mental problems
-
నిశ్శబ్ద మహమ్మారి : కనిపెట్టకపోతే కాటేస్తుంది!
National Stress Awareness Day 2024 జీవితంలో ప్రతీ వ్యక్తికి ఎంతో కొత్త ఒత్తిడి ఉంటుంది. ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక కారణానికి ఒత్తిడిని అనుభవిస్తారు. కానీ ఒత్తిడికి మనం ప్రతిస్పందిస్తున్నామనేది మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఒత్తిడి తీవ్రమైతే మాత్రమే ముప్పే. ఈ నిశ్శబ్ద మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తుంది. ప్రతీ ఏడాది నవంబరు 6న నేషనల్ స్ట్రెస్ అవేర్నెస్ డే జరుపు కుంటారు. ఈ సందర్భంగా ఒత్తిడి, అవగాహన విషయాలను తెలుసుకుదాం.దీర్ఘకాలిక ఒత్తిడి ఆందోళన, నిరాశలను కారణం. ఇది అనేక శారీరక అనారోగ్యాలకు దారితీస్తుంది. అందుకే దీనిపై అవగాహన పెంచుకుని, అప్రమత్తంకావాలి. స్ట్రెస్ మేనేజ్మెంట్పై అవగాహన పెంచుకోవాలి.జాతీయ ఒత్తిడి అవగాహన దినోత్సవం 2024: థీమ్నేషనల్ స్ట్రెస్ అవేర్నెస్ డే 2024 థీమ్ "ఒత్తిడిని తగ్గించేందుకు, వారి సంరణక్షను మెరుగుపరచడానికి ప్రచారం చేయడం". ఇది ఒత్తిడి నిర్వహణ, మానసిక ఆరోగ్యం , స్వీయ సంరక్షణను ప్రోత్సహించేలా చేస్తుంది. విశ్రాంతి, సంపూర్ణత, సామాజిక సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రోత్సహిస్తుంది.ఆరోగ్యంపై ఒత్తిడి ప్రభావాలు ఏమిటి?ఆరోగ్యంపై ఒత్తిడి ప్రభావం శారీరకంగా, మానసికంగా గణనీయంగా ఉంటుంది. పని, ఆర్థిక వ్యవహారాలు, మానవ సంబంధాలు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, అనారోగ్యం, ప్రియమైన వ్యక్తి మరణం, లాంటి అంశాలు ఒత్తిడికి కారణమవుతాయి. ఇవి హార్మోన్లు, మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. దీర్ఘకాలిక ఒత్తిడి ఒత్తిడి కార్టిసాల్ అనే హార్మోన్‌ను పెరుగుదలకు దారి తీస్తుంది. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఫలితంగా సాధారణ జలుబు నుండి మరింత తీవ్రమైన అనారోగ్యాలకు దారి తీస్తుంది. జలుబు, ఫ్లూ, వైరస్లు , ఇతర వ్యాధులుడిప్రెషన్ , ఆందోళన, అలసటతలనొప్పి, గుండె సమస్యలు లేదా గుండెపోటు, నిద్రలేమి చిరాకు , కోపం, అతిగా తినడం, కడుపు, జీర్ణశయాంతర సమస్యలుఏకాగ్రతలోపించడం,బయటపడేదెలా?ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి అనేది ఎవరికి వారు ప్రయత్నించాలి. ఒత్తిడికి కారుణాలను అర్థం చేసుకోవడం ముఖ్యం.మన చేయి దాటిపోతోంది అనిపించినపుడు థెరపిస్ట్ లేదా కౌన్సెలర్‌తో మాట్లాడి, వారి సలహాలను పాటించాలి. గిన చికిత్స తీసుకోవాలి.వ్యాయామం చేస్తూ మనసుని, శరీరాన్నిఉత్సాహంగా ఉంచుకోవాలి.నడవడం, జాగింగ్ బైక్ నడపడం, గార్డెనింగ్, యోగా లేదా వెయిట్ లిఫ్టింగ్ వంటివి చేయాలి. ఈ సందర్భంగా వెలువడిన హార్మోన్లు మెదడుకి మంచిది. సంతోషకరమైన అనుభూతినిస్తాయి.ధ్యానం,మెడిటేషన్ టెక్నిక్‌ని ప్రయత్నించవచ్చు. ధ్యానం రక్తపోటును తగ్గిస్తుంది. నచ్చిన పనిపై దృష్టిపెట్టాలి. తద్వారా మనసుకు ప్రశాంతత తనిస్తుంది. -
Jaipur Literature Festival 2024: చిల్డ్రన్ ఫస్ట్
‘మన దేశంలో అన్నింటికీ కోర్సులు ఉన్నాయి... పేరెంటింగ్‌కి తప్ప. పిల్లల మానసిక సమస్యల గురించి చాలా తక్కువ పట్టింపు ఉన్న దేశం. పిల్లల్లో మానసిక సమస్యలు అధికంగా ఉన్న దేశం మనదే. పిల్లల గురించిన ఆలోచనే అందరికీ ప్రధానం కావాలి’ అన్నారు జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొన్న చైల్డ్ సైకియాట్రిస్ట్‌లు డాక్టర్ శేఖర్ శేషాద్రి, డాక్టర్ అమిత్ సేన్, పిల్లల మానసిక చికిత్సా కేంద్రం నిర్వాహకురాలు నేహా కిర్పాల్. ఇంకా వారేమన్నారు? ‘మన దేశంలో పదికోట్ల మంది బాల బాలికలు మానసిక సమస్యలతో బాధ పడుతున్నారు. వారిలో కేవలం ఒక్కశాతం మందికి మాత్రమే నాణ్యమైన మానసిక చికిత్స, థెరపీ అందుతున్నాయి. తల్లిదండ్రుల ప్రపంచం, పిల్లల ప్రపంచం వేరు వేరుగా ఉంది. చాలా కుటుంబాలలో సభ్యుల మధ్య కనెక్టివిటీ లేదు. దానివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి’ అని తెలిపారు పిల్లల మానసిక ఆరోగ్యరంగంలో పని చేస్తున్న నేహా కిర్పాల్, శేఖర్ శేషాద్రి, అమిత్ సేన్.జైపూర్‌లో జరుగుతున్న జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో ‘రీక్లయిమింగ్ హోప్’ అనే సెషన్లో వీరు పాల్గొన్నారు. చదువుల ఒత్తిడి – ఆత్మహత్యలు పోటీ పరీక్షల ఒత్తిడి పిల్లలను ఆత్మహత్య లకు ఉసిగొల్పుతోంది. రాజస్థాన్‌లోని ‘కోటా’లో కోచింగ్ సంస్థల వ్యాపారం 12 వేల కోట్లకు చేరుకుంది. ఏటా లక్షమంది విద్యార్థులు అక్కడ జెఇఇ, నీట్ ర్యాంకుల కోసం చేరుతున్నారు. తీసుకున్న ఫీజు కోసం నిర్వాహకులు తల్లిదండ్రులను సంతృప్తిపరచడానికి పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నారు. రోజుకు 12గంటల రొటీన్ వల్ల పిల్లలకు కొద్దిగా కూడా రిలీఫ్ లేదు. రోజువారీ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నవారికి ఒకరకమైన ట్రీట్మెంట్, మార్కులు రాక స్ట్రగుల్ చేస్తున్నవారికి ఒక ట్రీట్మెంట్ ఉంటోంది. పిల్లలు తమ మీద తాము విశ్వాసం కోల్పోతున్నారు. చెప్పుకుందామంటే తల్లిదండ్రుల నుంచి కనీస సానుభూతి దొరకడం లేదు. దాంతో ఆత్మహత్యల ఆలోచనలు, చర్యలు పెరుగుతున్నాయి. పిల్లలకు ఏం కావాలో తెలుసుకోకుండా వారు చదువుకునే గదుల్లో ఫ్యాన్లు తీసేసినంత మాత్రాన ఆత్మహత్యలు ఆగవు. పిల్లలే మనకు ప్రధానం అనుకోక΄ోవడం వల్ల ఈ దారుణ స్థితి ఉంది’ డాక్టర్ అమిత్ సేన్ అన్నారు. ఢిల్లీకి చెందిన ఈ చైల్డ్ సైకియాట్రిస్ట్ పిల్లలకు ఎలాగైనా మానసిక చికిత్స అందించాలని ‘చిల్డ్రన్ ఫస్ట్’ అనే ఆన్లైన్ క్లినిక్‌ని నడుపుతున్నారు. కాని పల్లెటూరి పిల్లలకు ఇలాంటి సాయం ఉంటుందని కూడా తెలియడం లేదు అని వా΄ోయారాయన. వందమంది పిల్లల్లో ఒక్కరే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు అని తెలిపారు. పరీక్షల మేళాలు జరగాలి ‘పరీక్షలంటే మార్కులు అని పిల్లల బుర్రల్లో ఎక్కించాం. కాని పరీక్ష రాస్తున్నాం అంటే ఏదో ఒకటి నేర్చుకునే అవకాశం వచ్చింది అనే భావన పిల్లల్లో ఎక్కించాలి. నేర్చుకుని, ఆ నేర్చుకున్నది చూపుదాం అని పిల్లలు అనుకోవాలి తప్ప మార్కులు చూపిద్దాం అనుకోకూడదు. నా దృష్టిలో పిల్లలు పరీక్షలు ఎంజాయ్ చేయాలంటే పరీక్షల మేళాలు జరగాలి. మైదానాల్లో రకరకాల పరీక్షలు రాసేందుకు పిల్లలను ఆహ్వానించాలి. అక్కడే ఆ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ ఉంచాలి. పురాణాలు, క్రీడలు, భౌగోళిక ్రపాంతాలు, ఆరోగ్యం... ఇలా అనేక అంశాల మీద పరీక్షలు అక్కడికక్కడ రాయించాలి. దాంతో పరీక్షల భయంపోతుంది’ అన్నారు నిమ్హాన్స్ (బెంగళూరు) సీనియర్ చైల్డ్ సైకియాట్రిస్ట్ శేఖర్ శేషాద్రి. ‘పిల్లలు ఏదైనా సమస్య చెప్పుకోవాలనుకున్నప్పుడు ముగ్గురు వారితో సున్నితంగా వ్యవహరించాలి. ఒకరు కుటుంబ సభ్యులు... రెండు స్కూల్ టీచర్లు... మూడు సమాజం అనే చుట్టుపక్కలవారు, బంధువులు. పిల్లలకు గౌరవం ఇవ్వాలి అని కూడా చాలామంది అనుకోరు’ అన్నారాయన. ‘చైల్డ్ అబ్యూజ్ జరిగినప్పుడు పిల్లలు వచ్చి చెప్పుకుంటే వారిని దగ్గరకు తీసుకోవాల్సిందిపోయి... నువ్వే దీనికి కారణం అని నిందించే స్థితి ఉంది’ అన్నారాయన. కోవిడ్ చేసిన మేలు ‘కోవిడ్ వల్ల తల్లిదండ్రులు, పిల్లలు ఇంట్లో ఎక్కువ రోజులు కలిసి ఎక్కువసేపు గడిపే వీలు వచ్చింది. అప్పటికి గాని మన దేశంలో పిల్లలు, తల్లిదండ్రులు ఒకరికి ఒకరు సంబంధం లేకుండా ఎలా జీవిస్తున్నారో పరస్పరం అర్థం కాలేదు. కోవిడ్ వల్ల బంధాలు బలపడ్డాయి. అది జరిగిన మేలు. అదే సమయంలో పిల్లల మానసిక సమస్యలు, ప్రవర్తనలు తల్లిదండ్రులకు తెలిసి వచ్చాయి. కాని వాటికి సరైన చికిత్స చేయించాలని మాత్రం అనుకోవడం లేదు’ అన్నారు నేహా కిర్పాల్. ఈమె పిల్లల మానసిక చికిత్స కోసం ‘అమాహహెల్త్’ అనే క్లినిక్‌ల వరుసను నడుపుతున్నారు. ‘పిల్లల మానసిక ఆహ్లాదానికి కళలు చాలా ముఖ్యమని తెలుసుకోవాలి. ఇటీవల పిల్లల మానసిక సమస్యలకు ఆర్ట్స్ బేస్డ్ థెరపీలు బాగా ఉనికిలోకి వచ్చాయి’ అని తెలిపారు వారు. – జైపూర్ నుంచి సాక్షి ప్రతినిధి -
