National Stress Awareness Day 2024 జీవితంలో ప్రతీ వ్యక్తికి ఎంతో కొత్త ఒత్తిడి ఉంటుంది. ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక కారణానికి ఒత్తిడిని అనుభవిస్తారు. కానీ ఒత్తిడికి మనం ప్రతిస్పందిస్తున్నామనేది మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఒత్తిడి తీవ్రమైతే మాత్రమే ముప్పే. ఈ నిశ్శబ్ద మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తుంది. ప్రతీ ఏడాది నవంబరు 6న నేషనల్ స్ట్రెస్ అవేర్‌నెస్ డే జరుపు కుంటారు. ఈ సందర్భంగా ఒత్తిడి, అవగాహన విషయాలను తెలుసుకుదాం.
దీర్ఘకాలిక ఒత్తిడి ఆందోళన, నిరాశలను కారణం. ఇది అనేక శారీరక అనారోగ్యాలకు దారితీస్తుంది. అందుకే దీనిపై అవగాహన పెంచుకుని, అప్రమత్తంకావాలి. స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌పై అవగాహన పెంచుకోవాలి.
జాతీయ ఒత్తిడి అవగాహన దినోత్సవం 2024: థీమ్
నేషనల్ స్ట్రెస్ అవేర్‌నెస్ డే 2024 థీమ్ "ఒత్తిడిని తగ్గించేందుకు, వారి సంరణక్షను మెరుగుపరచడానికి ప్రచారం చేయడం". ఇది ఒత్తిడి నిర్వహణ, మానసిక ఆరోగ్యం , స్వీయ సంరక్షణను ప్రోత్సహించేలా చేస్తుంది. విశ్రాంతి, సంపూర్ణత, సామాజిక సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రోత్సహిస్తుంది.
ఆరోగ్యంపై ఒత్తిడి ప్రభావాలు ఏమిటి?
ఆరోగ్యంపై ఒత్తిడి ప్రభావం శారీరకంగా, మానసికంగా గణనీయంగా ఉంటుంది. పని, ఆర్థిక వ్యవహారాలు, మానవ సంబంధాలు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, అనారోగ్యం, ప్రియమైన వ్యక్తి మరణం, లాంటి అంశాలు ఒత్తిడికి కారణమవుతాయి. ఇవి హార్మోన్లు, మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. దీర్ఘకాలిక ఒత్తిడి ఒత్తిడి కార్టిసాల్ అనే హార్మోన్‌ను పెరుగుదలకు దారి తీస్తుంది. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఫలితంగా సాధారణ జలుబు నుండి మరింత తీవ్రమైన అనారోగ్యాలకు దారి తీస్తుంది.
జలుబు, ఫ్లూ, వైరస్లు , ఇతర వ్యాధులు
డిప్రెషన్ , ఆందోళన, అలసట
తలనొప్పి, గుండె సమస్యలు లేదా గుండెపోటు, నిద్రలేమి
చిరాకు , కోపం, అతిగా తినడం, కడుపు, జీర్ణశయాంతర సమస్యలు
ఏకాగ్రతలోపించడం,
బయటపడేదెలా?
ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి అనేది ఎవరికి వారు ప్రయత్నించాలి. ఒత్తిడికి కారుణాలను అర్థం చేసుకోవడం ముఖ్యం.
మన చేయి దాటిపోతోంది అనిపించినపుడు థెరపిస్ట్ లేదా కౌన్సెలర్‌తో మాట్లాడి, వారి సలహాలను పాటించాలి. గిన చికిత్స తీసుకోవాలి.
వ్యాయామం చేస్తూ మనసుని, శరీరాన్నిఉత్సాహంగా ఉంచుకోవాలి.
నడవడం, జాగింగ్ బైక్ నడపడం, గార్డెనింగ్, యోగా లేదా వెయిట్ లిఫ్టింగ్ వంటివి చేయాలి. ఈ సందర్భంగా వెలువడిన హార్మోన్లు మెదడుకి మంచిది. సంతోషకరమైన అనుభూతినిస్తాయి.
ధ్యానం,మెడిటేషన్ టెక్నిక్‌ని ప్రయత్నించవచ్చు. ధ్యానం రక్తపోటును తగ్గిస్తుంది.
నచ్చిన పనిపై దృష్టిపెట్టాలి. తద్వారా మనసుకు ప్రశాంతత తనిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment