
నగరంలో హోలీ సందడి మొదలయ్యింది. ఈ నెల 14న పండుగ సందర్భంగా ఇప్పటికే నగరంలోని పలు దుకాణాల్లో హోలీ వేడుకలకు సంబంధించిన వివిధ రకాల సామగ్రిని కొనుగోలు చేయడానికి బేగం బజార్ వచ్చిన కొనుగోలుదారులు, మహిళలతో సందడి వాతావరణం నెలకొంది.

హోలీ రంగుల కేళీ. చక్కటి సంగీతం, కుటుంబం , స్నేహితులతో మంచి సమయం గడపటం, చక్కటి స్వీట్లు. రెండు రోజుల వేడుకల కోసం సన్నాహాలు వారాల ముందుగానే షురూ అయిపోతాయి. రంగుల పొడులు (గులాల్), వాటర్ గన్‌లు , స్వీట్లను కొనుగోలు చేసే వ్యక్తులతో మార్కెట్‌లు నిండిపోతాయి. రాధా కృష్ణుల దైవిక ప్రేమకు గుర్తుగా జరుపుకోవడం ఒక ఆనవాయితీ.
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగల్లో మరో ముఖ్యమైన పండుగ. హోలీ అంటే రంగుల పండుగ. ఫాల్గుణ మాసం శుక్లపక్ష పౌర్ణమి నాడు హోలీ పండుగను జరుపుకుంటారు. పౌర్ణమి రాత్రి హోలికా దహనం చేస్తారు. మరునాడు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ ఉత్సాహంగా హోలీ వేడుకలను ఎంజాయ్ చేస్తారు. దీనిని ధూలేడి పండుగ అని అంటారు.
హోలీ పండుగ అంటేనే ఉత్సాహభరితమైన పండుగ. 'రంగుల పండుగ'. చిన్నా పెద్దా అంతా దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగల్లో హోలీ కూడా. వసంతం రాకను తెలియ చెప్పే పండుగ. భారతదేశం వ్యాప్తంగా హోలీని గొప్పగా జరుపుకుంటారు. ఒక్కోప్రాంతంలో ఒక్కోలా దీనిని చేసుకుంటారు. శ్రీకృష్ణుని జన్మస్థలమైన మధుర, బృందావనంలో హోలీకి ప్రత్యేక ప్రాధన్యత ఉంది. మేజర్‌గా అన్ని చోట్ల రంగులతో సెలబ్రేట్ చేసుకుంటారు.
ఆర్గానిక్ కలర్స్‌నే వాడదాం
హోలీ ప్రధానంగా రంగుల చుట్టూ ఉంటుంది. అందుకే దీనిని ఆడేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పర్యావరణానికి, మన చర్మానికి ఎలాంటి హాని జరగకుండా ఉండాలంటే సేంద్రీయ, సహజమైన రంగులు ఎంచుకోవడం ఉత్తమం. అలాగే స్నేహితులతో హోలీ ఆడేటపుడు అప్రమత్తంగాఉండాలి. ఎక్కువగా తిరగకుండా, హైడ్రేటెడ్‌గా ఉండాలా జాగ్రత్తపడాలి. జుట్టుకు నూనె రాస్తే రంగులు ఈజీగా వదిలిపోతాయి. కళ్లకు అద్దాలు పెట్టుకోవాలి. సన్‌స్క్రీన్ వాడితే మంచిది.
Comments
Please login to add a commentAdd a comment