అరచేతిలో అడిక్షన్
అర్ధరాత్రి.. మీరు గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా ఫోన్ మోగడంతో ఉలిక్కిపడి లేచారు. ఈ టైంలో ఫోనా?! ఎవరికి ఏమైందోనన్న ఆందోళనతో మంచం పక్కనే ఉన్న ఫోన్ అందుకుని కంగారుగా స్క్రీన్ వైపు చూశారు. అంతే, ఆశ్చర్యం, కాసింత గందరగోళం.. ఎందుకంటే మీకు అస్సలు ఫోనే రాలేదు. జన సమ్మర్థం ఉన్న ప్రాంతం.. అక్కడ మీరూ ఉన్నారు. అంతలో ఎవరిదో ఫోన్ రింగవుతోంది. ఆ వెంటనే మీ చేయి కూడా మీ జేబులో ఉన్న ఫోన్ మీదికి వెళ్లింది. మీ పక్కనే ఉన్న వ్యక్తి ‘హలో..’ అనడంతో మీకు అర్థమైంది.. రింగైంది మీ ఫోన్ కాదని. అసలు ఆ రింగ్ టోన్ కూడా మీ ఫోన్‌ది కాదు. ఆ విషయం మీకూ తెలుసు.. అయినా రింగ్ వినపడగానే మీ చేయి అలా మీ ఫోన్ మీదికి వెళ్లిపోయింది. ఫుల్ ట్రాఫిక్.. బైక్‌పై వెళుతున్నారు. జేబులో ఉన్న మీ ఫోన్ అప్పటికే రెండు మూడు సార్లు రింగైంది. కానీ ఫోన్ బయటకు తీసి మాట్లాడలేని పరిస్థితి. ఎవరు ఎందుకు కాల్ చేస్తున్నారో అని ఆలోచిస్తూ.. వేగంగా ట్రాఫిక్‌ను దాటి వెళ్లి బైక్‌ను అలా రోడ్డు పక్కన నిలిపి ఫోన్ బయటకు తీసి చూసి షాకయ్యారు. అక్కడ ఎలాంటి కాల్ రాలేదు. మరి రెండు మూడు సార్లు మీరు విన్న ఆ రింగ్ ఎక్కడిది? ఇల్లు.. ఇల్లాలు.. పిల్లలు.. ఓ అందమైన ఇల్లు.. ఆ ఇంట్లో మీరూ, మీ భార్య, ఇద్దరు పిల్లలు. మీరు బయటికి వెళ్లింది మొదలు.. ఇంట్లో ఎదురు చూపులు మొదలవుతాయి. ఉండబట్టలేక పిల్లలు అడిగేస్తారు.. నాన్న ఇంకెప్పుడొస్తారమ్మా? అని. ఆ నాన్న కోసమే ఎదురుచూస్తున్న అమ్మ.. ‘కాసేపట్లో వచ్చేస్తారులే’ అంటూ పిల్లలను సముదాయిస్తుంది. మీరు ఇంట్లోకి అడుగు పెట్టగానే.. ఇక ఆ ఇంట్లో సందడే సందడి. పిల్లల అల్లరితో అది తార స్థాయికి చేరుతుంది. అప్పుడు ఆ ఇల్లు.. నందనవనాన్ని తలపిస్తుంది. గృహమే కదా స్వర్గసీమ అన్న నానుడిని మరిపిస్తుంది. అలాకాకుండా, మీరు ఇంట్లోకి వచ్చీ రావడంతోనే జేబులోంచి మొబైల్ తీసి దానికి అంకితమైపోతే.. గంటల తరబడి దానికే దాసోహమైతే.. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయేంతగా మీ ఫోనే మీకు ప్రపంచమైతే.. మీ ఇల్లాలి సంగతేంటి? నాన్నతో కలిసి అల్లరిచేయడం కోసం ఎదురుచూస్తున్న ఆ పసిబిడ్డల పరిస్థితేంటి? అటు మొబైల్‌తో మీరు.. ఇటు మీ పలకరింపు కోసం నిరీక్షిస్తూ మీ ఇల్లాలు, మీకు బోలెడన్ని కబుర్లు చెప్పాలని పరితపిస్తూ మీ పిల్లలు. ఇంట్లో నలుగురు ఉన్నా.. అంతా నిశ్శబ్ధం! మీకు, మీ భార్యాపిల్లలకు మధ్య అంతులేని అగాథం! కుటుంబానికి టైం కేటాయించడానికి, మొబైల్‌తో టైంపాస్ చేయడానికి మధ్య ఎంత తేడా ఉందో చూడండి.. మనల్ని మనకు కాకుండా చేస్తుంది.. మన చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉందంటే యావత్ ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్టే. అవసరం మేరకు దానిని వినియోగించుకుంటే.. అరచేతిలో అద్భుతమవుతుంది. అంతకు మించి అదే పనిగా దానితో కాలక్షేపం చేస్తే మాత్రం అనర్థాలకు మూలమవుతుంది. ఇలా అతిగా ఫోన్ వాడేవారు దానికి బానిసలవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, విద్యార్థులు, యువత పలు మానసిక సమస్యల బారిన పడుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వ్యసనం చాలా ప్రమాదకరం. మన జీవితంపై, మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మనల్ని మనకు కాకుండా చేస్తుంది. మన వారిని మనకు దూరం చేస్తుంది. సెల్‌ఫోనే మనకు జీవితమైనప్పుడు.. ఒంటరి తనాన్ని ఆశ్రయిస్తాం. స్నేహితులకు, బంధువులకు దూరమవుతాం. భార్యాబిడ్డలతోనే ఉంటున్నా.. వారికి అందనంత దూరంలో సెల్‌ఫోన్‌తో సేదదీరుతాం. నిద్ర రాదు.. ఆకలి వేయదు. కళ్లకు తప్ప మెదడుకు పని లేకపోవడంతో మెదడు మొద్దుబారి జ్ఞాపకశక్తి తగ్గడమేగాక.. పలు మానసిక రుగ్మతలకు ద్వారాలు తెరుస్తుంది. ఇలా అయితే బానిస అయినట్టే! మీరు అదే పనిగా ఫోన్ చెక్ చేసుకుంటున్నారా? ఎలాంటి కాల్ రాకుండానే.. వ చ్చినట్టు, ఏ నోటిఫికేషన్ రాకుండానే ఏదో మెసేజ్ వ చ్చినట్టు భ్రమపడుతున్నారా? మీకు ఎలాంటి కాల్ వచ్చే పరిస్థితి లేకున్నా.. ఎవరైనా కాల్ చేస్తారేమోనని ఎదురు చూస్తున్నారా? ఫోన్‌కు మెసేజ్ రావడమే ఆలస్యం.. చేస్తున్న పనిని ఉన్నఫళంగా వదిలేసి క్షణాల్లోనే వాటిని చూసేస్తున్నారా? సోషల్ మీడియాలో గంటల తరబడి గడుపుతున్నారా? అవసరం ఉన్నా లేకున్నా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఈ లక్షణాలు, లేదా వీటిలో కొన్ని అయినా మీలో కనిపిస్తే.. మీరు స్మార్ట్‌ఫోన్‌కు బానిస అయినట్టే లెక్క. ఒక్కసారి పరీక్షించుకుందాం.. మనం బయటికి వెళ్లేటప్పుడు ఎప్పుడైనా ఓ సారి మొబైల్‌ను ఇంట్లోనే ఉంచుదాం. ఆ తర్వాత మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయో గమనిద్దాం. ఏదో పోగొట్టుకున్నట్టు.. దేని మీదా ధ్యాస లేనట్టు.. చేసే పనిమీద ఏకాగ్రత కుదరనట్టు.. ఫోన్లో మునిగిఉన్న వాళ్లను చూస్తే ఉక్రోషం తన్నుకొస్తున్నట్టు.. ఆకలేస్తున్నా అన్నం తినబుద్ధికానట్టు.. చికాకు.. చిరాకు.. పిచ్చెక్కుతున్నట్టు.. వెంటనే ఇంటికి వెళ్లి ఫోన్ తీసుకోవాలని తెగ ఆరాటపడిపోతున్నట్టు.. ఇలా మనలో మెదులుతున్న ఆలోచనల స్థాయిని బట్టి తెలుసుకోవచ్చు.. మనం ఏ స్థాయిలో మొబైల్‌కు బానిసయ్యామో. ఫోన్‌కు బానిసవ్వడం అన్నది తీవ్రంగా ఉందనిపించినప్పుడు వెంటనే మానసిక నిపుణుడిని సంప్రదించాలి. సైకలాజికల్ కౌన్సెలింగ్ అవసరం ప్రతి దానికి సెల్ ఫోన్ మీద ఆధారపడటం ఎక్కువైంది. ఈ అడిక్షన్ అనేది.. సెల్‌ఫోన్ లేకుంటే రోజు గడవదేమో అన్న స్థితికి చేరుకుంది. కొద్దిసేపు మొబైల్ కనపడకపోయినా, చార్జింగ్ పెట్టుకునే సౌకర్యం లేకపోయినా ఆందోళనకు గురవుతున్నారు. ఫోన్ రింగ్ కాకున్నా రింగ్ టోన్ వినిపిస్తున్నట్టు అనిపించడాన్ని రింగ్సైటీ అంటారు. అదేపనిగా ఫోన్ వినియోగించడం వల్ల, ఇన్ఫర్మేషన్ ఓవర్ లోడ్ వల్ల ఈ సమస్య సంభవిస్తుంది. ఈ సమస్యకు సైకలాజికల్ కౌన్సెలింగ్ అవసరం. – ఎం.లహరి, సైకాలజిస్ట్ నోటిఫికేషన్లు ఆపేద్దాం.. మన పనిలో మనం తలమునకలై ఉన్నప్పుడు ఫోన్‌కు వచ్చే అనవసర నోటిఫికేషన్లు మన ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. వాటి ప్రభావం మన పనితీరుపైనా పడుతుంది. ఫోన్‌కు నోటిఫికేషన్ రాగానే ఏదైనా ముఖ్యమైన మెస్సేజ్ వ చ్చిందేమోనని తెగ ఆరాటపడిపోతాం. అందుకే సోషల్ మీడియా యాప్‌లకు సంబంధించిన అన్ని నోటిఫికేషన్లను ఆఫ్‌లో పెట్టుకోవడం ఉత్తమం. అంతకు మించి సమయం ఇవ్వొద్దు.. రోజుకు ఎంత సేపు స్మార్ట్ ఫోన్ వాడుతున్నాం.. ఏయే యాప్‌లలో ఎక్కువసేపు గడుపుతున్నామో స్పష్టంగా తెలుసుకోవాలి. ఇందుకోసం మన మొబైల్లోనే ఆప్షన్లుంటాయి. మొబైల్ స్క్రీన్‌పై మనం గడుపుతున్న సమయాన్ని వాటి సాయంతో అంచనా వేస్తూ.. మన అవసరం మేర మాత్రమే ఫోన్‌ను వినియోగిస్తూ.. ఫోన్ వాడకం సమయాన్ని క్రమంగా తగ్గించుకుందాం. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం.. సాధారణంగా మనం ఖాళీగా ఉన్నప్పుడే స్మార్ట్ ఫోన్‌కు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాం. అలాగే వీకెండ్లలో వీడియోలు చూస్తూనో, గేమ్‌లు ఆడుతూనో లేదా ఫ్రెండ్స్‌తో చాటింగ్‌లు చేస్తూనో గంటల తరబడి గడిపేస్తాం. అలా కాకుండా ఖాళీ వేళల్లో,సెలవులు, వీకెండ్లలో విశ్రాంతి తీసుకోవడం, స్నేహితులను కలవడం, లేదా కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లడం వంటి కార్యక్రమాలు పెట్టుకోవాలి. ప్రతి సమాచారానికి ఫోన్ల మీదే ఆధారపడకుండా.. పుస్తకాల నుంచీ పొందుతుండాలి. బెడ్‌కు దూరంగా.. మొబైల్ మనకు పక్కనే ఉంటే దానిని వాడాలనిపిస్తుంది. నిద్రపట్టకపోయినా, మెలకువ వచ్చినా.. పక్కన ఫోన్ ఉంటే ఇట్టే అందుకుంటాం. ఈ అలవాటును అధిగమించాలంటే మన బెడ్‌కు దూరంగా.. మన చేతికి అందనంత దూరంలో ఫోన్ పెట్టుకోవడం ఉత్తమం. అసలు స్విచ్ఛాఫ్ చేసుకుంటే మరీ మేలు. – తమనంపల్లి రాజేశ్వరరావు,ఏపీ సెంట్రల్ డెస్క్ -
విమర్శ లేదా తిరస్కరణను హ్యాండిల్ చేయలేకపోతున్నారా?
విమర్శలు ఎవరికీ నచ్చవు. వివేక్కి అసలే నచ్చవు. నేను సరిగా లేనేమో, నన్ను ఎవ్వరూ పట్టించుకోరేమో, తిరస్కరిస్తారేమో, విమర్శిస్తారేమో అనే భయం నిరంతరం అతన్ని వెంటాడుతూ ఉంటుంది. తప్పు చేయడం, మాట పడటం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఆందోళన చెందుతుంటాడు. ఎవరైనా ఏదైనా మాటంటే చాలు.. నెలల తరబడి దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతుంటాడు. అందుకే ఆఫీస్ మీటింగ్‌లకు ఏదో ఒక సాకు చెప్పి ఎగవేస్తుంటాడు. టీమ్ లీడర్ అయితే అందరితో మాట్లాడాల్సి వస్తుందని ప్రమోషన్ కూడా వద్దన్నాడు. ఏ విషయంలోనూ నిర్ణయం తీసుకోలేడు, ఎవరినీ నమ్మలేడు. ఏ అమ్మాయితో మాట్లాడితే ఏమవుతుందోనని దూరదూరంగా ఉంటాడు. అలా మొత్తం మీద అందరికీ దూరంగా ఒంటరిగా గడిపేస్తుంటాడు. వివేక్ సమస్య ఏమిటో పేరెంట్స్‌కు, ఫ్రెండ్స్‌కు అర్థంకాలేదు. అడిగినా ఏమీ చెప్పడు. నాకేం నేను బాగానే ఉన్నానంటాడు. పెళ్లి చేసుకోమంటే ముందుకురాడు. అప్పుడే పెళ్లేంటంటూ వాయిదా వేస్తుంటాడు. ‘ఇప్పటికే 30 ఏళ్లొచ్చాయి, ఇంకెప్పుడ్రా చేసుకునేది?’ అని పేరెంట్స్ గొడవపడుతున్నా పట్టించుకోడు. వివేక్ సమస్యేమిటో అర్థంకాక తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. వివేక్ లాంటి వాళ్లు జనాభాలో 2.5 శాతం మంది ఉంటారు. దీన్ని అవాయిడెంట్ పర్సనాలిటీ డిజార్డర్ (AVPD) అంటారు. అంటే అది వ్యక్తిత్వంలో ఏర్పడిన సమస్య, రుగ్మత. ఇలాంటి వ్యక్తిత్వ రుగ్మతలను గుర్తించడం కష్టం. ఎందుకంటే అవి ఆ వ్యక్తి ప్రవర్తనలో, వ్యక్తిత్వంలో విడదీయలేని భాగంగా ఉంటాయి. బాల్యానుభవాల నుంచే.. ఏవీపీడీకి జన్యు, పర్యావరణ, సామాజిక, మానసిక కారకాలను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. పరిస్థితి మెరుగుపడడంలో పాత్ర పోషించే కొన్ని అంశాలు.. బాల్యంలో తల్లిదండ్రుల ఆప్యాయత, ప్రోత్సాహం లేకపోవడం, తిరస్కరణకు గురయిన పిల్లలు ఈ రుగ్మతకు లోనవుతారని పరిశోధనలు సూచిస్తున్నాయి. తోటివారి తిరస్కరణ, ఎమోషనల్ అబ్యూజ్, అపహాస్యానికి గురైన వ్యక్తులు చిన్నతనంలో చాలా సిగ్గుపడతారు. పెద్దయినా ఆ సిగ్గును అధిగమించరు. బాల్యంలో ఎదురైన బాధాకరమైన అనుభవాలు వారి ఆలోచనా విధానాలు మారడంలో పాత్ర పోషిస్తాయి. అలాంటి అనుభవాలు మళ్లీ ఎదురుకాకుండా, వాటిని తప్పించుకునేందుకు మనుషులనే తప్పించుకు తిరుగుతుంటారని అర్థం చేసుకోవచ్చు. రెండేళ్ల వయసులోనే ఈ లక్షణాలు కనిపించినా పెరిగి పెద్దవాళ్లయిన తర్వాత మాత్రమే నిర్ధారణ అవుతుంది. అసమర్థత భావాలే ప్రధాన లక్షణం.. అసమర్థత భావాలు, విమర్శ లేదా తిరస్కరణను తీసుకోలేకపోవడం, సోషల్ ఇన్హిబిషన్ ఏవీపీడీ ప్రధాన లక్షణాలు. యుక్త వయసుకు వచ్చేనాటికి వీటిని అనుభవించి ఉంటారు. వాటితోపాటు ఈ కింది లక్షణాలు కూడా ఉంటాయి. తనను తాను అసమర్థంగా, ఆనాకర్షణీయంగా, తక్కువగా భావించడం విమర్శ లేదా తిరస్కరణ భయం కారణంగా వర్క్ ప్లేస్‌లో వ్యక్తులతో కలసి పనిచేసే అవకాశాలను తప్పించుకోవడం పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని కచ్చితంగా తెలిస్తే తప్ప ఇతరులతో సంభాషించడానికి ఇష్టపడకపోవడం అవమాన భయం కారణంగా సన్నిహిత సంబంధాలలో తడబాటు సామాజిక పరిస్థితుల్లో విమర్శల గురించే ఆలోచిస్తూ ఉండటం కొత్త సామాజిక పరిస్థితులను తప్పించుకోవడం రిస్క్ తీసుకోవడానికి లేదా ఇబ్బందికి దారితీసే కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఇష్టపడకపోవడం. అయితే ఈ లక్షణాలు కనిపించగానే ఏవీపీడీ ఉందని కంగారుపడిపోకండి. ఈ రుగ్మత నిర్ధారణకు సైకాలజిస్ట్‌తో సైకలాజికల్ ఎవాల్యుయేషన్ అవసరం. ఎవాల్యుయేషన్ తర్వాతనే ఈ సమస్య ఉందని నిర్ధారిస్తారు. గుర్తించడమే చికిత్సలో తొలిమెట్టు ఏవీపీడీతో బాధపడేవారిలో చాలామంది దాన్ని గుర్తించరు. గుర్తించినా చికిత్స తీసుకోరు. అందుకే మీకు తెలిసిన లేదా ప్రేమించే వ్యక్తి ఏవీపీడీతో జీవిస్తున్నారని భావిస్తే, సైకాలజిస్ట్‌ను కలిసేందుకు ప్రోత్సహించండి. థెరపీ లేకుండా దీని నుంచి మెరుగుపడే అవకాశం లేదు. ఏవీపీడీ నుంచి బయటపడాలంటే చేయాల్సిన మొదటి పని దాని సంకేతాలను గుర్తించడం. నిర్దిష్ట లక్షణాలను అర్థంచేసుకోవడం ద్వారా, వాటిని పరిష్కరించుకునే మార్గాలను అన్వేషించగలుగుతారు సమస్య నుంచి బయటపడేందుకు స్మోకింగ్, ఆల్కహాల్, అతిగా తినడం లాంటి అనారోగ్యకరమైన కోపింగ్ టెక్నిక్స్ కాకుండా ఆరోగ్యకరమైన సంరక్షణ మార్గాలు పాటించాలి మీ చికిత్సలో స్నేహితులు, కుటుంబ సభ్యులను కూడా చేర్చుకోండి. మీ సమస్యేమిటో, ఎలా సహాయం చేయాలో వాళ్లకు బాగా అర్థమవుతుంది · కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, సైకోడైనమిక్ థెరపీ, స్కీమా థెరపీ, గ్రూప్ థెరపీ, సోషల్ స్కిల్స్ ట్రైనింగ్ లాంటివి ఈ రుగ్మత నుంచి బయటపడేందుకు సహాయపడతాయి బాల్యంలోని బాధాకరమైన అనుభవాలను అర్థంచేసుకుని, వాటి తాలూకు నొప్పిని, సంఘర్షణను అధిగమించేందుకు చికిత్స ఉపయోగపడుతుంది · ఏవీపీడీ చికిత్సకోసం మందులు ఏవీ లేనప్పటికీ.. దానివల్ల వచ్చే డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి సంబంధిత రుగ్మతల నుంచి బయటపడేందుకు మందులు ఉపయోగపడతాయి. --సైకాలజిస్ట్ విశేష్ (చదవండి: మానసిక సమస్య ఉందని గుర్తించడమెలా?) -
బాల్యంలో స్మార్ట్ ఫోన్‌తో యవ్వనంలో మతి చెడుతోంది
సాక్షి, అమరావతి: చిన్నతనంలోనే స్మార్ట్ ఫోన్‌ను వినియోగించడం మొదలుపెట్టిన వారికి యవ్వనంలో మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్ ఎంత ఆలస్యంగా అలవాటు చేసుకుంటే అంత మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆ అధ్యయనం హెచ్చరించింది. వాషింగ్టన్కు చెందిన స్వచ్ఛంద సంస్థ సపియన్ ల్యాబ్స్ ‘గ్లోబల్ మైండ్ ప్రాజెక్టు’లో భాగంగా 41 దేశాల్లో 18–24 ఏళ్ల మధ్య వయసున్న 27,969 మందిపై అధ్యయనం చేసింది. వీరిలో చిన్న వయసులోనే స్మార్ట్ ఫోన్ వినియోగించడం మొదలు పెట్టిన వారి మానసిక స్థితి బలహీనంగా ఉందని పేర్కొంది. యువకుల కంటే యువతుల్లోనే ఎక్కువ మానసిక రుగ్మతల ప్రభావాన్ని గుర్తించింది. ఉత్తర అమెరికా, యూరప్, లాటిన్ అమెరికా, ఓషియానియా, దక్షిణాసియా, ఆఫ్రికా ప్రాంతాల్లోని యువత మానసిక స్థితిగతులను 47 అంశాల ఆధారంగా లెక్కించారు. వయసు పెరిగితే దుష్ప్రభావం తక్కువ యువకులు 6 ఏళ్ల వయసు నుంచి ఫోన్ వాడకం మొదలు పెట్టిన వారు 42 శాతం, 18 ఏళ్ల వయసుల్లో ఫోన్ వాడకం మొదలు పెట్టిన వారిలో 36 శాతం మానసిక అనారోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు గుర్తించారు. అయితే మహిళల్లో ఆరేళ్ల వయసు నుంచి ఫోన్ వాడుతున్న వారిలో 74 శాతం, వయోజనులైన తర్వాత 46 శాతం వివిధ మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. వయసు పెరిగిన తర్వాత స్మార్ట్‌ఫోన్ వినియోగం మొదలైతే దాని దు్రష్పభావం కొంత వరకు తక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. అలాగే పురుషుల్లో ఆత్మవిశ్వాసం, సామాజిక దృక్పథం, ఇతరులతో సానుకూల సంబంధాలు కలిగి ఉండే సామర్థ్యాలు పెరిగినట్లు, మహిళల్లో మానసిక స్థితి, స్థితప్రజ్ఞత మెరుగ్గా ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా ఆత్మహత్య ఆలోచనలు, దుందుడుకు భావాలు, వాస్తవికత నుంచి వేరుగా ఉన్నారనే భావనలు గణనీయంగా తగ్గాయి. వారంలో ఒక రాత్రి నిద్ర కోల్పోతున్నారు స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్న 10 ఏళ్ల వయసు్కల్లో 12.5 శాతం మంది నోటిఫికేషన్లు చూసుకోవడానికి అర్ధరాత్రి మేల్కొంటున్నారు. దీంతో సగటున వారానికి ఒక రాత్రి నిద్ర కోల్పోతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. వాస్తవానికి సామాజిక మాధ్యమాల్లో రోజుకు మూడు గంటలు గడిపే కౌమారదశ పిల్లల్లో డిప్రెషన్, ఆందోళన లక్షణాలు ఎక్కువగా ఉండటంతో పాటు రెట్టింపు మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల్లోని 13–17 ఏళ్ల మధ్య వయసు్కల్లో దాదాపు 95 శాతం మంది సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే భారతదేశంలో సుమారు 200 మిలియన్ల మంది చిన్నారులు, తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ల వినియోగంపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
మనసు కడలిలో ఒత్తిడి ఉప్పెన
విజయవాడ పటమటకు చెందిన 45 ఏళ్ల రమేష్ ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. ఏడాది కిందట ఉద్యోగం కోల్పోయాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముట్టడంతో తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాడు. నిద్ర పట్టక పోవడం, దీర్ఘ ఆలోచనలు చేయడంతో పలు రోగాల బారిన పడ్డాడు. ఎన్ని ఆస్పత్రులకు తిరిగినా జబ్బు ఏమీ లేదని తిప్పి పంపేవారు. ఆ తర్వాత తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగానే ఇలా జరుగుతుందని వైద్యులు తేల్చారు. లబ్బీపేటకు చెందిన 35 ఏళ్ల వెంకటేష్ ప్రభుత్వ ఉద్యోగి. ప్రతిరోజూ అర్ధరాత్రి దాటే వరకూ సెల్‌ఫోన్ చూస్తూ, ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లే సమయానికి గానీ నిద్రలేచే వాడు కాదు. నిత్యం ఇలా హడావుడిగా బయలు దేరడం, ఆఫీసుకు పరుగులు పెట్టే క్రమంలో ఒత్తిడికి గురయ్యాడు. అవి తీవ్రరూపం దాల్చడంతో సైకాలజిస్టును ఆశ్రయించాల్సి వచ్చింది. లబ్బీపేట(విజయవాడతూర్పు): తల తిరుగుతుంది.. కడుపులో తిప్పుతుంది.. గుండె పట్టుకుంటుంది.. ఏ పనినీ సక్రమంగా చేయనివ్వదు.. చివరకు ఆత్మహత్యకు దారి తీస్తుంది..! అదే డిప్రెషన్. ఇది ఈ కాలపు ప్రధాన సమస్య. ఒకప్పటి పాతరోజుల్లో జీవితంలో ఎప్పుడోగానీ ఒత్తిడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురయ్యేది కాదు. కానీ ఇటీవల అందరూ నిత్యం ఒత్తిడికి గురవుతున్నారు. ఫలితంగా అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. నిరంతరం ఒత్తిడికి గురయ్యే వారిలో వ్యాధి నిరోధక శక్తి లోపిస్తుందని, ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా గుర్తించండి.. నిద్రలేమి, ఎల్లప్పుడూ దిగులుగా ఉండటం.. ఏకాగ్రతా లోపించడం వంటి సమస్యలు ఉంటే మానసిక నిపుణుల సలహా ఎంతో అవసరం. ఇలాంటి వారు క్లిష్ట పరిస్థితుల్లో నికోటిన్, డ్రగ్స్, ఆల్కాహాల్‌తో పాటు, ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. పిల్లల్లో తరచూ కోపం, చికాకు పడటం, తలను గోడకేసి కొట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. మానసిక అశాంతికి కారణమయ్యే వ్యతిరేక భావనలు పెరిగిపోతుంటే తక్షణమే కౌన్సెలింగ్ పొందడం, ఆరోగ్య సలహా తీసుకోవడానికి మొహమాట పడకూడదు. మీ సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే వెంటనే నిపుణులను సంప్రదించాలి. కొరవడిన మానసికోల్లాసం నగరంలోని కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో క్రీడా ప్రాంగణాలు లేని పరిస్థితి నెలకొంది. ఉదయం 8 నుంచి రాత్రి 7 వరకూ పుస్తకాలతోనే కుస్తీ పట్టించడంతో వారిలోని సృజనాత్మకత దెబ్బతినడంతో పాటు, జ్ఞాపకశక్తిని కోల్పోతున్నట్లు, ఒత్తిళ్లకు గురవుతున్నట్లు మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. ఆటపాటలతో చదివిన వారిలో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని, బట్టీ చదువుల్లో రోబోలుగా మారుతున్నారు. వారిలో సామాజిక, నైతిక విలువులు కూడా పెంపొందడం లేదని చెబుతున్నారు. ఒత్తిడితో దుష్ప్రభావాలు ♦ నిద్ర పట్టక పోవడం ♦ ఆకలి లేక పోవడం, లేక ఎక్కువ ఆహారం తినడం ♦ఎక్కువ తినేవారు ఒబెసిటీకి గురవడం ♦ హార్మోన్ల సమతుల్యత లోపించడంతో మహిళల్లో పీరియడ్స్ ఇబ్బందులు ♦ మధుమేహం, రక్తపోటు అదుపులోలేకపోవడం ♦ తీవ్రమైన ఒత్తిడి ఉన్న వారిలో హృద్రోగ సమస్యలు ♦ వ్యాధి నిరోధక శక్తి తగ్గడంలో ఇన్ఫెక్షన్స్ సోకడం జరుగుతుంది. ఇలా జయించొచ్చు ♦ రోజుకు 7 గంటలు తగ్గకుండా నిద్రపోవాలి, ఒకే సమయానికి రోజూ పడుకోవాలి. ♦ సమతుల ఆహారం తీసుకోవాలి. ♦ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ♦ యోగ, మెడిటేషన్‌పై దృష్టి సారించి, క్రమం తప్పకుండా పాటించాలి ♦ సెల్‌ఫోన్ చూడటం మాని, పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలి. ♦ భావోద్వేగాలు, ప్రవర్తనలపై అదుపు కలిగి ఉండాలి. ♦ అసమానతలు, సమస్యలను ధైర్యంగా పరిష్కరించుకోవాలి. ఒత్తిళ్లతో రుగ్మతలు తీవ్రమైన ఒత్తిళ్లకు గురయ్యే వారు అనేక రుగ్మతలకు గురవుతుంటారు. ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యతతో మహిళల్లో పీరియడ్స్ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. నిద్రలేక పోవడం, ఎక్కువ ఆహారం తినడం కారణంగా ఊబకాయులుగా మారిపోతున్నారు. వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. సరైన సమయంలో కౌన్సెలింగ్, చికిత్స పొందడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు. – డాక్టర్ విజయలక్ష్మి, మానసిక వైద్య నిపుణురాలు, విజయవాడ యువతలో తీవ్రమైన ఒత్తిడి ప్రస్తుతం యువత ఎక్కువగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. వారిపై సెల్‌ఫోన్, సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. వాటికి అడిక్ట్ అవడంతో ఇతర వాటిపై దృష్టి సారించలేక పోతున్నారు. చదువులో రాణించలేక పోవడం, ఉద్యోగంలో పనిపై దృష్టి పెట్టలేక పోవడం, వ్యాపారాలు, ఇలా అనేక రంగాల వారు కౌన్సెలింగ్ కోసం మా వద్దకు వస్తున్నారు. దేనినైనా అవసరం మేరకు వినియోగించాలి. – డాక్టర్ గర్రే శంకరరావు, సైకాలజిస్టు -
మీకంటే తోపు లేడనుకుంటున్నారా? అయితే సమస్యే..!
హరిప్రసాద్ ఒక వైద్యుడు. ఎంబీబీఎస్ చదివాక వైజాగ్‌లో ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఆదాయం అంతంతమాత్రంగా ఉండేది. దాంతో డిస్టెన్స్‌లో సైకాలజీ చదివి, ఒక డాక్టరేట్ కొనుక్కొని సైకాలజిస్ట్ అవతారమెత్తాడు. తానో కొత్త మనోవైద్య విధానాన్ని కనిపెట్టానని, మాట్లాడకుండానే ఎలాంటి మానసిక సమస్యలనైనా సులువుగా నయం చేస్తానని పత్రికల్లో ప్రకటనలిచ్చేవాడు. ప్రపంచంలో ఏ సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ నయం చేయని కేసులను తాను నయం చేశానని గొప్పలు చెప్పుకునేవాడు. అతని మాటలు, ప్రకటనలు నమ్మి వచ్చిన వ్యక్తులను తన వాక్చాతుర్యంతో ప్రభావితం చేసేవాడు. లక్షలకు లక్షలు ఫీజు తీసుకునేవాడు. అలా చేయడం ప్రొఫెషనల్ ఎథిక్స్‌కి భిన్నమని తెలిసినా ఏమాత్రం గిల్టీగా ఫీలయ్యేవాడు కాదు. తన క్లయింట్లందరినీ ఒక కల్ట్‌గా మార్చి, వాళ్లు తనను ప్రశంసిస్తుంటే పొంగిపోతుండేవాడు. ఇక ఇంట్లో హరిప్రసాద్ ప్రవర్తన మరింత ఘోరంగా ఉండేది. ‘నేనొక మోనార్క్‌ని, నా మాటే అందరూ వినాలి’ టైపులో ఉండేవాడు. భార్య లత ఏం చేసినా తప్పులు పట్టడం, నీకేం తెలియదంటూ విమర్శించడం, ఇల్లు దాటి అడుగు బయటకు పెట్టనీయకపోవడం, తనను అసలు మనిషిలా గౌరవించకపోవడం ఆమె మనసును విపరీతంగా గాయపరచింది. దాంతో ఆమె డిప్రెషన్‌కి లోనై, భర్తకు తెలియకుండా కౌన్సెలింగ్‌కి వచ్చింది. నేనే గొప్పనుకోవడం కూడా సమస్యే లత మాటలను బట్టి హరిప్రసాద్ నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్(NPD) తో బాధపడుతున్నాడని అర్థమైంది. ఇది ఉన్నవారికి తనకు తానే ముఖ్యం. నిత్యం తమ గురించే ఆలోచించుకుంటూ, తనకంటే గొప్పవారు లేరనుకుంటారు. రోజూ తమ విజయాల గురించి మాట్లాడతారే తప్ప ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారనే విషయాన్ని అస్సలు అర్థం చేసుకోరు. ఏ మాత్రం గిల్టీ ఫీలింగ్ లేకుండా ఇతరులను దోపిడీ చేస్తారు. ఇతరుల అవసరాలను పణంగా పెట్టి తాము అనుకున్నది సాధిస్తారు. తానే అధికుడననే దృష్టి ఉండటం వల్ల ఇతరులను వస్తువులుగా చూస్తారు, మానవత్వాన్ని కోల్పోతారు. ఏకపక్ష దృక్పథాన్ని కలిగి ఉండటం, భాగస్వామి నుంచి అమితంగా ఆశించడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలుంటాయి. ఈ డిజార్డర్ మహిళల కన్నా పురుషుల్లో ఎక్కువ. కొందరు రాజకీయ నాయకుల్లోనూ, మత గురువుల్లోనూ, కల్ట్ లీడర్స్లోనూ ఈ లక్షణాలుంటాయి. NPD లక్షణాలు.. ఈ వ్యక్తిత్వ రుగ్మత యుక్తవయస్సులో ప్రారంభమై వివిధ సందర్భాల్లో కనిపిస్తుంది. తాను గొప్పవాడిననే ఫాంటసీ, ప్రవర్తన, నిత్యం ప్రశంసలు కోరుకోవడం, సహానుభూతి లేకపోవడం ఈ రుగ్మత ప్రధాన లక్షణాలు. ఈ కింది లక్షణాల్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే NPD ఉన్నట్లే. గోరంత ప్రతిభను, విజయాలను కొండంతగా చేసి చెప్పుకోవడం.. తన విజయం, శక్తి, తేజస్సు, అందం, ప్రేమ అపరిమితమనే భారీ ఊహలు.. తానో ప్రత్యేకమైన వ్యక్తినని, తనను, తన సిద్ధాంతాలను సాధారణ వ్యక్తులు అర్థం చేసుకోలేరని భావించడం.. మితిమీరిన అభిమానాన్ని కోరుకోవడం.. దానికోసం అబద్ధాలు చెప్పడం లేదా రాయడం.. అసమంజసమైన అంచనాలు.. తన లక్ష్యాలను సాధించుకోవడానికి ఇతరులను మోసం చేయడం లేదా వాడుకోవడం.. ఇతరుల భావాలు, అవసరాలను గుర్తించడానికి ఇష్టపడకపోవడం.. తరచుగా ఇతరులపై అసూయపడటం లేదా ఇతరులు తన పట్ల అసూయపడుతున్నారని నమ్మడం.. అహంకార ప్రవర్తనతో ఇతరులను ప్రతికూలంగా అంచనా వేయడం.. విమర్శను ఎదుర్కోవడంలో తీవ్ర ఇబ్బంది.. తన లోపలి అభద్రత, అసమర్థత, వైఫల్యం బయటపడతాయేమోననే భయం. ఎందుకు వస్తుంది? • వారసత్వంగా వచ్చిన గుణాలు.. • మితిమీరిన విమర్శలు లేదా మితిమీరిన ప్రేమతో ముంచెత్తే తల్లిదండ్రులను కలిగి ఉండటం.. • కఠినమైన పేరెంటింగ్, పేరెంట్స్ నిర్లక్ష్యం.. • భారీ అంచనాలను సెట్ చేసుకోవడం.. ∙ • లైంగిక సమస్యలు, సాంస్కృతిక ప్రభావాలు.. ∙ • న్యూరోబయాలజీ వల్ల! పరిష్కారమేమిటి? NPD ఉన్న వ్యక్తులు తాము చేసేదంతా సరైనదే అనుకుంటారు. కాబట్టి వారికి వారుగా చికిత్స పొందే అవకాశం ఉండదు. అందుకని కుటుంబ సభ్యులే గుర్తించి తీసుకురావాల్సి ఉంటుంది. దీనికి ఎలాంటి మందులూ లేవు. ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్, మెడిటేషన్ కొంత ఉపయోగపడతాయి. సీబీటీ, డీబీటీ, సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ వంటి థెరపీల ద్వారా మరింత సహాయం చేయవచ్చు. వ్యక్తి ఆత్మగౌరవాన్ని పెంచడం, వాస్తవిక అంచనాలను అందించడం లక్ష్యంగా థెరపీ సాగుతుంది. ఇతరులను సహానుభూతితో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. సొంత బలాలు, బలహీనతలను గుర్తించేలా, విమర్శలు అంగీకరించేలా సిద్ధం చేస్తుంది. బాల్యంలోని సంఘర్షణలను, వాటిని ఎదుర్కోవడానికి ఉపయోగించిన డిఫెన్స్ మెకానిజాన్ని అర్థంచేసుకుని, కొత్త డిఫెన్స్ మెకానిజాన్ని అలవాటు చేయిస్తుంది. NPD ఉన్నవారిని అర్థం చేసుకుని, కలసి జీవించేలా కుటుంబ సభ్యులను ఎడ్యుకేట్ చేస్తుంది. వారితో సర్దుకుపోవడం అసాధ్యమని భావిస్తే విడిపోయేందుకు సిద్ధం చేయిస్తుంది. -సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com -
టెలి మానస భరతం!
