work shop
-
‘ఈ పంచాయతీ సమ్మేళనం ఒక కీలక మైలురాయి’
హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ(ఎన్ఐఆర్డీ&పీఆర్)లో 'జీవన సౌలభ్యం: చివరి అంచె వరకూ మెరుగైన సేవలు’ అనే అంశంపై కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన పంచాయతీ సమ్మేళనంలో తొలి ప్రాంతీయ వర్క్‌షాప్ జరిగింది. పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పంచాయతీని సమర్థవంతమైన, పారదర్శకమైన, బాధ్యతాయుతమైన సేవల కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో ఈ పంచాయతీ సమ్మేళనం ఒక కీలక మైలురాయిని సూచిస్తుందన్న ఆయన.. గ్రామీణ స్వావలంబనకు, ప్రజలు స్వచ్ఛందంగా పన్ను చెల్లించేందుకు సేవా భావంతో సమర్థవంతమైన సేవలను అందించడం కీలకమని చెప్పారు.నాణ్యమైన సేవలను పొందటానికి, ప్రజలు పన్నులు చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేయటానికి మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ఆయన వివరించారు. స్వయం సమృద్ధ ఆదాయం ద్వారా పంచాయతీలు స్వావలంబన సాధించడానికి వీలు కల్పిస్తుందన్నారు. విజయవంతమైన సేవలను అందించే పద్ధతులను కాగితాల్లో పొందుపరచాలని, ఇతర పంచాయితీలకు స్ఫూర్తినిచ్చేలా వాటితో పంచుకోవాలని తెలిపారు. సేవలందించటంలో ఆదర్శంగా నిలుస్తోన్న రాష్ట్రాల్లో అనుసరిస్తున్న నమూనా ప్రక్రియలను ఇతర రాష్ట్రాల్లో అమలు చేసేందుకు వాటితో కలిసి పనిచేయాలని కోరారు. గతంలో కంప్యూటర్లు అందుబాటులో లేని వివిధ రాష్ట్రాల్లోని గ్రామ పంచాయతీలకు 22,164 కంప్యూటర్లను అందించేందుకు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉండటం గణనీయంగా మెరుగుపడుతుంది. 3,301 గ్రామపంచాయతీ కార్యాలయాల నిర్మాణానికి కూడా మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందని.. ఇందులో కామన్ సర్వీస్ సెంటర్లు(సీఎస్సీలు) ఉంటాయని, క్షేత్రస్థాయిలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎన్ఐఆర్డీ&పీఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జీ. నరేంద్రకుమార్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో సానుకూల మార్పును తీసుకురావాల్సిన బాధ్యత పంచాయతీ ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందన్నారు. “పంచాయతీ ప్రజాప్రతినిధులు, అధికారులను అత్యాధునిక పరికరాలు, సాంకేతికతో సన్నద్ధం చేయడం ద్వారా క్షేత్రస్థాయి నుంచే పరిపాలనా విప్లవానికి రంగం సిద్ధం చేస్తున్నాం” అని వ్యాఖ్యానించారుఈ వర్క్‌షాప్‌ను హైదరాబాద్‌లో నిర్వహించినందుకు పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖకు తెలంగాణ ప్రభుత్వ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ లోకేష్ కుమార్ డీఎస్ కృతజ్ఞతలు తెలియజేశారు. పంచాయితీ సమ్మేళనంలో నిర్వహించనున్న నాలుగు ప్రాంతీయ వర్క్‌షాప్‌లలో ఇది మొదటిది. సృజనాత్మక విధానాలపై చర్చించడం, క్షేత్రస్థాయిలో సేవలను పెంపొందించడం కోసం అనుభవాలను పంచుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం కాగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మిజోరం, ఒడిశా రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొని.. సేవలను అందించడంలో సవాళ్లు, అవకాశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో సేవలను అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా జీవన సౌలభ్యం అనే ఇతివృత్తంతో చర్చాగోష్ఠులను నిర్వహించారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) అన్లైన్ ద్వారా సేవలను అందించేందుకు ఉపయోగపడే సర్వీస్ ప్లస్ ప్లాట్‌ఫామ్‌ను ఈ సందర్భంగా ప్రదర్శించింది. క్షేత్రస్థాయిలో కమ్యూనికేషన్, సేవలను అందించటాన్ని క్రమబద్ధీకరించడంలో కృత్రిమ మేధ, డిజిటల్ ప్రజా వేదికలకు(డీపీజీ- డిజిటల్ పబ్లిక్ గూడ్స్) ఉన్న సామర్థ్యాన్ని వాధ్వానీ ఫౌండేషన్, భాషిని, యునిసెఫ్‌లు చూపించాయి. సేవల సమర్థతను మదింపు చేయడానికి, మెరుగుపరచటానికి ఫ్రేమ్‌వర్క్‌లను అందించే.. గ్రామీణ ప్రాంతాల్లో సేవలను అందించే విషయంలో ప్రామాణికతలను నిర్ణయించటంపై ఎన్ఐఆర్డీ&పీఆర్ ఒక సెషన్ నిర్వహించింది. -
రాజమౌళితో మహేశ్ సినిమా.. ఆ టెస్ట్ పాసవ్వాల్సిందేనా!
ఆర్ఆర్ఆర్ విషయంలో రాజమౌళి అనుకున్నది సాధించాడు...ఇక ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి తన నెక్ట్స్ మూవీపైనే ఫోకస్ పెట్టాడు. రాజమౌళి సినిమా ఏదైనా సెట్స్ పైకి వెళ్లే ముందే పక్కా ప్లానింగ్‌తో రెడీ అవుతాడు. ఓ సినిమా అనుకున్న తర్వాత ఏ స్టేజ్‌లో కూడా కాంప్రమైజ్ కాడు. రాజమౌళితో సినిమా అంటే ఆషామాషీగా ఉండదు. ఏ స్టార్ హీరో అయినా, ఏ స్టార్ టెక్నిషీయన్ అయినా రాజమౌళి మాట వినాల్సిందే. ఇక రాజమౌళి నిర్వహించే వర్క్ షాప్‌కు అందరూ హాజరు కావాల్సిందే. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో జక్కన్న తెరకెక్కించబోయే తన నెక్ట్స్ మూవీకి వర్క్ షాప్ ప్లాన్ రెడీ చేశాడు. రాజమౌళితో సినిమా చేయడం హీరోలకు ఓ సవాల్ అనే చెప్పాలి. తన కథకు తగినట్లు హీరో ఉండే విధంగా రాజమౌళి శిక్షణ ఇప్పిస్తాడు. హీరో తన పాత్రకు తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే పాత్రను అర్థం చేసుకుని ఆ క్యారెక్టర్లోకి హీరో పరకాయ ప్రవేశం చేసేలా రాజమౌళి ట్రైనింగ్ ఉంటుంది. సాధారణంగా ఏ డైరెక్టర్ అయినా వర్క్ షాప్ వన్ వీక్ లేదా టెన్ డేస్ ఉండేలా ప్లాన్ చేస్తుంటారు. అయితే రాజమౌళి కొన్ని నెలల పాటు వర్క్ షాష్ నిర్వహిస్తాడు. అంతే కాదు ఈ వర్క్ షాప్ కోసం బడ్జెట్ కూడా కేటాయిస్తాడు. ఇక ప్రిన్స్‌తో తెరకెక్కించబోయే #ఎస్ఎస్ఎంబీ 29 మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టనున్నాడట జక్కన్న. రాజమౌళి మగధీర సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ వరకు అన్ని సినిమాలకు వర్క్ షాప్ నిర్వహించాడు. తన ఊహలో ఆలోచనల్ని రాజమౌళి ముందుగా తన టీమ్‌కు చెబుతాడు. అలాగే వారు ఇచ్చే ఇన్ పుట్స్ కూడా తీసుకుంటాడు. ఇక ఆర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కెమెరా, విజువల్ ఎఫెక్ట్స్ ఇలా ప్రతి విభాగానికి తాను తీయబోయే సినిమాకి సంబంధించి అన్ని విషయాలు వివరిస్తాడు. తను ఏ సీన్ ఏలా తీయాలనుకుంటున్నది. అందుకు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ కోరుకుంటున్నాడో వివరిస్తాడు. అలాగే మహేశ్ బాబుతో తీయబోయే సినిమా కోసం రాజమౌళి ఓ భారీ వర్క్ షాప్ ప్లాన్ చేశాడనే మాట టీ టౌన్లో వినిపిస్తోంది. గ్లోబల్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వేంచర్ జోనర్లో తెరకెక్కించబోయే ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ ఎక్కడ అవసరం అవుతాయి.. ఏ సీన్స్‌కు గ్రీన్ మ్యాట్ వాడాలి. ఇక యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన శిక్షణ ఈ వర్క్ షాప్‌లో ఉండనుందని సమాచారం. బాహుబలి, బాహుబలి- 2 సినిమాల కోసం రాజమౌళి కొన్ని నెలల పాటు ప్రభాస్ - రానా, అనుష్క, నాజర్, సత్యప్రకాశ్లకు వర్క్ షాపులు నిర్వహించాడు. ఇక ప్రభాస్, రానాలో రాజరికం ఉట్టిపడేలా వాళ్లిద్దర్నీ ఆయన తీర్చిదిద్దారు. అలాగే మేకోవర్ విషయంలో ప్రభాస్ - రానా ఇద్దరూ చాలా కష్టపడ్డారు. అంతే కాదు ఓ రేంజ్లో రానా, ప్రభాస్ జిమ్‌లో కసరత్తులు చేసి కండలు పెంచారు. ఇక ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్‌ను కూడా వదిలిపెట్టలేదు. ఇక ఇప్పుడు పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించబోయే మహేశ్ బాబు సినిమా కోసం... ఆరు నెలల వర్క్ షాప్ ప్లాన్ చేశాడట రాజమౌళి. ఈ మూవీ నెక్ట్స్ సమ్మర్లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ వుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ సినిమా వర్క్ షాప్ స్టార్ట్ అవుతుందనే ప్రచారం ఫిల్మ్ సర్కిల్స్‌లో సాగుతోంది. ఈ వర్క్ షాప్‌లో మహేష్ బాబుతో సహా మిగిలిన యాక్టర్స్ అందరికీ ట్రైయినింగ్ ఉంటుందట. కాగా.. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న మహేశ్ బాబు మూవీ ఎస్ఎస్ఎంబీ 28 ఆగస్టు 11న విడుదల కానుంది. -
ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని ఎవరూ అలక్ష్యం చేయొద్దు: సీఎం జగన్
-
ఇది వర్గాల యుద్ధం: సీఎం జగన్
మనం పాలకులం కాదు ప్రజా సేవకులం. అధికారం చలాయించడం కోసం కాదు మనం ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉండేది.. నేను సీఎంగా ఉండేది.. ఎదిగే కొద్దీ ఒదగాలి. అధికారంలో ఉండేకొద్దీ ఇంకా ఎక్కువ ఒదగాలి. అప్పుడే ప్రజల నుంచి ఇంకా మంచి స్పందన లభిస్తుంది. ఈ వాస్తవాన్ని గుర్తించకపోతే నష్టపోతాం. ప్రతి గ్రామానికి వెళ్లండి. ప్రతి ఇంటినీ సందర్శించండి. ఏ ఇంటికైనా వెళ్లకపోతే.. మీరు తమ ఇంటికి రాలేదని, వారు మనకు వ్యతిరేకం అయ్యే అవకాశం ఉంది. వారు మనకు ఓటేయరని తెలిసినా వెళ్లండి. ఎందుకంటే వారికి ఎంతగా మంచి చేశామనే రికార్డులు మన దగ్గర ఉన్నాయి. వాటిని చిరునవ్వుతో వివరిస్తే, వారి మనసు మారొచ్చు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో ఇవాళ కులాల మధ్య కాదు.. క్లాస్‌ల మధ్య.. అంటే పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధం జరుగుతోంది. మనం పొరపాటున అధికారంలోకి రాకపోతే, రాష్ట్రంలో ఉన్న ఏ పేదవాడికీ న్యాయం జరగదు. పేదవాడి ప్రతినిధి మనమే. మనం నష్టపోతే పేదలు నష్టపోతారు. వారికి న్యాయం జరగాలంటే మళ్లీ మనం తప్పకుండా అధికారంలోకి రావాలి. ఇందుకోసం ప్రతి గడపనా కనీసం ఐదు నిమిషాల పాటు గడపాలి. మూడున్నరేళ్లలో మనం చేసిన మంచి గురించి చెప్పాలి’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలకు ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్బోధించారు. ‘దయచేసి అందరూ గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై ధ్యాస పెట్టండి.. మూడున్నరేళ్లుగా మనం చేస్తున్న మంచిని.. రానున్న రోజుల్లో చేయబోయే మేలును వివరించండి. మంచి చేసిన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరండి. మీరు ఆ ఇంటికి కేటాయించే సమయం మీకు ఎంతో మేలు చేస్తుంది. మీ నియోజకవర్గంలో ప్రతి ఇంటిని మీకు చేరువ చేస్తుంది. మీ గెలుపునకు బాటలు వేస్తుంది’ అంటూ దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమం కొనసాగుతున్న తీరుపై సమీక్షించారు. ఇకపై మరింత మెరుగ్గా నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలకు మార్గ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. గడప గడపకు మన ప్రభుత్వంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు సమర్థులనే పార్టీ కన్వీనర్లుగా నియమించండి ► నాయకత్వం వహించే సామర్థ్యం ఉన్న ముగ్గురు కార్యకర్తలనే సచివాలయ కన్వీనర్లుగా నియమించాలి. అందులో తప్పనిసరిగా ఒక మహిళ ఉండాలి. ఎమ్మెల్యేలకు ఇష్టం వచ్చిన వారిని నియమించుకోవచ్చు. వారికి తప్పనిసరిగా స్మార్ట్ ఫోన్ ఉండి తీరాలి. ఆ తర్వాత ప్రతి 50 ఇళ్లకు ఒక తమ్ముడు, ఒక చెల్లిని గృహ సారథులుగా నియమించాలి. వారు ఆ 50 ఇళ్లకు సంబంధించిన వారై ఉండాలి. ఎక్కడా వలంటీర్లు గృహ సారథులుగా ఉండకూడదు. ► పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు జనవరిలో ఆసరా మూడో దఫా రూ.6,500 కోట్లు చెల్లించబోతున్నాం. దానికి సంబంధించి ఇంటింటా ప్రచారం చేస్తూ, వారికి లేఖలు అందిస్తాం. ఆ తర్వాత గృహ సారథుల నియామకానికి సంబంధించి మరో దఫా వెరిఫికేషన్ ఉంటుంది. ఎమ్మెల్యేల ద్వారా ట్యాబ్‌ల పంపిణీ ► రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యేల ద్వారా ట్యాబ్‌ల పంపిణీ మొదలవుతుంది. పగలు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని.. సాయంత్రం గడప గడపకూ కార్యక్రమాన్ని నిర్వహించాలి. జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్ రూ.2,750 పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం. పెన్షన్ పెంపుదలపై వారోత్సవాలను నిర్వహిస్తున్నాం. ఈ వారోత్సవాలలో రోజూ ఏదో ఒక మండలంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలి. సాయంత్రం గడప గడపకూ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ► గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్దేశించిన విధంగా జరగాలి. ప్రతి సచివాలయ పరిధిలో కనీసం రెండు రోజులు.. రోజుకు కనీసం 6 గంటల పాటు తిరగాలి. అలా తిరగని ఎమ్మెల్యేలు.. మరోసారి ఆయా సచివాలయాలు సందర్శించాలి. ప్రతి ఇంటికి వెళ్లాలి. ప్రతి ఇంట్లో కనీసం 5 నిమిషాలు గడిపి, వారికి ప్రభుత్వం వల్ల కలిగిన ప్రయోజనాలు వివరించాలి. ఒక వేళ ఒక గ్రామంలో రెండు రోజుల్లో మొత్తం తిరగలేమనుకుంటే.. మూడు, నాలుగు రోజుల సమయం తీసుకోండి. ఎక్కడా తొందర పడకూడదు. మొక్కుబడిగా పని చేయొద్దు. ప్రభావం చూపే పనుల్లో రాజీ వద్దు ► గ్రామాల్లో అత్యధిక ప్రభావం చూపే (హై ఇంప్యాక్ట్ వర్క్) పనులనే గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించండి. ఎక్కడా