
బాధితులకు సత్వర న్యాయం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ :
న్యాయస్థానంలో సాంకేతిక పద్ధతిపై సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని హైకోర్టు జడ్జి, కడప అడ్మినిస్ట్రేటివ్ జడ్జి యు.దుర్గాప్రసాద్‌రావు పేర్కొన్నారు. శనివారం జిల్లా కోర్టు సమావేశం హాల్‌లో నిర్వహించిన 4వ వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. ప్రస్తుత సాంకేతిక సమాజంలో సత్వర న్యాయం జరిగేందుకు న్యాయమూర్తులు కృషి చేయాలన్నారు. ప్రచార సాధనాల ద్వారా వచ్చే సాక్ష్యాలను నమోదు చేసుకుని ప్రాదాన్యత ఇవ్వాలన్నారు. జిల్లా రిటైర్డ్ జడ్జి పి.మోహన్‌రావు మాట్లాడుతూ ’సాంకేతిక రంగంలో సాక్ష్యాలను త్వరితగతిన విచారించి, న్యాయ పరిజ్ఞానాన్ని అందించాలన్నారు. అదే విధంగా ఆధారాలను రికార్డుల పరంగా కాని, వీడియ కాన్ఫరెన్స్ ద్వారా కాని విచారించి తగు న్యాయ సలహాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి గంధం సునీత, జిల్లాలోని ప్రధాన న్యాయమూర్తులు పాల్గొన్నారు.