కంచర్ల యాదగిరిరెడ్డి అక్షరాలా.. ఒక లక్ష అరవై నాలుగు వేల ముప్పై మూడు. 2021 సంవత్సరంలో భారత దేశంలో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య ఇది! కొంచెం అటు ఇటుగా నిమిషానికి ఇద్దరు బలన్మరణానికి పాల్పడుతున్నారన్నమాట!! కుటుంబ సమస్యలు, తీవ్రమైన వ్యాధుల బారిన పడటం ఇందుకు ప్రధాన కారణాలని నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ చెబుతున్నా, సంబంధిత నిపుణులు మాత్రం మానసిక సమస్యలే మూల కారణం అని స్పష్టం చేస్తుండటం గమనార్హం. చికిత్సలో వెనుకంజ.. ఎందుకీ పరిస్థితి? మానసిక సమస్యలంటే కేవలం పిచ్చి మాత్రమేనా? ఈ విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఏం చేస్తోంది? స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్లు ఏం చేయవచ్చు? అన్న దానిపై ప్రస్తుతం దేశంలో చర్చ కొనసాగుతోంది. భారతదేశం చాలా రంగాల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండవచ్చు కానీ, అంతర్జాతీయంగా మానవాభివృద్ధికి సూచికలైన పలు అంశాల్లో ఇప్పటికీ వెనుకబడే ఉంది. వైద్యంలో, ముఖ్యంగా మానసిక సమస్యలకు చికిత్స విషయంలో మరీ వెనుకంజలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి లక్ష జనాభాకు ఉన్న సైకియాట్రిస్టులు కేవలం 0.3, సైకాలజిస్టులు 0.07 మాత్రమే. ఇంకా చెప్పాలంటే మానసిక సమస్యల చికిత్సకు ఈ దేశంలో దాదాపు అవకాశం లేనట్టే! ఇక నర్సులైతే 0.12, ఆరోగ్య సిబ్బంది 0.07% ఉన్నారు. పాశ్చాత్య దేశాల్లో ఆరోగ్య రంగానికి కేటాయించిన బడ్జెట్లో సుమారు 5–18 శాతాన్ని మానసిక సమస్యల పరిష్కారానికి ఖర్చు చేస్తుంటే భారత్‌లో ఇది 0.05 శాతాన్ని దాటడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి ప్రభావం దేశాభివృద్ధి, ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్రంగానే కనిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యధికంగా బలవన్మరణాలకు పాల్పడు తున్న దేశాల్లో భారత్ ఒకటి. సుమారు 5.6 కోట్ల మనో వ్యాకులత బాధితులు, ఇంకో 4.3 కోట్ల మంది యాంగ్జైటీ రోగుల కారణంగా దేశంలో ఉత్పాదకత గణనీయంగా పడిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క కట్టింది. పనిచేసే సామర్థ్యమున్న 15– 39 ఏళ్ల మధ్య వయసు వారు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగించే విషయం. 2012– 2030 మధ్యకాలంలో ఈ నష్టం సుమారు రూ.84 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసిందంటే పరిస్థితి తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. దేశంలో మార్పు మొదలైంది మానసిక సమస్యలపై దేశం దృష్టి కోణం ఇప్పుడిప్పుడే మారుతోంది. ఇంతకాలం మానసిక సమస్యల కారణంగా జరిగే ఆత్మహత్యలపైనే ప్రభుత్వం తన దృష్టిని కేంద్రీకరించగా, తాజాగా ఈ ఏడాది బడ్జెట్లో నిధుల కేటాయింపును పెంచింది. అంతేకాకుండా ఓ మోస్తరు మానసిక సమస్యల పరిష్కారానికి టెలి–మెంటల్ హెల్త్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ నెల 10న ‘టెలి–మానస్’ పేరుతో భారీ కార్యక్రమం ఒకటి మొదలుపెట్టింది. దీనిలో భాగంగా మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న వారు 1–800–91–4416కు లేదా 14416కు ఫోన్ చేయడం ద్వారా సాయం పొందవచ్చు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (నిమ్హాన్స్) ఆధ్వర్యంలో, ఐఐఐటీబీ సాంకేతిక సహకారంతో ఈ కార్యక్రమం అమలు కానుంది. 23 టెలి–మానస్ కేంద్రాలు దేశవ్యాప్తంగా మొత్తం 23 టెలి–మానస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటికి అదనంగా జిల్లా స్థాయిలో జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం/ వైద్య కళాశాలల సిబ్బంది ద్వారా కన్సల్టేషన్లు నిర్వహిస్తారు. లేదంటే ఈ– సంజీవని ద్వారా ఆడియో, వీడియో సంప్రదింపులూ జరపవచ్చు. మానసిక ఆరోగ్య నిపుణులు, కౌన్సెలర్లు అన్నిరకాల మానసిక సమస్యలకు సంబంధించి సాయం అందిస్తారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌కు ఈ టెలి–మానస్ కార్యక్రమం అనుసంధానమై ఉంటుంది. ఫలితంగా ఆయా కేంద్రాల్లోని అత్యవసర సైకియాట్రిక్ సౌకర్యాలు కూడా రోగులకు అందుబాటులోకి వస్తాయి. నిమ్హాన్స్ ఇప్పటికే దాదాపు 900 మంది టెలిమానస్ కౌన్సెలర్లకు శిక్షణ కూడా పూర్తి చేసింది. వ్యాయామం.. నిద్ర.. కీలకం ►రోజూ క్రమం తప్పకుండా కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. వారంలో 5 రోజుల పాటైనా వ్యాయామం చేయడం ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ►సంతులిత ఆహారం, తగినన్ని నీళ్లు తాగడం కూడా అవసరం. తద్వారా శరీరానికి కావాల్సినంత శక్తి లభిస్తుండ టం వల్ల చురుగ్గా ఉంటామన్నమాట. ►కంటినిండా నిద్రపోవాలి. నిద్ర నాణ్యత పెరిగిన కొద్దీ మనిషి మాన సిక ఆరోగ్యంలోనూ మెరుగుదల కనిపించినట్లు 2021 నాటి ఓ సమీక్ష స్పష్టం చేసింది. ►ప్రాణాయామం, ధ్యానం, వెల్నెస్ అప్లికేషన్ల సాయంతో వీలైనంత వరకూ మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం జరగాలి. దినచర్యలను, సంఘటనలను రాసుకోవడం కూడా ఒత్తిడికి దూరం చేస్తుందని అంచనా. ►బంధుమిత్రులతో సత్సంబంధాలు మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చిన్నచూపు తగదు మానసిక సమస్యలను దేశంలో ఇప్పటికీ చిన్నచూపు చూస్తున్నారు. బాధితులను హేళన చేయడం, వెకిలి మాటలతో హింసించడం కూడా సర్వసాధారణమవుతుండటం దురదృష్టకరమైన అంశం. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిని ఇది మరింత కుంగుబాటుకు గురిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. సంపూర్ణ జీవితానికి ఓ సూచిక మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండటం సంపూర్ణ జీవితానికి ఓ సూచిక అన్నారు ఢిల్లీకి చెందిన మానసిక వ్యాధుల నిపుణుడు డాక్టర్ విశాల్ ఛబ్రా. పదిహేనేళ్లుగా ప్రాక్టీసు చేస్తున్న ఛబ్రాకు గడచిన నాలుగైదేళ్లుగా కేసుల సంఖ్య పది రెట్లు పెరిగింది. ఇప్పుడు ఆయన రోజుకు 10 గంటలు పని చేస్తున్నా 25% మందికి మాత్రమే అపాయింట్మెంట్ ఇవ్వగలుగుతున్నారు. ‘ఇటీవల కాలంలో మానసిక వ్యాధుల బారినపడుతున్నవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. అందులోనూ మహిళల సంఖ్య ఎక్కువ. పెరిగిపోతున్న పోటీతత్వం, విలాస వంతమైన జీవితాలు కావాలనుకోవడం, పొరుగు వారు లేదా సమీప బంధువులతో పోల్చుకోవడం వంటి వాటితో కుంగిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బతకాలని అనిపించలేదు: దీపిక పదుకునె ‘‘కనీసం ఒక్క ప్రాణాన్నైనా కాపాడలన్నది నా లక్ష్యం. అప్పుడే ఈ జీవితానికి సార్థకత’’.. ఏళ్లపాటు మనోవ్యాకులత సమస్యను ఎదుర్కోవడమే కాకుండా దాన్నుంచి విజయవంతంగా బయటపడి అంతర్జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు పొందిన బాలీవుడ్ నటి దీపికా పదుకునె ఇటీవల చేసిన వ్యాఖ్య ఇది. నృత్య దర్శకురాలు ఫరాఖాన్‌తో కలిసి దీపిక కొద్దిరోజుల క్రితం ‘‘కౌన్ బనేగా కరోడ్‌పతి’’ కార్యక్రమంలో పాల్గొన్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో దీపిక మనోవ్యాకులత సమస్యను ఎలా ఎదుర్కొన్నది వివరించారు. ‘‘2014లో మొదటిసారి సమస్యను గుర్తించారు. అకస్మాత్తుగా చిత్రంగా అనిపించేది నాకు. పనిచేయాలని అనిపించేది కాదు. ఎవర్నీ కలవాలనిపించేది కాదు. బయటికి వెళ్లాలన్నా చిరాకు వచ్చేది. అసలు ఏమీ చేయకుండా ఉండిపోవాలనిపించేది. చాలాసార్లు ఈ జీవితానికి ఓ అర్థ్ధం లేదని, ఇంకా బతికి ఉండకూడదని అనిపించేది’’ అని తెలిపారు. ఈ సమయంలోనే తన తల్లిదండ్రులు తనను చూసేందుకు బెంగళూరు నుంచి ముంబై వచ్చారని చెబుతూ.. ‘‘వాళ్లు తిరిగి వెళ్లేటప్పుడు విమానాశ్రయంలో ఉన్నట్టుండి ఏడ్చేశా. ఏదో తేడాగా ఉందని అమ్మ గుర్తించింది. అది మామూలు ఏడుపు కాదని అనుకుంది. ఓ సైకియాట్రిస్ట్‌ను కలవమని సూచించింది. ఆ తర్వాత కొన్ని నెలలకు కానీ కోలుకోవడం సాధ్యం కాలేదు’’ అని దీపిక తెలిపారు. ‘‘మనోవ్యాకులత సమస్య నాకే అనుభవమైందంటే నాలాంటి వాళ్లు ఇంకెంతమంది ఉన్నారో? అని అప్పట్లో నాకనిపించింది. అందుకే ఒక్క ప్రాణాన్ని కాపాడగలిగినా ఈ జీవితానికి సార్థ్ధకత ఏర్పడినట్లే అనుకుంటున్నా..’’ అని దీపిక తెలిపారు. -
‘నైట్రోజన్’ పైప్ నోట్లో పెట్టుకుని..
సాక్షి, ఖైరతాబాద్ (హైదరాబాద్): మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ యువకుడు లాడ్జిలో నైట్రోజన్ సిలిండర్ పైప్ నోట్లో పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మద్దునూరి శివరామవర్మ(25) బీటెక్ పూర్తి చేశాడు. గత కొంతకాలంగా తనను ఎవరో వెంటాడుతున్నారని, ఆత్మహత్య చేసుకుంటానంటూ మాట్లాడుతు న్నాడు. దీంతో శివరామవర్శకు కుటుంబీకులు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే గత నెల 26న హైదరాబాద్‌లో స్నేహితుడిని కలిసేందుకు వచ్చిన అతడు.. మాసబ్‌ట్యాంక్‌లోని హైదరాబాద్ హైట్స్ హోటల్లో ఓ గది తీసుకున్నాడు. సోమవారం ఉదయం నుంచి ఆ గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. సాయంత్రం 3 గంటలకు పోలీసులు గది తలుపులు తెరిచి చూడగా శివరామవర్మ అప్పటికే చనిపోయి ఉన్నాడు. అతడి శరీరం మొత్తం ఉబ్బి ఉంది. గదిలో దిగిన మరుసటి రోజే లంగర్‌హౌస్‌లో ఏసీ కోసం 5 కేజీల నైట్రోజన్ సిలిండర్ కొనుగోలు చేశాడని పోలీసులు తెలిపారు. హోటల్‌కు వచ్చిన అనంతరం ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని పైప్ కనెక్ట్ చేసుకొని సిలిండర్ ఆన్ చేసుకోవడంతో మృతి చెందినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణయ్య చెప్పారు. -
తు‘ఫోను’
సాక్షి, పార్వతీపురం(విజయనగరం) : ఫోన్ లేకుండా ఒక్క క్షణం ఉండలేని కార్తీక్ ఇంట్లో వారితో మాట్లాడటం తగ్గించేశాడు. అందరూ ఉన్నా ముభావంగా వ్యవహరించడం, వణకడం, స్థిరత్వం లేనిచూపులు, నిలకడ లేని ప్రవర్తన చూసి కుటుంబ సభ్యులు కలత చెందారు. అతనిలో వస్తున్న మార్పుతో నిపుణులను సంప్రదించగా నోమోఫోబియాతో బాధ పడుతున్నాడని తేల్చారు. సకాలంలో గుర్తించి కొద్దిపాటి కౌన్సెలింగ్‌తో అతని సమస్యను పోగొట్టారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సంఘటన మాదిరిగానే ఇప్పుడు విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని పెద్ద పెద్ద ఆస్పత్రుల్లో ఇలాంటి కేసులు నమోదౌతున్నాయి. నిత్యం ఫోన్లో ఆటలు, చాటింగ్ చేయడం, ఫేస్బుక్ వినియోగం, వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు రాత్రి పగలు చేయడం నోమో ఫోబియాకు గురౌతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ ఫోబియా బారిన పడటానికి ప్రధాన కారణం యువత చదువుతున్నా, పడుకున్నా, తింటున్నా, బస్టాప్‌లో నిల్చున్నా, ఆఫీసులో ఉన్నా, సినిమా హాలుకు వెళ్లినా, బ్యాంక్‌కు వెళ్లినా, కళాశాలకు వెళ్లినా వెంట సెల్ఫోన్లు పట్టుకుని అదే పనిగా వాటిని వాడడమేనని సర్వేలు చెబుతున్నాయి. మొబైల్ వాడకం ఒక వ్యసనం ఫోన్ లేకపోతే ఏర్పడే భయాన్నే నోమో ఫోబియాగా చెబుతుంటారు. నో మొబైల్ ఫోన్ నోబియా అనే పదం నుంచి సంక్షిప్తంగా దీనికి నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సెల్ఫోన్లు వాడుతున్న దేశంగా భారత్ అవతరిస్తోంది. ఈ క్రమంలో ఈ రుగ్మతకు గురవుతున్న అత్యధిక బాధితుల సరసన కూడా చేరబోతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అనేకమంది యువత ఫోన్ లేకుండా ఉండలేని స్థితికి చేరుతున్నారు. దీని తర్వాత దశ నోమోఫోబియానే అని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా వంటి దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. 66 శాతం మంది మధ్య పెద్ద వయస్కులు దీన్ని ఎదుర్కొంటున్నారు. నోమోఫోబియా లక్షణాలు ► మొబైల్‌ఫోన్, కంప్యూటర్ వంటి పరికరాలు అందుబాటులో లేకపోయినా, సిగ్నల్స్ సరిగ్గా అందకపోయినా ఆందోళనకు గురవుతారు. ► కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో ముఖాముఖి కలిసేందుకు మానసిక సంసిద్ధత గణనీయంగా తగ్గిపోతుంది. ► ఒంటరితనం, కుంగుబాటుతో బాధపడతారు. ► బయటికి వెళ్లాల్సి వస్తే చార్జర్, పవర్‌బ్యాంక్, అదనపు డివైజ్‌లను వెంట తీసుకెళ్లాలనుకుంటారు. ► చెమటలు రావడం, వణుకుడు, ఆందోళన, తమను తామే కొట్టుకోవడం వంటివి కనిపిస్తాయి. ఇలా బయట పడొచ్చు సకాలంలో ఈ లక్షణాలను పసిగట్టి తగిన మానసిక చికిత్స ఇప్పిస్తే సమస్యను పరిష్కరించుకొనే అవకాశం ఉంది. గ్రూప్ డిస్కషన్, నెలలో ఒకరోజు సెల్‌ఫోన్, కంప్యూటర్, ట్యాబ్, వంటివాటికి దూరంగా ఉండటం, నిద్ర పోవడానికి ముందు వీటిని కనీసం పదిహేను అడుగుల దూరంలో ఉంచడం చేయాలి. ఫోన్ పక్కనే ఉంటే నిద్రా భంగమే. కుటుంబసభ్యులు, స్నేహితులు వీరితో ఎక్కువ సమయాన్ని గడపడం వల్ల సాధారణ పరిస్థితులు సృష్టించవచ్చన్నదే నిపుణులు చెప్పేమాట. ఇటీవల ప్రధాన పట్టణాల్లో రెండు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ఇదే అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. స్నేహితులు, బంధువులతో ఫోన్లో కాకుండా నేరుగా కలిసి మాట్లాడటం వల్ల మానవ సంబంధాలు మెరుగుపడతాయి. సెల్‌ఫోన్, కంప్యూటర్లతో చేయాల్సిన పనులకు ఒక నిర్ణీత సమయం పెట్టుకోవడం వంటివి చేయొచ్చు. ఎవరికి వారే స్వీయ నియంత్రణ అవసరం. మరిన్ని ప్రత్యామ్నాయాలు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థల్లో సెల్ఫోన్లను నిషేధించింది. దీనిని పాఠశాలలు, కళాశాలలకే పరిమితం చేయకుండా విశ్వవిద్యాలయాలకు వర్తింపజేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మన రాష్ట్రంలో కూడా ఈ విధానం అమలు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే ప్రైవేటు కార్యాలయాల్లోని యువతకు సెల్‌ఫోన్, కంప్యూటర్, ట్యాబ్‌లు తప్పని సరి. అక్కడే విధులు నిర్వర్తించడానికి రెండురోజులు వారాంతపు సెలవులున్నా, ఎక్కువ మంది వాటి ద్వారా ఆయా రోజుల్లో కార్యకలాపాలను కొనసాగిస్తుంటారు. ఈ పనులకంటూ కచ్చితమైన ఒక సమయం పెట్టుకుంటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. బానిసలౌతున్న యువత మొబైల్ ఫోన్లకు యువత బానిసలవుతున్నారని అంతర్జాతీయ సంస్థల సర్వేలు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఈ పరిస్థితి ఇప్పుడిప్పుడే తీవ్రరూపం దాలుస్తోంది. ప్రస్తుతం 23 శాతం యువత నోమోఫోబియాకు గురవుతున్నారు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ ప్రాంతాల తర్వాత ప్రస్తుతం విశాఖపట్నంలో ఎక్కువగా ఈ కేసులు నమోదౌతున్నాయని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా ఈ కేసుల లక్షణాలు యువతలో కనిపిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. యువత, విద్యార్థులు రోజలో కనీసం 31 పర్యాయాలు సెల్‌ఫోన్ చూసుకుంటున్నారు. సుమారు 3 గంటల పాటు సెల్‌ఫోన్‌తోనే గడుపుతున్నారని తేలింది. పదేపదే ఈ రకమైన కాలక్షేపం వల్ల మానసిక, శారీరక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెబుతున్నారు. నోమోఫోబియా బాధితులకు కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా సమస్య నుంచి దూరం చేయవచ్చు. ఆలోచనల్లో మార్పులు తీసుకురావడం, టాక్ థెరపీ, విశ్రాంతి వంటి పద్ధతుల ద్వారా సమస్యను పరిష్కరించొచ్చు. నెట్ వర్క్‌ను పరిమితంగా వినియోగించుకొనేలా మార్గనిర్ధేశం చేస్తాం. ఫోన్‌కు దూరమైతే నోమో ఫోబియా దూరమౌతుంది. – శ్రీహరి, మానసిక నిపుణుడు విపరీత వినియోగంతో ఫోబియా సెల్ ఫోన్‌ను విశ్రాంతి లేకుండా అదే పనిగా వినియోగించడం వల్ల యువత అనేక రగ్మతలకు గురౌతోంది. అలాంటి కేసులు తరచూ వస్తున్నాయి. తలనొప్పి, నరాలు పట్టేయడం, స్థిరత్వం లేని మాటలు ఆడటం వంటి కేసులు వస్తున్నాయి. అన్నం తిన్నా, పడుకోవడానికి వెళ్లినా, చివరికి బాత్రూంకు వెళ్లినా సెల్‌ఫోన్ పట్టుకుని వెళ్లే కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రాథమిక స్థాయిలో గుర్తించిన ఇలాంటి కేసులను కౌన్సెలింగ్ కోసం రిఫర్ చేస్తున్నాం. – డాక్టర్ నాగభూషణ్‌రావు, సూపరింటెండెంట్, పార్వతీపురం ఏరియా ఆసుపత్రి -
ఒళ్లు పెరిగితే.. మానసిక సమస్యలు...
మీరు చదివింది నిజమే. బ్రిస్టల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి మరీ తెలుసుకున్నారీ విషయాన్ని. బాడీ మాస్ ఇండెక్స్.. అదేనండి..మన ఎత్తుకు, బరువుకు ఉన్న నిష్పత్తి ఎక్కువైతే మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తాయి అని వీరు అంటున్నారు. ఊబకాయంతో ఆరోగ్య సమస్యలు ఎక్కువన్న విషయం మనకు తెలిసిందే. బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం శరీరం బరువు, గుండె ఆరోగ్యం, రక్తపోటు వంటి అంశాలకు మానసిక సమస్యలకూ సంబంధం ఉంది. అయితే ఆరోగ్య సమస్యలతో మానసిక సమస్యలు వస్తాయా? లేదా మానసిక సమస్యలు వచ్చిన తరువాత ఆరోగ్య సమస్యలు మొదలవుతాయా? అన్నది మాత్రం స్పష్టం కాలేదు. మిగిలిన విషయాల మాటెలా ఉన్నా బాడీ మాస్ ఇండెక్స్ విషయంలో మాత్రం మానసిక సమస్యలు వస్తాయని తమ అధ్యయనంలో తేలిందని రాబిన్ వుట్టన్ అనే శాస్త్రవేత్త చెప్పారు. యునైటెడ్ కింగ్డమ్లో దాదాపు మూడు లక్షల మంది వివరాలను పరిశీలించిన తరువాత తాము ఈ అంచనాకు వచ్చినట్లు చెప్పారు. ఊబకాయంతో ఉన్న వారు ఆత్మనూన్యతతో బాధపడుతూండటం ఇందుక కారణం కావచ్చునని చెప్పారు. -
ఆ ట్యాబ్లెట్స్ మంచివేనా?
నేను ఇప్పుడు ప్రెగ్నెంట్‌ని. ‘ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్’ అనేవి ప్రెగ్నెంట్ లేడీస్‌కి మంచిదని చదివాను. మా ఆయనతో దీని గురించి మాట్లాడితే అలాంటివి పట్టించుకోవద్దు అన్నారు. దయచేసి దీని మంచి, చెడుల గురించి తెలియజేయగలరు. – కె. వనజ, కర్నూల్ ప్రతి ఒక్కరి శరీరంలో నాడీ వ్యవస్థకు సంబంధించి, ఇంకా ఇతర అవయవాల పనితీరుకు, హార్మోన్ల ఉత్పత్తికి కొద్దిగా కొవ్వు అవసరం ఉంటుంది. అందులో ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కూడా ముఖ్యం. అవి కళ్లు, నాడీ వ్యవస్థ, మెదడు పనితీరుకు దోహదపడతాయి. గర్భిణీ స్త్రీలు ఇవి తీసుకోవడం వల్ల, కడుపులోని శిశువు కళ్లు, మెదడు పనితీరు, ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. అలాగే కొందరిలో శిశువు కొద్దిగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా డీహెచ్ఏ అనే ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్ శిశువుకి బాగా ఉపయోగపడుతుంది. అవి చేపలు, రొయ్యలు వంటి వాటిలో ఎక్కువగా లభ్యమవుతాయి. వెజిటెబుల్ నూనెలు అంటే సోయాబీన్, మొక్కజొన్న నూనెల్లో.. అలాగే బాదం పప్పు, గుడ్లు, పాల ఉత్పత్తుల్లో కొద్దిగా దొరుకుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు మాంసాహారులైతే వారానికి రెండుసార్లు చేపలు తీసుకోవచ్చు. ఇలాంటి ఆహారం సరిగా తీసుకోనివారు విడిగా దొరికే డీహెచ్ఏ క్యాప్సూల్స్ రోజూ 300ఎమ్జీ తీసుకోవడం మంచిది. మెనోపాజ్ దశలో తలెత్తే శారీరక, మానసిక సమస్యలకు దూరంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వయసుతో సంబంధం లేకుండా ఇది త్వరగా వచ్చే అవకాశం ఉందా? త్వరగా రాకుండా ఉండడానికి ఏదైనా పరిష్కారం ఉందా? – యంఎల్, విజయవాడ ఆడవారిలో నలభై అయిదు సంవత్సరాలు దాటిన తర్వాత అండాశయాల నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ క్రమేణా తగ్గిపోతూ వచ్చి యాభైఆరు సంవత్సరాలకు పూర్తిగా ఆగిపోతుంది. ఆ సమయంలో పీరియడ్స్ పూర్తిగా ఆగిపోతాయి. దీన్నే మెనోపాజ్ దశ అంటారు. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి వారిలోని జన్యువులు, బరువు, ఇంకా తెలియని ఎన్నో అంశాల మీద ఆధారపడి మెనోపాజ్ దశను ఒక్కొక్కరు ఒక్కో వయసులో చేరుకుంటారు. కొందరిలో నలభై సంవత్సరాల కంటే ముందు కూడా పీరియడ్స్ ఆగిపోయి మెనోపాజ్ దశకు చేరే అవకాశం ఉంటుంది. దీన్నే ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటారు. క్యాన్సర్ చికిత్స కోసం రేడియో థెరపీ, కీమో థెరపీ వంటివి తీసుకున్న వారిలో చాలామందికి పీరియడ్స్ ముందుగానే ఆగిపోయే అవకాశం ఉంటుంది. మెనోపాజ్ ముందుగా రాకుండా ఉండటానికి మనం చెయ్యగలిగింది ఏమీలేదు. కాకపోతే దాని లక్షణాలను, సమస్యలను కొద్దిగా అధిగమించడానికి వాకింగ్, యోగా వంటివి చేస్తూ మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. వీరిలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఎముకలు, కండరాలు బలహీనపడటం, చెమటలు పట్టడం, ఒళ్లంతా ఆవిర్లు వచ్చినట్లుండటం, నిద్ర సరిగా పట్టకపోవడం, చిరాకు, కొద్దిగా మతిమరుపు, ఏకాగ్రత లేకపోవడం, మూత్ర సమస్యలు, లైంగిక సమస్యలు ఏర్పడతాయి. ఈస్ట్రోజన్ హార్మోన్లాగా పనిచేసే ఫైటో ఈస్ట్రోజన్స్ అనే పదార్థాలు సోయాబీన్స్‌లో దొరుకుతాయి. కాబట్టి ఆహారంలో సోయాబీన్స్, సోయాబీన్స్ పౌడర్, సోయాపాలు తీసుకోవడం మంచిది. అలాగే క్యాల్షియం ఎక్కువగా దొరికే ఆకుకూరలు, పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు, రాగులు, గుడ్లు, కొద్దిగా మాంసాహారం తీసుకోవాలి. మా చెల్లెలికి గర్భం తీసేశారు. ‘ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ’ వల్ల ఇలా జరిగిందని చెబుతున్నారు. దీని గురించి వివరంగా తెలియజేయగలరు. గర్భం తొలగించిన తర్వాత, మరోసారి గర్భం దాల్చడానికి ఎంత సమయం తీసుకోవాల్సి ఉంటుంది. – జి. నందన, అనకాపల్లి సాధారణంగా గర్భం ఫెలోపియన్ ట్యూబ్స్‌లో మొదలై మెల్లిగా పిండం ఏర్పడి, అది గర్భాశయంలోకి చేరి అక్కడ పెరగడం మొదలవుతుంది. కొందరిలో ట్యూబ్స్‌లో ఇన్ఫెక్షన్, ట్యూబ్స్ ఆకారం, పనితీరులో మార్పుల వల్ల గర్భంలోని పిండం గర్భాశయంలోకి రాకుండా ట్యూబ్స్లోనే ఉండిపోతుంది. పిండం పెరిగే కొద్దీ గర్భాశయం సాగుతుంది. కానీ ట్యూబ్స్ అలా సాగవు. కాబట్టి పిండం పెరిగేకొద్దీ ట్యూబ్స్ పగిలి, కడుపులో బ్లీడింగ అయిపోవడం, కడుపులో నొప్పి, షాక్‌లోకి వెళ్లడం, ప్రాణాపాయస్థితికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గర్భం అని ఇది యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ద్వారా నిర్ధారణ అయ్యాక, స్కానింగ్ ద్వారా నిర్ధారణ అవుతుంది. అలాగే సీరమ్ బీహెచ్‌సీజీ అనే రక్త పరీక్ష ద్వారా అది ఎంత పెరుగుతుంది, దీనికి మందుల ద్వారా చికిత్స చెయ్యవచ్చా, తప్పనిసరిగా ఆపరేషన్ చేసి ట్యూబ్‌ని తొలగించవలసి వస్తుందా అనేది అంచనా వేయడం జరుగుతుంది. ఈ గర్భాన్ని తొలగించిన తర్వాత కనీసం మూడు నెలలైనా గ్యాప్ తీసుకొని మళ్లీ గర్భానికి ప్రయత్నించొచ్చు. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
స్మార్ట్‌ఫోన్ వాడటంతో మానసిక రుగ్మతలు!
మెల్బోర్న్: అర్ధరాత్రి దాటినా కూడా మీరు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా! అయితే మీరు మానసిక రుగ్మతలకు లోను కాబోతున్నారు. అర్ధరాత్రి సమయంలో ఎక్కువగా స్మార్ట్‌ఫోన్ వినియోగించే యువత నాణ్యమైన నిద్రను పొందలేకపోవడం, స్వీయ నియంత్రణను కోల్పోవడం వంటి సమస్యలతోపాటు మానసిక రుగ్మతలతో బాధపడతారని ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 1,100 మంది 8 నుంచి 11 ఏళ్ల వయసు కలిగిన విద్యార్థులపై అధ్యయనం నిర్వహించి వెల్లడించారు. అధ్యయనంలో పాల్గొన్న వారిలో ఎనిమిదేళ్ల వయసు కలిగిన విద్యార్థుల్లో దాదాపు 85 శాతం మంది స్మార్ట్ఫోన్లు కలిగి ఉన్నారని, వీరిలో 1/3 వంతు మంది అర్ధరాత్రి దాటిన తర్వాత తాము ఫోన్ వినియోగించబోమని చెప్పారని వెర్నన్ తెలిపారు. మూడేళ్ల తర్వాత వీరిలో 93 శాతం మంది సొంత స్మార్ట్ఫోన్లు కలిగి ఉన్నారని, కేవలం 22 శాతం మంది మాత్రమే అర్ధరాత్రి అనంతరం స్మార్ట్‌ఫోన్ వినియోగించబోమని చెప్పినట్లు తెలిపారు. అయితే వీరి వయసు పెరిగే కొద్దీ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా స్మార్ట్‌ఫోన్‌ను వాడటం పెరిగిందని, వారిలో మానసిక ఆరోగ్యం క్షీణించడంతోపాటు, నిద్రలేమి సమస్యలు తీవ్రం అయ్యాయని వెర్నన్ వివరించారు. -
సామాజిక మాధ్యమాలతోమానసిక సమస్యలు
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాలు విరివిగా వాడుతూ యువత మానసిక సమస్యలను కొనితెచ్చుకుంటున్నారనీ, సమస్య ఉన్నట్లు కూడా వారు గుర్తించలేక పోతున్నారని మనస్తత్వ నిపుణులు అంటున్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినం సందర్భంగా సోమవారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులు, మానసిక రోగ నిపుణులు..ఈ జాఢ్యాన్ని వదిలించడానికి చేతులు కలుపుతున్నారు. సామాజిక మాధ్యమాలతో విద్యార్థులు చదువులో వెనుకబడుతున్నారని, సంబంధాలను నెర పలేకపోతున్నారని పేర్కొంటున్నారు. కొంత మంది యువత వేధింపులకు గురవుతుండగా, కొందరు బానిసలౌతున్నారన్నారు. -
టెన్షన్.. టెన్షన్
* మారుతున్న జీవనశైలిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి * విజయవాడ, గుంటూరు నగరాల్లో సర్వే * 25 శాతం మందికి ఇదే ప్రధాన సమస్య * ప్రాథమిక దశలో గుర్తిస్తే మంచిదంటున్న వైద్యనిపుణులు * నేటి నుంచి ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలు తెల్లారి లేస్తే అంతా ఉరుకులు పరుగులే... జీవనశైలి మారిపోయింది. లక్ష్యాన్ని అందుకోవాలనే తపనతో విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపారులు ఇలా అందరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. దీనికి పరిష్కారం ఏమిటి..? ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనం.. గుంటూరు డెస్క్: విజయవాడ, గుంటూరు ప్రాంతాలు రాజధానిగా అభివృద్ధి చెందడంతో మానసిక వత్తిళ్లు సైతం అదే రీతిలో పెరుగుతున్నట్లు నిపుణులు చెపుతున్నారు. ఇటీవల ఓ సంస్థ రెండు నగరాల్లో 1250 మందిని సర్వే నిర్వహించగా, ప్రతి నలుగురులో ఒకరు ఏదో ఒక మానసిక సమస్యకు గురవుతున్నట్లు తేలింది. అంటే 25 శాతం మంది మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. 22–29 సంవత్సరాల మధ్య వయస్సు వారు 55 శాతం మంది వత్తిళ్లకు గురవుతుండగా, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారు 42.5 శాతం మంది మానసిక వత్తిళ్లకు గురవుతున్నట్లు తేలింది. వ్యాధులకు మూలం ఒత్తిళ్లు.. వ్యక్తులు సమర్థులైన, బాధ్యత గల పౌరులుగా వ్యవహరించాలంటే వారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. శారీరక శ్రమ తక్కువ, మానసిక శ్రమ ఎక్కువ అయిపోతున్న ఆధునిక జీవనశైలిలో గుండెజబ్బు, మధుమేహం, అల్సర్లు వంటి రుగ్మతలు చోటుచేసుకుంటున్నాయి. పదేళ్లలోపు పిల్లల నుంచి కళాశాల విద్యార్థుల వరకు, అలాగే ఉద్యోగులు, గృహిణిలు, వ్యాపారస్తులు, సేవా రంగంలో ఉన్న వారు తమ రోజువారీ జీవితాల్లో తీవ్రమైన మానసిక వత్తిడికి, శ్రమకు గురవుతున్నారు. గ్రామీణుల కంటే పట్టణ వాసులే ఎక్కువ మానసిక సంఘర్షణకు గురవుతున్నట్లు నిపుణులు చెపుతున్నారు. మానసిక ప్రథమ చికిత్స... ఈ ఏడాది నినాదం సమాజంలో రోజు రోజుకు మానసిక సంఘర్షణలకు గురవుతున్న వారి సంఖ్య పెరగడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏటా అక్టోబరు 4 నుంచి 10 వరకూ మానసిక ఆరోగ్య అవగాహన వారోత్సవాలను నిర్వహించేందుకు నిర్ణయించింది. అందులో భాగంగా ప్రతిఏటా ఒక నినాదంతో ముందుకెళ్తుండగా, ఈ ఏడాది మానసిక ప్ర«థమ చికిత్స (సైకాలజిక్ ఫస్ట్ ఎయిడ్) అనే థీమ్‌తో అవగాహన కలిగించనున్నారు. ఈ సందర్భంగా పలు సంస్థలు, వైద్య సంఘాలు మానసిక ఆరోగ్యంపై వారం రోజుల పాటు విభిన్న కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు.. ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందేందుకు వైద్యం అందుబాటులో ఉంది. సమస్య తీవ్రతరం కాకుండా ప్రాథమిక దశలో గుర్తించి మానసిక వైద్యుడిని సంప్రదిస్తే కౌన్సెలింగ్‌తో పాటు, మందుల ద్వారా నయం చేయవచ్చు. – డాక్టర్ పర్వతనేని కృష్ణమోహన్, మానసిక వైద్య నిపుణులు యుక్త వయస్సు వారిలో ఎక్కువ సమస్యలు.. యుక్త వయస్సులో ఉన్న వారే ఎక్కువగా మానసిక సంఘర్షణలకు గురవుతున్నారు. పెళ్లైన∙కొత్తలో భార్యాభర్తల మధ్య సర్దుబాటు సమస్యలు, ఇద్దరూ వేర్వేరు ఆలోచనలు కలిగి ఉండటం అందుకు కారణంగా నిలుస్తున్నాయి. కొన్ని సందర్భాలలో విడాకుల వరకూ దారితీస్తుంది. సెక్సువల్ ప్రాబ్లమ్స్‌తో కూడా మా వద్దకు వస్తున్నారు. అటువంటి వారికి కౌన్సెలింగ్ ద్వారా వత్తిళ్ల నుంచి ఉపశమనం పొందేలా చేయవచ్చు. విద్యార్థుల్లో వత్తిడితో కూడుకున్న సమస్యలు పెరిగిపోయాయి. వారిని ఈ సమస్య నుంచి కాపాడుకోవాలి. – డాక్టర్ టీఎస్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించడమే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించి పోవడమే మానసిక వత్తిళ్లు పెరగడానికి కారణంగా చెప్పవచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రోజులో ఇద్దరు కలిసి అర్ధగంట కూడా మాట్లాడుకునే సమయం ఉండటం లేదు. పిల్లలతో కలిసి ఉండే సమయం కూడా చాలా తక్కువే. దీంతో వత్తిళ్ల నుంచి ఉపశమనం లభించడం లేదు. ఒకప్పుడు ఇంట్లోని అమ్మమ్మ, తాతయ్యలు తమ ఓదార్పు ద్వారా వత్తిడిని పోగోట్టేవారు. ఇప్పుడు అలాంటి వారు లేక పోవడంతో కౌన్సిలర్స్‌ను ఆశ్రయిస్తున్నారు. – డాక్టర్ గర్రే శంకరరావు, ఉపాధ్యక్షుడు, ఏపీ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ -
నిద్రలేమితో మానసిక సమస్యలు!
పరిపరి శోధన కంటినిండా ప్రశాంతమైన నిద్ర కరువైన వారికి మానసిక సమస్యలు తప్పవని వైద్య పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంగా నిద్రలేమితో బాధపడేవారు తేలికగా డిప్రెషన్‌కు లోనవుతారని, ఆందోళనను, భావోద్వేగాలను అదుపు చేసుకోలేక సతమతమవుతారని అంటున్నారు. నిద్ర కరువైతే మెదడు పనితీరులో తలెత్తే మార్పులే ఈ పరిస్థితులకు దారితీస్తాయని చైనాలోని గువాంగ్డాంగ్ ప్రావిన్షియల్ పీపుల్స్ హాస్పిటల్‌కు చెందిన వైద్య పరిశోధకులు చెబుతున్నారు. నిద్రలేమి వల్ల మెదడులో భావోద్వేగాలను నియంత్రించే భాగం దెబ్బతింటుందని, దానివల్ల హార్మోన్ల పనితీరులోనూ తేడాలొస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. -
పసివాడుతున్న బాల్యం
తల్లిదండ్రుల ప్రేమకు దూరం ఒంటరితనం... మానసిక సంఘర్షణ... ఆందోళన కలిగిస్తున్న విపరీత ధోరణులు ఏయూ క్యాంపస్: పసి హృదయాలు అద్దంలాంటివి... వాటిపై ముద్ర పడే విషయాలే ప్రతిబింబంగా ప్రతిఫలిస్తాయి. విహంగాల్లా స్వేచ్ఛగా ఎగరాల్సిన వయసులో ఎన్నో సంఘర్షణలు... అపరిపక్వ ఆలోచనలు... పట్టించుకునేవారు లేక... సాంత్వన చేకూర్చేవారు కానరాక వారెంతో తల్లడిల్లుతున్నారు. తమకు తాము అన్యాయం చేసుకుంటూ అసాంఘిక శక్తులుగా మారుతున్నారు. తమపై శ్రద్ధ చూపని తల్లిదండ్రులు... తమ ఆసక్తిని గుర్తించని అధ్యాపకులు... సమాజంలో కనుమరుగవుతున్న విలువలు...ఇలా అనేక లోపాలు నేటి తరం చిన్నారుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. వీటికి గల కారణాలు విశ్లేషిస్తే....చిన్నారులకు ప్రభావితం చేసే అంశాలు ప్రధానంగా మూడు ఉంటున్నాయి. మొదటిది కుటుంబం.. రెండోది పాఠశాల.. మూడోది సమాజం. వీటిలో ఇమడలేక సతమతమవుతున్న బాల్యం గాడి తప్పుతోంది. వీటిని చక్కదిద్ది, చిన్నారులను సక్రమ మార్గంలో నడిపించాల్సిన అవసరం ఉంది. కుటుంబం... సమస్యల వలయం... ►ఒక్కరే సంతానం కావడంతో మితిమీరిన గారాబం ► తల్లిదండ్రులు ఉద్యోగస్తులు కావడం... పిల్లల సమస్యలు, బాధలు తెలుసుకునే తీరిక వీరికి లేకపోవడం ► సాంత్వన చేకూర్చే తల్లిదండ్రుల ప్రేమ వారికి అందకపోడవం ► ఇతరుల ముందు చిన్నారులకు నిందించడం, దండించడం ► శారీరక, మానసిన సమస్యలను అధిగమించే విధానాలు తెలియకపోవడం ► తమ ఇష్టాలను, ఆకాంక్షలను తల్లిదండ్రులు పిల్లలపై రుద్దడం ఇలా ఉండాలి... ► నిత్యం తప్పనిసరిగా తల్లిదండ్రులు పిల్లలతో కొంత సమయం గడపాలి ► వారి సామర్ధ్యం, ఇష్టాలను తెలుసుకుని ప్రోత్సహించాలి ► లోపాలను వేలెత్తి చూపేకన్నా సరిదిద్దే ప్రయత్నం చేయాలి ► సమస్యలు గుర్తించి అధిగమించే విధంగా ప్రోత్సహించాలి ► మానసిక సమస్యలు, ప్రత్యేక సమస్యలు ఉన్నపుడు నిపుణులను కలవాలి ► అవసరాలకు మించి డబ్బు ఇవ్వడం సరికాదు పాఠశాల గతిని మార్చే ఇతర విద్యార్థులతో పోల్చి చూపడం, నిందించడం ఉత్తమ మార్కులు సాధించాలని ఒత్తిడి తీసుకురావడం అధ్యాపకుల బోధన సరిగా లేకపోవడం స్వీయ అభ్యసనం అలవాటు చేయకోవడం విద్యతోపాటు సహకార్యక్రమాలు, క్రీడలకు అవకాశం లేకపోవడం విద్యార్థుల మనసెరిగి బోధించే విధానం కనుమరుగవడం కేవలం లాభాపేక్షతోనే పాఠశాల నిర్వహణ సాగడం ఇలా ఉండాలి... ► విద్యార్థుల మనసెరిగి, ఆసక్తికి అనుగుణంగా బోధన ఉండాలి ► ఉపకరణాలతో ఆసక్తికరంగా బోధన జరపాలి ► ర్యాంకులు, మార్కుల పేరుతో విద్యార్థులపై ఒత్తిడి పెంచకూడదు ► {పేమతో మసలే అధ్యాపకులు ఉండాలి ► విద్యార్థి వ్యక్తిగత సమస్యలను తెలుసుకుని మార్గదర్శకత్వం అందించాలి ► {Mీడలు, సాంృ్కతిక కార్యక్రమాలకు సమయం కేటాయించాలి ► వ్యక్తిత్వ వికాస పాఠాలు బోధించాలి సమాజం...ప్రతిబింబం ► సమాజంలో విలువలు కనుమరుగవడం ► {పసార మాధ్యమాలలో నేర సంబంధ వార్తల నిడివి పెరగడం ► సకారాత్మక ధోరణిలో సమాజం ప్రతిబింబించకపోవడం ► సమాజంలోని వ్యక్తుల అనుచిత ప్రవర్తనలు ఇలా ఉండాలి... ►సమాజంలో విలువలకు, సంృ్కతి సంప్రదాయాలకు ప్రాధాన్యం అందించాలి ► వ్యక్తిత్వ వికాస సంబంధ వ్యాసాలు, కార్యక్రమాలు ప్రసారం చేయాలి ► నిపుణులతో విద్యార్థులకు కౌన్సెలింగ్ జరపాలి ► చిన్నారులను సమస్యలకు గురిచేసే పరిసరాలకు దూరంగా ఉంచాలి కౌన్సెలర్లను ఏర్పాటు చేయాలి... ప్రభుత్వ ఉత్తర్వులు అమలు జరిగేలా చూడాల్సిన అవసరం ఉంది. ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా సైకోమెట్రిక్ సైకాలజిస్ట్, కౌన్సెలర్లు ఏర్పాటు కావాలి. ప్రతి సంవత్సరం విద్యార్థుల మానసిక పరిస్థితులను వీరు గమనించాలి. విద్యార్థుల సమస్యలు గుర్తించి తగిన మార్గదర్శకత్వం నెరపాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో పెద్దలతో పిల్లలకు సాన్నిహిత్యం పెంచాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల భవితకు తోడ్పడే విధంగా ఆశావాద దృక్పధం అలవరచాలి. -ఆచార్య ఎం.వి.ఆర్ రాజు, ఏయూ సైకాలజీ విభాగాధిపతి -
అతుక్కుపోతే అంతే
- అంతర్జాలంతో నిండా ప్రయోజనాలే - మితిమీరితే అదో విష వలయం - లైక్స్, కామెంట్స్ కోసం పరితపిస్తే మానసిక సమస్యలు తప్పవ్ ఏలూరు సిటీ/ఏలూరు (వన్‌టౌన్)/ఏలూరు (బిర్లాభవన్ సెంటర్) : ‘వాట్ బ్రో. ఎఫ్బీలో పోస్టింగ్ చూశా. అదిరిందిలే..’ ఫేస్బుక్లో మిత్రుడి నుంచి వచ్చిన కామెంట్ ఇది. ఆ మరుక్షణమే ‘ఎస్ డ్యూడ్. మూడురోజుల టూర్‌ను ఎంజాయ్ చేశా’నంటూ అటువైపు నుంచి సమాధానం. ‘ఏంట్రా.. ఈ మధ్య బయటకు రావడం మానేశావ్’ అని అడిగితే.. ‘ఆ.. ఏముంది వీడెప్పుడూ సోషల్ మీడియూలోనే మునిగి తేలుతున్నాడ’ంటూ సెటైర్లూ వినిపిస్తున్నారు. ఏ సమాచారం పంచుకోవాలన్నా వాట్స్ యాప్, ట్విట్టర్, ఫేస్బుక్, వుయ్‌చాట్ ఇలా ఏదో దానిలో కలుద్దామనే ధ్యాసలోనే ఉంటోంది యువత. ఫేస్బుక్లో కామెంట్లు, లైక్‌లు, పోస్టింగ్‌లతో రోజులో సగానికిపైగా కాలాన్ని వెచ్చించే పరిస్థితులు వచ్చాయి. ప్రతి చిన్న పనినీ సోషల్ మీడియాలో చూపించేందుకే యువత తాపత్రయపడుతోంది. తమ పిల్లలు చాటింగ్‌లు చేస్తుంటే అదేమిటో తెలియక.. ఇబ్బందులు పడతారనే ఆందోళనతో సతమతమవుతున్నారు వారి తల్లిదండ్రులు. ఈ పరిస్థితులపై నేటి యువత, నిపుణులు ఏమంటున్నారంటే... జాగ్రత్తలు పాటించాలి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎక్కువగా ఉందనే చెప్పాలి. ప్రొఫెషనల్ కోర్సులు చేసే విద్యార్థులకు ఇంటర్నెట్తో చాలా ఉపయోగం ఉంది. స్టడీ మెటీరియల్ కావాలన్నా.. తెలియని విషయాలు తెలుసుకోవాలన్నా ఇంటర్నెట్ వినియోగించాలి. కానీ సోషల్ మీడియా వినియోగించే వారు జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. లేకుంటే సమస్యలు తప్పవు. - కల్యాణి, స్టూడెంట్ వ్యసనం కాకూడదు సోషల్ మీడియాను వినోదం కోసం వినియోగించటంలో తప్పులేదు. నేడు ఎక్కువమంది ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. అవసరం ఉన్నంత మేరకే ఉపయోగిస్తే ఏ విధమైన సమస్యా ఉండదు. చాలామందికి సోషల్ మీడియా వ్యసనంలా మారింది. అది వారికి, వారి కుటుంబానికి, సమాజానికి కూడా మంచిది కాదు. - శ్రావణ జ్యోతి, స్టూడెంట్ యువతులకు ఇబ్బందులు సోషల్ మీడియా పెడదారి పట్టడం కారణంగా యువతులు నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. విద్య, సమాచారం కోసం మాత్రమే ఇంటర్నెట్ను వినియోగిస్తే మంచిది. పరిమితులు లేకుండా సోషల్ మీడియాలో చొచ్చుకుపోతే యువతులకు ఇబ్బందులు తప్పవు. మితిమీరి దేనినీ వినియోగించకూడదు. మంచి విషయాలపై ఎప్పుడూ స్పందించాలి. - వల్లి, స్టూడెంట్ అవసరం మేరకు ఉపయోగించుకోవాలి బంధువులు, స్నేహితులు దూరంగా ఉన్నారనే భావన ఉండకుండా ఎఫ్బీ, వాట్స్‌యాప్ ఉపయోగపడుతున్నాయి. అయితే సోషల్ మీడియాను అవసరానికి మించి వాడటం కూడా తప్పే. మనకు అందివచ్చిన అవకాశాలను అవసరం మేరకు మాత్రమే ఉపయోగించుకుంటే లాభం ఉంటుంది. - బి.పూజిత, స్టూడెంట్ వరంగా భావించాలి కానీ.. పూర్వ ఒక సమాచారాన్ని చేరవేయాలంటే ఎన్నో రోజులు పట్టేది. ఇతర దేశాల్లోని బంధువులు ఎలా ఉన్నారో తెలుసుకోవాలన్నా చాలా కష్టంగా ఉండేది. చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞానంతో సోషల్ మీడియా అందుబాటులోకి రావటం వరంలా భావించాలి. కానీ.. అవసరం మేరకే వినియోగించుకోవలి. - వై.రామన్, స్టూడెంట్ మంచిచెడుల కలయిక సమాజంలో మంచి, చెడూ రెండూ ఉంటాయి. యువత మంచిని తీసుకుని చెడును విస్మరిస్తే బాగుంటుంది. తల్లి.. తండ్రి.. గురువు.. దైవం ఇలా పూర్వీకులు పాటించిన సంప్రదాయాలను అనుసరిస్తే ఏదిచేసినా మంచిదే. సోషల్ మీడియాతో చెడు ఉన్నా.. మంచి చాలానే ఉంది. అందుకే యువత సోషల్ మీడియాను మంచికే వినియోగించాలని నా సూచన. - వారణాశి సౌమ్య, స్టూడెంట్ సెల్ఫ్ కంట్రోల్ తప్పుతుంది నేటి యువత ఇంటర్నెట్ను అధికంగా వినియోగిస్తోంది. ఎక్కువ సమయూన్ని చాటింగ్, పోస్టింగ్స్తోనే గడపటం వల్ల యువతో ఆత్మ నిగ్రహం (సెల్ఫ్ కంట్రోల్) తప్పుతోంది. విలువైన సమయం వృథా అవుతోంది. ఇంటర్నెట్ను మితిమీరి వాడటం వల్ల సహజంగానే చికాకు, ఆగ్రహం కలుగుతారుు. క్రోధం పెరిగిపోతుంది. ఇంట్లో తల్లిదండ్రుల్ని, తరగతి గదుల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులను లక్ష్యపెట్టే పరిస్థితి ఉండటం లేదు. అవసరం లేని విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన వాటిని తేలిగ్గా తీసుకోవటం చేస్తున్నారు. తప్పొప్పులు తెలియని 13నుంచి 19 ఏళ్ల వయస్కుల జీవితాలపై జీవితాలపై చెడు ప్రభావం చూపుతోంది. పరీక్షల్లో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆత్మహత్యలూ పెరిగిపోతున్నాయి. - డాక్టర్ సీహెచ్ వంశీకృష్ణ, మానసిక వైద్య నిపుణులు మెదడు, నరాలపై తీవ్ర ప్రభావం కంప్యూటర్, ల్యాప్‌టాప్, సెల్ఫోన్ల వినియోగంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. వాటినుంచే వచ్చే కిరణాలు కంటిచూపుపై ప్రభావం చూపిస్తాయి. పైగా ఎక్కువ సమయం వాటిపై దృష్టి కేంద్రీకరించటం వల్ల మెదడుపై దుష్ర్పభావం పడుతుంది. మెదడు మొద్దుబారే ప్రమాదమూ ఉంది. సోషల్ మీడియాకు బానిసలుగా మారటంతో చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. అందువల్ల యువతే కాదు ఎవరైనా సరే ఇంటర్నెట్కు అతుక్కుపోకుండా అవసరం మేరకే వినియోగించడం మంచిది. - బోగరాజు ప్రసాద్, కంప్యూటర్ నిపుణులు ప్రమాదాలూ ఉంటాయి నెటిజన్ల విషయంలో చేసిన అధ్యయనాలను పరిశీలిస్తే.. మద్యం, మత్తు పదార్థాలకు బానిసలైన వారి తర్వాత స్థానంలో నెటిజన్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సోషల్ మీడియా ఓ వ్యసనంలా మారిపోవటంతో యువత పెడదారిలో పయనిస్తోందనేది నిపుణులు అభిప్రాయం. మెదడు, నరాలకు సంబంధించిన వ్యాధులకు ఇదే కారణమవు తోంది. ఎఫ్బీ, ట్విట్టర్, మైస్పేస్, వాట్స్‌యాప్, వుయ్ చాట్ వంటి సోషల్ సైట్లలో 80శాతం మంది యువత బిజీగా ఉంటున్నారని సర్వేలు చెబుతున్నాయి. సంఘవిద్రోహ శక్తులకూ ఈ సైట్లు ఆయుధాలుగా మారుతున్నాయి. కంప్యూటర్ కంటే ఎంతో శక్తివంతమైన మానవ మెదడు వీటి కారణంగా నిరుపయోగంగా మారి నిర్వీర్యం అయిపోతోంది. ఇక అశ్లీల సైట్ల ప్రభావంతో మహిళలు, యువతులపై అఘాయిత్యాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మానవ మేధస్సుకు ప్రతీకలుగా నిలుస్తున్న ఈ సాంకేతిక పరిజ్ఞానం వారినే బలి కోరుతుందనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. -
మాట్లాడరేమిటి! ఎవరక్కడ?
మానసికం ఇంట్లో రాత్రి వేళ ఒంటరిగా ఉన్నప్పుడు వెనుక ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తుంది. వెనక్కి తిరిగిచూస్తే ఎవరూ ఉండరు. కిటికీలో నుంచి ఎవరో తొంగిచూస్తున్నట్లు అనిపిస్తుంది. దగ్గరికి వెళ్లి చూస్తే ఎవరూ కనిపించరు... ఇలాంటివి చాలామందికి అనుభవంలో ఉన్న సంఘటనలే. అందుకే... వాటి గురించి లోతుగా పరిశోధించడానికి స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. కొందరు వ్యక్తులను ఎంచుకొని, వారి కళ్లకు గంతలు కట్టి రోబోట్ సహాయంతో ప్రయోగశాలలో కొన్ని పరిశోధనలు నిర్వహించారు. ఈ ప్రయోగంలో పాల్గొన్నవారికి, ఒకరికి కనిపించిన దృశ్యాలు మరొకరికి కనిపించలేదు. అప్పటి వారి శారీరకస్థితి, ఆలోచన సరళిని బట్టి కంటి ముందు దృశ్యాలు ప్రత్యక్షం కావడం ప్రారంభమయ్యాయి. కొందరైతే ఆ దృశ్యాలను తట్టుకోలేక ‘‘ఇక ఆపండి’’ అని అరిచారు. ‘మెదడు పనితీరు’ ‘శరీర కదలికలు’ ‘బాడీ పొజిషన్ ఇన్ స్పేస్’ ఆధారంగా భ్రమాజనిత దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. దీంతో పాటు అతి భౌతిక, భావోద్వేగ సందర్భాలు, ఆప్తులను కోల్పోయిన దుఃఖం, శారీరక రోగాలు, మానసిక సమస్యలు, వైద్యపరిస్థితులు... మొదలైనవి భ్రమాజనిత దృశ్యాలకు కారణమవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
పీడకలలేగా అని తీసిపారేయొద్దు!
లండన్: పీడ కలలతో చిన్నారులు ఉలిక్కిపడి నిద్రలోంచి లేస్తున్నారా? ఏం కాదులే..! అంటూ తీసిపారేయకండి. అలాంటి కలలే వారిలో మానసిక సమస్యలకు దారితీస్తాయని వార్విక్వర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. 12 ఏళ్ల వయసులో పిల్లలకు పీడ కలలు వస్తుంటే వారు కౌమారంలో మానసిక రుగ్మతలకు గురయ్యే అవకాశాలు మూడున్నర రెట్లు ఎక్కువగా ఉంటాయని వీరు గుర్తించారు. రాత్రివేళ భయపడే చిన్నారులు కూడా కౌమారంలో రెండు రెట్లు అధికంగా భ్రమలు, ఆలోచనలకు విఘాతం వంటి మానసిక సమస్యలకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు. ‘పీడకలలు నిద్రలో రెండో భాగంలో వస్తాయి. అప్పుడు భయంతో నడచి వెళుతున్నట్లు అనిపిస్తుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది’ అని శాస్త్రవేత్తలు తెలిపారు. అదే, నిద్రించగానే తొలి భాగం(గాఢ నిద్ర)లో ఉన్నప్పుడు భయంతో కేకలు పెట్టి లేచి కూర్చుంటారని వివరించారు.