
తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మను మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

రంగు రంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి పసుపుతో తయారు చేసిన గౌరమ్మకు బియ్యం పిండి, నువ్వులు, నూకలతో తయారు చేసిన ప్రసాదంగా నివేదించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు, యువతలు బతుకమ్మలను ఒక చోట పేర్చి వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. – కుత్బుల్లాపూర్

