషన్లు, అభ్యున్నతికి అన్ని సంఘాలు సంఘటితం కావాలని తెలంగాణా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. శుక్రవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర అద్యక్షుడు గజ్జల మల్లికార్జున్ మాదిగ అద్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన వచ్చే నెల 8, 9, 10 తేదీల్లో ఢిల్లీలో చేపట్టనున్న ర్యాలీ, ధర్నాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో మాదిగలకు 12శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో చాడలింగం, మోజేష్, పాలడుగు సాలయ్య, జానయ్య, విజయ, మురళి, మల్లేష్, నడిమింటి కృష్ణ, ముత్తయ్య, రాజ్‌కుమర్ పాల్గొన్నారు. -
ఆందోళన వద్దు.. అందరికీ అక్రిడిటేషన్లు
ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ న్యూశాయంపేట : ప్రభుత్వం ఇంకా కుదట పడలేదని, అధికారుల లేమితోనే జర్నలిస్టుల అక్రిడిటేషన్లు, ఆరోగ్యకార్డులు ఆలస్యమవుతున్నాయని, త్వరలో అందరికీ అందుతాయని రాష్ట్ర ప్రెస్ అకాడమి చైర్మెన్ అల్లం నారాయణ అన్నారు. ప్రెస్ అకాడమి చైర్మెన్‌గా రెండోసారి నియమితులైన సందర్భంగా ఆదివారం హన్మకొండ ప్రెసక్లబ్‌లో టీయూడబ్ల్యూజే(హెచ్–143) ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పోరాటాల ఫలితంగానే అక్రిడిటేషన్ల కోసం ప్రభుత్వం జీవో జారీ చేసిందని, డెస్క్ జర్నలిస్టులకు కూడా ఇచ్చేలా జీవో జారీ అయిందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 20 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధిని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందని, ఇది తమ సంఘ పోరాట ఫలితమేనని చెప్పారు. రూ.100 కోట్ల నిధిని సాధించి, ప్రతి జర్నలిస్టుకు రూ.10 వేల పెన్షన్ వచ్చేలా పోరాడుతానని అన్నారు. తన హయాంలో ప్రతిక్షణం జర్నలిస్టుల సంక్షేమానికే వెచ్చిస్తానన్నారు. జర్నలిస్టులకు ఆరోగ్యకార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరుకు కృషి చేస్తాన ని హామీ ఇచ్చారు. తెలంగాణ సిలబస్ ప్రవేశపెట్టి అకాడమి ద్వారా జర్నలిస్టులకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామన్నారు. అంతకు ముందు ప్రెస్‌క్లబ్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు క్రాంతి, పి.రవి, లెనిన్, కొండల్రావు, పి.శివకుమార్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి, జిల్లా అద్యక్షుడు జి.వెంకట్ పాల్గొన్నారు. -
రిజర్వేషన్ల కోసం ఉద్యమం
ఆదిలాబాద్ రిమ్స్ : రిజనులకు పది శాతం నిరజ్వేషన్లు కల్పించాలని ఉద్యమాలకు సిద్ధం కావాలని గిరిజన రిజర్వేషన్ సాధన సమితి జిల్లా అధ్యక్షుడు పెందూర్ ప్రబాకర్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రింట్మీడియ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. కనీసం గిరజన జనాభా నిష్పత్తి ప్రకారం 10 శాతం రిజ్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల కోసం ఈనెల 25న కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ ధర్నాకు 12 తెగలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో సమితి జిల్లా చెర్మైన్ మడావిరాజు, ప్రధాన కార్యదర్శి బానోవత్ రామరావు, ఉపాధ్యక్షుడు కడిమెతతిరుపతి, సభ్యులు కుర్సెంగ సూర్యబాను, జోడిదివాకర్, తుకారం, తానాజీలు ఉన్నారు. -
నీళ్లడిగితే దాడులు చేయిస్తారా?
అనంతపురం రూరల్: నీళ్లడిగితే దాడులు చేయిస్తారా? అని టీడీపీ నాయకలపై వైఎస్సార్ సీపీ నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, జడ్పీ ఫ్లోర్ లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డి మండిపడ్డారు. గురువారం వారు శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా జిల్లాకు రావాల్సిన సాగునీటిని రాకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ 22ను విడుదల చేసి జిల్లా రైతాంగానికి చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంటే జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులపై భౌతిక దాడులకు పాల్పడుతూ టీడీపీ నేతలు భయాందోళన సృష్టిస్తున్నా. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు ఎత్తివేయాలి.. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయా లని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనగానపల్లి మండలం కుర్లపల్లి ఘటనపై వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, చందు, కనగానపల్లి జడ్పీటీసీ ఈశ్వరయ్యపై నమోదు చే సిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న, ట్రేడ్ యూనియన్ నాయకులు ఆదినారాయుణరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నో బిలేసు, నాయకులు రాజేష్‌రెడ్డి, అనిల్‌కుమార్ , రామచంద్రారెడ్డి, నరసింహారెడ్డి, తిరుపాల్‌రెడ్డి, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నా రెండో పెళ్లిని అడ్డుకోండి
► భర్త ప్రమాద బీమా సొమ్ము కోసం ► తల్లిదండ్రుల కుట్రలు ► ప్రకాశం, నెల్లూరు ఎస్పీలకు ► వివాహిత హసీనా వినతి నెల్లూరు (బృందావనం) : తన భర్త ప్రమాద బీమా సొమ్ము కోసం, తనకు రెండో పెళ్లి చేసి తద్వారా లభించే సొమ్మును అనుభవించేందుకు, అత్త, మామలతో పాటు పిల్లల నుంచి దూరం చేసేందుకు తన తల్లిదండ్రులు కుట్రలు పన్నుతున్నారని వారి నుంచి తనకు, తన ముగ్గురు కుమారులకు రక్షణ కల్పించాలని బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని మునులపూడికి చెందిన షేక్ హాసీనా పోలీసు ఉన్నతాధికారులను వేడుకుంది. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం తన అత్త, మామ మస్తాన్‌బాషా, ముంతాజ్, మామ సోదరి రజియాబేగంతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టుకు చెందిన షేక్ హాసినాకు మునులపూడికి చెందిన ఏసీ టెక్నీషియన్ షేక్మస్తాన్బాషాతో 2007లో వివాహమైంది. వారికి ముగ్గురు కుమారులు ఉన్నారు. మస్తాన్‌బాషా హైదరాబాద్ నుంచి నెల్లూరుకు 2011 మే 14న ఒంగోలు ఫ్లైఓవర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి 2014 వరకు బుచ్చిరెడ్డిపాళెంలోనే ఉంటూ తన పిల్లలును చదివిస్తూ అత్త,మామల వద్ద ఉంటుంది. ఈ క్రమంలో తన తండ్రి మహబూబ్‌షరీఫ్ మునులపూడికి వచ్చి తల్లికి కిడ్నీలు చెడిపోయి పరిస్థితి సీరియస్‌గా ఉందని చెప్పి దేవరాజుగట్టుకు తీసుకెళ్లారన్నారు. అయితే ఇంటి వద్ద తన తల్లి ఆరోగ్యంగా ఉండడం చూసి వారిని ప్రశ్నించానన్నారు. తన భర్త రోడ్డు ప్రమాదానికి సంబంధించి రూ.14 లక్షలు బీమా ఉందని, ముగ్గురు పిల్లలను తమకు అప్పగిస్తే ఆ డబ్బు తమకు చెందుతుందని చెప్పారన్నారు. తనకు రిటైర్డ్ ఉద్యోగితో రెండో పెళ్లి చేస్తామని బలవంతం చేశారన్నారు. దీనికి తాను అంగీకరించక తిరిగి రావడంతో మార్కాపురం నుంచి కొందరు రౌడీలను తీసుకువచ్చి తన ముగ్గురు పిల్లలను తీసుకెళ్లారన్నారు. ఈ విషయమై నెల్లూరు ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
సేవ్ గర్ల్ చైల్డ్‌పై షార్ట్ ఫిల్మ్ పోటీలు
డాబాగార్డెన్స్: భ్రూణ హత్యల నివారణకు సేవ్ గర్ల్ చైల్డ్ అంశంపై అంతర్జాతీయ షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించనున్నట్టు వుమెన్ వెల్ఫేర్ సర్వీస్ ఆర్గనైజేషన్ ప్రతినిధి లతా చౌదరి తెలిపారు. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆడపిల్లలు లేకపోతే సమాజమే ఉండదన్నారు. లింగ నిర్థారణ పరీక్షలను చట్టబద్ధం చేయాలని, లింగ నిర్థారణ పరీక్షలలో ఆడపిల్ల అని తేలితే అప్పటి నుంచి ఆ గర్భస్త శిశువు బాధ్యతను, కాన్పు అయ్యేవరకు తల్లీ, బిడ్డా బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. సేవ్‌గర్ల్‌చైల్డ్ పేరిట నిర్వహిస్తున్న షార్ట్ ఫిల్మ్‌లు ఎనిమిది నిమిషాల వ్యవధిలో ఉండాలని, జూలై 30వ తేదీలోగా హెచ్డీ క్వాలిటీ, 1920 పిక్స్ అండ్ ఎంపీ-4తో అందజేయాలన్నారు. పోటీల్లో విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.లక్ష, ద్వితీయ బహుమతిగా రూ.75 వేలు, తృతీయ బహుమతిగా రూ.50 వేలతోపాటు మూడు కన్సొలేషన్ బహుమతులు అందజేయనున్నట్టు చెప్పారు. మరిన్ని వివరాలకు (email address) orldwomenera@gmail.com(website)www.wwsoindia.org ఇంటినెంబరు 402, ఐదో అంతస్తు, సాయినాథ్ ద్వారకామాయి అపార్ట్మెంట్, నిజాంపేట్, హైదరాబాద్-90 చిరునామాకు పంపాలని లేదా 9989576755, 9866516741 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. -
సలహాలివ్వడం జర్నలిస్టుల బాధ్యత
-
సలహాలివ్వడం జర్నలిస్టుల బాధ్యత: నరసింహన్
హైదరాబాద్: హైదరాబాద్ లో ఆదివారం జరుగుతున్న ప్రెస్ క్లబ్ స్వర్ణోత్సవ సంబరాలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, తదితర ప్రముఖులు హాజరయ్యారు. జర్నలిజం అంటే విమర్శలు చేయడమే కాదు.. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం జర్నలిస్టుల బాధ్యత అని గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించారు. ప్రతి విషయాన్ని సెన్సేషన్ చేయొద్దని, కొన్ని విషయాల్లో బాధ్యతగా వ్యవహరించాలని గవర్నర్ పేర్కొన్నారు. -
ప్రెస్‌క్లబ్ ఉత్సవాలకు టీయూడబ్ల్యూజే దూరం
జర్నలిస్టుల ఐక్యతను దెబ్బతీసే విధంగా ప్రెస్ క్లబ్ కార్యవర్గంలో ఉన్న కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని.. ఈ తీరును జీర్జించుకోలేక ప్రెస్ క్లబ్ స్వర్ణోత్సవాలకు దూరంగా ఉంటున్నట్లు టీయూడబ్ల్యూ జే నేతలు తెలిపారు. శనివారం విలేకరులతో మాట్లాడిన ఐజేయూ నేతలు కే.శ్రీనివాస్ రెడ్డి, దేవుల పల్లి అమర్ బషీర్ బాగ్ లో ఉన్న ప్రెస్ క్లబ్ కు సోమాజీ గూడలో ఉన్న ప్రభుత్వ భవనాన్ని కేటాయిస్తూ.. 1995లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారని.. యూనియన్ వారసత్వంగా ఉన్న ప్రెస్ క్లబ్ రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన టీయూడబ్ల్యూ జేకి అనుబంధంగానే కొనసాగాల్సి ఉంటుందని అన్నారు. కార్యవర్గంలోని కొందరు వ్యక్తులు జర్నలిస్టుల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చట్టబద్దంగా ప్రెస్ క్లబ్ కు సంక్రమించిన అధికారాలను కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రెస్‌క్లబ్ పాలకమండలి పదవీకాలం ముగియగా, స్వర్ణోత్సవాల పేరుతో మూడు రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారన్నారు. 50 సంవత్సరాలు ప్రెస్‌క్లబ్‌ను తీర్చిదిద్దిన వారిని కనీసం సంప్రదించకుండా, ప్రెస్‌క్లబ్‌కు మాతృసంస్థగా ఉన్న యూనియన్ నేతలను పరిగణలోకి తీసుకోకుండా స్వర్ణోత్సవాలు ఎలా జరుపుతారని ప్రశ్నించారు. 1965 మే 25న ఏర్పాటైన ప్రెస్‌క్లబ్‌కు ఆరునెలల తరువాత స్వర్ణోత్సవాలు నిర్వహించ డాన్ని తప్పుపట్టారు. ఈ సమావేశంలో ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు అమరనాథ్, ఐజేయూ కార్యదర్శి నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యుజె ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ, హెచ్‌యూజే అధ్యక్షుడు కోటిరెడ్డి పాల్గొన్నారు. -
ప్రెస్‌క్లబ్ ఉత్సవాలకు టీయూడబ్ల్యూజే దూరం
-
ప్రెస్‌క్లబ్ క్రికెట్ టోర్నమెంట్లో సాక్షి టీవీ బోణీ
-
వరంగల్ ఎంపీ టికెట్ ఎస్సీలకు ఇవ్వాలి
తెలంగాణ మాదిగ జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి పంజగుట్ట: టీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ టిక్కెట్ మాదిగలకు కేటాయించాలని తెంగాణ మాదిగ జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ మాదిగ జేఏసీ రాష్ట్ర సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు, వర్గీకరణ సాధనకు జాతీయ స్థాయిలో మలిదశ ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో మాదిగ విద్యార్థులు, యువకులను భాగస్వాములను చేసేందుకు డిసెంబర్ మొదటి వారంలో ఉస్మానియాలో ‘మాదిగల విద్యార్థి, యువ గర్జన’ నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువజన, విద్యార్ధి కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయా కమిటీలతో ఈ నెల 15న ఓయూలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. జేఏసీ ప్రతినిధులు బొట్ల భిక్షపతి, రాయకంటి రామ్‌దాస్, వినాయక్ మాట్లాడుతూ ... వరంగల్ ఎంపీ టిక్కెట్ పిడమర్తి రవికి కేటాయిస్తే ఆయనను గెలిపించుకుంటామన్నారు. కార్యక్రమంలో గారె వెంకటేశ్, బండారి వీరబాబు, శ్రీను, డాక్టర్ వీరేందర్, గద్దల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. -
31న గురుకులాల రౌండ్‌టేబుల్ సమావేశం
హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లోని సమస్యలపై అన్ని సంఘాలు కలసి గురుకులాల సమాఖ్యగా ఏర్పడి ఈ నెల 31న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నా యి. ‘గురుకుల వ్యవస్థ బలోపేతం-సమస్యలు-పరిష్కారం’ అనే అంశంపై ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ సంఘాల నాయకులు రామలక్ష్మణ్, దయానంద్, రవిచందర్, సీతామనోహర్, అర్జున వెంకట్‌రెడ్డి, యాదయ్య, బాలరాజు, పరంధాములు ఒక ప్రకటనలో తెలిపారు. -
మద్య నిషేధాన్ని కోరుతూ దేశవ్యాప్త యాత్ర
ప్రముఖ సామాజిక ఉద్యమకర్త స్వామి అగ్నివేష్ వెల్లడి హైదరాబాద్: మద్యపానాన్ని నిషేధించాలని కోరుతూ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దేశ వ్యాప్త యాత్రను చేపడుతున్నానని, దానికి కుల, మత, పార్టీలకు అతీతంగా సంపూర్ణ మద్దతు ఉన్నదని ప్రముఖ సామాజిక ఉద్యమ కర్త స్వామి అగ్నివేష్ తెలిపారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆప్సా, మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల మద్య నియంత్రణ ఉద్యమ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చిన స్వామి అగ్నివేష్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ ‘కల్లు మానండోయ్ - కళ్లు తెరవండోయ్’ అని ఉద్యమాలు చేపడితే నేటి ప్రభుత్వాలు మాత్రం మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. గుజరాత్లో మద్యం ఆదాయం లేకుండానే అభివృద్ధి పథంలో ఉందన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, రాజస్థాన్ ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలన్నారు. స్త్రీలపై అత్యాచారాలు.రోడ్డు ప్రమాదాలు, నేరాలతో పాటు అవినీతికి కూడా మద్యమే కారణమన్నారు. మద్యం పరిశ్రమలకు ప్రభుత్వాలిచ్చే రుణాలు నిలిపేయాలన్నారు. సిగరెట్, పొగాకు, ఇతర మత్తు మందులనూ నిషేధించాలని డిమాండ్ చేశారు. గతంలో తాను తెలంగాణకు వచ్చినప్పుడు నేటి సీఎంతో మద్యాన్ని నిషేధించాలని కోరినప్పడు సరేనన్నారని, నేడు మాట తప్పుతున్నారని విమర్శించారు. కేసీఆర్ స్పృహలోకి వచ్చే విధంగా ఇక్కడ మద్య నిషేధ ఉద్యమాలు జరగాలని పిలుపునిచ్చారు. ఈ సభకు అధ్యక్షత వహించిన జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఎక్సైజ్ పాలసీని రూపొందించాలన్నారు. పీవోడబ్ల్యూ నేత వి. సంధ్య మాట్లాడుతూ జూన్1 నుంచి వస్తున్న ప్రభుత్వ సారాయిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల లోపు మద్యంపై ప్రభుత్వం నిర్ణయం చేయకుంటే ఆమరణ నిరహార దీక్ష చేపడతానని ఆటో వర్కర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటి చైర్మన్ అమానుల్లాఖాన్ హెచ్చరించారు. సభలో సీపీఐ (ఎం.ఎల్.) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గోవర్ధన్, అప్సా డెరైక్టర్ ఎస్. శ్రీనివాస్‌రెడ్డి, మహిళా సంఘ నేతలు గజానని, శారద గౌడ్ పాల్గొన్నారు. -
కదం తొక్కండి
అనంతపురం అర్బన్ : రైతు, డ్వాక్రా రుణమాఫీ కోసం చేస్తున్న మహాధర్నాకు అంతా కదం తొక్కాలని వైఎస్ఆర్సీపీ నేతలు పిలుపునిచ్చారు. బుధవారం ప్రెస్‌క్లబ్ వద్ద బైక్ ర్యాలీని ఆ పార్టీ నేతలు చవ్వా రాజశేఖరరెడ్డి, మాజీ మేయర్ రాగే పరశురాం, అనంత చంద్రారెడ్డి, మీసాల రంగన్న, రిలాక్స్ నాగరాజు తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. టవర్‌క్లాక్ నుంచి శ్రీకంఠం సర్కిల్, పాతూరు మీదుగా సుభాష్‌రోడ్డులోని నందినిహోటల్ ఎదురుగా ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వరకు ర్యాలీ చేశారు. అనంతరం విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీల వల్ల రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతలు శాశ్వత రుణగ్రస్తులుగా మిగిలిపోయారని ఆరోపించారు. ఓవైపు నిత్యం కరువు, మరోవైపు అప్పులు పుట్టని పరిస్థితితో అన్నదాత ఆత్మహత్యలు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు సంబంధించిన రూ.6234 కోట్లను ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, మిద్దె భాస్కర్‌రెడ్డి, సర్పంచ్ లోక్‌నాథ్‌రెడ్డి, టీ.కృష్ణమూర్తి, ఆకుతోటపల్లి ఆనంద్, మహబూబ్‌పీరా, పెన్నోబుళేసు, విద్యార్థి విభాగం నాయకులు చింతా సోమశేఖర్‌రెడ్డి, కేవీ మారుతీప్రకాష్, మరువపల్లి ఆదినారాయణరెడ్డి, జయరాంనాయక్, శ్యాంసుందర్‌శాస్త్రి, విద్యాసాగర్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, శ్రీనివాసులు, రాజేష్‌రెడ్డి, ఖాజాహుస్సేన్, మోసీ, వెంకటేశ్వర్‌రెడ్డి, వడ్డేశీనా, చిన్నా, ఆవుల రాఘవేంద్రరెడ్డి, సురేష్, క్రిష్ణమూర్తి, నాగేంద్రరెడ్డి, రామయ్య, యెడుగూరి అనుదీప్, చవ్వా అంకిత్ తదితరులు పాల్గొన్నారు. -
‘రికార్డులు’ రాస్తోంది!
చూశారా.. ఎంత పే....ద్ద కలమో.. 37.23 కిలోల బరువు ఉన్న ఈ పెన్ను ఎత్తు 18.53 అడుగులు.. ప్రపంచంలోనే అతిపెద్ద కలంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. అంతేకాదు మరో ఏడు రికార్డులను కూడా సొంతం చేసుకుంది. గురువారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో దీన్ని ప్రదర్శించారు. 448 రోజులు కష్టపడి ఇత్తడితో దీన్ని తయారు చేసినట్లు రూపకర్త ఎం.ఎస్.ఆచార్య తెలిపారు. ఈ పెన్ను తయారీకి రూ.4 లక్షల వరకు ఖర్చు చేసినట్లు చెప్పారు. కలంపై భారతీయ నృత్య భంగిమలు, సంగీత వాయిద్యాలను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, అమేజింగ్ వరల్డ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, ఆర్.హెచ్.ఆర్ రికార్డు, ఎవరెస్టు వరల్డ్ రికార్డులు వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, దైవజ్ఞశర్మ భారీ కలంతో జై తెలంగాణ, జై కేసీఆర్ అని రాశారు. -
పత్రికలే పట్టుగొమ్మలు
విజయనగరం మున్సిపాలిటీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికలు పట్టుగొమ్మలు వంటివని, వాటిలో పని చేసే వారంతా జిల్లాను మంచి మార్గంలో నడిపించాలని విజయనగరం డీఎస్పీ ఎస్.శ్రీనివాసరావు సూచించారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గురజాడ వంటి ఎందరో మహనీయులు నడయాడిన విజయనగరాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచాలని కోరారు. ప్రెస్ ఫొటోగ్రాఫర్లు తీసిన ఫొటోలు పోలీసులకు కీలకంగా ఉపయోగపడతాయన్నారు. మున్సిపల్ కమిషనర్ ఆర్.సోమన్నారాయణ మాట్లాడుతూ ప్రజల నాడి తెలుసుకునే వైద్యులు జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లని వాఖ్యానించారు. ప్రజల అవసరాలను వెలుగులోకి తీసుకురావడం ద్వారా అధికారులమైన తాము వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సాహితీరాజధానిగా వెలుగొందుతున్న విజయనగర కీర్తిని కొనసాగించే బాధ్యత పత్రికలపై ఉందన్నారు. అనంతరం జిల్లాలో ఫొటోగ్రఫీ సేవలందిస్తున్న కాండ్రేగుల రామారావు, జీవీఎస్ఆర్ మూర్తి, ఎం.సీతారామ్, పి.రాజేశ్వరరావు, డి.సత్యనారాయణమూర్తి, కాళ్ల శ్రీనివాసరావు, జంపు నాయుడు, గిడిజాల శ్రీను, ఎ.కిశోర్, ఆర్ దాలిరాజులను ఘనంగా సత్కరించారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు జరజాపు శేషగిరిరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే అధ్యక్ష, కార్యదర్శులు పీఎస్‌ఎస్‌వీ ప్రసాదరావు, మహాపాత్రో, ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి సముద్రాల గురుప్రసాద్ పాల్గొన్నారు. -
చట్టాల్లో కాదు సమాజంలో మార్పు రావాలి
అత్యాచార ఘటనలపై విశ్రాంత లోకాయుక్త సంతోష్ హెగ్డే సాక్షి, బెంగళూరు : లోకం తెలియని పసిమొగ్గలపై అత్యాచారాల ఉదంతంపై విశ్రాంత లోకాయుక్త సంతోష్ హెగ్డే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా ఘటనలను నిరోధించాలంటే చట్టాల్లో మార్పు కాదని, సమాజంలో రావాలని అభిప్రాయపడ్డారు. మాజీ రీసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(ఆర్ అండ్ ఏడబ్ల్యూ) ఉద్యోగి ఆర్.కె.యాదవ్ రాసిన ‘మిషన్ ఆర్ అండ్ ఏడబ్ల్యూ’ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని బుధవారమిక్కడి ప్రెస్‌క్లబ్ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంతోష్ హెగ్డే మాట్లాడుతూ...ఢిల్లీలో ‘నిర్భయ’ ఘటన జరిగిన అనంతరం అత్యాచార ఘటనలకు సంబంధించిన చట్టాలను కఠినతరం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే చట్టాలు కఠినంగా ఉన్నప్పటికీ వ్యక్తుల ఆలోచనా ధోరణిలో మార్పు లేకపోవడం వల్లే ఈ తరహా ఘటనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల చట్టాల్లో కాకుండా వ్యక్తుల్లో మార్పు వచ్చినపుడు మాత్రమే ఈ తరహా ఘటనలను నిరోధించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇక జుడీషియరీలో రాజకీయ నేతల జోక్యం పెరుగుతుండడాన్ని ఆయన తీవ్రంగా తప్పు బట్టారు. జుడీషియరీ అంశాలను పరిశీలించేందుకు న్యాయరంగంలోని నిపుణులతోనే ఓ మండలిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత రక్షణ వ్యవస్థలో కీలకమైన ఆర్ అండ్ ఏడబ్ల్యూ విభాగంలో జరిగిన కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలను రచయిత ఆర్.కె.యాదవ్ తన ‘మిషన్ ఆర్ అండ్ ఏడబ్ల్యూ’ పుస్తకంలో పొందుపరిచినట్లు వివరించారు. అంతేకాక ఆర్ అండ్ ఏడబ్ల్యూ విభాగాన్ని కొంతమంది పాలకులు ఏలా దుర్వినియోగం చేశారనే అంశాలను కూడా ఈ పుస్తకంలో రాసినట్లు పేర్కొన్నారు. -
సానియాకు ఇచ్చినట్లే మిగతా క్రీడాకారులకు ఇవ్వాలి
టీ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎల్బీ స్టేడియం: రాష్ట్రంలోని క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగావకాశాలు రాకపోవడం విచారకరమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, అంబర్పేట్ ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ (టీకేఏ) ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం టీకేఏ చైర్మన్ అయిన జి.కిషన్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెన్నిస్ క్రీడాకారిణి సానియాకు ఇచ్చిన భారీ నజరానాను ఇతర క్రీడాకారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర, జాతీయ క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు, కోచ్‌లకు ఉపాధి కల్పించగలమనే భరోసా ప్రభుత్వం ఇవ్వాలని ఆయన కోరారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైన క్రీడాకారులు తమ స్పానర్షిప్ కోసం రాజకీయ పార్టీల ఆఫీసులు, ఎమ్మెల్యేల చుట్టు తిరిగే అవసరం లేకుండా చూడాలన్నారు. అలాగే రాష్ట్రంలోని పార్టీలు రాజకీయాలకు అతీతంగా క్రీడాకారులను ఆదుకునే చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్ మాట్లాడుతూ నేడు ఆసియా క్రీడల్లో బంగారు పతకాన్ని అందిస్తున్న కబడ్డీని ఒలింపిక్ క్రీడల్లో చేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. -
బచావత్ ట్రిబ్యునల్ ప్రకారమే నీటి కేటాయింపులు
విజయవాడ : బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం నీటి కేటాయింపులు జరపాల్సిందేనని రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ చెప్పారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కృష్ణాడెల్టాలో నారు మడులకు నీటిని విడుదల చేయాల్సిందేనన్నారు. 155 ఏళ్ల ఆయకట్టుకు నీటిని విడుదల చేయవద్దనే హక్కు ఎవరికీ లేదన్నారు. కృష్ణాడెల్టాకు నీరు విడుదల చేయొద్దని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. రాష్ట్ర విభజన జరిగితే జల యుద్ధాలు జరుగుతాయని తాము ముందే హెచ్చరించామన్నారు. తాము చెప్పింది నిజమేనని, తాగునీటి విడుదలలోనూ తెలంగాణ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందన్నారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు నీటిని కేటాయించేందుకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. తెలంగాణ రాష్ర్ట వాటాలోనే హైదరాబాద్‌కు నీటిని కేటాయించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేటాయింపులకు మించి నీటిని వాడుకుంటూనే ఎదురుదాడికి దిగుతోందన్నారు. డెల్టాలో తాగునీటి అవసరాలకు 3.5 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నారని, దానిలో 2.4 టీఎంసీలే దిగువకు చేరతాయన్నారు. తూర్పు కాలువకు ప్రస్తుతం విడుదల చేస్తున్న 500 క్యూసెక్కుల నీరు ఏమూలకు చాలదన్నారు. రివర్‌బోర్డు సమావేశంలో మన వాదనలు సమర్థంగా వినిపించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి రావాలన్నారు. పోలవరం ముంపు ప్రాంతాలైన ఏడు మండలాల్లో పర్యటించి నిర్వాసితుల బాధలు, ఇబ్బందులు తెలుసుకుని వారి పునరావాసానికి, ఉపాధికి ప్రాధాన్యత కల్పించేటట్లు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. నీటి విడుదలలో రాజకీయాలకు తావివ్వకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేయాలన్నారు. పీసీసీ కార్యదర్శి కొలనుకొండ శివాజీ, కిసాన్‌సంఘ్ నాయకుడు కుమారస్వామి పాల్గొన్నారు, -
సంప్రదాయ మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలి
అభివృద్ధి పేరుతో తీరాన్ని కొల్లగొడితే సహించబోం తీరప్రాంతంపై మత్స్యకారులకు హక్కులు కల్పించాలి తీరప్రాంత నియంత్రణ మండలికి చట్టభద్రత కల్పించాలి ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ మత్స్యకార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజారావు విజయవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పేరిట తీరప్రాంత మత్స్యకారుల జీవనానికి, జీవనోపాధికి ఆటంకం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ మత్స్య కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూరాడ రాజారావు హెచ్చరించారు. విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత అందరి దృష్టి తీరప్రాంతంపై పడిందన్నారు. ఇందుకు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే కారణమని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు అతిపెద్ద తీరం ఉందని, అభివృద్ధి చేసుకుంటామని చెబుతున్న నాయకులు మత్స్యకారుల సమస్యలపై స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. 60 లక్షలకుపైగా ఉన్న మత్స్యకారుల సంక్షేమానికి ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు పరచాలని డిమాండ్ చేశారు. మత్స్య కారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాల్లో మత్స్యకారులను ఎస్టీలుగా పరిగణిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. మండల కమిషన్ నివేదికలోనూ ఈ అంశం ఉందన్నారు. తీరప్రాంతంపై మత్స్యకారులకు హక్కులు కల్పించాలని, 2009లో రూపొందించిన ముసాయిదా బిల్లుకు తక్షణమే చట్టబద్ధత కల్పించాలని కోరారు. చేపల బజారుల్లో వ్యాపారాలు చేసుకుంటున్న మహిళా మత్స్యకార కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. 2011లో రూపొందించిన తీరప్రాంత క్రమబద్ధీకరణ మండలి (సీఆర్‌జడ్) ముసాయిదా బిల్లును చట్టం చేయాలన్నారు. సముద్రంలో చేపలవేట సాగిస్తున్నవారు ప్రమాదవశాత్తు మరణిస్తే చెల్లించే ఎక్స్‌గ్రేషియాను రూ.లక్ష నుంచి 5 లక్షలకు పెంచాలన్నారు. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు బియ్యంతో పాటు రూ.9,400 నగదు చెల్లించాలన్నారు. తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ విధానం అమలులో ఉందన్నారు. సంప్రదాయ మత్స్యకారుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు రూ.100 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. చేపల వేట సాగించేవారికి సబ్సిడీపై డీజిల్ అందజేయాలన్నారు. వ్యవసాయదారులకు ఇస్తున్నట్లే మత్స్యకారులకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించాలని కోరారు. అభివృద్ధి పేరుతో తీరప్రాంతాన్ని కొల్లగొట్టి మత్స్యకారులనే తరిమివేయాలని చూస్తే సహించబోమన్నారు. ఈ సమావేశంలో మత్స్యకార యువజన సంఘం అధ్యక్షుడు తెడ్డు శంకర్, కె.ఆదిలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. -
టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ నుంచి మాకు ప్రాణహాని
ఉరవకొండ, న్యూస్‌లైన్ : టాస్క్ఫోర్స ఎస్ఐ రాగిరి రామయ్య, సిబ్బంది నుంచి తమకు ప్రాణహాని ఉందని గుంతకల్లుకు చెందిన పెరవలి రాజేష్‌చౌదరి, పత్రాల సురేష్, నారాయణ ఆరోపించారు. ఆదివారం గుంతకల్లులోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేష్‌చౌదరి మాట్లాడుతూ.. టాస్క్ఫోర్స పోలీసుల ఆగడాలను ఈ నెల 8వ తేదీ తర్వాత సీఎం దృష్టికి తీసుకెళతామన్నారు. అలాగే వారి నుంచి రక్షణ కల్పించాలని హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని చెప్పారు. మే 13న తాను వ్యాపారానికి సంబంధించిన రూ.3 లక్షల నగదును నారాయణ వద్ద ఉంచానన్నారు. అదే నెల 15న ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ వేస్తున్నామంటూ తనతో పాటు మరో నలుగురిని ఎస్ఐ రాగిరి రామయ్య, వారి సిబ్బంది అరెస్ట్ చేశారన్నారు. నారాయణ వద్ద ఉన్న రూ.3 లక్షలతో పాటు, మిగతా వారి వద్ద ఉన్న రూ.12 లక్షలు బలవంతంగా లాక్కున్నారన్నారు. అయితే తమను అరెస్ట్ చేసి.. రూ.11.17 లక్షలు మాత్రమే పట్టుకున్నట్లు మీడియాకు చూపారని ఆరోపించారు. మిగతా సొమ్ము ఏమైందో టాస్క్ఫోర్స పోలీసులే చెప్పాలన్నారు. పత్రాల సురేష్ వూట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అరుుతే టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ ఫోన్ చేసి ‘నీవు బెట్టింగ్ ఆడుతున్నట్లు ఒప్పకోకపోతే బట్టలూడదీసి కొట్టుకుంటుపోతా.. వెంటనే రూ.2 లక్షలు ఇవ్వు’ అని డివూండ్ చేసినట్లు ఆరోపించారు. ఎస్ఐ అండదండలతో కానిస్టేబుల్స్ వురింత రెచ్చిపోరుు ఇంట్లోకి చొరబడి తీవ్ర పదజాలంతో వూట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. -
పవన్ రాజకీయ అజ్ఞాని
ఆయన నిలకడలేని వ్యక్తి.. పూటకోమాట..ప్రాంతానికో వ్యాఖ్య ఆయన నైజం చంద్రబాబును తిట్టి.. ఆయన పంచన చేరడం దుర్మార్గం ‘పవన్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ పుస్తకావిష్కరణలో రచయిత ధ్వజం పంజగుట్ట,న్యూస్‌లైన్: పదవులు గడ్డిపోచతో సమానమని, పార్టీలన్నీ భ్రష్టు పట్టిపోయాయని అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించిన సినీహీరో పవన్‌కల్యాణ్ ఇప్పుడు మోడీ జపం, టీడీపీ వంతపాడుతున్నారని రచయిత బొగ్గుల శ్రీనివాస్ విమర్శించారు. ‘పవన్‌కల్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ అన్న పుస్తకాన్ని ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన ఆవిష్కరించి పవన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ‘జనసేన పార్టీ ఆవిర్భావ సభలో తనకు కులం, మతం, ప్రాంతం తేడాల్లేవని ప్రగల్బాలు పలికిన ఆయన పూటకోమాట మాట్లాడుతున్నాడు. గతంలో చంద్రబాబు పెద్ద అవినీతి పరుడని..ఇప్పుడు సీమాంధ్ర అభివృద్ధి ఆయనతోనే సాధ్యమని అంటున్నాడు. బాబు సింగపూర్‌లో డబ్బు దాచుకున్నారని విమర్శించి..ఇప్పుడు రెండురాష్ట్రాలను బాబు మాత్రమే సింగపూర్‌లా తీర్చిదిద్దగలరని ఎలా అంటున్నారు’ అని ప్రశ్నించారు. మహిళలపై యాసిడ్ దాడులు జరిగినప్పుడు, దిల్సుఖ్నగర్ బాంబుపేలుళ్లు జరిగినప్పుడు స్పందించని ఆయన రాష్ట్ర విభజన విషయంలో దేశసమగ్రతకు భంగం వాటిల్లుతుందనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని స్పష్టం చేశారు. ఐదేళ్లు ఏమి మాట్లాడకుండా కేవలం ఎన్నికల సమయంలో పవన్ పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని, ఆయన మాటలను సీమాంధ్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరని తేల్చిచెప్పారు. తెలంగాణ లో ఒకలా, సీమాంధ్రలో మరోలా మాట్లాడుతున్న ఆయన ఇరుప్రాంతాల్లో శాంతియుత వాతావరణం లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆయన శైలి మారకుంటే తమ పుస్తకం భాగాలు వస్తూనే ఉంటాయని శ్రీనివాస్ ఈసందర్భంగా వెల్లడించారు. -
ఆమ్ ఆద్మీ తరపున స్వతంత్ర అభ్యర్థులు
కడప రూరల్, న్యూస్‌లైన్: కడప కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ నగర కన్వీనర్, కో కన్వీనర్ సాజిద్ హుసేన్, సుబ్రమణ్యం తెలిపారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కడప కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ తరుపున పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి సరైన సమయంలో బి.ఫారాలు అందించలేక పోయామన్నారు. స్వతంత్య్ర అభ్యర్థులుగా 10వ డివిజన్‌కు డాక్టర్ అశోక్‌కుమార్, 13వ డివిజన్‌కు జీవీ సుబ్రమణ్యం, 14వ డివిజన్‌కు ఎ.నారాయణ, 19వ డివిజన్‌కు ఎం.సుబ్బరాయుడు, 31వ డివిజన్‌కు జఫ్రరుల్లాఖాన్, 32వ డివిజ న్కు సయ్యద్ జావిద్‌బాష, 42వ డివిజన్‌కు మహబూబ్‌పీర్ ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున చీపురు గుర్తుపై పోటీ చేస్తారన్నారు. కార్యక్రమంలో ఆపార్టీ నాయకులు పి.శివారెడ్డి, ప్రమీలాదర్శన్ పాల్గొన్నారు. -
‘సృజన’ డీవీడీ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ఎందరో అమరులు, సాహితీవేత్తల కృషి ఫలితంగానే ‘సృజన’ పత్రిక పాఠకులను ప్రభావితం చేసిందని విప్లవ రచయితల సంఘం(విరసం) నేత వరవరరావు అన్నారు. మిత్రమండలి సహకారంతో ఈ పత్రిక మొదలైందని తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సృజన 200 సంచికల డీవీడీని విరసం నేత చలసాని ప్రసాద్ ఆవిష్కరించి వరవరరావుకు అందజేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. సృజన ఉన్నత ప్రమాణాలు పాటించి, సమాజాన్ని ప్రభావితం చేసే ఎన్నో రచనలను వెలువరించిందన్నారు. సృజన సంపాదకురాలు హేమలత, రచయితలు ఆశారాజు, జీవన్‌కుమార్, ప్రొఫెసర్ ఎన్.గోపి, బాల్‌రెడ్డి, ఆకుల భూమన్న, అల్లం నారాయణ, టంకశాల అశోక్, పీసీ నర్సింహారెడ్డి, సోమంగి వేణుగోపాల్, డీఎస్ రాములు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
సమైక్యాంధ్ర ఉద్యమంపై నేడు సమావేశం
శ్రీకాకుళం అర్బన్, న్యూ స్ లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు శ్రీకాకుళం ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఉదయం 10 గం టలకు సమావేశం నిర్వహించనున్నామని ఆం ధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పొన్నాడ వెంకటరమణారావు శనివారం తెలిపారు. సమైక్యాంధ్ర సాధనే ధ్యేయంగా జిల్లాల్లో పర్యటిస్తున్న వేదిక కన్వీనర్ ల క్ష్మారెడ్డి ఈ సమావేశంలో పాల్గొంటారని వెల్లడించారు. సమైక్యాం ధ్ర ఉద్యమాన్ని మరింతగా ప్రజల్లో తీసుకువెళ్లనున్నామని పేర్కొన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ ఆచార్యులు ప్రసాదరెడ్డి, అంబేద్కర్ యూనివర్సిటీ ఆచార్యులు జి.తులసీరావు, రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా గౌరవాధ్యక్షుడు, ఏపీఎన్జీవో సంఘం సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తమనాయుడు, జిల్లా చైర్మన్ హనుమంతు సాయిరాం, ప్రతినిధులు జామి భీమశంకర్, గీతాశ్రీకాంత్, దుప్పల వెంకట్రావు, ఎస్.వి.ఎస్.ప్రకాష్, కిలారి నారాయణరావు, కాళీ ప్రసాద్, జయరాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దుప్పల రవీంద్ర తది తరులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. -
నేటి నుంచి ఉద్యమం తీవ్రతరం
సాక్షి, తిరుపతి: రాష్ట్ర విభజనపై కేంద్రం దిగి రాకపోవడంతో శనివారం నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నట్టు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, ఆర్డీవో రామచంద్రారెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమి తి అధ్యక్షుడు అశోక్‌బాబు నేతృత్వంలో సీమాంధ్రలో ఉద్యమం తీవ్రతరం చేయనున్నట్టు చెప్పారు. శనివా రం నుంచి 30వ తేదీ వరకు నిరసనలు చేపడుతున్నామన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలన్నారు. 21న (శనివారం) సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు జిల్లావాసులు విద్యుద్దీపాలను వెలిగించద్దు. 23 నుంచి 30వ తేదీ వరకు ప్రయివేటు విద్యా సం స్థల మూసివేత. 24న సీమాంధ్ర బంద్. రైలు మార్గాలు మినహా రహదారుల దిగ్బంధం 25, 26 తేదీల్లో ప్రయివేటు రవాణా సంస్థల బంద్ 27, 28 తేదీల్లో సర్పంచ్‌లు పంచాయతీల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల నే ఏకవాక్య తీర్మానాలను ఆమోదించి ప్రధాన మంత్రికి పంపించాలి. ఈ సమావేశంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు చల్లాచంద్రయ్య, ఎం.నరసింహులునాయుడు, ఆవుల ప్రభాకర్ యాదవ్, బాబు, శివప్రసాద్, టీటీడీ, రెవెన్యూ జేఏసీ నాయకులు మోహన్‌రెడ్డి, సురేష్‌బాబు పాల్గొన్నారు. -
ప్రెస్ మీట్‌ను అడ్డుకున్న తెలంగాణవాదులు
-
వైఎస్ లేనందువల్లే తెలంగాణ ఉద్యమం
విజయవాడ, న్యూస్‌లైన్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించిఉంటే తెలంగాణ ఉద్యమం ఊసే ఉండేది కాదని, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిప్రత్యేకవాదాన్ని అణచివేసేవారని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన మీట్ ది ప్రెస్‌లో ఆయన ప్రసంగించారు. వైఎస్ నూటికి నూరుపాళ్లు సమైక్యవాదని, తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇవ్వలేదని స్పష్టం చేశారు. వెనుకబడిన ప్రాంతాల ను అభివృద్ధి చేయడం ద్వారా విభజనవాదాన్ని తిప్పికొట్టాలని ఆయన భావించారని, ఆ ఉద్దేశంతోనే 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తుపెట్టుకున్నారని భాను గుర్తుచేశారు. మహానేత మరణానంతరం ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రోశయ్య టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నిరాహారదీక్షను నిలువరించలేకపోవడం వల్లే తెలంగాణవాదం తెరపైకి వచ్చిందని ఉదయభాను చెప్పారు. రాజకీయ మనుగడ కోసం కొందరు నాయకులు చేపట్టిందే తెలంగాణ ఉద్యమమని, ప్రస్తుతం సీమాంధ్రలో సాగుతున్న ఉద్యమం ప్రజల నుంచి పుట్టుకొచ్చిందని తెలిపారు. రాష్ట్ర విభజనపై వైఎస్సార్ సీపీ ఎప్పుడూ ఒకే వైఖరి అవలంభిస్తోందని, రెండు ప్రాంతాలకు మేలు జరిగే విధంగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి పంపిన లేఖలో పేర్కొందని భాను వివరించారు. అరుునా కేంద్రం రాష్ట్ర విభజనకు ఒడికట్టిందని, దీన్ని నిరసిస్తూ అన్ని రాజకీయ పార్టీలకంటే ముందుగా తమ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించారని గుర్తుచేశారు. ప్రజాప్రయోజనాల కోసం తెలంగాణలో పార్టీ లేకపోయినా ఫర్వాలేదని నిర్ణయం తీసుకుందన్నారు. వైఎస్ విజయమ్మ, జగన్మోహన్రెడ్డిలు కూడా రాజీనామాలు సమర్పించి సమైక్య ఉద్యమానికి మద్దతు తెలియజేశారని చెప్పారు. సమైక్యాంధ్ర పరిరక్షణకు విజయమ్మ ప్రాణాలకు సైతం తెగించి సమర దీక్ష చేపట్టారని పేర్కొన్నారు. మిగతా పార్టీలన్నీ ఇదే నిర్ణయం తీసుకుంటే విభజన ప్రకటన వెలువడేది కాదన్నారు. ఇప్పటికీ చంద్రబాబునాయుడు రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నారని, అసలా పార్టీ వైఖరేమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నాయకుడు ఒకలా వ్యవహరిస్తుంటే, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అందుకు భిన్నంగా నిరహారదీక్షలు చేస్తున్నారని విమర్శించారు. విభజన జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రగల్భాలు పలికిన ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇప్పుడు కంటికి కనిపించడం లేదన్నారు. కావూరి సాంబశివరావు మంత్రి పదవి ఇవ్వగానే సోనియాగాంధీ భజన చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం తుదిశ్వాస వరకు పోరాడిన ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరి ఆ పౌరుషాన్ని చూపడం లేదన్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు తమ పదవులతోపాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తే విభజన ప్రక్రియ నిలిచిపోతుందని చెప్పారు. విభజిస్తే అంధకారమే.. రాష్ట్రాన్ని విభజిస్తే సాగునీటికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. జలవివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్స్ ఉన్నప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరీ జలవివాదం 30 ఏళ్లుగా కొనసాగుతూనే ఉందని గుర్తుచేశారు. విభజన జరిగితే కృష్ణా, గోదావరి నదులు కావేరీ నదిలా మారతాయన్నారు. పులిచింతల ప్రాజెక్ట్ నీటిపై తెలంగాణవాదులు పెత్తనం చేస్తారన్నారు. పశ్చిమ కృష్ణా ప్రాంతానికి జలాధారమైన మునేరు, పాలేరు, కట్టలేరు తెలంగాణ ప్రాంతం నుంచి రావాలని, విభజన జరిగితే ఆ నీరు వచ్చే అవకాశం ఉండదన్నారు. తన కళ్లెదురుగానే ఆలమట్టి డ్యాం నిర్మాణం జరిగితే చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని గుర్తుచేశారు. థర్మల్ పవర్ స్టేషన్లకు బొగ్గు దిగుమతి చేసుకునే స్థోమత లేక కోస్తా ప్రాంతం అంధకారంలోకి వెళుతుందన్నారు. విభజన తర్వాత సీమాంధ్ర ప్రాంతంలో వచ్చిన ప్రజా ఉద్యమాన్ని చూసైనా పార్టీలు తమ వైఖరి మార్చుకోవాలని ఉదయభాను కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకుడు అంబటి ఆంజనేయులు, యూనియన్ అర్బన్ అధ్యక్షుడు ముత్యాల ప్రసాద్, కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.