TCSS ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు | telangana cultural society singapore bathukamma festival celebrations 2024 | Sakshi
Sakshi News home page

తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

Published Mon, Oct 7 2024 7:04 PM | Last Updated on Mon, Oct 7 2024 7:39 PM

telangana cultural society singapore bathukamma festival celebrations 2024

తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్(TCSS)ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు సంబవాంగ్ పార్క్‌లో అక్టోబర్ 5న(శనివారం) ఎంతో కన్నుల పండుగగా జరిగాయి. ఈ వేడుకల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరు సాంప్రదాయ పాటలు ఆటలతో ఎంతో హుషారుగా గడిపారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో సింగపూర్ బతుకమ్మ ఉయ్యాలో పాటలతో ఈ వేడుకలు మిన్నంటాయి. ఈ  సంబరాల్లో సింగపూర్ స్థానికులతో పాటు ఎంతో మంది ఎన్నారైలు సుమారు 4000 నుండి 5000 వరకు పాల్గొని బతుకమ్మ ఆడారు. సింగపూర్ లో నివసిస్తున్న తెలుగు వారందరికీ , స్థానికులకు  బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తు దశాబ్దానికి పైగా సింగపూర్‌లో బతుకమ్మ పండుగకు విశేష ఆదరణ కలుగజేయడం ద్వారా టీసీఎస్‌ఎస్‌ చరిత్రలో నిలిచిపోయిందని సొసైటీ సభ్యులు అన్నారు. ఈ సంబురాల్లో అందంగా ముస్తాబైన బతుకమ్మలకు, ప్రత్యేక సాంప్రదాయ, ఉత్తమ వస్త్రధారణలో మహిళలకు గృహ ప్రవేశ్, సౌజన్య డెకార్స్, ఎల్‌ఐఎస్‌ జువెల్స్ , బీఎస్‌కే కలెక్షన్స్ వారు ప్రత్యేక బహుమతులు అందజేశారు.

ఇరు తెలుగు రాష్ట్రాల తెలుగువారు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ వైభవాన్ని చాటి చెప్పడం ఎంతో సంతోషకరమని, బరాలు విజయవంతంగా జరుగుటకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ  టీసీఎస్‌ఎస్‌ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. టీసీఎస్‌ఎస్‌తో ప్రేరణ పొంది ఇతర సంస్థలు కూడా బతుకమ్మ నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు.

ఈ వేడుకల్లో టీసీఎస్‌ఎస్‌ ప్రత్యేకంగా తయారు చేయించిన బతుకమ్మ ప్రధాన ఆకర్షణగా  నిలిచింది. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా విడుదల చేసిన సింగపూర్ బతుకమ్మ ప్రోమో పాట "సింగపూర్ కొచ్చే శివుని పెండ్లాము.. సిరులెన్నో తీసుకొచ్చే మా పువ్వుల కోసము.." యూట్యూబ్‌లో విడుదల చేసినప్పటి నుంచి వేల వీక్షణాలతో దూసుకుపోతుందని తెలిపారు.

ఈ  సందర్భంగా ప్రతిఒక్కరికీ సొసైటీ  అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి , కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ  ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త  నల్ల, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి  వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్ మరియు కార్యవర్గ సభ్యులు రోజా రమణి, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా,  భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి,  విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

వీరితో పాటు సొసైటీ మహిళా విభాగ సభ్యులు రోజా రమణి, గడప స్వాతి, బసిక అనిత రెడ్డి, జూలూరు పద్మజ, సునీత రెడ్డి, హేమ లత, దీప నల్ల,కాసర్ల వందన, బొందుగుల ఉమా రాణి, నంగునూరు సౌజన్య, నడికట్ల కళ్యాణి, హరిత విజాపుర్, ఆవుల సుష్మ, పులిగిల్ల హరిత, సౌజన్య మాదారపు, ఎర్రమ రెడ్డి దీప్తి, సృజన వెంగళ,  హర్షిణి  మామిడాల, సుధా రాణి పెసరు ఈ బతుకమ్మ పండుగ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. సింగపూర్ వేడుకలను సొసైటీ ఫేస్‌బుక్ ,యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.

ఈ వేడుకలకు సహకారం అందించిన సంపంగి రియాలిటి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, మై స్క్వేర్ ఫీట్  (గృహప్రవేశ్) ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో, సరిగమ గ్రాండ్ రెస్టారెంట్ అండ్‌ బిస్ట్రో, జి.ఆర్.టి జ్యూవెల్లర్స్, మై హోమ్ గ్రూప్ కంస్ట్రక్షన్స్, అభిరామి జ్యూవెల్లర్స్, వీర ఫ్లేవర్స్ ఇండియన్ రెస్టారెంట్, ప్రద్ ఈవెంట్ మేనేజ్ మెంట్,  జి.ఆర్.టి ఆర్ట్లాండ్, జోయాలుక్కాస్ జ్యూవెల్లర్స్, ఏ.ఎస్.బి.ఎల్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్, ఎస్.వి.ఎస్ (శ్రీవసుధ) ట్రూ వెల్త్ ఇండియా, ది ఆంధ్ర కర్రీ క్లాసిక్ ఇండియన్ వెజ్ అండ్‌ నాన్ వెజ్ రెస్టారెంట్, కుమార్ ప్రాప్ నెక్స్ , గారెంటో అకాడమీ, ఎస్ పి సిస్నెట్ సొల్యూషన్ దట్స్ పర్ఫెక్ట్ , సౌజన్య హోమ్ డెకార్స్ , ఎల్.వై.ఎస్ జెవెల్స్ మరియు బి.ఎస్.కె కలెక్షన్స్, లాలంగర్ వేణుగోపాల్, రాకేష్ రెడ్డి రజిది, సతీష్ శివనాథుని, కవిత ఆనంద్ అండ్‌ సంతోష్ ఆమద్యల, హేమ సుభాష్ రెడ్డి దుంతుల, మల్లేష్ బారేపటి, శ్రీధర్ కొల్లూరి,చంద్ర శేఖర్ రెడ్డి కోమటిరెడ్డి, విజయ రామ రావు పొలినేని , సునీల్ కేతమక్క ,రంజిత్ రెడ్డి మండల, నాగేశ్వర్ రావు టేకూరి , బండారు శ్రీధర్ మరియు పార్క్  యాజమాన్యానికి సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ వేడుకలకు  సహకారం అందజేసిన కల్వ రాజు, సుగుణాకర్ రెడ్డి రావుల, మల్లేశ్ బరపతి, చల్లా కృష్ణ, మల్లవేని సంతోష్ కుమార్, మల్లారెడ్డి కళ్లెం, బాదం నవీన్, భాను ప్రకాష్ , సాయికృష్ణ కొమాకుల , ముక్కా కిశోర్‌కు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కీ.శే. గోనె నరేందర్ రెడ్డి గారు సొసైటీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement