పసివాడుతున్న బాల్యం
తల్లిదండ్రుల ప్రేమకు దూరం
ఒంటరితనం... మానసిక సంఘర్షణ...
ఆందోళన కలిగిస్తున్న విపరీత ధోరణులు
ఏయూ క్యాంపస్: పసి హృదయాలు అద్దంలాంటివి... వాటిపై ముద్ర పడే విషయాలే ప్రతిబింబంగా ప్రతిఫలిస్తాయి. విహంగాల్లా స్వేచ్ఛగా ఎగరాల్సిన వయసులో ఎన్నో సంఘర్షణలు... అపరిపక్వ ఆలోచనలు... పట్టించుకునేవారు లేక... సాంత్వన చేకూర్చేవారు కానరాక వారెంతో తల్లడిల్లుతున్నారు. తమకు తాము అన్యాయం చేసుకుంటూ అసాంఘిక శక్తులుగా మారుతున్నారు. తమపై శ్రద్ధ చూపని తల్లిదండ్రులు... తమ ఆసక్తిని గుర్తించని అధ్యాపకులు... సమాజంలో కనుమరుగవుతున్న విలువలు...ఇలా అనేక లోపాలు నేటి తరం చిన్నారుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. వీటికి గల కారణాలు విశ్లేషిస్తే....చిన్నారులకు ప్రభావితం చేసే అంశాలు ప్రధానంగా మూడు ఉంటున్నాయి. మొదటిది కుటుంబం.. రెండోది పాఠశాల.. మూడోది సమాజం. వీటిలో ఇమడలేక సతమతమవుతున్న బాల్యం గాడి తప్పుతోంది. వీటిని చక్కదిద్ది, చిన్నారులను సక్రమ మార్గంలో నడిపించాల్సిన అవసరం ఉంది.
కుటుంబం... సమస్యల వలయం...
►ఒక్కరే సంతానం కావడంతో మితిమీరిన గారాబం
► తల్లిదండ్రులు ఉద్యోగస్తులు కావడం... పిల్లల సమస్యలు, బాధలు తెలుసుకునే తీరిక వీరికి లేకపోవడం
► సాంత్వన చేకూర్చే తల్లిదండ్రుల ప్రేమ వారికి అందకపోడవం
► ఇతరుల ముందు చిన్నారులకు నిందించడం, దండించడం
► శారీరక, మానసిన సమస్యలను అధిగమించే విధానాలు తెలియకపోవడం
► తమ ఇష్టాలను, ఆకాంక్షలను తల్లిదండ్రులు పిల్లలపై రుద్దడం
ఇలా ఉండాలి...
► నిత్యం తప్పనిసరిగా తల్లిదండ్రులు పిల్లలతో కొంత సమయం గడపాలి
► వారి సామర్ధ్యం, ఇష్టాలను తెలుసుకుని ప్రోత్సహించాలి
► లోపాలను వేలెత్తి చూపేకన్నా సరిదిద్దే ప్రయత్నం చేయాలి
► సమస్యలు గుర్తించి అధిగమించే విధంగా ప్రోత్సహించాలి
► మానసిక సమస్యలు, ప్రత్యేక సమస్యలు ఉన్నపుడు నిపుణులను కలవాలి
► అవసరాలకు మించి డబ్బు ఇవ్వడం సరికాదు
పాఠశాల గతిని మార్చే ఇతర విద్యార్థులతో పోల్చి చూపడం, నిందించడం ఉత్తమ మార్కులు సాధించాలని ఒత్తిడి తీసుకురావడం అధ్యాపకుల బోధన సరిగా లేకపోవడం స్వీయ అభ్యసనం అలవాటు చేయకోవడం విద్యతోపాటు సహకార్యక్రమాలు, క్రీడలకు అవకాశం లేకపోవడం విద్యార్థుల మనసెరిగి బోధించే విధానం కనుమరుగవడం కేవలం లాభాపేక్షతోనే పాఠశాల నిర్వహణ సాగడం
ఇలా ఉండాలి...
► విద్యార్థుల మనసెరిగి, ఆసక్తికి అనుగుణంగా బోధన ఉండాలి
► ఉపకరణాలతో ఆసక్తికరంగా బోధన జరపాలి
► ర్యాంకులు, మార్కుల పేరుతో విద్యార్థులపై ఒత్తిడి పెంచకూడదు
► {పేమతో మసలే అధ్యాపకులు ఉండాలి
► విద్యార్థి వ్యక్తిగత సమస్యలను తెలుసుకుని మార్గదర్శకత్వం అందించాలి
► {Mీడలు, సాంృ్కతిక కార్యక్రమాలకు సమయం కేటాయించాలి
► వ్యక్తిత్వ వికాస పాఠాలు బోధించాలి
సమాజం...ప్రతిబింబం
► సమాజంలో విలువలు కనుమరుగవడం
► {పసార మాధ్యమాలలో నేర సంబంధ వార్తల నిడివి పెరగడం
► సకారాత్మక ధోరణిలో సమాజం ప్రతిబింబించకపోవడం
► సమాజంలోని వ్యక్తుల అనుచిత ప్రవర్తనలు
ఇలా ఉండాలి...
►సమాజంలో విలువలకు, సంృ్కతి సంప్రదాయాలకు ప్రాధాన్యం అందించాలి
► వ్యక్తిత్వ వికాస సంబంధ వ్యాసాలు, కార్యక్రమాలు ప్రసారం చేయాలి
► నిపుణులతో విద్యార్థులకు కౌన్సెలింగ్ జరపాలి
► చిన్నారులను సమస్యలకు గురిచేసే పరిసరాలకు దూరంగా ఉంచాలి
కౌన్సెలర్లను ఏర్పాటు చేయాలి...
ప్రభుత్వ ఉత్తర్వులు అమలు జరిగేలా చూడాల్సిన అవసరం ఉంది. ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా సైకోమెట్రిక్ సైకాలజిస్ట్, కౌన్సెలర్‌లు ఏర్పాటు కావాలి. ప్రతి సంవత్సరం విద్యార్థుల మానసిక పరిస్థితులను వీరు గమనించాలి. విద్యార్థుల సమస్యలు గుర్తించి తగిన మార్గదర్శకత్వం నెరపాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో పెద్దలతో పిల్లలకు సాన్నిహిత్యం పెంచాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల భవితకు తోడ్పడే విధంగా ఆశావాద దృక్పధం అలవరచాలి.
-ఆచార్య ఎం.వి.ఆర్ రాజు, ఏయూ సైకాలజీ విభాగాధిపతి