స్ట్రెస్ మేనేజ్‌మెంట్ పై వర్కుషాపు
Published Sun, Oct 23 2016 6:21 PM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM
తాడేపల్లిగూడెం(తాలూకా ఆఫీస్ సెంటర్):
స్థానిక శశి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ తాడేపల్లిగూడెంలో ఎస్‌ఎస్‌ఎస్ రెగ్యూలర్ యాక్టివిటీలో భాగంగా కళాశాలలో విద్యార్థినీ విద్యార్థులకు ఆదివారం స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌పై వర్కుషాపును నిర్వహించారు. ముఖ్య అతిధిగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి క్లీనికల్ సైకాలజిస్ట్ వి.హిమ బిందు హాజరైయారు. పరీక్షలను ఏ విధంగా ఎదుర్కొవాలి, ఒత్తిడిని ఏ విధంగా అధిగమించాలి తదితర విషయాలను విశ్లేషణంగా వివరించారు. సుమారు 20 మంది విద్యార్థినీ విద్యార్థులకు పర్సనల్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎ.రమేష్‌బాబు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భాను ప్రసాద్, కళాశాల డీన్స్ ఎం.వెంకటేశ్వరరావు, కె.వెంకట్రావు, జోడి, టీవీ రఘు ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర బందం పాల్గొన్నారు.
Advertisement