స్వ ప్రయోజనాలు ఆశించకండి. ఎవరినో సంతోష పరచాలని కూడా ఆలోచించొద్దు. ఆ పనుల కోసం ప్రతి సచివాలయానికి కేటాయిస్తున్న నిధుల్లో ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. అందువల్ల మీరు పనుల ప్రాధాన్యతను గుర్తించి, అక్కడికక్కడే ప్రతిపాదనలతో అప్లోడ్ చేస్తే, వెంటనే ఆమోదం లభిస్తుంది. ► అత్యంత ప్రాధాన్యత కలిగిన 23,808 పనులకు సంబంధించి రూ.930.28 కోట్లతో ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు రాగా, వాటిలో 21,275 పనులకు అనుమతి ఇచ్చాం. ఆ పనుల విలువ రూ.828.45 కోట్లు. వాటిలో 17,905 పనులు మొదలయ్యాయి. ఈ పనుల విలువ రూ.662.14 కోట్లు. మీరంతా మళ్లీ గెలవాలి మీ మీద నాకు ప్రేమ ఎక్కువ. మీలో ఎవరినీ పోగొట్టుకోవడం నాకిష్టం లేదు. మీ అందరినీ మళ్లీ చట్టసభలో చూడాలి. అదే నా కోరిక. మనం మన బాధ్యత సక్రమంగా నెరవేర్చకపోతే, కోట్ల మంది నష్టపోతారు. మోసంతో కూడిన రాజకీయాలు.. ప్రజలను ఉపయోగించుకుని వదిలేసే రాజకీయాలు.. వెన్నుపోటు రాజకీయాలు.. అబద్ధాల రాజకీయాలు.. ప్రజల మీద, పేదవాడి మీద ప్రేమ లేని రాజకీయాలు రాజ్యమేలుతాయి. మనకు ఎన్నికలకు ఇంకా 16 నెలల సమయం ఉంది. గడప గడపకూ.. కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం? అని ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఇంట్లో కనీసం 5 నిమిషాలు గడిపి, ఆ ఇంటికి చేసిన మంచిని వివరించి, వారి ఆశీర్వాదం కోరండి. అప్పుడే వారి నుంచి మనకు సానుకూలత లభిస్తుంది. ఎన్నికల ముందు మీకు అంత సమయం ఉండదు కాబట్టి ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరితో మమేకం అవ్వండి. అదే మన గెలుపునకు బాటలు వేస్తుంది. -
తీరు మారాలి.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: గడప గడపకు మన ప్రభుత్వంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జి మంత్రులను ఉద్దేశించి సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల వద్దకే వెళ్లి వాళ్ల సమస్యలు తెలుసుకుని.. సత్వర పరిష్కారం చేయాల్సిన ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయొద్దని ఆయన గట్టిగానే ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ మేరకు ఈ కార్యక్రమంలో వెనుకబడ్డ 27 మందిని ఆయన సున్నితంగా మందలించినట్లు తెలుస్తోంది. వారంలో నాలుగు రోజుల చొప్పున.. నెలకు పదహారు రోజులు కూడా తిరగకపోతే ఎలా? అని 27 మంది తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ మేరకు వాళ్ల పేర్లు చదివి మరీ.. వేగం పెంచాలని వాళ్లకు ఆయన సూచించారు. గంటా రెండు గంటలు తిరగడం కాదు.. ఏడు నుంచి ఎనిమిది గంటలు గ్రామాల్లో తిరగాలి. అదే గ్రామంలో పార్టీ నేతల ఇళ్లలో భోజనాలు చేయాలి. ప్రతి గడపకూ కచ్చితంగా సమయం కేటాయించాలి. డిసెంబర్లో మళ్లీ సమీక్ష నిర్వహిస్తా. అప్పటిలోగా అందరూ బాగా తిరగాలి. మళ్లీ నాతో పని చేయాలనే మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నా అని పరోక్షంగా వాళ్లను హెచ్చరించారు ఆయన. కుటుంబ సభ్యులు, బంధువులను గడప గడపకులో తిప్పొద్దని, ప్రజా ప్రతినిధులే వెళ్లాలని సమస్యలు గుర్తించి.. వెంటనే పరిష్కారం చేయాలని, అలాగే కేటాయించిన నిధులను వినియోగించుకోవాలని సీఎం జగన్ సూచించారు. ఈ విషయాన్ని ఏపీ హోంమంత్రి తానేటి వనిత, మాజీ మంత్రి పేర్ని నాని సైతం ధృవీకరించారు. ఇదీ చదవండి: వరుసగా మూడోసారి నంబర్‌వన్: సీఎం జగన్ -
ప్రతి సచివాలయంలో కచ్చితంగా 2 రోజులు గడప గడపకూ నిర్వహించాలి: సీఎం జగన్
-
‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై సీఎం జగన్ వర్క్‌షాప్ (ఫొటో గ్యాలరీ)
-
మనం చేయాల్సిందల్లా.. ప్రజల మద్దతు తీసుకోవడమే: సీఎం జగన్
తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వర్క్‌షాప్ నిర్వహించారు. మంత్రులు, రీజనల్ కో ఆర్డినేటర్స్, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్క్‌షాపును ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏమన్నారంటే.. ►గడపగడపకూ అనేది నిరంతరాయంగా జరిగే కార్యక్రమం ►దాదాపు 8 నెలలపాటు ఈకార్యక్రమం జరుగుతుది ►ఒక్కో సచివాలయానికి రెండు రోజులపాటు కేటాయింపు ►నెలలో 20 రోజులచొప్పున 10 సచివాలయాల్లో గడపగడపకూ కార్యక్రమం ►గడపగడపకూ కార్యక్రమాన్ని ఏరకంగా చేశాం? ఎలా చేస్తున్నాం? ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలి? ఎలా సమర్థత పెంచుకోవాలి? అన్నదాన్నికూడా మనం నిరంతరంగా చర్చించుకోవాలి. అందుకోసం నెలకోసారి వర్క్‌షాపు నిర్వహిస్తాం ►ఆ నెలరోజుల్లో చేపట్టిన గడపగడపకూ కార్యక్రమం, ఈ కార్యక్రమం ద్వారా మనకు వచ్చిన ఫీడ్ బ్యాక్‌పై ఈ వర్క్‌షాపులో చర్చిస్తాం ►ఇంకా మెరుగ్గా, సమర్థవంతంగా కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలన్నదానిపై ఈ వర్క్‌షాపుల్లో దృష్టిసారిస్తాం ►ప్రజాప్రతినిధుల నుంచి ఈ వర్క్‌షాపుల్లో సూచనలు, సలహాలు కూడా నిరంతరంగా తీసుకుంటాం, వాటిపై చర్చిస్తాం. దీనివల్ల మన ప్రయాణం మరింత మెరుగ్గా సాగుతుంది ►గడపగడపకూ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు ప్రజలనుంచి వచ్చిన విజ్ఞాపనలు, ఆ విజ్ఞాపనల పరిష్కారం కూడా అత్యంత ముఖ్యమైనది ►ఈ ప్రక్రియ సజావుగా, సమర్థవంతంగా సాగడంపైన కూడా దృష్టిపెడుతున్నాం ►గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో 175కి 175 సాధించాలి. ►ఇది మన లక్ష్యం, ఇది కష్టం కాదు. ఎందుకంటే.. ప్రతి ఇంటికీ మీరు వెళ్తున్నారు, ప్రతి ఇంటికీ జరిగిన మేలును వివరిస్తున్నారు ►ఏయే పథకాలు ఆ కుటుంబానికి అందాయో చెప్తున్నారు. ప్రతి అక్క చెల్లి పేరుమీద లేఖ కూడా ఇస్తున్నారు ►మనకు ఓటు వేయని వ్యక్తికి కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, పార్టీలు చూడకుండా పారదర్శకంగా మేలు చేశాం ►ప్రతి ఇంటికీ మేలు జరిగినప్పుడు.. ప్రజా ప్రతినిధులుగా మనకు ఏంకావాలి ►చరిత్రలో మనం ఒక ముద్ర వేశాం ►సంతృప్తిస్థాయిలో మంచి చేశామని చెప్పుకోగలుగుతున్నాం. కాలర్ ఎగరేసుకుని తిరగగలుగుతున్నాం ►ఇక మనం చేయాల్సిందల్లా.. ప్రజల మద్దతును మనం తీసుకోవడమే ►ఎవరైనా అనుకున్నామా? కుప్పంలో మున్సిపాల్టీ గెలుస్తామని? ►ఎంపీటీసీలు, జడ్పీటీసీలు క్లీన్ స్వీప్ చేస్తామని? ఎందుకు జరిగింది? ►అలాగే 175కి 175 సాధించగలుగుతాం. ఇది జరగాలి అంటే.. మనం కష్టపడాలి ►రాష్ట్రంలోని 87శాతం కుటుంబాలకు పథకాలు చేరాయి ►ప్రతి సచివాలయంలోనూ కచ్చితంగా 2 రోజులు గడపగడపకూ నిర్వహించాలి ►ప్రతి సచివాలయంలోనూ పొద్దుట నుంచి సాయంత్రం 6–7వరకూ గడపగడకూ నిర్వహించాలి ►ప్రతి నెలలో 10 సచివాలయాలు నిర్వహించేలా ప్రణాళిక వేసుకోవాలి ►ప్రతి నెలలో 20 రోజులు గడపగడపకూ నిర్వహించాలి. కార్యక్రమాన్ని నాణ్యతతో చేయడం అన్నది చాలా ముఖ్యం' అని సీఎం జగన్ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: (World Brain Tumor Day: మెదడులో కల్లోలం.. లక్ష మందిలో ఏడుగురికి) -
పరిమితి, కాలపరిమితి లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు: సజ్జల
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ పథకాలను పరిమితి, కాలపరిమితి లేకుండా అర్హులందరికీ అందిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను మాత్రం అమలు చేస్తున్నారని అన్నారు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో సాంఘిక సంక్షేమశాఖలో అమలవుతున్న పథకాలపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 'ప్రజల కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులదే. ముఖ్యమంత్రికి అతి ఇష్టమైన శాఖల్లో సాంఘిక సంక్షేమ శాఖ ఒకటి. ప్రజలకు విద్య, వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నాం. సంక్షేమ పథకాలు అంటే ముందుగా గుర్తొచ్చేది షెడ్యూల్డ్ కులాలు. సాంఘిక సంక్షేమ హాస్టల్లలో మౌలిక వసతులు కల్పించడానికి రాజీపడే ప్రసక్తే లేదు. గత ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 1700 వసతి గృహాల్లో 700 ఎత్తివేశారన్నారు. 'ఆ దిశగానే అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలని కోరుతున్నా. ప్రభుత్వ పరంగా పేదలకు సంక్షేమ పథకాలు అందించే అధికారులు మీరే. సోషల్ ఆడిట్ పెట్టి మరీ సంక్షేమ పథకాలను అందజేస్తున్న ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం. దళితుల కోసం ముందుండి నడిపించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీల అభిప్రాయాల కోసం సాంఘిక సంక్షేమ శాఖ పూర్తి స్థాయిలో పని చేస్తుంది. ప్రభుత్వం నడిపేది అధికారులైన మీరే' అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. చదవండి: (మంచి పనిని అడ్డుకునే ప్రయత్నం చేశారు, కానీ..: సీఎం జగన్) -
మహిళా జర్నలిస్టులకోసం రూ. 5 లక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టుల వర్క్‌షాప్ శనివారం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఏప్రిల్ 23, 24(శని, ఆది) రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమాలను తెలంగాణా ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ అల్లం నారాయణ ప్రారంభించారు. హైదరాబాద్ బేగంపేట, ప్లాజా హోటల్లో ప్రారంభమైన శిక్షణా శిబిరంలో తొలి రోజు మొదటి సెషన్‌కు జర్నలిసులు స్వేచ్ఛ, సుమబాల అధ్యక్షత వహించారు. రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా రెడ్డి హాజరైనారు. తెలంగాణా ఏర్పడిన తరువాత తొలిసారి మహిళా జర్నలిస్టుల కోసం ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, ఇది సంతోషదాయక మని అల్లం నారాయణ వెల్లడించారు. మహిళా జర్నలిస్టుల అస్థిత్వం కోసం, వారికి ఒక స్పేస్‌ను కల్పించడమే దీని ఉద్దేశమన్నారు. వివిధ అంశాలపై సీనియర్ పాత్రికేయుల ప్రసంగాలతోపాటు, మహిళలుగా మీడియాలో ఎదురవుతున్న కష్టనష్టాలను పంచుకునే కలబోత కార్యక్రమం కూడా ఉందని అల్లం నారాయణ వెల్లడించారు. ఈ చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని, అలాగే ఆయా సమస్యలను అర్థం చేసుకుని పరిష్కారంకోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. మహిళా జర్నలిస్టులకోసం రూ. 5 లక్షలు రాష్ట్ర మహొళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జర్నలిస్టులనుద్దేశించి ప్రసంగించారు. మహిళా జర్నలిస్టుల సంక్షేమం కోసం మంత్రిత్వ శాఖ తరపున 5 లక్షల రూపాయలను ఆమె ప్రకటించారు. ఈ సందర్భంగా తన అనుభవాలను పంచుకున్నారు. అనేక సమస్యలను ఎదుర్కొంటూ జర్నలిస్టులుగా రాణిస్తున్నవారికి, ఉన్నత స్థాయిలో తమ ప్రతిభను చాటుకుంటున్న వారిందరికీ మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మహిళా మీడియా సెంటర్ ఏర్పాటుకు కృషి ఈ సందర్బంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఇంతమంది మహిళా జర్నలిస్టులను చూడటం సంతోషంగా ఉందన్నారు. అన్ని రంగాల్లోనూ మహిళలు ఉన్నత స్థాయికి రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని ముఖ్యంగా మీడియా, పోలీసు రంగంలో మరింత శ్రమించాల్సి ఉంటుందన్నారు. తన దృష్టికి వచ్చిన పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. మీడియా సెంటర్ ఏర్పాటు కోసం కూడా కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమ కాలంలోనూ, ఇపుడు పునర్నిర్మాణంలో కూడా జర్నలిస్టుల పాత్ర అమోఘమని ఆమె కొనియాడారు. ముఖ్యంగా మీడియాలో పురుషులతో సమానంగా ఎదగడం అంటే.. ఎంతో ఒత్తిడి ఉంటుంది, అయినా నిబద్ధతతో రాణిస్తున్నవారిని తాను చాలామందిని చూశానని, ఇది నిజంగా అభినందనీయమని సబితారెడ్డి ప్రశంసించారు. తెలంగాణ తొలి మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి సాక్షి.కామ్‌తో ప్రత్యేకంగా మాట్లాడుతూ మహిళా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం తమ ప్రభుత్వం తరపున చేయాల్సిందంతా చేస్తామని హామీ ఇచ్చారు . జర్నలిజం అంటే ఒక వినూత్నమైన రంగం. మీడియా రంగాన్ని కేవలం పురుషులకే పరిమితం కాకుండా అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ కూడా తాము ముందుండాలనే లక్ష్యంతో సాగుతున్న మహిళా పాత్రికేయులందరికీ హ్యాట్సాఫ్ అన్నారు. -
సమస్యల పరిష్కారానికి ‘సాక్షి’ ఓ ముందడుగు
సాక్షి, నెట్వర్క్: స్థానిక సమస్యల పరిష్కారానికి సాక్షి మీడియా గ్రూప్ మరో అడుగు ముందుకేసింది. అన్ని వనరులున్నా కాసింత చొరవ, ముందుచూపు లేకపోవటంతో కొనసాగుతున్న సమస్య లకు చెక్ చెప్పే ప్రయత్నంలో భాగంగా పౌర సమాజాన్ని, ప్రజాప్రతినిధులు, అధికారులను ఒకే వేదిక మీదకు తీసు కువచ్చింది. శుక్రవారం జూమ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా చర్చా వేదికలు నిర్వహించింది. ఆయా పట్టణాలు ఎదుర్కొంటున్న వరద ముంపు, చెత్త వంటి సమస్యల పరిష్కారం దిశగా చొరవ తీసుకుంది. పట్టణాల సమగ్ర అభివృద్ధితో పాటు కొత్త ఉపాధి అవకా శాలపై చర్చలు నిర్వహించింది. నిరుద్యోగుల ఉపాధికి ఇండస్ట్రియల్ పార్కులు: హరీశ్‌రావు సిద్దిపేటలో నిర్వహించిన డిబేట్లో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ‘వలసలు. కరువుల నుంచి బయటపడి సీఎం కేసీఆర్ ఆశీస్సులతో సస్యశ్యామల జిల్లాగా సిద్దిపేటను మార్చుకున్నాం. సమగ్రాభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి పై దృష్టి పెట్టాం. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన నీరు, విద్యుత్, రవాణా లాంటి వసతులను ఒక్కొక్కటిగా కల్పిస్తున్నాం. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, చేర్యాల ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. అందుకు వెయ్యి ఎకరాల భూసేకరణ కూడా చేశాం. పరిశ్రమలకు ప్రత్యేక లేఔట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. వర్గల్లో 1,200 ఎకరాల్లో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నాం..’ అని హరీశ్‌రావు తెలిపారు. వరంగల్‌లో ‘ముంపు’పై ముందుచూపు గతేడాది ఇదే సీజన్లో భారీగా వచ్చిన వర్షాల కారణంగా వరంగల్ నగరంలో 33 డివిజన్లు ముంపునకు గురయ్యాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌లో ఇలాంటి విపత్తులు సంభవించకుండా ఉండేందుకు వీలుగా ‘వరంగల్ ముంపు’పై శుక్రవారం చర్చ జరిగింది. న్యాయవాది పొట్లపల్లి వీరభద్రరావు, సామాజిక కార్యకర్తలు తిరునగర్ శేషు, పుల్లూరు సుధాకర్, రెడ్‌క్రాస్ చైర్మన్ విజయచందర్ రెడ్డి, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, గ్రేటర్ వరంగల్ సీఎంహెచ్వో రాజిరెడ్డి, గ్రేటర్ వరంగల్ డీఎఫ్ఓ కిశోర్ పాల్గొన్నారు. ప్రధానంగా వరంగల్ మహానగరంలో నాలాలు, గొలుసుకట్టు చెరువులు ఆక్రమణకు గురై అక్రమ నిర్మాణాలు వెలియడం వల్ల చాలా కాలనీలు ముంపునకు గురవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. నగరంలో ఉన్న సుమారు 32 చెరువులు కుదించుకుపోగా, 12 వరకు నామరూపాలు లేకుండా పోయాయని వీరభద్రరావు, పుల్లూరు సుధాకర్ తదితరులు పేర్కొన్నారు. వరదలు వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు స్పందించకుండా, ఆక్రమణలపై కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు శాశ్యత ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ముంపునకు గురికాకుండా ఏమేమి చర్యలు చేపట్టాలో వెల్లడించారు. కాగా ముంపు ప్రాంతాల్లో గతేడాది ఎలాంటి చర్యల ద్వారా ప్రజలను ఆదుకున్నారు? ఎలాంటి ముందస్తు ప్రణాళికలు చేపడుతున్నారు? తదితర అంశాలను సీఎంహెచ్ఓ రాజిరెడ్డి, డీఎఫ్ఓ కిశోర్ వివరించారు. మౌలిక వసతులపైనా.. నిజామాబాద్ నగరంలో మౌలికవసతులు, నల్లగొండలో భూగర్భ డ్రైనేజీ, భువనగిరిలో ప్రధాన రహదారి , సంగారెడ్డిలో చెత్త డంపింగ్ యార్డు అంశాలపై, మహబూబ్‌నగర్ పట్టణంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణ కోసం ఉద్దేశించిన భారత్ మాల రహదారి నిర్మాణ అవాంతరాలపై చర్చ జరిగింది. -
జల్‌జీవన్ మిషన్‌పై వర్క్‌షాప్ ప్రారంభించిన పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: జల్‌జీవన్ మిషన్‌పై ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం వర్క్‌షాప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ టెక్నికల్ హ్యాండ్‌బుక్‌ను మంత్రి పెద్దిరెడ్డి ఆవిష్కరించారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. '' జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులకు ఆర్డబ్ల్యూఎస్ ద్వారా నీటి వసతి అందిస్తున్నాం. 2024 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. జల్‌జీవన్ మిషన్ ద్వారా ఈ ఏడాది రూ. 7,251 కోట్లతో పనులు చేపట్టనున్నాం. వాటర్ గ్రిడ్‌తో మంచినీటి సమస్యకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టనున్నాం'' అని పెద్దిరెడ్డి తెలిపారు. -
పిల్లల ఊహాశక్తికి సరైన ఇంధనం.. ‘టిక్లింగ్ టేల్స్’
పిల్లల ఊహాశక్తికి సరైన ఇంధనం కథ. పిల్లల మెదళ్లను చురుగ్గా మార్చగలిగే సాధనం కథ కానీ, ఈ డిజిటల్ యుగంలో యంత్రాలతో కుస్తీ పడే పిల్లలకు కథ చేరువలో లేదు.నాయనమ్మ, తాతయ్య లేని చిన్న కుటుంబాలు.సంపాదనలో తల్లీదండ్రులవి తీరికలేని క్షణాలు. ఇలాంటి లోకంలో పిల్లల మానసిక శక్తి గురించి ఆలోచించారు డాక్టర్ శ్వేత.టిక్లింగ్ టేల్స్ అంటూ పిల్లలకోసం కథల పందిరి అల్లుతున్నారు. రాజస్థాన్‌లో పుట్టి పెరిగిన శ్వేత వృత్తిరీత్యా దంతవైద్యురాలు. తల్లి అయ్యాక మూడేళ్ల కొడుకు తను ఏం చెప్పినా ‘ఊ..’ కొట్టే విధానం ఆమెను కట్టిపడేసింది. ఎంతో తెలుసుకోవాలనే ఆరాటం గల ఆ చిన్న వయసు ‘కథ చెప్పవూ’ అని అడుగుతున్నట్టుగా అనిపించేది’ అంటారు శ్వేత. ఆ ఆలోచనే ఇప్పుడు వేలాది మంది పిల్లలకు కథలు చెప్పేలా చేసింది అంటారామె. అక్కణ్ణుంచే ‘టిక్లింగ్ టేల్స్’అంటూ లిటిల్ స్టార్స్‌కి కథల పందిరి వేస్తోంది. తల్లిదండ్రులకు కథలు చెప్పడంలో నైపుణ్యాలు చెబుతుంది. స్కూళ్లలో కథల వర్క్‌షాప్స్ నడుపుతోంది. పిల్లల పుట్టిన రోజులు, పాఠశాల వార్షికోత్సవాలు.. అది ఇది అని ఏమీ లేకుండా పిల్లలు ఎక్కడుంటే అక్కడ కథలతో దోస్తీ చేయిస్తుంది. రచయిత్రిగా, కథకురాలిగా, శిక్షకురాలిగా, కోచ్‌గా, టిక్లింగ్ టేల్స్ డైరెక్టర్‌గా డాక్టర్ శ్వేత అద్భుతమైన పాత్రలను పోషిస్తోంది. చదవని వారికి వినిపించే కథ ‘చిన్నతనం లో తల్లితో కలిసి భయం భయంగా లైబ్రరీకి వెళ్లిన తొలిరోజులను ఇప్పటికీ గుర్తుకు చేసుకుంటుంది శ్వేత. అక్కడ తను చూసిన కథల పుస్తకాలు పఠనం పట్ల ఎలా ఆసక్తిని పెంచిందో చెబుతుంది. ఆ ఆసక్తే ఇప్పుడు ప్రతిభావంతులైన కథకుల బృందానికి నాయకత్వం వహించేలా చేసింది’ అంటోంది ఈ డాక్టర్. ‘బాగా చెప్పాలంటే బాగా చదవాలనే విషయాన్ని ఎప్పుడో గ్రహించాను. ఇప్పుడు పిల్లలను చూడండి. వారు ఎంతసేపూ వీడియో గేమ్స్ ఆడటమే చూస్తున్నాం. కథల పుస్తకాలు చదవడం అనేదే మనం చూడటంలేదు. ఈ తరం ఎక్కడికి వెళుతుందో అనే ఆందోళన నాది. నా కొడుకుతో కాసేపు సమయం గడిపినా వాడిని కథల్లోకి తీసుకెళ్లిపోతాను. నేను చదివిన విషయాలన్నీ వాడికి కథలుగా మార్చి చెబుతుంటాను. వాడిపై ఆ కథల ప్రభావం, ఫలితాన్ని చూసినప్పుడు తల్లిగా నా ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా మారిందో అర్ధమైంది. అప్పుడే మా ఇంటి నాలుగు గోడలు దాటి కథలు వినే పిల్లల సంఖ్య పెరగాలన్న విషయం గ్రహించాను. ఎక్కువమంది పిల్లలకు కథలు వినసొంపుగా చెప్పాలంటే నేను మరిన్ని పుస్తకాలతో ప్రేమలో పడాలి. ఈ వాస్తవాన్ని గ్రహించి ఇంట్లో పుస్తకాల లైబ్రరీ ఏర్పాటు చేసుకున్నాను. ఎవరైనా తల్లితండ్రులు ఈ సూత్రాన్ని పాటించవచ్చు’ అంటారు డాక్టర్ శ్వేత. ఈ కథాస్టార్ బృందంలో ఆరుగురు కథలు చెప్పే ప్రతిభావంతులైన తల్లులు ఉన్నారు. ఈ బృందం రేపటితరానికి కథలతోఎలాంటి మార్గం వేయాలో సమావేశాలు ఏర్పరచుకుంటారు. తాము చేయబోయే, చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రణాళికలు రచిస్తుంటారు. కథా ప్రపంచంలోకి ప్రయాణం ‘టిక్లింగ్ టేల్స్’ అంటూ కథలు చెప్పడం 2013 లో ప్రారంభించింది డాక్టర్ శ్వేత. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదామె. టిక్లింగ్ టేల్స్ ముఖ్య ఉద్దేశం పాఠకులను పెంచడం, పిల్లలను తిరిగి పుస్తకాల లోకంలోకి తీసుకురావడం, వారిని చదివించేలా చేయడం, కథ చెప్పే సెషన్ల తోపాటు, ఉపాధ్యాయులతో శిక్షణా కార్యక్రమాలు, పాఠశాల సెషన్లు ఏర్పాటు చేయడం వంటివీ ఉంటాయి. ఆరోగ్యకరమైన ఎదుగుదలకు కథ ‘కథలు వినడం ప్రతి బిడ్డ జన్మహక్కు. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి పిల్లలకి మంచి ఆహారాన్ని ఇస్తారు. అదేవిధంగా ఆరోగ్యకరమైన జీవితం కోసం మనసు కూడా హెల్దీగా ఉండాలి. అందుకు ప్రతి బిడ్డకు మంచి ఆలోచన విధానం కలిగించాలి. కథలు ప్రతి బాల్యంలో అంతర్భాగం గా మారాలి. ఇంట్లో ఒక మేధావిని పెంచాలనుకుంటే ఆ బిడ్డకు అద్భుత కథలు చెప్పాలి. అలాగని ఉనికిలో లేని విషయాల గురించి చెప్పకూడదు. కథ ద్వారా ఏది మంచిది, ఏది మంచిది కాదనేది వారికి తెలిసిపోవాలి. కథలు చెప్పేటప్పుడు పిల్లలను తక్కువ అంచనా వేయవద్దు..’ అంటూ తల్లిదండ్రులకు, టీచర్లకు తన వర్క్‌సెషన్ల ద్వారా వివరిస్తారు డాక్టర్ శ్వేత. ప్రస్తుతం ముంబై కేంద్రంగా పనిచేస్తున్న టిక్లింగ్ టేల్స్ వర్చువల్ ప్లానెట్ వెంచర్ ద్వారా కథా శ్రవణాన్ని అందిస్తోంది. పిల్లలకు పుస్తకాలు అందేలా చూడటంతోపాటు మ్యూజిక్‌తో కూడిన ఆడియో కథలనూ జతచేసి ఇస్తున్నారు. సౌండ్ ఎఫెక్ట్స్‌తో ఆసక్తికరంగా ఆడియో కథల పుస్తకాల ద్వారా పదాల ఉచ్చారణ, పఠనం, శబ్దాన్ని నేర్పుతున్నారు. పిల్లలు కథను గుర్తుకు తెచ్చుకోవడానికి, తిరిగి ఆస్వాదించడానికి దేశవ్యాప్తంగా పప్పెట్ షోలను కూడా నిర్వహిస్తాం’ అని చెబుతున్నారు ఈ డాక్టర్. -
సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలి: బొత్స సత్యనారాయణ
-
కొండల్లో కొలువేల్పు
ఉద్యోగం ఉన్న ఇంట్లో దేవుడు ఉన్నట్లే. దేవుడి పటాన్నైతే తెచ్చిపెట్టుకోవచ్చు. ఉద్యోగాన్ని ఎవరు పటం కట్టి ఇస్తారు? పటాలతో కొండపైకి వెళ్లింది కివాసింగ్. మాట తీరును మెరుగుపరిచే పటం.. డబ్బులు కాసే ఐడియాల పటం.. మార్కెటింగ్‌కు పదును పెట్టే పటం.. అన్నీ కలిపి చూస్తే.. దేవుడు ప్రత్యక్షం! కుమావోన్ కొలువేల్పు కివా ఇప్పుడు. సరస్సులు కొండలపైకి ఎగసిపడలేవు. కివాసింగ్ రెండున్నరేళ్లుగా కొండలపైకి వెళ్లివస్తోంది. కొద్దిరోజులు కొండలపైనే ఉంటుంది కూడా. ‘సరస్సుల జిల్లా’ నైనిటాల్ అమ్మాయి కివాసింగ్. ‘టీచ్ ఫర్ ఇండియా’ లో ప్రోగ్రామ్స్ స్పెషలిస్టుగా అనుభవం ఉన్నవారికి చిన్నా చితకా ఉద్యోగాలేమీ రావు. నెత్తిన పెట్టుకుని విమానాల్లో ఊరేగించే ఉద్యోగాలే అన్నీ. అవొద్దనుకుని దేవుడి గుడి మెట్లు ఎక్కినట్లుగా.. కుమావోన్ కొండల్లోని ప్రతి గడపా ఎక్కి దిగుతోంది. ఏముంటాయి కొండల్లో! ఏముంటాయేమిటి? కొండలే ఉంటాయా! మనుషులు ఉండరా? వాళ్లకు పిల్లలు ఉండరా? వాళ్లు పెద్దయి ఉండరా? ఉద్యోగాల కోసం చూస్తూ ఉండరా? ‘‘నా పేరు కివాసింగ్ అమ్మా. నైనిటాల్ నుంచి వచ్చాను. మీ కిందే నేను ఉండేది. మీరు కొండపైన, నేను సరస్సు పక్కన..’’ ఆమె చేతిలో ఉన్న ఫైల్స్, ల్యాప్‌టాప్ చూస్తారు వాళ్లు. ఆమె ముఖంపై చిరునవ్వును కూడా. ఇంట్లోకి రమ్మనే అవసరం ఉండదు. కొండల్లో భాగమై ఉండే ఇళ్లు కనుక కొండంతా ఇల్లే. కూర్చునే చోటు, నిలబడే చోటు అంటూ ఏమీ ఉండవు. కూర్చున్నాక కివాసింగ్ అడుగుతుంది.. ‘‘చదువుకునే పిల్లలు గానీ, చదువుకున్న పిల్లలు గానీ ఇంట్లో ఉన్నారా?’’ అని. ‘‘ఉన్నారు తల్లీ. నీ అంత పిల్లలు ఉన్నారు. ఉద్యోగం ఏమైనా ఇప్పిస్తావా?’’.. వాళ్ల ప్రశ్న. నవ్వుతుంది కివాసింగ్. ‘‘ఏం ఉద్యోగం?’’ అంటుంది. ‘‘ఏదైనా.. ఇల్లు గడవడానికి నాలుగు రూపాయలు వస్తే చాలు’’ అంటారు. కుమావోన్ ప్రాంతంలో ప్రతి ఇంటి ముందూ కనిపించే మందార చెట్టులా, కనిపించకుండా ప్రతి చెట్టుకూ విరబూసే ఆశ.. ఉద్యోగం. బడికి పోతున్న పిల్లలున్నవాళ్లయితే.. ‘‘నీలాగా ఇంగ్లిష్ మాట్లాడాలి. నీలాగా కంప్యూటర్ వచ్చి ఉండాలి. అప్పుడు వాళ్లకు ఉద్యోగం వస్తుంది’’ అంటారు. మధ్యలో కివాసింగ్ ఫోన్ మాట్లాడ్డం విని ఉంటారు వాళ్లు. శ్రావ్యమైన ఆ కంఠంలోంచి జలపాతంలా దూకుతుండే ఇంగ్లిష్తో తమ పిల్లలకు తలస్నానం చేయించలేక గానీ.. లేకుంటే అంతపనీ చేసేవారు. ‘‘ఇంగ్లిష్ వస్తుంది అమ్మా.. చక్కగా మాట్లాడగలరు కూడా. నాకంటే చక్కగా..’’ అంటుంది కివాసింగ్. ఇదంతా రెండేళ్ల క్రితం వరకు. కివాసింగ్ టీమ్‌లోని వాలంటీర్ కుమావోన్‌కు కివాసింగ్ ఇప్పుడు తరచూ ఏమీ వెళ్లడం లేదు. ఆమె తరఫున వాలంటీర్లు వెళుతున్నారు. సాయంత్రాలు స్కూల్లో, కాలేజీ ఆవరణల్లో వర్క్‌షాపులు పెడుతున్నారు. వర్క్‌షాపు అనే మాట ఎంత లేదన్నా కాస్త గంభీరమైనదే. ఏదో కార్ఖానా అన్నట్లు ఉంటుంది. అలాంటి భయాలేమీ కలగకుండా వాలంటీర్లు పిల్లల్ని కలుసుకుంటున్నారు. ఇంగ్లిష్‌లో మాట్లాడ్డానికీ, ఇంగ్లిష్ అనే కాదు.. అసలంటూ చక్కగా మాట్లాడ్డానికి, కొత్తవాళ్లతోనైనా చొరవగా మాట్లాడడానికీ వారికి ఇప్పటి నుంచే శిక్షణ ఇస్తున్నారు. ఈ వాలంటీర్లలోనే నికార్సయిన స్పోకెన్ ఇంగ్లిష్ నేర్పించేవారు ఉంటారు. పిల్లల టీచర్లకు కూడా వాళ్లు బోధనలోని మెళుకువలు నేర్పిస్తుంటారు. ‘మెళకువ’ అంటే చెప్పడంలో మెళకువ కాదు, వినేలా చెప్పడంలో సరళత. అలాగే పిల్లల ఆసక్తుల్ని అడిగి తెలుసుకుని వాటిపై మరింత ఆసక్తిని కలిగించేందుకు స్టడీ మెటీరియల్ ఉచితంగా ఇస్తుంటారు. ఇక చదువు అయిపోయి, ఉద్యోగాల కోసం చూస్తున్న యువతుల వర్క్‌షాపు వేరుగా ఉంటుంది. క్యాంపస్ సెలక్షన్‌కు కంపెనీల వాళ్లు వచ్చినట్లు కొండల్లోకి వచ్చి రిక్రూట్ చేసుకునే వారూ ఉంటారు. అదంతా కూడా కివాసింగ్ ఏర్పాటే. అయితే వాళ్లేమీ పెద్ద పెద్ద అర్హతల కోసం చూడరు. ‘అదుంటే బాగుండేది, ఇదుంటే బాగుండేది’ అనరు. ‘మీరేం చేయగలరు?’ అని అడుగుతారు. కుమావోన్ అమ్మాయిలు తగ్గుతారా! ‘ఏదైనా చేయగలం’ అంటారు. ‘ఇక్కడే ఉండి ఏం చేయగలరు?’ అని వీళ్లు మళ్లీ అడుగుతారు. అప్పుడు అమ్మాయిల ఆలోచన స్వయం ఉపాధి వైపు మళ్లుతుంది. ఆ కొండల్లో తమకు ఏ ముడిసరుకు లభిస్తుందో గమనిస్తారు. సెలక్షన్ వాళ్లు వెళ్లిన మొదట్లో ఒక అమ్మాయి.. ‘ఐపన్ జాపపద కళ మాకు ప్రత్యేకం’ అని చెప్పింది. కుట్లు అల్లికల వంటిది ఐపన్. వాటితో అలంకరిస్తూ బ్యాగుల్ని తయారు చేసి మార్కెట్ చేసుకోవచ్చు అని వీళ్లు ఐడియా ఇచ్చారు. కొన్నాళ్ల తర్వాత ఇంకో టీమ్ వచ్చి కుమావోన్ ‘మహిళా పారిశ్రామిక వేత్త’లకు మార్కెటింగ్ ఎలా చేయాలో చెప్పి వెళ్లింది. ‘ఇక మీద మిమ్మల్ని మీరు ఎప్పుడూ కుమావోన్ అమ్మాయిల్లా చూసుకోకండి. మీ ఉత్పత్తులకు మీరు యజమానుల్లా ఉండండి’ అని కూడా! అమ్మాయిల కాన్ఫిడెన్స్ కళకళలాడితే ఎలా ఉంటుందో ఇప్పుడు ఎవరైనా వెళ్లి కుమావోన్లో చూడొచ్చు. ఎవరెస్టునే ఎక్కాలనేముందీ, సొంత కాళ్లపైన కూడా నిలబడొచ్చు. కుమావోన్‌లోని రెండు గ్రామాలకు ఆ శక్తిని ఇచ్చిన కివాసింగ్.. మిగతా గ్రామాలకూ చేరేందుకు టూల్ కిట్‌తో ఇప్పుడు నెట్లో ‘మౌటేన్ విలేజ్ ఫౌండేషన్’ అనే వెబ్ గుడారం వేసుకుని ఉంది. ఐపన్ ఆర్ట్‌తో సంచుల తయారీ : కుమావోన్ యువతులు -
రిలయన్స్ జియోకు ‘హార్ట్ఫుల్నెస్ ఆర్గనైజేషన్ అవార్డు’
సాక్షి, హైదరాబాద్: హార్ట్ఫుల్నెస్ ఇనిస్టిట్యూట్ ‘ది హార్ట్ఫుల్నెస్ ఆర్గనైజేషన్ అవార్డు’కు రిలయన్స్ జియో ఎంపిక అయింది. హైదరాబాద్‌లోని కన్హా శాంతి వనంలోని హార్ట్ఫుల్నెస్ ఇనిస్టిట్యూట్ యొక్క ప్రపంచ ప్రధాన కార్యాలయంలో శనివారం ఈ అవార్డు ప్రధానోత్సవం జరిగింది. జియో తెలంగాణ సీఈఓ కె.సి. రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ ఒక అంతర్జాతీయ లాభాపేక్షలేని సంస్థ. ఇది 130 దేశాలలో విస్తరించి ఉంది. సంస్థకు 2020 సంవత్సరం ఒక ముఖ్యమైన మైలురాయి. హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో ఈ ఏడాదితో హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ 75 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా, తన భాగస్వామి సంస్థలను ‘ది హార్ట్‌ఫుల్ ఆర్గనైజేషన్ అవార్డు’తో సత్కరించింది. ఉద్యోగుల శ్రేయస్సును ప్రోత్సహించడానికి హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్తో భాగస్వామ్యం కలిగిన ప్రపంచవ్యాప్తంగా 1,200 కి పైగా సంస్థల నుండి 10 ఉత్తమ కంపెనీలను ఎంపిక చేసారు. నూతన సంవత్సరం సందర్భంగా, రిలయన్స్ జియో హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో దేశ వ్యాప్తంగా 180 పైగా జియో కార్యాలయాలలో 3 రోజుల వర్క్‌షాప్ నిర్వహించింది, వీటిలో 3000 మందికి పైగా జియో ఉద్యోగులు పాల్గొన్నారు. చదవండి: ఇప్పటికీ జియోనే చౌక.. -
టి–హబ్‌లో రక్షణ రంగ స్టార్టప్‌ల వర్క్‌షాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రక్షణ రంగ స్టార్టప్ సంస్థలకు సంబంధించిన వర్క్‌షాప్‌కు హైదరాబాద్‌లోని టి–హబ్ వేదిక కానుంది. డిసెంబర్ 16, 17 తారీఖుల్లో (సోమ, మంగళ) రెండు రోజుల పాటు జరిగే ఈ వర్క్‌షాప్‌ను.. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్, నెక్సస్ స్టార్టప్ హబ్ (న్యూఢిల్లీ) కలిసి సంయుక్తంగా నిర్వహించనున్నాయి. భారత్, అమెరికా రక్షణ రంగ సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఇది తోడ్పడనుంది. డిఫెన్స్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి స్టార్టప్ సంస్థలు వినూత్న ఆవిష్కరణలు ఇందులో ప్రదర్శించనున్నాయి. పలువురు వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, ప్రభుత్వ అధికారులు ఈ వర్క్‌షాపులో పాల్గోనున్నారు. -
‘పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి’
సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగాల పరీక్షలను పకడ్బందీగా, సమర్థవంతంగా నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై అధికారులకు అవగాహన కల్పించేందుకు తాడేపల్లిలో నిర్వహించిన రాష్ట్ర్రస్థాయి వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. రేపు సాయంత్రానికి అన్ని జిల్లాల్లో స్టాంగ్ రూమ్‌లు సిద్ధం చేయాలన్నారు. ఈ సారి 1.26 లక్షల ఉద్యోగాలకు 22 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. పరీక్ష నిర్వహణలో ఎక్కడా చిన్నపాటి నిర్లక్ష్యానికి కూడా తావుండకూడదన్నారు. ప్రణాళికబద్ధంగా పరీక్షలను నిర్వహించాలని చెప్పారు. అధికారులంతా బాధ్యతగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఎంఎఫ్ఏ, డీటీపీ ఆధ్వర్యంలో దుబాయిలో వర్క్‌షాప్
గల్ఫ్ డెస్క్: గల్ఫ్ దేశాలకు ఉద్యోగుల భర్తీ ప్రక్రియను చేపట్టే రిక్రూటింగ్ ఏజెన్సీల వ్యాపార నైతికత, వలస కార్మికుల హక్కులు అనే అంశంపై జూన్ 23–25 వరకు దుబాయిలో ఒక వర్క్‌షాప్ జరిగింది. మైగ్రంట్ ఫోరమ్ ఇన్ ఏసియా(ఎంఎఫ్ఏ), డిప్లొమసీ ట్రైనింగ్ ప్రోగ్రాం (డీటీపీ), మిడిల్ ఈస్ట్ సెంటర్ అనే మూడు సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. అరబ్ గల్ఫ్ దేశాలు, ఆసియా దేశాలలోని సామాజిక కార్యకర్తలు, కార్మిక నాయకులు, యాజమాన్య సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. కార్యక్రమం చివరి రోజున దుబాయిలోని తెలంగాణ ప్రవాసులు కృష్ణ దొనికెని, మంద సుమంత్‌రెడ్డి పాల్గొన్నారు. అరబ్ గల్ఫ్ దేశాల ఆర్థికాభివృద్ధిలో వలస కార్మికుల పాత్ర గణనీయమైనది. వీరి హక్కుల గురించి, చట్టాల గురించి అవగాహన కల్పించాలి. ప్రైవేటు రంగం ఇందుకు బాధ్యత తీసుకోవాలి అనే నేపథ్యంలో ఈ చర్చాగోష్టి జరిగింది. వలస కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం ప్రభుత్వాలు, ప్రైవేటు రంగం, సామాజిక సంస్థలు కలిసి పనిచేయడం అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఇందుకు కావలసిన విజ్ఞానం అందించడానికి ఈ సామర్థ్య నిర్మాణ (కెపాసిటీ బిల్డింగ్) సదస్సు నిర్వహించారు. -
ముఖ్యమంత్రి అసెంబ్లీ పాఠాలు
-
స్కోడా ఆటో అతిపెద్ద వర్క్‌షాప్ ప్రారంభం
కోయంబత్తూర్: దేశంలోనే అతిపెద్ద వర్క్‌షాప్‌ను స్కోడా ఆటో ఇండియా తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఏర్పాటు చేసింది. ‘ఇండియా 2.0’ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎస్జీఏ కార్స్ ఇండియాతో కలిసి ఈ సర్వీస్ అవుట్‌లెట్‌ను ప్రారంభించింది. ఏడాదికి 20,000 స్కోడా వాహనాలను సర్వీసింగ్ చేయగలిగే విధంగా 49,585 చదరపు అడుగుల్లో ఈ సెంటర్ రూపుదిద్దుకుంది. ఈ సందర్భంగా సంస్థ సేల్స్, సర్వీస్, అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ జాక్ హోల్లిస్ మాట్లాడుతూ.. ‘దక్షిణ భారతదేశంలో మార్కెట్ వాటా పెంచాలనే లక్ష్యంతో కార్పొరేట్ ప్రమాణాలతో వర్క్‌షాప్‌ను ప్రారంభించాం. కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే భావనతో అధునాతన సేవలను అందిస్తున్నాం’ అని అన్నారు. -
ప్రొడక్టు డిజైన్‌పై గీతంలో వర్క్‌షాప్
సాక్షి, విశాఖపట్నం : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొడక్టు డిజైన్‌పై నిర్వహించే మూడురోజుల వర్క్‌షాప్ గురువారం మొదలైంది. విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయం మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో 12,13,14తేదీలలో వర్క్‌షాపు జరగనుంది. వర్క్‌షాప్ రిసోర్స్ పర్సన్‌గా న్యూజెర్సీలోని బెక్టాన్ డికిన్సన్ సంస్థ పరిశోధన-అభివృద్ధి విభాగం నిపుణుడు పాల త్రివిక్రమ్ భానోజీ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలోచనలకు రూపం ఇవ్వడంలో ప్రొడక్ట్ ఇంజనీరింగ్ పాత్ర కీలకమన్నారు. ఇందుకోసం క్యాడ్, కామ్ సాంకేతిక పరిజ్ఞానం జోడిస్తే వినియోగదారులకు అవసరమైన విధంగా ఉత్పత్తులు అభివృద్ధి చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ కె. లక్ష్మీప్రసాద్, హెచ్ఓడీ సత్యనారాయణ, ప్రొగ్రామ్ కన్వీనర్లు ఆర్.భానుపవన్, కోదండరావు తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ విక్రయదారులను దేశ ద్రోహులుగా ప్రకటించాలి
హైదరాబాద్: సినీ పరిశ్రమను ఒక కుదుపు కుదుపుతున్న డ్రగ్స్ వ్యవహారంపై సినీ నిర్మాత, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీష్ రెడ్డి స్పందించారు. మాదక ద్రవ్యాల మత్తులో మానవ సమాజం అనే అంశంపై సోమజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన చర్చా వేదికలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ విక్రయదారులను దేశద్రోహులుగా పరిగణించే విధంగా కఠిన చట్టాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు. డ్రగ్స్ మాఫియాను తీవ్రవాదులుగా పరిగణించి, వారిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీని కోరారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ కేసు దర్యాప్తు నత్తనడకగా జరుగుతోందన్నారు. డ్రగ్స్ అనర్థాలపై యువజన కాంగ్రెస్, స్వచ్ఛంద సంస్థలు యువతకు అవగాహన కల్పించాలని కోరారు. డ్రగ్స్ కేసులో ప్రభుత్వం రోజుకో సీనీనటులను దర్యాప్తు పేరుతో కాలయాపన చేస్తోందని అంతే తప్ప కేసులో పురోగతి లేదన్నారు. కేసులో పురోగతికి సిట్ అడుగులేయాలని పొంగులేటి చూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాస్, సూర్యప్రకాష్ రావు, మాజీ పోలీస్ అధికారి గోపీనాథ్ రెడ్డి, సినిమా రంగానికి చెందిన జొన్నవిత్తుల, త్రిపుర నేని చిట్టి, తెలంగాణ యువజన కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు వెంకట్, ఏఐఎస్ఎఫ్ తెలంగాణ అధ్యక్షుడు వేణు, పీడీఎస్‌యూ అధ్యక్షుడు ప్రభులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
బయోమెడికల్ వేస్ట్‌తో వ్యాధులు
– కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ సంచాలకులు రాజేందర్‌రెడ్డి కర్నూలు(హాస్పిటల్): ఆసుపత్రుల్లో బయోమెడికల్ వేస్ట్‌తో వైద్యసిబ్బందికే వ్యాధులు వచ్చే అవకాశం ఉందని కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ సంచాలకులు రాజేందర్‌రెడ్డి చెప్పారు. ఆసుపత్రుల్లో బయోమెడికల్ వేస్ట్ నిర్వహణపై బుధవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్లినికల్ లెక్చర్ గ్యాలరీలో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రుల్లో బయోవేస్ట్ నియమావళి, వ్యర్థపదార్థాలను వేరే చేసే పద్ధతి, చేతులు పరిశుభ్రత, వ్యక్తిగత సంరక్షణ, ద్రవ వ్యర్థాలు, వ్యాధి సంక్రమిక బట్టలను శుభ్రపరచడం, నేలను శుభ్రం చేయడం, పాదరస వ్యర్థ నిర్వహణ, వ్యర్థాలను నిల్వ ఉంచే ప్రదేశం ఎలాగుండాలనే విషయాలపై విపులీకరించారు. ఆసుపత్రుల్లో బయోమెడికల్ వేస్ట్‌ను ఎలా నిర్వహించాలనే విషయమై నియంత్రణకు తమ శాఖ చూసుకుంటుందన్నారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత లేకపోతే రోగాలు వస్తాయaన్నారు. సింగపూర్ దేశంలో వ్యర్థాలు రోడ్డుపై పారవేస్తే జరిమానాలు విధిస్తారన్నారు. ఇక్కడ కూడా ప్రస్తుతం మున్సిపల్ వ్యర్థాలు పారవేసే వారిపై జరిమానాలు విధించే చట్టం వచ్చిందన్నారు. దీంతో ప్రజల్లో క్రమశిక్షణ గల జీవితం అలవడుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి, సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ వై. శ్రీనివాసులు, ఏఆర్ఎంవో డాక్టర్ వై. ప్రవీణ్‌కుమార్, రక్షణ సంస్థ ప్రతినిధి రత్నం, తదితరులు పాల్గొన్నారు. -
పాపికొండల్లో జాతీయ స్థాయి ఫొటోగ్రఫీ వర్క్‌షాప్
13 జిల్లాల నుంచి 135 మంది ఫొటోగ్రాఫర్ల రాక ప్రత్యేక బోటులో పయనం రాజమహేంద్రవరం సిటీ : గతకాలపు చెరదని జ్ఞాపకాల దొంతరలకు సజీవసాక్ష్యం ఫొటో అని సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ ప్రాన్సిస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమీ సహకారంతో పాపికొండల ప్రాంతంలో నాలుగు రోజు ల పాటు నిర్వహించే 8వ జాతీయ స్థాయి ఫొటోగ్రఫీ వర్క్‌షాప్‌ను రాజమహేంద్రవరం పుష్కరఘాట్ వద్ద జెండా ఊపి మంగళవారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అద్భుత దృశ్యాలను కెమెరాల్లో బంధించేందుకు ఫొటో గ్రాఫర్లు ఎంతో శ్రమిస్తుంటారని చెప్పా రు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చక్కని ఫొటోలు తీస్తూ ప్రజల మన్ననలు పొందేందుకు ప్రయత్నిస్తున్న ఫొటోగ్రాఫర్లను ఆయన అభినందించారు. ఫొటోలు వాస్తవికతకు అద్దం పడతాయన్నారు. 13 రాష్ట్రాలకు చెందిన 135 మంది ఫొటోగ్రాఫర్లు పాపికొండల ప్రాంతంలో జరిగే ఫొటో వర్క్‌షాపులో పాల్గొనేందుకు ప్రత్యేక బోటులో బయలుదేరి వెళ్లారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ వర్క్ షాపులో ల్యాండ్‌స్కేప్, ఫ్యాషన్, జర్నలి జం, ట్రావెల్, ఫిక్టోరియల్ విభాగాల్లో శిక్షణ ఇస్తామని ఫొటోగ్రఫీ అకాడమీ అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వరరావు తెలిపా రు. ఫెడరేష¯ŒS ఆఫ్ ఇండియ¯ŒS ఫొటోగ్రఫీ జనరల్ సెక్రటరీ బి.కె.సిహ్వ, ప్రముఖ అడ్వర్టైజ్మెంట్ ఫొటోగ్రాఫర్ సిరీస్ కరాలే, ఫొటోగ్రఫీ సొసైటీ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ సువర్ణాగేడే, ఫొటోగ్రఫీ అకాడమీ కార్యదర్శి టి.శ్రీనివాసరెడ్డి, బి.కె.అగర్వాల్ పాల్గొన్నారు.