సాక్షి, అమరావతి: జల్‌జీవన్ మిషన్‌పై ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం వర్క్‌షాప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్‌డబ్ల్యూఎస్ టెక్నికల్ హ్యాండ్‌బుక్‌ను మంత్రి పెద్దిరెడ్డి ఆవిష్కరించారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. '' జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులకు ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారా నీటి వసతి అందిస్తున్నాం. 2024 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. జల్‌జీవన్ మిషన్ ద్వారా ఈ ఏడాది రూ. 7,251 కోట్లతో పనులు చేపట్టనున్నాం. వాటర్ గ్రిడ్‌తో మంచినీటి సమస్యకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టనున్నాం'' అని పెద్దిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment