డ్రగ్స్‌ విక్రయదారులను దేశ ద్రోహులుగా ప్రకటించాలి | work shop on drugs effects on human life in press club | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ విక్రయదారులను దేశ ద్రోహులుగా ప్రకటించాలి

Published Fri, Jul 28 2017 5:16 PM | Last Updated on Fri, May 25 2018 2:29 PM

డ్రగ్స్‌ విక్రయదారులను దేశ ద్రోహులుగా ప్రకటించాలి - Sakshi

డ్రగ్స్‌ విక్రయదారులను దేశ ద్రోహులుగా ప్రకటించాలి

హైదరాబాద్‌: సినీ పరిశ్రమను ఒక కుదుపు కుదుపుతున్న డ్రగ్స్‌ వ్యవహారంపై సినీ నిర్మాత, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీష్‌ రెడ్డి స్పందించారు. మాదక ద్రవ్యాల మత్తులో మానవ సమాజం అనే అంశంపై సోమజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన చర్చా వేదికలో ఆయన పాల్గొన్నారు.  ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ విక్రయదారులను దేశద్రోహులుగా పరిగణించే విధంగా కఠిన చట్టాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు.  డ్రగ్స్‌ మాఫియాను తీవ్రవాదులుగా పరిగణించి, వారిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీని కోరారు.

ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్‌ కేసు దర్యాప్తు నత్తనడకగా జరుగుతోందన్నారు. డ్రగ్స్‌ అనర్థాలపై యువజన కాంగ్రెస్, స్వచ్ఛంద సంస్థలు యువతకు అవగాహన కల్పించాలని కోరారు. డ్రగ్స్‌ కేసులో ప్రభుత్వం రోజుకో సీనీనటులను దర్యాప్తు పేరుతో కాలయాపన చేస్తోందని అంతే తప్ప కేసులో పురోగతి లేదన్నారు. కేసులో పురోగతికి సిట్ అడుగులేయాలని పొంగులేటి చూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాస్, సూర్యప్రకాష్ రావు, మాజీ పోలీస్ అధికారి గోపీనాథ్ రెడ్డి, సినిమా రంగానికి చెందిన జొన్నవిత్తుల, త్రిపుర నేని చిట్టి, తెలంగాణ యువజన కాంగ్రెస్‌ నాయకుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, తెలంగాణ ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్, ఏఐఎస్‌ఎఫ్‌ తెలంగాణ అధ్యక్షుడు వేణు, పీడీఎస్‌యూ అధ్యక్షుడు ప్రభులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement